cabinate
-
పసుపుబోర్డు, గిరిజన వర్సిటీకి కేంద్ర కేబినెట్ ఓకే
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణకు సంబంధించి మూడు కీలక అంశాలపై బుధవారం కేంద్ర కేబి నెట్ నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో జాతీయ పసుపు బోర్డు, సమ్మక్క–సారక్క కేంద్రీయ గిరి జన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. సమ్మక్క సారక్క వర్సిటీకి రూ. 889.07 కోట్లు నిధులు కేటాయించింది. ఇక తె లంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాలను పునః పంపిణీ చేయాలని, ప్రాజెక్టుల వారీగా నీటిని కేటాయించాలని కృష్ణా వాటర్ డిస్ప్యూ ట్స్ (బ్రిజేశ్) ట్రిబ్యునల్–2ను కేబినెట్ ఆదేశించింది. ఎంతోకాలం నుంచి కొనసాగుతున్న జల వివాదాలకు ఇది ఒక పరిష్కారం చూపే అవకా శం ఉంది. తెలంగాణలో వారం రోజుల్లో ప్రధా ని వరుసగా రెండోసారి పర్యటించిన మరునాడే కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం. భేటీ అనంతరం కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, అనురాగ్‌సింగ్ ఠాకూర్, ఎల్.మురుగ న్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. సమ్మక్క–సారక్క గిరిజన వర్సిటీకి రూ.889.07 కోట్లు ఏపీ పునర్విభజన చట్టంలోని హామీ ప్రకారం తెలంగాణలో ఏర్పాటు చేయాల్సిన గిరిజన యూనివర్సిటీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర విశ్వవిద్యాలయాలు చట్టం–2009ను సవరిస్తూ పార్లమెంటులో కేంద్ర విశ్వవిద్యాలయాలు (సవరణ) బిల్లు–2023ను ప్రవేశపెట్టాలని తీర్మానించింది. గిరిజన యూని వర్సిటీ కోసం కేంద్రం రూ.889.07 కోట్లు నిధు లు కేటాయించింది. ఈ వర్సిటీ రాష్ట్రంలో విద్యా భివృద్ధి, నాణ్యతను మెరుగుపర్చడంతోపాటు గిరిజనుల ప్రయోజనాలు, గిరిజన కళలు, సంస్కృతి, సంప్రదాయ విజ్ఞాన వ్యవస్థ బోధన, పరిశోధనలను అందిస్తుందని.. ఉన్నత విద్య, ఆధునిక విజ్ఞానానికి సంబంధించిన మార్గాలను ప్రోత్సహిస్తుందని తెలిపింది. ప్రాంతీయ అసమతుల్యతను తొలగించడానికి తోడ్పడుతుందని వెల్లడించింది. భారీ ఎగుమతులే లక్ష్యంగా.. దేశీయంగా పసుపు పంట, పసుపు ఉత్పత్తుల అభివృద్ధి కోసం జాతీయ పసుపు బోర్డును తెలంగాణలో ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. పసుపు వినియోగం పెంచడానికి, అంతర్జాతీయంగా మార్కెట్ అభివృద్ధికి ఈ చర్య తోడ్పడుతుందని తెలిపింది. దేశంలో 2022–23లో 3.24 లక్షల హెక్టార్లలో పసుపు సాగు చేయగా.. 11.61 లక్షల టన్నులు ఉత్పత్తి అయిందని తెలిపింది. బంగ్లాదేశ్, యూఏఈ, అమెరికా, మలేసి యాల్లో భారత పసుపునకు డిమాండ్ ఎక్కువగా ఉందని పేర్కొంది. జాతీయ పసుపు బోర్డుతో 2030 నాటికల్లా రూ.8,400 కోట్ల (బిలియన్ డాలర్ల) విలువైన పసుపు ఎగుమతులను సాధించాలన్నది లక్ష్యమని వెల్లడించింది. ఈ బోర్డుకు చైర్మన్‌ను కేంద్రం నియమిస్తుంది. ఆయుష్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయం, వాణిజ్య, పరిశ్రమల శాఖల నుంచి రొటేషన్ పద్ధతిలో రాష్ట్రాల నుంచి ప్రతినిధులు, పరిశోధనల్లో భాగస్వామయ్యే సంస్థలు, పసుపు రైతులు, ఎగుమతిదారుల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. బోర్డుకు కార్యదర్శిని కేంద్ర వాణిజ్య శాఖ నియమిస్తుంది. -
మామునూరులో.. ఎగరనున్న విమానం !
వరంగల్: సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి వరకు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఉమ్మడి వరంగల్‌కు చెందిన పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. సుమారు పది రోజుల పాటు కురిసిన వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రజలను ఆదుకోవడంతో పాటు పెండింగ్‌లో ఉన్న వివిధ ప్రాజెక్టులపై ఈ కేబినెట్లో స్పష్టత ఇచ్చింది. ప్రధానంగా మామునూరులో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి 253 ఎకరాల భూమి ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఏళ్లతరబడిగా ఎయిర్పోర్ట్ అంశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన నలుగుతోంది. వెయ్యి ఎకరాల స్థలానికి గాను 270 ఎకరాలు అన్యాక్రాంతం కాగా 730 ఎకరాలకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) ఫెన్సింగ్ చేసింది. అయితే మరో 431 ఎకరాలు కావాలని సూచించిన అధికారులు చివరకు 253 ఎకరాలైనా పరవాలేదన్నారు. దీంతో ఎయిర్‌పోర్ట్‌కు 253 ఎకరాల స్థలం ఇచ్చేందుకు కేబినెట్లో ఆమోదం తెలపడంతో త్వరలోనే మామునూరు నుంచి విమానాలు ఎగరవచ్చన్న చర్చ మొదలైంది. ఇదిలా ఉండగా.. మహబూబాబాద్ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలకు ప్రయోజనం కలిగించే ఉద్యానవన కళాశాలకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులు.. రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో ఏళ్ల తరబడి పని చేస్తున్న కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ విలీనం చేసుకోవడానికి కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ఆ వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఈనెల 3న అసెంబ్లీలో బిల్లు పెట్టి అమల్లోకి తేనున్నారు. దీంతో వరంగల్ రీజియన్ పరిధిలోని 9 ఆర్టీసీ డిపోలకు చెందిన 3,627 మంది డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లతో పాటు వివిధ కేడర్లకు చెందిన కార్పొరేషన్ ఉద్యోగులు ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. ఉమ్మడి జిల్లాకు ‘వరద’ సాయం.. ఉమ్మడి వరంగల్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల పది రోజుల పాటు కురిసిన వర్షాలు, వరదలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో తక్షణ సహా యక చర్యల కోసం రూ.500 కోట్లు కేబినెట్ కేటాయించింది. ఇందులో సుమారు రూ.237 కోట్ల వరకు ఉమ్మడి వరంగల్‌కు దక్కే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. గ్రేటర్ వరంగల్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో సుమారు రూ.587 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేసిన అధికారులు సర్వే చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో వివిధ శాఖల పరిధిలో వరదల వల్ల రూ.1,000 కోట్లకుపైనే నష్టం జరిగి ఉంటుందని అంచనా. కాగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు మృతి చెందిన 32 మందికి సంబంధించి ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో రోడ్లకు వెంటనే తాత్కాలిక మరమ్మతు చేపట్టేందుకు నిధులు కేటాయించారు. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ఈసారి భారీగా నష్టం జరిగిందని అభిప్రాయపడిన మంత్రివర్గం.. అన్ని విధాల అండగా ఉండాలని, సీనియర్ అధికారులను ఇన్‌చార్జ్‌లుగా నియమించి సహాయక చర్యలను వేగవంతం చేయాలని నిర్ణయించింది. -
వేలం ద్వారా ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం
ఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం విషయం కేంద్రం వేగం పెంచింది. గతంలో తరహాలో కేంద్ర కేబినేట్, సబ్ కమిటీ తదితర విషయాలేవీ లేకుండా త్వరగా పెట్టుబడులు ఉపసంహరించేలా కొత్త విధానాలు అమలు చేయబోతున్నారు. ఈ మేరకు బుధవారం జరిగిన కేంద్ర కేబినేట్ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. డైరెక్టర్లకే అధికారం వ్యూహాత్మక ప్రభుత్వ రంగ సంస్థలలో వేంగా పెట్టుబడులు ఉపసంహరించాలని కేంద్రం నిర్ణయించింది. వీటితో పాటు పలు సంస్థల్లో ఉన్న మైనార్టీ భాగస్వామ్యాలను సైతం వదులుకోవాలని డిసైడ్ అయ్యింది. ఈ ప్రక్రియలో వేగం పెంచేందుకు.. పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయ అధికారం ప్రభుత్వ రంగ సంస్థల డైరెక్టర్లకు కట్టబెడుతూ నిర్ణయం తీసుకుంది. గతంలో అయితే కేబినేట్ జోక్యం ఇందులో ఉండేది. సబ్సిడరీల మూసివేత పలు కీలక విభాగాల్లో ప్రభుత్వం భారీ ఎత్తున పెట్టుబడి పెట్టింది. వీటికి అనుబంధంగా పలు సబ్సిడరీ కంపెనీలు కూడా నెలకొల్పింది. అయితే తాజాగా సబ్సిడరీ సంస్థలను మూసివేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఉమ్మడి నిర్వహణ సంస్థల యంత్రాంగం మార్పు అధికారం డైరెక్టర్లకే కట్టబెట్టింది. దీని ద్వారా ప్రైవేటీకరణ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. వేలం ద్వారా ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం ప్రక్రియలో భాగంగా బిడ్లను ఆహ్వానించడం. ఆ తర్వాత పరిశీలించడం.. ఆపై నిర్ణయం తీసుకోవడం వంటి సుదీర్ఘ ప్రక్రియను కుదించింది కేంద్ర కేబినేట్. అందులో భాగంగా ప్రభుత్వ సంస్థల అమ్మకం ప్రక్రియను వేలం పాట ద్వారా చేపట్టాలని నిర్ణయించింది. దీంతో ఒకే దశలో ప్రైవేటీకరణ పూర్తయిపోతుంది. పరిమిత ప్రమేయం ప్రైవేటీకరణ జరిగగా మిగిలిన ప్రభుత్వ రంగ సంస్థలలో కేంద్ర ప్రభుత్వ ప్రమేయం తగ్గించాలని కేంద్ర కేబినేట్ తాజాగా నిర్ణయించింది. ప్రభుత్వ రంగ సంస్థలు స్వతంత్రంగా పని చేయాలని కేంద్రం భావిస్తోంది. అందులో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం డైరెక్టర్లకు అప్పగించబోతున్నారు. ఇథనాల్ తప్పనిసరి బయో ఫ్యూయల్ పాలసీలో కేంద్రం పలు మార్పులు చేస్తూ ఆమోదం తెలిపింది. అందులో భాగంగా కొత్తగా ఫీడ్ స్టాక్ కు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. అంతేకాదు 2030 నాటికి పెట్రోల్ లో 20 శాతం ఇతర ఇథనాల్ కలపడం తప్పనిసరి చేయనున్నారు. బయో ఫ్యూయల్ ప్రోగ్రాం కింద స్పెషల్ ఎకనామిక్ జోన్ ఏర్పాటుకు ప్రోత్సహకాలు అందివ్వాలని కేబినేట్ నిర్ణయించింది. రత్నాలను అమ్మేస్తాం ఇప్పటి వరకు నష్టాల్లో ఉన్న కంపెనీలను అమ్ముతాం అంటు చెప్పిన కేంద్రం ఇప్పుడు సరికొత్తగా లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను సైతం ప్రైవేటీకరిస్తామని చెబుతోంది. ఈ మేరకు తాజాగా జరిగిన కేబినేట్ సమావేశంలో మహారత్న, నవరత్న, మినీ రత్న వంటి ప్రభుత్వ రంగ సంస్థలలో మరింత వేగంగా పెట్టుబడుల ఉపసంహరణకు నిర్ణయం తీసుకుంది. చదవండి: ప్రైవేటీకరణకు ప్రభుత్వ సంస్థలు, కేంద్ర ఆర్ధిక శాఖ కీలక ఆదేశాలు! -
బీజేపీపై సంచలన ఆరోపణలు: కేబినెట్ బెర్త్, డబ్బు ఇస్తామన్నారు!
చండీగఢ్: పంజాబ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఆమ్ఆద్మీ పార్టీ పంజాబ్ చీఫ్, ఎంపీ భగవంత్ మాన్ కాషాయ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీలోకి రావాలంటూ ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు తనకు డబ్బు ఆశచూపారని, కేంద్ర కేబినెట్లో స్థానం కల్పిస్తామని ప్రలోభ పెట్టారని మాన్ ఆదివారం మీడియా సమావేశంలో ఆరోపించారు. ‘బీజేపీ సీనియర్ నేత ఒకరు నాలుగు రోజుల క్రితం నాతో మాట్లాడారు. బీజేపీలో చేరేందుకు మీరు ఏం తీసుకుంటారు?. మీకు డబ్బేమైనా కావాలా? మా పార్టీలోకి వస్తే కేంద్ర కేబినెట్లో కావల్సిన పోస్టు ఇస్తాం’ అని ఆశ చూపారన్నారు. సదరు బీజేపీ నేత పేరును సమయం వచ్చినప్పుడు వెల్లడిస్తానన్నారు. పంజాబ్‌లోని ఆప్ ఎమ్మెల్యేలకు కూడా బీజేపీ నేతలు గాలం వేస్తున్నారన్నారు. పంజాబ్‌లో ఆప్ ఏకైక ఎంపీ అయినందున పార్టీ మారితే తనకు ఫిరాయింపుల నిరోధక చట్టం కూడా వర్తించదని చెప్పారు. అయినప్పటికీ, తను ఎవరికీ అమ్ముడుపోయే వ్యక్తిని కాదన్నారు. బీజేపీ కుట్ర పూరిత రాజకీయాలు చేస్తోందన్నారు. -
రేపిస్టులకు ఇక చుక్కలే.. కఠిన శిక్ష అమలుకు పార్లమెంట్ ఆమోదం
ఇస్లామాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఆడవారిపై అఘాయిత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దేశాలతో సంబంధం లేకుండా ప్రతి చోటా మహిళలు అత్యాచారానికి గురవుతున్నారు. మనదేశంలో నిర్భయ వంటి కఠిన చట్టాలు తెచ్చినప్పటికి లాభం లేకుండా పోతుంది. ఈ క్రమంలో మృగాళ్లను ఎన్కౌంటర్ చేయడం.. లేదా వారికి అంతకు మించి కఠిన శిక్షలు విధించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పార్లమెంటు కొత్త చట్టాన్ని ఆమోదించింది. తరచుగా అత్యాచారాలకు పాల్పడే నిందితులను కఠినమైన కెమికల్ కాస్ట్రేషన్‌కు గురి చేసే చట్టాన్ని ఆమోదించింది. అత్యాచార నేరాలకు సంబంధించిన కేసులను త్వరితగతిన విచారించడం.. నేరస్థులకు కఠిన శిక్షలు విధించేందుకుగాను పాక్ ఈ చట్టాన్ని ఆమోదించినట్లు తెలిపింది. (చదవండి: కులభూషణ్ జాదవ్‌కు ఊరట.. ఐసీజే దెబ్బకు వెనక్కు తగ్గిన పాక్) గత కొంత కాలంగా పాకిస్తాన్లో మహిళలు, చిన్నారులపై అకృత్యాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితులపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తడంతో ఈ కొత్త చట్టానికి ఆమోదం తెలిపినట్లు పాక్ ప్రకటించింది. విమర్శకులు ప్రకారం దేశ వ్యాప్తంగా నమోదవుతున్న అత్యాచార కేసుల్లో కేవలం 4 శాతం కేసుల్లో మాత్రమే శిక్ష పడుతున్నట్లు ఆరోపించారు. దాదాపు ఏడాది క్రితం పాకిస్తాన్ మంత్రివర్గం ఆమోదించిన అత్యాచార నిరోధక ఆర్డినెన్స్‌ను పాక్ ప్రెసిడెంట్ ఆరిఫ్ అల్వీ ఆమోదించాడు. అత్యాచార నిందుతలకు కెమికల్ కాస్ట్రేషన్ విధించాలని ఆర్డినెన్స్‌లో పొందుపరిచారు. కొత్త క్రిమినల్ లా (సవరణ) బిల్లు 2021 బిల్లుతో పాటు 33 ఇతర బిల్లులను బుధవారం పాక్ పార్లమెంటు ఉమ్మడి సెషన్ ఆమోదించింది. ఇది పాకిస్తాన్ శిక్షాస్మృతి, 1860, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, 1898లను సవరించాలని కోరుతున్నట్లు డాన్ వార్తాపత్రిక నివేదించింది. (చదవండి: కరాచీలో అంతుపట్టని వైరల్ జ్వరాలు!!) ‘‘కెమికల్ కాస్ట్రేషన్ అనేది ప్రధాన మంత్రి రూపొందించిన నియమాల ద్వారా సక్రమంగా తెలియజేయబడిన ప్రక్రియ. ఈ శిక్ష అనుభవించిన వ్యక్తి ఇక తన జీవితాంతం లైంగిక చర్యలో పాల్గొనలేడు. ఇక ఈ శిక్ష అమలు కోర్టు పర్యవేక్షణలో మెడికల్ బోర్డు ఆమోదించిన ఔషధాల ద్వారా నిర్వహించబడుతుందని’’ బిల్లులో పేర్కొన్నారు. (చదవండి: మహిళా ఉద్యోగికి ఏఈ లైంగిక వేధింపులు.. బుద్ధి చెప్పిన కుటుంబ సభ్యులు ) జమాత్-ఇ-ఇస్లామీ సెనేటర్ ముస్తాక్ అహ్మద్ ఈ బిల్లుపై నిరసన వ్యక్తం చేశారు. ఇది ఇస్లాం విరుద్ధమని.. షరియాకు వ్యతిరేకమని పేర్కొన్నారు. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని బహిరంగంగా ఉరితీయాలని, అయితే షరియాలో కాస్ట్రేషన్ ప్రస్తావన లేదని ఆయన అన్నారు. కెమికల్ కాస్ట్రేషన్.... కెమికల్ కాస్ట్రేషన్ అంటే లైంగిక కార్యకలాపాలను తగ్గించడానికి మందులు వాడే ప్రక్రియ. మీడియా నివేదికల ప్రకారం, దక్షిణ కొరియా, పోలాండ్, చెక్ రిపబ్లిక్, అమెరికాలోని కొన్ని రాష్ట్రాలతో సహా దేశాల్లో ఇది ఒక చట్టపరమైన శిక్ష. చదవండి: ‘అత్యాచారం చేసి.. పెళ్లి చేసుకుంటే కేసు కొట్టేయాలా?’ -
కొలువుదీరిన బొమ్మై కొత్త టీం.. యడ్డీ కుమారుడికి నిరాశ
బెంగళూరు: కర్ణాటక కొత్త కేబినెట్ కొలువుదీరింది. కొత్త ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ఎంపిక చేసిన 29 మంది బుధవారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్ వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్త కేబినెట్లో మాజీ సీఎం యడియూరప్ప కుమారుడు విజేయంద్రకు చోటు దక్కుతుందని ఊహాగానాలు వచ్చినప్పటికి.. చివరకు ఆయనకు మొండి చేయి ఎదురయ్యింది. కొత్త మంత్రలు జాబితాలో యడ్డీ కుమారుడి పేరు లేకపోవడం గమనార్హం. అలానే ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉండనున్నట్లు భావించినప్పటికి.. చివరికి ఒక్కరికి కూడా ఉప ముఖ్యమంత్రి పదవి దక్కలేదు. ప్రమాణ స్వీకారం చేసిన 29 మంది వీరే.. 2023 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొత్త మంత్రులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. నేడు ప్రమాణ స్వీకారం చేసిన వారిలో గోవింద్ కరజోల్, కేఎస్ ఈశ్వరప్ప, ఆర్ అశోక, బి. శ్రీరాములు, వి. సోమన్న, ఉమేశ్ కత్తి, ఎస్. అంగర, జేసీ మధుస్వామి, అరగ జ్ఞానేంద్ర, కోట శ్రీనివాస పూజారి, మురేగేశ్ నిరానీ, శివరామ హెబ్బార్, సీఎస్ అశ్వథ్‌నారాయణ, అరగ జ్ఞానేంద్ర, సీసీ పటేల్, ఆనంద్ సింగ్, ఎస్టీ సోమేశేఖర్, బీసీ పటేల్, బీఏ బసవరాజు, డాక్టర్ కె.సుధాకర్, కె.గోపాలయ్య, శశికళ జొల్లె, ఎంటీబీ నాగరాజ్, కేసీ నారయణ గౌడ, బీసీ నగేష్, వి.సునీల్ కుమార్, హాలప్ప ఆచార్, శంకర్ పాటిల్ ముననకొప్ప, మునిరత్న ఉన్నారు. సామాజిక వర్గాల వారిగా.. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల జాబితాను పరిశీలిస్తే.. అన్ని సామాజిక వర్గాల వారికి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. బొమ్మై కేబినెట్లో ఎనిమిది మంది లింగాయత్ సమాజిక వర్గానికి చెందిన వారు ఉండగా.. ఒక్కలిగల నుంచి ఏడుగురు, ఓబీసీ నుంచి ఏడుగురు, ఎస్సీ సామాజిక వర్గం నుంచి ముగ్గురు, ఎస్టీల నుంచి ఒకరు, రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒకరికి, మహిళల నుంచి ఒకరికి చోటు దక్కింది. -
ముఖ్యమైన నాలుగు సవరణ బిల్లులకు ఆమోదం
సాక్షి, హైదరాబాద్: నాలుగు ప్రభుత్వ బిల్లులకు ఆమోదం తెలిపిన రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశం నిరవధికంగా వాయిదా పడింది. రాష్ట్ర శాసనసభ ఆరో సమావేశం రెం డో విడత భేటీని మంగళవారం ప్రత్యేకంగా నిర్వహించా రు. మంగళవారం ఉదయం 11.30కు ప్రారంభమైన సమావేశం ప్రశ్నోత్తరాలు వంటి ఇతర ఎజెండా ప్రస్తావన లేకుండా నేరుగా సవరణ బిల్లులపై చర్చను చేపట్టింది. భారతీయ స్టాంప్ (తెలంగాణ సవరణ) బిల్లు– 2020, తెలంగాణ వ్యవసాయ భూమి (వ్యవసాయేతర ప్రయోజనాల కోసం మార్పు) (సవరణ) బిల్లు– 2020ని ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు తరఫున శాసనసభ వ్యవహా రాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రతిపాదించారు. ఈ రెండు బిల్లులపై చర్చ సందర్భంగా ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, జాఫర్ హుస్సేన్, కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క పలు సూచనలు చేశారు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (సవరణ) బిల్లు– 2020ని మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ప్రతిపాదించగా, అహ్మద్ బలాలా (ఎంఐఎం), భట్టి విక్రమార్క (కాంగ్రెస్) తో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేకానంద్ గౌడ్, సుధీర్‌రెడ్డి చర్చలో పాల్గొన్నారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (తెలంగాణ) సవరణ బిల్లు– 2020ని న్యాయశాఖ మంత్రి ఏ.ఇంద్రకరణ్‌రెడ్డి ప్రతిపాదించారు. నాలుగు బిల్లులను సభ ఆమోదించినట్లు ప్రకటించిన స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి శాసనసభను నిరవధికంగా వాయిదా వేశారు. మంగళవారం ఉదయం సభ ప్రారంభ సమయంలో సమావేశ మందిరంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ ఐదు నిమిషాల పాటు సభలో ఉన్నారు. సమావేశం వాయిదాకు ముందే పలువురు శాసనసభ్యులు తిరుగుముఖం పట్టారు. కాగా, శాసనసభ ఆమోదించిన నాలుగు సవరణ బిల్లులపై చర్చించేందుకు బుధవారం శాసనమండలి ప్రత్యేక భేటీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ బిల్లులపై చర్చించి ఆమోదం తెలిపిన తర్వాత శాసనమండలిని నిరవధికంగా వాయిదా వేస్తూ చైర్మన్ ప్రకటన చేస్తారు. చదవండి: భారీ వర్షాలు: పోలీసు శాఖను అప్రమత్తం చేసిన డీజీపీ -
కార్పొరేటర్ టు కేబినెట్..
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల నుంచి రాజకీయ అరంగ్రేటం చేసిన చాలామంది నేతలు చట్టసభల వరకు ఎదిగారు. నిరంతర ప్రజాసేవ, క్రమశిక్షణ, నిబ ద్ధతలే సోపానాలుగా క్షేత్రస్థాయి లో పడిన తొలిమెట్టును రాజకీయ పునాదిగా ఉపయోగించుకుని అంచెలంచెలు గా ఎదిగారు. పట్టణ స్థానిక సంస్థల్లో ప్రజాసేవ మొదలుపెట్టిన వారు జాతీయ స్థాయి నేతలుగా, రాష్ట్ర మంత్రులుగా, పార్టీ సారథులుగా, డిప్యూటీ స్పీకర్ లాంటి రాజ్యాం గబద్ధ హోదాల్లో పనిచేస్తూ సమకాలీన రాజకీయాల్లో తమదైన పాత్ర పోషిస్తున్నారు. కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లుగా పనిచేసిన వారు ఈ జాబితాలో ఉండగా.. మేయర్లు, కార్పొరేట ర్లుగా పనిచేసి చట్ట సభలకు ఎదిగిన వారి గురించి ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల తరుణంలో ఓసారి మన నం చేసుకుందాం. క్షేత్రం నుంచి కదిలొచ్చి.. క్షేత్రస్థాయిలో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన చాలామంది నేతలు చట్టసభలకు ప్రాతిని« ధ్యం వహించడం విశేషం. కేంద్ర కేబినెట్ మంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ రేణుకా చౌదరి బంజారాహిల్స్ కార్పొరేటర్‌గా పనిచేశారు. అక్కడి నుంచే రాజకీయ అరంగ్రేటం చేసిన ఆమె జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందారు. అదే కోవలో రాష్ట్ర కేబినెట్ వరకు ఎదిగిన నేతలు కూడా నగర రాజకీయాల నుంచే తమ ప్రస్థానాన్ని ప్రారంభించారు. వీరిలో ప్రస్తుత శాసనçసభ ఉపసభాపతి, మాజీ మంత్రి టి.పద్మారావుగౌడ్ ఒకరు. ఆయన రెండుసార్లు హైదరాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోని మోండా డివిజన్‌కు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తు త మంత్రి గంగుల కమలాకర్ కూడా కార్పొరేటర్ నుంచి కేబినెట్ వరకు ఎదిగారు. కరీంనగర్ నగర పాలక సంస్థలో రెండు సార్లు డివిజన్ కార్పొరేటర్‌గా పనిచేసిన గంగుల ఆ తర్వాత ఎమ్మెల్యేగా పలుమార్లు ఎన్నికయ్యారు. ప్రస్తుతం బీసీ సంక్షేమం బాధ్యతలు చూస్తున్నారు. కమలాకర్, వినయ్‌భాస్కర్, నరేందర్ ప్రత్యక్ష ఎన్నికల్లో బల్దియా మేయర్‌గా గెలిచిన తీగల కృష్ణారెడ్డి.. ఆ తర్వాత ఎమ్మెల్యే గా చట్ట సభల్లోకి అడుగుపెట్టారు. ప్రస్తుత ప్రభుత్వ చీఫ్ విప్ ధాస్యం వినయ్‌భాస్కర్ కూడా ఓరుగల్లు నగర పాలక సంస్థలో కార్పొరేటర్ గా పనిచేశారు. ఆ తర్వాత ఆయన వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికవుతు న్నారు. అదే నగరానికి ప్రథమ పౌరుడి గా వ్యవహరిస్తూనే శాసనసభకు ఎన్నికైన నన్నపునేని నరేందర్ కూడా ఒకనాటి కార్పొరేటరే. ఆయన ప్రస్తుతం వరంగల్ (తూర్పు) నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎల్బీనగర్ ప్రస్తుత ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అక్బర్‌బాగ్ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా రెండుసార్లు ప్రజాసేవ చేశారు. ఆ తర్వాత హుడా చైర్మన్‌గా పనిచేసిన దేవిరెడ్డి ఇప్పుడు రెండోసారి ఎమ్మెల్యేగా సేవలందిస్తున్నారు. జీహెచ్ఎంసీకి అంబర్‌పేట డివిజన్ నుంచి ప్రాతినిధ్యం వహించిన కాలేరు వెంకటేశ్ ప్రస్తుతం అదే నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ కూడా 3 దశాబ్దాల క్రితం జవహర్‌నగర్ కార్పొరేటర్‌గా పనిచేశారు. మజ్లిస్‌లో ముగ్గురు.. శాసనసభలో ప్రధాన ప్రతిపక్షమైన ఎంఐఎంకు ఏడుగురు ఎమ్మెల్యేలుండ గా అందులో ముగ్గురు కార్పొరేటర్లుగా పనిచేసిన వారే. పత్తర్‌ఘట్టీ కార్పొరేటర్‌గా పనిచేసిన అహ్మద్ బలా లా మలక్‌పేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జాఫర్ హుస్సేన్ మిరాజ్ (నాంపల్లి ఎమ్మెల్యే) కూడా కార్పొరేటర్‌గా ఎన్నికై జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్‌గా పనిచేశారు. పాతబస్తీ నుంచి కార్పొరేటర్‌గా పనిచేసిన ముంతాజ్ అహ్మద్ ఖాన్ (చార్మినార్) ప్రస్తుత ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. గతంలో డబీర్‌పుర కార్పొరేటర్‌గా పనిచేసిన రియాజుల్ హసన్ అఫన్ది ఎమ్మెల్సీ అయ్యారు. ప్రస్తుతం బీజేపీకి చెందిన ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా మంగళ్‌హాట్ నుంచి కార్పొరేటర్‌గానే రాజకీయాల్లోకి వచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ కూడా గతంలో కార్పొరేటరే. మున్సిపల్ చైర్మన్లుగా చేసిన జగ్గారెడ్డి (సంగారెడ్డి ఎమ్మెల్యే), సోమారపు సత్యనారాయణ (రామగుండం మాజీ ఎమ్మెల్యే) లాంటి నేతలు కూడా చట్టసభలకు ఎన్నిక కావడం విశేషం. -
‘మిత్రపక్షంగా ఉంటాం.. కేబినెట్లో చేరం’
పట్నా : ఎన్డీయే మిత్రపక్షంగా మాత్రమే ఉంటాము.. మోదీ కేబినెట్లో కొనసాగబోమంటున్నారు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. మోదీ కేబినెట్లో జేడీయూకు కేవలం ఒక్క మంత్రి పదవి మాత్రమే కేటాయించారు. దీని పట్ల నితీష్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాము మోదీ ప్రభుత్వంలో చేరడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. మోడీ కేబినెట్లో జేడీయూకు ఒక మంత్రి పదవి ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. ఏదో పేరుకు మంత్రి పదవి ఇస్తామంటే ఆ పదవి తమకు అక్కర్లేదని తేల్చి చెప్పారు నితీష్. అయితే బీజేపీ జేడీయూల మధ్య బంధం కొనసాగుతుందన్నారు. కానీ మోదీ కేబినెట్లో మాత్రం చేరబోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఎన్డీయే మిత్రపక్షంగా మాత్రమే ఉంటామని నితీష్ స్పష్టం చేశారు. ఎన్డీయే మిత్ర పక్షాలకు ఒక్కో మంత్రి పదవి ఇస్తామని అమిత్ షా చెప్పినప్పుడే ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు నితీష్ కుమార్ చెప్పారు. ఇక బీజేపీ ఇచ్చిన ఆఫర్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది జేడీయూ. ఒక్క మంత్రి పదవే ఇవ్వడం.. అందులోనూ ప్రాధాన్యత లేని పోర్ట్‌ఫోలియో ఇవ్వడం పట్ల కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. 2017 లో జేడీయూ బీజేపీతో చేతులు కలిపిన తర్వాత కూడా మోడీ కేబినెట్లో చేరలేదు. అయితే ఈసారి బీజేపీ మిత్రపక్షంగా బీహార్‌లో 17 సీట్లలో పోటీ చేసిన జేడీయూ 16 సీట్లను కైవసం చేసుకుంది. ఈసారి మంచి ప్రాధాన్యత ఉన్న పోర్ట్‌ఫోలియో కలిగిన మంత్రి పదవులను జేడీయూ ఆశిచింది. అయితే ఒక్క మంత్రి పదవి ఇవ్వడాన్ని జేడీయూ వ్యతిరేకించింది. -
మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు!
-
వసంత పంచమిన తెలంగాణ కేబినెట్ విస్తరణ
-
మంత్రివర్గ విస్తరణ చేయకపోవడం బాధాకరం: దత్తాత్రేయ
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసి 22 రోజులైనా ఇప్పటికీ మంత్రిమండలిని విస్తరించకపోవడం బాధాకరమని బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. రాష్ట్రంలో అధికారాలన్నీ ఒకే వ్యక్తి చేతిలో ఉండటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. మంత్రులు లేకపోవడంతో పాలనాపరమైన శాఖల్లో పనితీరు లోపించిందన్నారు. గురువారం ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రి గడ్కరీని కలసి రాష్ట్రంలో పలు రహదారుల అభివృద్ధిపై వినతిపత్రాన్ని ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిద్దిపేట–ఎల్కతుర్తి, జనగాం–దుద్దెడ, మెదక్–ఎల్లారెడ్డి, ఫకీరాబాద్–బైంసా, సిరిసిల్ల–కామారెడ్డి, వలిగొండ–తొర్రూర్, నిర్మల్– ఖానాపూర్ రహదారులను జాతీయ రహదారుల ప్రాజెక్టులో చేర్చి అభివృద్ధి చేయాలని కోరినట్టు చెప్పారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించాలన్నారు. నాలుగున్నరేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సహకారంతో రహదారుల అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉందని చెప్పారు. -
ముహూర్తం ఎప్పుడో?
-
మంత్రిగా మహమూద్ అలీ ప్రమాణస్వీకారం
-
‘రాజకీయాల్లోకి వస్తే ప్రపంచ యుద్ధమే’
న్యూయార్క్ : తాను రాజకీయాల్లోకి వస్తే మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది.. రాజకీయాలు తనకు సరిపడవంటున్నారు పెప్సీకో మాజీ సీఈవో ఇంద్ర నూయి. ప్రతిష్టాత్మక ఏషియా సోసైటి ఫౌండేషన్ అందించే ‘గేమ్ చేంజర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకున్న సందర్భంగా ఇంద్ర నూయి పలు విషయాల గురించి మాట్లాడారు. ‘ట్రంప్ క్యాబినేట్లో మీరు జాయిన్ అవ్వొచ్చు కదా’ అనే ప్రశ్నకు సమాధానంగా ఆమె ‘నాకు రాజకీయాలు సరిపోవు. నాకు సరిగా మాట్లడటమే రాదు. ఇంక లౌక్యంగా ఎలా మాట్లాడగలను.. ఒకవేళ నేను గనక రాజకీయాల్లోకి వస్తే మూడో ప్రపంచ యుద్ధమే వస్తుంది’ అంటూ ఇంద్ర నూయి చమత్కరించారు. పెప్పీకో సీఈవో బాధ్యతల నుంచి తప్పుకుంటానని ఈ నెల 3న ఇంద్ర నూయి ప్రకటించారు. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ ‘దాదాపు 40 ఏళ్లుగా నా రోజు ఉదయం 4 గంటలకు ప్రారంభమయ్యేది. రోజుకు దాదాపు 18 - 20 గంటలు పనిచేసే దాన్ని. కానీ ఇప్పుడు నాకు విశ్రాంతి దొరికింది. ఇప్పుడు నేను రోజుకు కనీసం 6 గంటలు ఏకధాటిగా నిద్రపోవడం ఎలా అనే విషయాన్ని నేర్చుకోవాలి. వీలైనన్ని దేశాలు చుట్టి రావాలి’ అంటూ చెప్పుకొచ్చారు. -
రెండు వారాల్లో కేబినెట్ ముందుకు టెలికం పాలసీ
న్యూఢిల్లీ: నూతన టెలికం పాలసీ రెండు వారాల్లో కేబినెట్ ఆమోదానికి రానున్నట్లు ఆ శాఖ కార్యదర్శి అరుణ సౌందరాజన్ తెలిపారు. అంతర్గత మంత్రిత్వ శాఖల సంప్రదింపులు ముగిశాయని, కేబినెట్ ఆమోదానికి సమర్పించడానికి ముందు తుది మెరుగులు దిద్దుకుంటోందని చెప్పారామె. నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్స్ పాలసీ (ఎన్డీసీపీ) అయిన దీన్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే బహిర్గత పరిచింది. టెలికం రంగంలో కొత్తగా రూ.6.5 లక్షల మేర పెట్టుబడులను ఆకర్షించడం, 2022 నాటికి 40 లక్షల ఉద్యోగాలను కల్పించడం, లెవీలను క్రమబద్ధీకరించడం ద్వారా టెలికం కంపెనీలపై భారాన్ని తగ్గించడం, 50ఎంబీపీఎస్ బ్రాడ్ బ్యాండ్ వేగాన్ని స్టాండర్డ్‌గా మార్చడం, 5జీ సేవల్ని తీసుకురావవడం వంటి లక్ష్యాలు ఇందులో ఉన్నాయి. -
కర్ణాటకలో కొలువుదీరిన కుమారస్వామి కేబినేట్
-
బాలల కెబినెట్ ఎన్నిక
గద్వాల న్యూటౌన్ : స్వచ్ఛ విద్యాలయలో భాగంగా శుక్రవారం పట్టణంలోని బుర్దపేట ఉన్నత పాఠశాలలో బాలల క్యాబినెట్ ఎన్నుకున్నట్లు ప్రధానోపాధ్యాయుడు గోపీనాథ్ తెలిపారు. ప్రతి తరగతి నుంచి ముగ్గురు విద్యార్థినులు, ఇద్దరు విద్యార్థుల చొప్పున అయిదు తరగతులకు 25 మంది ప్రతినిధులను ఎన్నుకున్నారు. ప్రధానమంత్రి, ఉప ప్రధానమంత్రి, విద్యా, పర్యావరణ, తాగునీరు, పారిశుధ్యం, ఆహారం, క్రీడలు, ఆరోగ్యం, నైతిక విలువలు తదితర మంత్రిత్వ శాఖలకు ఎన్నికలు నిర్వహించారు. ప్రధాన మంత్రిగా విద్యార్థి చంద్రశేఖరాచారి, ఉప ప్రధానిగా జగదీశ్వరి ఎన్నికయ్యారు. బాలల క్యాబినెట్ ద్వారా పాఠశాల మరింత అభివద్ధి చెందుతుందని హెచ్ఎం పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు భానుప్రకాష్, ఏఎన్ చారి, కష్ణకుమార్, శ్రీనివాసులు, కష్ణయ్య, జ్యోత్సS్న, అనిత తదితరులు పాల్గొన్నారు.