
పెప్సీకో మాజీ సీఈవో ఇంద్ర నూయి(ఫైల్ ఫోటో)
న్యూయార్క్ : తాను రాజకీయాల్లోకి వస్తే మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది.. రాజకీయాలు తనకు సరిపడవంటున్నారు పెప్సీకో మాజీ సీఈవో ఇంద్ర నూయి. ప్రతిష్టాత్మక ఏషియా సోసైటి ఫౌండేషన్ అందించే ‘గేమ్ చేంజర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకున్న సందర్భంగా ఇంద్ర నూయి పలు విషయాల గురించి మాట్లాడారు. ‘ట్రంప్ క్యాబినేట్‌లో మీరు జాయిన్ అవ్వొచ్చు కదా’ అనే ప్రశ్నకు సమాధానంగా ఆమె ‘నాకు రాజకీయాలు సరిపోవు. నాకు సరిగా మాట్లడటమే రాదు. ఇంక లౌక్యంగా ఎలా మాట్లాడగలను.. ఒకవేళ నేను గనక రాజకీయాల్లోకి వస్తే మూడో ప్రపంచ యుద్ధమే వస్తుంది’ అంటూ ఇంద్ర నూయి చమత్కరించారు.
పెప్పీకో సీఈవో బాధ్యతల నుంచి తప్పుకుంటానని ఈ నెల 3న ఇంద్ర నూయి ప్రకటించారు. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ ‘దాదాపు 40 ఏళ్లుగా నా రోజు ఉదయం 4 గంటలకు ప్రారంభమయ్యేది. రోజుకు దాదాపు 18 - 20 గంటలు పనిచేసే దాన్ని. కానీ ఇప్పుడు నాకు విశ్రాంతి దొరికింది. ఇప్పుడు నేను రోజుకు కనీసం 6 గంటలు ఏకధాటిగా నిద్రపోవడం ఎలా అనే విషయాన్ని నేర్చుకోవాలి. వీలైనన్ని దేశాలు చుట్టి రావాలి’ అంటూ చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment