world war 3
-
బాంబు షెల్టర్లకు గిరాకీ వరల్డ్ వార్-3కి సంకేతమా?
-
మూడో ప్రపంచయుద్ధం ముంచుకొస్తోంది: భయపెడుతున్న బిషప్ భవిష్యవాణి
కాన్బెర్రా: మూడో ప్రపంచయుద్ధ భయాలు ప్రపంచాన్ని వెంటాడుతున్నాయి. ఇరాన్, సిరియా, హమాస్, హిజ్బొల్లా, ఇజ్రాయెల్ మధ్య ఎప్పుడైనా భీకర యుద్ధం జరగబోతోందనే భయం అందరిలో నెలకొంది. మరోవైపు చైనా, తైవాన్ మధ్య ఉద్రిక్తతలు ఆసియా ఖండంలో అశాంతిని మరింతగా పెంచుతున్నాయి.ప్రపంచంలోని పలు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇతర దేశాలలో తీవ్ర ఆందోళనను సృష్టిస్తున్నాయి. తాజాగా ఆస్ట్రేలియన్ బిషప్ చెప్పిన భవిష్యవాణి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన బిషప్ మార్ మేరీ ఇమ్మాన్యుయేల్ మూడవ ప్రపంచ యుద్ధం భారీ బీభత్సాన్ని సృష్టిస్తుందని పేర్కొన్నాడు. ఈ యుద్ధంలో లెక్కలేనంత మంది ప్రాణాలు కోల్పోతారని, బతికిన వారు తర్వాత పశ్చాత్తాప పడతారని బిషప్ పేర్కొన్నారు. ఈయన తన సోషల్ మీడియా ఖాతా 'ఎక్స్'లో మానవాళికి ఎదురయ్యే చీకటి భవిష్యత్తును తాను ఊహించినట్లు పేర్కొన్నారు. A prophecy of world War 3.Almost one third of the population will perish.It will be the most disastorous , times of humanity. pic.twitter.com/om9PIia9BH— M. O. G. Bishop mar mari Emmanuel (@Bishopmurmuri) November 24, 2024బిషప్ మార్ మేరి ఇమ్మాన్యుయేల్ తన వీడియో సందేశంలో మూడవ ప్రపంచ యుద్ధం భారీ విధ్వంసాన్ని తెస్తుందని హెచ్చరించారు. ఈ యుద్ధంలో ప్రపంచ జనాభాలో మూడింట ఒక వంతు మంది కనుమరుగవుతారని, మిగిలిన మూడింట రెండొంతుల మంది తాము ఇక పుట్టకూడదని కోరుకుంటారని తెలిపారు. ఈ యుద్ధంలో అణ్వాయుధాలను వినియోగిస్తారని పేర్కొన్నారు. భవిష్యత్ గురించి బిషప్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బాబా వెంగా, నోస్ట్రాడామస్ తదితర ప్రపంచ ప్రసిద్ధ భవిష్యవాణివేత్తలు కూడా ఇదే విధమైన విషయాలను వెల్లడించారు.ఇది కూడా చదవండి: World Oldest Man: ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు కన్నుమూత -
బైడెన్ వల్ల మూడో ప్రపంచ యుద్ధం ఖాయం: ట్రంప్
ఇజ్రాయెల్, లెబనాన్‌లోని హెజ్బొల్లా మధ్య చోటు చేసుకున్న మిసైల్స్, రాకెట్ల దాడులు మధ్యప్రాచ్యంలో ఒక్కసారిగా యుద్ధ వాతావరణాన్ని తలపించాయి.ఈ దాడులపై అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలో ఉన్న నేతలు నిద్రలో పోతుండటం వల్ల ఈ దాడులు జరుగుతున్నాయని, ఇలా కొనాసాగితే మూడో ప్రపంచం యుద్ధం రావటం ఖాయమని ‘ఎక్స్’ వేదికగా అన్నారు.‘మధ్యప్రాచ్యంలో దాడులు జరగకుండా ఎవరు చర్చలు జరుపుతున్నారు? అక్కడ బాంబులు పడుతున్నాయి. అమెరికా అధ్యక్షడు జో బైడెన్ కాలిఫోర్నియాలోని బీచ్‌లో నిద్రిస్తున్నాడు. ఆయన డెమోక్రాట్లచే దుర్మార్గంగా బహిష్కరించబడ్డారు. కామ్రేడ్ కమల తన ప్రచారం బృందంతో బస్సు యాత్ర చేస్తోంది. కమల రన్నింగ్ మేట్ టిమ్ వాల్జ్ ఒక చెడ్డ ఎంపిక. సరైన వాళ్లును ఎంచుకోండి. మూడో ప్రపంచ యుద్ధం మనకు వద్దు. అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాము’ అని ట్రంప్ విమర్శలు చేశారు.Who is negotiating for us in the Middle East? Bombs are dropping all over the place! Sleepy Joe is sleeping on a Beach in California, viciously Exiled by the Democrats, and Comrade Kamala is doing a campaign bus tour with Tampon Tim, her really bad V.P. Pick. Let’s not have World…— Donald J. Trump (@realDonaldTrump) August 25, 2024 మధ్యప్రాచ్యంలో చోటు చేసుకుంటున్న ఘర్షణలను నిలువరించటంపై అమెరికా నాయకత్వంపై పలు సందేహాలను కలుగుతున్నాయని అన్నారు. సంఘర్షణకు దారితీసే ఉద్రిక్తతల తీవ్రతలను నివారించే మార్గాలను చర్చించడానికి యుఎస్ ఎయిర్ ఫోర్స్ జనరల్ సిక్యూ బ్రౌన్.. మిడిల్ ఈస్ట్‌లో అనూహ్య పర్యటన తర్వాత ఈ దాడులు జరగటం గమనార్హం.ఆదివారం లెబనాన్ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం మిసైల్స్‌తో దాడి చేసింది. హిజ్బుల్లా ఉగ్రసంస్థ నుంచి పొంచి ఉన్న ముప్పును ఎందుర్కొనేందుకు ఈ ముందస్తు దాడులను చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. సుమారు 40 మిసైల్స్‌ను ఇజ్రాయెల్ లెబనాన్‌పై ప్రయోగించింది.అయితే ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా వెంటనే స్పందించిన హిజ్బుల్లా ఉగ్రసంస్థ.. ఇజ్రాయెల్‌పై సుమారు 320 కట్యూషా రాకెట్లతో దాడి చేసినట్లు ప్రకటించింది. దీంతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ దాడుల్లో నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. -
48 గంటల్లో మూడో ప్రపంచ యుద్ధం?
మరో రెండు రోజుల్లో అంటే రాబోయే 48 గంటల్లో మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తోంది. న్యూ నోస్ట్రాడమస్‌గా పేరొందిన భారతీయ జ్యోతిష్య నిపుణులు కుశాల్ కుమార్ ఈ అంచనా వేశారు. జూన్ 18న మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభం కాబోతోందని కుశాల్ తెలిపారు.ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం భారత్-పాక్ సరిహద్దుల్లో ఉగ్రదాడులు, ఉత్తర కొరియా సైన్యం దక్షిణ కొరియా సరిహద్దు ప్రాంతంలోకి ప్రవేశించడం, ఇజ్రాయెల్- లెబనాన్ మధ్య పెరుగుతున్న ఘర్షణలు ఇవన్నీ మూడవ ప్రపంచ యుద్ధం ప్రారంభానికి సంకేతాలు.జూన్ 18న సంభవించే అత్యంత బలమైన గ్రహాల సంఘర్షణ ఫలితంగా మూడవ ప్రపంచ యుద్ధం మొదలవుతుందని కుశాల్ తెలిపారు. మేలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన తర్వాత కుశాల్ ఈ అంచనా అందించారు. జూన్ 9న యాత్రికుల బస్సుపై ఉగ్రదాడి దీనికి ముందస్తు సూచనగా ఆయన పేర్కొన్నారు. కాగా ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను మట్టుబెట్టే పనిలో మన సైనికులు నిమగ్నమై ఉన్నారు. జూన్ 10, 12 తేదీల్లో కూడా ఉగ్రదాడులు జరిగాయి.కుశాల్ కుమార్ అంచనా ప్రకారం రాబోయే 48 గంటలు క్లిష్టమైనవి. ఈ సమయంలో యుద్ధం చెలరేగే అవకాశం ఉంది. మూడో ప్రపంచ యుద్ధం పెను విధ్వంసాన్ని నృష్టించనుంది. ఆకాశం నుంచి ఉపగ్రహాలు కిందికి దూసుకువస్తాయని, అడవులు బూడిదగా మారుతాయని ఆయన తెలిపారు. అన్ని దేశాలు ఒకదానితో మరొకటి పోరాటానికి దిగుతాయని, ఈ యుద్ధం మొత్తం ప్రపంచాన్నంతటినీ సర్వనాశనం చేస్తుందని కుశాల్ వివరించారు. -
అడుగు దూరంలో వరల్డ్ వార్-3.. హెచ్చరించిన పుతిన్
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడో ప్రపంచ యుద్ధం అడుగు దూరంలోనే ఉందని పశ్చిమ దేశాలను పుతిన్ హెచ్చరించారు. ఇక, తాజాగా జరిగిన రష్యా అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్ భారీ మెజార్టీతో మరోసారి ఆ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దాదాపు 88శాతం ప్రజల మద్దతుతో ఆయన రష్యా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అనంతరం, పుతిన్ మాట్లాడుతూ.. ఆధునిక ప్రపంచంలో ఏదైనా సాధ్యమే. మూడో ప్రపంచ యుద్ధం అడుగు దూరంలో ఉంది. రష్యా, అమెరికా నేతృత్వంలోని నాటో కూటమికీ మధ్య ఘర్షణ తలెత్తితే మాత్రం అది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని హెచ్చరించారు. అయితే దీన్ని ఎవరూ కోరుకోవడం లేదన్నారు. ఇదే సమయంలో భవిష్యత్తులో తమ సైన్యాన్ని ఉక్రెయిన్‌కు పంపుతామన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ వ్యాఖ్యలను పుతిన్ తప్పుబట్టారు. ఇక, మార్చి 15 నుంచి 17 మధ్య రష్యా ఎన్నికల సమయంలో ఉక్రెయిన్ దాడులను తీవ్రతరం చేసింది. సరిహద్దు ప్రాంతాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించింది. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడం అవసరమని మీరు భావిస్తున్నారా? అని అడిగిన ప్రశ్నకు పుతిన్.. దాడులు ఇలాగే కొనసాగితే తమ భూభాగాన్ని రక్షించడానికి రష్యా మరింత ఉక్రేనియన్ భూభాగం నుంచి బఫర్ జోన్‌ను సృష్టిస్తుందని చెప్పారు. ఇది చదవండి: రష్యా అధ్యక్ష ఎన్నికలు.. పుతిన్ ఘన విజయం ఉక్రెయిన్‌లో నాటో సైనిక సిబ్బంది ఇప్పటికే ఉన్నారని, రష్యా యుద్ధభూమిలో ఇంగ్లిష్, ఫ్రెంచ్ దళాలు తలపడుతున్నాయి. ఇందులో వారికి ఎటువంటి మంచి జరగడం లేదు.. ఎందుకంటే వారు అక్కడ పెద్ద సంఖ్యలో చనిపోతున్నారని అన్నారు. ఈ రోజు జరుగుతున్న విషాద సంఘటనలను దృష్టిలో ఉంచుకుని, కీవ్ పాలనలోని భూభాగాల్లో ఒక నిర్దిష్ట 'శానిటరీ జోన్'ని సృష్టించడానికి మేము ఏదో ఒక సమయంలో బలవంతపు చర్యలు చేపడతామని పుతిన్ చెపుకొచ్చారు. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించడానికి మాత్రం పుతిన్ నిరాకరించారు. ఇదే సమయంలో ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని తీవ్రతరం చేయడాన్ని మెక్రాన్ ఆపివేసి.. శాంతి స్థాపనలో కీలక పాత్ర పోషించాలని తాను కోరుకుంటున్నానని పుతిన్ అన్నారు.. ‘నేను పదే పదే చెబుతున్నాను.. నేను మళ్లీ అదే చెబుతాను.. మేము శాంతి చర్చల కోసం ఉన్నాం.. కానీ శత్రువుల తూటాలు అయిపోతున్నందుకు కాదని వ్యాఖ్యలు చేశారు. -
మూడో ప్రపంచ యుద్ధం తప్పదు! ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై కొన్ని నెలలుగా సైనిక చర్య పేరుతో భీకర దాడులకు పాల్పడుతోంది రష్యా. అందుకు దీటుగా కీవ్ సేనలు బదులిస్తున్నారు. వందల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ అంశంపై స్పందించారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తక్షణం శాంతియుతంగా యుద్ధానికి ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో శనివారం నిర్వహించిన ‘సేవ్ అమెరికా’ ర్యాలీలో మాట్లాడుతూ.. అణ్వాయుధాల వినియోగంపై హెచ్చరించారు. ‘అజ్ఞానుల కారణంగా ఈ భూమిపై ఏమీ మిగలదు. ఉక్రెయిన్ యుద్ధానికి తక్షణ శాంతియుతంగా చర్చలు జరిపి ముగింపు పలకాలని మనమంతా డిమాండ్ చేయాలి. లేదా మూడో ప్రపంచ యుద్ధంతోనే ముగుస్తుంది. దాంతో మన భూమండలంపై ఏమీ మిగలదు.’ అని ప్రపంచాన్ని హెచ్చరించారు ట్రంప్. అణ్వాయుధాల వినియోగంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరికలు చేసిన తర్వాత ట్రంప్ ఈ మేరకు స్పందించటం సంచలనంగా మారింది. క్యూబన్ మిసైల్స్‌తో ఏర్పాడిన సంక్షోభంతో 60 ఏళ్ల తర్వాత మళ్లీ న్యూక్లియర్ బాంబుల ముప్పు పొంచి ఉందంటూ వ్యాఖ్యానించారు బైడెన్. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అణ్వాయుధాల హెచ్చరికలు జోక్ కాదని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ ప్రపంచానికి సూచించారు. గతంలోనూ ఇలాంటి హెచ్చరికలే చేశారు పలువురు ప్రపంచ నేతలు. వరుస హెచ్చరికల నేపథ్యంలో మూడో ప్రపంచ యుద్ధం తప్పదనే భావనలు మొదలైనట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: Russia Ukraine War: పుతిన్ అణ్వాయుధ బెదిరింపులపై బైడెన్ సంచలన వ్యాఖ్యలు -
ఇక అసలు యుద్ధం.. రష్యా తీవ్ర హెచ్చరికలు
పాశ్చాత్య దేశాల నుంచి భారీ ఆయుధ సంపత్తిని సమకూర్చుకుంటున్న వేళ.. ఉక్రెయిన్‌కు రష్యా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అసలైన యుద్ధం ఇప్పుడే మొదలుకాబోతోందంటూ ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో ఉక్రెయిన్ మళ్లీ భయం గుప్పిటకు చేరింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ తాజాగా అక్కడి మీడియాతో మాట్లాడారు. సిసలైన మూడో ప్రపంచ యుద్ధం దగ్గర పడిందని ఉక్రెయిన్ను హెచ్చరిస్తూనే.. శాంతి చర్చల విషయంలో కీవ్ వర్గాలు, ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ అనుసరిస్తున్న తీరుపై మండిపడ్డారాయన. ఇదిలా ఉండగా.. నాటో తరపున పాశ్చాత్య దేశాల నుంచి భారీ ఎత్తున్న ఆయుధ సామాగ్రి ఇప్పుడిప్పుడే ఉక్రెయిన్‌కు చేరుకుంటోంది. అంతేకాదు.. అమెరికా, దాని మిత్ర పక్షాలు ఓ కీలక నిర్ణయం తీసుకునేందుకు మంగళవారం భేటీ కానున్నాయి. ఈ తరుణంలోనే సెర్గీ తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు. మొదటి నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న రష్యా.. ఇప్పుడు జరగబోయే విధ్వంసానికి పాశ్చాత్య దేశాలు, ఉక్రెయిన్ తప్పుడు నిర్ణయాలే కారణమంటూ హెచ్చరికలు జారీ చేసింది. రష్యా అణు దాడులకు పాల్పడవచ్చనే ఆరోపణలు చేస్తూ.. అమెరికా సహా పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్ సాయానికి ముందుకొస్తున్నాయి. తాజాగా అమెరికా 700 మిలియన్ డాలర్ల సాయం అందిస్తామని ప్రకటించడంతో పాటు నాటో తరపున మరిన్ని దేశాలు ఫైటర్ జెట్లను, ఇతర యుద్ధ సామాగ్రిని ఉక్రెయిన్‌కు చేరవేస్తున్నాయి. చదవండి: మరో రెండు దేశాలను టార్గెట్ చేసిన పుతిన్ భారీగా సైన్యాన్ని నష్టపోతున్న వేళ.. రష్యా అధ్యక్షుడు పుతిన్ చర్చల పట్ల ఏమాత్రం సానుకూలంగా లేడని, అందుకే దాడులు ఉధృతం చేసే అవకాశాలు ఉన్నాయంటూ కీవ్ మీడియా వరుస కథనాలు ఇస్తోంది. దీంతో ఉక్రెయిన్ పౌరులు భయంతో మళ్లీ పరుగులు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి మొదలైన ఉక్రెయిన్ ఆక్రమణ(మిలిటరీ చర్య).. ఇంకా కొనసాగుతూనే ఉంది. భారీ ఆస్తి, ప్రాణ నష్టాలు వాటిల్లుతున్న ఉక్రెయిన్ వెనక్కి తగ్గకపోవడం, ఇన్ని రోజులు గడుస్తున్నా యుద్ధం ఓ కొలిక్కి రాకపోవడంపై పుతిన్ అంచనాలు తప్పినట్లేనని మేధావులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో యుద్ధం తీవ్రంగా మారే హెచ్చరికలూ వెలువడుతున్నాయి. ఇదీ చదవండి: ఉక్రెయిన్ను నడిపిస్తోంది ఇదే! -
థర్డ్ వరల్డ్ వార్‌పై రష్యా సంచలన వ్యాఖ్యలు.. తమ లక్ష్యం అదేనంటూ..
మాస్కో: ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం గనుక వస్తే అది అణ్వాయుధాలు, విధ్వంసక ఆయుధాలతోనే జరుగుతుందని రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ అభిప్రాయపడ్డారు. మరో ప్రపంచ యుద్ధం అణు యుద్ధమే అవుతుందని బుధవారం అల్‌జజీరా ఇంటర్వ్యూలో చెప్పారు. తమ ప్రత్యర్థి దేశం ఉక్రెయిన్ అణ్వాయుధాలు పొందడాన్ని తాము అనుమతించబోమని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ అణ్వాయుధాలు దక్కించుకోకుండా నిరోధించడం కోసమే తాము ప్రత్యేక మిలటరీ ఆపరేషన్ చేపట్టామని వివరించారు. ఉక్రెయిన్ను నిరాయుధీకరణ దేశంగా మార్చడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో పశ్చిమ దేశాల ఆంక్షలకు తాము సిద్ధంగానే ఉన్నామని తెలిపారు. ఉక్రెయిన్‌తో రెండు దఫా చర్చలకు రష్యా సన్నద్ధంగా ఉందని లావ్రోవ్ ఉద్ఘాటించారు. అమెరికా ఆదేశాల వల్లే ఈ చర్చల ప్రక్రియను ఉక్రెయిన్ వాయిదా చేస్తోందని ఆరోపించారు. మరోవైపు రెండు దేశాల ఎదురు దాడుల్లో రష్యా సైనికులు, ఉక్రెయిన్ తరఫున సైనికులతో పాటు సాధారణ పౌరులు కూడా భారీ సంఖ్యలో మృత్యువాతపడుతున్నారు. ప్రధాన పట్టణాలపై ఫోకస్ చేసిన రష్యన్ బలగాలు ఖార్కీవ్ను పూర్తిగా స్వాధీనం చేసుకున్నాయి. మరోవైపు యుద్ధంతో ఏడు లక్షల మంది దేశం విడిచి పారిపోతుండగా.. వాళ్లకు ఆశ్రయం ఇచ్చేందుకు చాలా దేశాలు విముఖత వ్యక్తం చేస్తున్నాయి. -
ప్రస్తుత పరిస్థితుల్లో మూడో ప్రపంచ యుద్దం రావొచ్చు!
లండన్: కరోనావైరస్ మహమ్మారి వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభం ప్రస్తుతం ప్రపంచంలో అనిశ్చితి, ఆందోళనను కలుగజేసిందని, ఇవి మరొక ప్రపంచ యుద్దానికి దారి తీసే అవకాశం ఉందని బ్రిటన్ సాయుధ దళాల అధిపతి హెచ్చరించారు. సైన్యంలో గాయపడిన, మరణించిన వారి స్మారకార్ధం ఏర్పాటు చేసిన కార్యక్రమం సందర్భంగా ఆయన ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటరర్వ్యూలో మాట్లాడారు. ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరిగిన కారణంగా అవి ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్తతలకు దారి తీయవచ్చు అని బ్రిటన్ సాయుధ దళాధిపతి చీఫ్ నిక్ కార్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మరొక ప్రపంచ యుద్దం వచ్చే ముప్పు ఉందా అని అడగగా అలా జరగే అవకాశం ఉంది. కాబట్టి మనం ఆ విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి అని అన్నారు. అది వరకు జరిగిన యుద్దం వలన ఏర్పడిన భయానక పరిస్థితుల గురించి మర్చిపోకూడదని కార్టర్ తెలిపారు. చరిత్రలో జరిగిన రెండు భయంకరమైనమ పెద్ద యుద్దాలను చూస్తే చాలా నష్టం జరిగింది. ఇలాంటి యుద్దాలను మళ్లీ మేము చూడలేము అని పేర్కొన్నారు. చదవండి: వైట్‌హౌస్ నుంచి వెళ్దాం: ట్రంప్‌తో భార్య మెలానియా -
‘రాజకీయాల్లోకి వస్తే ప్రపంచ యుద్ధమే’
న్యూయార్క్ : తాను రాజకీయాల్లోకి వస్తే మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది.. రాజకీయాలు తనకు సరిపడవంటున్నారు పెప్సీకో మాజీ సీఈవో ఇంద్ర నూయి. ప్రతిష్టాత్మక ఏషియా సోసైటి ఫౌండేషన్ అందించే ‘గేమ్ చేంజర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకున్న సందర్భంగా ఇంద్ర నూయి పలు విషయాల గురించి మాట్లాడారు. ‘ట్రంప్ క్యాబినేట్లో మీరు జాయిన్ అవ్వొచ్చు కదా’ అనే ప్రశ్నకు సమాధానంగా ఆమె ‘నాకు రాజకీయాలు సరిపోవు. నాకు సరిగా మాట్లడటమే రాదు. ఇంక లౌక్యంగా ఎలా మాట్లాడగలను.. ఒకవేళ నేను గనక రాజకీయాల్లోకి వస్తే మూడో ప్రపంచ యుద్ధమే వస్తుంది’ అంటూ ఇంద్ర నూయి చమత్కరించారు. పెప్పీకో సీఈవో బాధ్యతల నుంచి తప్పుకుంటానని ఈ నెల 3న ఇంద్ర నూయి ప్రకటించారు. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ ‘దాదాపు 40 ఏళ్లుగా నా రోజు ఉదయం 4 గంటలకు ప్రారంభమయ్యేది. రోజుకు దాదాపు 18 - 20 గంటలు పనిచేసే దాన్ని. కానీ ఇప్పుడు నాకు విశ్రాంతి దొరికింది. ఇప్పుడు నేను రోజుకు కనీసం 6 గంటలు ఏకధాటిగా నిద్రపోవడం ఎలా అనే విషయాన్ని నేర్చుకోవాలి. వీలైనన్ని దేశాలు చుట్టి రావాలి’ అంటూ చెప్పుకొచ్చారు. -
మరో మహాయుద్ధం పొంచి ఉందా?
► మూడో ప్రపంచ యుద్ధంపై పెరుగుతున్న భయాలు ► దేశాధినేతల నోట తరచుగా ప్రస్తావనలు.. హెచ్చరికలు ► ఆందోళనలు పెంచుతున్న ప్రపంచ పరిణామాలు ► క్రిమియా నుంచి సిరియా, కొరియాల వరకూ ఉద్రిక్తతలు ► అమెరికా, రష్యా, చైనాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం ► భారత్–పాక్–చైనా మధ్య యుద్ధ భయాలు సాక్షి నాలెడ్జ్ సెంటర్ ప్రపంచ దేశాల మధ్య అగ్గి రాజుకుంటోంది. అంతకంతకూ ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. తూర్పు యూరప్‌లో సైనిక పదఘట్టనలు మిన్నంటుతున్నాయి. పశ్చిమాసియా పేలుళ్లతో దద్దరిల్లుతోంది. దక్షిణ చైనా సముద్రంలో యుద్ధనౌకల రద్దీ పెరుగుతోంది. దక్షిణాసియాలో సరిహద్దులు ఉద్రిక్తమవుతున్నాయి. దేశదేశాలు సైనిక పాటవాలకు పదును పెడుతున్నాయి. పరిణామాలను చూస్తే ప్రపంచం మరో మహాయుద్ధానికి సన్నద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది! అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన కీలక సలహాదారుడు బానన్, బ్రిటన్ మాజీ ప్రధాని కామెరాన్, సోవియట్ రష్యా చివరి నాయకుడు గోర్బచేవ్, చైనా కమ్యూనిస్టు ప్రభుత్వ మంత్రులు వంటి అగ్రరాజ్యాల అధినాయకుల నోటి వెంట మూడో ప్రపంచ యుద్ధం మాటలు తరచుగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచ భౌగోళిక రాజకీయ సంబంధాలు, ఆర్థిక పరిస్థితులు బలహీనంగా ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడ ఏ సంఘర్షణ ముదిరినా.. అది అనూహ్యంగా ప్రపంచ యుద్ధంగా మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ యుద్ధం ఎక్కడ ఎలా మొదలు కావచ్చనే అంశంపై అంతర్జాతీయ మీడియాలో విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. నిప్పు ఎక్కడ రాజుకోవచ్చు?: మొదటి ప్రపంచ యుద్ధం 1914లో యూరప్‌లో మొదలైంది. రెండో ప్రపంచ యుద్ధం కూడా 1939లో యూరప్‌లోనే ఆరంభమైంది. అందుకు ప్రధాన కారణం.. అప్పుడు ప్రపంచంలో బలమైన శక్తులు అక్కడ కేంద్రీకృతమై ఉండటమే. ఆ యుద్ధాలు రెండూ అనూహ్యంగా వచ్చిపడ్డవే. 1945లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత యూరప్‌లో శాంతి, సామరస్యాలు వర్ధిల్లుతూ వచ్చాయి. 1962లో క్యూబా క్షిపణి సంక్షోభం.. ప్రపంచాన్ని అణుయుద్ధం అంచులవరకూ తీసుకెళ్లినా.. అగ్ర రాజ్యాల సంయమనంతో ఉద్రిక్తతలు చల్లారాయి. అనంతరం సోవియట్ రష్యా పతనంతో ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిపోయి.. ప్రపంచ యుద్ధం వచ్చే పరిస్థితులు తొలగిపోయాయని అనుకున్నారు. కానీ.. ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. యూరప్ దేశాల ఐక్యత విచ్ఛిన్నమవుతోంది. సోవియట్ పతనంతో బలహీనపడిందనుకున్న రష్యా బలం పుంజుకుంది. పశ్చిమాసియాలో అగ్రరాజ్యాల మధ్య పరోక్ష యుద్ధం సాగుతోంది. ఆసియాలో చైనా బలపడటం అమెరికాకు ఆందోళన కలిగిస్తోంది. ఉత్తర కొరియా అణ్వస్త్ర బలం ప్రపంచానికే ముప్పుగా కనిపిస్తోంది. భారత్–పాకిస్తాన్–చైనా మధ్య కశ్మీర్, సరిహద్దుల వివాదం ముదురుతోంది. ఈ పరిస్థితుల్లో మూడో ప్రపంచ యుద్ధం ఎక్కడి నుంచైనా మొదలుకావచ్చునని నిపుణులు చెబుతున్నారు. యురేసియా (యూరప్–అమెరికా–రష్యా): క్రిమియాను రష్యా కలిపేసుకోవడంతో యూరప్–రష్యా మధ్య రెండో ప్రచ్ఛన్న యుద్ధం మొదలైందని 2014లోనే అంతర్జాతీయ మేగజీన్ ‘టైమ్’ ప్రకటించింది. పుతిన్ సారథ్యంలోని రష్యా.. ఉక్రెయిన్ సంక్షోభంలో కూడా జోక్యం చేసుకోవడం విస్తరణవాదంగా పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి. ఇక నాటోకు కాలం చెల్లిందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు యూరప్ దేశాల్లో ఆందోళన రేకెత్తించాయి. రష్యా–యూరప్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ భగ్గుమన్నాయి. ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే ప్రచ్ఛన్న యుద్ధం కాస్తా ప్రత్యక్ష యుద్ధంగా మారే ప్రమాదం ఉందని అంతర్జాతీయ నిపుణుల అంచనా. పశ్చిమాసియా (సిరియా–రష్యా–అమెరికా) అమెరికాపై 9/11 ఉగ్రదాడి అనంతరం అఫ్గాన్, ఇరాక్‌లపై అమెరికా దాడులు చేయడంతో పశ్చిమాసియాలో ఐసిస్ వంటి భయంకర ఉగ్రవాద సంస్థలు బలపడ్డాయి. సిరియాలో బషర్ అల్–అసద్ సర్కారును కూల్చగలిగితే ప్రపంచంలోని సుసంపన్న చమురు నిల్వలపై అమెరికాకు తిరుగులేని ఆధిపత్యం లభించేది. కానీ అసద్ సర్కారుకు రష్యా అండగా ఉండటంతో.. సిరియా భూమికగా అమెరికా–రష్యాలు మళ్లీ ముఖాముఖి తలపడుతున్నాయి. ఈ ఘర్షణ ముదిరి భారీ ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర కొరియా–చైనా–అమెరికా ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ఉద్రిక్తంగా ఉన్న ప్రాంతం కొరియా ద్వీపకల్పం. ఉత్తర కొరియా అణ్వస్త్రాలు, క్షిపణుల పరీక్షల పరంపరతో ప్రపంచాన్ని వేడెక్కిస్తోంది. ఆ దేశం దూకుడును నియంత్రించడానికి అవసరమైతే ఏకపక్షంగా చర్యలు చేపడతామని అమెరికా హెచ్చరించింది. యుద్ధనౌకలను కూడా ఆ దేశానికి సమీపంలోకి పంపించింది. అమెరికాతో జపాన్ జతకట్టి సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది. అమెరికా సంయమనం పాటించాలని ఉత్తర కొరియా మిత్రదేశమైన చైనా చెబుతోంది. అదే సమయంలో యుద్ధం వస్తే ఎదుర్కోవడానికి తన సైన్యాన్ని సమాయత్తం చేస్తోంది. అమెరికా బెదిరింపు చర్యలను చూసి ఉత్తరకొరియా ముందస్తు దాడులకు దిగే ప్రమాదం ఉందని.. అదే జరిగితే ఉ.కొరియా, చైనా, రష్యా–దక్షిణ కొరియా, అమెరికా, జపాన్ల మధ్య భారీ యుద్ధం రావచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్–ఇజ్రాయెల్–అమెరికా: ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని రద్దు చేస్తానని ట్రంప్ ప్రకటించారు. అలా రద్దు చేయడమంటే.. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా, దాని మిత్రదేశం ఇజ్రాయెల్ సైనిక దాడులు చేయడమే. అలా జరిగితే ఇరాన్ ఆ దేశాలతో యుద్ధానికి దిగుతుంది. ఇరాన్ మిత్రపక్షమైన రష్యాతోపాటు కొన్ని పశ్చిమాసియా మిత్రులు కూడా యుద్ధానికి దిగవచ్చు. అమెరికా వైపు నాటో దేశాలు, సౌదీ అరేబియా వంటి అరబ్ దేశాలు యుద్ధానికి దిగక తప్పదు. అది మూడో ప్రపంచ యుద్ధంగా మారుతుంది. ఆసియా పసిఫిక్ (అమెరికా–జపాన్–చైనా): ఆర్థికంగా, సైనికంగా వేగంగా బలపడుతున్న చైనాతో తనకు ఇబ్బందులు ఉంటాయని అమెరికా భావిస్తోంది. ఈ నేపథ్యంలో చైనాను కట్టడి చేయడానికి తన నౌకాదళ స్థావరాల్లో 60 శాతాన్ని ఆసియాకు బదిలీ చేసింది. జపాన్ తదితర తూర్పు దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంది. ఇటీవలి కాలంలో చైనా–జపాన్ మధ్య కొన్ని దీవుల విషయంలో ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికా–చైనా మధ్య దక్షిణ చైనా సముద్రం విషయంలో గొడవలు ముదురుతున్నాయి. అమెరికా–చైనా రెండూ ముఖాముఖి తలపడే దిశగా పయనిస్తున్నాయని అంచనా వేస్తున్నారు. దక్షిణాసియా (ఇండియా–పాక్– చైనా–అమెరికా): భారత్–పాకిస్తాన్ మధ్య కశ్మీర్‌పై ఇప్పటికే మూడు యుద్ధాలు జరిగాయి. పాకిస్తాన్‌కు చైనా మద్దతిస్తోంది. ఒబామా హయాంలో అమెరికా–భారత్ మధ్య బంధం బలపడినప్పటికీ.. ట్రంప్ అధ్యక్షుడయ్యాక అమెరికా వైఖరిపై గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో అధీన రేఖ వెంట ఉద్రిక్తతలు పెరిగిపోయి ఏ పక్షం సైనిక చర్యలను పెంచినా అది పూర్తిస్థాయి యుద్ధానికి దారితీయొచ్చని, ఆ యుద్ధంలోకి అమెరికా, చైనాలు కూడా ప్రవేశించే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. అటు భారత్–చైనా మధ్య కూడా సరిహద్దు సమస్య ఉంది. ఇప్పటికే చైనా–భారత్ మధ్య ఒక యుద్ధం జరిగింది. సరిహద్దు వివాదం మరో యుద్ధానికి దారితీస్తుందా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మూడో ప్రపంచ యుద్ధంపై ఎవరేమన్నారు? ‘‘ప్రస్తుత పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. ప్రపంచం యుద్ధానికి సంసిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. నాటో–రష్యాలు పాయింట్ బ్లాంక్ రేంజ్లో మోహరించాయి’’ – మిఖాయిల్ గోర్బచేవ్, సోవియట్ రష్యా చివరి అధ్యక్షుడు (జనవరి 2017) ‘‘వాళ్లు మూడో ప్రపంచ యుద్ధం వచ్చేలా ఒత్తిడి చేస్తున్నారు..’’ – అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (జనవరి 2017లో–ఏడు ముస్లిం దేశాల నుంచి వలసలను నిషేధిస్తూ ఉత్తర్వును విమర్శించిన డెమొక్రాట్లను ఉద్దేశిస్తూ..) ‘‘ఉత్తర కొరియాపై చేయి వేస్తే.. జనం తుపాకులు, క్షిపణులతో రక్షించుకుంటారు. మా వద్ద థెర్మోన్యూక్లియర్ బాంబు ఉంది. మూడు బాంబులతో ప్రపంచం అంతమవుతుంది..’’ – ఉత్తర కొరియా అనధికారిక దౌత్యవేత్త అలెజాండ్రో చావో ది బెనోస్ (ఏప్రిల్ 2017) ‘‘ఈ ఏడాది మే 13న మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుంది. ట్రంప్ ఈ యుద్ధాన్ని ఆరంభిస్తారు. పెను విధ్వంసం, భారీ మరణాల తర్వాత అక్టోబర్ 13న యుద్ధం ముగుస్తుంది.’’ – హోరిసియో విలేగస్ (ఏప్రిల్ 2017– ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అవుతారని 2015లోనే చెప్పిన జోస్యుడు)