పాశ్చాత్య దేశాల నుంచి భారీ ఆయుధ సంపత్తిని సమకూర్చుకుంటున్న వేళ.. ఉక్రెయిన్‌కు రష్యా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అసలైన యుద్ధం ఇప్పుడే మొదలుకాబోతోందంటూ ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో ఉక్రెయిన్ మళ్లీ భయం గుప్పిటకు చేరింది.
రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ తాజాగా అక్కడి మీడియాతో మాట్లాడారు. సిసలైన మూడో ప్రపంచ యుద్ధం దగ్గర పడిందని ఉక్రెయిన్‌ను హెచ్చరిస్తూనే.. శాంతి చర్చల విషయంలో కీవ్ వర్గాలు, ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అనుసరిస్తున్న తీరుపై మండిపడ్డారాయన. ఇదిలా ఉండగా.. నాటో తరపున పాశ్చాత్య దేశాల నుంచి భారీ ఎత్తున్న ఆయుధ సామాగ్రి ఇప్పుడిప్పుడే ఉక్రెయిన్‌కు చేరుకుంటోంది. అంతేకాదు.. అమెరికా, దాని మిత్ర పక్షాలు ఓ కీలక నిర్ణయం తీసుకునేందుకు మంగళవారం భేటీ కానున్నాయి. ఈ తరుణంలోనే సెర్గీ తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు.
మొదటి నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న రష్యా.. ఇప్పుడు జరగబోయే విధ్వంసానికి పాశ్చాత్య దేశాలు, ఉక్రెయిన్ తప్పుడు నిర్ణయాలే కారణమంటూ హెచ్చరికలు జారీ చేసింది. రష్యా అణు దాడులకు పాల్పడవచ్చనే ఆరోపణలు చేస్తూ.. అమెరికా సహా పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్ సాయానికి ముందుకొస్తున్నాయి. తాజాగా అమెరికా 700 మిలియన్ డాలర్ల సాయం అందిస్తామని ప్రకటించడంతో పాటు నాటో తరపున మరిన్ని దేశాలు ఫైటర్ జెట్లను, ఇతర యుద్ధ సామాగ్రిని ఉక్రెయిన్‌కు చేరవేస్తున్నాయి.
చదవండి: మరో రెండు దేశాలను టార్గెట్ చేసిన పుతిన్
భారీగా సైన్యాన్ని నష్టపోతున్న వేళ.. రష్యా అధ్యక్షుడు పుతిన్ చర్చల పట్ల ఏమాత్రం సానుకూలంగా లేడని, అందుకే దాడులు ఉధృతం చేసే అవకాశాలు ఉన్నాయంటూ కీవ్ మీడియా వరుస కథనాలు ఇస్తోంది. దీంతో ఉక్రెయిన్ పౌరులు భయంతో మళ్లీ పరుగులు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఫిబ్రవరి 24వ తేదీ నుంచి మొదలైన ఉక్రెయిన్ ఆక్రమణ(మిలిటరీ చర్య).. ఇంకా కొనసాగుతూనే ఉంది. భారీ ఆస్తి, ప్రాణ నష్టాలు వాటిల్లుతున్న ఉక్రెయిన్ వెనక్కి తగ్గకపోవడం, ఇన్ని రోజులు గడుస్తున్నా యుద్ధం ఓ కొలిక్కి రాకపోవడంపై పుతిన్ అంచనాలు తప్పినట్లేనని మేధావులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో యుద్ధం తీవ్రంగా మారే హెచ్చరికలూ వెలువడుతున్నాయి.
ఇదీ చదవండి: ఉక్రెయిన్‌ను నడిపిస్తోంది ఇదే!
Comments
Please login to add a commentAdd a comment