Sergei lavrov
-
కమలా హారీస్‌కు పుతిన్ మద్దతు.. ట్విస్ట్ ఇచ్చిన లావ్రోవ్
మాస్కో: అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచ దేశాల ఫోకస్ ఉంది. ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనే చర్చ కూడా నడుస్తోంది. ఎన్నికల్లో పలు దేశాలు నేతలు ఎవరికి మద్దతు ఇస్తున్నారనే అంశం కూడా ఎన్నికల్లో కీలక కానుంది. ఇక, కమలా హారీస్‌కే తమ మద్దతు అంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలో పుతిన్ వ్యాఖ్యలపై రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ క్లారిటీ ఇచ్చారు.అమెరికా అధ్యక్ష ఎన్నికలపై లావ్రోవ్ తాజాగా స్పందిస్తూ.. ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారీస్‌కు మద్దతు ఉంటుందని పుతిన్ సరదాగా మాత్రమే అన్నారు. పుతిన్ అప్పుడప్పుడు జోక్స్ వేస్తుంటారు. అందులో భాగంగానే ఇలా మాట్లాడారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మా జోక్యం ఏమీ ఉండదు. ఇంతకుముందు, ఇప్పుడు.. ఎన్నికల్లో జోక్యం చేసుకోము. మా వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదు అంటూ కామెంట్స్ చేశారు. BREAKING: Russian Foreign Minister Sergei Lavrov said in an interview with Sky News Arabia that Putin was JOKING when he said he wanted Kamala Harris to win the election in November.— Amanda Liyang (@esraa28305334) September 22, 2024ఇదిలా ఉండగా.. కొద్దిరోజులు క్రితం రష్యా అధ్యక్షుడు పుతిన్.. అమెరికా ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కమలాతో పనిచేయడం సులువని తనదైన శైలిలో మాట్లాడారు. అయితే, హారీస్ ఎంపికలో జో బైడెన్ నిర్ణయాన్ని తాను గౌరవిస్తానన్నారు. ఏదేమైనా.. ఆ దేశ అధ్యక్షుడు ఎవరనే విషయాన్ని అక్కడివారే నిర్ణయిస్తారని ముగించారు.అనంతరం, పుతిన్ వ్యాఖ్యలపై వైట్‌హౌస్ వర్గాలు స్పందించాయి. పుతిన్ కామెంట్స్‌కు అమెరికా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ కౌంటరిచ్చారు. అమెరికా తదుపరి అధ్యక్షుడు ఎవరనే విషయాన్ని నిర్ణయించేది కేవలం స్థానికులే. మా అధ్యక్ష ఎన్నికలపై పుతిన్ మాట్లాడటం ఆపేస్తే మంచింది. ఈ ఎన్నికల్లో మీ జోక్యాన్ని ఎవరూ కోరుకోవడం లేదు. భవిష్యత్‌లో కూడా ఎన్నికల గురించి మాట్లాడకండి అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: బైడెన్‌తో చర్చలు ఫలించాయి: ప్రధాని మోదీ -
'మా రక్షణ కోసం చేస్తున్న యుద్ధం': రష్యా విదేశాంగ మంత్రి
ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధమే ప్రధాన అంశంగా ఢిల్లీలో జీ20 విదేశాంగ మంత్రుల సమావేశం జరిగిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఉక్రెయిన్ యుద్ధం గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు లావ్రోవ్ మాట్లాడుతూ.."రష్యా దురాక్రమణదారు కాదు. మాకు వ్యతిరేకంగా యుద్ధాన్ని ప్రారంభించారు. మేము ఆ యుద్ధాన్ని ఆపేందుకే యత్నించాం. ఉక్రెనియన్ ప్రజలను ఉపయోగించి మాకు వ్యతిరేకంగా యుద్ధానికి దిగిలే చేశారు. వాస్తవానికి రష్యా తనను తాను రక్షించుకునేందుకే యుద్ధం చేస్తోంది. పశ్చిమ దేశాలకు రెండు రకలుగా ప్రవర్తిస్తాయి. జీ20 సమావేశంలో ఉక్రెయిన్ గురించి లెనెత్తినప్పుడూ లిబియా, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, యుగోస్లేవియా తదితర దేశాల పరిస్థితి గురించి చర్చించరే. ఆర్థిక నిర్వహణ, సూక్ష్మ ఆర్థిక విధానాల కోసం ఏర్పడిన జీ20 సదస్సు తన రక్షణ కోసం పోరాడుతున్న రష్యా గురించి ఎవ్వరూ మాట్లాడరు గానీ కేవలం ఉక్రెయిన్ మాత్రమే జీ20కి కనిపిస్తుంది. అలాగే అమెరికా చేస్తున్న రష్యా డబులస్టాండర్డ్ వ్యాఖ్యలు గురించి మాట్లాడుతూ..సెర్బియాపై ఎప్పుడూ దాడి జరిగిందో అమెరికాకు తెలియదు, కానీ ఆ సమయంలో అమెరికా సెనెటర్‌గా ఉన్న బైడెన్ దీన్ని తానే ప్రోత్సహించానని గొప్పలు చెప్పుకుంటాడు. అలాగే ఇరాన్ దేశం నాశనమైనప్పుడూ టోని బ్లెయిర్ అది పొరపాటుగా చెప్పుకున్నాడు. అమెరికా దేశం ముప్పు అని ప్రకటించగానే మిగతా దేశాలు వంత పాడతాయే గానీ ఇలాంటి వాటి గురించి ప్రశ్నించదు." అని అన్నారు. అలాగే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో చర్చలు జరపడమనేది నేరపూరిత నేరం అని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ డిక్రీ పై సంతంకం చేసినప్పుడూ..యుద్ధాన్ని ముగించేందుకు ఎలా చర్చలు జరుగుతాయన్నారు. రష్యాను యుద్ధ రంగంలో ఓడించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, నాటో సెక్రటరీ జనరల్ జెనసర్ స్టోల్టెన్‌బర్గ్ బహిరంగంగా ప్రకటించారని లావ్రోవ్ అన్నారు. అంతేగాదు ఐరోపాలో దేశాలు ఉక్రెయిన్‌లో రష్యా చేస్తున్న దాడివల్ల ప్రభావితం కాలేదని, రష్యా చర్యలన్నింటికి పశ్చిమ దేశాలే కారణమని లావ్రోవ్ ఆరోపించారు. (చదవండి: ఆ ప్రాంతంలో ఈ పిల్లి ఫేమస్.. చూసేందుకు ఎగబడుతున్న పర్యాటకులు!) -
యుద్ధం ముగించండి.. ససేమిరా అంటున్న రష్యా!
ఇండోనేషియాలో జరిగిన జీ20 సదస్సులో యూఎస్, పాశ్చాత్య మిత్రదేశాలు యుద్ధానికి ముగింపు పలకమంటూ రష్యా పై ఒత్తిడి తెచ్చాయి. ఐతే రష్యా రాయబారి మాత్రం ససేమిరా తగ్గేదేలే అని తేల్చి చెప్పారు. ఈ మేరకు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత జరిగిన తొలి జీ20 సమావేశంలో యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్, రష్యా రాయబారి సెర్గీ లావ్రోవ్లు సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ సమావేశానికి కంటే ముందే బ్లింకెన్ ఫ్రెంచ్, జర్మన్ సహచరులు, ఒక సీనియర్ బ్రిటీష్ అధికారితో కలిసి రష్యా ఉక్రెయిన్‌పై సాగిస్తున్న దురాక్రమణ గురించి చర్చించినట్లు యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ పేర్కొంది. ఐతే ఈ జీ 20 సమావేశంలో... రష్యా ఉద్దేశ పూర్వకంగానే ఉక్రెయన్ వ్యవసాయాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడిందని, అందువల్లే ప్రపంచ ఆహార భద్రత సమస్య ఏర్పడిందన్నారు.ఈ సమస్యకు చెక్‌పెట్టేలా పరిష్కార మార్గాల కోసం కూడా చర్చించారు. అదీగాక బ్లింకెన్ రష్యా రాయబారి లావ్రోవ్తో చర్చించడానికి దూరంగా ఉండటం వల్లే రష్యా ప్రపంచ ఆహార సంక్షోభాన్ని ప్రేరేపించందంటూ విమర్శలు వెలువెత్తాయి. అంతేకాదు రష్యా యుద్ధంలో దెబ్బతిన్న ఉక్రెయిన్ ఎగుమతులను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ యూఎస్ సెక్రటరీ బ్లింకెన్.. రష్యా రాయబారిని ప్రశ్నించారు. అంతేకాదు ఉక్రెయిన్ ఎగుమతులను అనుమతించమని రష్యాని డిమాండ్ చేశారు. మధ్యాహ్న సమయానికి జరిగిన జీ20 సెషన్లో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా ప్రసంగించడంతోనే లావ్రోవ్ గైర్హాజరయ్యారని దౌత్య వర్గాలు పేర్కొన్నాయి. కాగా, మాస్కో రాయబారి లావ్రోవ్ మాత్రం తాను హజరయ్యానని విలేకరుల సమావేశంలో చెప్పడం విశేషం. ఇదిలా ఉండగా.. జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై కాల్పులు జరగాయనే వార్తలు హల్చల్ చేయడంతో ఆ సమావేశం కాస్త ఉద్విగ్నంగా మారింది. ఇది చాలా విచారకరమైన క్షణమని అమెరికా కార్యదర్శి బ్లింకెన్ పేర్కొన్నారు. ఈ జీ20 సమావేశంలో యుద్ధాన్ని సాధ్యమైనంత మేర త్వరగా ముగించడం, చర్చల ద్వారా విభేదాలను పరిష్కరించడం పై దృష్టి సారించడం వంటివి మాత్రమే తమ బాధ్యత అని ఇండోనేషియా విదేశాంగ మంత్రి రెట్నో మార్సుడి అన్నారు. (చదవండి: పైశాచికం.. షింజో అబే మృతిపై చైనాలో సంబురాలు!) -
ఇక అసలు యుద్ధం.. రష్యా తీవ్ర హెచ్చరికలు
పాశ్చాత్య దేశాల నుంచి భారీ ఆయుధ సంపత్తిని సమకూర్చుకుంటున్న వేళ.. ఉక్రెయిన్‌కు రష్యా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అసలైన యుద్ధం ఇప్పుడే మొదలుకాబోతోందంటూ ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో ఉక్రెయిన్ మళ్లీ భయం గుప్పిటకు చేరింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ తాజాగా అక్కడి మీడియాతో మాట్లాడారు. సిసలైన మూడో ప్రపంచ యుద్ధం దగ్గర పడిందని ఉక్రెయిన్ను హెచ్చరిస్తూనే.. శాంతి చర్చల విషయంలో కీవ్ వర్గాలు, ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ అనుసరిస్తున్న తీరుపై మండిపడ్డారాయన. ఇదిలా ఉండగా.. నాటో తరపున పాశ్చాత్య దేశాల నుంచి భారీ ఎత్తున్న ఆయుధ సామాగ్రి ఇప్పుడిప్పుడే ఉక్రెయిన్‌కు చేరుకుంటోంది. అంతేకాదు.. అమెరికా, దాని మిత్ర పక్షాలు ఓ కీలక నిర్ణయం తీసుకునేందుకు మంగళవారం భేటీ కానున్నాయి. ఈ తరుణంలోనే సెర్గీ తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు. మొదటి నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న రష్యా.. ఇప్పుడు జరగబోయే విధ్వంసానికి పాశ్చాత్య దేశాలు, ఉక్రెయిన్ తప్పుడు నిర్ణయాలే కారణమంటూ హెచ్చరికలు జారీ చేసింది. రష్యా అణు దాడులకు పాల్పడవచ్చనే ఆరోపణలు చేస్తూ.. అమెరికా సహా పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్ సాయానికి ముందుకొస్తున్నాయి. తాజాగా అమెరికా 700 మిలియన్ డాలర్ల సాయం అందిస్తామని ప్రకటించడంతో పాటు నాటో తరపున మరిన్ని దేశాలు ఫైటర్ జెట్లను, ఇతర యుద్ధ సామాగ్రిని ఉక్రెయిన్‌కు చేరవేస్తున్నాయి. చదవండి: మరో రెండు దేశాలను టార్గెట్ చేసిన పుతిన్ భారీగా సైన్యాన్ని నష్టపోతున్న వేళ.. రష్యా అధ్యక్షుడు పుతిన్ చర్చల పట్ల ఏమాత్రం సానుకూలంగా లేడని, అందుకే దాడులు ఉధృతం చేసే అవకాశాలు ఉన్నాయంటూ కీవ్ మీడియా వరుస కథనాలు ఇస్తోంది. దీంతో ఉక్రెయిన్ పౌరులు భయంతో మళ్లీ పరుగులు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి మొదలైన ఉక్రెయిన్ ఆక్రమణ(మిలిటరీ చర్య).. ఇంకా కొనసాగుతూనే ఉంది. భారీ ఆస్తి, ప్రాణ నష్టాలు వాటిల్లుతున్న ఉక్రెయిన్ వెనక్కి తగ్గకపోవడం, ఇన్ని రోజులు గడుస్తున్నా యుద్ధం ఓ కొలిక్కి రాకపోవడంపై పుతిన్ అంచనాలు తప్పినట్లేనని మేధావులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో యుద్ధం తీవ్రంగా మారే హెచ్చరికలూ వెలువడుతున్నాయి. ఇదీ చదవండి: ఉక్రెయిన్ను నడిపిస్తోంది ఇదే! -
Ukraine-Russia War: చర్చలకు వెన్నుపోటు
లివీవ్: యుద్ధానికి చర్చల ద్వారా పరిష్కారం దొరుకుతుందన్న ఆశలపై రష్యా నీళ్లుచల్లింది. చర్చల ప్రక్రియకు ఉక్రెయిన్ ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా వెన్నుపోటు పొడుస్తోందని బుధవారం తీవ్ర ఆరోపణలు చేసింది. ముందుగా రష్యా దళాలు తమ దేశం నుంచి వెనుదిరగాలని ఆ తర్వాత శాంతి ఒప్పందం చేసుకుని, దానిపై ప్రజల్లో రిఫరెండం జరిపిద్దామని ఉక్రెయిన్ చేస్తున్న ప్రతిపాదనలు అర్థం లేనివని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ వ్యాఖ్యలు చేశారు. ‘ఒప్పందానికి రిఫరెండంలో ఉక్రెయిన్ ప్రజలు ఆమోదం తెలపకపోతే ఏం చేస్తారు? ఈ పిల్లీ ఎలుకా ఆటలు మాకిష్టం లేదు’ అంటూ కుండబద్దలు కొట్టారు. 2015లో తూర్పు ఉక్రెయిన్ విషయమై ఫ్రాన్స్, జర్మనీ మధ్యవర్తిత్వంలో కుదిరిన మిన్స్క్ ఒప్పందం అమలుకే నోచుకోలేదని గుర్తు చేశారు. కాగా, ఉక్రెయిన్‌కు సంఘీభావ సూచకంగా ఆ దేశ జాతీయ పతాకాన్ని పోప్ ఫ్రాన్సిస్ ముద్దాడారు. తీవ్ర దాడులు ఉక్రెయిన్ నగరాలపై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. టెర్నోపిల్ ప్రాంతంలో రష్యా క్షిపణులు రసాయనాలతో నిండిన ఆరు రిజర్వాయన్లను ధ్వంసం చేయడంతో అక్కడ భూగర్భ, నదీ జలాలు కలుషితమైనట్టు ఉక్రెయిన్ చెప్పింది. యుద్ధం వల్ల కనీసం 74 దేశాల్లో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయని, 120 కోట్ల మంది ఆహార, ఇంధన, ఎరువుల ధరల పెరుగుదలతో అల్లాడుతున్నారని ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెరస్ ఆవేదన వెలిబుచ్చారు. పుతిన్ కూతుళ్లపై ఆంక్షలు రష్యా అధ్యక్షుడు పుతిన్ కూతుళ్లు మరియా పుతినా, క్యాథరినా తికొనోవాపై కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. త్వరలో మరిన్ని ఆంక్షలుంటాయంటూ అధ్యక్షుడు బైడెన్ ట్వీట్ చేశారు. పుతిన్ కూతుళ్ల వివరాలను రష్యా అత్యంత గోప్యంగా ఉంచుతూ వస్తోంది. వారు రష్యా వర్సిటీలోనే చదువులు పూర్తి చేశారని గతంలో పుతిన్ వెల్లడించారు. మరియా ఓ ప్రైవేట్ కంపెనీలో, క్యాథెరినా మాస్కో స్టేట్ వర్సిటీలో పని చేస్తున్నట్టు సమాచారం. ఉక్రెయిన్‌కు ‘చెక్’ యుద్ధ ట్యాంకులు ఉక్రెయిన్‌కు టీ–72 యుద్ధ ట్యాంకులు, బీవీపీ–1 సాయుధ వాహనాలు పంపుతూ చెక్ రిపబ్లిక్ నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌కు యుద్ధ ట్యాంకులు అందించిన తొలి నాటో దేశంగా నిలిచింది. మిగతా దేశాలన్నీ ఇప్పటిదాకా యాంటీ ట్యాంక్ మిసైళ్లు, చిన్న ఆయుధాలు, పరికరాలు ఇస్తూ వచ్చాయి. -
యుద్ధాన్ని మేం ఆరంభించం! అలాగని.. చూస్తూ ఊరుకోం: రష్యా ప్రకటన
మాస్కో: ఉక్రెయిన్‌లో తొలుత తాము యుద్ధాన్ని ఆరంభించమని రష్యా విదేశాంగమంత్రి సెర్గేవ్ లావ్రోవ్ శుక్రవారం ప్రకటించారు. అలాగని పాశ్చాత్య దేశాలు రష్యా రక్షణ ప్రయోజనాలను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. ఫిబ్రవరిలో ఉక్రెయిన్ను రష్యా ఆక్రమించవచ్చని అమెరికా, మిత్రపక్షాలు అనుమానపడుతున్నాయి. ఈ నేపథ్యంలో లావ్రోవ్ స్పందించారు. రష్యా యుద్ధాన్ని కోరుకోదన్నారు. ఇటీవల కాలంలో ఉక్రెయిన్ సరిహద్దులకు లక్ష మంది సైనికులను రష్యా తరలించడం, నాటో పక్షాలు యుద్ధ నౌకలు మొహరించడంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఉక్రెయిన్ను ఆక్రమించే ఉద్దేశం తమకు లేదని రష్యా పలుమార్లు ప్రకటించినా యూఎస్ నమ్మడం లేదు. నాటోలో ఉక్రెయిన్‌కు సభ్యత్వం ఇవ్వకూడాని రష్యా డిమాండ్ చేస్తోంది. కానీ నాటో, యూఎస్ ఈ డిమాండ్‌ను తిరస్కరించాయి. యూఎస్, మిత్రదేశాలు తమ విధానాన్ని మార్చుకోనప్పుడు తాము కూడా తమ విధానాన్ని మార్చుకోమని లావ్రోవ్ తెలిపారు. ప్రస్తుతం రాజీకి ఆస్కారం ఉన్నట్లు కనిపించడం లేదని హెచ్చరించారు. తాము సంవత్సరాల క్రితం ప్రతిపాదించిన అంశాలపై చర్చలకు అమెరికా ఇప్పుడు అంగీకారం చెబుతోందని ఆయన విమర్శించారు. నాటో విస్తరణను ఆపాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని, దీనిపై మరోమారు ఆయా దేశాలకు లేఖ రాస్తామని చెప్పారు. కొనసాగిన హెచ్చరికలు రష్యా దురాకమ్రణకు పాల్పడితే తీవ్ర చర్యలు తప్పవని అమెరికా, మిత్రపక్షాలు చేస్తున్న హెచ్చరికలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉక్రెయన్ను ఆక్రమిస్తే రష్యా నుంచి నిర్మించిన పైప్‌లైన్ నుంచి సహజవాయువు సరఫరాను జర్మనీ అడ్డుకుంటుందని యూఎస్ అధికారులు గురువారం ప్రకటించారు. ఆంక్షల బెదిరింపులపై లావ్రోవ్ స్పందిస్తూ అమెరికా జోక్యంతో అన్ని రకాల బంధాలకు ఆటంకం కలుగుతుందని విమర్శించారు. ప్రస్తుతం బాల్టిక్ సముద్ర చుట్టుపక్కల ప్రాంతాల్లో అటు రష్యా, ఇటు నాటో బలగాల సంరంభం పెరిగింది. సైనికుల, యుద్ధవిమానాల విన్యాసాలు ఎక్కువయ్యాయి. సంక్షోభ నేపథ్యంలో అంతా శాంతి వహించాలని ఉక్రెయిన్ నేతలు అభ్యర్ధిస్తున్నారు. రష్యా ఆక్రమణకు దిగుతుందని భావించడంలేదన్నారు. అయితే యూఎస్ అధ్యక్షుడు బైడెన్ మాత్రం రష్యాపై అనుమానాలనే వ్యక్తం చేస్తున్నారు. -
'ఉత్తర కొరియా రెడీ అయింది.. మరి మీరు'
ప్యాంగ్యాంగ్ : తమ అణు విధానంపై అమెరికాతో ప్రత్యక్షంగా బహిరంగంగా చర్చలు జరిపేందుకు ఉత్తర కొరియా సిద్ధంగా ఉందని రష్యా విదేశాంగ మంత్రి సెర్జెయ్ లారోవ్ తెలిపారు. ఈ విషయాన్ని తాను అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్కు కూడా తెలియజేసినట్లు చెప్పారు. గురువారం వియన్నాలో జరిగిన దౌత్య వేత్తల సమావేశంలో తాను ఈ సందేశాన్ని చెప్పినట్లు వివరించారు. అయితే, టిల్లర్ సన్ నుంచి వెంటనే ఎలాంటి స్పందన రాలేదని, ముందు ఉత్తర కొరియా తన అణు కార్యక్రమాలను వదిలేసుకుంటేనే ముందుకు వెళతామనే ఆలోచనలో ఉన్నట్లు అర్థమైందని అన్నారు. ఐక్యరాజ్యసమితి ఉన్నత శ్రేణి అధికారి జెఫ్రీ ఫెల్ట్మేన్ ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి రియాంగ్ హోను ప్యాంగ్యాంగ్లో కలిసిన సందర్భంగా చర్చల అంశాన్ని ముందుకు తీసుకొచ్చారని, అందుకు ఉత్తర కొరియా సానుకూలంగా స్పందించిందని తెలిపారు. -
కిమ్, ట్రంప్‌లు మరీ చిన్న పిల్లలా...
మాస్కో : అమెరికా, ఉత్తరకొరియా అద్యక్షులు డొనాల్డ్ ట్రంప్, కిమ్ జాంగ్ ఉన్‌ల మధ్య మాటల తుటాలు పేలుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో బిగ్ కంట్రీ రష్యా స్పందించింది. వారిద్దరూ మరీ చిన్నపిల్లలా ప్రవర్తిస్తున్నారని రష్యా విదేశాంగ మంత్రి సర్గెయ్ లవరొవ్ తెలిపారు. శుక్రవారం బీబీసీ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్, కిమ్‌లు స్కూల్ పిల్లలా కొట్టేసుకుంటున్నారు. ఈ వ్యవహారంలో ఐరాస భద్రతా మండలిలో రాజకీయ దౌత్యం అవసరమన్న ఆయన.. ఇరు దేశాలను శాంతిపజేసేందుకు తాము చైనాతో కలిసి ముందుకు సాగేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ‘కొరియా అణు పరీక్షలను మౌనంగా చూస్తు ఉండాల్సిన పని లేదు. అలాగని వారిపై మాటికి మాటికి యుద్ధం చేస్తామని ప్రకటించం సరికాదు అని అమెరికాను ఉద్దేశించి’ సర్గెయ్ తెలిపారు. మరోవైపు ప్రపంచ దేశాలు కూడా వీరిద్దరి మధ్య వాదనలు ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయోనని భయపడుతున్నాయి. ఇంతకు ముందు ఐక్యరాజ్య సమితిలో తొలిసారి మాట్లాడిన ట్రంప్.. ఉత్తరకొరియాకు హెచ్చరిక ఇచ్చాడు. కిమ్ అణుబాంబులు చేతపట్టుకొన్న పిచ్చోడు అని.. తాను తల్చుకుంటే ఉత్తరకొరియాను నాశనం చేస్తానని ట్రంప్ పేర్కొన్నాడు. తాజాగా ఆ వ్యాఖ్యలకు కౌంటర్‌గా ట్రంప్ కుక్కలా మొరుగుతున్నాడంటూ కిమ్ తీవ్ర పదజాలంతో విమర్శించాడు. ట్రంప్ ఒక పిచ్చోడు.. మతిపోయి మాట్లాడుతున్నాడు అంటూ కిమ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆంక్షలు ఎన్ని విధించినా.. అణ్వాయుధాల విషయంలో వెనకకు తగ్గేది లేదని అతను తెగేసి చెప్పాడు. తమ దేశం జోలికి వస్తే అమెరికా తగిన మూల్యం చెల్లించుకుంటోంది అని కిమ్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. మళ్లీ ఇప్పుడు ‘కిమ్ భరతం ఎప్పుడో పట్టి ఉండాల్సిందన్న’ అభిప్రాయం ట్రంప్ వ్యక్తం చేశాడు కూడా. -
మా రసాయన ఆయుధాలను అప్పగిస్తాం: సిరియా
మాస్కో/వాషింగ్టన్: సిరియా సంక్షోభానికి పరిష్కారం దిశగా కీలక పరిణామం చోటు చేసుకుంది. మిత్రదేశమైన రష్యా ప్రతిపాదన ప్రకారం, తమ రసాయనిక ఆయుధాలను అంతర్జాతీయ సమాజ నియంత్రణలోకి తెచ్చేందుకు సిరియా అంగీకరించింది. తమపై అమెరికా దూకుడును తిప్పికొట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంగళవారం ప్రకటించింది. రసాయనిక ఆయుధాలను అప్పగిస్తే సిరియాపై దాడిని నిలిపివేస్తామని అమెరికా అధ్యక్షుడు ఒబామా చెప్పిన కొన్ని గంటల్లోనే సిరియా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఆయుధాల అంశంపై మంగళవారం రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయని సిరియా విదేశాంగ మంత్రి వాలిద్ అల్ మోలెమ్ మాస్కోలో చెప్పారు.