మాస్కో: అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచ దేశాల ఫోకస్ ఉంది. ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనే చర్చ కూడా నడుస్తోంది. ఎన్నికల్లో పలు దేశాలు నేతలు ఎవరికి మద్దతు ఇస్తున్నారనే అంశం కూడా ఎన్నికల్లో కీలక కానుంది. ఇక, కమలా హారీస్‌కే తమ మద్దతు అంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలో పుతిన్ వ్యాఖ్యలపై రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ క్లారిటీ ఇచ్చారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలపై లావ్రోవ్ తాజాగా స్పందిస్తూ.. ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారీస్‌కు మద్దతు ఉంటుందని పుతిన్ సరదాగా మాత్రమే అన్నారు. పుతిన్ అప్పుడప్పుడు జోక్స్ వేస్తుంటారు. అందులో భాగంగానే ఇలా మాట్లాడారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మా జోక్యం ఏమీ ఉండదు. ఇంతకుముందు, ఇప్పుడు.. ఎన్నికల్లో జోక్యం చేసుకోము. మా వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదు అంటూ కామెంట్స్ చేశారు.
BREAKING: Russian Foreign Minister Sergei Lavrov said in an interview with Sky News Arabia that Putin was JOKING when he said he wanted Kamala Harris to win the election in November.
— Amanda Liyang (@esraa28305334) September 22, 2024
ఇదిలా ఉండగా.. కొద్దిరోజులు క్రితం రష్యా అధ్యక్షుడు పుతిన్.. అమెరికా ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కమలాతో పనిచేయడం సులువని తనదైన శైలిలో మాట్లాడారు. అయితే, హారీస్ ఎంపికలో జో బైడెన్ నిర్ణయాన్ని తాను గౌరవిస్తానన్నారు. ఏదేమైనా.. ఆ దేశ అధ్యక్షుడు ఎవరనే విషయాన్ని అక్కడివారే నిర్ణయిస్తారని ముగించారు.
అనంతరం, పుతిన్ వ్యాఖ్యలపై వైట్‌హౌస్ వర్గాలు స్పందించాయి. పుతిన్ కామెంట్స్‌కు అమెరికా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ కౌంటరిచ్చారు. అమెరికా తదుపరి అధ్యక్షుడు ఎవరనే విషయాన్ని నిర్ణయించేది కేవలం స్థానికులే. మా అధ్యక్ష ఎన్నికలపై పుతిన్ మాట్లాడటం ఆపేస్తే మంచింది. ఈ ఎన్నికల్లో మీ జోక్యాన్ని ఎవరూ కోరుకోవడం లేదు. భవిష్యత్‌లో కూడా ఎన్నికల గురించి మాట్లాడకండి అంటూ వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: బైడెన్‌తో చర్చలు ఫలించాయి: ప్రధాని మోదీ
Comments
Please login to add a commentAdd a comment