వాషింగ్టన్: అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు హోరాహోరీగా ఉన్నాయి. ఇద్దరు అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారీస్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. ఇక, ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్‌పోల్స్ ఇంకా ఆసక్తికరంగా మారాయి.
👉కాగా, అమెరికా దేశ పరిస్థితులపై 70 శాతం మంది ఓటర్లు తాము నిరాశాజనకంగా ఉన్నామని చెప్పడం గమనార్హం. ఇదే సమయంలో ఇద్దరు అభ్యర్థులకు స్పష్టమైన మెజార్టీ ఇవ్వకపోవడం విశేషం. దీంతో, గెలుపు ఎవరిది అనే అంశంపై ఎగ్జిట్ పోల్స్ స్పష్టమైన వివరాలను వెల్లడించలేదు.
👉ఇక, ఎన్నికలపై ఫస్ట్ వేవ్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. అమెరికన్ ప్రజలు దేశంలో ప్రజాస్వామ్య పరిస్థితి, ఆర్థిక వ్యవస్థ, అబార్షన్ వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు సర్వే సంస్థలు వెల్లడించాయి.
👉ఎన్నికలపై సీబీఎస్ న్యూస్ విడుదల చేసిన పోల్స్ ప్రకారం అమెరికాలో 10 మందిలో దాదాపు ఆరుగురు ప్రజాస్వామ్య స్థితిని తమ మొదటి సమస్యగా పేర్కొన్నారు. అలాగే, ఐదు శాతం మంది ఓటర్లు అబార్షన్ చట్టంపై ఫోకస్ ఉన్నట్టు చెప్పుకొచ్చారు. 10 మందిలో ఒకరు ఆర్థిక వ్యవస్థను ప్రాధాన్యతా అంశంగా ఎంచుకున్నారు.
👉అలాగే, సీఎన్‌ఎన్ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. దాదాపు మూడు వంతుల ఓటర్లు ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థకు కట్టుబడి ఓటు వేసినట్టు చెప్పారు. ఇద్దరు అభ్యర్థులపై ప్రతికూల అభిప్రాయాన్ని చూపించారు. ఇదిలా ఉండగా..ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పనితీరుపై పది మందిలో నలుగురు ఓటర్లు మెచ్చుకున్నారు. మిగిలిన ఆరుగురు అసంతృప్తిని వ్యక్తం చేశారు.
👉ఇక, ఇప్పటి వరకు వెలువడిన ఎన్నికల ఫలితాల్లో డొనాల్డ్ ట్రంప్ ఆరు రాష్ట్రాల్లో విజయం సాధించారు. మరో తొమ్మిదో రాష్ట్రాల్లో ముందంజలో ఉన్నారు. మరోవైపు.. కమలా హారీస్ ఒక్క చోట విజయం సాధించగా, మరో ఐదు రాష్ట్రాల్లో ముందంజలో కొనసాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment