
చైనాలోని లియావోయాంగ్ నగరంలోని ఓ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 22 మంది మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. అగ్నిప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. రెండు, మూడు అంతస్తుల భవనాల నుంచి భారీగా మంటలు చెలరేగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మంటలను అర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ నెలలో చైనాలో జరిగిన రెండో అతిపెద్ద అగ్ని ప్రమాదం ఇది.
ఏప్రిల్ 9న ఓ నర్సింగ్ హోమ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 20 మంది మృతి చెందారు. చెంగ్డే నగరంలోని లాంగ్‌హువా కౌంటీలో రాత్రి 9 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మొత్తం 20 మంది వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు. మంటలు చెలరేగిన సమయంలో ఈ హోమ్‌లో మొత్తం 260 మంది వృద్ధులు ఉన్నారు.
#BREAKING 🚨
First images from the restaurant fire 🔥
22 people dead and 3 injured after a #fire broke out at a restaurant near a resettlement housing complex in Liaoyang, #Liaoning Province. The investigation is ongoing. #China #fire pic.twitter.com/WRelu9T8ov— Nazlı Özdemir (@nazliiozdemr) April 29, 2025