బీజింగ్: చైనాలోని హెనన్ ప్రావిన్సులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి యశన్‌పూ గ్రామంలోని ఓ ఎలిమెంటరీ బోర్డింగ్ స్కూల్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మొత్తం 13 మంది చనిపోయారు. ఒకరు గాయపడ్డారు.
ఈ విషయాన్ని చైనా అధికారిక మీడియా జినుహా న్యూస్ రిపోర్ట్ చేసింది. అయితే మృతి చెందిన వారిలో ఎంత మంది విద్యార్థులున్నారన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పివేశారు.
మంటలకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై సోషల్ మీడియాలో ప్రజలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. 13 కుటుంబాలకు చెందిన 13 మంది చిన్న పిల్లలు ఒక్కసారిగా లేకుండా పోయారు. ఘటనకు కారణమైన వారికి కఠిన శిక్ష విధించకపోతే చనిపోయిన వారి ఆత్మలు శాంతించవని నెటిజన్లు మండిపడుతున్నారు.
ఇదీచదవండి.. పన్నూ హత్యకు కుట్ర.. నిఖిల్ గుప్తా అప్పగింతకు కోర్టు ఓకే
Comments
Please login to add a commentAdd a comment