Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Hundreds Of Flights And Trains Cancelled Sandstorms Hit China1
చైనాలో ఇసుక తుపాను బీభత్సం.. వందలాది విమాన, రైళ్ల సర్వీసులు రద్దు

బీజింగ్‌: చైనాను భీకర గాలులు అతలాకుతలం చేస్తున్నాయి. ఇసుక తుపాను, భారీ గాలులతో రాజధాని బీజింగ్‌లో చెట్లు నేలకొరిగాయి. ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. వందలాది విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. బీజింగ్‌, డాక్సింగ్‌లో 693 విమాన సర్వీసులు రద్దు చేయడంతో పాటు, రైళ్లను కూడా నిలిపివేశారు. దుమ్ము తుపానులు చెలరేగడంతో.. అధికారులు పర్యాటక ప్రదేశాలను మూసేశారు.చైనాకు తీవ్ర తుఫాన్ హెచ్చరికలు జారీ అయ్యాయి. వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. గంటకు 150 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని.. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని అలర్ట్‌ చేసింది. దేశంలోని ఉత్తర, తీర ప్రాంతాలలో తీవ్రమైన ప్రభావం ఉంటుందని అధికారులు హెచ్చరించారు.విమానాశ్రయ ఎక్స్‌ప్రెస్ సబ్‌వే, హై-స్పీడ్‌ రైలు మార్గాలతో సహా కొన్ని రైలు సేవలను కూడా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. బీజింగ్, డాక్సింగ్‌లో విమానాశ్రయాల్లో వందలాది మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే నిద్రిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.గత ఏడాది చైనాలోని వివిధ ప్రాంతాల్లో సంభవించిన తుపానులు, వరదల్లో అనేక మంది మరణించారు. వేలాది మంది తమ ఇళ్లను వదిలి వెళ్ళవలసి వచ్చింది. మే నెలలో దక్షిణ చైనాలో కురిసిన వర్షాలతో ఒక రహదారి కూలిపోయి 48 మంది మరణించిన సంగతి తెలిసిందే.April 12, China was hit by a nationwide gale and dust storm that was rare in history, with the maximum gust reaching 46.8m/s! The sandstorm blew from Mongolia all the way to the Yangtze River and may even affect Hong Kong! pic.twitter.com/8mO795JEep— Jim (@yangyubin1998) April 12, 2025

CM Mamata says Waqf Act won't be implemented in West Bengal2
Waqf act:. పశ్చిమబెంగాల్‌లో నిరసన సెగ.. సీఎం మమతా విన్నపం ఇదే!

కోల్ కతా: వక్ఫ్ సవరణ చట్టం ఇప్పటికే అమల్లోకి వచ్చిన తరుణంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నిరసన జ్వాలలు రాజుకున్నాయి. వక్ఫ్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలంటూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసన ‍కార్యక్రమం చేపట్టారు. ప్రధానంగా రాష్ట్రంలో ముర్షీబాద్ తో పాటు పల్ల జిల్లాల్లో వరుసగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో శనివారం అది ఇంకా తీవ్ర రూపం దాల్చింది. ఈ నేపథ్యంలో వంద మందిని అరెస్టు చేశారు. దీనిపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ‘ ప్రజలకు ఇదే నా విజ్ఞప్తి. రాష్ట్రంలోని అన్ని మతాలకు ప్రజలకు నేను ఒకటే విన్నపం చేస్తున్నా. ఎవరూ కూడా రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులకు చోటివ్వకండి. ఇక్కడ ఏమైనా జరిగితే ఓవరాల్ గా నష్టపోయేది ప్రజలే. అది ఏ వర్గమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా ప్రజలే ఇబ్బంది పడతారు. మీ నిరసనను హింసాత్మకంగా మారనివ్వకండి. ఎవరి జీవితమైనా ఒక్కటే. ప్రతీ మనిషి జీవితం చాలా ముఖ్యమైనదే విషయం మీరు గ్రహించండి.వక్ఫ్ సవరణ చట్టం అనేది రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదు. వక్ఫ్ సవరణ చట్టాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్న క్రమంలో దాన్ని మేము చట్టంగా గుర్తించడం లేదు. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన చట్టం మాత్రమే. మనం దీనికి కేంద్రాన్నే అడుగుదాం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్ గా ఉంది. మనకు సమాధానం చెప్పాల్సింది కేంద్ర ప్రభుత్వమే. ఈ చట్టానికి మేము మద్దతు ఇవ్వడం లేదు. అదే సమయంలో ఇక్కడ అమలుకు కూడా నోచుకోదు. ఇది గుర్తుపెట్టుకుంది. అంతా నిరసనలు విరమించి శాంతించండి’ అంటూ మమతా బెనర్జీ ‘ఎక్స్( వేదికగా ఒక పోస్ట్ పెట్టారు.সবার কাছে আবেদনসব ধর্মের সকল মানুষের কাছে আমার একান্ত আবেদন, আপনারা দয়া করে শান্ত থাকুন, সংযত থাকুন। ধর্মের নামে কোনো অ-ধার্মিক আচরণ করবেন না। প্রত্যেক মানুষের প্রাণই মূল্যবান, রাজনীতির স্বার্থে দাঙ্গা লাগাবেন না। দাঙ্গা যারা করছেন তারা সমাজের ক্ষতি করছেন।মনে রাখবেন, যে…— Mamata Banerjee (@MamataOfficial) April 12, 2025 కాగా, పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ బిల్లు.. చట్ట రూపం దాల్చింది.ఏప్రిల్‌ 8వ తేదీ నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. దీనికి కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గత శనివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. మరోవైపు..సుప్రీంకోర్టులో వక్ఫ్‌ బిల్లును సవాల్‌ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి., ఈ క్రమంలో.. తమ వాదనలు వినాలంటూ కేంద్రం కేవియట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ క్రమంలో 15, 16వ తేదీల్లో దేశ సర్వోన్నత న్యాయస్థానంలో జరగబోయే విచారణపై ఉత్కంఠ నెలకొంది. వక్ఫ్‌ సవరణ చట్టాన్ని సవాల్‌ చేస్తూ సుమారు 16 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటితో పాటు కేంద్రం వేసిన కేవియట్‌ను కలిపి విచారించాలని చీఫ్‌ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం నిర్ణయించింది.

Indian Home Ministry Alerted All States Check Details Here3
Intelligence alert: అన్ని రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్‌

న్యూఢిల్లీ, సాక్షి:​ దేశవ్యాప్తంగా ఉగ్రదాడులు జరగవచ్చనే నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంతో కేంద్ర హోం శాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. మరీ ముఖ్యంగా సముద్ర తీర ప్రాంత పట్టణాలు అప్రమత్తంగా ఉండాలని, గస్తీ పెంచుకోవాలని సూచించింది. సముద్ర మార్గం గుండా వచ్చిన ఉగ్రవాదులు 2008 ముంబై 26/11 మారహోమానికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ కేసులో కీలక సూత్రధారి, లష్కరే ఉగ్రవాది తహవూర్‌ రాణా విచారణ ప్రస్తుతం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు దిగవచ్చని నిఘా సంస్థలు కేంద్ర హోం శాఖకు నివేదిక సమర్పించాయి. దీంతో హోం శాఖ అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు పంపింది. ఉగ్రవాదులు డ్రోన్లు, ఐఈడీలతో దాడులు చేసే అవకాశం ఉందని, ప్రత్యేకించి సముద్ర తీర ప్రాంతాలపై ఎక్కువ నిఘా ఉంచాలని సూచించింది. మరోవైపు.. నిఘా సంస్థలు రైల్వే శాఖను ప్రత్యేకంగా అప్రమత్తం చేయడం గమనార్హం.

Kommineni Srinivasa Rao Reaction On Ys Jagan Raptadu Tour4
‘కూటమి’ డైవర్ట్‌ పాలిటిక్స్‌.. వైఎస్‌ జగన్‌పై పెద్ద కుట్రే జరుగుతుందా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా ఏదైనా పెద్ద కుట్ర జరుగుతోందా? లేక ఏపీ ప్రజల అసంతృప్తిని కప్పిపుచ్చి డైవర్ట్ చేయడానికి కూటమి ప్రభుత్వం చూస్తోందా? వైఎస్‌ జగన్‌ రాప్తాడు పర్యటనను తెలుగుదేశం మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతులు కవర్‌ చేసిన తీరు చూస్తే ఎవరికైనా ఈ అనుమానాలు రాకమానవు. హోంశాఖ మంత్రి అనిత, టీడీపీ లోక్‌సభ సభ్యుడు లావు కృష్ణదేవరాయళ్ల వ్యాఖ్యలు అనుమానాలను మరింత బలపరిచేవిగా ఉంటున్నాయి. రాప్తాడు నియోజకవర్గంలోని పాపిరెడ్డిపల్లిలో హత్యకు గురైన వైసీపీ నేత కురుబ లింగమయ్య బీసీ వర్గపు నేత. ఆ ప్రాంతంలో ఈ వర్గానికి మంచి పట్టే ఉంది. హత్య వెనుక రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత వర్గానికి చెందిన కొందరు ఉన్నారన్నది అభియోగం. మొత్తం ఇరవై మందిపై ఫిర్యాదు చేస్తే ఇద్దరిపైనే కేసు పెట్టారట. లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ వెళ్లడానికి సిద్దమైన రోజు నుంచి పరిటాల సునీత ఆయనపై పలు విమర్శలు చేశారు. కొన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలూ చేశారు.దానికి అక్కడి వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇది ఒక నియోజకవర్గానికి పరిమితం అనుకుంటే, దానిని హోం మంత్రి రాష్ట్రస్థాయి వివాదంగా మార్చితే, టీడీపీ ఎంపీ జాతీయ స్థాయికి తీసుకువెళ్లే యత్నం చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు ఆయన లేఖ రాసిన తీరు, అందులో ప్రస్తావించిన అంశాలు అన్ని కూడా జగన్ కు వ్యతిరేకంగా పెద్ద కుట్రకు ఏమైనా ప్లాన్ చేశారా అన్న సందేహం వస్తుంది. విశేషం ఏమిటంటే గతంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వంటి వారు పల్నాడు ప్రాంతంలో కక్షల రాజకీయాలను ఎగదోసేలా వ్యాఖ్యలు చేసినప్పుడు , ఆయా చోట్ల పోలీసులపై దూషణలకు దిగినప్పుడు ఇదే లావు శ్రీకృష్ణదేవ రాయలు వైసీపీ ఎంపి. టీడీపీ నేతలపై ఆయన కూడా విమర్శలు చేసే ఉంటారు కదా! అదే రాయలును ప్రయోగించి టీడీపీ నాయకత్వం కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేయించింది. నిజానికి జగన్ టూర్ సందర్భంగా జరిగిన ఘటనలపై కేంద్రానికి ఫిర్యాదు చేయవలసినంత పరిస్థితి ఏమిటో అర్థం కాదు. పైగా అందులో కేవలం రాప్తాడు అంశంతో ఆపకుండా, గత ఐదేళ్లుగా తెలుగుదేశం పార్టీ చేసే పిచ్చి ఆరోపణలన్నిటిని కలగలిపి అమిత్ షా కు ఫిర్యాదు చేశారు. ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. అవసరం రీత్యా టీడీపీ అధినేత చంద్రబాబుతో బీజేపీ అధిష్టానం పొత్తుకు సిద్దమైంది తప్ప, ఆయనపై నమ్మకం, విశ్వాసంతో కాదన్న సంగతి అందరికి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీని, అమిత్ షా ను చంద్రబాబు ఎంతగా దూషించింది వారికి తెలియదా? జగన్ బీజేపీతో పొత్తు పెట్టుకోకపోయినా, ఎన్నడూ అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. బీజేపీ పెద్దలు కూడా జగన్ పై ఆ గౌరవం చూపుతూ వచ్చారు.ఇప్పుడు తెలుగుదేశం వ్యూహాత్మకంగా జగన్ పై వారికి ఉన్న సదభిప్రాయాన్ని చెడగొట్టి, ఏదో రకంగా కేసులు పెట్టించి రాజకీయంగా దెబ్బ కొట్టాలన్న దురుద్దేశంతో ఇలా లేఖలు రాయిస్తున్నట్లు కనబడుతుంది. జగన్‌ ప్రజలలో తిరుగుతుంటే వస్తున్న ఆదరణ చూసి కూటమి నేతలు ఖంగు తింటున్నారు. జగన్‌ది నిజంగానే కుట్ర స్వభావమై ఉంటే, అసలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు బీజేపీ పంచన చేరే అవకాశం ఎందుకు రానిస్తారు? ఆయనే ఎన్డీయే కూటమిలో చేరి ఉండేవారు కదా! కాని ఒక సిద్దాంతానికి కట్టుబడి ఆయన అందులో చేరలేదు. అంశాల వారిగా మద్దతు ఇవ్వడం లేదా, వ్యతిరేకించడం చేస్తూ వచ్చారు. ఉదాహరణకు వక్ఫ్ బిల్లుపై వైసీపీ స్పష్టంగా వ్యతిరేకిస్తే, దానిని కూడా వక్రీకరించడానికి టీడీపీ మీడియా ఎన్ని పాట్లు పడింది చూశాం. అదే చంద్రబాబు గతంలో ఎన్డీయే నుంచి బయటకు వచ్చాక ట్రిపుల్‌ తలాఖ్, ముస్లింలకు సంబంధించిన ఇతర అంశాల్లోనూ బీజేపీని, మోడీని ఎంతో ఘాటుగా విమర్శించారు. కాని ఇప్పుడు ఎన్డీయేతో కలిసి, కిక్కురుమనకుండా కేంద్రానికి మద్దతు ఇచ్చారు. దీనిపై రాష్ట్రంలో ముస్లిం వర్గాలలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది.జగన్ పై 11 సీబీఐ కేసులు, 9 ఈడి కేసులు ఉన్నాయని రాయలు ఇప్పుడు ఆ లేఖలో పేర్కొనడమే కుట్ర. అన్ని కేసులు ఉన్నప్పుడే వైసీపీలో చేరి ఈయన ఎంపీ అయ్యారు కదా! అసలు ఆ కేసులన్నీ కక్ష పూరితమని బీజేపీ నేత, దివంగత సుష్మా స్వరాజ్ పార్లమెంటులోనే చెప్పిన విషయం ఈయనకు తెలియదా? జగన్‌ను ప్రొఫెషనల్ పొలిటికల్ క్రిమినల్ అంటూ రాసిన లేఖపై కృష్ణదేవరాయలు సంతకం చేశారంటే ఆయనకు ఆత్మ అనేది ఉందా అన్న సందేహం వస్తుంది. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఎన్ని కుట్రలు చేసిందీ... ఎన్ని అక్రమాలకు పాల్పడిందీ ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన పుస్తకంలోనే ఉన్నాయి కదా? సొంత మామను పదవి నుంచి తోసేసి ఎలాంటి కుట్రలేదని తన తండ్రి రత్తయ్యతో చెప్పించి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆయన 1996లో లక్ష్మీపార్వతి ఆధ్వర్వంలోని ఎన్టీఆర్‌ టీడీపీ తరపున పోటీ చేశారు. లావుకు మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇస్తూ చంద్రబాబుపై పలు కేసులు ఉన్నాయని, ఆయన కూడా బెయిల్ పై ఉన్నారని, కనుక ప్రొఫెషనల్ పొలిటికల్ క్రిమినల్ అని ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు. జగన్ ప్రజలలో విద్వేషాలు రెచ్చగొడుతున్నారట. ఎంత దుర్మార్గపు ఆరోపణ. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మతం పేరుతో, కులం పేరుతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎంత దారుణమైన రాజకీయం చేసింది లావుకు తెలియదా? వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబందించి కూడా జగన్‌పై నీచంగా లేఖలో ప్రస్తావించడం ద్వారా టీడీపీ ఏదో కుట్ర చేస్తోందన్న అనుమానం కలగదా? విపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేశ్‌లు ఏ మాదిరిగా పోలీసులను తిట్టింది ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయే. పోలీసులను జగన్ కక్ష సాధింపులకు వాడుకున్నారట. ఆ పని నిజంగా చేసిఉంటే చంద్రబాబు, లోకేశ్‌ పవన్ కళ్యాణ్‌లపై అప్పట్లో ఎన్ని కేసులు వచ్చి ఉండాలి? ఇప్పుడు రెడ్ బుక్ పేరుతో జరుగుతున్న అరాచకాలను గమనిస్తే జగన్ టైమ్‌లో ఎక్కడైనా ఒకటి, అరా జరిగాయేమో తప్ప, రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. అయినా కార్యకర్తలను రెచ్చగొట్టి కేసులు పెట్టించుకోవాలని సూచించింది చంద్రబాబు, లోకేశ్‌లు కాదా? ఎన్ని కేసులు ఉంటే అంత పెద్ద పదవి ఇస్తానని ఆఫర్ చేసింది వారు కాదా? ఐదేళ్ల క్రితం ఏదో అన్నారనో, లేక ఏదో జరిగిందని, ఇప్పుడు తమ మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ కేసులు పెట్టడాన్ని కక్ష రాజకీయాలు అంటారా? లేక అలాంటి కేసులే పెట్టని జగన్ పాలనను కక్ష పూరిత పాలన అంటారా? జగన్ భద్రతకు సంబంధించి లావుతో పాటు మంత్రి అనిత కూడా ఏదో వాదన చేశారు. ఈ ఒక్కదానికి సమాధానం చెప్పగలరా? 250 మంది పోలీసులు జగన్ హెలికాఫ్టర్ వద్ద నిజంగా ఉండి ఉంటే, అక్కడ చేరిన వంద మంది,లేదా రెండు వందల మందిని వెనక్కి పంపించలేకపోయారా? వారిని అక్కడకు రాకుండా ఆపలేకపోయారా? ఏపీ పోలీసులు అంత అసమర్థులని వీరు చెబుతున్నారా? హెలికాఫ్టర్ విండ్ షీల్డ్ దెబ్బతినడంతో వీఐపీలను తీసుకువెళ్లడం రిస్కు అని పైలట్ అన్నారే తప్ప, తాము వెళ్లలేమని ఎక్కడైనా చెప్పారా? ఇంతకు ముందు కూడా జగన్ ఆయా చోట్లకు హెలికాఫ్టర్ లో వెళ్లి వచ్చారు కదా? అక్కడ కూడా ఇలాగే జరిగిందా? లేదే! జగన్ పోలీసులందరిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు విపరీతమైన వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏదో భూకంపం వచ్చేసినట్లుగా దీనికి కవరేజీ ఇస్తోంది. చంద్రబాబుకు ఊడిగం చేస్తున్న పోలీసులను ఉద్దేశించి జగన్ అన్నారు. మరి చంద్రబాబు, లోకేశ్‌లు పోలీసు అధికారులను అంతకన్నా దారుణంగా దూషించిన వీడియోలు కనబడుతున్నాయి కదా?పోలీసు అధికారుల సంఘం కూడా వాటిని ఎందుకు ప్రస్తావించడం లేదు. బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా జగన్ నే విమర్శించారు తప్ప, అంతకు ముందు చంద్రబాబు దూషణల గురించి మాట్లాడడం లేదే! హోం మంత్రి అనిత అయితే ఏకంగా టీడీపీని భుజాన వేసుకుని మోస్తున్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్న ఎస్.ఐ.ని దమ్మున్నోడు అని ప్రశంసించారంటే ఇంతకన్నా సిగ్గు చేటైన విషయం ఏమి ఉంటుంది? అసలు హోం శాఖలో ఏమి జరుగుతోందో అమెకు తెలుసా అన్నది ఒక సందేహం. ఎందుకంటే రెడ్ బుక్ పేరుతో మొత్తం హోం శాఖను నడుపుతున్నది లోకేశే అని అంతా చెబుతున్నారు. మీడియాతో మాట్లాడేటప్పుడు వ్యవస్థను పాడుచేసేలా ఒక మంత్రే మాట్లాడిన తీరు చూస్తే తెలుగు దేశం ఆధ్వర్యంలో వ్యవస్థలు ఎంతగా దిగజారాయో అవగతం అవుతుంది. పనిలో పని లావు కృష్ణదేవ రాయలు, కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పేరుతో సరికొత్త రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నామని అమిత్ షా కు తెలియచేసి ఆయన మెప్పు పొందగలిగితే బాగుండేది కదా? ఒక వైపు చంద్రబాబు ఆయా స్కామ్ లలో నిందితుడుగా ఉన్నారు. ఆయన కూడా బెయిల్ పైనే ఉన్న విషయం జనం మర్చిపోయారన్నది వారి ఉద్దేశం కావచ్చు. ఆయా స్కాములను నీరుకార్చే పనిలో ఉండి ఉండవచ్చు. వాటన్నిని కప్పిపుచ్చి జగన్ పై తట్టెడు బురద వేయడం ద్వారా వైసీపీని దెబ్బ తీయాలని అనుకుంటే అది అంత తేలిక కాదు. సూపర్ సిక్స్ గురించి కాని, కక్ష రాజకీయాల గురించి కాని ప్రజలలో ఈ ప్రభుత్వం పట్ల ఏహ్యత పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి కొత్త కుట్రలకు ఎల్లో మీడియాతో కలిసి కూటమి ప్రభుత్వం తెరదీసింది. ఈ తరహా వ్యూహాలలో చంద్రబాబును మించిన నేత దేశంలోనే మరెవ్వరైనా ఉన్నారా? కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

IPL 2025 I Never Seen So Much Money: Aakash Chopra on Pant Failures5
అంత డబ్బు కళ్ల చూడలేదు!.. అతడు బ్యాటింగ్‌కు రాకపోవడమేంటి?

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL) చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు రిషభ్‌ పంత్‌ (Rishabh Pant). ఈ టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ను దక్కించుకునేందుకు లక్నో సూపర్‌ జెయింట్స్‌ (LSG) ఏకంగా రూ. 27 కోట్లు ఖర్చు చేసింది. మెగా వేలంలో ఇతర జట్లతో పోటీపడి మరీ లక్నో యాజమాన్యం పంత్‌ను భారీ ధరకు దక్కించుకుంది.ఐపీఎల్‌-2025లో కెప్టెన్‌గా పంత్‌కు పగ్గాలు అప్పగించింది. అయితే, సారథిగా ఫర్వాలేదనిపిస్తున్న ఈ టీమిండియా స్టార్‌.. బ్యాటర్‌గా మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. ఈ సీజన్‌లో అతడి కెప్టెన్సీలో లక్నో ఇప్పటికి ఐదు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని మూడు గెలిచింది.19 పరుగులుఇక బ్యాటర్‌గా రిషభ్‌ పంత్‌ చేసిన పరుగులు మొత్తం కలిపి కేవలం 19. ఈ నేపథ్యంలో అతడి బ్యాటింగ్‌ వైఫల్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా లక్నో జట్టు శనివారం సొంత మైదానం ఏకనా స్టేడియంలో గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడనుంది. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా పంత్‌ బ్యాట్‌ ఝులిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు.ఒకేసారి అంత డబ్బు నేను కళ్లజూడలేదుఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా రిషభ్‌ పంత్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ప్రైస్‌ ట్యాగ్‌’ పంత్‌పై ప్రతికూల ప్రభావం చూపిస్తోందా? అన్న నెటిజన్ల ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ఏమో నాకైతే తెలియదు. ఎందుకంటే.. నా జీవితంలో ఒకేసారి అంత డబ్బు నేను కళ్లజూడలేదు.కాబట్టి.. అతడిపై ఒత్తిడి ఉంటుందో లేదో నేను అంచనా వేయలేను. అయితే, ఓ ఆటగాడిపై ఇలాంటివి కచ్చితంగా ప్రభావం చూపుతాయా? అంటే అవుననీ చెప్పవచ్చు. డబ్బు (ప్రైస్‌ ట్యాగ్‌) లేదంటే కెప్టెన్సీ భారం అతడిపై ఒత్తిడి పెంచుతుండవచ్చు. కారణం ఏదైనా పంత్‌ దానిని అధిగమించాలి.. గానీ తప్పించుకోకూడదు. అతడు బ్యాటింగ్‌కు రాకపోవడమేంటి?గత మ్యాచ్‌లో పంత్‌ బ్యాటింగ్‌కు వెళ్లకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. క్రీజులోకి వెళ్తేనే కదా.. పరుగులు వస్తాయో.. రావో తెలిసేది. కనీస ప్రయత్నానికి కూడా వెనుకాడితే ఎలా?.. అతడు బ్యాటింగ్‌కు వెళ్లకుండా తప్పించుకోవడం ఎంతమాత్రం సరికాదు’’ అని ఆకాశ్‌ చోప్రా విమర్శించాడు.కాగా గత మ్యాచ్‌లో లక్నో జట్టు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో తలపడింది. ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన ఈ పోరులో టాస్‌ గెలిచిన ఆతిథ్య కేకేఆర్‌.. పంత్‌ సేనను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లు ఐడెన్‌ మార్క్రమ్‌ (28 బంతుల్లో 47), మిచెల్‌ మార్ష్ (48 బంతుల్లో 81) దంచికొట్టగా.. నికోలస్‌ పూరన్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌ (36 బంతుల్లో 87 నాటౌట్‌) ఆడాడు.అయితే, మిడిలార్డర్‌లో వచ్చే పంత్‌ ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు రాలేదు. నాలుగో స్థానంలో అబ్దుల్‌ సమద్‌ (6).. ఐదో స్థానంలో డేవిడ్‌ మిల్లర్‌ (4 నాటౌట్‌)ను ఆడించాడు. ఇక ఈ మ్యాచ్‌లో 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి లక్నో 238 పరుగులు సాధించింది. లక్ష్య ఛేదనలో కేకేఆర్‌ 234 రన్స్‌కే పరిమితం కావడంతో నాలుగు పరుగుల స్వల్ప తేడాతో పంత్‌ సేన జయభేరి మోగించింది. ‌చదవండి: IPL 2025: గుజరాత్‌ టైటాన్స్‌కు షాక్‌.. అతడు సీజన్‌ మొత్తానికి దూరం

Celebrity Master Chef Wins Gaurav Khanna check Cash Prize and all 6
సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ టైటిల్‌ ఎగరేసుకుపోయాడు : ప్రైజ్‌మనీ ఎంతో ?

రుచికరమైన వంటకాలు, కబుర్లు ,కాకర కాయలతో ఇంతకాలం అలరించిన ‘‘సెలబ్రిటీ మాస్టర్ చెఫ్’’కు శుభం కార్డు పడింది. తమ అభిమాన ఓటీటీ తారలు ఈ సిరీస్‌లో పాక నిపుణులుగా రూపాంతరం చెందడాన్ని చూసి అభిమానులు మురిసిపోయారు. ఫరా ఖాన్, వికాస్ ఖన్నా, రణవీర్ బ్రార్ న్యాయ నిర్ణేతలుగా ఉన్న సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ గ్రాండ్ ఫినాలే ఏప్రిల్ 11న గ్రాండ్‌గా జరిగింది. ఇంతకీ ఈ షో విజేత ఎవరు, ప్రైజ్‌మనీ ఎంత? ఇతర వివరాలను తెలుసుకుందాం పదండి!ప్రముఖ టెలివిజన్ నటుడు, అనుపమ పాత్రతో పాపులర్‌ గౌరవ్ ఖన్నా ఈ షో విజేతగా నిలిచాడు. సీజన్‌తో తనదైన శైలితో ఆకట్టుకున్న గౌరవ్‌ చివరి ధశలో కూడా న్యాయ నిర్ణేతలను ఆకట్టుకున్నాడు. సిగ్నేచర్ డిష్‌లు, రుచులు, స్టైల్‌తోమాత్రమే కాకుండా, కాన్పూర్ నుంచి ముంబై దాకా సాగిన భావోద్వేగ ప్రయాణం గురించి పంచుకున్న కథ కూడా అటు ప్రేక్షకులను, ఇటు న్యాయనిర్ణేతల హృదయాలనూ కదిలించింది. దీంతో ఫలితాలు ప్రకటిస్తూ గౌరవ్‌ను వారు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. నలుగురు హేమాహేమీలను ఓడించి ప్రతిష్టాత్మకమైన ట్రోఫీని దక్కించుకున్నాడు గౌరవ్‌. ఫలితంగా రూ. 20 లక్షల నగదు బహుమతి, ప్రీమియం కిచెన్ ఉపకరణాలను గెలుచుకున్నాడు.నెమ్మదిగా ప్రారంభించి, ఒకదాని తర్వాత ఒకటి అద్భుతమైన వంటకాలను నేర్చుకుని అందించి ఈ రోజు ఈ స్థానానికి చేరుకున్నాడు.ఇది నా మొదటి రియాలిటీ షో" నేను ఎప్పుడూ కెమెరా ముందు ఏడవలేదు, అంటూ కన్నీళ్లతో తన కథను చెప్పి అందరిచేత కన్నీళ్లు పెట్టించాడు. ఈ సందర్బంగా ఫినాలేలో అతిథిగా వచ్చిన చెఫ్ సంజీవ్ కపూర్, మాట్లాడుతూ ఇప్పటిదాకా ఎమోషన్స్‌కి దూరంగా పారిపోతూ ఇక్కడి దాకా వచ్చి వుంటావ్‌... ఇపుడిక భావోద్వాగాల్ని కూడా మిళితం చేస్తూ కొత్త జీవితాన్ని మొదలు పెట్టు ("అబ్ తక్ షాయద్ ఎమోషన్స్ సే భాగ్ కర్ యహాన్ తక్ పోహ్చే హో. ఆజ్ సే జిందగీ షురూ కరో, ఎమోషన్స్ సే జుడ్ కే") అని సలహా ఇచ్చారు.తీవ్రమైన పోటీ మధ్య గౌరవ్ తన ఆవిష్కరణ, సాంకేతికత , నైపుణ్యంతో ప్రత్యేకంగా నిలిచారు. సాంకేతిక సవాళ్లను నేర్చుకోవడం నుండి ప్రస్తుతం వైరల్‌గా మారిన హనీకాంబ్‌ పావ్లోవా వంటి క్లిష్టమైన డెజర్ట్‌లను తయారు చేయడం వరకు, గౌరవ్ అతని పాక నైపుణ్యం, ప్రయాణం విశేషంగా నిలిచింది. అతని నటనా చాతుర్యంతోపాటు, వంటగదిలో నైపుణ్యం, ప్రావీణ్యం ఆశ్చర్యకరమైన ప్రతిభ, అభిమానులు . ఆహార విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది.స్టార్-స్టడెడ్ పోటీదారుల జాబితాలో ఆయేషా జుల్కా, అభిజీత్ సావంత్, ఉషా నద్కర్ణి, అర్చన గౌతమ్, చందన్ ప్రభాకర్, కబితా సింగ్, దీపికా కాకర్ తదితరులు ఉన్నారు.కాగా సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ తొలి సీజన్‌ ఈ ఏడాది జనవరి 27న మొదలైంది. ఏప్రిల్ 11న ముగిసింది. ఈ గ్రాండ్ ఫినాలేలో, నిక్కీ తంబోలిని తొలిరన్నరప్‌గా నిలవగా, తేజస్వి ప్రకాష్ మూడవ స్థానాన్ని దక్కించుకున్నారు. ఫైసల్ షేక్ , రాజీవ్ అడాటియా మొదటి ఐదుగురు ఫైనలిస్టుల జాబితాలో నిలిచారు. ఈ ఫైనల్‌కు ప్రముఖ చెఫ్ సంజీవ్ కపూర్ న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.సెలబ్రిటీ చెఫ్‌లు వికాస్ ఖన్నా, రణ్‌వీర్ బ్రార్‌లతో కలిసి ఫైనలిస్టుల తుది వంటకాలను రుచి చూసి,విజేతలను ఎంపిక చేశారు. ఫరా ఖాన్ హోస్ట్ చేసిన ఈ షో కామెడీ, వంటల మేళవింపుతో మధురక్షణాలతో రోలర్‌కోస్టర్‌గా సాగింది.

How Vanajeevi Ramaiah Haritha Yagnam Helps Society Environment7
రామయ్య హరిత యజ్ఞం, ఎంత మేలు చేసిందో తెలుసా?

వృక్షో రక్షతి రక్షితః అనే సందేశమే వనజీవి రామయ్య జీవిత సారాంశం. చెట్ల ఆవశ్యకత చెప్పిన నిజమైన పర్యావరణ యోధుడాయన. వనజీవి రామయ్య చూపిన మార్గం భావితరాలకు ప్రేరణ కూడా. ఇంతకీ ఆయన ఏళ్ల తరబడి కొనసాగించిన హరిత యజ్ఞతం భవిష్యత్తు తరాలకు ఎంత మేలు అందించిందో తెలుసా?చిన్నప్పుడు బడిలో సర్‌ చెప్పిన పాఠాలే దరిపల్లి రామయ్య ఆకుపచ్చ కలకు స్ఫూర్తినిచ్చాయి. దశాబ్దాల పాటు శ్రమించి కోటికి పైగా మొక్కలు నాటేలా చేశాయి. ఇన్నేళ్లలో ఆయన నాటిన ఎన్నో వేల, లక్షల మొక్కలు మహావృక్షాలుగా ఎదిగాయి. స్వయంగా ఆయన నాటివే కాకుండా.. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో మరెందరో మొక్కలు నాటి ఈ మహా యజ్ఞంలో భాగం అయ్యారు.చెట్లు కార్బన్‌ డైయాక్సైడ్‌ను పీల్చుకుని ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయని తెలిసిందే. గాల్లోని హానికారక సల్ఫర్‌ డైయాక్సైడ్‌, నైట్రోజన్‌ ఆక్సైడ్‌లనూ ఫిల్టర్‌ చేస్తుంటాయి. కడదాకా ఆయన కొనసాగించిన హరిత యజ్ఞంతో.. కాలుష్యం తగ్గి గాలి స్వచ్ఛత పెరిగింది.ఏడాదిలో ఒక చెట్టు సగటున 48 పౌండ్ల(22 కేజీలు) కార్బన్‌ డైయాక్సైడ్‌ను పీల్చుకుంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. బదులుగా ఏడాదికి ఇద్దరికి సరిపడా ఆక్సిజన్‌ను విడుదల చేస్తుందట. రామయ్య నాటింది కోటి మొక్కలకు పైనే. అంటే.. 218 మిలియన్‌ కేజీల Co2ను పీల్చుకునే అవకాశం ఉంది. ఏడాదికి 47 వేల కార్లు రోడ్డు మీద తిరిగితే వెలువడే కాలుష్యానికి ఇది సమానం. పోనీ కోటికి పైగా మొక్కల్లో లక్షల, వేల మొక్కలు వృక్షాలుగా ఎదిగి ఉన్నా.. ఆ మహానుభావుడి కృషి భావితరాల్లో ఎంత మందికి ప్రాణవాయువు అందిస్తుందో అర్థం చేసుకోవచ్చు.

AP Inter Result 2025 Live Updates: Direct Link to Check AP Inter Result Online8
ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల, ఒక్క క్లిక్‌తో క్షణాల్లో చెక్‌ చేసుకోండిలా..

విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలు(AP Inter Results) శనివారం విడుదలయ్యాయి. ఇంటర్‌ ఫస్టియర్‌లో 70 శాతం, సెకండ్‌ ఇయర్‌లో 83 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. ఇంటర్‌ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ పరీక్ష రాసిన విద్యార్థులు కేవలం ఒకే ఒక్క క్లిక్‌తో www.sakshieducation.com వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.క్లిక్‌ 👉🏼 ఫస్ట్‌ ఇయర్‌ రెగ్యులర్‌ రిజల్ట్స్‌ క్లిక్‌ 👉🏼 సెకండ్‌ ఇయర్‌ ఇయర్‌ రెగ్యులర్‌ రిజల్ట్స్‌క్లిక్‌ 👉🏼 ఫస్ట్‌ ఇయర్‌ వొకేషనల్‌ రిజల్ట్స్‌క్లిక్‌ 👉🏼 సెకండ్‌ ఇయర్‌ వొకేషనల్‌ రిజల్ట్స్‌ AP Inter Results 2025.. ఎలా చెక్‌ చేసుకోవాలి.. ?➤ ముందుగా https://results.sakshieducation.com ను క్లిక్‌ చేయండి.➤పైన కనిపిస్తున్న లింక్‌లపై క్లిక్ చేయండి.➤ మీ హాల్‌టికెట్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేయండి.➤ వివరాలు ఎంటర్‌ చేసి సబ్‌మిట్‌ బటన్‌ను క్లిక్‌ చేయండి. ➤ తర్వాతి స్క్రీన్‌లో ఫలితాలు డిస్‌ప్లే అవుతాయి.➤ భవిష్యత్‌ అవసరాల కోసం డౌన్‌లోడ్‌/ప్రింట్‌ అవుట్‌ తీసుకోండి.ఫస్ట్‌ ఇయర్‌ ఫలితాల్లో చిత్తూరు లాస్ట్‌ఇదిలా ఉంటే.. ఇంటర్‌లో ఈ ఏడాది 10 లక్షలకుపైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి - 19 వరకు ఫస్టియర్‌ పరీక్షలు జరగగా, మార్చి 3- 20 వరకు సెకండియర్‌ పరీక్షలను నిర్వహించారు. జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ పూర్తి కావడంతో ఇవాళ ఫలితాలను వెల్లడించారు. ఇంటర్‌ ఫలితాల్లో బాలికలదే పై చేయిగా నిలిచింది. ఫస్ట్ , సెకండ్ ఇయర్ ఫలితాల్లో ఫస్ట్‌ ప్లేస్‌లో కృష్ణా జిల్లా నిలిచింది. రెండు, మూడు స్థానాల్లో గుంటూరు , ఎన్టీఆర్ జిల్లాలు నిలిచాయి. ఇక.. ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో లాస్ట్ ప్లేస్‌లో సీఎం సొంతజిల్లా చిత్తూరు నిలవడం గమనార్హం. సెకండ్ ఇయర్ ఫలితాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో నిలిచింది. మే 12 నుంచి ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని ఇంటర్‌బోర్డు ప్రకటించింది.

UPI Outage As Several Users Face Issue With Payments9
యూపీఐ సేవల్లో అంతరాయం: స్పందించిన ఎన్‌పీసీఐ

దేశ వ్యాప్తంగా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవల్లో మరోసారి అంతరాయం ఏర్పడింది. ట్రాన్సక్షన్స్ జరగడం లేదని చాలామంది యూజర్లకు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నాడు. మధ్యాహ్నం 12:43 గంటకు సమస్య తీవ్రతరం అయిందని, 2,000 మందికి పైగా వినియోగదారులు సమస్యలను నివేదించారని డౌన్ డిటెక్టర్‌ వెల్లడించింది.గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వినియోగదారులు యూపీఐ సేవలను యాక్సెస్ చేయడంలో సమస్యలను ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. డౌన్ డిటెక్టర్ ప్రకారం.. సుమారు 79 శాతం మంది వినియోగదారులు చెల్లింపులకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొన్నారు. 19 శాతం మంది నిధులను బదిలీ చేయలేకపోయారు. మరో 2 శాతం ఫిర్యాదులు UPI ద్వారా కొనుగోళ్లకు సంబంధించిన సమస్యలను నివేదించారు.యూపీఐ సేవల్లో అంతరాయాలకు సంబంధించిన సమస్యలు తలెత్తడం ఇదే మొదటిసారి కాదు. మార్చి 26న, ఏప్రిల్ 2న కూడా ఇలాంటి సమస్యలే తలెత్తాయి.టెక్నికల్ సమస్యల కారణంగా ఈ యూపీఐ సేవల్లో అంతరాయం జరిగినట్లు అప్పుడు ఎన్‌పీసీఐ వెల్లడించింది. కాగా ఇప్పుడు మరోమారు ఈ సమస్య తెరమీదకు వచ్చింది.ఇదీ చదవండి: తత్కాల్‌ బుకింగ్‌ టైమింగ్స్‌లో మార్పు లేదు: ఐఆర్‌సీటీసీ క్లారిటీస్పందించిన ఎన్‌పీసీఐకొన్ని సాంకేతిక సమస్యల కారణంగా లావాదేవీలకు ఆటంకం కలుగుతోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాము. మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము అని ఎన్‌పీసీఐ ట్వీట్ చేసింది.NPCI is currently facing intermittent technical issues, leading to partial UPI transaction declines. We are working to resolve the issue, and will keep you updated. We regret the inconvenience caused.— NPCI (@NPCI_NPCI) April 12, 2025

India Highest Paid Directors: 3 Telugu Directors in Top 510
అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకునే డైరెక్టర్లు.. టాప్‌ 5లో ముగ్గురు మనోళ్లే!

సినిమా రెమ్యునరేషన్‌ల విషయానికి వస్తే ఎప్పుడూ నటీనటులదే చర్చకు వస్తుంది కానీ దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణుల గురించి రాదు. కానీ ఇదంతా గతం... ఇప్పుడు రెమ్యునరేషన్స్‌ విషయంలో సినిమా దర్శకులు హీరోలతో ఢీ అంటే ఢీ అంటున్నారు. కొందరు దర్శకులైతే టాప్‌ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారు. అందుకే ఇప్పుడు దర్శకుల పారితోషికాలు కూడా చర్చనీయాంశంగా మారాయి.నెం.1 ప్లేస్‌లో జక్కన్నప్రస్తుతం ఎన్నో రకాలుగా ఉత్తరాది సినీపరిశ్రమను వెనక్కి నెట్టేసిన దక్షిణాది.. డైరెక్టర్ల రెమ్యునరేషన్ల విషయంలోనూ తానే టాప్‌ అని నిరూపించుకుంటోంది. ప్రస్తుతం అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకుంటున్న దర్శకుడిగా టాలీవుడ్‌ మెగా డైరెక్టర్‌ రాజమౌళి (SS Rajamouli) నెం1 స్థానంలో ఉన్నాడు. బాహుబలి 1, 2లతో పాటు RRRల ద్వారా వందలు, వేల కోట్ల కలెక్షన్లతో చరిత్రను తిరగరాసిన ఈ డైరెక్టర్‌... దాదాపుగా రూ.200 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్టు తెలుస్తోంది. దశాబ్ధానికిపైగా హిట్స్‌ ఇస్తున్న రాజమౌళి సంగతి అలా ఉంచితే... మిగిలిన టాప్‌ 5లో కొందరు ఒకటి, రెండు సినిమాలతోనే అగ్రస్థానానికి ఎగబాకడం గమనార్హం.రెండో ప్లేస్‌ కూడా మనదే..అలా చూస్తే 2వ స్థానంలో కూడా తెలుగుదర్శకుడైన సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఉండడం విశేషం. తెలుగు అర్జున్‌రెడ్డి తర్వాత ఒక్కసారిగా బాలీవుడ్‌కి ఎదిగిపోయిన సందీప్‌... అర్జున్‌ రెడ్డి హిందీ రీమేక్, ఆ తర్వాత యానిమల్‌ సినిమాలతో రూ.100 నుంచి రూ.150 కోట్లు డిమాండ్‌ చేసే స్థాయికి వెళ్లాడు. ఏకంగా నెం. 2 స్థానంలోకి ఎగిరి కూర్చున్నాడు. కేవలం మూడే సినిమాలతో ఆయన ఈ ఘనత సాధించడం చెప్పుకోదగ్గది. అదే రకంగా దేశం అంతా ఇప్పుడు మాట్లాడుకుంటున్న సెన్సేషనల్‌ డైరెక్టర్‌ అట్లీ ది సైతం అనూహ్యమైన విజయయాత్రే. 100% సక్సెస్‌ రేటుఈ తమిళ దర్శకుడు అట్లీ కుమార్‌ (Atlee Kumar) కేవలం ఆరు చిత్రాలతో 100 శాతం సక్సెస్‌ రేటుతో 3వ స్థానం దక్కించుకున్నాడు. తమిళ చిత్రాలైన మెర్సల్, బిగిల్‌లతో పాటు షారుఖ్‌ ఖాన్‌ నటించిన జవాన్‌ వంటి బ్లాక్‌ బస్టర్‌లతో అట్లీ భారతీయ సినిమాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. గత 2023లో విడుదలైన జవాన్‌ ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకు పైగా వసూలు చేసి ప్రపంచ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కొంత విరామం అనంతరం ప్రస్తుతం తాత్కాలిక టైటిల్‌ ఎఎ22ఎక్స్‌ఎ6 పేరుతో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌తో అనౌన్స్‌ చేసిన ప్రాజెక్ట్‌ అట్లీని అమాంతం 3వస్థానంలోకి చేర్చింది. 233% రెమ్యునరేషన్‌ పెంచిన డైరెక్టర్‌జవాన్‌ కోసం రూ. 30 కోట్లను మాత్రమే అందుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు ఒకేసారి రూ. 100 కోట్లకు అంటే.. దాదాపుగా 233% తన పారితోషికం పెంచేశాడు. ఈ డీల్‌ భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే డైరెక్టర్‌గా అట్లీని మూడవ స్థానంలో నిలిపింది. ఆ తర్వాత రూ.80 కోట్లతో 4వ స్థానంలో బాలీవుడ్‌ దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరానీ, రూ.75 కోట్లతో 5వస్థానంలో సుకుమార్‌, రూ. 55–65 కోట్లతో సంజయ్‌ లీలా భన్సాలీలు ఉన్నారు.చదవండి: ఇంట్లో గొడవలు.. చనిపోదామనుకున్నా.. ఏడ్చేసిన గీతూ రాయల్‌

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement