బీజింగ్: చైనాలోని జిగాంగ్ నగరంలోని ఓ షాపింగ్ సెంటర్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 16 మంది మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. అధికారిక వార్తా సంస్థ జిన్హువా నుండి అందిన సమాచారం ప్రకారం 14 అంతస్తుల వాణిజ్య భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది.
అగ్నిమాపక దళంతో పాటు రెస్క్యూ సిబ్బంది ప్రమాదం జరిగిన భవనంలో చిక్కుకున్నవారిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ముందుగా భవనం దిగువన ఉన్న షాపింగ్ సెంటర్‌లో మంటలు చెలరేగాయి. అవి చుట్టుపక్కల దుకాణాలకు వ్యాపించాయి. మంటలు చెలరేగడానికి కారణమేమిటి? ప్రమాద సమయంలో భవనంలో ఎంతమంది ఉన్నారనేది ఇంకా తెలియరాలేదు. అగ్నిప్రమాదానికి కారణానికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చైనాలో అగ్ని ప్రమాదాలు, ఇతర విపత్తలు తరచూ జరగుతుంటాయి. ఈ ఏడాది మే 20 నాటికి 947 మంది వివిధ విపత్తుల కారణంగా మృతి చెందారు. నేషనల్ ఫైర్ అండ్ రెస్క్యూ అడ్మినిస్ట్రేషన్ ప్రతినిధి మాట్లాడుతూ హోటళ్లు, రెస్టారెంట్లు వంటి ప్రదేశాల్లో ఇటీవలి కాలంలో అగ్ని ప్రమాదాలు 40 శాతం మేరకు పెరిగాయన్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్, లేదా గ్యాస్ లైన్ల లీకేజీ, నిర్లక్ష్యం మొదలైనవి అగ్ని ప్రమాదాలకు ప్రధాన కారణమన్నారు.
A MASSIVE fire in China leaves 8 dead and many trapped in a Zigong shopping mall.
More confirmation of Hanke’s School Boy’s Theory of History: It’s just one damn thing after another.pic.twitter.com/7OCuGbnNKZ— Steve Hanke (@steve_hanke) July 17, 2024
Comments
Please login to add a commentAdd a comment