యూఎస్ స్టేట్స్‌లో పోలింగ్ నడుస్తోంది. మొదటి దశ, చివరి దశల పోలింగ్ ముగిసిన వెంటనే.. ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. అమెరికాలో పేపర్ బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరుగుతాయని తెలిసిందే. ఓటింగ్ మెషీన్లపై అక్కడి ఓటర్లలో నమ్మకం లేకపోవడం అందుకు ప్రధాన కారణం. అయితే అక్కడి ఎన్నిక విధానం తరహాలో కౌంటింగ్ కూడా కాస్త భిన్నంగానే ఉంటుంది.
మన దగ్గర పోస్టల్ బ్యాలెట్ తర్వాత ఈవీఎంల లెక్కింపు ఉంటుంది కదా. కానీ, అమెరికాలో సాధారణంగా ఎన్నికలు జరిగిన రోజే పోలైన ఓట్లను మొదట లెక్కిస్తారు. తర్వాత మెయిల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. దేశాల నుంచి వచ్చిన ఓట్లను, మిలటరీ బ్యాలెట్లను ఆ తర్వాత లెక్కిస్తారు. ఇందుకోసం..
కాన్వాసింగ్(canvassing) ప్రక్రియ ద్వారా ఎన్నికైన స్థానిక ఎన్నికల అధికారులు ఓట్లను పరిశీలించి లెక్కిస్తారు. ఎన్ని ఓట్లు పోలయ్యాయి? ఓటర్ల జాబితాలో ఎన్ని పేర్లున్నాయి? అనేది పోలుస్తూ.. అర్హత గల ప్రతిఓటూను లెక్కించేలా చూడటమే వీరి పని.
బ్యాలెట్‌పై ఏమైనా మరకలు ఉన్నాయా?.. బ్యాలెట్ పాడైపోయిందా?.. ఇలా కక్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఒకవేళ అభ్యంతరంగా అనిపిస్తే.. డాక్యుమెంటేషన్ చేసి దర్యాప్తు చేస్తారు. అలాగే.. కౌంటింగ్ బ్యాలెట్లను ఎలక్ట్రానిక్ స్కానర్లతో జతచేస్తారు. దీనివల్ల ఫలితాల పట్టిక కనిపిస్తుంది. కొన్ని పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్ స్కానర్లతో కాకుండా మాన్యువల్‌గానూ లెక్కిస్తారు. మరికొన్ని సమయాల్లో రెండుసార్లు కౌంటింగ్ జరుపుతారు. అయితే.. కాన్వాస్‌లో ఎవరు పాల్గొనాలనేదానిపై కఠిన నిబంధనలుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment