వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల బరిలో నిలిచిన ఇద్దరు అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఇక, అమెరికా పలు యూనియన్ల ఓట్ల కీలకంగా మారనున్నాయి. కొన్ని యూనియన్ల సభ్యులు డొనాల్డ్ ట్రంప్‌కు అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది.
కాగా, అమెరికాలో ఇంటర్నేషనల్ బ్రదర్‌హుడ్ ఆఫ్ టీమ్‌స్టర్స్ యూనియన్‌కు సంబంధించిన ఓట్లు ఎన్నికల్లో కీలకంగా మారానున్నాయి. ఈ యూనియల్‌లో దాదాపు 1.3 మిలియన్ల సభ్యులు ఉన్నారు. ఈ యూనియన్‌లో ట్రక్ డ్రైవర్లు, ఎయిర్‌లైన్స్ పైలట్స్, జూకీపర్ల వరకు అనేక ఇతర కార్మికులు కూడా ఉన్నారు. ఇక, యూనియన్‌కు సంబంధించి బుధవారం ఎలక్ట్రానిక్ పోల్‌ను విడుదల చేశారు. ఈ పోల్స్‌లో ఎక్కువ మంది డొనాల్డ్ ట్రంప్‌వైపే మొగ్గుచూపారు.
యూనియన్ సభ్యుల జాతీయ ఎలక్ట్రానిక్ పోల్ ప్రకారం.. ట్రంప్‌కు 59.6 శాతం ఓట్లు రాగా, కమలా హారీస్‌కు మాత్రం కేవలం 34 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో, కమలాపై ట్రంప్ పైచేయి సాధించారు. ఇక, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల నుంచి తప్పుకోకముందు ఆయనకు మద్దుతుగా 44 శాతం ఓట్లు వచ్చాయి. కాగా, యూనియన్‌లో మెజార్టీ ఓటర్లు ట్రంప్‌కు మద్దతు ఇస్తున్న నేపథ్యంలో ఓట్లు అభ్యర్థులు ఇద్దరికీ యూనియన్ కీలకంగా మారనుంది. అయితే, 2000 సంవత్సరం నుంచి ఈ యూనియన్ సభ్యులు డెమోక్రటిక్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు. ఇక, ఈ ఎన్నికల్లో మాత్రం రిపబ్లిక్ పార్టీ అభ్యర్థికి సపోర్టు ఇస్తూ పోల్స్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.
ఇప్పటి వరకు యూనియన్ మద్దతు ఇలా..
1984లో ప్రెసిడెంట్ రోనాల్డ్ రీగన్‌కు
1988లో వైస్ ప్రెసిడెంట్ జార్జ్ హెచ్‌డబ్ల్యు బుష్‌తో సహా రిపబ్లికన్‌లను ఆమోదించారు.
1996 తర్వాత యూనియన్ ఆమోదం పొందకపోవడం ఇదే మొదటిసారి.
2000 నుండి ప్రతి డెమోక్రాటిక్ అభ్యర్థికి అనుకూలంగా ఉన్నారు.
ఇది కూడా చదవండి: Israel Hezbollah War: పేజర్‌లో 3 గ్రాముల పేలుడు పదార్థం!
Comments
Please login to add a commentAdd a comment