న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికలో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే.. చాలా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొవల్సి వస్తుందని ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ హెచ్చరించారు. విస్కాన్సిన్‌లోని పార్టీ మద్దతుదారులతో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.
‘‘డొనాల్డ్ ట్రంప్ ప్రమాదకరమైన వ్యక్తి అని అమెరికా ప్రజలు గుర్తించటం చాలా ముఖ్యమని భావిస్తున్నా. ఇదే విషయాన్ని నేను చాలా బహిరంగంగా చెప్పాను. ట్రంప్ మళ్లీ అమెరికాకు అధ్యక్షుడిగా ఎంపికైతే కలిగే పరిణామాలు చాలా క్రూరంగా ఉంటాయి. నవంబర్ 5న జరగనున్న అధ్యక్ష ఎన్నికల కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది. అమెరికా మిత్రపక్షాలు ఆందోళన చెందుతున్నాయి.
ట్రంప్ పొగడ్తలకు సులభంగా తన ఆలోచనలను మార్చుకుంటారు. కోవిడ్ సమయంలో ఆయన ఏం చేశారో అందరికీ తెలుసు. తన వ్యక్తిగత ప్రయోజనం కోసం (రష్యన్ అధ్యక్షుడు) వ్లాదిమిర్ పుతిన్‌కు రహస్యంగా కోవిడ్ పరీక్షల పరికరాలు పంపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ పదేపదే చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఆయన ఒక రోజులో పరిష్కరిస్తానని చెప్పారు. లొంగిపోవడం ద్వారా అమెరికా ప్రెసిడెంట్ అటువంటి సమస్యను పరిష్కరించాలని అమెరికన్లుగా మనం భావిస్తున్నామని నేను అనుకోను.
డోనాల్డ్ ట్రంప్ అమెరికాకు అధ్యక్షుడైతే వ్లాదిమిర్ పుతిన్ ఏకంగా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో కూర్చుంటారు. ట్రంప్ తనను అభిమానించే వ్యక్తులను సంతోషపెట్టాలని అనుకుంటారు’’ అని అన్నారు. ఇక.. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి సంబంధించి ఇటువంటి వ్యాఖ్యలు ట్రంప్ గంతంలో కూడా చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment