లండన్: కరోనావైరస్ మహమ్మారి వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభం ప్రస్తుతం ప్రపంచంలో అనిశ్చితి, ఆందోళనను కలుగజేసిందని, ఇవి మరొక ప్రపంచ యుద్దానికి దారి తీసే అవకాశం ఉందని బ్రిటన్ సాయుధ దళాల అధిపతి హెచ్చరించారు. సైన్యంలో గాయపడిన, మరణించిన వారి స్మారకార్ధం ఏర్పాటు చేసిన కార్యక్రమం సందర్భంగా ఆయన ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటరర్వ్యూలో మాట్లాడారు. ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరిగిన కారణంగా అవి ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్తతలకు దారి తీయవచ్చు అని బ్రిటన్ సాయుధ దళాధిపతి చీఫ్ నిక్ కార్టర్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మరొక ప్రపంచ యుద్దం వచ్చే ముప్పు ఉందా అని అడగగా అలా జరగే అవకాశం ఉంది. కాబట్టి మనం ఆ విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి అని అన్నారు. అది వరకు జరిగిన యుద్దం వలన ఏర్పడిన భయానక పరిస్థితుల గురించి మర్చిపోకూడదని కార్టర్ తెలిపారు. చరిత్రలో జరిగిన రెండు భయంకరమైనమ పెద్ద యుద్దాలను చూస్తే చాలా నష్టం జరిగింది. ఇలాంటి యుద్దాలను మళ్లీ మేము చూడలేము అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment