కాన్బెర్రా: మూడో ప్రపంచయుద్ధ భయాలు ప్రపంచాన్ని వెంటాడుతున్నాయి. ఇరాన్, సిరియా, హమాస్, హిజ్‌బొల్లా, ఇజ్రాయెల్ మధ్య ఎప్పుడైనా భీకర యుద్ధం జరగబోతోందనే భయం అందరిలో నెలకొంది. మరోవైపు చైనా, తైవాన్ మధ్య ఉద్రిక్తతలు ఆసియా ఖండంలో అశాంతిని మరింతగా పెంచుతున్నాయి.
ప్రపంచంలోని పలు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇతర దేశాలలో తీవ్ర ఆందోళనను సృష్టిస్తున్నాయి. తాజాగా ఆస్ట్రేలియన్ బిషప్ చెప్పిన భవిష్యవాణి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన బిషప్ మార్ మేరీ ఇమ్మాన్యుయేల్ మూడవ ప్రపంచ యుద్ధం భారీ బీభత్సాన్ని సృష్టిస్తుందని పేర్కొన్నాడు. ఈ యుద్ధంలో లెక్కలేనంత మంది ప్రాణాలు కోల్పోతారని, బతికిన వారు తర్వాత పశ్చాత్తాప పడతారని బిషప్ పేర్కొన్నారు. ఈయన తన సోషల్ మీడియా ఖాతా 'ఎక్స్'లో మానవాళికి ఎదురయ్యే చీకటి భవిష్యత్తును తాను ఊహించినట్లు పేర్కొన్నారు.
A prophecy of world War 3.
Almost one third of the population will perish.
It will be the most disastorous , times of humanity. pic.twitter.com/om9PIia9BH— M. O. G. Bishop mar mari Emmanuel (@Bishopmurmuri) November 24, 2024
బిషప్ మార్ మేరి ఇమ్మాన్యుయేల్ తన వీడియో సందేశంలో మూడవ ప్రపంచ యుద్ధం భారీ విధ్వంసాన్ని తెస్తుందని హెచ్చరించారు. ఈ యుద్ధంలో ప్రపంచ జనాభాలో మూడింట ఒక వంతు మంది కనుమరుగవుతారని, మిగిలిన మూడింట రెండొంతుల మంది తాము ఇక పుట్టకూడదని కోరుకుంటారని తెలిపారు. ఈ యుద్ధంలో అణ్వాయుధాలను వినియోగిస్తారని పేర్కొన్నారు. భవిష్యత్ గురించి బిషప్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బాబా వెంగా, నోస్ట్రాడామస్ తదితర ప్రపంచ ప్రసిద్ధ భవిష్యవాణివేత్తలు కూడా ఇదే విధమైన విషయాలను వెల్లడించారు.
ఇది కూడా చదవండి: World Oldest Man: ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు కన్నుమూత
Comments
Please login to add a commentAdd a comment