
టెక్నాలజీ ఎంతగా పెరుగుతోందో.. స్కామర్లు కూడా అంతే వేగంగా పెరిగిపోతున్నారు. ఆన్‌లైన్‌లో ఎప్పుడైనా ఆదమరిస్తే.. చెబుకు చిల్లు ఖాయమే. ఇలాంటి ఘటనలు గతంలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో సంఘటన ఆస్ట్రేలియాలో వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఆస్ట్రేలియాకు చెందిన మహిళ 'అన్నెట్ ఫోర్డ్' ఆన్‌లైన్‌లో ప్రేమ కోసం వెతుకుతున్నప్పుడు.. స్కామర్ల చేతికి చిక్కింది. దీంతో సుమారు 4.3 కోట్లు (780000 ఆస్ట్రేలియన్ డాలర్స్) పోగొట్టుకుంది. పెళ్ళై కొన్నేళ్ళకు భర్తతో విడిపోయిన తరువాత.. 2018లో ఫోర్డ్ ఆన్‌లైన్ డేటింగ్ వైపు మొగ్గు చూపి, 'ప్లెంటీ ఆఫ్ ఫిష్' అనే డేటింగ్ సైట్‌లో చేరింది. ఇక్కడే 'విలియం' అనే వ్యక్తితో చాట్ చేయడం ప్రారంభించింది.
కొన్ని నెలల తరువాత మలేషియాలోని కౌలాలంపూర్‌లో కొంతమంది పర్సు, కార్డులను ఎవరో దొంగలించారని చెప్పి, అన్నెట్ ఫోర్డ్ నుంచి విలియం రూ. 2.75 లక్షలు తీసుకున్నాడు. ఆ తరువాత కూడా బ్యాంక్ కార్డులు పోయాయని.. మెడికల్స్ బిల్స్, హోటల్స్ బిల్స్ వంటివి చెల్లించాలని మరికొంత డబ్బు తీసుకున్నాడు. తాను (ఫోర్డ్) మోసపోయానని గ్రహించే సమయానికి ఆమె రూ. 1.6 కోట్లు నష్టపోయింది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసులకు నివేదించిప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది.
ఫేస్‌బుక్‌లో రెండో స్కామ్
నాలుగు సంవత్సరాల తరువాత, 'అన్నెట్ ఫోర్డ్' ఫేస్‌బుక్‌లో మరొక స్కామ్ బారిన పడింది. ఆమ్‌స్టర్‌డామ్‌కు చెందినవాడినని చెప్పుకునే 'నెల్సన్' అనే వ్యక్తితో పరిచయం ఏర్పడిన తరువాత.. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI)లో తన స్నేహితుడు ఉన్నాడని, అతనిపై దర్యాప్తు జరుగుతోందని, అతనికి సహాయం చేయడానికి 2500 AUD (సుమారు రూ. 1.3 లక్షలు) అవసరమని చెప్పాడు.
మొదట్లో అనుమానం వచ్చిన ఫోర్డ్ డబ్బు పంపించడానికి నిరాకరించింది. అయితే, నెల్సన్ ఆమెను బిట్‌కాయిన్ ATMలో డబ్బు జమ చేయమని ఒప్పించాడు. ఆ తరువాత కొన్ని రోజులకు ఆమె ఖాతాలోకి డబ్బు వచ్చి వెళ్లడం గమనించింది. అసలు విషయం తెలుసుకునే లోపే.. రూ. 1.5 కోట్లు పోగొట్టుకుంది.
ఇదీ చదవండి: 'ఉచితంగా పనిచేస్తా.. ఉద్యోగమివ్వండి': టెకీ పోస్ట్ వైరల్
మోసపోయిన తరువాత ఫోర్డ్.. ఆస్ట్రేలియన్లను ఇలాంటి మోసాలకు బలికావద్దని హితవు పలికింది. గుర్తు తెలియని వ్యక్తులు నమ్మకంగా మాట్లాడి.. చివరికి మీ నుంచి డబ్బు లాగేస్తారని, తరువాత మీరే దివాళా తీస్తారని చెప్పింది. మొత్తం మీద ఆన్‌లైన్‌లో ఏదైనా సెర్చ్ చేసేటప్పుడు, గుర్తు తెలియని వ్యక్తులకు స్పందించేటప్పుడు.. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment