
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో మోసాలు కూడా ఎక్కువవుతున్నాయి. ఆదమరిస్తే.. ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. ఆన్‌లైన్ మోసాలకు సంబంధించిన కథనాలు గతంలో చాలానే తెలుసుకున్నాం. అలాంటిదే మరొకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇంతకీ.. ఇది ఎక్కడ, ఎప్పుడు, ఎలా జరిగింది? అనే విషయాలను వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.
దక్షిణ ఢిల్లీలోని షేక్ సారాయ్‌కు చెందిన ఒక వ్యక్తి మొబైల్ కోసం ఆన్‌లైన్ షాపింగ్ చేశారు. ఫోన్ కోసం ఎదురు చూస్తున్న అతనికి డెలివరీ వచ్చింది. కానీ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే.. అందులో సోప్ బార్, బిస్కెట్ ప్యాకెట్ ఉండటం చూసి ఖంగుతిన్నాడు.
బాధితుడు ఫిబ్రవరి 11న రూ.16,680 విలువైన మొబైల్ ఫోన్ ఆర్డర్ చేశాడు. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకున్నాడు. ఫిబ్రవరి 12న డెలివరీ ఏజెంట్ పేరుతో.. కాల్ చేసి ఈ రోజు డెలివరీ చేస్తానని చెప్పాడు. కానీ కొనుగోలుదారు (బాధితుడు) కోరికమేరకు మరుసటి రోజు ఉదయం డెలివరీ చేసాడు. డెలివరీ తీసుకున్న తరువాత, తాను చెల్లించాల్సిన మొత్తాన్ని.. యూపీఐ ద్వారా చెల్లించారు.
డబ్బు చెల్లించి.. ఆఫీసుకు వెళ్లి దాన్ని ఓపెన్ చేస్తే, మొబైల్ స్థానంలో బిస్కెట్ ప్యాకెట్, సోప్ బార్ ఉన్నాయి. మోసపోయానని గ్రహించాడు. డెలివరీ ఏజెంట్ నెంబర్‌కు కాల్ చేసాడు. మొదట్లో, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో ఫిర్యాదు చేయడం ద్వారా సమస్య పరిష్కారమవుతుందని అతనికి డెలివరీ ఏజెంట్ చెప్పాడు. తరువాత ఆ నెంబర్‌కు కాల్ చేస్తే.. స్విచ్ ఆఫ్ వచ్చింది. షాపింగ్ వెబ్‌సైట్ కూడా అతని ఈమెయిల్‌లకు స్పందించలేదు.
ఇదీ చదవండి: '8-8-8 రూల్ పాటించండి': పనిగంటలపై నీర్జా బిర్లా
బాధితుడు చేసేదేమీ లేక.. పోలీసులకు ఫిర్యాదు చేసాడు. పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. నకిలీ డెలివరీ ఏజెంట్‌ను ట్రాక్ చేయడానికి, మోసగాళ్లు కస్టమర్ వివరాలను ఎలా యాక్సెస్ చేశారో తెలుసుకోవడానికి దర్యాప్తు కొనసాగుతోంది.
ఇలాంటి మోసాల నుంచి ఎలా బయటపడాలంటే?
మోసగాళ్ళు ఆన్‌లైన్ షాపింగ్ పేరుతో.. ప్రజలను దోచుకుంటున్నారు. ఆన్‌లైన్ లావాదేవీల సంఖ్య పెరుగుతున్నందున, వినియోగదారులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని పలువురు నిపుణులు చెబుతున్నారు.
➤డెలివరీ తీసుకోవడానికి ముందు.. డెలివరీ ఏజెంట్లు నిజమైనవారా? కాదా? అని ధృవీకరించుకోవాలి.
➤వ్యక్తిగత వివరాలను ఎప్పుడు పంచుకోకూడదు. లావాదేవీలను పూర్తి చేసే ముందు ప్యాకేజీలను చెక్ చేసుకోవాలి.
➤ఏదైనా అనుమానం కలిగితే.. ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లకు ఫిర్యాదు చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment