online Scam
-
వణికించిన ఫోన్ కాల్.. రూ. 7.28 లక్షలు దోపిడీ
ఆన్లైన్ మోసాలకు అంతే లేకుండా పోతోంది. వయసుతో సంబంధం లేకుండా యువత, ఉన్నత విద్యావంతులు కూడా ఈ మోసాలకు గురవుతున్నారు. తాజాగా 25 ఏళ్ల ఐఐటీ బాంబే విద్యార్థి అధునాతన మోసంలో రూ. 7.28 లక్షలు కోల్పోయి బాధితుడయ్యాడు.వార్తా సంస్థ పీటీఐ రిపోర్ట్ ప్రకారం.. విద్యార్థికి ట్రాయ్ అధికారినంటూ ఓ వ్యక్తి నుండి కాల్ వచ్చింది. విద్యార్థి మొబైల్ నంబర్‌పై చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సంబంధించిన 17 ఫిర్యాదులు నమోదయ్యాయని ఆ వ్యక్తి చెప్పాడు. తమ సూచనలను పాటించకపోతే "డిజిటల్ అరెస్ట్" అయ్యే ప్రమాదం ఉందని బెదిరించాడు.చట్టపరమైన పరిణామాలు, అభియోగాల తీవ్రతకు భయపడిన విద్యార్థి వారి సూచనలను అనుసరించడానికి అంగీకరించాడు. కేసుల నుంచి పేరును తొలగించడానికి, చట్టపరమైన సమస్యలను నివారించడానికి రూపొందించిన ప్రక్రియ పేరుతో స్కామర్లు పలు దఫాలుగా రూ. 7.28 లక్షలను వారి ఖాతాకు బదిలీ చేయాలని ఆదేశించారు. భయంతో అతను వారి సూచనలను అనుసరించిన విద్యార్థి చివరికి bమోసానికి గురయ్యాడు.వణికిపోవద్దు..ఇలాంటి ఆన్లైన్ మోసాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల ఇలాంటి మోసాలకు బలి అవుతున్న వ్యక్తుల సంఖ్య దేశంలో పెరుగుతోంది. ఈ స్కామ్‌లలో చాలా వరకు వాట్సాప్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు లేదా చట్టబద్ధమైన సంస్థల పేరుతో నకిలీ వెబ్సైట్ల ద్వారా జరుగుతన్నాయి. అటువంటి కాల్స్ వచ్చినప్పుడు కాలర్ గుర్తింపును ధ్రువీకరించుకోవాలని, సున్నితమైన సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో పరిస్థితిని అంచనా వేయడానికి కొంత సమయం తీసుకోవాలని, భయంతో హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోవద్దని సూచిస్తున్నారు. -
గూగుల్‌ను గుడ్డిగా నమ్మితే.. మీకూ ఇలాంటి మోసమే జరగొచ్చు!
ప్రస్తుతం ఏది కావాలన్నా గూగుల్లోనే వెతికేస్తున్నాం. అయితే అందులో వచ్చిన ప్రతి సమాచారాన్ని గుడ్డిగా నమ్మి ముందుకు వెళ్తే మోసపోయే అవకాశం ఉంది. ఇలాగే పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ వ్యక్తి కర్ణాటకలోని ఉడిపిలో క్యాబ్ బుక్ చేసుకునే ప్రయత్నంలో ఆన్లైన్ మోసానికి గురై రూ.4.1 లక్షలు పోగొట్టుకున్నాడు.మోసం జరిగిందిలా..గూగుల్ సెర్చ్‌లో కనిపించిన మోసపూరిత కార్ రెంటల్ వెబ్‌సైట్‌తో లింక్ అయిన నకిలీ చెల్లింపు పేజీలో తన కార్డ్ వివరాలను నమోదు చేసి బాధితుడు మోసపోయినట్లు తెలుస్తోంది. ఓ వార్తా నివేదిక ప్రకారం.. ఆ వ్యక్తి కార్ రెంటల్ సర్వీస్‌ల కోసం గూగుల్‌లో శోధించాడు. “శక్తి కార్ రెంటల్స్” అని కనిపించిన లింక్‌పై క్లిక్ చేశాడు. కొద్దిసేపటికే కంపెనీ ప్రతినిధినంటూ ఒక వ్యక్తి అతన్ని సంప్రదించాడు. అతను వెబ్సైట్ ద్వారా టోకెన్‌గా రూ. 150 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించమని సూచించాడు.దీంతో బాధితుడు తన డెబిట్, క్రెడిట్ కార్డ్‌లతో ఫీజు చెల్లించడానికి ప్రయత్నించాడు. అయితే ఎంత ప్రయత్నించినా లావాదేవీ పూర్తి చేయడానికి అవసరమైన ఓటీపీ రాలేదు. కానీ, కొద్దిసేపటికే అతని ఖాతాల నుండి డబ్బులు కట్ అయినట్లు బ్యాంక్ నుంచి నోటిఫికేషన్లు వచ్చాయి. తన ఎస్బీఐ క్రెడిట్ కార్డు నుంచి రూ.3.3 లక్షలు, కెనరా బ్యాంక్ డెబిట్ కార్డు నుంచి రూ.80,056 మొత్తం రూ.4.1 లక్షలు కట్ అయ్యాయి.దేనికోసమైనా గూగుల్‌లో వెతికేటప్పుడు అందులో వచ్చే లింక్‌లను ఒకటికి రెండుసార్లు ధ్రువీకరించుకుని ముందుకెళ్లాలి. ఆర్థిక విషయాలకు సంబంధించినవైతే మరింత జాగ్రత్త అవసరం. మరోవైపు గూగుల్ కూడా ఇలాంటి మోసాలను అరికట్టడానికి ఒక కొత్త అల్గారిథమ్‌ను అభివృద్ధి చేసినట్లు కొన్ని నెలల క్రితం తెలిపింది. -
ఛత్తీస్‌గఢ్‌లో ఉత్తుత్తి ‘ఎస్బీఐ’ శాఖ
జంజ్‌గిర్–చంపా(ఛత్తీస్‌గఢ్): ఆన్లైన్ మోసాల బారినపడిన బాధితులు మొట్టమొదట న్యాయం కోసం వెళ్లేది బ్యాంక్ బ్రాంచ్ వద్దకే. అలాంటి బ్యాంక్ కార్యాలయం నకిలీ అని తేలితే?. ఛత్తీస్‌గఢ్‌లో ఇలాంటి మోసం ఒకటి తాజాగా వెలుగుచూసింది. ఈ ఉదంతంలో పోలీసులు ముగ్గురిని అరెస్ట్‌చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) పేరిట కొందరు మోసగాళ్లు నకిలీ ఎస్బీఐ బ్రాంచ్‌ను తెరచి జనం నుంచి డబ్బులు ‘ఫిక్స్డ్’ డిపాజిట్లు తీసుకోవడం మొదలెట్టారు. శక్తి జిల్లా అదనపు ఎస్పీ రామాపటేల్ తెలిపిన వివరాల ప్రకారం.. శక్తి జిల్లాలోని మల్ఖారౌదా పోలీస్‌స్టేషన్‌పరిధిలోని ఛంపోరా గ్రామంలో సెప్టెంబర్ 18వ తేదీన కొత్తగా నకిలీ ఎస్బీఐ బ్రాంచ్ తెరుచుకుంది. అక్కడి దుకాణసముదాయంలో ఒక షాప్‌ను అద్దెకు తీసుకుని కంప్యూటర్లు, ఇతర బ్యాంకింగ్ సామగ్రితో ఎస్బీఐ శాఖను కొందరు మొదలుపెట్టారు. అయితే ఈ బ్రాంచ్‌పై అనుమానం వచ్చిన ఒక వ్యక్తి పోలీసులు, బ్యాంక్‌కు ఫోన్‌చేసి ఫిర్యాదుచేశారు. దీంతో హుతాశులైన పోలీసులు, కొర్బా పట్టణంలోని ఎస్బీఐ రీజనల్ ఆఫీస్ బృందంతో కలిసి ఈ నకిలీ బ్రాంచ్‌కు హుటాహుటిన వచ్చారు. అప్పుడు ఆ నకిలీ బ్రాంచ్‌లో ఐదుగురు పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే అక్కడి ఉద్యోగులకు తాము నకిలీ బ్రాంచ్‌లో పనిచేస్తున్నామన్న విషయం కూడా తెలీదని వార్తలొచ్చాయి. బ్యాంక్ మేనేజర్‌గా చెప్పుకునే ఒక వ్యక్తి వీరిని ఇంటర్వ్యూ చేసి నియమించుకున్నాడని సమాచారం. దీంతో ముగ్గురిని అరెస్ట్ చేసి పోలీసులు ప్రశ్నించడం మొదలెట్టారు. బ్రాంచ్‌లోని కంప్యూటర్లు, ఇతర మెటీరియల్‌ను స్వా«దీనం చేసుకున్నారు. అయితే ఈ నకిలీ బ్రాంచ్ వల్ల ఎవరైనా మోసపోయారా? ఎంత మంది డిపాజిట్లు చేశారు? ఇతర తరహా లావాదేవీలు జరిగాయా? అనే వివరాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు. -
అంబానీ పెళ్ళికి వెళ్ళామని చెప్పి అమాంతం దోచేశారు
-
భారత్‌లో 71 లక్షల వాట్సాప్ అకౌంట్స్ బ్యాన్ - కారణం ఇదే!
2023 నవంబర్ నెలలో ప్రముఖ మెసేజింగ్ యాప్ 'వాట్సాప్' భారతదేశంలో ఏకంగా 71 లక్షల అకౌంట్స్ నిషేధించింది. పెరుగుతున్న ఆన్లైన్ స్కామ్‌లను తగ్గించడంలో భాగంగా సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 2021 కొత్త ఐటీ రూల్స్‌ని దృష్టిలో ఉంచుకుని యూజర్స్ నుంచి స్వీకరించిన వినతుల కారణంగా వాట్సాప్ 71 లక్షల అకౌంట్స్ మీద నిషేధం విధించింది. యూజర్ రిపోర్ట్లు రాకముందే కంపెనీ నవంబర్ 1 నుంచి 30 వరకు 19,54,000 ఖాతాలను ముందస్తుగా నిషేధించింది. దీనికి ప్రధాన కారణం సంస్థ నిబంధనలను అతిక్రమించడమే. గత నవంబర్‌లో యూజర్ల నుంచి వాట్సప్ 8841 వినతులను అందుకుంది. ఇందులో స్పామ్ ఖాతాలకు సంబంధించిన కంప్లైంట్స్ వంటివి ఉన్నాయి. 'అకౌంట్స్ యాక్షన్డ్' కింద వాట్సాప్ ఖాతాలను బ్యాన్ చేయడం లేదా పునరుద్ధరించడం వంటివి చేస్తుంది. దీనితో పాటు, మిలియన్ల మంది భారతీయ సోషల్ మీడియా వినియోగదారులు లేవనెత్తిన ఆందోళనలను పరిష్కరించడానికి కేంద్రం గ్రీవెన్స్ అప్పీలేట్ కమిటీ (GAC)ని ప్రవేశపెట్టింది. ఇదీ చదవండి: అమితాబ్ బచ్చన్ ఆస్తులు అద్దెకు - సంవత్సరానికి అన్ని కోట్లా.. వాట్సాప్ తప్పుడు సమాచార వ్యాప్తిని, వ్యక్తిగత డేటాకు భంగం కలగకుండా మెటా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే కంపెనీ రూల్స్ అతిక్రమించిన వారి అకౌంట్స్ నిషేధిస్తోంది, రానున్న రోజుల్లో మరింత పటిష్టమైన భద్రతను అందించడానికి ఏఐ వంటి ఆధునిక టెక్నాలజీతో పనిచేయడానికి సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. -
సైబర్ నేరగాళ్ల కొత్త ప్లాన్.. స్విగ్గీ ఖాతా ద్వారా రూ.38,000 మాయం!
ఓ వైపు టెక్నాలజీ పెరుగుతుంటే.. మరోవైపు సైబర్ నేరాలు కొత్త అవతారాల్లో పుట్టుకొస్తున్నాయి. గతంలో బ్యాంక్ నుంచి కాల్ చేసినట్లు ప్రజలను మోసం చేసి ఓటీపీ వంటి వివరాలను తెలుసుకుని అకౌంట్లలో ఉండే డబ్బు మాయం చేసేవారు. అయితే ఇప్పుడు ఎలాంటి ఓటీపీలు అవసరం లేకుండానే డబ్బు కాజేయడానికి ఓ కొత్త మార్గం కనిపెట్టేసారు. దీంతో మన ప్రమేయం లేకుండానే ఖాతాల్లో సొమ్ము మాయమైపోతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇటీవల బెంగళూరులో 'చెన్నకేశవ' అనే వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. దెబ్బకు రూ.38,000 పోగొట్టుకున్నాడు. నిజానికి ఈ మోసం స్విగ్గీ ఖాతా ద్వారా జరిగినట్లు తెలిసింది. ఆటోమొబైల్ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగం చేస్తున్న చెన్నకేశవకు స్విగ్గీ నుంచి ఆటోమేటెడ్ కాల్ వచ్చింది. కాల్ రిసీవ్ చేసుకున్న చెన్నకేశవ ఆర్డర్ నిర్దారించాడని ఒకటి నొక్కండి, లేకుంటే రెండు నొక్కండి అంటూ వచ్చింది. దీంతో అతడు ఆర్డర్ చేసుకోలేదు కాబట్టి ఒకటి నొక్కాడు. ఈ క్రమంలోనే అకౌంట్ వెరిఫికేషన్ కోసం ఓటీపీని అందించాలని వాయిస్ మెసేల్ ద్వారా అడగటంతో ఆ వివరాలు ఎంటర్ చేసాడు. కానీ మళ్ళీ ఓటీపీలు, కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఇలా మొత్తానికి అతని ఖాతా నుంచి ఏకంగా సైబర్ నేరగాళ్లు రూ. 38,720 ఖర్చు చేసినట్లు తెలుసుకున్నాడు. ఇదీ చదవండి: ఇలా ఎలా అనిపించిన ఓలా.. జరిగిన మోసాన్ని గ్రహించిన చెన్నకేశవ వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు అతని Swiggy ఖాతాలోకి లాగిన్ చేయడానికి ప్రయత్నించినప్పుడు, హిస్టరీ వివరాలు మొత్తం డిలీట్ చేసినట్లు కనిపించింది. ఈ సంఘటనపై స్విగ్గీని కూడా సంప్రదించారు. దీనిపైన సమగ్ర విచారణ జరపడానికి కొంత సమయం అవసరమని, అప్పటి వరకు చెన్నకేశవ స్విగ్గీ అకౌంట్ బ్లాక్ చేయడం ద్వారా లేజీపే ముందస్తు చర్యలు చేపట్టి తదుపరి అనధికార మినహాయింపులను నిరోధించింది. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి సంఘటనలు ఎవరికైనా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. తప్పకుండా స్విగ్గీ యూజర్స్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. -
జోడీల ముసుగులో కేడీలు
(బీవీ రాఘవరెడ్డి): అప్పట్లో పెళ్లిళ్ల పేరయ్యలు, ఆ మ్యారేజి బ్యూరోలు సంబంధాలు కుదర్చటంలో ముఖ్య పాత్ర పోషించగా టెక్నాలజీ పెరిగాక వెబ్సైట్లు, యాప్‌లు వచ్చేశాయి. కాలికి బలపం కట్టుకుని తిరిగే పని లేకుండా ఇంట్లో కూర్చుని ఇంటిల్లిపాదీ తిలకించేలా చౌకగా సేవలందిస్తున్నాయి. దేశంలో ప్రముఖ పెళ్లిళ్ల వెబ్సైట్లను పరిశీలిస్తే భారత్ మ్యాట్రిమోనికి కోటి మందికి పైగా వినియోగదారులున్నారు. మ్యాచ్‌ఫైండర్ మ్యాట్రిమోనిలో రెండు వేల ప్రాంతాలకు చెందిన యువతీ యువకులు రిజిస్టర్ చేసుకున్నారు. 2002లో ప్రారంభించిన ఫ్రీ వెబ్సైట్ వివాహ్ డాట్‌కామ్ ఉచితంగానే సేవలందిస్తోంది. వెబ్గేట్ డాట్‌కామ్ రోజుకు 600 మందికి పైగా ఖాతాదారులకు సేవలు అందిస్తున్నట్లు చెబుతోంది. 1996లో ప్రారంభమైన షాదీ డాట్‌కామ్ దేశంలోనే మొదటిదిగా చెబుతారు. కమ్యూనిటీ మ్యాట్రిమోనికి దేశంలో 140 శాఖలున్నాయి. డైవర్సీ మ్యాట్రిమోని యాప్‌ను 5 లక్షల మంది డౌన్లోడ్ చేసుకుని ఉపయోగిస్తున్నారు. వెబ్సైట్ నిర్వాహకుల్లో కొందరు ఉచితంగా సేవలందిస్తుంటే మిగిలిన వారు రూ.500 నుంచి రూ.5,000 వరకు వసూలు చేస్తున్నారు. మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫీజు చెల్లిస్తే సరైన జోడీని వెతికి పెడతామంటున్నారు. విద్యార్హతలు, ఉద్యోగం, ఇష్టాయిష్టాలు, కుల గోత్రాలు, జాతకచక్రాలు, ఆర్థిక స్థితి, కుటుంబ నేపథ్యం లాంటి వివరాలన్నీ ఫొటోలు, ఫోన్ నంబర్లతో సహా వెబ్సైట్లు అందుబాటులో ఉంచుతున్నాయి. యువతీ యువకుల ప్రాధాన్యతలకు అనుగుణంగా పర్ఫెక్ట్ మ్యాచ్‌లను సూచిస్తున్నాయి. మ్యాట్రిమోనీ వెబ్‌సైట్స్‌లో అబ్బాయిల కంటే అమ్మాయిలే చురుగ్గా ఉంటున్నారు. ఆచి తూచి అడుగేయాల్సిందే... ఇదంతా ఒకఎత్తు కాగా పెళ్లిళ్ల వెబ్సైట్లను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న కేసులు పెరుగుతున్నాయి. నకిలీ ప్రొఫైల్స్, ఫొటోలతో రిజిస్టర్ చేసుకుని అమాయకులను మోసగిస్తున్నారు. మార్ఫింగ్ సర్టిఫికెట్లు అప్లోడ్ చేసి కొందరు కేటుగాళ్లు టోకరా వేస్తున్నారు. వివరాలు సేకరించి బహుమతులు పంపి ఎర వేస్తుంటారు. లైంగిక దాడులకు పాల్పడుతున్న ఘటనలూ వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి వాటి బారిన పడకుండా అప్రమత్తత అవసరం. సమాచారం కోసమే మ్యాట్రిమోని సైట్లను ఉపయోగించుకోవాలి. పెద్దల ద్వారా ప్రత్యక్షంగా పూర్తి వివరాలు నిర్ధారించుకున్న తర్వాతే ఒక నిర్ణయానికి రావాలి. ఫోన్ చేసి డబ్బులు అడగడం, వ్యక్తిగత ఫొటోలు పంపమనటం, హోటళ్లకు రావాలని కోరితే సందేహించాల్సిందే. ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ఖాతాలను క్షుణ్నంగా పరిశీలించాలి. అమెరికా వెళ్దామని.. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలోని రామిరెడ్డిపేటకు చెందిన రజని (పేరు మార్చాం) భర్తతో మనఃస్పర్థల కారణంగా విడాకులు తీసుకుంది. ఓ మ్యాట్రిమోని వెబ్సైట్ ద్వారా కొచ్చర్ల శ్రీకాంత్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుని అమెరికా వెళ్దామని చెప్పడంతో నమ్మింది. వీసా కావాలంటే బ్యాంకు ఖాతాలో పెద్ద మొత్తంలో డబ్బులు ఉండాలంటూ విడతల వారీగా రూ.48 లక్షలు కాజేసి ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు కాకినాడకు చెందిన వంశీకృష్ణగా గుర్తించారు. బీఫార్మసీ చదివి వ్యసనాలకు బానిసై మోసాల బాట పట్టాడు. అతడిపై హైదరాబాద్, రామగుండం, రాజమహేంద్రవరం, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో 2009 నుంచి 16కిపైగా చీటింగ్ కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకుని అమెరికా పేరుతో రూ.17.5 లక్షలు స్వాహా చేశాడు. ఈ ఏడాది జనవరి 30న పోలీసులు అరెస్టు చేయగా బెయిల్‌పై విడుదలై తిరిగి అదే పంథాలో నరసరావుపేట మహిళను మోసగించి పరారయ్యాడు. సంపన్న మహిళలపై వల మ్యాట్రిమోనియల్ సైట్ల ద్వారా 40 మంది మహిళలను మోసగించిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పేరుతో తన వద్ద రూ.2.25 లక్షలు కాజేసినట్లు యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విశాల్ సురేశ్ చవాన్ అలియాస్ అనురాగ్ చవాన్(34) మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్స్‌లో నకిలీ ఖాతాలు సృష్టించి సంపన్న మహిళలపై వల విసిరాడు. ఖరీదైన ఐ ఫోన్లను బహుమతిగా పంపి ఆకట్టుకునేవాడు. పెట్టుబడుల పేరుతో డబ్బులు కాజేయడంతోపాటు, కొందర్ని హోటళ్లకు రప్పించుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడు. మత్తుమందు ఇచ్చి.. పెళ్లిళ్ల వెబ్సైట్ల ద్వారా 12 మంది మహిళలను ఆకర్షించి లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఓ మెకానికల్ ఇంజనీర్‌ను ముంబై పోలీసులు 2021 జూన్ 8న అరెస్టు చేశారు. మహేశ్ అలియాస్ కరణ్ గుప్తా మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లలో నకిలీ ప్రొఫైల్స్‌తో రిజిస్టర్ చేసుకున్నాడు. మహిళలతో ఫోన్లో మాట్లాడి పబ్‌లు, రెస్టారెంట్లకు ఆహ్వానించేవాడు. మత్తుమందు కలిపిన డ్రింక్ తాగించి లైంగిక వేధింపులకు పాల్పడేవాడని వెల్లడైంది. హ్యాకర్‌గా పనిచేసిన అనుభవంతో తెలివిగా నేరాలకు పాల్పడేవాడు. గిఫ్ట్‌లు పంపి.. విశాఖకు చెందిన మీనాక్షి (పేరు మార్చాం) భర్త చనిపోవడంతో మాట్రిమోనీ డాట్‌కామ్ ద్వారా అమెరికాలోని ఓ సా‹ఫ్ట్‌వేర్ ఇంజనీర్‌తో పరిచయం పెంచుకుంది. అమెరికా నుంచి పలుసార్లు గిఫ్్టలు కూడా ఆమెకు అందాయి. కొన్నాళ్ల తర్వాత అత్యవసరమని చెప్పడంతో బాధితురాలు రూ.50 లక్షలు అతడికి ట్రాన్స్ఫర్ చేసింది. ఆ తర్వాత నుంచి నిందితుడి ఫోన్ పనిచేయలేదు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
నయా ‘ఆన్లైన్’ మోసం
దొండపర్తి (విశాఖ దక్షిణ): ‘హలో సర్.. ఆన్లైన్లో మీరు పెట్టిన ఆర్డర్ వచ్చింది. కేవలం రూ.270 చెల్లించండి’ అంటూ విశాఖపట్నం ఉషోదయ జంక్షన్లో నివాసముంటున్న ఒక మహిళకు ఫోన్ వచ్చింది. ఆర్డర్ ఇవ్వలేదని చెప్పినా.. తక్కువ ధరకు ప్రొడక్ట్ వచ్చిందని చెప్పడంతో ఆమె కొరియర్‌ను తీసుకున్నారు. డబ్బులు చెల్లించాక కొరియర్‌ను తెరిచి చేస్తే అందులో పాత డ్రెస్ ఉంది. వెంటనే బిల్‌పై ఉన్న కస్టమర్ కేర్‌కు ఫోన్ చేయగా.. విషయం చెప్పకముందే ఫోన్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి మాట్లాడుతూ.. ‘మీ ఐటెమ్‌ను తిరిగి ఇచ్చేయాలనుకుంటున్నారా? మీ ఫోన్ నంబర్‌కు లింక్ పంపిస్తున్నాం. అది ఓకే చేస్తే అమౌంట్ మీకు తిరిగొస్తుంది’ అని చెప్పాడు. అసలు విషయం చెప్పకముందే సదరు వ్యక్తి అలా చెప్పే సరికి ఆమెకు అనుమానం వచ్చింది. లింక్ క్లిక్ చేస్తే ఫోన్ హ్యాక్ అవుతుందని భావించి వెంటనే ఆమె సోమవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నగరంలోకి బిహార్ గ్యాంగ్! ఆన్లైన్ లోన్ యాప్‌లు, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, డేటింగ్ యాప్‌ల ద్వారా ఫ్రెండ్ రిక్వెస్ట్ లింక్‌లు.. ఇలా అనేక మార్గాల్లో దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ఆన్లైన్ కేటుగాళ్లు ప్రజలను నిలువునా దోచుకుంటున్నారు. తాజాగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తరహాలో ఆన్లైన్ ఆర్డర్, కొరియర్ పేరుతో ప్రజలను దోచుకోడానికి కొత్త పంథాను ఎంచుకున్నారు. బిహార్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన గ్యాంగ్ నగరంలోనే తిష్టవేసి.. ఆన్లైన్లో ఆర్డర్స్ పేరుతో బుక్ చేసుకోకపోయినా ఫోన్లు చేసి కొరియర్‌ను అందిస్తున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు విశాఖ నగరంలో ఒక ప్లాట్‌లో ఉంటున్న ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పూర్తి స్థాయి విచారణ చేయాల్సి ఉందని.. ఈ ఆరుగురికి కొరియర్ మోసాలతో సంబంధం ఉందో, లేదో విచారణలో తేలుతుందని అంటున్నారు. కొరియర్లో పనికిరాని వస్తువులు కొరియర్‌ను తెరిచి చూస్తే అందులో వాడేసిన బట్టలు, పగిలిపోయిన చిన్న చిన్న వస్తువులు ఉంటున్నాయి. ఇటువంటివి డెలివరీ అయితే డబ్బులు చెల్లించిన వారు తప్పకుండా కస్టమర్ కేర్‌కు ఫోన్ చేయడం సర్వసాధారణం. ఆ గ్యాంగ్‌కు కావాల్సింది కూడా ఇదే. అలా కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసిన వెంటనే.. ఎటువంటి సమాచారం అడగకుండానే.. ‘మీ ఆర్డర్‌ను రిటర్న్ ఇచ్చేస్తున్నారా? మీకు లింక్ పంపిస్తాం. దాన్ని క్లిక్ చేస్తే మీ డబ్బులు రిఫండ్ అయిపోతాయి’ అని సమాధానమిస్తున్నారు. ఒకవేళ ఆ లింక్‌ను క్లిక్ చేస్తే బ్యాంక్ ఖాతా ఖాళీ అయిపోతుంది. ఆన్లైన్ మోసాలతో పాటు ఆర్డర్ చేయకుండా వచ్చే కొరియర్ల విషయంలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ భవానీ ప్రసాద్ సూచించారు. -
సరికొత్త ఆన్లైన్ మోసం.. ఈ యాప్ డౌన్లోడ్ చేస్తే ఇక అంతే సంగతులు!
ఆన్లైన్లో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, సైబర్ సెక్యూరిటీ నిపుణులు, మీడియా ఎంత చెబుతున్నా కొందరు అస్సలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో దేశంలో చాలా మంది డబ్బు నష్టపోతున్నారు. ఫోన్లో బ్యాంకు వివరాలు అడిగే వారికి ఎలాంటి సమాచారం ఇవ్వరాదని ముఖ్యంగా ఎటిఎం కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలు అసలే తెలుపవద్దని వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా ఎంత ప్రచారం చేస్తున్న అమాయకులు సైబర్ నేరగాళ్ల బారినపడి ఆన్లైన్ మోసాలకు గురవుతునే ఉన్నారు. తాజాగా మరోసారి హ్యాకర్లు స్మార్ట్ ఫోన్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకోమని అడుగుతున్న కొత్త ఆన్లైన్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. హ్యాకర్లు ప్రజలను మోసగించడానికి, వారి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బును దొంగిలించడానికి కొత్త మార్గాలతో ముందుకు వస్తున్నారు. ఈ కొత్త డిజిటల్ మోసాన్ని మొదట జర్నలిస్ట్ విశాల్ కుమార్ నివేదించారు. తన స్వంత అనుభవాలను పంచుకున్న కుమార్ హ్యాకర్లు తనను ఏ విధంగా మోసం చేయలని చూశారో పేర్కొన్నారు. ఈ ఆన్లైన్ స్కామ్ ప్రకారం.. మొదట హ్యాకర్లు మీ సిమ్ కార్డ్ డాక్యుమెంటేషన్ అసంపూర్ణంగా ఉందని, వెంటనే వివరాలను పంచుకోవాలని లేకపోతే 24 గంటల్లోగా సేవలు డీయాక్టివేట్ చేయనున్నట్లు ఒక సందేశాన్ని ప్రజలకు పంపుతారు. వాస్తవానికి, అది హ్యాకర్లు పంపిన నకిలీ సందేశం మాత్రమే. ఈ నకిలీ యాప్స్ డౌన్లోడ్ చేయలని ప్రజలను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ యాప్స్ బ్యాక్ గ్రౌండ్ లో మీ వివరాలను సేకరిస్తాయి. అందులో ఇచ్చిన ఒక నెంబర్ కి చేయాలి మెసేజ్ సూచిస్తుంది. కుమార్ ఆ కస్టమర్ కేర్ నెంబరుకు డయల్ చేశాడు. అప్పుడు ఆ నకిలీ కస్టమర్ Any Remote DeskTop అనే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని హ్యాకర్ సూచించినట్లు చెప్పాడు. అయితే, ఈ యాప్ ద్వారా అవతలి వ్యక్తి మీ స్క్రీన్ నమోదు చేసే వివరాలు మొత్తం చూసే అవకాశం ఉంది. మీరు గనుక డబ్బులు చెల్లించడానికి ఆ సమయంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యం వినియోగిస్తే ఆ వివరాలు హ్యాకర్స్ చేతికి చిక్కే అవకాశం ఉంది. అందుకని, కస్టమర్, ఈ-కెవైసీ పేరుతో ఎవరైనా కాల్ చేసిన, మెసేజ్ పంపిన వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. (చదవండి: టెలిగ్రామ్ యాప్ సర్వర్ డౌన్..!) -
మాజీ సీజేఐకి రూ. లక్ష టోకరా
న్యూఢిల్లీ : అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిన నేటి డిజిటల్ యుగంలో ఆన్లైన్ మోసాలు పెచ్చుమీరుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ప్రతీ ఒక్కరూ హ్యాకర్స్ బారిన పడుతూ అకౌంట్లు గుల్ల చేసుకుంటున్నారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎం లోధా కూడా తాజాగా ఈ జాబితాలో చేరిపోయారు. ఏకంగా మాజీ సీజేఐ లావాదేవీలపై కన్నేసిన హ్యాకర్స్.. ఆయన ఫ్రెండ్స్ లిస్టులోని జస్టిస్ బీసీ సింగ్ ఈ- మెయిల్‌ను హ్యాక్ చేసి లోధా నుంచి లక్ష రూపాయలు దోచుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఢిల్లీ సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ట్రీట్మెంట్ కోసం డబ్బు కావాలని.. ‘ ఏప్రిల్ 19న బీపీ సింగ్ నుంచి నాకు ఈ-మెయిల్ వచ్చింది. తన సోదరుడి చికిత్స కోసం లక్ష రూపాయలు కావాలని అడిగారు. ఈ విషయం గురించి మాట్లాడాలని ఫోన్ చేసినా ఎత్తలేదు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో ఉన్నారు కదా అని వెంటనే లక్ష రూపాయలు ఆన్లైన్ ద్వారా(రెండు విడతల్లో) పంపించాను’ అని జస్టిస్ లోధా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయం గురించి దక్షిణ ఢిల్లీ ఏసీపీ మాట్లాడుతూ..‘ జస్టిస్ బీపీ సింగ్ తన ఈ మెయిల్ అకౌంట్ హ్యాక్ అయిన విషయాన్ని గుర్తించారు. ఈ క్రమంలో తన అకౌంట్ నుంచి ఆర్ఎం లోధాకు వెళ్లిన మెసేజ్‌ల వల్ల ఆయన మోసపోయారని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా లోధాకు సూచించారు. దీంతో జస్టిస్ లోధా మమ్మల్ని ఆశ్రయించారు. చీటింగ్, ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసుకుని..సైబర్ క్రైమ్ బ్రాంచ్ టీం విచారణ జరుపుతున్నారు’ అని తెలిపారు. -
ఆన్లైన్ స్కామ్‌తో ‘కొంప’ కొల్లేరయింది
లండన్: 28 ఏళ్ల సారా, 34 ఏళ్ల రిట్చీ ఇటీవలనే పెళ్లి చేసుకున్నారు. వారు అందరిలాగానే సొంతింటి కళలు కన్నారు. హార్ట్ఫోర్డ్షైర్లోని బిషప్స్ స్టార్ట్ఫోర్డ్ ప్రాంతంలో ఓ త్రిబుల్ బెడ్ రూమ్ ఇంటిని కొనాలనుకున్నారు. ఇదే లక్ష్యంతోని ఓ దశాబ్దకాలంగా వారు పైసా పైసా కూడబెడుతూ వచ్చారు. మధ్యవర్తులైన ‘అడ్వాంటేజ్ ప్రాపర్టీ లాయర్స్’ను సంప్రదించారు. పెళ్లైన కొత్త జంటకు, ప్రాపర్టీ లాయర్లకు మధ్య ఇల్లు కొనుగోలుకు సంబంధించి ఈ మెయిల్స్ రూపంలో లావాదేవీలు నడిచాయి. చివరకు బేరం కుదిరింది. గత డిసెంబర్ రెండో వారంలో దాదాపు రెండు కోట్ల రూపాయల ఇల్లుకు అడ్వాన్స్ కింద 45 లక్షల రూపాయలను చెల్లించాల్సిందిగా ‘అడ్వాంటేజ్ ప్రాపర్టీ లాయర్స్’ సంస్థ నుంచి ఇంటి కొనుగోలు వ్యవహారాలను స్వయంగా చూస్తున్న సారాకు ఈ మెయిల్ వచ్చింది. ఆ మరుసటి రోజే, అంటే డిసెంబర్ 17వ తేదీన ప్రాపర్టీ లాయర్ల సంస్థ నుంచి మరో ఈ మెయిల్ వచ్చింది. తాము ఇంతకుముందు పంపించిన బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఆడిటింగ్‌లో ఉందని, ఇప్పడిస్తున్న కొత్త అకౌంట్ నెంబర్‌కు డబ్బును బదిలీ చేయాల్సిందిగా ఆ మెయిల్లో ఉంది. దాని ప్రకారమే సారా 45 లక్షల రూపాయలను బార్క్లేస్ బ్యాంక్ బ్రాంచ్‌కు బదిలీ చేసింది. ఇక సారా, రిట్చీలు కొత్తింట్లోకి ప్రవేశించేందుకు ముహూర్తం చూసుకుంటున్నారు. ఇంతలో ప్రాపర్టీ లాయర్ల సంస్థ నుంచి మళ్లీ మెయిల్ వచ్చింది. ఇంతవరకు తమకు అడ్వాన్స్ డబ్బులు ముట్టలేదని, త్వరగా పంపించాలన్నది ఆ మెయిల్ సారాంశం. సారాకు, సంస్థ ప్రతినిధులకు మధ్య వాదోపవాదాలు జరిగినంతరం అసలు మోసం తెల్సింది. కొనుగోలు దారులు, ప్రాపర్టీ లాయర్ల మధ్య నడిచిన లావాదేవీలకు సంబంధించిన ఈ మెయిళ్లను దుండగులు హ్యాక్ చేశారు. ప్రాపర్టీ సంస్థ తరఫున దొంగ మెయిల్స్ పంపించి సారా జంట కొంప ముంచారు. జరిగిన మోసానికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన సారా వారి సాయంతో బ్యాంక్ బ్రాంచికి వెళ్లి ఎంక్వైరీ చేశారు. ఆమె ఖాతాలో మిగిలిన మొత్తాన్ని స్తంభింపచేసిన బ్యాంక్ అధికారులు దొంగ ఖాతాదారులు ఒకే రోజు మూడు బ్రాంచ్‌ల నుంచి వీలైనంత మేరకు పెద్ద మొత్తాలను డ్రాచేసి ఉడాయించారని చెప్పారు. పోయిన సొమ్ముకు తామే మాత్రం బాధ్యత వహించలేమని, ఖాతాలు సవ్యంగా నడుస్తున్నప్పుడు కొంత మంది దుర్బుద్ధితో ఇలాగా మోసం చేస్తారని భావించలేంగదా! అన్నది వారి సమాధానం. దొంగ ఖాతాలను మూసివేయడానికి ఎప్పటికప్పుడు కృషి చేస్తున్నా ఆన్లైన్లో ఇలాంటి మోసాలు జరుగుతుంగే తాము మాత్రం ఏం చేయలమని, సానుభూతి చూపించడం తప్పా అన్నది వారి వివరణ. ఇలాంటి నేరాలను పరిశోధించే నిఘా విభాగానికి వెళ్లి ఐటీ నిపుణులతో ఈ మెయిళ్లు ఎక్కడి నుంచి జనరేట్ అయ్యాయో కనుగొనేందుకు సారా దంపతులు ప్రయత్నించారు. ఇందులో దొంగ మెయిళ్లు ఉన్నట్లు కనిపించడం లేదన్నారు. పోలీసులు మళ్లీ వెళ్లి ప్రాపర్టీ లాయర్ల సంస్థకు వెళ్లి ఎంత విచారించినా ఆ సంస్థ సిబ్బంది హస్తం ఉన్నట్లు ఆధారాలు దొరకలేదు. బాధితులే తమ కంప్యూటర్ వ్యవస్థ, ఈ మెయిళ్లు భద్రంగా ఉన్నాయో, లేవో చూసుకోవాలని, లావాదేవీలు, ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలప్పుడు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని, ఫోన్ ద్వారా కూడా ముందుగా ధ్రువీకరించుకోవాలని బ్యాంక్, పోలీసు అధికారులు, ప్రాపర్టీ సంస్థ ఉద్యోగులు ఉచిత సలహా ఇచ్చారు. ఇలాంటి మోసాలు కూడా జరగుతాయని తామెన్నడు ఊహించలేదని ఓ కంపెనీలో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న సారా, ఓ వైన్ కంపెనీకి డెరైక్టర్‌గా పనిచేస్తున్న రిట్చీ ఆవేదన వ్యక్తం చేశారు. బంధు మిత్రులెవరైనా అప్పిస్తే ఇల్లు కొంటామని, లేకపోతే ఇల్లు గురించి మరచిపోతామని అన్నారు. -
క్లిక్ క్లిక్‌లో కిటుకు
* అశ్లీలంతో ఎర * సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ * ‘కార్డ్’ సమాచారం తస్కరణ * ఆన్లైన్ ద్వారానే టోకరా సాక్షి,సిటీబ్యూరో: నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) ఆధీనంలో ఉన్న సైబర్‌క్రైమ్ పోలీసులకు ఇటీవల ఓ ఫిర్యాదు అందింది. తమిళనాడులో ఉంటున్న నగరానికి చెందిన ఓ యువకుడి ఖాతా నుంచి రూ.10లక్షలు గోల్మాల్ అయ్యాయన్నది దాని సారాంశం. ప్రాథమికంగా దర్యాప్తు చేపట్టిన అధికారులు అతగాడు ఓ అశ్లీల వెబ్సైట్లోకి లాగిన్ కావడంతో ఈ మోసం చోటుచేసుకుందని గుర్తించారు. క్రెడిట్,డెబిట్ కార్డులకు సంబంధించిన వ్యక్తిగత వివరాలతోపాటు నెట్ బ్యాంకింగ్‌కు ఉపకరించే రహస్య అంశాలను తస్కరించేందుకు సైబర్ నేరగాళ్లు అశ్లీలంతో ఎరవేస్తున్నారని పోలీసులు గుర్తించారు. రహస్య వివరాలు తస్మాత్ జాగ్రత్త :ఓ వ్యక్తికి చెందిన సొమ్మును ఆన్లైన్లో స్వాహా చేయడానికి సైబర్‌నేరగాళ్లకు అతడి క్రెడిట్/డెబిట్ కార్డుకు చెందిన నెంబర్, సీవీవీ కోడ్‌లతోపాటు కొన్ని వ్యక్తిగత వివరాలూ అవసరం. ఇంటర్నెట్ బ్యాంకింగ్‌కు సంబంధించి లాగిన్ ఐడీ, పాస్వర్డ్ కచ్చితంగా ఉండాల్సిందే. ఇవిలేకుండా ఫ్రాడ్‌కు పాల్పడటం సాధ్యం కాదు. గతంలో ఈ వివరాల కోసం సైబర్ నేరగాళ్లు వివిధ పేర్లు, వెరిఫికేషన్లు అంటూ ఫోన్లు చేయడం, మెయిల్స్ పంపడంతోపాటు సూడో సైట్లు సృష్టించేవారు. ఇప్పుడు రూటు మార్చి ‘అశ్లీలందారి’ పట్టారు. టార్గెట్ యూతే: ఈ వ్యవహారంలో సైబర్ నేరగాళ్ల వలలో ఎక్కువగా యువకులే పడుతున్నారు. వీరిని టార్గెట్‌గా చేసుకుని ఆకర్షించేందుకు కొన్ని అశ్లీల వెబ్సైట్లను రూపొం దిస్తున్నారు. దీని సమాచారం, అర్ధనగ్న, నగ్నచిత్రాలతో కూడిన చిత్రాలను వివిధ సామాజిక నెట్వర్కింగ్ సైట్లతోపాటు వెబ్సైట్లకు లింక్ చేసి అప్లోడ్ చేస్తున్నారు. వీటిని ఆకర్షితులవుతున్న యువత క్లిక్ చేయగా..అందులో పొందుపరిచిన వీడియోలు, ఫొటోలు ఓపెన్ కావాలన్నా కొంత మొత్తం రుసుం చెల్లించాలంటూ ప్రత్యేకలింకు ఏర్పాటు చేస్తున్నారు. ఇలా లాగిన్ కావడానికి, వీడియోలు-ఫొటోలు చూడటానికి కార్డులు, నెట్ బ్యాంకింగ్ ద్వారా నగదు చెల్లించి సభ్యత్వం తీసుకోవాలని అక్కడ ఉంటోంది. దీంతో ‘కార్డుల’ వివరాలు, నెట్‌బ్యాంకింగ్‌కు సంబంధించిన సమాచారాన్ని ‘వినియోగదారులు’ అందులో పూరిస్తున్నారు. ఈ వివరాలన్నీ నేరుగా సైబర్‌నేరగాళ్లకు చేరిపోవడంతో వాటిని వినియోగించి తేలిగ్గా ఖాతాలు ఖాళీ చేయడమో, ఆన్లైన్ షాపింగ్చేసి ‘కార్డు’లకు చిల్లుపెట్టడమో చేస్తున్నారు. ఈ నేరాలకు పాల్పడే వారు వినియోగిస్తున్న సర్వర్లు విదేశాల్లో ఉంటుండడంతో వారికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడం అసాధ్యమవుతోంది. అలాంటి వారికి నైతికత ఉండదు ‘ఆన్లైన్ షాపింగ్, చెల్లింపులు చేసేప్పుడు పూర్తి నమ్మకమైన సైట్ల ద్వారానే చేపట్టాలి. అశ్లీల సైట్లు నిర్వహించే వారికి నైతికత ఉండదన్నది గుర్తుంచుకోండి. అలాంటి వాళ్లు మీ కార్డులకు సంబంధించిన, ఆన్లైన్ ఖాతాల వివరాలు తెలిస్తే కచ్చితంగా దుర్వినియోగం చేస్తారు. అప్రమత్తంగా ఉండడం వల్లే సైబర్ నేరగాళ్లను కట్టడి చేయొచ్చు’ - జి.పాలరాజు, డీసీపీ,సీసీఎస్