2023 నవంబర్ నెలలో ప్రముఖ మెసేజింగ్ యాప్ 'వాట్సాప్' భారతదేశంలో ఏకంగా 71 లక్షల అకౌంట్స్ నిషేధించింది. పెరుగుతున్న ఆన్‌లైన్ స్కామ్‌లను తగ్గించడంలో భాగంగా సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
2021 కొత్త ఐటీ రూల్స్‌ని దృష్టిలో ఉంచుకుని యూజర్స్ నుంచి స్వీకరించిన వినతుల కారణంగా వాట్సాప్ 71 లక్షల అకౌంట్స్ మీద నిషేధం విధించింది. యూజర్ రిపోర్ట్‌లు రాకముందే కంపెనీ నవంబర్ 1 నుంచి 30 వరకు 19,54,000 ఖాతాలను ముందస్తుగా నిషేధించింది. దీనికి ప్రధాన కారణం సంస్థ నిబంధనలను అతిక్రమించడమే.
గత నవంబర్‌లో యూజర్ల నుంచి వాట్సప్ 8841 వినతులను అందుకుంది. ఇందులో స్పామ్ ఖాతాలకు సంబంధించిన కంప్లైంట్స్ వంటివి ఉన్నాయి. 'అకౌంట్స్ యాక్షన్డ్' కింద వాట్సాప్ ఖాతాలను బ్యాన్ చేయడం లేదా పునరుద్ధరించడం వంటివి చేస్తుంది. దీనితో పాటు, మిలియన్ల మంది భారతీయ సోషల్ మీడియా వినియోగదారులు లేవనెత్తిన ఆందోళనలను పరిష్కరించడానికి కేంద్రం గ్రీవెన్స్ అప్పీలేట్ కమిటీ (GAC)ని ప్రవేశపెట్టింది.
ఇదీ చదవండి: అమితాబ్ బచ్చన్ ఆస్తులు అద్దెకు - సంవత్సరానికి అన్ని కోట్లా..
వాట్సాప్ తప్పుడు సమాచార వ్యాప్తిని, వ్యక్తిగత డేటాకు భంగం కలగకుండా మెటా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే కంపెనీ రూల్స్ అతిక్రమించిన వారి అకౌంట్స్ నిషేధిస్తోంది, రానున్న రోజుల్లో మరింత పటిష్టమైన భద్రతను అందించడానికి ఏఐ వంటి ఆధునిక టెక్నాలజీతో పనిచేయడానికి సన్నద్ధమవుతున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment