ప్రముఖ మెసేజింగ్ యాప్ 'వాట్సాప్' సెప్టెంబర్ నెలలో భారతదేశంలోని 85 లక్షల కంటే ఎక్కువ ఖాతాలను నిషేధించినట్లు తెలిపింది. ఇందులో సుమారు 16,58,000 ఖాతాలపైన ఎలాంటి ఫిర్యాదులు లేకపోయినప్పటికీ.. ఐటీ రూల్స్ ఉల్లంఘించిన కారణంగా చర్యలు తీసుకుంది.
భారతదేశంలో సుమారు 600 మిలియన్ల కంటే ఎక్కువ మంది వాట్సాప్ ఉపయోగిస్తున్నట్లు సమాచారం. నియమాలకు ఉల్లంఘించిన ఖాతాదారుల అకౌంట్లను వాట్సాప్ ఎప్పటికప్పుడు నిషేధిస్తూ ఉంది. ఇందులో భాగంగానే గత నెలలో భారీగా సంఖ్యలో ఖాతాలను నిషేధించింది.
ఇదీ చదవండి: తండ్రి నుంచి అప్పు తీసుకుని మరీ!! మకుటం లేని మహరాజుగా ఎదిగి..
మోసం లేదా తప్పుడు సమాచారం చేరవేయడం.. వంటి చర్యలకు పాల్పడిన యూజర్లపైన వాట్సాప్ చర్యలు తీసుకుంటోంది. గత ఆగస్టు నెలలో కూడా వాట్సాప్ 84.58 లక్షల ఖాతాలను వాట్సాప్ నిషేదించింది. దీన్ని బట్టి చూస్తే.. రాబోయే రోజుల్లో కూడా నియమాలను అతిక్రమించిన వారి ఖాతాలను వాట్సాప్ తొలగించనున్నట్లు స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment