accounts
-
85 లక్షల ఖాతాలపై నిషేధం!.. వాట్సప్ కీలక నిర్ణయం
ప్రముఖ మెసేజింగ్ యాప్ 'వాట్సాప్' సెప్టెంబర్ నెలలో భారతదేశంలోని 85 లక్షల కంటే ఎక్కువ ఖాతాలను నిషేధించినట్లు తెలిపింది. ఇందులో సుమారు 16,58,000 ఖాతాలపైన ఎలాంటి ఫిర్యాదులు లేకపోయినప్పటికీ.. ఐటీ రూల్స్ ఉల్లంఘించిన కారణంగా చర్యలు తీసుకుంది.భారతదేశంలో సుమారు 600 మిలియన్ల కంటే ఎక్కువ మంది వాట్సాప్ ఉపయోగిస్తున్నట్లు సమాచారం. నియమాలకు ఉల్లంఘించిన ఖాతాదారుల అకౌంట్లను వాట్సాప్ ఎప్పటికప్పుడు నిషేధిస్తూ ఉంది. ఇందులో భాగంగానే గత నెలలో భారీగా సంఖ్యలో ఖాతాలను నిషేధించింది.ఇదీ చదవండి: తండ్రి నుంచి అప్పు తీసుకుని మరీ!! మకుటం లేని మహరాజుగా ఎదిగి..మోసం లేదా తప్పుడు సమాచారం చేరవేయడం.. వంటి చర్యలకు పాల్పడిన యూజర్లపైన వాట్సాప్ చర్యలు తీసుకుంటోంది. గత ఆగస్టు నెలలో కూడా వాట్సాప్ 84.58 లక్షల ఖాతాలను వాట్సాప్ నిషేదించింది. దీన్ని బట్టి చూస్తే.. రాబోయే రోజుల్లో కూడా నియమాలను అతిక్రమించిన వారి ఖాతాలను వాట్సాప్ తొలగించనున్నట్లు స్పష్టమవుతోంది. -
నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కొత్త మైలురాయి
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదైన మొత్తం క్లయింట్ ఖాతాల సంఖ్య 20 కోట్ల మార్కును దాటింది. డిజిటల్ పరివర్తన, నూతన సాంకేతిక ఆవిష్కరణలు ఇందుకు కారణమని సంస్థ తెలిపింది. ఎనిమిది నెలల క్రితం 16.9 కోట్ల స్థాయిలో ఉండగా స్వల్ప వ్యవధిలోనే ఈ మైలురాయిని దాటినట్లు పేర్కొంది.ఇదీ చదవండి: ఎన్ఎస్ఈ కొత్త యాప్.. తెలుగులోనూ వెబ్సైట్భారత వృద్ధి గాథపై ఇన్వెస్టర్లకున్న పటిష్టమైన విశ్వాసానికి ఇది నిదర్శనమని ఎన్ఎస్ఈ చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీరామ్ కృష్ణన్ తెలిపారు. మహారాష్ట్ర నుంచి అత్యధికంగా 3.6 కోట్ల ఖాతాలు ఉండగా, ఉత్తర్‌ప్రదేశ్ (2.2 కోట్లు), గుజరాత్ (1.8 కోట్లు), చెరి 1.2 కోట్ల ఖాతాలతో రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. -
ప్రపంచంలోనే ఎక్స్‌లో అత్యధిక ఫాలోవర్లు వీరికే (ఫొటోలు)
-
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
సాక్షి,హైదరాబాద్: ఐదు ఎకరాల కంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం సోమవారం(మే 6)రైతు బంధు నిధులు విడుదల చేసింది. రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకుగాను రూ.2 వేల కోట్ల దాకా ప్రభుత్వం విడుదల చేసినట్లు సమాచారం. మూడు రోజుల్లో మొత్తం రైతుబంధు చెల్లింపు ప్రక్రియ పూర్తవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఐదు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకు రైతు బంధు నిధులు ఇప్పటికే విడుదల చేశారు. తాజాగా ఐదెకరాల పైన ఉన్నవారికి నగదు బదిలీ ప్రారంభించారు. -
భారత అంతర్గత వ్యవహరాలపై స్పందించిన యూఎన్ఓ
న్యూయార్క్: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, లోక్ సభ ఎన్నికలకు ముందు ఐటీ విభాగం కాంగ్రెస్ పార్టీ ఖాతాలను ఫ్రీజ్ చేయటం వంటి అంశాలపై తాజాగా ఐక్యరాజ్యసమితి (యూఎన్ఓ)స్పందించింది. అయితే ఇటీవల ఈ విషయాలపై అమెరికా స్పందించగా.. భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అమెరికా దౌత్యవేత్తకు భారత్ సమన్లు కూడా జరీ చేసింది. ఒక్కరోజు వ్యవధిలో ఐక్యరాజ్య సమితి స్పందించటం గమనార్హం. భారత్‌లో లోక్‌సభ ఎన్నికల ముందు విపక్ష సీఎం అరెస్ట్, ప్రతిపక్షపార్టీ ఖాతాల స్తంభనతో నెలకొన్న రాజకీయ అనిశ్చిత్తిపై ఓ విలేకరి ప్రస్తావించగా.. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ అధికార ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ స్పందించారు. ‘ఇండియా, ఎన్నికలు జరిగే ప్రతి దేశంలోను ప్రజల రాజకీయ, పౌరహక్కులు రక్షించబడతాయని ఆశిస్తున్నాం. స్వేచ్ఛ, న్యాయమైన వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఓటు వేస్తారని నమ్ముతున్నాం’ అని అన్నారు. కేజ్రీవాల్ అరెస్ట్‌పై ఇప్పటికే జర్మనీ, అమెరికా స్పందించిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అకౌంట్లపై అమెరికా రెండోసారి స్పందించటం గమనార్హం. అయితే దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇవి పూర్తిగా తమ దేశ అంతర్గత విషయాన్ని స్పష్టం చేసింది. ఆయా తమ దేశ సార్వభౌమత్వాన్ని గౌరవించాలని పేర్కొన్న విషయం తెలిసిందే. -
28న వైఎస్సార్ రైతు భరోసా, సున్నా వడ్డీ రాయితీ జమ
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా కింద 2023–24 సీజన్ మూడో విడత పెట్టుబడి సాయంతో పాటు రబీ–2021–22, ఖరీఫ్–2022 సీజన్లో అర్హత పొందిన రైతు కుటుంబాలకు సున్నా వడ్డీ రాయితీ సొమ్ముల పంపిణీకి రంగం సిద్ధమైంది. రైతు భరోసా, సున్నా వడ్డీ రాయితీ కింద 64.37 లక్షల రైతు కుటుంబాలకు రూ.1,294.34 కోట్ల సాయం అందించనున్నారు. మూడో విడత రైతు భరోసా కింద 53.58 లక్షల మందికి రూ.1,078.36 కోట్లు సాయమందిస్తారు. రబీ 2021–22, ఖరీఫ్–2022కు సంబంధించి 10.79 లక్షల మందికి రూ.215.98 కోట్ల సున్నా వడ్డీ రాయితీ సొమ్ము అందిస్తారు. ఈ నెల 28న తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి ఈ సొమ్ము జమ చేయనున్నారు. ఒక్కో రైతు కుటుంబానికి రూ.67,500 ఎన్నికలకు ముందు ఏటా రూ.12,500 చొప్పున ఐదేళ్లలో రూ.50 వేల సాయం ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చినప్పటికీ, అధికారంలోకి వచ్చిన వెంటనే అంతకంటే మిన్నగా ఏటా 3 విడతల్లో రూ.13,500 చొప్పున ఐదేళ్లలో రూ.67,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇచ్చిన హామీకంటే రూ.17,500 ఎక్కువగా ప్రతి రైతుకూ సాయం అందించి సీఎం జగన్ రైతన్నల పట్ల తనకున్న చిత్తశుద్ధిని చాటుకున్నారు. భూ విస్తీర్ణంతో ముడిపెట్టకుండా చివరికి 5 సెంట్ల భూమి ఉన్న రైతుకు సైతం రూ.13,500 చొప్పున ఏటా పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ఇలా 2019–20లో 46,69,375 మందికి రూ.6,173 కోట్లు, 2020–21లో 51,59,045 మందికి రూ.6,928 కోట్లు, 2021–22లో 52,38,517 మందికి రూ.7,016.59 కోట్లు, 2022– 23లో 51,40,943 మందికి రూ.6,944.50 కోట్లు చొప్పున పెట్టుబడి సాయం అందించారు. 2023–24లో గరిష్టంగా 53.58 లక్షల కుటుంబాలకు లబ్ధి 2023–24లో తొలి విడతలో 52,57,263 రైతు కుటుంబాలకు రూ.3,942.95 కోట్లు, రెండో విడతలో 53,52,905 కుటుంబాలకు రూ.2,204.77 కోట్లు సాయం అందించారు. కాగా మూడో విడతలో 53,58,368 రైతు కుటుంబాలకు రూ.1,078.36 కోట్లు జమచేయనున్నారు. లబ్ధిదారుల్లో 51,00,063 మంది భూ యజమానులు కాగా, భూమి లేని ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనార్టీ సాగుదారులు 1,64,705 మంది, దేవదాయ, అటవీ భూమి సాగుదారులు 93,600 మంది ఉన్నారు. తొలి విడతతో పోల్చుకుంటే రెండో విడతలో 95,642 మంది పెరగ్గా, రెండో విడతతో పోల్చుకుంటే మూడో విడతలో మరో 5,463 మంది పెరిగారు. మూడో విడత సాయంతో కలిపి ఈ ఏడాది 53.58 లక్షల మందికి రూ.7,226.08 కోట్ల పెట్టుబడి సాయం అందించగా, ఈ ఐదేళ్లలో సగటున 51.13 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ.67,500 చొప్పున రూ.34,288.17 కోట్ల పెట్టుబడి సాయాన్ని అందించినట్టవుతుంది. క్రమం తప్పకుండా సున్నా వడ్డీ రాయితీ వడ్డీ భారం తగ్గించడంతో పాటు రైతుల్లో ఆర్థిక క్రమశిక్షణ తీసుకురావడమే లక్ష్యంగా 2019 ఖరీఫ్ సీజన్ నుంచి వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తోంది. సీజన్లో రూ.లక్ష లోపు తీసుకున్న రుణాన్ని ఏడాది లోపు చెల్లించిన వారిలో ఈ క్రాప్ ప్రామాణికంగా అర్హులైన రైతుల పొదుపు ఖాతాలకు సీజన్ చివర్లో సున్నా వడ్డీ రాయితీని ఈ ప్రభుత్వం జమ చేస్తోంది. ఇలా ఇప్పటి వరకు 73.88 లక్షల రైతు కుటుంబాలకు రూ.1,834.55 కోట్లు చెల్లించింది. ఈ మొత్తంలో చంద్రబాబు ఆయన పాలించిన ఐదేళ్లలో 39.07 లక్షల మంది రైతులకు ఎగ్గొట్టిన రూ.1,180.66 కోట్లు కూడా ఉన్నాయి. తాజాగా రబీ –2021–22 సీజన్లో అర్హత పొందిన 4.48 లక్షల మంది రైతులకు రూ.84.30 కోట్లు, ఖరీఫ్–2022 సీజన్లో అర్హత పొందిన 6.31లక్షల మందికి రూ.131.68 కోట్లు వెరసి 10.79 లక్షల మందికి రూ.215.98 కోట్లు జమ చేయనున్నారు. తాజాగా జమ చేసే మొత్తంతో కలిపి ఈ ఐదేళ్లలో 84.67 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ.2,050.53 కోట్లు జమ చేశారు. అదే చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 40.61 లక్షలమందికి రూ.685.46 కోట్ల వడ్డీ రాయితీని మాత్రమే చెల్లించారు. గత ప్రభుత్వంతో పోలిస్తే రైతుల సంఖ్య రెట్టింపు కాగా, వడ్డీ రాయితీ సొమ్ము మూడు రెట్లు ఎక్కువగా అందించినట్టయింది. ఇచ్చిన మాట కంటే ఎక్కువగా ఇస్తున్న సీఎం జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీకంటే మిన్నగా వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించి రైతులకు అండగా నిలిచారు. ఇప్పటికే రూ.65,500 చొప్పున సాయం అందించగా, మిగిలిన సాయం ఈ నెల 28న జమ చేస్తున్నాం. తాజా సాయంతో కలిపి ఈ 5 ఏళ్లలో 34,288 కోట్ల పెట్టుబడి సాయం అందించినట్టయ్యింది. రైతు రుణ మాఫీ, అన్నదాత సుఖీభవ పథకాల కింద చంద్రబాబు రైతులకు ఇచ్చిన సాయంకంటే రెట్టింపు సాయం ఒక్క రైతు భరోసా పథకం కిందే ఇచ్చాం. – కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి -
ఆ అప్పులు.. అంటగట్టినవే..
సాక్షి, అమరావతి: రాష్ట్ర అప్పులపై దుష్ట చతుష్టయం చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలేనని అసెంబ్లీ సాక్షిగా ‘కాగ్’ నివేదిక కుండబద్ధలు కొట్టింది. రాష్ట్ర అప్పులు రూ.పది లక్షల కోట్లకు చేరాయంటూ ఎల్లో మీడియాతో పాటు టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని నివేదిక స్పష్టం చేసింది. 2022–23 అకౌంట్స్‌పై కాగ్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం గురువారం శాసనసభకు సమర్పించింది. కార్పొరేషన్ల అప్పులను దాచేస్తున్నారని, కాగ్‌కు కూడా చెప్పడం లేదంటూ ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారంలో వీసమెత్తు నిజం లేదని కాగ్ అకౌంట్స్ నివేదిక వెల్లడించింది. 2022–23 నాటికి బడ్జెట్లో చేసిన అప్పులు, బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్లు, సొసైటీలు, కంపెనీలు, మార్కెట్ రుణాలు, వివిధ పథకాలు, కార్యక్రమాల అమలు కోసం ఆర్థిక సంస్ధల నుంచి గ్యారెంటీ ఇచ్చి తీసుకున్న అప్పుల పూర్తి వివరాలను కాగ్ స్పష్టంగా వెల్లడించింది. ఎఫ్ఆర్బీఎం (ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ) నిబంధనలు, లక్ష్యాలను ప్రభుత్వం పక్కాగా పాటిస్తోందని స్పష్టం చేసింది. 2022–23లో ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడే అప్పులు, ద్రవ్య, రెవెన్యూ లోటు ఉన్నాయని కాగ్ నివేదిక పేర్కొంది. బడ్జెట్ బయట అప్పులను సైతం ఎటువంటి దాపరికం లేకుండా కాగ్ అకౌంట్స్‌లో స్పష్టం చేసింది. 2018–19 మార్చి నాటికి రాష్ట్ర ప్రభుత్వ అప్పులు రూ.2,57,612 కోట్లుగా ఉన్నాయని కాగ్ పేర్కొంది (2019 మే నాటికి టీడీపీ సర్కారు సొంత ప్రచారం కోసం మరో రూ.14 వేల కోట్లు అప్పు చేసింది). ఆ రూ.14 వేల అప్పులను మినహాయించి చూసినా సరే 2022–23 నాటికి బడ్జెట్లో చేసిన అప్పులు రూ.4,23,942 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. అంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1,66,330 కోట్లు మాత్రమేనని, టీడీపీ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా రుణాలు తీసుకుని రాష్ట్రాన్ని అప్పుల కుంపట్లోకి నెట్టిందని కాగ్ అకౌంట్స్ నివేదిక స్పష్టం చేస్తోంది. 2022–23 నాటికి బడ్జెట్లో అప్పులతో పాటు బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్లు, ఆర్థిక సంస్థలు, కంపెనీల ద్వారా గ్యారెంటీ ఇచ్చి తీసుకున్న అప్పులు మొత్తం కలిపి రూ.5,62,817 కోట్లు మాత్రమేనని కాగ్ అకౌంట్స్ స్పష్టం చేశాయి. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు వెల్లడించినా ఎల్లో మీడియా, టీడీపీ నేతలు అనధికార అప్పులంటూ దుష్ప్రచారానికి తెగబడుతున్నారు. -
ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం భారీగా పెరుగుదల
సాక్షి, అమరావతి : ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం గత నాలుగేళ్లలో భారీగా పెరిగిందని కాగ్ అకౌంట్స్ నివేదిక స్పష్టం చేసింది. 2022–23 ఆర్థిక సంవత్సరం కాగ్ అకౌంట్స్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం గురువారం అసెంబ్లీకి సమర్పించింది. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం పెరుగుతుండటంతో తప్పనిసరి రెవెన్యూ వ్యయం ఏటేటాపెరుగుతోందని కాగ్ అకౌంట్స్ స్పష్టం చేశాయి. ఉద్యోగుల వేతనాల వ్యయం అంతకు ముందు ఆర్థిక ఏడాదితో పోల్చి చూస్తే 2022–23 ఆర్థిక సంవత్సరంలో 19.18 శాతం మేర పెరిగినట్టు కాగ్ అకౌంట్స్ పేర్కొన్నాయి. 2019–20 ఉద్యోగుల పెన్షన్ల వ్యయం రూ.17,385 కోట్లు ఉండగా, 2022–23 నాటికి పెన్షన్ల వ్యయం రూ.22,584 కోట్లకు పెరిగినట్లు కాగ్ అకౌంట్స్ స్పష్టం చేశాయి.. అంటే నాలుగేళ్లలో పెన్షన్ల వ్యయం రూ.4,942 కోట్ల మేర పెరిగింది. అలాగే ఉద్యోగుల వేతనాల వ్యయం 2019–20లో రూ.36,179 కోట్లు ఉండగా, 2022–23 నాటికి వేతనాల వ్యయం రూ.49,421 కోట్లు పెరిగినట్లు కాగ్ అకౌంట్స్ పేర్కొన్నాయి. అంటే నాలుగేళ్లలో వేతనాల వ్యయం రూ.13,242 కోట్ల మేర పెరిగింది. -
20 ఖాతాలను సమీక్షించండి.. బ్యాంకులకు ఆర్థిక శాఖ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: మొండి బకాయిల (ఎన్పీఏ) నిర్వహణలో భాగంగా ఇన్సాల్వెన్సీ– దివాలా కోడ్ కింద దాఖలైన టాప్ 20 ఖాతాలను నెలవారీగా పర్యవేక్షించాలని, సమీక్షించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) అధిపతులను కోరింది. పీఎస్బీ మేనేజింగ్ డైరెక్టర్లు, సీఈఓలతో జరిగిన సమావేశంలో ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ వివేక్ జోషి మాట్లాడుతూ, నెలవారీగా టాప్ 20 దివాలా కేసులను సమీక్షించాలని కోరారు. ఈ సమావేశంలో నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఏఆర్సీఎల్) పని తీరును కూడా సమీక్షించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల మెజారిటీ వాటాతో ఎన్ఏఆర్సీఎల్ 2021లో ఏర్పాటయి న సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: రాష్ట్రాలకు రూ.72,961 కోట్లు విడుదల.. ఎందుకంటే.. కెనరా బ్యాంక్ స్పాన్సర్ బ్యాంక్‌గా ఉంది. సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్, 2002 కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీగా రిజిస్టర్ అయ్యింది. -
వాట్సాప్ యూజర్లకు షాక్.. 75 లక్షల అకౌంట్స్ బ్యాన్
మెటా యాజమాన్యంలోని వాట్సాప్ (WhatsApp) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, 2021 ప్రకారం.. భారతదేశంలో సుమారు 75 లక్షల కంటే ఎక్కువ నకిలీ అకౌంట్స్ నిషేదించింది. 2023 అక్టోబర్ 01 నుంచి 31 మధ్య 7548000 ఖాతాలను నిషేదించింది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వాట్సాప్ నెలవారీ నివేదికలో వివరించిన విధంగా.. 19,19,000 వినియోగదారు నివేదికల కంటే ముందుగానే నిషేధించడం జరిగింది. అక్టోబర్‌లో దేశంలో రికార్డు స్థాయిలో 9,063 ఫిర్యాదులను అందుకున్నట్లు సమాచారం. ఇందులో ఖాతాను నిషేధించడం లేదా గతంలో నిషేధించబడిన ఖాతాను పునరుద్ధరించడం వంటివి ఉన్నాయి. దేశంలో 500 మిలియన్ల కంటే ఎక్కువ వినియోగదారుల సంఖ్యను కలిగి ఉన్న వాట్సాప్ అక్టోబర్‌లో 9,063 ఫిర్యాదులను అందుకున్నట్లు.. వీటిపైన 12 చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే వాట్సాప్ ఒక ఖాతాను నిషేధించడం లేదా గతంలో నిషేధించిన దాన్ని పునరుద్ధరించడం వంటి పరిష్కార చర్యలను సూచిస్తుంది. వినియోగదారు ఫిర్యాదులకు సంబంధించిన సమగ్ర వివరాలను పరిగణలోకి తీసుకుని, దుర్వినియోగాన్ని ఎదుర్కోవడానికి సరైన చర్యలు తీసుకుంటోంది. ఇదీ చదవండి: నాలుగేళ్ల నిరీక్షణకు తెర.. సైబర్‌ట్రక్ లాంచ్ చేసిన టెస్లా - ధర ఎంతంటే? వాట్సాప్ సెప్టెంబర్ 1, 2023 నుంచి సెప్టెంబర్ 30 వరకు మొత్తం 7,111,000 ఖాతాలను బ్యాన్ చేసింది. ఇందులో వినియోగదారు నివేదికలను స్వీకరించడానికి ముందు 2,571,000 ఖాతాలు ముందస్తుగా నిషేధించారు. అప్పుడు వచ్చిన ఫిర్యాదుల్లో అకౌంట్ సపోర్ట్ (1,031), బ్యాన్ అప్పీల్ (7,396), అదర్ సపోర్ట్ (1,518), ప్రొడక్ట్ సపోర్ట్ (370), సేఫ్టీ (127) వంటి కేటగిరీల్లో 10,442 యూజర్ రిపోర్ట్‌లను స్వీకరించినట్లు సమాచారం. -
వాట్సాప్ యూజర్లకు షాక్! 71.1 లక్షల అకౌంట్లపై నిషేధం
మెటా యాజమాన్యంలోని వాట్సాప్ (WhatsApp) గత సెప్టెంబర్ నెలలో భారత్‌కు చెందిన 71.1 లక్షల వాట్సాప్ అకౌంట్లను బ్యాన్ చేసింది. ఈ ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ విడుదల చేసిన తాజా ఇండియా నెలవారీ నివేదిక ప్రకారం.. వాట్సాప్ సెప్టెంబర్‌లో ఐటీ నిబంధనలకు అనుగుణంగా 71.1 లక్షల ఖాతాలను నిషేధించింది. 2023 సెప్టెంబర్ 1 నుంచి 30వ తేదీల మధ్య 71,11,000 ఖాతాలను నిషేధించినట్లు వాట్సాప్ పేర్కొంది. వీటిలో 25,71,000 అకౌంట్లను వినియోగదారుల నుంచి ఫిర్యాదులు రాకముందే ముందస్తుగా బ్యాన్ చేసినట్లు వివరించింది. ఇదీ చదవండి: బిగ్ డీల్స్: రూ.15 వేల కంటే తక్కువకే బెస్ట్ 5జీ ఫోన్లు! వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వాటిపై వాట్సాప్ తీసుకున్న సంబంధిత చర్యలు, అలాగే ప్లాట్ఫామ్లో దుర్వినియోగాన్ని అరికట్టడానికి వాట్సాప్ చేపట్టిన సొంత నివారణ చర్యలు తదితర వివరాలు ‘యూజర్ సేఫ్టీ రిపోర్ట్’లో ఉన్నాయి. ఈ రిపోర్ట్ ప్రకారం.. సెప్టెంబర్ 1 నుంచి 30 మధ్య గ్రీవెన్స్ అప్పీలేట్ కమిటీ నుంచి వాట్సాప్‌కు ఆరు ఆర్డర్లు రాగా అన్నింటినీ పరిష్కరించింది. కాగా వాట్సాప్ గత ఆగస్టులో 74 లక్షల ఖాతాలను నిషేధించింది. వీటిలో 35 లక్షల ఖాతాలను ముందస్తుగా బ్యాన్ చేసింది. -
74 లక్షల వాట్సాప్ అకౌంట్లు బ్యాన్! ఒక్క నెలలోనే..
WhatsApp Accounts Banned: మెటా యాజమాన్యంలోని ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ (WhatsApp) భారత్‌లో ఒక్క నెలలోనే ఏకంగా 74 లక్షల అకౌంట్లు బ్యాన్ చేసింది. ఐటీ నిబంధనలకు అనుగుణంగా ఆగస్టు నెలలో 74 లక్షల ఖాతాలను నిషేధించినట్లు వాట్సాప్ తాజాగా విడుదల చేసిన ఇండియా నెలవారీ నివేదిక పేర్కొంది. ఆగస్టు నెలలో మొతం 74 లక్షల ఖాతాలను బ్యాన్ చేయగా వీటిలో 35 లక్షల అకౌంట్లపై యూజర్ల నుంచి ఫిర్యాదులు రాకముందే ముందస్తుగా చర్యలు తీసుకున్నారు. సంబంధిత అకౌంట్లపై యూజర్ల నుంచి అందిన ఫిర్యాదులు, వాటిపై తీసుకున్న చర్యలతో పాటు ప్లాట్ఫామ్లో దుర్వినియోగాన్ని అరికట్టడానికి వాట్సాప్ సొంతంగా తీసుకున్ననివారణ చర్యల వివరాలు 'యూజర్-సేఫ్టీ రిపోర్ట్'లో ఉన్నాయి. ఆగస్టు 1 నుంచి ఆగస్ట్ 31 మధ్య, మొత్తం 74,20,748 వాట్సాప్ ఖాతాలను బ్యాన్ చేశామని, వీటిలో 3,506,905 ఖాతాలపై యూజర్ల నుంచి ఫిర్యాదుల రాకపోయినా ముందస్తుగా చర్యలు తీసుకున్నట్లు వాట్సాప్ తెలిపింది. జూన్‌లోనూ 66 లక్షలు వాట్సాప్ గత జూన్ నెలలోనూ 66 లక్షలకు పైగా అకౌంట్లను బ్యాన్ చేసింది. 2023 జూన్ 1 నుంచి 30వ తేదీ మధ్య మొత్తం 6,611,700 వాట్సాప్ అకౌంట్లను బ్యాన్ చేసింది. ఇందులో 2,434,200 అకౌంట్లను ఫిర్యాదులతో సంబంధం లేకుండా ముందస్తుగా నిషేధించింది. -
40 ఖాతాల్లోకి ఉన్నట్టుండి లక్షలు.. డబ్బులు తీసుకునేందుకు క్యూ!
ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలోని కొందరు గ్రామీణులు రాత్రికిరాత్రే లక్షాధికారులయ్యారు. వీరి బ్యాంకు ఖాతాల్లో గుర్తుతెలియని అకౌంట్ నుంచి డబ్బలు జమ అయ్యాయి. సుమారు 40 మంది గ్రామీణుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. దీనికి సంబంధించిన మెసేజ్ రాగానే ఆ ఖాతాదారుల ఆనందంతో చిందులేశారు. ఆ డబ్బు తీసుకునేందుకు బ్యాంకు ముందు క్యూ కట్టారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఘటన కేంద్రపారా జిల్లాలోని ఒడిశా గ్రామ్య బ్యాంకు చెందిన బాటీపాడా శాఖలో చోటుచేసుకుంది. ఖాతారులు తమ అకౌంట్లోని పెద్ద మొత్తంలో డబ్బులు జమకావడంతో వారంతా బ్యాంకుకు చేరుకున్నారు. కొందరు తమ ఖాతాల నుంచి సొమ్ము ఉపసంహరించుకున్నారు. మరికొందరు డబ్బులు తీసుకోలేకపోయారు. పలువురు ఖాతాదారులకు అకౌంట్లలో వేల రూపాయలు మొదలుకొని 2 లక్షల రూపాయల వరకూ జమ అయ్యాయి. దీనిని గమనించిన బ్యాంకు అధికారులు నగదు విత్‌డ్రాలను నిలిపివేశారు. వినియోగదారుల ఖాతాలలోకి ఈ సొమ్ము ఎలా వచ్చిందనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇది కూడా చదవండి: బెర్లిన్‌లో గణేశుని ఆయలం.. దీపావళికి ప్రారంభం -
66 లక్షల వాట్సాప్ అకౌంట్లు బ్యాన్.. కారణం ఇదే...
మెటా (Meta) యాజమాన్యంలోని ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్(WhatsApp) భారత్‌లో 2023 జూన్ నెలలో 66 లక్షలకు పైగా అకౌంట్లను బ్యాన్ చేసింది. ఐటీ రూల్స్ 2021కి అనుగుణంగా మెటా ఈ చర్యలు తీసుకుంది. 2023 జూన్ 1 నుంచి 30వ తేదీ మధ్య మొత్తం 6,611,700 వాట్సాప్ అకౌంట్లను బ్యాన్ చేసింది. ఇందులో 2,434,200 అకౌంట్లను ఫిర్యాదులతో సంబంధం లేకుండా ముందస్తుగా నిషేధించినట్లు వాట్సాప్ తాజా నివేదికలో వెల్లడించింది. మరోవైపు జూన్ నెలలో 7,893 ఫిర్యాదులు అందగా వీటిలో 337 అకౌంట్లపై చర్యలు తీసుకున్నట్లు ప్రకటించింది. Amazon Great Freedom Festival Sale 2023: లేటెస్ట్ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు! గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ షురూ.. వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా 500 మిలియన్లకు పైగా యూజర్లు ఉన్నారు. యూజర్ సేఫ్టీ రిపోర్ట్‌లో నమోదైన ఫిర్యాదులకు అనుగుణంగా కొన్ని అకౌంట్లపై చర్యలు తీసుకోగా నిబంధనలు అతిక్రమించిన మరికొన్ని అకౌంట్లపై ముందస్తు చర్యలు చేపట్టినట్లు వాట్సాప్ పేర్కొంది. చర్యల నిమిత్తం గ్రీవెన్స్ అప్పిలేట్ కమిటీ నుంచి ఆదేశాలు అందినట్లు తెలిపింది. -
డిజిటల్ హెల్త్ ఖాతాల్లో రెండో స్థానంలో ఏపీ
సాక్షి, అమరావతి: ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలందేలా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నారు. ఓ పక్క గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతూనే, రాష్ట్ర వ్యాప్తంగా నూతన వైద్య కళాశాలలను అందుబాటులోకి తెస్తున్నారు. మరోపక్క ప్రజలకు డిజిటల్ వైద్య సేవలందించే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ అకౌంట్ (ఆభా)ల సృష్టిలోనూ ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టారు. దీంతో డిజిటల్ హెల్త్ అకౌంట్ల సృష్టిలో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇటీవల పార్లమెంట్‌లోనే వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 43.01 కోట్ల మందికి ఆభా రిజి్రస్టేషన్లు చేశారు. రాష్ట్రాలవారీగా చూస్తే ఉత్తరప్రదేశ్ 4.29 కోట్ల అకౌంట్లతో మొదటి స్థానంలో ఉంది. 4,10,49,333 ఖాతాలతో ఏపీ రెండో స్థానంలోఉంది. 4.04 కోట్లతో మధ్యప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. దక్షిణాదికి చెందిన మరే రాష్ట్రం టాప్–5లో లేదు. కర్ణాటక 2.35 కోట్ల ఖాతాలతో 8వ స్థానంలో, 98 లక్షల ఖాతాలతో తెలంగాణ 14వ స్థానంలో ఉన్నాయి. ఇదీ డిజిటల్ ఖాతా ఆభా అకౌంట్లో ప్రతి పౌరుడికి 14 అంకెల డిజిటల్ ఆరోగ్య ఐడీ ఇస్తారు. వ్యక్తి ఆరోగ్య చరిత్ర మొత్తం ఇందులో నమోదు చేస్తారు. ఎప్పటికప్పు డు ఇది అప్డేట్ అవుతుంటుంది. ఓపీ, ఐపీ స్లి ప్పులు, వైద్య పరీక్షల ఫలితాలు, పాత చికిత్స తా లూకూ ఫైళ్లు వంటి మోతబరువు లేకుండా దేశంలో ఎక్కడి నుంచి అయినా ఒక్క క్లిక్‌తో ఆరోగ్య చరిత్ర అందుబాటులోకి తేవడానికి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్(ఏబీడీఎం)ను కేంద్రం ప్రవేశపెట్టింది. పేపర్ రహిత సేవలు అందించడానికి వీలుగా ఈ–హాస్పిటల్ విధానాన్ని అమలు చేస్తోంది. చదవండి: మేం చెప్పిందే చట్టం!.. అధికారులను బెదిరించిన ‘నారాయణ’ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా.. ఏబీడీఎం అమలులో ఏపీ తొలి నుంచి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. రాష్ట్రంలో 4.81 కోట్ల మందికి ఆభాలు రిజిస్టర్ చేయడం లక్ష్యం కాగా, ఇప్పటికి 85% మందికి రిజి్రస్టేషన్ పూర్తి చేశారు. మొత్తం జనాభాలో ఆభా రిజిస్టర్ కవరేజ్ పరంగా దేశంలోనే తొలిస్థానంలో ఏపీ నిలుస్తోంది. రాష్ట్రంలోని 14,368 ఆసుపత్రులు, 20,467 మంది వై ద్యులు, వైద్య సిబ్బంది ఏబీడీఎంలో రిజిస్టర్ అ య్యారు. పీహెచ్సీ నుంచి బోధనాస్పత్రి వరకు అ న్ని స్థాయిల్లో ఈ–హెచ్ఆర్ విధానాన్ని ప్రశేపెట్టి ప్ర జలకు డిజిటల్ వైద్య సేవలను వైద్య శాఖ అంది స్తోంది. ఏపీ విధానాలను అవలంబించాలని నేషన ల్ హెల్త్ అథారిటీ అన్ని రాష్ట్రాలకు సూచించింది. మహారాష్ట్ర, తమిళనాడు అధికారులు ఏపీకి వచ్చి ఇక్కడి విధానాలను తెలుసుకుని వెళ్లారు. ఆరోగ్య రికార్డులు పదిలం డిజిటల్ హెల్త్ అకౌంట్ ద్వారా ప్రతి వ్యక్తి ఆ రోగ్య రికార్డులు ఆన్లైన్లో పదిలంగా ఉంటా యి. వంద శాతం పౌరులందరికీ ఆభా రిజిస్ట్రేషన్ త్వరలోనే పూర్తి అవుతుంది. ప్రభుత్వాస్పత్రుల్లో ఈ–హెచ్ఆర్ అమలు చేస్తున్నాం. ఈ విధానంపై ఆస్పత్రుల్లో అధికారులు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. – జె. నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ -
రూ. 3,000 కోట్ల మొండి పద్దుల విక్రయానికి యూనియన్ బ్యాంక్
న్యూఢిల్లీ: బ్యాడ్ బ్యాంక్ ఎన్ఏఆర్సీఎల్కు విక్రయించేందుకు రూ. 3,000 కోట్ల విలువ చేసే 8 మొండి పద్దులను (ఎన్పీఏ) గుర్తించినట్లు యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 900 కోట్ల విలువ చేసే మూడు ఖాతాలను విక్రయించినట్లు తెలిపింది. తాజాగా దాదాపు రూ. 10,000 కోట్ల బాకీలు ఉన్న మొత్తం 42 సమస్యాత్మక ఖాతాలను గుర్తించినట్లు బ్యాంకు సీఈవో ఎ మణిమేఖలై తెలిపారు. వీటిలో కనీసం ఎనిమిది ఖాతాలను ఈ ఆర్థిక సంవత్సరం విక్రయించగలమని ఆశిస్తున్నట్లు వివరించారు. -
వీడియోకాన్ ఫౌండర్ అకౌంట్ల అటాచ్మెంట్.. సెబీ ఆదేశాలు
న్యూఢిల్లీ: రూ. 5.16 లక్షల జరిమానా బకాయిలను రాబట్టుకునే దిశగా వీడియోకాన్ గ్రూప్ వ్యవస్థాపకుడు వేణుగోపాల్ ధూత్‌కు చెందిన బ్యాంక్, డీమాట్, మ్యుచువల్ ఫండ్ ఖాతాలు, లాకర్లను అటాచ్ చేయాల్సిందిగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశించింది. ఆయా ఖాతాల నుంచి డెబిట్ లావాదేవీలను అనుమతించరాదంటూ బ్యాంకులు, డిపాజిటరీలు (సీడీఎస్ఎల్, ఎన్ఎస్డీఎల్), మ్యుచువల్ ఫండ్ సంస్థలకు సూచించింది. అయితే, క్రెడిట్ లావాదేవీలకు అనుమతించవచ్చని పేర్కొంది. క్వాలిటీ టెక్నో అడ్వైజర్స్, క్రెడెన్షియల్ ఫైనాన్స్, సుప్రీం ఎనర్జీ వంటి సంస్థలతో తనకున్న పెట్టుబడులు, సంబంధం గురించి వెల్లడించకుండా, నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఈ ఏడాది మార్చిలో ధూత్‌కు సెబీ రూ. 5 లక్షల జరిమానా విధించింది. అయితే, ఆ మొత్తాన్ని చెల్లించడంలో ఆయన విఫలమయ్యారు. ఇదీ చదవండి ➤ ఫాక్స్ కార్పొరేషన్ స్ట్రీమింగ్ సర్వీస్‌కు సీఈవోగా అంజలీ సూద్ దీంతో అసలుతో పాటు రూ. 15,000 వడ్డీ, రికవరీ వ్యయాల కింద మరో రూ. 1,000 కలిపి మొత్తం రూ. 5.16 లక్షలు బాకీ చెల్లించాలని అటాచ్మెంట్ నోటీసులో సెబీ ఆదేశించింది. వీడియోకాన్ గ్రూప్ సంస్థలకు రుణ సదుపాయాలు కల్పించినందుకు ప్రతిగా అప్పట్లో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవోగా పనిచేసిన చందా కొచర్, ఆమె భర్తకు ధూత్ ప్రయోజనం చేకూర్చారని (క్విడ్ ప్రో కో) ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. -
భారత్‌లో 47 లక్షల వాట్సాప్ అకౌంట్స్ బ్యాన్
-
జీమెయిల్, యూట్యూబ్ యూజర్లకు అలర్ట్: త్వరలో అకౌంట్లు డిలీట్!
మీకు జీమెయిల్, యూట్యూబ్ అకౌంట్లు ఉన్నాయా.. క్రియేట్ చేసి చాలా కాలం అవుతోందా.. తరచూ ఉపయోగించడం లేదా.. అయితే ఆ అకౌంట్లు త్వరలో డిలీట్ అయ్యే అవకాశం ఉంది. మనలో చాలా మందికి జీమెయిల్ అకౌంట్ ఉంటుంది. కొంత మంది అవసరంకొద్దీ రెండు.. మూడు.. ఇలా లెక్కకు మించి జీమెయిల్ అకౌంట్లు క్రియేట్ చేస్తుంటారు. ఆ తర్వాత ఆ అకౌంట్లను ఒకసారి కూడా ఓపెన్ చేయరు. రెండేళ్లకుపైగా ఉపయోగంలో లేని అలాంటి ఇన్‌యాక్టివ్ జీమెయిల్ అకౌంట్లను గూగుల్ త్వరలో డిలీట్ చేయనుంది. ఇదీ చదవండి: ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎంలకు షాక్! కొత్త సర్వీస్‌ను తీసుకొచ్చిన జొమాటో.. ఇన్‌యాక్టివ్ అకౌంట్లకు సంబంధించి గూగుల్ కొత్త విధానాలను ప్రకటించింది. ప్రతి 24 నెలలకు ఒకసారి లాగిన్ అవ్వాలని, పాత గూగుల్ అకౌంట్లను సమీక్షించాలని యూజర్లను కోరింది. రెండు సంవత్సరాలుగా ఆపరేట్ చేయని అకౌంట్లలో స్టోర్ అయిన డేటా డిలీట్ అయ్యేలా ఇప్పటికే గూగుల్ ఒక విధానాన్ని కలిగి ఉంది. కానీ, ఇప్పుడు ఆ డేటా మొత్తాన్ని పూర్తిగా తమ సర్వర్ల నుంచి డిలీట్ చేయనుంది. ఈ ప్రమాదాన్ని తగ్గించడానికి గూగుల్ అకౌంట్ల కోసం ఇన్‌యాక్టివ్ విధానాన్ని మరో రెండేళ్లకు అప్డేట్ చేస్తున్నట్లు గూగుల్ పేర్కొంది. యూట్యూబ్, గూగుల్ ఫొటోస్పైనా ప్రభావం కొత్త విధానం డిసెంబర్ 2023 నుంచి అమలులోకి వస్తుందని ఇటీవలి బ్లాగ్ పోస్ట్‌లో గూగుల్ పేర్కొంది. జీమెయిల్, డాక్స్, డ్రైవ్, మీట్, క్యాలెండర్, యూట్యూబ్, గూగుల్ ఫోటోస్ సహా ఇనాక్టివ్ అకౌంట్లలో స్టోర్ మొత్తం మొత్తం కంటెంట్ తొలగించనున్నట్లు తెలిపింది. ఇంతకు ముందు 2020లో ప్రకటించిన విధానం ప్రకారం.. ఇనాపరేటివ్ అంకౌంట్లలోని కంటెంట్‌ను మాత్రమే తొలగించేది. ఇప్పుడు తీసుకొచ్చిన విధానంలో అకౌంట్లను కూడా తొలగించే అవకాశం ఉంది. ఈ విధానం వ్యక్తిగత గూగుల్ అకౌంట్లకు మాత్రమే వర్తిస్తుందని, పాఠశాలలు లేదా వ్యాపార సంస్థల అకౌంట్లపై ఎలాంటి ప్రభావం ఉండదని గూగుల్ పేర్కొంది. తొలగించే ముందు నోటిఫికేషన్లు ఉపయోగంలో లేని అకౌంట్లను గూగుల్ దశలవారీగా తొలగిస్తుంది. మొదటగా డిసెంబర్లో ఈ తొలగింపు ప్రక్రియను ప్రారంభించనుంది. అకౌంట్ క్రియేట్ చేసి తర్వాత ఎప్పుడూ ఉపయోగించని అకౌంట్లను తొలి విడతలో తొలగించనుంది. ఇలా తొలగించే ముందు ఆ అకౌంట్లకు, దానికి సంబంధించి పేర్కొన్న రికవరీ అకౌంట్లకు నోటిఫికేషన్లు పంపుతుంది. కాబట్టి మీకు గూగుల్ అకౌంట్ ఉండి తరచూ ఉపయోగించకపోతే వెంటనే యాక్టివేట్ చేసుకోండి. ఇదీ చదవండి: Aditi Avasthi: రూ.1600 కోట్ల నిధులు.. ఎడ్టెక్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తున్న అదితి అవస్తీ! -
మాఫీ చేసిన రుణ వసూళ్లు పెంచుకోవాలి: బ్యాంకులకు ఆర్థిక శాఖ కీలక సూచన
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులు మాఫీ చేసిన (ఖాతాల్లో రద్దు) మొండి రుణాల (ఎన్పీఏలు)ల వసూళ్ల విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ కీలక సూచన చేసింది. వీటి వసూళ్ల రేటు తక్కువగా ఉండడంతో కనీసం 40 శాతానికి అయినా పెంచుకోవాలని కోరింది. 2022 మార్చి నాటికి ఐదేళ్ల కాలంలో ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) రూ.7.34 లక్షల కోట్లను ఖాతాల్లో మాఫీ చేశాయి. ఇందులో 14 శాతాన్నే అవి వసూలు చేసుకోగలిగాయి. మాఫీ చేసినప్పటికీ వాటిని వసూలు చేసుకునే కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. 2022 మార్చి నాటికి మాఫీ చేసిన రూ.7.34 లక్షల కోట్లలో రూ.1.03 లక్షల కోట్లనే వసూలు చేశాయి. ఇదీ చదవండి: భారత్ ‘గ్రీన్’ పరిశ్రమకు రాయితీ రుణాలు దీంతో 2022 మార్చి నాటికి నికరంగా మాఫీ చేసిన ఎన్పీఏల మొత్తం రూ.6.31 లక్షల కోట్లుగా ఉంది. ఈ విధమైన వసూళ్లు ఆమోదయోగ్యం కాదని ఆర్థిక శాఖ స్పష్టం చేసినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇలా వసూలయ్యే మొత్తం బ్యాంకుల నికర లాభాలను పెంచుతుందని పేర్కొన్నాయి. ఈ పరిస్థితిపై సమీక్ష చేయడానికి వీలుగా కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ త్వరలోనే పీఎస్బీ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నట్టు చెప్పాయి. 2022 మార్చి నాటికి ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు మాఫీ చేసిన రుణాల మొత్తం రూ.11.17 లక్షల కోట్లుగా ఉంది. ఇదీ చదవండి: బ్యాంకింగ్‌లోకి బడా కార్పొరేట్లను అనుమతించొద్దు -
ఐసీఐసీఐ బ్యాంక్ రూపీ వోస్ట్రో ఖాతాలు
ముంబై: రూపీ వోస్ట్రో ఖాతాలను ఆఫర్ చేస్తున్నట్టు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది. ఎగుమతి, దిగుమతిదారులు వోస్ట్రో ఖాతాల ద్వారా రూపాయి మారకంలో చెల్లింపులు చేసుకోవచ్చ ని పేర్కొంది. ఇన్వాయిస్, చెల్లింపులకు ఐఎన్ఆర్ను ఉపయోగించడం ద్వారా విదేశీ కరెన్సీ మారకం రిస్క్ తగ్గుతుందని తెలిపింది. 29 దేశాల్లోని కరస్పాడెంట్ బ్యాంకుల్లో 100కుపైగా రూపీ వోస్ట్రో అకౌంట్లకు కలిగి ఉన్నట్టు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది. విదేశీ వాణిజ్య విధానం 2023కు తోడు, ఎగుమతులు, దిగుమతులు, ఇన్వాయిసింగ్ ఐఎన్ఆర్లో ఉండాలన్న ఆర్బీఐ కార్యాచరణకు అనుగుణంగా ఈ చర్య చేపట్టినట్టు తెలిపింది. -
Twitter Blue Tick: బడా బిజినెస్మేన్లకూ షాకిచ్చిన మస్క్!
ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్ అన్నంత పనీ చేశాడు. సబ్స్క్రిప్షన్ చార్జీలు చెల్లించని యూజర్ల అకౌంట్లన్నింటికీ బ్లూ టిక్‌లు తొలగించింది ట్విటర్. ఇందులో టాప్ సినీ సెలబ్రిటీలు, క్రీడా ప్రముఖులు, హై-ప్రొఫైల్ బిజినెస్మేన్లు ఉన్నారు. నెలవారీ రుసుము 8 డాలర్లు (సుమారు రూ. 660) చెల్లించని హై-ప్రొఫైల్ యూజర్ల ఖాతాలకు సంబంధించిన బ్లూటిక్‌లను ట్విటర్ తొలగించింది. వెరిఫైడ్ బ్లూటిక్ కావాలంటే కచ్చితంగా సబ్స్క్రిప్షన్ చార్జీ చెల్లించాలని లేకుంటే ఏప్రిల్ 20 నుంచి బ్లూటిక్‌లను తొలగిస్తామని గత కొన్ని రోజులుగా ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్ హెచ్చరిస్తూనే ఉన్నారు. గడువు తేదీ అయిపోగానే సబ్స్క్రిప్షన్ చార్జీ చెల్లించని అకౌంట్లన్నికీ వెరిఫైడ్ బ్లూటిక్ టిక్‌ను ట్విటర్ తొలగించింది. ఇదీ చదవండి: కియా, హ్యుందాయ్ కంపెనీలకు షాక్! ఆ కార్లు రీకాల్ చేసేయాలని అభ్యర్థనలు టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్, విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఛైర్మన్ ఉదయ్ కోటక్ ఇంకా పలువురు బడా వ్యాపారవేత్తలు తమ ట్విటర్ అకౌంట్లకు బ్లూటిక్‌ను కోల్పోయారు. తమ బ్లూ టిక్ అలాగే ఉండాలనుకునేవారు నెలకు సుమారు రూ.660 చొప్పున చెల్లించి ట్విటర్ బ్లూకు సభ్యత్వాన్ని పొందవలసి ఉంటుంది. ఇక వెరిఫైడ్ బ్యాడ్జ్‌ను ఉంచుకోవాలనుకునే సంస్థలు నెలవారీ రుసుము 1,000 డాలర్లు (రూ. 82వేలకు పైగా)తో పాటు 50 డాలర్లు (సుమారు రూ. 4,100) అదనంగా చెల్లించాలి.ట్విటర్ 'వెరిఫైడ్ ఆర్గనైజేషన్స్' కోసం గోల్డ్ టిక్‌లను, ప్రభుత్వ సంస్థలు, వాటి అనుబంధ సంస్థలకు గ్రే టిక్‌లను ట్విటర్ అందిస్తుంది. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! -
700 ఖాతాల నిలిపివేత
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య కాలంలో వివిధ కారణాలతో 700 పైగా ఖాతాలను బ్లాక్ చేసినట్లు క్రిప్టో ఎక్సే్చంజీ వజీర్ఎక్స్ వెల్లడించింది. ఇందులో అత్యధిక భాగం అకౌంట్లను యూజర్ల అభ్యర్ధనల మేరకు నిలిపివేసినట్లు వివరించింది. 3వ పారదర్శకత నివేదికను విడుదల చేసిన సందర్భంగా వజీర్ఎక్స్ ఈ విషయాలు తెలిపింది. దీని ప్రకారం సమీక్షాకాలంలో దాదాపు 1 కోటి లావాదేవీలు జరిగాయి. ఇదే సమయంలో ఈడీ, సీబీఐ వంటి దేశీయ దర్యాప్తు సంస్థలతో పాటు ఎఫ్‌బీఐ వంటి విదేశీ ఏజెన్సీల నుండి 828 అభ్యర్ధనలు వచ్చాయి. వీటిలో 764 దేశీ దర్యాప్తు సంస్థల నుంచి రాగా మిగతావి విదేశీ ఏజెన్సీల నుంచి వచ్చినట్లు వివరించింది. ఎక్కువగా అక్రమంగా నిధుల బదలాయింపులు, క్రిప్టో స్కాములు, చీటింగ్, ఫోర్జరీ లాంటి నేరాలపై ఫిర్యాదులు అందినట్లు వజీర్ఎక్స్ తెలిపింది. క్రిప్టో కరెన్సీలపై అవగాహన పెంచేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని, అలాగే మోసాలను నివారించేందుకు నియంత్రణ సంస్థలకు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తున్నామని వజీర్ఎక్స్ సీఈవో నిశ్చల్ శెట్టి తెలిపారు. -
నవంబర్ 18 నుండి వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ అకౌంటెంట్స్
ముంబై: ఈ నెల (నవంబర్) 18 నుండి 21 వరకు ముంబైలో 21వ వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ అకౌంటెంట్స్ (డబ్ల్యూసీవోఏ) జరగనుంది. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అకౌంటెంట్స్ (ఐఎఫ్ఏసీ) దీన్ని నిర్వహించనుంది. ఐఎఫ్ఏసీ 118 ఏళ్ల చరిత్రలో ఈ సదస్సును ముంబైలో నిర్వహించడం ఇదే ప్రథమమని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ప్రెసిడెంట్ దేబాశీష్ మిత్రా తెలిపారు. నాలుగేళ్లకోసారి జరిగే ఈ కాంగ్రెస్‌ను తొలిసారిగా 1904లో అమెరికాలోని సెయింట్ లూయిస్‌లో నిర్వహించారు. ముంబైలో జరిగే నాలుగు రోజుల సదస్సులో సుమారు 35 సెషన్లు ఉంటాయని, 150 మంది పైగా వక్తలు మాట్లాడతారని మిత్రా చెప్పారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియుష్ గోయల్, పారిశ్రామికవేత్తలైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, అదానీ గ్రూప్ చీఫ్ గౌతం అదానీ తదితరులు వీరిలో ఉంటారని వివరించారు. డబ్ల్యూసీవోఏ చరిత్రలోనే అత్యధికంగా 9,000 మంది పైచిలుకు డెలిగేట్లు ఇందులో పాల్గొంటున్నట్లు మిత్రా తెలిపారు. చదవండి: Steve Jobs పాత చెప్పులు వేలం: రికార్డు ధర -
మస్క్ వేటు, షాక్‌లో స్టార్ కమెడియన్, ట్విస్ట్ ఏంటంటే?
న్యూఢిల్లీ: ట్విటర్ కొనుగోలు తరువాత టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ తన ప్రణాళికలను పక్కాగా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వ్యాపార వర్గాలను సైతం విస్మయానికి గురి చేస్తున్నారు. ముందస్తు హెచ్చరికలు లేకుండానే పేరు మార్పు, కామిక్ ఖాతాలను శాశ్వతంగా బ్యాన్ చేస్తామని ప్రకటించిన మస్క్ తొలి వేటు వేశారు. (మారుతి స్విఫ్ట్-2023 కమింగ్ సూన్: ఆకర్షణీయ, అప్డేటెడ్ ఫీచర్లతో) తాజాగా హాస్య నటి కాథీ గ్రిఫిన్‌కు భారీ షాకిచ్చారు మస్క్. ఏకంగా తన పేరుతోనే కామెడీ చేయడంతో సీరియస్‌గా స్పందించారు. ఎలాన్ మస్క్ పేరుతో కాథీ తన ట్విటర్ ఖాతాపేరును, ప్రొఫైల్ పిక్చర్నుమార్చుకోవడంతోపాటు,అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థులకు మద్దతి వ్వాల్సిందిగా ప్రజలను కోరడంతో ఆమె ఖాతాను శ్వాశతంగా సస్పెండ్ చేశారు. దీనికితోడు మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ మాస్టోడాన్‌కి మద్దతు కలడం ట్విటర్ కొత్త బాస్ మస్క్‌కు ఆగ్రహం తెప్పించింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ఇపుడు నెట్టింట వైరల్ అవుతోంది. వాక్ స్వాతంత్య్రానికి విఘాతం కలిగిస్తున్నారంటూ పలువురు మస్క్‌పై మండిపడుతున్నారు. దీనిపై స్పందించిన మస్క్, కావాలంటే ఆమె 8 డాలర్లు చెల్లించి (బ్లూ టిక్ ఫీజు) ఖాతాను తిరిగి పొందవచ్చంటూ ట్వీట్ చేశారు. (ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్: రూ.40 వేల భారీ డిస్కౌంట్) కాగా 44 బిలియన్ డాలర్లతో ట్విటర్‌ను టేకోవర్ చేసిన బిలియనీర్ మస్క్ బ్లూ టిక్ ఫీజును తీసుకురావడం సంచలనంగా మారింది. అలాగే కీలక ఎగ్జిక్యూటివ్‌లతో పాటు, పలువురు ఉద్యోగుల తొలగింపు కలకలం రేపింది. నకీలీ,పేరడీ ఖాతాలపై శాశ్వతంగా వేటు వేయనున్నట్టు ప్రకటించారు. అదీ పేరడీ అని లేబుల్ లేకుండానే ప్రముఖులు, పాపులర్ పేర్లతో అకౌంట్లు క్రియేట్ చేసి సరదా కంటెంట్ పోస్ట్ చేసేవాళ్లకు వేటు తప్పదంటూ మస్క్ ఆదివారం వరుస ట్వీట్లలో వార్నింగ్ ఇచ్చారు. గతంలో లాగా ముందస్తు హెచ్చరికలు లేకుండా, ఎలాంటి నోటీసు లేకుండా పర్మినెంట్‌గా బ్యాన్ చేస్తామంటూ తాజాగా హెచ్చరించిన సంగతి తెలిసిందే. BREAKING: @KathyGriffin has been permanently suspended from Twitter for impersonating @ElonMusk pic.twitter.com/ust86DZHKj — Benny Johnson (@bennyjohnson) November 6, 2022 But if she really wants her account back, she can have it — Elon Musk (@elonmusk) November 7, 2022 -
ట్విటర్లో ఇక అలాంటి వేషాలు కుదరదు
ట్విట్టర్ (ట్విటర్) కొత్త సీఈవో ఎలన్ మస్క్ సంస్కరణల్లో భాగంగా .. యూజర్లకు మరో ఝలక్ ఇచ్చారు. ప్రముఖుల, పాపులర్ పేర్లతో అకౌంట్లు క్రియేట్ చేసి.. సరదా కంటెంట్ పోస్ట్ చేసేవాళ్లను నియంత్రించాలని నిర్ణయించారు. పేరడీ అని లేబుల్ లేకుండా.. కొనసాగే అకౌంట్లపై శాశ్వతంగా వేటు ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం వరుసగా చేసిన ట్వీట్లలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ట్విటర్లో కొందరు ఫన్నీ కంటెంట్ క్రియేషన్ పేరిట ప్రముఖలు, పాపులర్ పేర్లను ఉపయోగించి పేరడీ అకౌంట్లతో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇకపై వాళ్లు పేరడీ అని ట్విటర్ హ్యాండిల్లో స్పష్టంగా పేర్కొనాలి. లేకుంటే ఎలాంటి హెచ్చరికలు ఇవ్వకుండానే ఆ ఖాతాలను శాశ్వతంగా తొలగిస్తారు. గతంలో ముందుగా హెచ్చరించిన తర్వాతే చర్యలు తీసుకునేవాళ్లు. కానీ, ఇకపై పేరడీరాయుళ్ల వేషాలు కుదరవని పరోక్షంగా స్పష్టం చేశారు ఎలన్ మస్క్. Going forward, any Twitter handles engaging in impersonation without clearly specifying “parody” will be permanently suspended — Elon Musk (@elonmusk) November 6, 2022 అకౌంట్ సైనప్ అయ్యే సమయంలోనే ఈ మేరకు ఇకపై షరతుల్లో ఆ విషయం స్పష్టం చేయనుంది ట్విటర్. ఇంతకు ముందులా వార్నింగ్ ఇవ్వకుండానే ఖాతాపై వేటు ఉంటుందని మస్క్ మరో ట్వీట్లో తెలిపారు. ఇదిలా ఉంటే.. ఎలన్ మస్క్ పేరిట అదీ వెరిఫైడ్ మార్క్‌తో ఓ ప్రొఫైల్ నుంచి భోజ్‌పురి పదాలతో ట్వీట్ విపరీతంగా వైరల్ అయ్యింది. అది పేరడీ అకౌంట్ కావడంతో ట్విటర్ దానిని తొలగించింది. Any name change at all will cause temporary loss of verified checkmark — Elon Musk (@elonmusk) November 6, 2022 పేరడీ నిర్ణయం మాత్రమే కాదు.. పేరులో ఏదైనా మార్పు గనుక జరిగినా.. నష్టం తప్పదని ఎలన్ మస్క్ స్పష్టం చేశారు. ‘‘ఏదైనా పేరు మార్పు తాత్కాలికంగా ధృవీకరించబడిన చెక్‌మార్క్‌ను కోల్పోతుంది’’ అని పేర్కొన్నారాయన. ఇక ట్విటర్లో నిషేధిత ఖాతాలు పునరుద్ధరణ పైనా ఎలన్ మస్క్ గతవారం ఒక స్పష్టత ఇచ్చిన సంగతి తెలిసిందే. ఖాతాలు తిరిగి యాక్టివేట్ అయ్యేందుకు ఒక పద్దతి ఉంటుందని, ట్విటర్ సైట్లో అది పూర్తి అయ్యాకే సదరు ఖాతా పునరుద్ధరణ అవుతుందని ఆయన స్పష్టం చేశారు. Widespread verification will democratize journalism & empower the voice of the people — Elon Musk (@elonmusk) November 6, 2022 ఇక విస్తృత ధృవీకరణ ద్వారా జర్నలిజాన్ని ప్రజాస్వామ్యం చేస్తుందని, ప్రజల గొంతును శక్తివంతం చేస్తుంది ఇదీ చదవండి: హిందూ ప్రధానిగా గర్విస్తున్నా -
దాదాపు 27 లక్షల ఖాతాలపై వేటువేసిన వాట్సాప్
సాక్షి,ముంబై: మెటాకు చెందిన ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ ఈ నెలలో కూడా పెద్ద ఎత్తున ఖాతాలపై వేటు వేసింది. సెప్టెంబర్ 30 వరకు ఏకంగా 26 లక్షల 85 వేల భారతీయుల వాట్సాప్ ఖాతాలను నిషేధించింది.సెప్టెంబర్ నివేదిలో సంబంధిత వివరాలను సంస్థ వెల్లడించింది. ఇందులో 8 లక్షలకుపైగా వాట్సాప్ అకౌంట్లనుఎలాంటి ఫిర్యాదలు రాకముందే తొలగించినట్లు వాట్సాప్ పేర్కొంది. ఫేక్ వార్తలు, తప్పుడు సమాచారాన్ని నిరోధించే క్రమంలో తప్పుడు, నకిలీ ఖాతాలను బ్యాన్ చేసింది. అలాగే భారత ఐటీ రూల్స్ 2021కి (IT Rules 2021) అనుగుణంగా లక్షలాదిగా వాట్సాప్ అకౌంట్లను నిలిపి వేస్తుంది. ఒక్క సెప్టెంబర్ నెలలోనే ఏకంగా 26 లక్షల 85 వేల భారతీయుల వాట్సాప్ ఖాతాలపై నిషేధం విధించినట్లు తన నెలవారీ నివేదికలో వెల్లడించింది. ఈ మేరకు 2022 సెప్టెంబర్ యూజర్ సేఫ్టీ రిపోర్ట్‌ను భారత ఐటీ మంత్రిత్వ శాఖకు అందించింది. అలాగే సెప్టెంబర్‌లో 666 ఫిర్యాదులు అందగా, 23 మందిపై మాత్రమే చర్యలు తీసుకున్నట్టు ప్రకటించింది. గ్రీవెన్స్ ఛానెల్ ద్వారా వినియోగదారుల ఫిర్యాదులకు ప్రతిస్పందించడం, వాటిపై చర్యలు తీసుకోవడంతో పాటు, ప్లాట్‌ఫారమ్‌లో హానికరమైన కంటెంట్‌ను నివారిస్తున్నామని, ఎందుకంటే హాని జరిగిన తరువాత గుర్తించడం కంటే ముందునేగా నివారించడానికే తమ ప్రాధాన్యత వాట్సాప్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో వాట్సాప్ దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. -
Instagram Down: ఇన్‌స్టాగ్రామ్‌కు ఏమైంది? యూజర్ల గగ్గోలు, మీమ్స్ వైరల్
సాక్షి, ముంబై: మెటా యాజమాన్యంలోని సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ సేవలు నిలిచిపోవడం యూజర్లలో గందర గోళానికి తీసింది. తాజాగా మెటా సొంతమైన ఇన్స్టాగ్రామ్ క్రాష్ అయిందంటూ ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు గగ్గోలు పెట్టారు. ఇన్‌స్టాలో సమస్యలను ఎదుర్కొంటున్న పలువురు యూజర్లు సోషల్ మీడియాలో సోమవారం ఫిర్యాదు చేశారు. తమ ఖాతాలను తాత్కాలికంగా నిలిపి వేసినట్లు ఒక అలర్ట్ మెసేజ్ వచ్చినట్టు వినియోగదారులు వాపోయారు. వినియోగదారులు తమ ఖాతాలకు తిరిగి లాగిన్ చేయడంలో సమస్యలు, అకౌంట్ సస్పెండ్ స్క్రీన్షాట్లతో ఫిర్యాదులు ట్విటర్లో వెల్లువెత్తాయి. తమ ప్రొఫైల్‌లను యాక్సెస్ చేయలేకపోతున్నామని ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. ఇన్స్టాగ్రామ్ క్రాష్ అయినట్టు కనిపిస్తోంది లేదంటే..నాఅకౌంట్ బ్లాక అయిందా అంటూ ఒక వినియోగదారు సోమవారం ట్వీట్ చేశారు. ఏకంగా తమ ఖాతా 30 రోజుల పాటు సస్పెండ్ అనే మెసేజ్‌తోపాటు శాశ్వతంగా నిలిపివేసే ప్రమాదం ఉందనే అలర్ట్ వచ్చిందంటూ ఆందోళనకు గురయ్యారు. అంతేకాదు తమ ఫాలోవర్ల సంఖ్య కూడా పడిపోయిందని తెలిపారు. All of us coming to twitter to confirm instagram is down #instagramdown pic.twitter.com/DT6BthlNDK — cesar (@jebaiting) October 31, 2022 #instagramdown again. The only ones who never disappoint me pic.twitter.com/yeWxZurwvn — Mr bean (@thisbeann) October 31, 2022 Me trying to recover my Instagram account #instagramdown pic.twitter.com/3cOPNCBX2w — sparsh kanak (@kanak_sparsh) October 31, 2022 దీంతో ఈ వార్త ట్విటర్లో ట్రెండింగ్‌లో నిలిచింది. దీనిపై ఇన్స్టాగ్రామ్ స్పందించింది. అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నామని ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని ప్రకటించింది. Me apologising to my wifi after finding out Instagram is down #instagramdown pic.twitter.com/wk0I5XT91e — ABSOLUT VODKA (@VodkaTweetz) October 31, 2022 My account was blocked, anyone with the same problem? #instagramdown #instagramerror #instadown #Instagramcrashing pic.twitter.com/y4M7rmrzXq — ThatGirl. (@claudiahellen_) October 31, 2022 -
డేంజర్లో ఫేస్బుక్ ఖాతాలు: డక్టైల్ మాల్వేర్ కొత్త వెర్షన్
న్యూఢిల్లీ: సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఫేస్బుక్ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్. ఫేస్బుక్ బిజినెస్ ఖాతాలు కొత్త మాలావేర్ దాడికి గురయ్యాయి. డక్టైల్ మాల్వేర్ కొత్త పీహెచ్‌పీ వెర్షన్‌తో వినియోగదారులనుప్రమాదంలో నెట్టేసింది. పలు బిజినెస్ ఖాతాలు హ్యాకింగ్గు గురైనట్టు తెలుస్తోంది. దీనిపై క్లౌడ్ సెక్యూరిటీ క ంపెనీ తాజా హెచ్చరికలు జారీచేసింది. క్లౌడ్ సెక్యూరిటీ కంపెనీ, ZScaler అక్టోబర్ 13న తన బ్లాగ్ పోస్ట్‌లో ఈ కొత్త వాలావేర్ గురించి నివేదించింది. ఫ్రీ, క్రాక్డ్ అప్లికేషన్ ఇన్‌స్టాలర్‌గా ఆయా ఖాతాల్లోకి జొర పడుతోందని తెలిపింది. ఈ కొత్త పీహెచ్‌పీ డక్టైల్ మాల్వేర్, యూజర్ల ఇమెయిల్ అడ్రస్‌లు, పేమెంట్ రికార్డ్‌లు, ఫండింగ్ సోర్స్‌లు అకౌంట్ స్టేటస్‌లలో చెల్లింపు సమాచారం కూడా దృష్టి సారించింది. అంతేకాదు ఇది పేజీలను మార్చగలదు.. కీలక ఆర్థిక సమాచారాన్ని యాక్సెస్ చేయగలదని, ఫేస్‌బుక్‌తో పాటు టెలిగ్రామ్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ యాప్స్ సహా వివిధ ప్లాట్‌ఫారమ్‌లను కూడా లక్ష్యంగా చేసుకుందని కంపెనీ వెల్లడించింది. గతంలో ఉపయోగించిన డక్టైల్ డాట్నెట్ బైనరీకి బదులుగా తాజాగా దీన్ని సైబర్ నేరగాళ్లు పీహెచ్‌పీ మార్చారని పేర్కొంది. యాప్‌ను ఇన్స్టాల్ చేసిన తర్వాత, అప్లికేషన్ కంపాటబిలిటీని చెక్ చేసే నెపంతో, రెండు.tmp ఫైల్స్ జనరేట్ చేస్తున్నట్టు గుర్తించినట్టు తెలిపింది. అయితే ఈ రెండు డక్టైల్ వెర్షన్లు అత్యంత ప్రమాదకర మైనవని సూచించింది. ఇవి హానికరమైన కోడ్‌ను యూజర్ల ఖాతాలో వదిలి, దీని తరువాత, డేటా చోరీ చేస్తోందని వివరించింది. పుర్రె ఆకారంలో ఉండే కంప్యూటర్ కోడ్ డక్టైల్ మాలావేర్ను 2021లో తొలిసారి గుర్తించారు. డక్టైల్ ఇన్ఫోస్టీలర్ కీలకమైన డేటాను యాక్సెస్ చేయడం ద్వారా ఆర్థిక నష్టాన్ని కలిగించే అవకాశంకూడా ఉందని, ప్రొటెక్టివ్ లాగిన్ మెజర్స్ తీసుకున్న ఖాతాలు కూడా ప్రమాదంలో పడవచ్చని హెచ్చరిచింది. పీహెచ్‌పీ ఇన్ఫోస్టీలర్తో వినియోగ దారుల సమాచారం ఇప్పటికీ ప్రమాదంలో ఉందని తెలిపింది. -
దాదాపు 24 లక్షల అకౌంట్లకు షాకిచ్చిన వాట్సాప్
న్యూఢిల్లీ: సోషల్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ జూలైలో భారతదేశంలో 23.87 లక్షలకు పైగా ఖాతాలను నిషేధించింది. ఈ ఖాతాలపై వచ్చిన ఫిర్యాదులు ఆధారంగా ఈచర్చ తీసుకుంది. ఇదే ఏడాది జూన్‌లో 22 లక్షలకు పైగా ఖాతాలను, మేలో 19 లక్షల ఖాతాలు బ్యాన్ చేసింది. ఇది చదవండి : 100 డాలర్లు రీఫండ్ అడిగితే, కోటి ఇచ్చారా? ఇదెక్కడి చోద్యం రా మామా! మార్గదర్శకాలు,నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ ఖాతాలను బ్యాన్ చేసినట్టు ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ వెల్లడించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్-2021 నిబంధనల కింద తాజా నివేదికలో వాట్సాప్ఈవివరాలను అందించింది. అలాగే యూజర్ల ఫిర్యాదులు దానిపై తాము తీసుకున్న చర్యల వివరాలు కూడా పొందుపరిచామని వాట్సాప్ తెలిపింది. ఇదీ చదవండి: WhatsApp:బీ అలర్ట్: ఈ ఫోన్లలో వాట్సాప్ అక్టోబరు నుంచి పనిచేయదు జూలైలో అందిన 574 ఫిర్యాదుల నివేదికల్లో 392 నివేదికలు 'బ్యాన్ అప్పీల్' గాను, మిగిలినవి ఖాతా,ప్రొడక్ట్స్, భద్రత లాంటివి వచ్చాయని చెప్పింది. జూలై 1, 2022 , జూలై 31, 2022 మధ్య, 23,87,000 వాట్సాప్ ఖాతాలు నిషేధించామని, వీటిలో 14,16,000 ఖాతాలు ముందుగా బ్యాన్ చేశామని నెలవారీ నివేదిక పేర్కొంది. అంతకుముందు జూన్‌లో వాట్సాప్‌కు 632 ఫిర్యాదుల నివేదికలు అందగా, మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాటిలో 64పై చర్య తీసుకున్న సంగతి తెలిసిందే. -
వాట్సాప్ యూజర్లకు షాక్: లక్షల ఖాతాలపై నిషేధం
న్యూఢిల్లీ: మెసేజింగ్ యాప్ వాట్సాప్ మే నెలలో భారత్‌కు చెందిన 19.10 లక్షల ఖాతాలను నిషేధించింది. ఉల్లంఘనలను నిరోధించడానికి, గుర్తించడానికి ఏర్పాటు చేసిన సొంత యంత్రాంగంతోపాటు వినియోగదారుల ఫిర్యాదుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వాట్సాప్ ప్రకటించింది. ఈ ఏడాది మార్చిలో 18.05 లక్షలు, ఏప్రిల్‌లో 16 లక్షల భారతీయ ఖాతాలను వాట్సాప్ నిషేధించింది. గతేడాది అమల్లోకి వచ్చిన నూతన ఐటీ నియమాల ప్రకారం 50 లక్షలకు పైగా వినియోగదారులు ఉన్న పెద్ద డిజిటల్ వేదికలు ప్రతి నెలా ఫిర్యాదుల నివేదికలను ప్రచురించాల్సి ఉంటుంది. -
AP: సినిమా టికెట్ల కలెక్షన్లు.. ఒక్కరోజులోనే థియేటర్ల ఖాతాలోకి
సాక్షి, అమరావతి: ‘సినిమా టికెట్ల కలెక్షన్లు ఒక్కరోజులోనే థియేటర్ల ఖాతాలో జమవుతాయి. రోజువారి ప్రాతిపదికన టికెట్ల కలెక్షన్లు థియేటర్లకు చెల్లిస్తారు’.. ఇదీ ఏపీ స్టేట్ ఫిల్మ్, టీవీ, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీ) సినిమా థియేటర్ల యజమానులతో కుదర్చుకునే అవగాహన ఒప్పందం (ఎంఓయూ)లో స్పష్టంగా పేర్కొన్న అంశం. ఈ విధానంతోనే థియేటర్ల యజమానులతో కార్పొరేషన్ ఎంఓయూలు కుదుర్చుకుంటోంది. చదవండి: ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు పారదర్శకంగా ఆన్లైన్ విధానంలో టికెట్లు విక్రయిస్తే ఇక దశాబ్దాలుగా తాము సాగిస్తున్న దోపిడీకి అడ్డుకట్ట పడుతుందన్న ఆందోళనతో కొందరు తాజాగా ఓ దుష్ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. ‘ఆన్లైన్ విధానంలో సినిమా టికెట్ల విక్రయం మొదలైతే.. టికెట్ల కలెక్షన్ల మొత్తం ప్రభుత్వం థియేటర్ల యజమానులకు ఎప్పుడిస్తుందో’.. అంటూ థియేటర్ల యజమానులను గందరగోళపరిచేందుకు యత్నిస్తున్నారు. కానీ, దీంతో నిమిత్తం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్లను ఆన్లైన్ విధానంలో విక్రయించే విధానాన్ని త్వరలో ప్రారంభించడానికి ఉద్యుక్తమవుతోంది. రోజువారీ ప్రాతిపదికన థియేటర్ల ఖాతాకు బదిలీ ఆన్లైన్ విధానంలో సినిమా టికెట్ల విక్రయానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ప్రభుత్వం జీఓ జారీచేసి మార్గదర్శకాలను వెల్లడించింది. ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయానికి టెండర్ల ప్రక్రియ పూర్తిచేసింది. మరోవైపు.. ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీ రాష్ట్రంలోని సినిమా థియేటర్ల యజమానులతో ఒప్పందం కుదుర్చుకునే ప్రక్రియ చేపట్టింది. ఆన్లైన్ విధానంపై ఎలాంటి సందేహాలకు ఆస్కారంలేకుండా అన్ని అంశాలను సమగ్రంగా ఒప్పంద పత్రంలో పేర్కొంది. ప్రధానంగా ఆన్లైన్ విధానంలో సినిమా టికెట్ల విక్రయం ద్వారా వసూలైన మొత్తాన్ని థియేటర్ల యాజమాన్యానికి తిరిగి ఎప్పుడు బదిలీ చేస్తారు అనే అంశంపై స్పష్టత ఇచ్చింది. ఎంఓయూలోని ఆరో నిబంధనలో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొంది. టికెట్ల కలెక్షన్‌ను రోజువారి ప్రాతిపదికన సంబంధిత థియేటర్ల బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తామని వెల్లడించింది. సినిమా టికెట్ల కలెక్షన్లలో సర్వీస్ చార్జి (1.95శాతం) మినహాయించుకుని మిగిలిన మొత్తం అంటే జీఎస్టీతో సహా థియేటర్ల బ్యాంకు ఖాతాలో ఒక్క రోజులోనే జమవుతుంది. థియేటర్ల యాజమాన్యమే జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఒకరోజు కలెక్షన్ ఆ మర్నాడే థియేటర్ల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ అవుతుంది. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది. కాబట్టి సినిమా టికెట్ల విక్రయ మొత్తం తమకు ఎప్పుడు చేరుతుంది అనేదానిపై థియేటర్ల యాజమాన్యాలు ఆందోళన చెందాల్సిన అవసరమేలేదని ఎఫ్డీసీ వర్గాలు స్పష్టంచేస్తున్నాయి. అంతేకాదు.. ఆన్లైన్ విధానాన్ని సక్రమంగా నిర్వహించేందుకు మరికొన్ని నిబంధనలను కూడా ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. అవి.. ♦ఆన్లైన్ వెబ్సైట్ లాగిన్ సౌకర్యం థియేటర్ కౌంటర్ వద్ద, మేనేజర్ చాంబర్లోనూ కల్పిస్తారు. ♦థియేటర్లకు బీఫాం లైసెన్సులు రెన్యువల్ కూడా ఆన్లైన్ విధానంలోనే సులభంగా చేస్తారు. ♦సినిమా టికెట్లను ఆన్లైన్ విధానంలో ముందుగా రిజర్వ్ చేసుకునే సౌలభ్యం కల్పిస్తారు. అడ్వాన్స్ టికెట్ల బుకింగ్ మొత్తం కూడా సంబంధిత షో ముగిసిన తరువాతే థియేటర్ల బ్యాంకు ఖాతాకు బదిలీచేస్తారు. అక్రమాలకు కళ్లెంపడుతుందనే ఆందోళన దశాబ్దాలుగా సినిమా టికెట్ల విక్రయాల్లో అక్రమాలకు పాల్పడుతున్న కొందరికి ఆన్లైన్ విధానం సంకటప్రాయంగా మారింది. ఆన్లైన్ విధానాన్ని పారదర్శకంగా అమలుచేసేందుకు ప్రభుత్వం స్పష్టమైన విధివిధానాలను ప్రకటించడమే అందుకు కారణం. సినిమా సీట్లను మ్యాపింగ్ చేయనుండటంతో కలెక్షన్లను తక్కువగా చూపించి పన్ను ఎగవేయడం ఇకపై సాధ్యంకాదు. థియేటర్లు కచ్చితంగా బీఫామ్ లైసెన్స్‌ను రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి. అందుకే.. ఆన్లైన్ విధానాన్ని అడ్డుకునేందుకు కొందరు దుష్ప్రచారానికి తెరతీశారు. ప్రధానంగా.. హైదరాబాద్‌లో ఉంటున్న కొందరు ఏపీ థియేటర్ల యజమానులను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నారు. ఎంఓయూ కుదుర్చుకోకుంటే.. ఆన్లైన్ విధానానికి కట్టుబడిన రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. నిర్ణీత గడువులోనే థియేటర్ల యజమానులు ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని స్పష్టంచేసింది. జూలై మొదటివారంలో ఆన్లైన్ టికెట్ల విక్రయం విధానాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. ఈలోగా ఎంవోయూల ప్రక్రియ పూర్తిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్లను ప్రభుత్వం నిర్దేశించింది. అందుకు విరుద్ధంగా వ్యవహరించే థియేటర్లపై చర్యలు తీసుకోవాలని కూడా స్పష్టంచేసింది. -
భారతీయులకు షాక్.. వాట్సాప్ ఖాతాలపై నిషేధం
న్యూఢిల్లీ: మొబైల్ మెసేజింగ్ సంస్థ అయిన వాట్సాప్.. భారతీయులకు బిగ్ షాక్ ఇచ్చింది. హానికర కార్యకలాపాలను నిరోధించే ప్రక్రియలో భాగంగా భారతీయ యూజర్లు వినియోగిస్తున్న లక్షల సంఖ్యలో ఉన్న వాట్సాప్ ఖాతాలను నిషేధించింది. దీనికి సంబంధించి ఆయా వివరాలను సంస్థ పొందుపరిచింది. అయితే, కొందరు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఐటీ నిబంధనలను ఉల్లంఘించే యూజర్లపై గత కొంతకాలంగా చర్యలు తీసుకుంటున్న వాట్సాప్.. తాజాగా ఏప్రిల్ నెలకు సంబంధించిన నివేదికను విడుదల చేసింది. ఒక్క ఏప్రిల్ నెలలోనే భారత్‌లో 16.6 లక్షల ఖాతాలను నిషేధించినట్టు వెల్లడించింది. కొత్త ఐటీ రూల్స్‌కు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. కాగా, అడ్వాన్స్డ్ మెషీన్ లెర్నింగ్ సిస్టమ్ ద్వారా నిరంతరాయంగా ఇలా అపాయకర ఖాతాలను గుర్తించి, నిరోధించే ప్రక్రియ కొనసాగుతుందని సంస్థ తెలిపింది. అనుమానిత అకౌంట్‌పై నెగటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చినపుడు, ఇతరులు ఆ అకౌంట్‌ను బ్లాక్ చేసినపుడు ఆ అకౌంట్‌ను పర్యవేక్షించి తగు కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ఇదిలా ఉండగా.. కొత్త ఐటీ నిబంధనలు- 2021 ప్రకారం.. 50లక్షలకుపైగా యూజర్లు కలిగిన డిజిటల్ ప్లాట్‌ఫాంలు వాటికి సంబంధించిన ఫిర్యాదులు, తీసుకున్న చర్యలపై నెలవారీగా ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే ఏప్రిల్ 1 నుంచి 30 వరకు వాట్సాప్ వేదికపై రూల్స్‌కు విరుద్ధంగా ప్రవర్తించిన 16,66000 ఖాతాలపై నిషేధం విధించినట్టు వాట్సాప్ తెలిపింది. సందేశాలనూ సరిచేయొచ్చు! వాట్సాప్‌లో ఇతరులకు పంపే మెసేజ్‌లను మళ్లీ ఎడిట్/రీ–రైట్ చేసే ఆప్షన్ త్వరలో అందుబాటులోకి రావచ్చు. ఇది ప్రస్తుతం పరీక్ష దశలో ఉంది. Out of the total, 122 accounts were banned based on user complaints while 16.66 lakh accounts were barred to prevent harmful activity on the app, said the Facebook-owned messaging app.https://t.co/Xq6CXFimui — Mint (@livemint) June 1, 2022 -
నవ్వితే చాలు అకౌంట్‌కు డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయ్!
నవ్వు గురించి ఓ సినిమాలో "నవ్వవయ్యా బాబూ నీ సొమ్మేం పోతుంది, నీ సోకేం పోతుందనే" పాట విని ఉంటాం. ఆ పాట సంగతి అటుంచితే టెక్నాలజీ పుణ్యమా అని.. ఇప్పుడు నిజంగానే నవ్వితే చాలు అకౌంట్లో ఉన్న మన సొమ్ము మాయం కానుంది. మన అకౌంట్ నుంచి మరో అకౌంట్‌కు ట్రాన్స్ ఫర్ కానుంది. ఇది వినడానికి నమ్మశక్యం కాకపోవచ్చు. కానీ ఇది అక్షరాల నిజం. ఎందుకంటే! ఫైనాన్షియల్ సర్వీస్ దిగ్గజం మాస్టర్ కార్డ్ యూజర్లకు అదిరిపోయే టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. మాస్టర్ కార్డ్ వినియోగదారులు పేమెంట్ చేసేందుకు బయో మెట్రిక్ తంబ్ లేదంటే నవ్వితే చాలు కార్డ్, స్మార్ట్ ఫోన్, టెలిఫోన్‌తో అవసరం లేకుండా మరో అకౌంట్‌కు డబ్బుల్ని ట్రాన్స్ ఫర్ చేయోచ్చు. ప్రస్తుతం ఈ సరికొత్త ఫీచర్‌ను బ్రెజిల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నారు. త్వరలో ప్రపంచ వ్యాప్తంగా ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. కొత్త టెక్నాలజీతో బెన్ఫిట్స్ ఏంటంటే! ఈ కొత్త టెక్నాలజీతో కరోనాలాంటి వైరస్ల నుంచి వినియోగదారులు సురక్షితంగా ఉంచడంతో పాటు సెక్యూర్‌గా మరింత ఫాస్ట్‌గా డబ్బుల్ని మాస్టర్ కార్డ్ తెలిపింది. నేటి ఆధునిక జీవన శైలికి తగ్గట్లుగా వేగంగా పేమెంట్ సేవలందించేందుకు ఈ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చాం. ఇదే సమయంలో సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేశామని మాస్టర్ కార్డ్ సైబర్ అండ్ ఇంటెలిజెన్స్ ప్రెసిడెంట్ అజయ్ భల్లా తెలిపారు. కేబీవీ రీసెర్చ్ ఏం చెబుతోంది 2026 నాటికి ఈ కాంటాక్ట్ లెస్ బయో మెట్రిక్ టెక్నాలజీ బిజినెస్ 18.6బిలియన్ డాలర్లకు చేరుకోనుందని మార్కెట్ రీసెర్చ్ సంస్థ కేబీవీ రీసెర్చ్ తెలిపింది. అయితే మాస్టర్ కార్డ్ అందుబాటులోకి తెచ్చిన ఈ కొత్త సౌకర్యం ఇప్పటికే వీసా, అమెజాన్లు అభివృద్ధి చేశాయని తెలిపింది. చదవండి👉ఏటీఏం కార్డ్ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త! -
వాట్సాప్ ఖాతాలపై నిషేధం.?
-
టెలికాం లెక్కల్లో గోల్మాల్..రూ.890కోట్లు అవినీతి..కాగ్ నివేదిక
సమాచార సాంకేతికత (ఐటీ), టెలికం మంత్రిత్వశాఖల కింద పనిచేసే విభాగాల అకౌంట్లలో తీవ్ర అవకతవకలు ఉన్నట్లు కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) నివేదిక ఒకటి పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా ఎన్ఐసీఎస్ఐ (నేషనల్ ఇన్ఫార్మాటిక్స్ సెంటల్ సర్వీస్) ద్వారా రూ. 890 కోట్ల విలువైన హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ కొనుగోళ్లు వీటిలో ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు 2017–18, 2018–19 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి నివేదికలను విడుదల చేసింది. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్, సీ–డాట్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ , ఐటీఐ లిమిటెడ్, సీడీఏసీ తీసుకున్న నిర్ణయాలు ప్రతికూల ఆర్థిక పరిణామాలకు దారితీసేవిగా ఉన్నాయని లోక్‌సభలో ప్రవేశపెట్టిన కాగ్ నివేదిక పేర్కొంది. డైరెక్టరేట్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అండ్ విజువల్ పబ్లిసిటీ (డీఏవీపీ) ద్వారా ప్రింట్ మీడియా ప్రకటన విడుదలకు సంబంధించిన ప్రభుత్వ సూచనలకు కట్టుబడి ఉండేలా చూసుకోవడంలో నేషనల్ ఈ–గవర్నెన్స్ డివిజన్ (ఎన్ఈజీడీ) విఫలమైందని కూడా కాగ్ తన నివేదికలో పేర్కొంది. దీని ఫలితం రూ.1.21 కోట్ల అనవసర చెల్లింపులు జరిగాయని అంచనాలకు వచ్చింది. -
3 మిలియన్ల ఖాతాలను బ్యాన్ చేసిన వాట్సాప్!
ఈ ఏడాది జూన్ - జూలై నెలల మధ్య కాలంలో 3 మిలియన్లకు పైగా ఖాతాలను నిషేధించినట్లు ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వెల్లడించింది. హానికరమైన, అనుచితమైన సమాచారాన్ని అరికట్టడానికి, సురక్షితమైన యూజర్ అనుభవాన్ని అందించడం కోసం ఖాతాలను నిషేదించినట్లు వాట్సాప్ పేర్కొంది. యూజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదులు, ఇండియా గ్రీవియెన్స్ ఆఫీసర్ నుంచి అందుకున్న మెయిల్స్ ఆధారంగా ఈ మెసేజింగ్ ఫ్లాట్ ఫారంలో హానికరమైన సమాచారాన్ని అరికట్టడం కోసం ఆటోమేటెడ్ టూల్స్ ద్వారా ఖాతాలను నిషేదించింది. (చదవండి: Work From Home: కంపెనీల అనూహ్య నిర్ణయం) కొత్త ఐటీ రూల్స్ 2021కు అనుగుణంగా వాట్సాప్ తన యూజర్ సేఫ్టీ మంత్లీ రిపోర్ట్ బయటకు విడుదల చేసింది. ఈ ఏడాది జూన్ 16 - జూలై 31 మధ్య 46 రోజుల వ్యవధిలో వచ్చిన ఫిర్యాదులు ఆధారంగా, అలాగే తన స్వంత టూల్స్ గుర్తించిన స్పామ్ గల 3.027 మిలియన్ ఖాతాలను నిషేధించినట్లు వాట్సప్ పేర్కొంది. హానికరమైన, అనుచితమైన సమాచారాన్ని అరికట్టడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు వాట్సాప్ యాజమాన్యం పేర్కొంది. ఖాతాల నుంచి ఇలాంటి సమాచారం వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది. తప్పుడు సందేశాల వ్యాప్తికి కారణమవుతున్న ఖాతాలను గుర్తించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఏదైనా గ్రీవియెన్స్ కోసం మమ్మల్ని సంప్రదించాలంటే యూజర్లు wa@support.whatsapp.comకు ఈ-మెయిల్ చేయవచ్చు అని తెలిపింది. -
ఎస్... అవన్నీ వదంతులే!
‘ది ఫ్యామిలీ మేన్ 2’ వెబ్ సిరీస్‌లో ఉగ్రవాది రాజీ పాత్రను అద్భుతంగా చేసినందుకు బోలెడన్ని ప్రశంసలు దక్కించుకున్నారు సమంత. అలాగే ఎల్టీటీఈ (తమిళ ఈలం)కి సహకరించే తమిళ ఉగ్రవాదిగా కనిపించడం పట్ల తమిళ ప్రజల నుంచి విమర్శలు కూడా ఎదురయ్యాయి. తాజాగా ‘ది ఫ్యామిలీ మేన్ సీజన్ 2’ తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో తనకు ఎవరి మనోభావాలను కించపరిచే ఉద్దేశం లేదని సమంత పేర్కొన్నారు. ఇంకా ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ – ‘‘ఎవరి సొంత అభిప్రాయాలు వారికి ఉంటాయి. ఆ విషయాన్ని నేను ఆమోదిస్తాను. అయితే ఆ అభిప్రాయాన్నే వారు బలంగా నమ్ముతుంటే, వారి మనోభావాలను దెబ్బతీసినందుకు క్షమించమని కోరుతున్నాను. నేను ఎవర్నీ బాధపెట్టాలనుకోలేదు. ఉద్దేశపూర్వకంగా ఏదీ చేయలేదు. అయితే ఈ సిరీస్ రిలీజ్ అయ్యాక (హిందీలో రిలీజైంది) కొంతవరకూ విమర్శలు సద్దుమణిగాయి. ఊహించినంత చెడుగా లేదని చూసినవాళ్లల్లో కొందరు గ్రహించారు. చూడని ప్రేక్షకులు, ఒకవేళ చూసినా అదే అభిప్రాయానికి కట్టుబడి ఉన్నట్లయితే మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పుకుంటున్నాను’’ అన్నారు. ఇంకా రాజీ పాత్ర గురించి చెబుతూ – ‘‘తను విలన్ కాదు. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన అమ్మాయి. ఆమె పడిన ఇబ్బందులు విన్నవాళ్లెవరూ తను విలన్ అనుకోరు’’ అన్నారు సమంత. ఈ మధ్య సమంత తన సోషల్ మీడియా అకౌంట్స్ ఐడీలో ‘అక్కినేని’ అని తీసేసి ‘ఎస్’ అని మాత్రమే పెట్టుకోవడంతో పలు ఊహాగానాలు నెలకొన్నాయి. ఈ విషయం గురించి ప్రస్తావించినప్పుడు – ‘‘ఊహలన్నీ వదంతులే. అయినా నేను వదంతులకు ఎప్పుడూ స్పందించలేదు. ఇప్పుడూ అంతే’’ అన్నారు. ‘‘ఓ నెల రోజులు బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నాను. కొత్త ప్రాజెక్ట్స్ సైన్ చేయలేదు. బ్రేక్ అయ్యాక కథలు వింటాను’’ అన్నారు సమంత. -
తాలిబన్లకు భారీ షాకిచ్చిన ఫేస్బుక్..!
లండన్: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ తాలిబన్లపై కఠిన వైఖరిని ప్రదర్శిస్తోంది. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ యాప్‌లను వినియోగించకుండా తాలిబన్లపై ఫేస్బుక్ నిషేధం విధించింది. తాలిబన్లకు మద్దతుగా ఉన్న కంటెంట్‌పై కూడా ఫేస్బుక్ నిషేధం విధించనుంది. తాలిబన్లకు అనుకూలంగా ఉన్న కంటెంట్, వీడియోలను, పోస్ట్‌లను తొలగించేందుకు ప్రత్యేకమైన అఫ్గాన్ నిపుణుల బృందాన్ని ఫేస్బుక్ ఏర్పాటుచేసింది.(చదవండి: Afghanistan: తాలిబన్ల కీలక ప్రకటన.. అఫ్గాన్లకు..) తాలిబన్లను యూఎస్ టెర్రరిస్టు సంస్థగా గుర్తించిన్నట్లు ఫేస్బుక్ పేర్కొంది. గత కొన్నేళ్లుగా తాలిబన్ తన సందేశాలను వ్యాప్తి చేయడానికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్‌మీడియా ప్లాట్‌ఫాంలను వాడుకుంటుంది. తాలిబన్ల సందేశాలను నిర్మూలించడం కోసం ఫేస్బుక్ ప్రత్యేకంగా స్థానిక దరి పెర్షియన్, పష్తో భాషలను మాట్లాడే అఫ్గాన్ నిపుణులను నియమించినట్లు ఫేసుబుక్ ప్రతినిధి ఒక ప్రకటనలో వెల్లడించారు. తాలిబన్లు కమ్యూనికేట్ చేసుకోవడం కోసం వాట్సాప్ యాప్ వాడుతున్నట్లు తమ వద్ద నివేదికలు ఉన్నాయని ఫేస్బుక్ ప్రతినిధి తెలిపారు. వాట్సాప్‌లో సర్క్యూలేట్ అయ్యే మెసేజ్‌లను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామని ఫేస్బుక్ పేర్కొంది. (చదవండి: తాలిబన్ల దురాగతాలు.. ఫేస్బుక్, ట్విటర్, యూట్యూబ్ అలర్ట్! ఆ వీడియోలకు నోట్ తప్పనిసరి) -
ఈ బ్యాంకులో ఖాతా తెరిస్తే రూ. 25 లక్షల బీమా మీ సొంతం..!
కోవిడ్-19 రాకతో అనేక కుటుంబాలు చిన్నభిన్నమయ్యాయి. కరోనా వైరస్ కారణంగా అనేక కుటుంబాలు ఆర్థికంగా కూడా దెబ్బతిన్నాయి. అనేక కుటుంబాలు అప్పులు ఊబిలో చిక్కుకున్నాయి. ఇన్సురెన్స్ కలిగిన కుటుంబాలు కాస్త అప్పులబారిన పడకుండా నిలిచాయి. ప్రస్తుతం చాలా మంది హెల్త్ ఇన్సురెన్స్‌ల వైపు మొగ్గుచూపుతున్నారు. తాజాగా సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సరికొత్త హెల్త్ అండ్ వెల్నెస్ సేవింగ్స్ అకౌంట్‌ను అందుబాటులోకి తెచ్చింది. బ్యాంకులో సేవింగ్ అకౌంట్‌ను తీసుకున్న ఖాతాదారులకు ఆకర్షనీయమైన వడ్డీ రేట్లను అందించనుంది. అంతేకాకుండా మూడు ప్రధాన ఆఫర్లను ఖాతాదారులకు సూర్యోదయ బ్యాంకు ఇవ్వనుంది. ఈ బ్యాంకులో ఖాతా తీసుకున్న ఖాతాదారులకు రూ. 25 లక్షల టాప్ అప్ ఆరోగ్య భీమా లభిస్తుంది. దీంతో పాటుగా వార్షిక ఆరోగ్య సంరక్షణ ప్యాకేజీ, ఆన్ కాల్ అత్యవసర అంబులెన్స్ వైద్య సంరక్షణ సేవలను సూర్యోదయ స్మాల్ ఫినాన్స్ బ్యాంకు అందిస్తుంది. అకౌంట్‌ను ఓపెన్ చేసిన ఒక సంవత్సర కాలంపాటు టాప్ ఆప్ హెల్త్ ఇన్సూరెన్స్, హెల్త్‌కేర్ ప్యాకేజీలను ఉచితంగా ఇవ్వనుంది. 2022 మార్చి 31 వరకు దేశవ్యాప్తంగా 102 ప్రదేశాలలో 20 కి.మీ దూరం వరకు ఉచిత అంబులెన్స్ సేవను ఖాతాదారులకు అందిస్తోంది. ఈ ఆఫర్లను పొందాలంటే ఖాతాదారులు సగటున నెలసరి బ్యాలెన్స్ రూ. 3 లక్షల వరకు మెయింటెన్ చేయాల్సి ఉంటుందని బ్యాంకు పేర్కొంది. అంతేకాకుండా హెల్త్ డిక్లరేషన్ ఫారమ్‌కు అనుగుణంగా ఖాతాదారుడు అర్హతను సాధించాల్సి ఉంటుంది. హెల్త్ అండ్ వెల్నెస్ సేవింగ్ ఖాతా ప్రయోజనాలు.. కాంప్లిమెంటరీ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ రూ. 25 లక్షలు. 5 లక్షల కంటే ఎక్కువ వైద్య ఖర్చులు అయితేనే ఈ అమౌంట్‌ను పొందవచ్చును. ఈ హెల్త్ ఇన్సూరెన్స్‌తో సెల్ఫ్‌తో పాటుగా భార్యకు, ఇద్దరి పిల్లలకు వర్తించనుంది. ఉచితంగా ఆన్లైన్ డాక్టర్ సంప్రదింపులు, ఉచిత ఆరోగ్య పరీక్షలు, ఆన్లైన్ ఫార్మసీ వోచర్లు, నెట్వర్క్ డిస్కౌంట్ కార్డ్‌తో సహా నలుగురు సభ్యుల వరకు టాప్ అప్ హెల్త్ ఇన్సూరెన్స్ అందుబాటులో ఉండనుంది. మార్చి 31, 2022 వరకు ఎమర్జెన్సీ అంబులెన్స్ సేవలు. సేవింగ్ అకౌంట్‌పై 6.25 శాతం వడ్డీ లభిస్తుంది. ఖాతాదారులకు రూపే ప్లాటినం డెబిట్ కార్డును అందిస్తోంది. ఖాతాదారులు ఏటీఎమ్ నుంచి ప్రతిరోజు రూ. 1.5 లక్షల వరకు నగదును విత్‌డ్రా చేయవచ్చును. -
20 లక్షల ఖాతాలపై వాట్సప్ నిషేదం
న్యూఢిల్లీ: దేశంలో కొత్త ఐటీ నిబంధనల ప్రకారం వాట్సాప్ యాజమాన్యం నెలవారీ కాంప్లయన్స్ రిపోర్టును గురువారం విడుదల చేసింది. భారత్‌లో ఈ ఏడాది మే 15 నుంచి జూన్ 15 వరకూ 20 లక్షల వాట్సాప్ ఖాతాలను నిషేధించినట్లు వెల్లడించింది. ప్రజల నుంచి 345 ఫిర్యాదులు అందాయని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఐటీ రూల్స్ ప్రకారం.. 50 లక్షలకుపైగా ఖాతాదారులున్న ప్రతి సోషల్ మీడియా, డిజిటల్ వేదిక ప్రతినెలా కాంప్లయన్స్ నివేదిక విడుదల చేయాల్సి ఉంటుంది. ప్రజల నుంచి తమకు అందిన ఫిర్యాదులు, వాటిపై తీసుకున్న చర్యలను తప్పనిసరిగా తెలియజేయాలి. హానికరమైన, అనుచితమైన సమాచారాన్ని అరికట్టడానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు వాట్సాప్ యాజమాన్యం పేర్కొంది. ఖాతాల నుంచి ఇలాంటి సమాచారం వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది. తప్పుడు సందేశాల వ్యాప్తికి కారణమవుతున్న ఖాతాలను గుర్తించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నట్లు స్పష్టం చేసింది. తాము నిషేధం విధించిన ఖాతాల్లో 95 శాతం ఖాతాలు అనధికార (స్పామ్) మెసేజ్‌లకు సంబంధించినవేనని తెలియజేసింది. -
ఏపీ: రైతు ఖాతాల్లోకి విద్యుత్ బిల్లుల సొమ్ము
సాక్షి, అమరావతి: వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకం కింద శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ పంపుసెట్ల విద్యుత్ బిల్లులకు సంబంధించి 3,97,31,348 రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమచేస్తూ ప్రభుత్వం బుధవారం జీవో జారీచేసింది. శ్రీకాకుళం జిల్లాలో ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రయోగాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. జూన్ నెలలో జరిగిన విద్యుత్ వినియోగాన్ని లెక్కించిన తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ తమ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపింది. ఈ మొత్తాన్ని రైతు ఖాతాల్లోకి జమ చేస్తున్నట్టు ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి జీవోలో పేర్కొన్నారు. -
సేవింగ్స్ అకౌంట్ నుంచి రూ.94 లక్షలు మాయం.. ట్విస్ట్ ఏంటంటే..
సాక్షి, యశవంతపుర(కర్ణాటక): అకౌంట్లను హ్యాక్ చేసి రూ.94.72 లక్షలను దోచిన అంతర్జాతీయ ముఠాకు చెందిన ముగ్గురిని బెళగావి జిల్లా సదలగా పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలో ఉండే నైజీరియా వాసి ఉజకా పీటర్‌గోజి(40), మహారాష్ట్రవాసులు హరిశంకర పాండే (28), అభిజిత్ ఘనశ్యామ్ మిశ్రా(27)లను అరెస్ట్ చేశారు. బెళగావి జిల్లా నిప్పాణి తాలూకా బోరగాం అరిహంత సహకార బ్యాంక్‌కు చెందిన ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాలో రూ.15 లక్షలను ఈ ముఠా మే 28న డ్రా చేసింది. జూన్ 3న శమనెవాడిలోని అరిహంత సహకార బ్యాంక్‌లో సేవింగ్స్ ఖాతాలో ఉన్న రూ.79 లక్షలకు పైగా నగదును బదిలీ చేసుకుంది. భారీగా డబ్బులు మాయం కావడంపై బ్యాంక్ మేనేజర్ అశోక సదలగా పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తుచేసి ముంబైలో మోసగాళ్లను పట్టుకున్నారు. చదవండి: దావణగెరెలో మిస్సి కాటు బాలిక మృత్యువాత -
టార్గెట్ రూ.216 కోట్లు!
ఐదు ట్రస్ట్‌లకు సంబంధించిన రూ.200 కోట్లకు పైగా సొమ్ము బ్యాంకుల్లో కొన్నేళ్లుగా కదలకుండా ఉండటాన్ని ఓ ముఠా గమనించింది. వాటిని స్వాహా చేయడానికి స్కెచ్చేసింది. ఇది కనిపెట్టిన పుణే సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన ముగ్గురితో పాటు మొత్తం 14 మందిని అరెస్టు చేశారు. సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌తో పాటు గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లకు చెందిన వారితో కూడిన ఓ గ్యాంగ్ ఐదు ట్రస్ట్‌లకు సంబంధించిన సొమ్ముపై కన్నేసింది. ఆయా ట్రస్టుల బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.216 కోట్లకు పైగా మొత్తాన్ని కొట్టేయడానికి భారీ స్కెచ్ వేసింది. స్టాక్ బ్రోకర్ల ఖాతాల్లోకి మళ్లిస్తే ఎవరికీ అనుమానం రాదనే ఉద్దేశంతో వారి ద్వారా స్వాహా చేయడానికి రంగంలోకి దిగింది. దీనిపై సమాచారం అందుకున్న మహారాష్ట్రలోని పుణే సైబర్ క్రైమ్ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. తామే స్టాక్ బ్రోకర్లుగా నటించి 14 మందిని అరెస్టు చేశారు. వీరిలో హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు ఉన్నారని పుణే సైబర్ క్రైమ్ విభాగం అధికారి శివాజీ పవార్ బుధవారం ‘సాక్షి’కి తెలిపారు. ఈ వ్యవహారంలో బ్యాంకు సిబ్బంది పాత్రను అనుమానిస్తున్నామని, ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఆయన కథనం ప్రకారం.. పుణేకు చెందిన అనఘా మోడక్ ఈ వ్యవహారానికి సూత్రధారిగా ఉన్నాడు. ఎంబీఏ ఉత్తీర్ణుడైన ఇతను గతంలో కొన్ని ప్రైవేట్ ఉద్యోగాలు చేశాడు. అయితే గత ఏడాది కోవిడ్ ప్రభావంతో ఉద్యోగం కోల్పోయిన ఇతగాడు పెడతోవ పట్టి తేలిగ్గా డబ్బు సంపాదించడానికి అనువైన మార్గాలు అన్వేషించాడు. ఈ క్రమంలో ముంబైకి చెందిన కొందరు వ్యక్తుల నుంచి ఉత్తరాదికి చెందిన ఐదు ట్రస్ట్‌ల సమాచారం అతనికి అందింది. ఆ ట్రస్టులకు రెండు ప్రైవేట్ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయని, అయితే ఏళ్లుగా లావాదేవీలు జరగట్లేదని, వాటిలో పెద్దమొత్తంలో ఉన్న డబ్బులు ఎవ్వరూ డ్రా చేసుకోవట్లేదని తెలిసింది. ఈ సమాచారం లీక్ చేసింది ఆయా బ్యాంకులకు చెందిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐదింటిలో కలిపి రూ.216,29,54,240 సొమ్ము ఉందని, ఇతర వివరాలు పక్కాగా చెప్పడంతో పాటు ఆయా బ్యాంక్ ఖాతాల పిన్ నంబర్లు సైతం అందజేయడంతో వారి హస్తంపై అనుమానం కలుగుతోంది. బ్యాంకు ఖాతాల వివరాలతో పాటు ట్రస్ట్‌ల సమాచారంతో కూడిన దాదాపు 20 స్క్రీన్ షాట్లను మోడక్ వాట్సాప్ ద్వారా అందుకున్నాడు. ఇవన్నీ ఉన్నప్పటికీ ట్రస్ట్‌ల అధికారిక ఖాతాల్లో ఉన్న మొత్తాలను నేరుగా డ్రా చేసుకోవడం సాధ్యం కాదు కనుక ఓ పథకం వేశాడు. ఉత్తరాదిలోని వివిధ ప్రాంతాలకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో ఒప్పందాలు చేసుకున్నాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ల సాయంతో ఆయా బ్యాంక్ ఖాతాల్లో ఉన్న మొత్తాలను స్టాక్ బ్రోకర్లకు చెందిన కరెంట్ ఖాతాల్లోకి మళ్లించాలనేదే ఆ పథకం. ఈ వ్యవహారంలో సహకరించడానికి, స్టాక్ బ్రోకర్లను సమన్వయ పరచడానికి పరిచయస్తుల ద్వారా హైదరాబాద్‌లోని సికింద్రాబాద్‌కు చెందిన మామిడి రాజశేఖర్, వారాసిగూడలోని బౌద్ధనగర్‌కు చెందిన జి.లక్ష్మీనారాయణ, నాగోల్ బండ్లగూడ వాసి యువీ సుబ్రహ్మణ్యంలను భాగస్వాములుగా చేసుకున్నాడు. ఆ బ్యాంకు ఖాతాలను హ్యాక్ చేయడం ద్వారా వాటిలోని నగదును మళ్లించడానికి పథకం వేసిన మోడక్ దానికోసం హ్యాకర్లను సిద్ధం చేసుకున్నాడు. వారికి రూ.2.5 కోట్లు చెల్లించాల్సి ఉండగా రూ.25 లక్షలు సమీకరించి అడ్వాన్సుగా ఇచ్చాడు. ఇక స్టాక్ బ్రోకర్లను వెతికి పట్టుకోవడం, వారితో బేరసారాలు సాగించడం కోసం మోడక్ కొందరు అనుచరుల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. తొలుత వివిధ ప్రాంతాల స్టాక్ బ్రోకర్ల ఖాతాలను వాడుకోవాలని భావించారు. అయితే ఆఖరి నిమిషంలో ప్లాన్ మార్చి పుణే ప్రాంతానికే చెందిన వారి కోసం ఆరా తీయడం మొదలెట్టారు. దీంతో ఈ విషయం గత వారం పుణే సైబర్ క్రైమ్ పోలీసులకు తెలిసింది. దీంతో వారే స్టాక్ బ్రోకర్ల అవతారం ఎత్తారు. అనఘా మోడక్‌ను సంప్రదించిన పోలీసు బృందం తాము తమ ఖాతాలను అందించడానికి సిద్ధంగా ఉన్న ట్లు చెప్పింది. అతడు అంగీకరించి తన వద్ద ఉన్న డేటా బయటపెట్టడంతో పాటు తమ వలలో చిక్కడంతో అదుపులోకి తీసుకుంది. అతను వెల్లడించిన సమాచారం ఆధారంగా గుజరాత్, మహారాష్ట్రతో పాటు హైదరాబాద్, ఉత్తరప్రదేశ్‌ల్లోనూ దాడులు నిర్వహించి ముఠా సభ్యుల్ని అరెస్టు చేసింది. పరారైన బ్యాంకు సిబ్బంది కోసం గాలిస్తోంది. -
500 మంది ట్విటర్ ఖాతాలు రద్దు
న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా న్యూఢిల్లీలో రైతులు చేస్తున్న నిరసనలకు సంబంధించి తప్పుడు ప్రచారం చేస్తున్న వారి ట్విట్టర్ అకౌంట్లను రద్దు చేయాలన్న కేంద్ర ప్రభుత్వం ఆదేశాలపై సామాజిక మాధ్యమం ట్విట్టర్ చర్యలు మొదలు పెట్టింది. మొత్తం 500 మంది ట్విట్టర్ ఖాతాలను రద్దు చేసినట్టుగా తన బ్లాగ్‌లో ట్విట్టర్ పేర్కొంది. భారత్‌లో మరికొంత మందికి ట్విట్టర్‌తో యాక్సెస్ లేకుండా నిరోధించింది. అదే సమయంలో వినియోగదారుల స్వేచ్ఛను కాపాడతామని ట్విట్టర్ పేర్కొంది. వార్తా సంస్థలు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, రాజకీయనేతల ఖాతాల్ని నిరోధించలేమంది. అలా చేస్తే భారత రాజ్యాంగం వారికి ఇచ్చిన భావప్రకటనా స్వేచ్ఛను కాలరాసినట్టేనని ట్విట్టర్ కేంద్రానికి బదులిచ్చింది. రైతు ఉద్యమంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న పాకిస్తాన్, ఖలిస్తాన్ మద్దతుదారులకు చెందిన 1,178 ఖాతాలపై నిషేధం విధించాలని ఈ నెల 4న కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ సంస్థని ఆదేశించింది. రైతు నిరసనలపై తప్పుడు ప్రచారం చేస్తూ, రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని కేంద్రం ట్విట్టర్‌కి తెలిపింది. దీనిపై ట్విట్టర్ చర్యలు చేపడుతూ మొత్తం 500 మంది అకౌంట్లను నిషేధించింది. కొంత మంది ఖాతాల్లో విద్వేషపూరిత ట్వీట్లను తొలగించింది. ‘కూ’లో స్పందించిన కేంద్రం అమెరికాకి చెందిన ట్విట్టర్ సంస్థ తన చర్యలన్నింటినీ బ్లాగ్‌లో పేర్కొనడంపై కేంద్ర ప్రభుత్వం మండిపడింది. ఈ అంశంపై కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శితో అపాయింట్మెంట్ కోరిన ట్విట్టర్ ఇలా బ్లాగ్‌లో పోస్టు చెయ్యడం అసాధారణమని ఐటీ శాఖ పేర్కొంది. ఐటీ శాఖ తన స్పందనని దేశీయంగా తయారు చేసిన ట్విట్టర్ తరహా ‘కూ’ యాప్‌లో పోస్టు చేసింది. కేంద్రం తన స్పందనని కూ యాప్‌లో ఉంచడంతో ఈ యాప్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
ట్విట్టర్ సంచలన నిర్ణయం: 250 అకౌంట్లు బ్లాక్
న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్‌పై రైతులు సాగిస్తున్న పోరాటం ప్రభావం చాలా అంశాలపై పడుతోంది. వారి నిరసనల నేపథ్యంలోనే తాజాగా ట్విట్టర్ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా దాదాపు 250 అకౌంట్లను సోమవారం ట్విట్టర్ సంస్థ బ్లాక్ చేసింది. అకౌంట్లు బ్లాక్ అయిన వారు ఎవరో కాదంట.. తప్పుడు సమాచారం పోస్ట్ చేయడంతోపాటు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణతో ట్విట్టర్ చర్యలు చేపట్టింది. అతే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే ట్విట్టర్ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. తప్పుడు సమాచారం, రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్న పలువురి ట్విట్టర్ ఖాతాలపై చర్యలు తీసుకోవాలంటూ వారం కిందట ట్విట్టర్ సంస్థకు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. అందులో భాగంగానే ట్విట్టర్ తాజా నిర్ణయం. ప్రసారభారతి సీఈఓతో పాటు పలువురు ప్రముఖ వ్యక్తులకు చెందిన ట్విట్టర్ ఖాతాలను మూసివేస్తున్నట్లు ట్విట్టర్ ప్రకటన విడుదల చేసింది. "భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడటానికి పారదర్శకత చాలా ముఖ్యమైనది.నిలిపివేయబడిన కంటెంట్ కోసం మాకు నోటీసు విధానం ఉన్నది. కంటెంట్‌ను నిలిపివేయమని అభ్యర్థనలు అందిన అనంతరం ప్రభావిత ఖాతాదారులకు సమాచారాన్ని వెంటనే తెలియజేస్తాం" అని ట్విటర్ ఆ ప్రకటనలో తెలిపింది. '#ModiPlanningFarmerGenocide' హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగిస్తున్న, జనవరి 30వ తేదీన నకిలీ, బెదిరింపు, రెచ్చగొట్టే ట్వీట్లు చేస్తున్న దాదాపు 250 ట్వీట్లు / ట్విట్టర్ ఖాతాలను బ్లాక్ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ.. ట్విట్టర్‌ను ఆదేశించినట్లు తెలుస్తోంది. ప్రజలను రెచ్చగొడుతుండడంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, సెక్షన్ 69 ఏ కింద ఆయా ట్విట్టర్ ఖాతాలను, ట్వీట్లను బ్లాక్ చేయమని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. దేశ రాజధాని సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనను దృష్టిలో ఉంచుకుని దేశంలో శాంతిభద్రతల సమస్యలు పెరగకుండా నిరోధించాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖతోపాటు వివిధ చట్ట అమలు సంస్థల అభ్యర్థనను అనుసరించి ట్విట్టర్ సంస్థ ఈ ఖాతాలను బ్లాక్ చేసింది. -
రాత్రికి రాత్రే రైతు ఖాతాలో రూ.473 కోట్లు
నల్లగొండ/యాదాద్రి/తుర్కపల్లి: ఓ సామాన్య రైతు ఖాతాలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.473 కోట్ల మేర నగదు జమైంది. అంత డబ్బు తన ఖాతాలో చూసిన ఆ రైతు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గంధమల్ల గ్రామానికి చెందిన అనుమూల సంజీవరెడ్డి అనే రైతుకు భువనగిరిలోని డక్కన్ గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉంది. సంజీవరెడ్డి బుధవారం పక్కనున్న సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌కు వెళ్లాడు. డబ్బులు అవసరం ఉండగా ఏటీఎం కార్డు ద్వారా డీసీసీబీ ఏటీఎం సెంటర్లో డబ్బులు డ్రా చేసేందుకు ప్రయత్నించాడు. ఎన్నిసార్లు ప్రయత్నించినా డబ్బులు రాకపోవడంతో బ్యాలెన్స్ చెక్ చేసుకున్నాడు. అంతే తన ఖాతాలోని బ్యాలెన్స్ చూసి ఆశ్చర్యపోయాడు. ఖాతాలో రూ.473,13,30,000 అని ఉంది. ఇన్ని డబ్బులు తన ఖాతాలో ఎందుకు ఉన్నాయో అతనికి అర్థం కాలేదు. ఆ ఏటీఎంలో తప్పుడు రిసిప్ట్ ఏమైనా వచ్చిందేమోనని ఎస్బీఐ ఏటీఎంలో కూడా చెక్ చేశాడు. అక్కడా అంతే బ్యాలెన్స్ చూపించింది. (చదవండి: నోట్లోంచి డబ్బులు రప్పిస్తానని.. ) అయితే తన ఖాతాలో అన్ని డబ్బులు ఉన్నా.. ఏటీఎం నుంచి డబ్బులు ఎందుకు రావడం లేదో తెలుసుకునేందుకు గురువారం భువనగిరిలోని డక్కన్ గ్రామీణ బ్యాంకుకు వెళ్లాడు. బ్యాంకు అధికారులకు విషయం తెలపగా వారు చెక్ చేసి ‘మీ అకౌంట్ ఫ్రీజ్ అయ్యింది.. ఏటీఎం సర్వర్ పనిచేయడం లేదు’.. అని సమాధానం ఇచ్చారు. ఏటీఎం రిసిప్ట్‌లో భారీ మొత్తంలో బ్యాలెన్స్ చూపిస్తోందని చెప్పగా.. ‘మీ ఖాతాలో కేవలం రూ.4వేల చిల్లర మాత్రమే ఉందని’సమాధానం ఇచ్చారు. దీంతో సంజీవరెడ్డి ఏమీ అర్థంకాక వెనుదిరిగి ఇంటికి చేరుకున్నాడు. కాగా, అతని ఖాతాలో కోట్ల కొద్ది డబ్బు జమైందన్న విషయం రెండు రోజులుగా మండలంలో చర్చనీయాంశమైంది. -
ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్ అకౌంట్
సినిమా వీక్షకులకు శుభవార్త తెలిపింది నెట్‌ఫ్లిక్స్. నెట్‌ఫ్లిక్స్ డిసెంబర్ 5, 6 తేదీల్లో మనదేశంలో స్ట్రీమ్ ఫెస్ట్‌ను నిర్వహిస్తుంది. ఈ 48 గంటల ఫెస్ట్‌ను డిసెంబర్ 5న తెల్లవారుజామున 12.01 నుండి డిసెంబర్ 6న రాత్రి 11.59 గంటలకు వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది నెట్‌ఫ్లిక్స్. డిసెంబర్ 5, 6 తేదీల్లో అభిమానులు ఉచితంగా సినిమాలు, వెబ్ సిరీసులు భారతీయ అన్ని భాషల్లోని కంటెంట్‌ను ఉచితంగా చూడొచ్చని తెలిపింది. మొదటగా దీన్ని మనదేశంలో మాత్రమే అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇది ఒకవేళ విజయవంతం అయితే మిగతా దేశాలలో ప్రవేశపెట్టాలని చూస్తుంది.(చదవండి: వాట్సప్ సేవలు ఇక బంద్) భారత ఓటీటీ మార్కెట్లో అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్, జీ5 వంటి వాటికీ పోటీగా ఎదిగేందుకే నెట్‌ఫ్లిక్స్ రెండు రోజులు ఉచితంగా కంటెంట్‌ను వీక్షించే అవకాశాన్ని కల్పిస్తుండటం గమనార్హం. రేపటి నుండి ప్రారంభం అయ్యే ఫెస్ట్ లో క్రెడిట్ లేదా డెబిట్ కార్డు లేదా చెల్లింపు అవసరం లేదని కంపెనీ ధ్రువీకరించింది. ఈ స్ట్రీమింగ్ ఫెస్ట్‌లో కంటెంట్‌ను వీక్షించడానికి మీరు మీ ఇమెయిల్ ఐడీ లేదా పేరు లేదా ఫోన్ నంబర్‌తో సైన్ అప్ చేసుకోవాలి. ఒకరి లాగిన్ సమాచారాన్ని మరొకరు ఉపయోగించుకొనేందుకు వీల్లేదని తెలిపారు. 480p రిజల్యూషన్‌తో కంటెంట్ ని స్ట్రీమ్ చేయవచ్చు. 2020 3వ త్రైమాసికంలో ఫలితాలు నెట్‌ఫ్లిక్స్‌కు ఆశాజనకంగా లేవు. ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో 1.57 కోట్ల కొత్త సబ్ స్క్రైబర్లు రాగా, రెండో త్రైమాసికంలో అది కోటి సబ్ స్క్రైబర్లకు తగ్గింది. ఇప్పుడు మూడో త్రైమాసికంలో ఏకంగా 22 లక్షలకు పడిపోయింది. దీంతో నెట్ ఫ్లిక్స్ వినియోగదారులను ఆకట్టుకోవడానికి కొత్త ప్రయోగాలు చేస్తోంది. -
నల్లధనంపై పోరులో కీలక ముందడుగు
న్యూఢిల్లీ /బెర్న్ : స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో భారతీయుల ఖాతాల వివరాలకు సంబంధించి రెండో జాబితా భారత్‌కు చేరింది. స్విట్జర్లాండ్‌తో సమాచార మార్పిడి ఒప్పందానికి (ఏఈఓఐ) అనుగుణంగా భారత్‌కు స్విట్జర్లాండ్ ఈ కీలక సమాచారం అందచేసింది. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనంపై ప్రభుత్వం చేపట్టిన పోరాటంలో ఇది మైలురాయిగా భావిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ ఒప్పందం కింద స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) బ్యాంకు ఖాతాలపై సమాచారాన్ని అందిస్తున్న 86 దేశాల్లో భారత్ ఒకటి. ఏఈఓఐ కింద స్విస్ బ్యాంకుల్లో భారత పౌరుల బ్యాంకు ఖాతాల వివరాలకు సంబంధించి 2019 సెప్టెంబర్‌లో భారత్ స్విట్జర్లాండ్ నుంచి తొలి జాబితా అందుకుంది. చదవండి : బంజారాహిల్స్‌లో గుట్టలుగా కరెన్సీ కట్టలు ఈ ఏడాది 31 లక్షల ఫైనాన్షియల్ అకౌంట్లకు సంబంధించిన సమాచారాన్ని ఆయా దేశాలతో పంచుకున్నామని ఎఫ్‌డీఏ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. స్విస్ బ్యాంకుల్లో 86 దేశాలకు చెందిన 31 లక్షల ఖాతాల సమాచారాన్ని స్విట్జర్లాండ్ పంచుకోగా అందులో భారత జాతీయులు, సంస్ధల సంఖ్య భారీగానే ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. పన్ను ఎగవేత, ఇతర ఆర్థిక నేరాలకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా గత ఏడాదిగా భారత అధికారుల విజ్ఞప్తి మేరకు స్విస్ అధికారులు 100కు పైగా వ్యక్తులు, సంస్ధలకు సంబంధించిన సమాచారాన్ని పంచుకున్నారని అధికారులు తెలిపారు. ఇక చురుగ్గా ఉన్న ఖాతాలు, 2018లో మూసివేసిన ఖాతాలకు సంబంధించిన సమాచారాన్ని ఏఈఓఐలో భాగంగా స్విస్ అధికారులు భారత్‌తో పంచుకుంటారు. స్విస్ అధికారులు పంచుకున్న ఖాతాల్లో పనామా, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, కేమాన్ దీవులు వంటి విదేశాల్లో భారతీయులు నెలకొల్పిన కంపెనీలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు, రాజ కుటుంబాలకు చెందిన వ్యక్తుల వివరాలు ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే రెండో జాబితాలో వెల్లడించిన భారతీయుల ఖాతాల్లో ఎంత మొత్తం సంపద ఉందనే వివరాలను అధికారులు వెల్లడించలేదున. ఒప్పంద నిబంధనల్లో పొందుపరిచిన గోప్యతా క్లాజుల కారణంగా సమాచారాన్ని వెల్లడించలేమని అధికారులు చెబుతున్నారు. స్విస్ అధికారులు పంచుకునే సమాచారంలో స్విస్ బ్యాంకు ఖాతాలకు సంబంధించి ఖాతాదారు పేరు, చిరునామా, నివసించే దేశం, పన్ను గుర్తింపు నెంబర్, ఆయా బ్యాంకుల పేర్లు, అకౌంట్లో బ్యాలెన్స్, క్యాపిటల్ ఇన్‌కం వంటి కీలక సమాచారం ఉంటుంది. పన్ను చెల్లింపుదారులు తమ ట్యాక్స్ రిటన్స్‌లో సరైన సమాచారం అందించారా లేదా అనే కోణంలో పన్ను అధికారులు ఈ సమాచారాన్ని పరిశీలించేందుకు అనుమతిస్తారు. ఇక వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో స్విస్ అధికారులు తమ బ్యాంకుల్లో భారత జాతీయులు, వారి సారథ్యంలోని సంస్ధల ఖాతాలకు సంబంధించిన సమచారంతో కూడిన మూడో జాబితాను భారత్‌కు అందచేస్తారు. -
ఆ వీడియోల కోసం యాహూ మాజీ ఉద్యోగి నిర్వాకం
మనుషుల విపరీత ధోరణులు, వికారాలు ఎంత హేయంగా వుంటాయనే దానికి నిదర్శనం యాహూ ఉద్యోగి మాజీ ఇంజనీర్ రీస్ డేనియల్ రూయిజ్ (34). లైంగిక ఫోటోలు, వీడియోల కోసం ఏకంగా 6,000 ఖాతాలను హ్యాక్ చేశాడు. అదీ తనకు తెలిసిన మహిళలు, తన తోటి మహిళా ఉద్యోగుల ఖాతాలనుంచే వీటిని చోరీ చేశాడు. ఎన్‌గాడ్జెట్ అందించిన కథనం ప్రకారం సంస్థలోని అంతర్గత నెట్‌వర్క్‌కు తన కున్న యాక్సెస్‌ను ఉపయోగించుకొని ఈ దురాగతానికి పాల్పడ్డాడు. తద్వారా వేలాది వినియోగదారుల పాస్‌వర్డ్స్‌ను హ్యాక్ చేశాడు. వారి ఖాతాల్లోని వ్యక్తిగత ఫోటోలను, వీడియోలను తన పర్సనల్ హార్డ్ డ్రైవ్‌కు డౌన్లోడ్ చేశాడు.ప్రధానంగా మహిళలు,చిన్నపిల్లల సోషల్ మీడియా ఖాతాలే అతడి టార్గెట్. అంతేకాదు వీరిలో తన స్నేహితులు, మహిళా సహోద్యోగులు కూడా ఉన్నారని స్వయంగా రూయిజ్ వెల్లడించాడు. థర్డ్ పార్టీ సైట్స్ ద్వారా యాపిల్ ఐక్లౌడ్, ఫేస్బుక్, జీమెయిల్, డ్రాప్‌బాక్స్ తదితర ఖాతాల పాస్వర్డ్ రీసెట్ చేసి, తనకు కావాల్సిన డాటాను చోరీ చేసేవాడు. తాజాగా రూయిజ్ తన నేరాన్ని అంగింకరించాడు. ఇందుకు రూయిజ్ ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని అంచనా. -
ఎంఐఎం టిక్ టాక్
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియా యాప్ ‘టిక్ టాక్’లో అధికారిక ఖాతా ఉన్న తొలి రాజకీయ పార్టీగా ఎంఐఎం రికార్డుకెక్కింది. ఈ మేరకు మంగళవారం ఆ పార్టీ కేంద్ర కార్యాలయమైన దారుస్సలాం నుంచి ఒక ప్రకటన విడుదలైంది. దేశంలోని యువ ఇంటర్నెట్ వినియోగదారులను టిక్‌టాక్ ద్వారా చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టం చేసింది. పార్టీ అధికారిక ‘టిక్‌టాక్’ఖాతాను సుమారు 7000 మంది అనుసరిస్తుండగా, 60 వేల మంది లైక్‌లు, 75 వీడియోలు వచ్చాయన్నారు. యువత తమ భావ స్వేచ్ఛను పంచుకునేందుకు ఇది ఒక వేదికగా పనిచేస్తోందని పేర్కొంది. -
కాసులు ఖాతాల్లోకి..
ఖమ్మంవ్యవసాయం: పెట్టుబడి పైకం రైతుల ఖాతాల్లోకి చేరుతోంది. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నుంచి రైతుబంధు పేరిట నూతన పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో పంటల సాగుకు పెట్టుబడి సహాయం అందించి.. రైతులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది నుంచి సీజన్‌కు ఎకరాకు రూ.5వేల చొప్పున పెట్టుబడి నగదు అందించాలని ప్రభుత్వం నిర్ణయించి.. పకడ్బందీగా అమలు చేస్తోంది. దీంతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు జిల్లాలో 2,79,198 మంది రైతులకు చెందిన 6.87 లక్షల ఎకరాల భూమికి రూ.343.10కోట్ల పెట్టుబడి సహాయం అందనుంది. ఇప్పటికే ఈ ప్రక్రియను వ్యవసాయ శాఖ ప్రారంభించింది. రైతుల బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సహాయం జమ అయ్యే విధంగా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. గత ఏడాది ఒక్కో సీజన్‌కు ఎకరాకు రూ.4వేల చొప్పున రైతులకు పెట్టుబడి సహాయం అందించి ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పుడు ఖరీఫ్, రబీ సీజన్లలో వేర్వేరుగా ఎకరాకు రూ. 4వేల చొప్పున పంటలకు పెట్టుబడి సహా యం రూ.8వేలను ప్రభుత్వం అందించింది. ఖరీఫ్ సీజన్లో చెక్కుల రూపంలో పెట్టుబడి అందించిన ప్రభుత్వం.. రబీ సీజన్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పెట్టుబడి సాయాన్ని రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. అదే విధానాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఎకరాకు రూ.5వేల పెట్టుబడి సాయం ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి ఎకరాకు రూ.5వేల చొప్పున ప్రభుత్వం పెట్టుబడి సహాయం అందిస్తోంది. గత ఏడాది సీజన్‌కు రూ.4వేల చొప్పున పెట్టుబడి సాయం అందించిన ప్రభుత్వం.. రైతులను మరింతగా ప్రోత్సహించేందుకు ఈ ఏడాది నుంచి ఎకరాకు మరో రూ.వెయ్యి పెంచింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో రైతుబంధు పథకంలో ఎకరాకు సీజన్‌కు మరో రూ.వెయ్యి పెంచుతామని పేర్కొంది. మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయంలో మరింత శ్రద్ధ చూపి.. ఖరీఫ్ సీజన్ నాటికి ఎకరాకు రూ.5వేల చొప్పున రైతులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి ఎకరాకు రూ.5వేల చొప్పున పెట్టుబడి సహాయం అందించే ప్రక్రియను వ్యవసాయ శాఖ చేపట్టింది. 2,79,198 మంది రైతులకు ‘పెట్టుబడి’ జిల్లాలో సొంత భూములతో పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగిన 2,79,198 మంది రైతులకు ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతుబంధు పథకం వర్తించనుంది. ప్రభుత్వం గత ఏడాది నుంచి అందిస్తున్న పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగిన రైతులకు, అటవీ భూములకు(పోడు) హక్కు పత్రాలు కలిగిన రైతులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 6.87 లక్షల ఎకరాల భూమికి రూ.343.10కోట్లు కేటాయింపు జిల్లాలో వివిధ రకాలుగా పట్టాలు కలిగి ఉన్న 6.87 లక్షల ఎకరాల భూమికి ప్రభు త్వం పెట్టుబడి సాయం అందించేందుకు చర్యలు తీసుకుంది. మొత్తం భూమి లో పంటల సాగుకు పెట్టుబడి సహాయంగా రూ.343.10కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఈ సహాయంతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతులు తమ భూముల్లో సాగు చేసే పంటలకు సంబంధించిన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం లక్ష్యం కూడా అదే. పెట్టుబడి సహాయంతో పంటలను సాగు చేసుకోవాలని ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు అవగాహన కల్పిçంచే ప్రయత్నాలు చేస్తోంది. సద్వినియోగం చేసుకోవాలి.. ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు అందిస్తున్న రైతుబంధు పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. పంటల సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువుల కొనుగోలు కోసం రైతుబంధు పథకం నగదును వినియోగించుకోవాలి. ప్రభుత్వం చేపట్టిన ఈ పథకం రైతులకు, వ్యవసాయ రంగానికి ఎంతో మేలు చేస్తుంది. ఖరీఫ్ సీజన్‌కు అనుకూలంగా పెట్టుబడి సహాయం రైతులకు బ్యాంక్ ఖాతాల ద్వారా చేరుతుంది. ఆ ఖాతాల నుంచి నగదును వివిధ రకాలుగా పంట పెట్టుబడులకు వినియోగించుకోవచ్చు. – ఏ.ఝాన్సీలక్ష్మీకుమారి, జిల్లా వ్యవసాయాధికారి -
విప్రో బైబ్యాక్ బొనాంజా
న్యూఢిల్లీ: దేశీ ఐటీ దిగ్గజం విప్రో మరోసారి ఇన్వెస్టర్లకు తీపి కబురు చెప్పింది. భారీస్థాయిలో రూ.10,500 కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించింది. కంపెనీ మంగళవారం మార్చి క్వార్టర్(క్యూ4) ఫలితాల సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించింది. కాగా, బైబ్యాక్‌లో భాగంగా షేరుకు రూ.325 ధర చొప్పున 32.3 కోట్ల షేర్లను తమ వాటాదారుల నుంచి తిరిగి కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. ఈ ప్రతిపాదనకు తమ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపినట్లు వెల్లడించింది. కంపెనీ మొత్తం పెయిడ్–అప్ ఈక్విటీలో ఇది 5.35 శాతానికి సమానం.సెబీ నిబంధనల ప్రకారం టెండర్ ఆఫర్ రూపంలో ప్రస్తుత వాటాదారుల నుంచి ఈ బైబ్యాక్‌ను చేపట్టనున్నట్లు విప్రో ఎక్సే్ఛంజీలకు వెల్లడించిన సమాచారంలో పేర్కొంది. ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ కంపెనీ కూడా బైబ్యాక్‌లో పాలుపంచుకోవడానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలిపింది. కాగా, తాజా బైబ్యాక్ ధర విప్రో షేరు మంగళవారం నాటి మార్కెట్ ముగింపు ధర రూ.281తో పోలిస్తే దాదాపు 16 శాతం అధికం కావడం గమనార్హం. 15 నెలల్లో రెండోది... గడిచిన 15 నెలల్లో ఇది విప్రో ప్రకటించిన రెండో షేర్ల బైబ్యాక్. 2017 నవంబర్–డిసెంబర్లో విప్రో రూ.11,000 కోట్ల విలువైన షేర్లను ఇన్వెస్టర్ల నుంచి తిరిగి కొనుగోలు చేసింది. ఇక గడిచిన నాలుగేళ్ల కాలాన్ని తీసుకుంటే విప్రో చేపట్టిన మూడో బైబ్యాక్ ఇది. 2016లో తొలిసారి విప్రో రూ. 2,500 కోట్ల బైబ్యాక్‌ను ప్రకటించింది. కాగా, ఈ ఏడాది మార్చి 31 నాటికి విప్రోలో ప్రమోటర్లకు 73.85 శాతం వాటా ఉంది. 6.49 శాతం వాటా ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్ చేతిలో ఉంది. ఇక విదేశీ ఇన్వెస్టర్ల వద్ద 11.74 శాతం వాటా, ప్రజలు, కార్పొరేట్లు, ఇతరత్రా ఇన్వెస్టర్ల వద్ద 7.92 శాతం వాటా ఉంది. తాజా బైబ్యాక్ ఆఫర్ నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి చేపడతామని... పోస్టల్ బ్యాలెట్ ద్వారా వాటాదారుల ఆమోదం తీసుకోనున్నట్లు కంపెనీ పేర్కొంది. బైబ్యాక్ ప్రక్రియ, కాల వ్యవధి, ఇతర వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది. ఐటీ కంపెల బైబ్యాక్ రూటు... భారీ మొత్తంలో ఉన్న నగదు నిల్వలను ఇన్వెస్టర్లకు పంచేందుకు ఇటీవల కాలంలో దేశీ ఐటీ కంపెనీలు వరుసపెట్టి బైబ్యాక్‌లను ప్రకటిస్తున్నాయి. గత రెండేళ్లలో దేశీ ఐటీ అగ్రగామి టీసీఎస్ ఏకంగా రూ.16,000 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్ రూపంలో కొనుగోలు చేసింది. రెండో అతిపెద్ద దేశీ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ కూడా 2017 డిసెంబర్లో రూ.13,000 కోట్ల బైబ్యాక్‌ను ప్రకటించగా.. మళ్లీ ఈ ఏడాది జనవరిలో రూ.8,260 కోట్ల బైబ్యాక్ ఆఫర్‌ను చేపట్టింది. ఇంకా హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎంఫసిస్ ఇతరత్రా ఐటీ కంపెనీలు కూడా బైబ్యాక్‌లు, ప్రత్యేక డివిడెండ్ల రూపంలో ఇన్వెసర్లకు మంచి రాబడులనే అందించాయి. కాగా, ఎల్అండ్టీ బలవంతంగా టేకోవర్ చేసేందుకు ప్రయత్నిస్తున్న మైండ్‌ట్రీ కూడా ప్రత్యేక డివిడెండ్‌పై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మార్కెట్ విలువ (క్యాపిటలైజేషన్) పరంగా టాప్–5 దేశీ ఐటీ కంపెనీలు 2017 జనవరి నుంచి 2019 జనవరి మధ్య కాలంలో ఏకంగా రూ.1.17 లక్షల కోట్లను షేర్ల బైబ్యాక్, డివిడెండ్ల రూపంలో ఇన్వెస్టర్లకు చెల్లించాయి. ఏడాదికి ఒక్కసారి మాత్రమే షేర్లను బైబ్యాక్ చేసేందుకు సెబీ నిబంధనలు అనుమతిస్తున్నాయి. షేర్ల బైబ్యాక్ కారణంగా కంపెనీ షేరువారీ ఆర్జన (ఈపీఎస్) మెరుగుపడుతుంది. -
కాంగ్రెస్‌కు షాక్: భారీగా ఫేస్బుక్ పేజీల తొలగింపు
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల వేళ దేశంలోని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్‌తో సంబంధం ఉన్న వ్యక్తుల నకిలీ అకౌంట్లు, పేజీలను భారీ స్థాయిలో తొలగించినట్లు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ పోమవారం వెల్లడించింది. యూజర్లను తమ పోస్టులతో తప్పుదోవ పట్టిస్తున్నందు వల్లే ఫేక్ అకౌంట్లను తొలగించినట్లు ఫేస్బుక్ తెలిపింది. అలాగే తొలగించిన కొన్ని నమూనా పేజీలను కూడా పోస్ట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్లో పనిచేసే వారి వ్యక్తిగత అకౌంట్లతో సంబంధం ఉన్న ఎఫ్బీ పేజీలను తొలగించినట్లు ఎఫ్బీ సైబర్ సెక్యూర్టీ హెడ్ నథానియల్ గ్లిచర్ తెలిపారు. వీటిని ఆటోమేటెడ్ సిస్టమ్స్ ద్వారా గుర్తించినట్టు చెప్పారు. వ్యక్తులు వారి గుర్తింపును దాచి పెట్టడానికి ప్రయత్నించినా, కాంగ్రెస్ ఐటీ సెల్‌తో ఉన్న అనుబంధం ద్వారా గుర్తించామన్నారు. ఆయా అకౌంట్ల ప్రవర్తన ఆధారంగా తొలగిస్తున్నామనీ, అయితే ఈ తొలగింపులు వారు పోస్ట్ చేసిన కంటెంట్‌కు సంబంధించి కాదని తెలిపింది. అయితే తమ ప్లాట్‌ఫాంను అనుచిత పద్ధతుల్లో వాడడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. అయితే ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ ఇంకా స్పందించాల్సి ఉంది. పాకిస్థాన్ నుంచి ఫేక్ అకౌంట్లను ఆపరేట్ చేస్తున్నందున మరో 103 ఖాతాలను తొలగిస్తున్నట్లు కూడా ఫేస్బుక్ వెల్లడించింది. మిలిటరీ ఫ్యాన్ పేజీలు, పాక్ సంబంధిత వార్తల పేజీలు, కశ్మీర్ సంబంధిత పేజీలు కూడా ఉన్నాయి. పాకిస్థాన్ సైన్యానికి చెందిన ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్(ఐఎస్పీఆర్) ఉద్యోగులు ఈ నకిలీ అకౌంట్లను నడిపిస్తున్నట్లు విచారణలో తేలిందని ఎఫ్బీ పేర్కొంది. -
కొత్త ఏడాదిలో పేటీఎంకు భారీ ఊరట
సాక్షి, న్యూడిల్లీ: 2019 కొత్త ఏడాది ఆరంభంలో పేమెంట్ సేవల సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు భారీ ఊరట లభించింది. గత ఏడాది నిలిచిపోయిన బిజినెస్‌ను పునఃప్రారంభించుకునేందుకు రిజర్వ్‌బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈవాలెట్లను తెరుచుకునేందుకు, కొత్త కొస్టమర్ల నమోదుకు అనుతినిచ్చింది. దీంతో తన బ్యాంకింగ్ సేవలను మరింత మెరుగుపరచడానికి సంబంధిత వినియోగదారుల కేవైసీ ప్రాసెస్‌ను ప్రారంభించాలని యోచిస్తోంది. వన్9 కమ్యూనికేషన్స్, విజయ్‌శేఖర్ శర్మ సహ యాజమాన్యంలోని పేటీఎం బ్యాంకులో కెవైసీ నిబంధనలు ఉల్లంఘనల ఆరోపణలతో గత ఏడాది జూన్‌లో కొత్త కస్టమర్లను నమోదును ఆర్బీఐ నిలిపివేసింది. అలాగే బ్యాంక్ సీఈవో రేణు సత్తిని తొలగించి, కొత్త సీఈవో, ఎండీగా సతీష్ గుప్తాను నియమించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దాదాపు 32 సంవత్సరాల అనుభవం కలిగిన సతీష్ గుప్తా ఒక అనుభవజ్ఞుడైన బ్యాంకరు. నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తో చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. కాగా పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో సుమారు 42 మిలియన్ల ఖాతాలుండగా, 2019 చివరి నాటికి100మిలియన్ల వినియోగదారులను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
ఇదీ ‘లెక్క’.. చెప్పాలి పక్కా!
ఏమిటీ లెక్కలు..? ఏదైనా పెళ్లి తంతో.. లేక ఫంక్షన్ కోసమో ? అనుకుంటున్నారా..! కాదు.. ఇవీ ఎన్నికల ‘లెక్కలు’! సోమవారం నుంచి నామినేషన్లు ప్రారంభమయ్యాయి. ఇక పోలింగ్ ముగిసే వరకు పోటీలో ఉన్న అభ్యర్థులు వివిధ రకాలుగా ప్రచారాలు చేయడం.. వారి వెంట మందీ మార్బలం, వాహనాలు, తదితరమైనవి ఉండటం తెలిసిందే. ఏ రకంగా ఖర్చు చేసినా, ఎంతమందితో ర్యాలీలు నిర్వహించినా, వివిధ రూపాల్లో ప్రచారార్భాటాలు చేసినా అంతా లెక్క చెప్పాల్సిందే. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు శాసనసభకు పోటీ చేసే అభ్యర్థి గరిష్టంగా రూ.28 లక్షలకు మించి ఖర్చు చేయడానికి వీల్లేదు. ఆ లోపునే ఖర్చు చేయడమే కాక నామినేషన్ వేసినప్పటి నుంచి ప్రతిపైసాకు తప్పనిసరిగా లెక్క చూపాల్సిందే. అలాగని ఎక్కువ ఖర్చు చేసినా తక్కువ చూపితే సరిపోదు. అభ్యర్థులు వినియోగించే ప్రచార సామగ్రి, ప్రచారానికయ్యే ఖర్చులను, వెంట వచ్చే మద్దతుదారులు, కార్యకర్తలకు టీలు, టిఫిన్లు తదితరమైన వాటికి మార్కెట్ ధరలను పరిగణనలోకి తీసుకొని జిల్లా ఎన్నికల అధికారి నిర్ణయిస్తారు. ధరలు నిర్ణయించడానికి ముందు ఆయా పార్టీల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకొని, అన్నీ బేరీజు వేస్తారు. ఇలా హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తాము చేసే ఖర్చులు.. వేటికి ఎంత చూపాలో ధరలు నిర్ణయించారు. నిర్ణయించిన ధరల కంటే తక్కువ చూపితే ఎన్నికల వ్యయంలో పేర్కొన్న లెక్కల్ని ఆమోదించరు. మొత్తం 105 వస్తువులు/సరుకులకు ధరలు నిర్ణయించారు. వాటిల్లో కొన్నింటి ధరలిలా ఉన్నాయి.. – సాక్షి, హైదరాబాద్ -
5కోట్ల అకౌంట్లు హ్యాక్
-
షాకింగ్ న్యూస్ : 5 కోట్ల అకౌంట్లు హ్యాక్
శాన్ఫ్రాన్సిస్కో: దాదాపు 5కోట్ల ఫేస్బుక్ వినియోగదారుల అకౌంట్లు హ్యాక్ అయ్యాయని ఫేస్బుక్ శుక్రవారం వెల్లడించింది. ‘వ్యూ యాజ్’ ఫీచర్ ద్వారా హ్యాకర్లు చొరబడి సమాచారాన్ని సేకరించి ఉండొచ్చని అభిప్రాయపడింది. ‘ఈ డేటా దుర్వినియోగం జరిగిందో లేదో ఇంకా స్పష్టత రాలేదు. మిగిలిన వినియోగదారుల భద్రతా వ్యవస్థను పటిష్టం చేశాం. కొంతకాలంగా ఫేస్‌బుక్‌పై తరచూ సైబర్ దాడులు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది’ అని ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ అన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే శుక్రవారం ఉదయం 9 కోట్లకు పైగా వినియోగదారులను అత్యవసరంగా తమ అకౌంట్లను లాగ్ఔట్ చేయాలని ఫేస్బుక్ సూచించింది. న్యూస్‌ఫీడ్ పైన ఈ విషయాన్ని తెలియజేసింది. ‘మంగళవారం మధ్యాహ్నం, 5 కోట్ల యూజర్ల డేటాఅటాక్ అయిందని మా ఇంజనీరింగ్ టీమ్ గుర్తించింది. వ్యూ యాజ్ అనే ఫీచర్‌లోని సాంకేతిక లోపాన్ని ఉపయోగించుకుని హ్యాకర్లు ఈ దాడికి పాల్పడ్డారు. ఇదిప్రైవేసీ ఫీచర్’ అని మార్క్ జుకర్‌బర్గ్ వెల్లడించారు. ప్రస్తుతానికి లోపాన్ని సరిచేసినప్పటికీ.. ఆ ఫీచర్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. హ్యాకర్ల దాడి వార్తల నేపథ్యంలో ఫేస్బుక్ షేర్లు అమెరికా స్టాక్‌మార్కెట్లలో నష్టపోయాయి. ప్రస్తుతానికి ఆ లోపాన్ని సరిదిద్దామని, ఈ విషయాన్ని అమెరికాలోని సంబంధిత ప్రభుత్వ శాఖలకు తెలియజేశామని ఫేస్బుక్ పేర్కొంది. -
ప్రభుత్వ ఉద్యోగ పరీక్ష.. అందరూ ఫెయిల్!
పనాజి : అకౌంటెంట్ పోస్టుల నియామకాల కోసం గోవా ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలో ఒక్కరు కూడా అర్హత సాధించకపోవడం ప్రస్తుతం చర్చనీయాశంమైంది. సుమారు 8వేల మంది గ్రాడ్యుయేట్లు ఈ పరీక్ష రాయగా.. వీరిలో ఏ ఒక్కరికి 100కు కనీసం 50 మార్కులు రాలేదు. ఈ ఏడాది జనవరి 7న నిర్వహించిన ఈ పరీక్షలో ఒక్కరు కూడా కనీస మార్కులు సాధించలేదని డైరెక్టరేట్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. గతేడాది అక్టోబర్‌లో 80 పోస్టులు నియమాకాల కోసం ప్రభుత్వం నోటీఫికేషన్ విడుదల చేసింది. ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, అకౌంట్స్ సంబంధిత ప్రశ్నలతో 100 మార్కులకు ఐదు గంటల సమయంతో జనవరిలో పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షలో అర్హత సాధించినవారికి మౌఖిక ఇంటర్వ్యూల ద్వారా తుది జాబితాను ఎంపికచేస్తామని నోటీఫికేషన్లో పేర్కొంది. కానీ ఏ ఒక్కరు అర్హత సాధించకపోవడంతో అధికారులు నిశ్చేష్టులయ్యారు. ఇక ఫలితాలను ఆలస్యం చేయడాన్ని గోవా ఆమ్ఆద్మీ పార్టీ నేత ప్రదీప్ పద్గోనకర్ తప్పుబట్టారు. 8000 మంది అభ్యర్థుల్లో ఏ ఒక్కరు అర్హత సాధించకపోవడం రాష్ట్రంలోని పతానవస్థలో ఉన్న విద్యావిధానానికి అద్దం పడుతోందని విమర్శించారు. -
స్విస్ డిపాజిట్లకు ముందుకురాని యజమానులు
జ్యూరిచ్/న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకుల్లో భారతీయుల ఖాతాల్లోని డిపాజిట్లను క్లెయిమ్ చేసుకునే వారు కరువయ్యరు. స్విట్జర్లాండ్ బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ 2015 డిసెంబర్లో అక్కడి బ్యాంకుల్లో అచేతనంగా ఉన్న ఖాతాలు లేదా క్లెయిమ్ చేసుకోకుండా ఉన్నవాటి వివరాలతో కూడిన జాబితా విడుదల చేసింది. వీటిలో స్విట్జర్లాండ్ పౌరులతో పాటు విదేశీయులవి, భారతీయులకు సంబంధించిన ఖాతాలు కూడా ఉన్నాయి. కానీ, ఇంత వరకు వాటికి సంబంధించి ఏ మాత్రం పురోగతి లేదు. ఈ ఖాతాల అసలు యజమానులు లేదా వారి చట్టబద్ధమైన వారసులు క్లెయిమ్ చేసుకునేందుకు వీలుగా నాడు జాబితాను విడుదల చేయడం జరిగింది. 3,500 ఖాతాలకు గాను కనీసం ఓ 6 భారతీయులకు సంబంధించినవి ఉన్నాయి. క్లెయిమ్ వస్తే గనుక సంబంధిత ఖాతాలను జాబితా నుంచి తొలగిస్తున్నారు. 2017లో కేవలం 40 ఖాతాలకు సంబంధించి క్లెయిమ్‌లు వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలకు చెందిన వారు స్విస్ బ్యాంకుల్లో పెద్ద ఎత్తున డిపాజిట్లను దాచుకున్న విషయం గమనార్హం. అయితే, అంతర్జాతీయంగా నల్లధనంపై చర్యలు తీవ్రతరం కావడంతో స్విట్జర్లాండ్ భారత్ సహా పలు దేశాలతో సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకునేందుకు ఒప్పందాలు చేసుకుంది. స్విస్ నేషనల్ బ్యాంకు తాజా గణాంకాల ప్రకారం 2017లో భారతీయులకు సంబంధించిన ఖాతాల్లో రూ.7,000 కోట్ల మేర డిపాజిట్లు ఉన్నాయి. -
కూలి డబ్బులు 'సస్పెండ్'
గిద్దలూరు: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆశయం నీరుగారుతోంది. పథకం ప్రారంభంలో ఎందరో పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందారు. గ్రామంలోనే పనులు కల్పించడం వలన ఉపాధి పనులు చేసుకుంటూ వారికి ఉన్న అరకొర భూములను సాగుచేసుకుంటూ ఆర్థికంగా కొంతమేర ఉపశమనం పొందారు. ప్రస్తుతం ఉపాధిహామీ పథకం పరిస్థితి ఇందుకు భిన్నంగా మారింది. పథకం లక్ష్యం మంచిదే అయినప్పటికీ అధికారుల నిర్లక్ష్యానికి ఉపాధి కూలీలుపనుల విషయంలో ఆసక్తి చూపడం లేదు. ఇవ్వాల్సిన కూలి డబ్బులను సకాలంలో అందజేయకపోవడమే ఇందుకు కారణమని కూలీలు ఆరోపిస్తున్నారు. మూడేళ్లుగా సస్పెన్షన్ ఖాతాల్లో ఉన్న సొమ్ము కూలీలకు అందకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. కూలీల వేతనం బ్యాంకు ఖాతాలో జమకావాలంటే కూలీల జాబ్‌కార్డు నంబరు, ఆధార్‌కార్డు నంబరు, బ్యాంకు ఖాతాకు అనుసంధానం కావాల్సి ఉంటుంది. బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానం కాకపోతే కూలీకి రావాల్సిన కూలి సొమ్మును సస్పెన్షన్ ఖాతాలో జమచేస్తారు. సస్పెన్షన్ ఖాతాల్లో ఉన్న నగదును సదరు కూలీకి చెల్లించడంలో ఉపాధి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మూడేళ్లుగా కాలయాపన చేస్తున్నారు. ఫలితంగా సస్పెన్షన్ ఖాతాల్లో జమలు పేరుకుపోయాయి. సస్పెన్షన్ ఖాతాల్లో రూ.2.51 కోట్లు: గత మూడేళ్లుగా సస్పెన్షన్ ఖాతాల్లో రూ.2.51 కోట్ల ఉపాధి కూలీల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో చేసిన పనికి సంబంధించిన కూలి డబ్బులు రాక అవస్థలు పడుతున్నారు. జిల్లాలోని 56 మండలాల్లో 40,300 మంది కూలీల ఖాతాలు సస్పెన్షన్‌లో ఉన్నాయి. ఇందుకు గాను రూ.2.51 కోట్ల నిధులు కూలీలకు అందకుండా ఉపాధి ఖాతాల్లోనే ఉండిపోయాయి. కష్టపడినందుకు గాను వచ్చే కూలి బ్యాంకులో పడకపోవడంతో కూలి డబ్బుల కోసం కూలీలు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. చూద్దాం.. చేద్దాం అంటూ కూలీలకు చెబుతూ కాలయాపన చేస్తున్నారే తప్ప వారికి కూలి డబ్బులు వచ్చేలా చేయడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కూలీలకు శాపం... అధికారుల నిర్లక్ష్యం ఉపాధి కూలీలకు శాపంగా మారింది. ఉపాధి కూలీలకు జాబ్‌కార్డు ఇచ్చిన తర్వాత వారి ఖాతాలకు ఆధార్ కార్డు నంబర్‌ను అనుసంధానం చేయాల్సి ఉంటుంది. జాబ్‌కార్డు నంబర్‌తో పాటు బ్యాంకు ఖాతా నంబరుకు ఆధార్‌కార్డును అనుసంధానం ఖచ్చితంగా ఉంటేనే వారికి కూలి డబ్బులు ఖాతాలో జమవుతాయి. దగ్గరుండి కంప్యూటర్ ఆపరేటర్లతో ఈ ఖాతాలను అనుసంధానం చేయించే బాధ్యత అధికారులే తీసుకోవాలి. అయినప్పటికీ వారు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన ఇలాంటి పరిస్థితి వచ్చిందని పలువురు కూలీలు ఆరోపిస్తున్నారు. ఈ ఖాతాలను అనుసంధానం చేస్తేనే కూలీలు చేసిన పనులకు వేతనాలు జమయ్యే అవకాశం ఉంటుంది. బ్యాంకు అధికారులు, ఉపాధి అధికారులు సమన్వయంతో వ్యవహరించి ఉపాధి కూలీలకు చెందిన కూలి డబ్బులు ఉన్న సస్పెన్షన్ ఖాతాల సమస్యను పరిష్కరించాలని కూలీలు కోరుతున్నారు. ♦ ఈమె పేరు మట్టెమల్ల లుథియమ్మ, రాచర్ల మండలంలోని అంకిరెడ్డిపల్లె గ్రామం. ఉపాధిహామీ పథకం పనులకు సంబంధించి ఈమెకు రావాల్సిన మొత్తం రూ.8,900. గత సంవత్సర కాలంగా తనకు రావాల్సిన కూలి సొమ్ము గురించి ఉపాధి సిబ్బందిని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. ‘ఇల్లు గడవడం కోసం పనికి వెళితే చేసిన పనికి వేతనాలు చెల్లించకపోతే ఎలా. బ్యాంకు అకౌంట్‌కు ఆధార్ లింకు కాలేదని అందుకే డబ్బులు రాలేదని అధికారులు చెబుతున్నారని’ లుథియారాణి ఆవేదన చెందుతోంది. ♦ ఈ యువకుని పేరు ఎం.రోశయ్య, రాచర్ల మండలంలోని యడవల్లి గ్రామం. గత ఏడాది చేసిన పనికి సంబంధించిన రూ.6 వేలు వరకు కూలి సొమ్ము రావాలి. 9 వారాల పాటు పనిచేస్తే ఒక్క రూపాయి బిల్లు ఇవ్వలేదు. ‘వేసవిలో పనులు చేసి సంపాదించుకున్న డబ్బుతో చదువుకునేందుకు ఉపయోగించుకోవచ్చని ప్రతి రోజూ పనికి వెళ్తున్నాను. అయినప్పటికీ కూలి సొమ్ము ఇవ్వడం లేదు. బ్యాంకు అకౌంట్‌కు ఆధార్ జతకాకుంటే చేయాల్సిన బాధ్యత ఉపాధి అధికారులదే కానీ ఇన్ని రోజులుగా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని’ రోశయ్య ప్రశ్నిస్తున్నాడు. బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానం చేయించుకోవాలి సస్పెండ్ ఖాతాల్లో కూలి సొమ్ము జమ అయిన వారు వారికి చెందిన జాబ్‌కార్డు, ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం ఉపాధి కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లకు ఇస్తే వారు అనుసంధానం చేస్తారు. అనంతరం పేమెంట్లు జనరేట్ చేయడం ద్వారా ఆయా ఖాతాలకు నగదు జమవుతుంది. పాత బకాయిలు రావాల్సిన వారు సంబంధిత పోస్టల్ సిబ్బందిని కలిస్తే వారు నగదు ఇస్తారు. సస్పెండ్ ఖాతాల్లో ఉన్న నగదును కూలీలకు ఇచ్చేందుకు ఆధార్, జాబ్‌కార్డు, బ్యాంకు ఖాతా జిరాక్సులను ఫీల్డ్ అసిస్టెంట్ల ద్వారా సేకరించి ఎవరి కూలి సొమ్ము వారికి ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. – పద్మావతి, డ్వామా ఏపీడీ. -
కాగ్నిజెంట్ ఖాతాల జప్తు తొలగింపు
ముంబై: ఆదాయపు పన్ను వివాదానికి సంబంధించి స్తంభింపజేసిన తమ సంస్థ ఖాతాల్లో కార్యకలాపాలకు మద్రాసు హైకోర్టు అనుమతించినట్లు కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ తెలియజేసింది. ఆదాయపు పన్ను శాఖ చర్యలపై స్టే విధించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు అనుమతించిందని సంస్థ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే స్టే ఉత్తర్వు ప్రకారం– రూ.2,800 కోట్ల పన్ను వివాదంలో 15 శాతం అంటే దాదాపు రూ.490 కోట్లను తాము డిపాజిట్ చేస్తున్నట్లు కాగ్నిజెంట్ తెలిపింది. దీనికి కోర్టు రెండు రోజుల గడువిచ్చిందని, ఈ పేమెంట్‌కు వీలుగా జేపీ మోర్గాన్... ముంబైలో కంపెనీకి ఉన్న బ్యాంక్ అకౌంట్‌ను జప్తును కోర్టు తొలగించింది. 15 శాతం చెల్లింపులతో పాటు వివాదాస్పద మిగిలిన మొత్తానికి వడ్డీని కూడా కేసు పరిష్కారమయ్యేంతవరకూ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 18వ తేదీకి వాయిదా పడింది. 2016లో కాగ్నిజెంట్ దాదాపు 1.2 బిలియన్ డాలర్ల విలువైన షేర్ బై బ్యాక్ చేపట్టింది. ఆ సమయంలో తన విదేశీ మాతృ సంస్థకు కాగ్నిజెంట్ చెల్లించిన డివిడెండ్‌పై ఎలాంటి పన్నూ చెల్లించలేదని భారత ఐటీ శాఖ ఆరోపించింది. దీనికి సంబంధించి కంపెనీకి చెందిన దాదాపు రూ.2,500 కోట్లమేర విలువైన 60 డిపాజిట్లను రెండు వారాల క్రితం జప్తు చేసింది. కార్పొ బ్రీఫ్స్... ఎన్సీసీ: మార్చి నెలలో రూ.1,085 కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకుంది. ఇందులో ఎలక్ట్రికల్ విభాగంలో రూ.741 కోట్ల విలువ చేసే మూడు ఆర్డర్లతోపాటు, వాటర్, ఎన్విరాన్మెంట్ విభాగం నుంచి రూ.344 కోట్ల కాంట్రాక్టు ఉంది. నాట్కో: నరాల సంబంధ చికిత్సలో వాడే టెరిఫ్లూనమైడ్ జనరిక్ వర్షన్‌ను భారత్‌లో తొలిసారిగా విడుదల చేసింది. జగిల్: కస్టమర్లకు మెరుగైన సౌకర్యాల కోసం మార్కెటింగ్ ఆటోమేషన్ కంపెనీ రిటైన్లీ టెక్నాలజీస్‌తో చేతులు కలిపింది. -
మోదీ మరో మెగా మిషన్ ఇదేనా?
సాక్షి, న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు తరువాత కేంద్ర ప్రభుత్వం మరో మెగామిషన్ను పక్రటించనుందట. ఈజ్ ఆఫ్ బిజినెస్‌లో భారత్ 30 ర్యాంకులు ఎగబాకడం, అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ రేటింగ్ బూస్ట్‌తో జోష్ మీద ఉన్న నరేంద్రమోదీ ప్రభుత్వం మరో మెగా మిషన్‌కు సన్నద్ధమవుతోంది. డీమానిటైజేషన్, జీఎస్టీ, ఆధార్ అనుసంధానం లాంటి సంస్కరణల తరువాత మరో కీలక చర్యపై దృష్టిపెట్టింది. ఒకవైపు ఆధార్ అనుసంధానంపై వివాదం కొనసాగుతుండగానే.. 1 బిలియన్ , 1 బిలియన్, 1 బిలియన్ కనెక్టివిటీపై దృష్టి పెట్టినట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. అంటే 100కోట్ల ఆధార్ నంబర్లతో 100కోట్ల బ్యాంకు ఖాతాల అనుసంధానం, 100 కోట్ల మొబైల్స్ లింకింగ్.. ఇదే కేంద్ర సర్కార్ నెక్ట్స్ టార్గెట్. పెద్దనోట్ల రద్దు తర్వాత అధికంగా నమోదవుతున్న బ్యాంక్ ఖాతాలు, పుంజుకుంటున్న డిజిటల్ లావాదేవీల నేపథక్యంలో ప్రభుత్వం ఈ లక్ష్యంపై దృష్టి పెట్టిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 1 + 1 +1 ప్లాన్ తొందర్లనే ప్రకటించవచ్చని ప్రభుత్వ వర్గాలు విశ్వసిస్తున్నాయి. ఆర్థిక, డిజిటల్ సేవల విస్తరణలో ఇది పెద్ద ముందుడుగు భావిస్తున్నాయి. -
200 ట్విట్టర్ ఖాతాలు బ్యాన్
శాన్ఫ్రాన్సిస్కో: అమెరికా 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా కొన్న వివాదం మరింత ముదురుతోంది. ఈ ఎన్నికల్లో మాస్కో జోక్యంపై దర్యాప్తు నేపథ్యంలో మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ 200 ఖాతాలను నిషేధించింది. వీటిని నకిలీ ఖాతాలను గుర్తించి తొలగించినట్లు సంస్థ ప్రకటించింది. విచారణలో భాగంగా ఈ చర్య తీసుకున్నామని, పరిశోధన బృందంతో సహకరించనున్నట్టు ట్విట్టర్ వెల్లడించింది. స్పామ్ నియమాలను ఉల్లంఘించినందుకు, రష్యా ఆధారిత రెండు వందలకుపైగా ట్విట్టర్ ఖాతాలను తొలగించినట్టు వెల్లడించింది. మాస్కో ప్రభుత్వంతో లింకులు తో టెలివిజన్ గ్రూప్ ఆర్టీ 274,000 డాలర్లు ఖర్చు చేసినట్లు ట్విట్టర్ తెలిపింది. వీటిని ఎన్నికలనుప్రభావితం చేసేందుకు వాడి ఉండవచ్చనే అనుమానాలను వ్యక్తం చేసింది. ఇంటెలిజెన్స్ అండ్ హౌస్ పెర్మనెంట్ సెలెక్ట్ కమిటీ ప్రతినిధితో ట్విటర్ వైస్ ప్రెసిడెంట్ కోలిన్ క్రోవ్ సమావేశమయ్యారు. ఇంటెలిజెన్స్ అధికారిని కలిశారు2016 అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యంపై విచారణకు సంబంధించి కాంగ్రెస్ కమిటీలతో చర్చలు జరుగుతున్నాయని తెలిపింది. ఈ అంశం విచారణలో ఉన్న కారణంగా, పరిశోధకులతో తాము ఏమి చర్చించిందీ బహిరంగంగా భాగస్వామ్యం చేయలేమంటూ ట్వీట్ చేసింది. కాగా ఇదే వ్యవహారంలో మరో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్కూడా తీవ్ర ఆరోపణలను ఎదుర్కొంటోంది. అలాగే ఫేస్బుక్ లాంటి ప్లాట్‌ఫాంలు యాంటి ట్రంప్ వైఖరి అవలంబిస్తున్నాయంటూ అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ట్విట్టర్లో మండిపడిన సంగతి తెలిసిందే. -
జీఎస్టీలో అన్ని వివరాలు నమోదు కావాల్సిందే
న్యూఢిల్లీ: జీఎస్టీ చట్టం అమల్లోకి వస్తే.. వస్తువులు పోయినా, చోరీకి గురైనా, దెబ్బతిన్నా పూర్తి సమాచారం తప్పకుండా నమోదు చేయాలని సీబీఈసీ (కేంద్ర ఎక్సైజ్, కస్టమ్స్ బోర్డు) పేర్కొంది. ఈ మేరకు జీఎస్టీ నమూనా నిబంధనలు విడుదల చేస్తూ... ఉచితంగా ఇచ్చే వస్తువులు, బహుమతుల వివరాల్ని కూడా తప్పకుండా నమోదు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఖాతా పుస్తకాలకు వరుస సంఖ్యలు కేటా యించాలని, రిజిస్టర్లు, పత్రాల్లో నమోదు చేసిన సమాచారం చెరపడం, కొట్టి వేయడం, దిద్దడం చేయకూడదని జీఎస్టీ నిబంధనల్లో పేర్కొన్నారు. ప్రతి పనికి ప్రత్యేక ఖాతాను నిర్వహించాలని, వస్తువుల తయారీ, వర్తకం, సేవలకు వేర్వేరు ఖాతాలు కొనసాగించాలని సూచించారు. వస్తువులు, సేవలకు సంబంధించి నిజమైన, సరైన సమాచారంతో కూడిన ఖాతాలతో పాటు సంబంధింత పత్రాలైన ఇన్వాయిస్లు, సరఫరా బిల్లులు, డెలివరీ చలానాలు, క్రెడిట్, డెబిట్ నోట్స్, రసీదులు, చెల్లింపుల వోచర్లు, వాపసు వస్తువుల వోచర్లు, ఈ–వే బిల్లులు తప్పకుండా ఉండాలని జీఎస్టీ నిబంధనల్లో స్పష్టం చేశారు. ముందస్తు వసూళ్లు, చెల్లింపులు, సర్దుబాట్లకు కూడా ప్రత్యేక ఖాతాలు నిర్వహించాల్సి ఉంటుంది. -
ఖాతాలో లెక్క.. చేతికి దక్కేదెలా?
అనంతపురం: బ్యాంక్ ఖాతాలో నిండుగా లెక్క ఉన్నా.. జనం చేతికి అందడం లేదు. ఆటోమేటిక్ టెల్లర్ మిషన్ (ఏటీఎం)లపైనే ఇంత కాలం ఆధారపడి నగదు విత్ డ్రా చేసుకున్న జిల్లా వాసులు నగదు కొరత కారణంతో సరికొత్త ఇబ్బందులు పడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న గ్రామీణ ప్రజలు సైతం ఇంతకాలం నగదు విత్‌డ్రా చేసుకునేందుకు బ్యాంక్‌ల కన్నా తొలి ప్రాధాన్యత ఏటీఎం కేంద్రాలకే ఇస్తూ వచ్చారు. అయితే ఐదు నెలల క్రితం పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జనం నగదు కష్టాలు రెట్టింపయ్యాయి. అవన్నీ తాత్కలికమే... పరిస్థితి కొన్ని రోజుల్లో సర్దుకుంటుందంటూ చెప్పుతూ వచ్చిన పాలకులు ప్రస్తుతం నెలకొన్న తాజా పరిస్థితులపై పెదవి విప్పడం లేదు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 70 శాతం ఏటీఎంలు పనిచేయడం లేదు. పనిచేస్తున్న 30 శాతం ఏటీఎంల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఎప్పుడు నగదు వస్తుందో తెలియని అయోమయం నెలకొంది. నగదు కోసం బ్యాంక్‌ల వద్ద గంటల తరబడి వేచి ఉండలేక ప్రజల్లో అసహనం తలెత్తుతోంది. -
జోరుగా కొత్త ఇన్వెస్టర్లు..!
గతేడాది డీమ్యాట్ ఖాతాల సంఖ్య 44 శాతం అప్ ముంబై: గత ఏడాది ఇన్వెస్టర్ల డీమ్యాట్ ఖాతాలు 44 శాతం పెరిగాయి. దేశంలోని రెండు డిపాజిటరీలు– ఎన్ఎస్డీఎల్, సీడీఎస్ఎల్ల్లో 2015లో కొత్తగా 16.7 లక్షల ఇన్వెస్టర్ల ఖాతాలు ఉండగా, గత ఏడాది కొత్త ఇన్వెస్టర్ల ఖాతాల సంఖ్య 44 శాతం వృద్ధితో 24 లక్షలకు పెరిగింది. దీంతో 2015, డిసెంబర్ నాటికి 2.47 కోట్లుగా ఉన్న మొత్తం ఇన్వెస్టర్ల ఖాతాలు గత ఏడాది డిసెంబర్ నాటికి 2.71 కోట్లకు పెరిగాయి. గత ఏడాది డిసెంబర్ 31నాటికి నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ(ఎన్ఎస్డీఎల్)లో 1.53 కోట్ల డీమ్యాట్ ఖాతాలున్నాయని క్యాపిటల్ మార్కెట్ నియం త్రణ సంస్థ, సెబీ వెల్లడించింది. 2015 చివరి నాటికి ఈ సంస్థలో ఉన్న ఇన్వెస్టర్ల డీమ్యాట్ ఖాతాల సంఖ్య 1.43 కోట్లు. ఇక 2015, డిసెంబర్ నాటికి 1.04 కోట్లుగా ఉన్న సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్(సీడీఎస్ఎల్) ఇన్వెస్టర్ల ఖాతాలు గత ఏడాది డిసెంబర్ నాటికి 1.18 కోట్లకు పెరిగాయి. ఇక డిపాజిటరీల్లోని ఇన్వెస్టర్ల ఖాతాల్లో ఉన్న సెక్యూ రిటీల విలువ గత ఏడాది డిసెం బర్ చివరినాటికి రూ.126.25 లక్షల కోట్లుగా ఉన్నాయి. అంతకు ముందటి ఏడాదితో పోల్చితే ఈ మొత్తం 8 శాతం అధికం. ఎన్‌ఎస్‌డీఎల్‌లో ఉన్న డీమ్యాట్ ఖాతాల్లోని సెక్యూరిటీల విలువ రూ.112 లక్షల కోట్లుగానూ, సీడీఎస్ఎల్లోని డీమ్యాట్ ఖాతాల్లోని సెక్యూరిటీల విలువ రూ.14 లక్షల కోట్లుగానూ ఉన్నాయి. ఇన్వెస్టర్లు ఖాతాలు తెరిచి సెక్యూరిటీలను డిపాజిట్ చేయడానికి ఎన్ఎస్డీఎల్, సీడీఎస్ఎల్లు తోడ్పడతాయి. ఈ డిపాజిటరీల ఖాతాల్లో ఇన్వెస్టర్లు షేర్లు, డిబెంచర్లు, బాండ్లను ఎలక్ట్రానిక్ (డీ మెటిరియలైజ్డ్) రూపంలో ఉంచుకోవచ్చు. -
చెల్లింపులకు బ్రేక్
నిలిచిపోయిన రూ.100 కోట్ల బిల్లులు ఆరో తేదీ నుంచి ఇదే పరిస్థితి ఖాతాలను ఫ్రీజ్ చేసిన ప్రభుత్వం సాంకేతిక సమస్యే కారణమంటున్న అధికారులు ఆందోళన చెందుతున్న ఉద్యోగులు పుష్కరాలు, మహిళా పార్లమెంటేరియన్ సదస్సు వంటి కార్యక్రమాలకు కోట్లాది రూపాయలు మంచినీళ్లలా ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఉద్యోగుల విషయానికి వచ్చేసరికి మాత్రం మొండిచేయి చూపుతోంది. ఆర్థిక లోటు ఉందంటూ వారికి సంబంధించిన వివిధ బిల్లులు చెల్లించేందుకు నిరాకరిస్తోంది. పలు ఖాతాలను సర్కారు ఫ్రీజ్ చేయడంతో జిల్లాలో దాదాపు రూ.100 కోట్ల చెల్లింపులు నిలిచిపోయాయి. దీనిపై ఉద్యోగులు మండిపడుతున్నారు. రామచంద్రపురం రూరల్ : జిల్లా ఖజానా కార్యాలయంలో చెల్లింపులకు బ్రేక్ పడింది. ఆర్థిక లోటు పేరుతో వివిధ ఖాతాలను ప్రభుత్వం ఫ్రీజ్ చేయడంతో ఈ నెల 6వ తేదీ నుంచి పలు హెడ్ అకౌంట్ల ద్వారా చెల్లింపులు నిలిచిపోయాయి. ఇప్పటివరకూ జిల్లావ్యాప్తంగా సుమారు రూ.100 కోట్ల మేర చెల్లింపులు నిలిచిపోయాయి. ఉద్యోగులకు సంబంధిం చిన వివిధ బిల్లులతోపాటు, ఆర్థిక అవసరాల కోసం పెట్టుకున్న బిల్లులను కూడా నిలిపివేశారు. సరెండర్ లీవ్, టీఏ, కార్యాలయ నిర్వహణ, సప్లిమెంటరీ జీతాలు, జీపీఎఫ్, విద్యార్థుల స్కాలర్షిప్, అంగన్వాడీ వేతనా లు తదితర వాటికి సంబంధించిన బిల్లులు నిలిచిపోయిన వాటి లో ఉన్నాయి. దీంతో ఆయా వర్గాలవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివిధ కార్యక్రమాలకు అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం తమవరకూ వచ్చేసరికి ఈవిధంగా వ్యవహరించడం సరికాదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు వచ్చినపుడు ఉద్యోగులు తమ ఆర్జిత సెలవులను ప్రభుత్వానికి సరెండర్ చేసి సొమ్ము తీసుకుంటారు. అయితే ప్రభుత్వం ప్రస్తుతం వీటి చెల్లింపులు కూడా నిలిపివేసింది. టీఏ బిల్లుల పరిస్థితి కూడా ఇంతే. ప్రభుత్వ కార్యక్రమాలకు ఉద్యోగులు సొంత ఖర్చుతో హాజరై, ధించిన బిల్లులు పెట్టుకుంటారు. వీటి చెల్లింపులను కూడా నిలిపివేశారు. కార్యాలయ నిర్వహణ బిల్లులను కూడా నిలిపివేయడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారనుందని ఉద్యోగులు, అధికారులు ఆందోళన చెందుతున్నారు. అంగన్వాడీ వేతనాలను కూడా కార్యాలయ నిర్వహణ పద్దు నుంచి ఇస్తారు. వీటిని కూడా నిలిపివేశారు. -
జిల్లాలో 3.77 లక్షల మందికి చంద్రన్నబీమా
మెప్మా ఏడీఎంసీ మోహన్ కుమార్ పిఠాపురం : జిల్లాలో 3.77 లక్షల మందికి చంద్రన్న బీమా కల్పించి రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచినట్టు మెప్మా ఏడీఎంసీ కె.మోహన్ కుమార్ తెలిపారు. ఆయన బుధవారం పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో బీమా రికార్డులను తనిఖీ చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 576 చంద్రన్న బీమా క్లెయిమ్‌లు నమోదు కాగా 441 క్లెయిమ్‌లు ఎల్ఐసీకి అప్పగించామన్నారు. వీటిలో 331 మందికి సొమ్ములు అందజేసినట్లు ఆయన తెలిపారు. జనవరి 31 నుంచి లబ్ధిదారుల ఎంపిక నిలిపివేశామన్నారు. ఈ పథకంలో లబ్ధిదారులు ఎవరైనా మృతి చెందితే 48 గంటలలోపు సంబంధిత కార్యాలయంలో మరణ వివరాలను నమోదు చేయించుకోవాలన్నారు. అలా కాకుండా ఆలస్యం అయితే క్లెయిమ్‌లు రావడం ఆలస్యం అవుతుందన్నారు. ఈ విషయంలో ఇప్పటికే నియమించిన బీమామిత్రల సహకారం తీసుకోవాలని ఆయన సూచించారు. అభయహస్తం పథకంలో గతంలో ఇచ్చే దహన సంస్కార ఖర్చులు రూ.5 వేలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేశామన్నారు. అభయహస్తం లబ్ధిదారులు రూ.385 చెల్లించి రెన్యువల్ చేయించుకోవాలని ఆయన కోరారు. ఇప్పటి వరకు అభయహస్తంలో 2,61,600 మంది ఉండగా విద్యార్థులకు రూ.1200 చొప్పున స్కాలర్షిప్పులు ఇస్తున్నామన్నారు. జిల్లాలో 2440 విద్యార్థులకు రూ.29,28,000 స్కాలర్షిప్పులు ఇస్తున్నామన్నారు. -
గర్భవతులకు ఆకర్షణీయ పథకం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఊహించినట్టుగానే దేశ ప్రజలపై వరాల జల్లు కురిపించారు. ముఖ్యంగా పేదలు, చిన్న వ్యాపారులు, రైతులు, మహిళలకు, సీనియర్ సిటిజన్స్ కోసం ఆకర్షణీయమైన పథకాలను ప్రకటించారు. శనివారం జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ ప్రభుత్వం రూపొందించిన కొత్త ప్రణాళికలు వెల్లడించారు. దేశంలో మహిళలు, ఉద్యోగినులు, పేదలు, బాగుపడినపుడే దేశం బాగుపడిందని ప్రకటించిన ప్రధాని గర్భవతులకు శుభవార్త అందించారు. ముఖ్యంగా గర్భవతి మహిళల కోసం దేశ వ్యాప్త పథకాన్ని ప్రకటించారు. గర్భవతులకు చికిత్స, ప్రసవం, టీకాలు, పౌష్టికాహారం తదితర వైద్య ఖర్చుల కోసం నెలకు రూ.6 వేల ఇవ్వనున్నట్టు తెలిపారు. డైరెక్ట్ గా ఆయా మహిళల ఖాతాల్లో ఈ సొమ్మును జమ చేయనున్నట్టు చెప్పారు. మాతా శిశు మరణాల నిరోధానికి ఈ పథకం బాగా ఉపయోగనుందన్నారు. పైలట్ ప్రాజెక్ట్ గా 650 జిల్లాలో ఈ ఆర్థిక సహాయ పథకాన్ని ప్రారంభించనున్నట్టు ప్రధాని చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం గ్రామీణ ప్రాంతాల్లో 33 శాతం గృహనిర్మాణాలను పెంచనున్నామని మోదీ చెప్పారు. గ్రామీణులకు ఇంటి నిర్మించుకునేవారికి ప్రోత్సాహకాలందించిన మోదీ కొత్త ఇంటి నిర్మాణం లేదా ఉన్న ఇంటిలో కొత్త నిర్మాణాలు కోసం రుణ సౌకర్యం కల్పించనున్నామన్నారు. ఇందుకు గాను రూ. 2 లక్షల రూపాయల రుణాన్ని అందించనున్నారు. అలాగే ప్రధాని ఆవాస యోజన పథకం కింద గ్రామీణులకు రూ.9 లక్షలపైన రుణాలపై 4శాతం వడ్డీ మాఫీ,రూ.12లక్షలపై రుణాలపై 3శాతం వడ్డీమాఫీ చేయనున్నట్టు ప్రకటించారు. -
చరిత్రలో అతిపెద్ద సైబర్ దాడి!
-
చరిత్రలో అతిపెద్ద సైబర్ దాడి!
న్యూయార్క్: ప్రముఖ ఇంటర్నెట్ దిగ్గజం యాహూ ఖాతాలో మరోసారి పెద్ద ఎత్తున హ్యాక్ అయ్యాయి. గతంలోనే ఒకసారి తమ ఖాతాలు భారీగా హ్యాకింగ్ కు గురయ్యాయని ధృవీకరించిన యాహూ మరోసారి షాకింగ్ న్యూస్ వెల్లడించింది. తమ ఖాతాలపై మరో మేజర్ సైబర్ ఎటాక్ జరిగిందని యాహూ వెబ్ సైట్ లో ప్రకటించింది. దాదాపు 100కోట్ల (1బిలియన్)కు పైగా ఖాతాలు హ్యాక్ అయినట్టు ప్రకటించడం ఆందోళన రేపింది. తమ వినియోగదారుల ఖాతాల నుంచి వ్యక్తిగత సమాచారం అపహరణకు గురైనట్టు తెలిపింది. 2013 ఆగస్టులో జరిగిన ఈ దాడి చరిత్రలోనే అతిపెద్ద సైబర్ దాడిగా పేర్కొంది. ఈ నేపథ్యంలో తమ యూజర్లకు పలు సూచనలు చేస్తూ తమ పాస్వర్డ్లు, సెక్యూరిటీ ప్రశ్నల సమాధానాలు మార్చుకోవాలని యూహూ పేర్కొంది. దీంతో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో పడిన యాహూ మరిన్ని కష్టాల్లో చిక్కుకుపో్యింది. 2014లోనూ యాహూ తమ నెట్వర్క్ నుంచి 50 కోట్ల యూజర్ల అకౌంట్ల వివరాలు హ్యాకింగ్‌కు గురయ్యాయని తెలిపింది. 50 కోట్ల యూజర్ల సమాచారం హ్యాకింగ్ గురవడమే ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద సైబర్ నేరంగా ఉంది. అయితే, తాజాగా 100 కోట్ల మంది యూజర్ల అకౌంట్లు హ్యాకింగ్ గురయ్యాయని తెలపడం కలకలం రేపుతోంది. గతంలో తమ యూజర్ల వివరాలను తస్కరించిన హ్యాకర్లు అప్పటి లాగే ఇప్పుడు కూడా యూజర్ల పేర్లు, ఈమెయిల్ ఐడీలు, టెలిఫోన్ నంబర్లు, పాస్‌వర్డ్‌లతో పాటు, ఎన్క్రిప్టెడ్, అన్ ఎన్క్రిప్టెడ్ సెక్యూరిటీ ప్రశ్నలు, సమాధానాలు అపహరించినట్లు తెలిపింది. అయితే తమ యూజర్లకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ సమాచారం, పేమెంట్ డేటా మాత్రం అపహరణకు గురికాలేదని యాహూ స్పష్టం చేసింది. కాగా ఇంటర్నెట్ వ్యాపారాన్ని అమ్మకానికి పెట్టిన సంస్థ అష్టకష్టాలు పడింది. చివరికి అమెరికా టెలికాం కంపెనీ వెరిజాన్ 4.8బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. అయితే యాహూ న్యూస్ సర్వీస్ తోపాటు, బ్లాగింగ్ ప్లాట్ ఫాం టంబ్లర్, ఫోటో షేరింగ్ సైట్ ఫ్లికర్, యాహూ ఫినాన్స్ ద్వారా టెక్ సేవలందిస్తున్న సంగతి తెలిసిందే. -
ఖాతాల్లో ఫుల్... జేబుల్లో నిల్
మూడో రోజూ అదే తంతు వేతన జీవులకు తీరని అవస్థలు పింఛ¯ŒSదారులు తిరుగుముఖం క్షణాల్లో రూ.140 కోట్లు ఖాళీ సాక్షి ప్రతినిధి – కాకినాడ : ఖాతాల్లో డబ్బున్నా ఖాతాదారులు మాత్రం వంద రూపాయల కోసం కటకటలాడుతున్నారు. చివరకు వేతన జీవులు కూడా జేబులో సరిపడా డబ్బుల్లేక నరకం చూస్తున్నారు. నెలలో ఒకటో తేదీ మొదలై శనివారం నాటికి మూడు రోజులైపోయింది. చేతిలో కనీస ఖర్చులకు డబ్బులు లేక సగటుజీవి సతమతమవుతున్నాడు. జీతాలువిడుదలైనా నాలుగు వేలు మించి చేతిలో పడక ఉద్యోగులు పరిస్థితి దయనీయంగా మారింది. ఒకరోజు కాకపోతే రెండో రోజు అప్పటికీ కాకపోతే మూడో రోజైనా అంతా సర్థుకుంటుందనే ఆశించారు.తీరా శనివారం కూడా నగదు విడుదల్లో పెద్దగా ఎటువంటి మార్పు కనిపించ లేదు. నెల ప్రారంభంలో చెల్లించే ఖర్చులకు చేతిలో సరిపడా డబ్బులు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ఉదయం నుంచి రాత్రి వరకు బ్యాంకులు, ఏటీఎంల వద్ద బారులుదీరిన వారికి నిరాశే ఎదురైంది. శుక్రవారం రాత్రికి జిల్లాకు వచ్చిన రూ.140 కోట్లు అన్ని బ్యాంకులకు జమ చేశారు. కానీ ఆ సొమ్ము రెండు గంటల్లోనే ఖాళీ అయిపోయింది.మధ్యాహ్నం 3 గంటల తరువాత దాదాపు జిల్లాలో ఏటీఎంలు, బ్యాంకుల్లో నగదు లేక ఖాతాదారులు, పింఛ¯ŒSదారులు, ఉద్యోగులు ఉసూరుమంటూ వెనుతిరిగారు. శనివారం రాత్రికి రూ.200 కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఆ నగదు వస్తే సోమవారం ఉదయం ప్రధాన బ్యాంకులతోపాటు ఏటీఎంలలో పెట్టే ఏర్పాట్లు చేస్తున్నారు. అయినా సమస్య ఇప్పటికిప్పుడు పరిష్కారమై అవసరం మేరకు సొమ్ము లభించే పరిస్థితి లేదని బ్యాంకు వర్గాలే చేతులెత్తేస్తున్నాయి. జీతాలు, పింఛన్ల పంపిణీ మొదలైన మూడో రోజు శనివారం కూడా అదే తంతు కొనసాగింది. ఎక్కడా ఏ ఏటీఎంలోను, బ్యాంకులోను డబ్బులు లేవనే సమాధానమే ఎదురైంది. కొంతలో కొంత కనీసం నాలుగైదు వేలైనా దక్కాయని ఉద్యోగులు సరిపెట్టుకుంటున్నారు. మె జార్టీ బ్యాంకుల్లో ఉదయం ప్రారంభమై రెండు గంటల్లోనే నగదు నిండుకోవడం తో జనం నిరాశతో వెళ్లిపోయారు. పింఛ¯ŒSదారుల అవస్థలు దయనీయం... పింఛ¯ŒSదారులకు రూ.1000, రూ.1500 ఇవ్వాల్సి ఉన్నా రూ.100 నోట్లు కొరత కారణంగా కనీసం పది శాతం మందికి కూడా ఇవ్వలేకపోయారు. ఏజెన్సీలో నేరుగా పింఛ¯ŒSదారుల చేతికే సొమ్ములు ఇస్తామని ప్రకటించినా అది కూడా ఆచరణలో బెడిసికొట్టింది.రూ.100 నోట్లు కొరత, పూర్తి స్థాయిలో బ్యాంకుల్లో నగదు లేకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైంది. సామాజిక భద్రతా పింఛన్లపైనే ఆధారపడ్డ వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు రోజు గడిచే పరిస్థితి లేక కన్నీటి పర్యంతమవుతున్నారు. ఏలేశ్వరం ఆంధ్రా బ్యాంకులో పింఛ¯ŒSదారులకు రూ. 1000కి బదులు రూ. 500 ఇవ్వడంతో నిరాశ చెందారు. పింఛ¯ŒSదారుల ఇబ్బందులపై అఖిల భారత మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో మహిళలు ర్యాలీ నిర్వహించే వరకూ వెళ్లింది. గోకవరం కొత్తపల్లికి చెందిన కె.కుమారి బ్రెయి¯ŒSకు ఆపరేష¯ŒS చేయించుకుని మందుల కోసం ఆటోలో రాజమహేంద్రవరం వెళ్లి నిరాశతో ఇంటికి తిరిగి వచ్చేసింది. ఇలా చాలా మంది మందులు, ఇంట్లో పచారీ సరుకులు కొ నుగోలు చేయడానికి చేతిలో డబ్బుల్లేక నానా తంటాలుపడుతున్నారు. ఉదయం బారులుదీరినా బ్యాంకులో నగదు లేక రాజానగరం ని యోజకవర్గంలో చా లా బ్యాంకుల్లో జనం తిట్టుకుంటూ పోయారు. అంతటా ఇదే పరిస్థితి... ∙తుని, పిఠాపురం నియోజకవర్గాల్లోని బ్యాంకుల్లో అయితే నగదు చెల్లింపులు జరపలేదు. రాజమం డ్రి రూరల్‌లో పింఛ¯ŒSదారులకు బ్యాంకుల్లో పింఛన్లు పడలేదు. + రాజమండ్రి సిటీలో ఏటీఎంలు వద్ద ఉదయం నుంచి రాత్రి వరకు క్యూలై¯ŒSలలో ఉండి రెండు వేలు వంతున తీసుకున్నారు. ∙కాకినాడ సిటీలో ఏటీఎంలలో నగదు లేక ఖాతాదారులు తిరిగి వెళ్ళిపోయారు. బ్యాంకు లో రూ.3 వేలు, రూ.4 వేలు మాత్రమే ఖాతాదారులకు ఇచ్చారు. అమలాపురంలో ఉద్యోగులకు పూర్తిస్థాయిలో నగదు ఇవ్వలేదు. మామిడికుదురు ఎస్బిఐలో సాయంత్రం 3 గంటల వరకు రూ.2వేలు నోట్లు ఇవ్వగా, నగదు నిండుకోవడంతో క్యూలో ఉన్న ఖాతాదారులు వెనుతిరిగారు. ఆత్రేయపురం మండలం ర్యాలి ఆంధ్రాబ్యాంకులో పింఛ¯ŒSదారులకు రూ.1000 డిపాజిట్ చేస్తే రూ.2 వేలు నోటు ఇస్తామనడంతో నిరాశ చెందారు. మండపేట, పెద్దాపురం, రామచంద్రపురం నియోజకవర్గాల్లో సామాజిక పింఛన్లు అందక వెనుతిరిగి వెళ్లి పోవడంకన్పించింది. ఈ పరిస్థితి ఎప్పటికి మారుతుంది.. తమ కష్టాలు ఎప్పటికి గట్టెక్కు తాయని జనం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. -
నల్లకుబేరులకు ఆర్బీఐ మరో షాక్..!
-
ఆర్బీఐ మరో షాక్..!
ముంబై: నల్లకుబేరులకు రిజర్వ్ బ్యాంక్ మరో్ షాక్ ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ఆపరేషన్ బ్లాక్ మనీ పథకంలో భాగంగా అక్రమార్కులకు చెక్ పెట్టేందుకు ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. "నగదు ఉపసంహరణ'' లపై సరికొత్త పరిమితిలను విధించింది. ప్రధాన్ మంత్రి జన్-ధన్ యోజన ఖాతాలనుంచి నగదు విత్ డ్రాకు పరిమితిని విధించింది. బినామీ ఆస్తి లావాదేవీ, డబ్బు లావాదేవీల నుంచి అమాయక రైతులు, గ్రామీణ ఖాతాదారుల రక్షించడానికి వీలుగా విత్ డ్రా లిమిట్ ను పదివేలకు కుదిస్తున్నట్టు వెల్లడించింది. కేవైసి ఖాతాదారులకు నెలలో పదివేలు, నాన్ కేవైసి ఖాతాదారులకు నెలలో అయిదువేలు విత్ డ్రాకు అనుమతినిస్తూ ఆర్బీఐ ఒక ప్రకటన జారీ చేసింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల రైతులు, ఇతర ఖాతాదారులకు అక్రమ లావాదేవీలనుంచి రక్షణ కల్పించేందుకుగాను ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. అలాగే 10వేలకు పైన విత్ డ్రాకు సరియైన ఆధారాలు, పత్రాలు చూపించిన తరువాత బ్యాంక్ మేనేజర్ అనుమతితో అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. -
అక్రమార్కులపై ఉచ్చు బిగుస్తున్న ఐటీ శాఖ
-
యాహూకి మరో షాక్!
కాలిఫోర్నియా: భారీ ఎత్తున యాహూ ఖాతాలు హాకింగ్ కు గురయ్యాయని ప్రకటించిన ఇంటర్నెట్ సంస్థ యాహూకి మరో షాక్ తగిలింది. కనీసం 50 కోట్ల ఖాతాల హ్యాకింగ్ వ్యవహారంలో సంస్థ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ ఒక యూజర్ కోర్టులో దావా వేశారు. న్యూయార్క్ కు చెందిన రోనాల్డ్ ష్వార్ట్జ్, శాన్ జోస్, కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కఠినమైన చర్యలు తీసుకోవడంతోపాటు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ వినియోగదారులను తరపున కోర్టును ఆశ్రయించారు. వినియోగదారుల వ్యక్తిగత సమాచార భద్రతను కాపాడతామని వాగ్దానం చేసిన సంస్థ ఘోరమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందని స్క్వార్జ్ ఆరోపించారు.. అయితే ఈ వ్యాజ్యంపై స్పందించడానికి యాహూ ప్రతినిధి సన్నీవేల్ తిరస్కరించారు. వెరిజోన్, యాహూ వ్యాపార ఒప్పందానికి నష్టం చేకూరే అవకాశం ఉందని, దీనికోసం సీఈవో మారిస్సా మేయర్స్ చేస్తున్నప్రయత్నాలను ప్రభావితం చేస్తుందని చెప్పారు. కాగా 50కోట్ల (500 మిలియన్) యూజర్ల అకౌంట్లు హ్యాకింగ్‌కు గురైనట్లు యాహూ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ బాబ్ లార్డ్ ఈ విషయాన్ని గురువారం ధృవీకరించారు. దీనిని స్టేట్ స్పాన్సర్డ్ అటాక్ అని హ్యాకింగ్‌కు సంబంధించి విచారణ కొనసాగుతోందని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
యాహూ వెల్లడించిన షాకింగ్ న్యూస్
వాషింగ్టన్: ఇంటర్నెట్ దిగ్గజం యాహూ షాకింగ్ న్యూస్ వెల్లడించింది. 50కోట్ల (500 మిలియన్) యూజర్ల అకౌంట్లు హ్యాకింగ్‌కు గురైనట్లు ప్రకటించింది. యాహూ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ బాబ్ లార్డ్ ఈ విషయాన్ని గురువారం ధృవీకరించారు. ఈ సమాచారాన్ని మొత్తాన్నీ కంపెనీ నెట్ వర్క్ నుంచి 2014లో దొంగిలించారని ఒక ప్రకటనలో తెలిపారు. యాహూ ఆన్ లైన్ ఖాతాదారులు తమ పాస్ వర్డ్ లను మార్చుకోవాలని యాహూ ఒక ప్రకటనలో కోరింది. భద్రతా ప్రశ్నలకు సమాధానాలివ్వాలని సూచించింది. అనుమానాస్పద లింక్ లపై క్లిక్ చేయొద్దని, డోన్ లోడ్లు చేయొద్దని హెచ్చరించింది. పేర్లు, ఈ మెయిల్ చిరునామాలు, టెలిఫోన్ నెంబర్లు, పుట్టిన తేదీలు, పాస్‌వర్డ్‌లతో పాటు ఎన్‌క్రిప్ట్, అన్ ఎన్క్రిప్డ్ ప్రశ్నలు, సమాధానాలు కూడా హ్యాకింగ్‌కు గురైన వాటిలో ఉన్నాయని బాబ్ లార్డ్ చెప్పారు. దీనిని స్టేట్ స్పాన్సర్డ్ అటాక్ అని ఆరోపించిన ఆయన, హ్యాకింగ్‌కు సంబంధించి విచారణ కొనసాగుతోందన్నారు. అలాగే విచారణలో వెల్లడైన సమాచారం మేరకు.. హ్యాకింగ్‌కు గురైన వాటిలో అన్ప్రొటెక్టెడ్ పాస్వర్డ్లు, పేమెంట్ కార్డ్ డాటా, బ్యాంకు అకౌంట్ సమాచారం తదితరాలు లేవని స్పష్టం చేశారు. పేమెంట్ కార్డ్ డేటా, బ్యాంక్ అకౌంటులకు సంబంధించిన సమాచారాన్ని హ్యాకింగ్‌కు గురైన సిస్టంలో భద్ర పరచలేదని చెప్పారు. హ్యాకింగ్ చేసిన వారు యాహూ నెట్ వర్క్‌ను చాలాకాలంగా ఉపయోగిస్తున్న వారు కాదని తమ విచారణలో వెల్లడైందన్నారు. మరోవైపు ఇదే అతి పెద్ద సైబర్ ఉల్లంఘనగా టెక్ నిపుణులు భావిస్తున్నారు. అలాగే 2014 నుంచి పాస్ వర్డ్ లను మార్చని యూజర్లను మార్చుకోవాల్సిందిగా కోరుతోందని షేప్ సెక్యూరిటీ అధికారి తెలిపారు. సైబర్ నేరగాళ్లు హ్యాకింగ్ లో ఆధునిక ఆటోమేటెడ్ టూల్స్ ఉపయోగించే అవకాశ ఉందనీ, ఈనేపథ్యంలో 4.8 బిలియన్ డాలర్ల యాహూ వెరిజోన్ కీలక అమ్మకంపై ప్రభావితం చేసే అవకాశం ఉందని మరో టెక్ నిపుణుడు హెచ్చరిచారు. కాగా ప్రపంచవ్యాప్తంగా మూడు వందల మిలియన్ల ఈ మెయిల్ అకౌంట్లు హ్యాక్ అయ్యాయని, హ్యాకర్లు జీమెయిల్, హాట్ మెయిల్, యాహూ అకౌంట్లు హ్యాక్ చేసి పాస్ వర్డ్స్, ఇతర సమాచారం దొంగిలించారని, ఈ సమాచారాన్ని రష్యాలోని క్రిమినల్ అండర్ వరల్డ్‌కు విక్రయించినట్లుగా గతంలో అందోళను చెలరేగిన సంగతి తెలిసిందే. -
బిల్లు చెల్లిస్తే ఒట్టు!
జిల్లాలో రూ.77.84కోట్లు నీరు–చెట్టు బిల్లుల పెండింగ్ ఇప్పటివరకు చేసినవి రూ.11.5కోట్లే కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న నిర్వాహకులు గతేడాది పరిస్థితి పునరావతం వచ్చే ఏడాది పనులపై ప్రభావం ఈ ఏడాది నీరు చెట్టు పథకంలో మంజూరైన ఫొటోలు: 2713 మంజూరైన నిధులు: రూ.184.75కోట్లు చేపట్టిన పనులు: 1649 చేపట్టిన పనుల విలువ: రూ. 89.34కోట్లు చేసిన బిల్లులు: రూ.11.5కోట్లు విజయనగరం గంటస్తంభం: నీరు చెట్టు పనులు అక్రమాలకు ఆనవాళ్లు... అంతా కనికట్టు అన్నది ఎంత సత్యమో... దాని ఫలితాలు అంతేనన్నది కూడా అంతే నిజం. ఈ పనుల ద్వారా పెరిగిన భూగర్భ జలాలు... తీరిన నీటికొరత... ఇలా అన్నీ తమ గొప్పతనమేనని చెప్పుకుంటున్న పాలకపక్ష నేతలు... ఆసలు ఎన్ని పనులు చేపట్టారు... ఎన్ని పూర్తి చేశారు... అందులో ఎన్నింటికి బిల్లులు చెల్లించారు... అన్నది పరిశీలిస్తే ప్రచారానికి వాస్తవ పరిస్థితికి తేడా స్పష్టమవుతుంది. ఇక్కడ అక్రమాలు... అవినీతి పనులు నాణానికి ఒక పార్శ్వమైతే... బిల్లులు చెల్లించక నిర్వాహకులు పడుతున్న అవస్థలు మరో కోణం. నీరు చెట్టు పథకం కింద నీటిపారుదలశాఖ కొన్ని పనులు చేపట్టింది. ఇందులో కొన్ని నామినేషన్ పద్ధతిపైనా... మరికొన్ని పనులు టెండర్ల విధానంలోనూ చేపట్టారు. అయితే వివిధ కారణాల రీత్యా ఈ పనులు పూర్తిస్థాయిలో జరగలేదు. చాలావరకు పనులు అసలు ప్రారంభమే కాలేదు. కాగా... చేసిన పనులకు ప్రభుత్వం ఇప్పటివరకూ బిల్లులు చేయకపోవడం విశేషం. వాస్తవానికి రూ.89.34కోట్ల విలువైన పనులు చేపట్టగా... ఇప్పటివరకు చెల్లించింది రూ.11.5కోట్లే. పెండింగ్‌లో ఉన్న రూ.77.84కోట్లలో రూ.39కోట్లు విలువల చెల్లింపులు ఖాతాల కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్నాయి. విడుదల కాని నిధులు వీటికి సంబంధించి సర్కారు నిధులు విడుదల చేయకపోవడంవల్లే బిల్లులు పెండింగ్‌లో పడుతున్నాయని... జూలై నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదని ఆ శాఖ అధికారులే చెబుతున్నారు. ఇదిలా ఉండగా బిల్లులు రాకపోవడంతో పనులు చేసిన సర్పంచులు, కాంట్రాక్టర్లు ఇబ్బంది పడుతున్నారు. బిల్లులకోసం ఇరిగేషన్, చెల్లింపులు ఖాతాల కార్యాలయాలకు వచ్చి ఆరా తీసి వెళ్లిపోతున్నారు. పనులు చేపట్టిన తమ్ముళ్లు సైతం తమ సర్కారు తీరుపై అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. సర్కారు తీరుతో నీరు–చెట్టు పనులంటేనే భయపడుతున్నారు. ఇంకా ప్రారంభం కాని పనులు ఇక మొదలుపెట్టేందుకే వెనకడుగు వేస్తున్నారు. ఈ విధంగా 1069 పనులు అసలు నిలిచిపోయే అవకాశం ఉంది. బిల్లులు పెండింగ్ ఉన్నాయి– నాగేశ్వరరావు, జిల్లా పేఅండ్‌అకౌంట్సు అధికారి, విజయనగరం ఇరిగేషన్ అధికారుల నుంచి వచ్చిన నీరు చెట్టుకు సంబంధించిన బిల్లులు పెండింగ్ ఉన్న విషయం నిజమే. మా దగ్గర ఉన్నవి సుమారు రూ.39కోట్ల బిల్లులు. ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేయాల్సి ఉంది. విడుదలైన వెంటనే బిల్లులు చెల్లిస్తాం. -
భారీగా ట్విట్టర్ ఎకౌంట్ల తొలగింపు
న్యూయార్క్: ఉగ్రవాద చర్యలను నియంత్రించే క్రమంలో మైక్రో బ్లాగింగ్ వెబ్సైట్.. ట్వట్టర్ కఠినమైన చర్యలు చేపడుతోంది. తీవ్రవాదాన్ని ప్రమోట్ చేస్తున్నారన్న కారణంతో భారీ సంఖ్యలో ఎకౌంట్లను సస్పెండ్ చేస్తోంది. గత ఆరునెలల కాలంలో 2,35,000 ఎకౌంట్లను ఉగ్రవాద కార్యకలాపాల మూలంగా సస్పెండ్ చేసినట్లు ట్విట్టర్ సంస్థ శుక్రవారం వెల్లడించింది. దీంతో గత ఏడాది కాలంగా ట్విట్టర్ తొలగించిన ఖాతాల సంఖ్య 3,60,000కు చేరింది. ప్రాధమికంగా ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద సంస్థ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు గుర్తించిన 1,25,000 ఖాతాలను 2016 ప్రారంభంలో ట్విట్టర్ సస్పెండ్ చేసింది. ఉగ్రవాదులు సోషల్ మీడియా ద్వారా తమ నెట్‌వర్క్‌ను విస్తరించుకుంటున్న క్రమంలో వారికి ట్వట్టర్ ప్రధాన ఆయుధంగా మారిందని గతంలో విమర్శలు వినిపించాయి. దీంతో అప్రమత్తమైన ట్విట్టర్ నష్టనివారణ చర్యలు చేపట్టింది. ఉగ్రవాద సంభాషణలకు సంబంధించిన సమాచారాన్ని గుర్తించి.. అలాంటి అకౌంట్లను తొలగించే పటిష్టమైన చర్యలను ట్విట్టర్ చేపడుతోంది. -
రుణ లీలలు
⇒ రుణాల మంజూరులో పొంతన లేని లెక్కలు ⇒ తాకట్టు లేనిదే రైతులకు అందని రుణాలు ⇒ కష్టతరమవుతున్న ఖరీఫ్ సాగు చిత్తూరు (అగ్రికల్చర్): ఈ ఖరీఫ్ సీజన్లో పంటల సాగుకు రైతులకు అందించాల్సిన రుణాల్లో బ్యాంకర్లు, అధికారులు కనికట్టు లెక్కలు చూపుతున్నారు. వాస్తవాల్లోకి వెళితే సన్న, చిన్నకారు, ఇదివరలో రుణాలు ఉన్న రైతులకు ఏమాత్రం పంట రుణాలు అందడం లేదు. కేవలం బంగారు తాకట్టుపైనే రుణాలను బ్యాంకర్లు అందిస్తున్నారు. ఫలితంగా జిల్లాలోని రైతులకు ఈ ఖరీఫ్ సాగు కష్టతరంగా మారింది. రైతులకు పంటల సాగులో ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా బ్యాంకులు పంట రుణాలు అందిస్తాయని ప్రభుత్వం చెబుతోంది. అదేగాక ఈ ఖరీఫ్‌కు రైతులకు ఏమేరకు రుణాలు అందించాలనే లక్ష్యాలను కూడా కేటాయించినట్లు ప్రకటించింది. ఇదివరలో రుణాలు పొంది రుణమాఫీలో ఉన్న రైతులకు కూడా తమ పాత రుణాలను రెన్యూవల్ చేసుకుంటే వెంటనే కొత్త రుణాలు అందించే విదంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. అయితే వాస్తవంగా సన్న, చిన్న రైతులకు పంట రుణాలు అందించిన దాఖలాలు కనిపించడం లేదు. పలుకుబడి ఉన్న మోతుబరి రైతులకు, బంగారు తాకట్టు పెట్టిన రైతులకు మాత్రమే బ్యాంకర్లు రుణాలు అందిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పొంతనలేని లెక్కలు ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్‌కు జిల్లాలోని రైతులకు పంట రుణాలు అందిచాలని లక్ష్యాలను కేటాయించింది. అయితే కేటాయించిన లక్ష్యాలు, అందించిన రుణాలపై బ్యాంకర్లు, వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్న లెక్కల్లో ఏమాత్రం పొంతనలేదు. బ్యాంకర్లు చెబుతున్న లెక్కల ప్రకారం ప్రభుత్వం రూ.2,520 కోట్లు లక్ష్యాన్ని కేటాయించగా అందులో ఇప్పటికి రూ.1,790 కోట్ల రుణాలను రైతులకు అందించినట్లు చెబుతున్నారు. వ్యవసాయశాఖ అధికారులు రూ.1,962 కోట్ల లక్ష్యానికి గాను ఇప్పటికి రూ.1,020 కోట్ల మేరకు రుణాలు అందించినట్లు చెబుతున్నారు. దీన్నిబట్టి చూస్తే ఇంతకీ ప్రభుత్వం కేటాయించిన లక్ష్యాలు ఎంత, వాటిలో అందించిన రుణాలు ఎంత అన్నది ప్రశ్నార్ణకంగా మారింది. బ్యాంకర్లు ఇప్పటికి అందించిన రుణాలను కేవలం పలుకుబడి ఉన్న మోతుబరి రైతులకు, నగలు తాకట్టు పెట్టిన రైతులకు మాత్రం రుణాలు అందించి పంట రుణాల కింద లెక్కలు చూపుతున్నట్లు పలువురు తెలుపుతున్నారు. కష్టాల సాగు ఈ ఖరీఫ్ సీజనుకు పంటలు సాగు చేయాలంటే రైతులకు కష్టతరంగా మారుతోంది. గత ఏడాది నవంబరులో జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో చెరువులు నీటితో నిండాయి. దీంతో దశాబ్ద కాలంగా వర్షాభావంతో పంటలు లేక విలవిల్లాడుతున్న రైతుల్లో పంటల సాగుపై ఆశలు మొలకెత్తాయి. పంటల సాగుకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా బంగారు నగలు తాకట్టుపెట్టి, ప్రై వేటు వ్యక్తుల వద్ద అధిక వడ్డీలకు అప్పులుచేసి పంటలను సాగుచేశారు. అయితే పంటలకు చీడపీడలు ఆశించడంతో వచ్చిన కాస్తా దిగుబడి అప్పులకు కూడా చాలక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి తరుణంలో ఖరీఫ్ సాగుకు మళ్లీ రుణాలు చేయాల్సిన దుస్థితి రైతులకు నెలకొంది. అయితే బ్యాంకర్లు మాత్రం రైతులకు తాకట్టు లేనిదే రుణాలు అందించడానికి సుముఖత చూపడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఇటు బ్యాంకు రుణాలు అందక, అటు ప్రై వేటు రుణాలు అందక పంటల సాగు రైతులకు కష్టతరంగా మారింది. -
బుడ్డ శనగ రైతులకు శుభవార్త
♦ జిల్లాలో 11,262మందికి రూ55.54కోట్లు మంజూరు ♦ వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ ♦ ఫలించిన ప్రతిపక్షనేత జగన్మోహన్రెడ్డి, ♦ కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిల కృషి పులివెందుల/రూరల్ : జిల్లాలో 2012-13 రబీ సీజన్లో సాగు చేసి ప్రీమియం చెల్లించిన బుడ్డ శనగ రైతులకు వారం, పది రోజుల్లో బీమా మొత్తాన్ని జమ చేయనున్నారు. జిల్లావ్యాప్తంగా 2012-13 రబీ సీజన్లో 55 వేలమంది రైతులు బుడ్డ శనగకు ప్రీమియం చెల్లించారు. ఇందుకు ప్రభుత్వం గతేడాది డిసెంబర్లో 28,372 మంది రైతులకు సంబంధించి రూ.124.03 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే మిగిలిన 26వేలమంది రైతులకు పరిహారం మంజూరు కాలేదు. ఈ రైతుల దరఖాస్తులలో డేటా షోయింగ్, రైతులు, రెవెన్యూ అధికారుల సంతకాలు లేకపోవడం, డబుల్ ఎంట్రీ కారణాలతో ఏఐసీ(అగ్రికల్చర్ ఇన్సురెన్స్ కంపెనీ) ఆఫ్ ఇండియా అధికారులు వాటిని పక్కన పెట్టారు. ఈ నేపథ్యంలో పరిహారం అందని రైతులకు బీమా మంజూరుచేయాలంటూ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిలు పలుమార్లు ఏఐసీ ఆఫ్ ఇండియా జీఎం రాజేశ్వరిసింగ్, వ్యవసాయశాఖ కమిషనర్ ధనుంజయరెడ్డి, కేంద్ర వ్యవసాయ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా గతంలో ఏఐసీ ఆఫ్ ఇండియా కార్యాలయానికి రైతులతో వెళ్లి వారి పరిస్థితిని వివరించి నెల రోజుల్లో వారి ఖాతాల్లో జమ చేయాలని ఇద్దరు ఒత్తిడి తెచ్చారు. రెండో విడతలో 11,262 మందికి లబ్ధి జిల్లావ్యాప్తంగా 11,262 మంది రైతులకు రూ55.54కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. ఇందులో పులివెందుల నియోజకవర్గంలోని ఏడు మండలాలకు సంబంధించి 3,623మంది రైతులు ఉన్నారు. వీరికి వారం, పదిరోజుల్లో పరిహారం వారి ఖాతాల్లో జమ కానుంది. మిగిలిన రైతులకు సైతం పరిహారం అందించేందుకు ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిలు కృషిచేయనున్నారు. బుడ్డశనగ రైతుల బీమా మంజూరుకు కృషిచేసిన ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిలకు వేముల జెడ్పీటీసీ సభ్యుడు మరకా శివకృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. -
లక్షల ఖాతాలను లాక్ చేసిన ట్విట్టర్
న్యూఢిల్లీ: ప్రముఖులు, సెలబ్రిటీల ట్విట్టర్ ఖాతాల హ్యాకింగ్ వ్యవహారంలో మైక్రో బ్లాగింగ్ వెబ్సైట్ ట్విట్టర్ దిద్దుబాటు చర్యలకు దిగింది. ముందు లీక్ వ్యవహారం లేదని వాదించిన ట్విట్టర్ ..ఈ వ్యవహారంపై ఆరా తీసింది. అనంతరం మిలియన్ల కొద్దీ ఖాతాలను లాక్ చేసినట్టు ప్రకటించింది. వినియోగదారుల భద్రత రీత్యా ఈ చర్య తీసుకున్నట్టు ట్విట్టర్ అధిపతి మైఖేల్ కోట్స్ తెలిపారు. దుమారం రేపిన ఈ హ్యాకింగ్ వ్యవహారంపై ట్విట్టర్ స్పందించిన ట్విట్టర్ ..డైరెక్ట్ పాస్వర్డ్ ఎక్స్ పోజర్ ను లాక్ చేసినట్టు వెల్లడించింది. తమ ఖాతాదారులందరూ పాస్ వర్డ్ ను రీసెట్ చేసుకోవాలని సూచించింది. మొత్తం ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలించి, ప్రతీ అంశాన్ని క్రాస్ చెక్ చేశామని సంస్థ అధికారులు తెలిపారు.ఈ నేపథ్యంలో కొన్ని ఖాతాలకు మరింత భద్రత అవసరమనే విషయాన్ని గ్రహించామని తెలిపారు. యూజర్ల ఖాతాల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ చర్యకు ఉపక్రమించినట్టు తెలిపారు. అయితే ఎన్ని ఖాతాలు హ్యాక్ అయ్యాయనే విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. యూజర్లు పటిష్టమైన పాస్ వర్డ్స్, టు-స్టెప్ వెరిఫికేషన్ ద్వారా తమ ఖాతాలను సెక్యూర్ చేసుకోవాలని సలహా ఇచ్చారు. యాప్ నోటిఫికేషన్స్, మెసేజ్ ల ద్వారా జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు. కాగా ఏకంగా 33 మిలియన్ల నెటిజన్ల యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్ ను హ్యాక్ చేసిన ఓ రష్యా హ్యాకర్ హ్యాకర్ వాటిన ఆన్లైన్లో అమ్మకానికి పెట్టడం ఆందోళన రేపింది. ఫేస్బుక్ అధిపతి మార్క్ జుకర్‌బర్గ్, ప్రముఖ సింగర్ కేటీ పెర్రీ సహా ఎంతోమంది సినీతారలు, ప్రముఖుల ఖాతాల వివరాలు సహా, యూజర్లలో పదిశాతం మంది ఈ హ్యాకింగ్ బారిన పడిన సంగతి తెలిసిందే. భద్రతాపరంగా ఎలాంటి లోపాలు లేవని కొట్టిపారేసిన ట్విట్టర్.. చివరకు భద్రతా చర్యలకు ఉపక్రమించింది. -
జీపీఎఫ్ ఖాతాల్లో పీఆర్సీ బకాయిలు
పెన్షన్‌దారులు, ఖాతాల్లేని ఉద్యోగులకు నగదు సీఎం సూచనతో మళ్లీ ఫైలు సిద్ధం చేసిన ఆర్థిక శాఖ సాక్షి, హైదరాబాద్: పీఆర్సీ బకాయిలను ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్) ఖాతాల్లో జమ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. పది నెలలుగా ఈ బకాయిల ఊసెత్తకుండా పెండింగ్‌లో పెట్టిన ప్రభుత్వం.. ఈ ఫైలును సిద్ధం చేయాలని తాజాగా ఆర్థిక శాఖకు పురమాయించింది. సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలతో పీఆర్సీ బకాయిల చెల్లింపులకు ఎంత మొత్తం అవసరం.. జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేసేందుకు ఎంత మొత్తం అవసరం, కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌లో ఉన్న కొత్త ఉద్యోగులకు నగదు చెల్లింపులకు ఎన్ని నిధులు అవసరమవుతాయనే తదితర వివరాలతో ఆర్థిక శాఖ మరోసారి ఈ ఫైలును సిద్ధం చేసినట్లు తెలిసింది. దీంతో బకాయిల చెల్లింపులపై త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశముందని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. బకాయిలను నగదు రూపంలో చెల్లిస్తారా..? జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తారా..? అనే తర్జన భర్జనలతో ఏడాదికి పైగా ప్రభుత్వం ఈ చెల్లింపులను ఆపేసింది. ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి రాకుండా బాండ్ల రూపంలో చెల్లించాలనే ప్రత్యామ్నాయాన్ని పరిశీలించింది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నుంచి వ్యతిరేకత రావటంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. బకాయిల మొత్తం రూ. 2,800 కోట్లు గత ఏడాది మార్చి నుంచి పీఆర్సీ వేతన సవరణను అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం 2014 జూన్ నుంచి 2015 ఫిబ్రవరి వరకు 9 నెలలకు సంబంధించిన బకాయిలను ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది. వీటిని ఒకేసారి చెల్లించాలంటే దాదాపు రూ. 2,800 కోట్లు అవుతుందని ఆర్థిక శాఖ అంచనాకు వచ్చింది. వీటిలో జీపీఎఫ్ ఖాతాలున్న ఉద్యోగులకు రూ.1,300 కోట్లు జమ చేయాలి. జీపీఎఫ్ ఖాతాల్లేని కొత్త ఉద్యోగులు, పెన్షన్‌దారులకు ఇవ్వాల్సిన గ్రాట్యుటీ బకాయిలకు రూ.1,500 కోట్లు కావాలని ఆర్థిక శాఖ ఇప్పటికే అంచనా వేసింది. బకాయిల చెల్లింపులు ఇప్పటికే ఆలస్యమయ్యాయని, జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయాలని ఇటీవల ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సీఎంను కలసిన సందర్భంగా విజ్ఞప్తి చేశారు. దీంతో జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేసేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎం ఆర్థిక శాఖకు సూచించినట్లు తెలిసింది. మరోవైపు ముందుగా జీపీఎఫ్ ఖాతాలున్న వారికి బకాయిలు జమ చేసి.. తర్వాత పెన్షన్‌దారులు, సీపీఎస్ ఖాతాలున్న కొత్త ఉద్యోగులకు నగదు రూపంలో చెల్లించాలనే ప్రతిపాదన సైతం అధికారుల పరిశీలనకు వచ్చినట్లు సమాచారం. కానీ ఆలస్యమైనప్పటికీ అందరికీ బకాయిలను ఒకేసారి చెల్లింపులు చేయాలనే తుది నిర్ణయానికి వచ్చారు. ఫైలును పంపించిన తర్వాత సీఎం నుంచి తుది నిర్ణయం వచ్చేంత వరకు తొందరపడవద్దని నిర్ణయించుకున్నారు. -
'ఆమె'కు అక్కడా అసమానతే..!
ఆకాశంలో సగం అంటున్న ఆధునిక సమాజంలోనూ.. మహిళలు అన్నింటా వెనుకబడే ఉంటున్నారంటున్నాయి తాజా నివేదికలు. ముఖ్యంగా భారతదేశంలో పనిలో, ఇతర చెల్లింపుల విషయంలోనే కాక... కనీస అవసరాలుగా మారిపోయిన బ్యాంకు ఖాతా, ఇటర్నెట్ వాడకం విషయంలోనూ మహిళలపై తీవ్ర అసమానతలు పెరిగిపోయినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. 2015 యునైటెడ్ నేషన్స్ డెవలప్ మెంట్ ప్రొగ్రాం (UNDP) మానవాభివృద్ధి నివేదిక ప్రకారం లింగ అసమానతలు.. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ కలతచెందే విధంగా ఉండటం శోనీయమని, ముఖ్యంగా ఇండియాలో ఈ శాతం మరీ ఎక్కువగా ఉందని చెప్తున్నాయి. భారతదేశంలో ఎనభై శాతం మంది మహిళలకు కనీసం బ్యాంకు ఖాతాలు లేకపోవడం అసమానతకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. మొత్తం ప్రపంచంలో 42 శాతం వరకూ మహిళలకు బ్యాంకు ఖాతాలు లేకపోగా.. అది భారత్ లో మరీ ఎక్కువ ఉన్నట్లుగా తాజా లెక్కలు చెప్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని ఇండియా, మెక్సికో, పాకిస్థాన్, యుగాండా సహా మొత్తం 38 దేశాల్లో ఎనభైశాతం కన్నా ఎక్కువ మంది మహిళలకు బ్యాంకు ఖాతాలు లేకపోగా... దీనికి భిన్నంగా జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా దేశాల్లో 90 శాతం కన్నా ఎక్కువ మందికి ఖాతాలు కలిగి ఉండటం తీవ్ర వ్యత్యాసాన్ని తెలుపుతోంది. నిజానికి ఈ అసమానతలు కేవలం బ్యాంకు ఖాతాల్లోనే కాక, ఇంటర్నెట్ ఉపయోగించడంలోనూ కనిపిస్తున్నాయి. భారత దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల్లో పురుషుల శాతంతో పోలిస్తే మహిళల శాతం తీవ్ర నిరాశాజనకంగానే ఉన్నట్లు తెలుస్తోంది. 2013 లెక్కల ప్రకారం పురుషులు 61శాతం మంది ఇంటర్నెట్ వినియోగదారులుంటే, స్త్రీలు 39 శాతం మాత్రమే ఉన్నట్లు రిపోర్టులు చెప్తున్నాయి. ఇతర దేశాల్లోని నివేదికలతో సరిపోల్చి చూసినప్పుడు చైనాలో మహిళలు 44శాతం, పురుషులు 56శాతం... టర్కీలో మహిళలు 44శాతం, పురుషులు 64శాతం వంటి కొద్ది మాత్రపు తేడాతోనే ఉండగా... భారతదేశం మాత్రం ఈ విషయంలో అత్యంత అధికస్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనే భారత్, చైనాల మూలాలు క్షీణిస్తున్నట్లుగా 2014 నివేదికలు చెప్తున్నాయి. దీన్నిబట్టి చూస్తే పురుషులకన్నా..ప్రపంచ వ్యాప్తంగా మహిళా భాగస్వామ్యం తీవ్రంగా పడిపోయినట్లు నివేదికలు నిరూపిస్తున్నాయి. 1990 లో 35 శాతం ఉన్నమహిళా భాగస్వామ్యం... 2013 నాటికి 27కు తగ్గిపోయింది. అదే చైనాలో 1990లో 73 శాతం ఉండగా... 2013 నాటికి 64 కు పడిపోయింది. ఇప్పటికైనా భారత ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉన్నట్లు తాజా నివేదికలు హెచ్చరిస్తున్నాయి. -
ఖాతాలు నిర్వహించుకోండి
- నగదు నిల్వలను మాత్రం అలాగే ఉంచండి - ఏపీ ఇంటర్ బోర్డుకు హైకోర్టు ఆదేశం - మధ్యంతర ఉత్తర్వులు జారీ - సెప్టెంబర్ 10వ తేదీకి విచారణ వాయిదా సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ బోర్డు సూచన మేరకు బ్యాంకులు స్తంభింపజేసిన ఖాతాలను నిర్వహించుకునేందుకు హైకోర్టు ఏపీ ఇంటర్ బోర్డుకు అనుమతినిచ్చింది. స్తంభింపజేసిన నాటికి బ్యాంకు ఖాతాల్లో నగదు నిల్వలను అలానే కొనసాగించాలని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శిని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చేనెల 10వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిం ది. తెలంగాణ ఇంటర్ బోర్డు రాసిన లేఖలకు స్పందించి, తమ బ్యాంకు ఖాతాలను ఎస్బీఐ స్తంభింపజేయడాన్ని సవాలు చేస్తూ ఏపీ ఇంటర్ బోర్డు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాన్ని బుధవారం విచారించిన ధర్మాసనం తన విచారణను గురువారం కూడా కొనసాగించింది. ఈ సందర్భంగా తెలంగాణ ఇంటర్ బోర్డు తరఫున అడ్వొకేట్ జనరల్ కొండం రామకృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. -
కార్పొరేషన్లో ఇంజనీరింగ్ వర్సెస్ అకౌంట్స్
రూల్స్ తెస్తున్న తంటా విచారణ చేపట్టిన కమిషనర్ విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థలో అకౌంట్స్, ఇంజినీరింగ్ విభాగాల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. అడ్డగోలుగా బిల్లులు చేయడం సాధ్యం కాదని ఫైనాన్షియల్ కమ్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ ఎలీషా కొర్రీల మంత్రదండం ఉపయోగిస్తున్నారు. ఇలా అయితే కాంట్రాక్టర్లతో పనులు చేయించలేమని ఇంజినీరింగ్ అధికారులు తిరగబడుతున్నారు. నాలుగు రోజుల క్రితం స్టాండింగ్ కమిటీ సమావేశం మందిరం వద్ద ఈఈ ధనుంజయ, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ ఎలీషాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇద్దరు అధికారుల బహిరంగంగా వాదులాటకు దిగడంతో విషయం కమిషనర్ దృష్టికి వెళ్లింది. అసలు ఏం జరుగుతోందనే దానిపై కమిషనర్ విచారణ చేపట్టారు. అకౌంట్స్ ఎగ్జామినర్ ఎంవీ ప్రసాద్ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. రూల్స్ రగడ ఫైనాన్షియల్ కమ్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ ఎలీషా నెలరోజుల క్రితమే బాధ్యతలు చేపట్టారు. ఆడిట్ విభాగం నుంచి ఇక్కడకు వచ్చిన ఆయన రూల్ పొజిషన్ ఫాలో అవ్వాల్సిందేనంటున్నారు. ఈమేరకు 17 అంశాలతో కూడిన లేఖను చీఫ్ ఇంజినీర్‌కు అందించారు. నిబంధనల ప్రకారమైతేనే బిల్లులు చేస్తానని స్పష్టం చేశారు. జీవో 250 ప్రకారం నామినేషన్ వర్కులకు కౌన్సిల్ అనుమతి తప్పనిసరిగా ఉండాలనే ఆంక్ష విధించారు. దీనిపై ఇంజినీరింగ్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో చేసిన పనులకు బిల్లులు ఇచ్చేయండి కొత్తగా చేపట్టబోయే వాటికి సంబంధించి నిబంధనలు అమలు చేయాలనేది ఇంజినీరింగ్ అధికారుల వాదన. సబ్జెక్ట్, కండీషన్ కార్పొరేషన్లో ఫాలో అవ్వడం లేదని, భవిష్యత్‌లో దీనివల్ల ఆడిట్లో ఇబ్బందులు ఎదురవుతాయన్నది చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ అభిప్రాయం. ఇంజినీరింగ్ అధికారులే కొందరు కాంట్రాక్టర్లను తనపైకి గొడవకు ఉసిగొలిపి అనవసర రాద్ధాంతం చేస్తున్నారనే భావనలో ఆయన ఉన్నారు. అంతా చిక్కే అకౌంట్స్ సెక్షన్లో ఉద్యోగం అంటేనే కత్తిమీద సాములా తయారైందని అధికారులు అంటున్నారు. ఇన్‌కం ట్యాక్స్ అప్డేట్ కాకపోవడం వల్లే తరుచు ఇబ్బందులు ఎదురువుతున్నాయి. కాంట్రాక్టర్లకు సంబంధించి ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ ప్రతి ఏడాది సక్రమంగా ఫైల్ చేయలేకపోతున్నారు. ట్యాక్స్ కన్సల్టెంట్ పనితీరుపై విమర్శలు ఉన్నప్పటికీ రాజకీయ అండదండల కారణంగా ఆమెనే కొనసాగిస్తున్నారు. అభివృద్ధిపై ఎఫెక్ట్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టి నెల రోజులు గడిచినప్పటికీ ఎలీషాకు చాంబర్ కేటాయించలేదు. ప్రస్తుతం ఆయన అకౌంట్స్ ఆఫీసర్ కె.అంబేద్కర్ చాంబర్‌నే వాడుకుంటున్నారు. చాంబర్ ఏర్పాటుకు సంబంధించి ఇంజినీరింగ్ అధికారులు వివరాలు తీసుకెళ్లి ఇరవై రోజులైనా ఇంత వరకు ఏర్పాటు చేయకపోవడం పట్ల ఎలీషా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. అకౌంట్స్, ఇంజినీరింగ్ సెక్షన్ల మధ్య తలెత్తిన కీచులాట అభివృద్ధి పనులపై ప్రభావం చూపనుంది. వివాదం ముదిరిపాకాన పడకుండా సర్దుబాటు చేయాలనే యోచనలో కమిషనర్ ఉన్నట్లు సమాచారం. -
ఆసరా..గాభరా!
- జీరో ఖాతాలకు బ్యాంకర్ల కొర్రీలు.. - లబ్ధిదారుల అవస్థలు - జంట జిల్లాల్లో 4.52 లక్షల ఆసరా పింఛన్లు - బ్యాంకు ఖాతాలు 1.51 లక్షలు మాత్రమే - అయోమయంలో 3.01 లక్షల మంది... సాక్షి, సిటీబ్యూరో: పింఛన్లు అందక ఆసరా లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. బ్యాంకర్ల కొర్రీలు, జీరో ఖాతాల ఓపెనింగ్‌లో కష్టాలతో దాదాపు 3 లక్షల మంది లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు. బ్యాంకు ఖాతాల ద్వారానే సామాజిక పింఛన్లు(ఆసరా) పంపిణీ చేయాలనే ప్రభుత్వ నిర్ణయం కారణంగా లబ్ధిదారులు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చే యాల్సి వస్తోంది. ఆసరా పింఛన్లకు సంబంధించి జీరో ఖాతాలు తెరవాలని అధికారయంత్రాంగం బ్యాంకర్లను ఆదేశించినా..సరిగ్గా పట్టించుకోకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. పింఛన్లు పంపిణీ చేసే తేదీ (10) దగ్గర పడుతుండటంతో మరింత టెన్షన్‌కు గురవుతున్నారు. ఖాతాల కోసం బ్యాంకులకు వెళ్లితే సాయంత్రం లేదా రేపు...ఎల్లుండి రావాలని సమాధానం వస్తుండడంతో వారు ఆవేదన చెందుతున్నారు. వికలాంగులు, వృద్ధులైతే బ్యాంకుల చుట్టూ ప్రతిరోజు తిరగలేక మధ్య దళారులను ఆశ్రయిస్తున్నారు. జీరో ఖాతాలు తెరిపించినందుకుగాను దళారులకు రూ.50 నుంచి రూ. 100 వరకు ముట్టజెప్పాల్సివస్తుందంటున్నారు. అధికార యంత్రాంగం జోక్యం చేసుకుంటే తప్ప ఖాతాలపై బ్యాంకర్లు కనికరించే పరిస్థితి లేదంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ నెల ఆసరా పింఛన్లు వరకు బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేసుకోవటం కష్టమని లబ్ధిదారులంటున్నారు. అధికారులు మాత్రం బ్యాంకు ఖాతాలు లేకుండా ఆసరా పింఛన్లు ఇవ్వలేమంటున్నారు. హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాలలో మొత్తంగా ఆసరా పింఛన్‌దారులు 4,52,168 మంది ఉన్నారు. హైదరాబాద్ జిల్లాలో 1,65,025 మంది, రంగారెడ్డి జిల్లాలో 2,87,143 మంది ఉన్నారు. అయితే బ్యాంకు ఖాతాలు మాత్రం ఇప్పటి వరకు జంట జిల్లాలలో 1.51 లక్షలే ఆసరా పింఛ న్లతో అనుసంధానమయ్యాయి. ఇందులో హైదరాబాద్ జిల్లాలో 78 వేలు కాగా, రంగారెడ్డి జిల్లాలో 73 వేల వరకు ఉన్నాయి. జంట జిల్లాల్లో ఇంకా 3,01,168 ఆసరా పింఛన్లు బ్యాంకు ఖాతాలతో అనుసంధానం కావాల్సి ఉంది. దీంతో ఈనెలలో పింఛన్ల పంపిణీపై అధికారయంత్రాంగం మల్లగుల్లాలు పడుతుండగా... బ్యాంకు ఖాతాలు లేని లబ్ధిదారులు మాత్రం పింఛన్ వస్తుందో..రాదోనని టెన్షన్ పడుతున్నారు. -
కోటి కొట్టేశారు!
పలు బ్యాంకుల నుంచి క్లోనింగ్ ద్వారా డబ్బు డ్రా చేసిన ముఠా ముంబై కేంద్రంగా సాగిన వ్యవహారం పోలీసులకు చిక్కిన సీసీ కెమెరా ఫుటేజ్‌లు బ్యాంక్ ఎదుట ఖాతాదారుల ఆందోళన హైదరాబాద్: సైబర్ నేరాలకు పాల్పడే ముంబాయికి చెందిన ముగ్గురు సభ్యుల ముఠా.. బ్యాంకు ఖాతాదారుల అకౌంట్లలో ఉన్న డబ్బులపై పంజా విసిరింది. ముంబాయిని కేంద్రంగా చేసుకున్న ఈ ముఠా నాలుగు నెలల వ్యవధిలో కొన్ని జాతీయ బ్యాంకులకు చెందిన ఖాతాదారుల అకౌంట్ల నుంచి అక్రమంగా రూ.కోటి వరకు డ్రా చేసింది. హైదరాబాద్‌లోని మారేడ్‌పల్లి సిండికేట్ బ్యాంకులో ఉన్న 19 మంది ఖాతాదారుల అకౌంట్ల నుంచి రూ.7 లక్షలు డ్రా చేశారని నగర సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)కు ఫిర్యాదు అందడంతో నకిలీ ఏటీఎం(క్లోనింగ్) ద్వారా ఈ ముఠా నగదు డ్రా చేసిన విషయం వెలుగు చూసింది. ప్రస్తుతం కేసును మారేడ్‌పల్లి పోలీసు స్టేషన్‌కు అప్పగించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందం ఒకటి రంగంలోకి దిగింది. హైదరాబాద్‌లో సిండికేట్ బ్యాంకు ఖాతాదారులే కాకుండా మరిన్ని బ్యాంకుల ఖాతాదారులు కూడా వీరి బారిన పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రూ.7 లక్షలు డ్రా మారేడుపల్లికి చెందిన విల్సన్స్టాన్లీ పికెట్‌లోని సిండికేట్ బ్యాంక్‌లో ఖాతాదారుడు. ఈయన అకౌంట్లో నుంచి ఏప్రిల్ 18వ తేదీ నుంచి ఏప్రిల్ 20వ తేదీ వరకు ప్రతి రోజు కొంత మొత్తం నగదు డ్రా అవుతూ వచ్చింది. ఇలా రూ. 3 లక్షలు డ్రా అయింది. వెస్ట్‌మారేడుపల్లికి చెందిన ఎంవీ. నర్సింగ్‌రావు కూడ ఇదే బ్యాంక్‌లో అకౌంట్ ఉంది. ఈయన అకౌంట్లో నుంచి రూ. 70 వేలు డ్రా అయ్యాయి. రైల్వే ఉద్యోగి అర్జున్‌రావు అకౌంట్లో నుంచి ఈ నెల 2న అర్ధరాత్రి రూ. 25వేలు డ్రా అయ్యాయి. ఇలా దాదాపు 19 మంది పికెట్ సిండికేట్ బ్యాంక్ శాఖకు చెందిన ఖాతాదారుల ఖాతాల నుంచి రూ. 7 లక్షలు డ్రా అయ్యాయి. ఈ మేరకు బాధితులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిండికేట్ బ్యాంక్ ఎదుట ఆందోళన డ్రా విషయమై బాధితులు పలుమార్లు పికెట్ సిండికేట్ బ్యాంక్ ఛీప్ మేనేజర్‌ను కలువగా చూస్తాం.. చేస్తాం.. అంటూ సమాధానం రావడంతో బాధితులు ఆగ్రహానికి గురైయ్యారు. ఈ క్లోనింగ్‌కు పాల్పడింది ముంబైకి చెందిన ముఠా అని మీడియాలో వార్తలు వెలువడడంతో బాధితులు శనివారం వెస్ట్‌మారేడుపల్లిలోని పికెట్ వద్ద ఉన్న సిండికేట్ బ్యాంక్ ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న మారేడుపల్లి ఎస్ఐ రవికుమార్ బ్యాంక్‌కు చేరుకుని వివరాలు సేకరించారు. కాగా పోలీసుల దర్యాప్తులో ముంబై కేంద్రం నుంచి నిందితులు డబ్బులు డ్రా చేసినట్లు తేలింది. అక్కడి ఏటీఎం ఫుటేజ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహిళతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కలసి ఈ అక్రమానికి పాల్పడ్డారని దర్యాప్తులో తేలింది. వీరు ఆయా బ్యాంకుల నుంచి ఇప్పటి వరకు రూ.కోటి వరకు డ్రా చేసినట్లు అనుమానిస్తున్నారు. కాగా ఈ విషయంలో బ్యాంకు అధికారుల స్పందన సరిగా లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగదు అపహరణపై పూర్తిస్థాయి విచారణ ముంబైకి చెందిన ఏటీఎంల ద్వారానే సిండికేట్ బ్యాంక్ నుంచి డూప్లికేట్ ఎటీఎం (క్లోనింగ్) ద్వారా నగదు డ్రా అయిందని బ్యాంక్ చీఫ్ మేనేజర్ శేషు తెలిపారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నామని, ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని అన్నారు. అయితే బాధితుల జాబితా వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. జాగ్రత్తలు ఇలా... Mెడిట్/డెబిట్ కార్డులను అందుకున్న వెంటనే దాని వెనుక విధిగా సంతకం చేయాలి.దుకాణ యజమానులు సైతం ఎవ రైనా కార్డు ద్వారా లావాదేవీలు జరిపినప్పుడు వారి సంతకాన్ని కార్డుపై ఉన్నదాంతో సరిచూడాలి.{పతి కార్డుకి వెనుక భాగంలో మూడు అంకెల సీవీవీ (కార్డ్ వెరిఫికేషన్ వాల్యూ) నంబర్ ఉంటుంది. దీన్ని కచ్చితంగా గుర్తుంచుకుని, కార్డుపై చెరిపేయాలి.ఆన్లైన్ ద్వారా వ్యవహారాలు సాగించినట్లయితే.. మీరు వినియోగిస్తున్న సైట్ అడ్రస్.. హెచ్‌టీటీపీతోనే ప్రారంభమైతేనే ముందుకు వెళ్లండి. మరి కొన్ని వివరాలకు హైదరాబాద్ పోలీసు వెబ్సైట్ చూడండి. చైనా నుంచి పరికరాల దిగుమతి ఈ తరహా నేరాలు చేస్తున్న వ్యక్తులు హ్యాకింగ్, సోషల్ నెట్ వర్కింగ్ ద్వారా పరిచయమై ముఠాగా ఏర్పడి క్రెడిట్, డెబిట్ కార్డుల డేటాను తస్కరించి, నకిలీ కార్డుల్ని తయారు చేస్తారు. ఏ ప్రాంతానికి చెందిన వారు అక్కడే డేటా చోరీ, క్లోన్డ్ కార్డుల వినియోగం చేస్తే దొరికిపోతామనే భయంతో మరో ప్రాంతానికి కార్డుల్ని పంపిస్తారు. దీనికోసం ఆన్లైన్ ద్వారా చైనా పరికరాలను తెప్పిస్తున్నారు. చేతిలో ఇమిడే స్కిమ్మర్లతో... అరచేతిలో ఇమిడిపోయే స్కిమ్మర్లతో పెట్రోల్ బంకులు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ తదితర చోట్ల పనిచేసే వారి ద్వారా వినియోగదారుడి కార్డు డేటాను సేకరిస్తారు. అలాగే ఏటీఎం సెంటర్లలోనూ మినీ స్కిమ్మర్లు, కెమెరాలు ఏర్పాటు చేసి దాని ద్వారా డేటా, సీక్రెట్ నంబర్‌ను కనుక్కొంటారు. ఈ డేటా ఆధారంగా నకిలీ కార్డులను సృష్టించి వినియోగ దారుల డబ్బు కొల్లగొడతారు. -
మాఫీమాయ
రుణమాఫీ అభ్యంతరాలపై ముగిసిన గడువు గందరగోళంగా అమలు 33,728 ఫిర్యాదులు స్వీకరణ తొలివిడతలో జమైంది రూ.157 కోట్లే రెండో జాబితాలో 75వేల అకౌంట్ల అప్లోడ్ పూర్తి తడిసిమోపెడవుతున్న రుణభారంతో అన్నదాతలు విలవిల రుణమాఫీ అమలు గందరగోళంగా ఉంది. వెల్లువెత్తుతున్న ఫిర్యాదులే ఇందుకు నిదర్శనం. గత నెల ఆరో తేదీన అట్టహాసంగా ప్రకటించిన తొలి జాబితాలోని రైతులకు సగం మొత్తం కూడా జమకాలేదు. ఇక రెండో జాబి తా వెయ్యి డాలర్ల ప్రశ్నగా ఉంది. తొలి జాబితాలో పేర్లు దక్కనివారంతా రెండో జాబితాలోనైనా తమ పేరు ఉంటుందో లేదోనని 45 రోజులుగా అధికారులు, బ్యాంకర్ల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. విశాఖపట్నం: జిల్లాలో 3.87లక్షల ఖాతాల్లో లక్షా 30వేల 979 ఖాతాలతో రుణమాఫీ తొలి అర్హత జాబితాను గత నెల 6వతేదీన ప్రభుత్వం ప్రకటించింది. వీరికి 349.34 కోట్ల మాఫీ చేస్తున్నట్టు పేర్కొంది. వాస్తవానికి లక్షా 25,067 మందికి రూ.157.17కోట్లు మాత్రమే వారి అకౌంట్లలో సర్దుబాటైంది. తొలి జాబితాలో చోటుదక్కని 2.57లక్షల మంది రైతులూ అర్హులేనని ప్రకటించారు. సరైన ధ్రువీకరణ పత్రాలు సమర్పించకపోవడం వల్లే తొలి జాబితాలో చోటు దక్కలేదని అధికారులు చెప్పుకొచ్చారు. అవసరమైన ఆధార్, ఇతర డాక్యుమెంట్ల వెంటనే సమర్పించాలని సూచించారు. అసలు ఎంతమందికి ఎంత మొత్తం మాఫీ కానుందన్నది చెప్పే నాధుడే లేకుండా పోయాడు. పట్టించుకునే వారే కరువాయే తొలి జాబితాలో చోటు దక్కని వారు కేవలం లక్షా 45వేలు మాత్రమేనని అధికారులు నిర్ధారించారు. కానీ రికార్డులన్నీ సక్రమంగా ఉన్న అర్హులు కేవలం 1.19 లక్షలు మాత్రమేనని కలెక్టర్ యువరాజ్ మంగళవారం ప్రకటించారు. వీరిలో ఇప్పటి వరకు 75వేల మందికి చెందిన అకౌంట్లు మాత్రమే అప్డేట్ చేశారని, మిగిలిన 44వేల మంది అకౌంట్లు అప్డేట్ చేయాల్సి ఉందని చెప్పుకొచ్చారు. చివరికొచ్చేసరికి వీరిలో ఎంతమంది మిగులుతారు? ఎంతమాఫీ అవుతుందో తెలియని పరిస్థితి. మాఫీపై ఫిర్యాదుల వెల్లువ మాఫీ కాని వారితో పాటు అయిన రైతులు కూడా తమకేమైనా అభ్యంతాలుంటే తెలియజేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇందు కోసం పలుమార్లు పొడిగించిన గడువు మంగళ వారంతో ముగిసింది. ఇప్పటి వరకు ఏకంగా 33,728 మంది ఆన్లైన్లో మాఫీపై తమ అభ్యంతరాలను తెలుపుతూ ఫిర్యాదులు చేశారు. ఇంకా రైతు సాధికారిత సదస్సులు, తహశీల్దార్లు, బ్యాంకర్లకు ఇచ్చిన ఫిర్యాదులైతే లెక్కే లేదు. వారానికి రెండురోజుల పాటు తహశీల్దార్లు బ్యాంకర్లతో సమావేశమై వీటిని పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేసినా గత 45 రోజుల్లో ఏ ఒక్క మండలంలోనూ అమలైన దాఖలాలు లేవు. గడువు మళ్లీ పెంచుతారో లేక.. వచ్చిన ఫిర్యాదులను నిర్దిష్ట గడువులోగా పరిష్కరిస్తారో వేచిచూడాల్సి ఉంది. అయితే మాఫీ విషయంలో తామంతా నిలువునా మోసపోయామమని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
నేటి నుంచి బ్యాంక్ ఖాతాకే నగదు బదిలీ
న్యూఢిల్లీ : వంట గ్యాస్ వినియోగదారులకు అమలు చేస్తున్న నగదు బదిలీ పథకం రెండో దశ దేశవ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభమైంది. మొత్తం 630 జిల్లాల్లో ఈ పథకం అమలు అయ్యింది. మొదటి దశలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 12 జిల్లాలను ఎంపిక చేయగా....మిగిలిన జిల్లాలను రెండో దశలో చేర్చారు. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మెదక్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో...తాజాగా ఈ పథకం అమల్లోకి వచ్చింది. అటు ఆంధ్రప్రదేశ్ లో విశాఖ, విజయనగరం, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో గురువారం నుంచి పథకం అమల్లోకి వచ్చింది. తొలి దశలో తలెత్తిన సాంకేతిక సమస్యల దృష్ట్యా....అధికారులు ఈ సారి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. వంట గ్యాస్ సబ్సిడిని పొందేందుకు ఆధార్ కార్డు లేదా బ్యాంకు ఖాతాను అనుసంధానం చేసుకోకపోతే....బహిరంగ మార్కెట్ ధరకే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. -
రూ.6 వేల కోట్లకు ‘జన ధన’ డిపాజిట్లు
మంగళూర్: ప్రధానమంత్రి జనధన యోజన కింద ప్రారంభమైన అకౌంట్ల ద్వారా ఇప్పటికి దాదాపు రూ.6,000 కోట్ల డిపాజిట్ల సేకరణ జరిగింది. మొత్తం దాదాపు 7.9 కోట్ల అకౌంట్లు ప్రారంభమయ్యాయి. ఈ యోజన కింద వచ్చే ఏడాది జనవరి 26 నాటికి 7.5 కోట్ల అకౌంట్లు ప్రారంభం కావాలన్నది కేంద్రం లక్ష్యం కాగా, ఇప్పటికే ఈ సంఖ్యను అధిగమించడం సానుకూలాంశం. ఆర్థిక సేవల శాఖ అదనపు కార్యదర్శి స్నేహలతా శ్రీవాస్తవ మంగళవారం ఈ విషయాలను వెల్లడించారు. ఆమె అంతకుముందు మంగళూరులో కార్పొరేషన్ బ్యాంక్ నిర్వహించిన జనధన యోజన మెగా ప్రచారంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కార్పొరేషన్ బ్యాంక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ ఎస్ఆర్ బన్సాల్ మాట్లాడుతూ, ఈ యోజన కింద తమ బ్యాంక్ ఇప్పటివరకూ 12.83 లక్షల సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లను ప్రారంభించిందన్నారు. రెండవ దశపై దృష్టి...: జన ధన మొదటిదశ విజయవంతమయిన నేపథ్యంలో ఇక రెండవ దశపై కేంద్రం ఇప్పటికే దృష్టి సారించింది. రెండవ దశ జనవరి 26 నుంచీ ప్రారంభం కానుంది. ఈ దశలో ఖాతాదారులకు అమ్మాల్సిన సూక్ష్మ బీమా ప్రొడక్టులను ఖరారు చేయాలని దేశంలో దిగ్గజ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ, ప్రభుత్వ రంగంలోని సాధారణ బీమా సంస్థలకు ఇప్పటికే కేంద్రం సూచించింది. దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రజలందరినీ భాగస్వాములు చేయాలన్న లక్ష్యంగా ఆగస్టు 28న ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ పథకాన్ని ప్రారంభించారు. బ్యాంకు ఖాతా ఉన్న వారు కూడా జనవరి 26లోగా తమ బ్యాంకు శాఖల నుంచి రూపే కార్డు తీసుకుంటే జన ధన యోజన కింద ఇస్తున్న రూ. 1 లక్ష ప్రమాద బీమా, రూ. 30,000 జీవిత బీమా పొందడానికి అర్హులవుతారు. ఆధార్ అనుసంధాన అకౌంట్లకు రూ.5,000 ఓవర్‌డ్రాఫ్ట్ సౌలభ్యం (అకౌంట్ నిర్వహణ ప్రాతిపదికగా) కల్పించడం ఈ పథకం ప్రత్యేకత. -
15లోగా ఖాతాల్లోకి మాఫీ సొమ్ము
-
బుడి బుడి పొదుపు...
ఏడేళ్ల ఆదిత్య నాన్నతో కలసి ఏటీఎంకి వెడితే .. కార్డు ఇన్సర్ట్ చేయడం నుంచి నగదు, ట్రాన్సాక్షన్ స్లిప్ తీసుకునేదాకా అంతా తానే చేయాలంటాడు. ఆరేళ్ల భార్గవి .. వాళ్లమ్మతో షాపింగ్‌కి వెడితే డబ్బులు తన చేత్తోనే ఇస్తానని మారాం చేస్తుంది. డబ్బు విలువ గురించి పూర్తిగా తెలియకపోయినా.. ఆర్థిక లావాదేవీలపై వారికి క్రమక్రమంగా పెరిగే ఆసక్తే ఇందుకు కారణం. అది గుర్తించే పిగ్గీ బ్యాంకులు, డిబ్బీలంటూ వారికి పొదుపును అలవాటు చేసేందుకు తల్లిదండ్రులు ప్రయత్నిస్తుంటారు. అటు బ్యాంకులు మరో అడుగు ముందుకేసి పిల్లల కోసం ప్రత్యేకంగా పొదుపు ఖాతాలు అందిస్తున్నాయి. ఉచితంగా పాస్‌బుక్‌లు, డెబిట్ కార్డులు, చెక్ బుక్కులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయాలతో పలు బ్యాంకులు కిడ్స్ అకౌంట్స్ ఇస్తున్నాయి. ఫెడరల్ బ్యాంక్, ఎస్బీఐ తదితర బ్యాంకులు ఈ మధ్యే ప్రత్యేక అకౌంట్స్‌ని అందుబాటులోకి తెచ్చాయి. ఈ నేపథ్యంలోనే పిల్లల పొదుపు ఖాతాలపై ఈ కథనం.. ఎస్బీఐ .. పెహ్లా కదమ్.. పెహ్లీ ఉడాన్.. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు రకాల అకౌంట్లు అందిస్తోంది. తల్లి, తండ్రి లేదా సంరక్షకులతో కలసి ఏ వయస్సు పిల్లల కోసమైన సంయుక్తంగా పెహ్లా కదమ్ ఖాతాను తెరవొచ్చు. ఇక, పదేళ్లు పైబడిన వారి కోసం పెహ్లీ ఉడాన్ సేవింగ్స్ ఖాతా ఉపయోగపడుతుంది. దీన్ని వారు సొంతంగా నిర్వహించుకోవచ్చు. ఈ ఖాతాలకు సంబంధించి చెక్ బుక్, పాస్‌బుక్, ఏటీఎం కార్డు ఇస్తారు. బిల్లుల చెల్లింపులు, ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం మొదలైన పరిమితమైన లావాదేవీల కోసం ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం కూడా ఉంటుంది. ఇలాంటి వాటిలో రూ. 5,000 దాకా పరిమితి ఉంటుంది. అదే మొబైల్ బ్యాంకింగ్ విషయంలోనైతే పరిమితి రూ. 2,000గా ఉంటుంది. . యంగ్ చాంప్.. పద్దెనిమిది సంవత్సరాల లోపు వారి కోసం ఫెడరల్ బ్యాంక్ యంగ్ ఛాంప్ పేరిట పొదుపు ఖాతాలను ప్రవేశపెట్టింది. పదేళ్లు అంతకు పైబడి వయస్సున్న పిల్లల కోసం దీన్ని ఉద్దేశించారు. ఏటీఎంలు, పాయింట్ ఆఫ్ సేల్స్‌లో రూ. 2,500 దాకా వ్యయ పరిమితితో ప్రత్యేకంగా డెబిట్ కార్డును అందిస్తుంది. మొబైల్ అలర్ట్‌లు, పేరెంట్స్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్‌గా నిధుల బదలాయింపు, నెట్ బ్యాంకింగ్, పాయింట్ ఆఫ్ సేల్స్‌లో కొనుగోళ్లకు రివార్డు పాయింట్లు మొదలైన ఫీచర్లు ఈ అకౌంట్లో ఉన్నాయి. కిడ్స్ అడ్వాంటేజ్.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. పిల్లల కోసం ప్రత్యేకంగా కిడ్స్ అడ్వాంటేజ్ అకౌంట్ ప్రవేశపెట్టింది. తల్లిదండ్రుల అనుమతి మేరకు 7-18 ఏళ్ల మధ్య వయస్సు గల పిల్లలకు వారి పేరు మీదే ఏటీఎం లేదా ఇంటర్నేషనల్ డెబిట్ కార్డును బ్యాంకు ఇస్తుంది. ఏటీఎంల ద్వారా గరిష్టంగా రూ.2,500 విత్‌డ్రా చేసుకోవచ్చు. అలాగే షాపింగ్ పరిమితి రూ. 2,500గా ఉంటుంది. ఈ ఖాతా రూ. 1,00,000 మేర విద్యా బీమా కవరేజీ ఉచితంగా అందిస్తుంది. అలాగే మూడు నెలలకోసారి స్టేట్మెంట్లు, లావాదేవీలకు సంబంధించిన ఉచిత ఈమెయిల్ అలర్ట్‌లు కూడా బ్యాంకు పంపిస్తుంది. జంబో కిడ్స్ సేవింగ్స్.. కరూర్ వైశ్యా బ్యాంక్ పన్నెండేళ్ల దాకా వయస్సు గల పిల్లల కోసం జంబో కిడ్స్ సేవింగ్స్ ఖాతాను అందిస్తోంది. ఇందులో మినిమం బ్యాలెన్స్ బాదరబందీ లేదు. ఏటీఎం కార్డు, ఉచితంగా జంబో డాల్‌ను కూడా బ్యాంకు ఇస్తుంది. అటు స్టూడెంట్ సేవింగ్స్ అకౌంటు పేరిట గరిష్టంగా 23 ఏళ్ల దాకా వయస్సు గల విద్యార్థుల కోసం మరో పొదుపు ఖాతాను కూడా బ్యాంక్ అందిస్తోంది. ఇందులో కనీస బ్యాలెన్స్ రూ.250 ఉండాలి. కోటక్ మై జూనియర్ అకౌంటు.. ఈ ఖాతాలపై కొటక్ మహీంద్రా బ్యాంక్ వార్షికంగా దాదాపు ఆరు శాతం దాకా వడ్డీ ఇస్తోంది. దీనికి అనుసంధానంగా రికరింగ్ డిపాజిట్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ వంటివి ప్రారంభించి.. క్రమం తప్పకుండా కడుతూ ఉంటే మినిమం బ్యాలెన్స్ నిబంధన నుంచి మినహాయింపు కూడా లభిస్తుంది. రెస్టారెంట్లు, షాపింగ్, ఎంటర్టైన్మెంట్ మొదలైన వాటికి సంబంధించి ప్రత్యేక ఆఫర్లు కూడా బ్యాంకు అందిస్తోంది. ఖాతాను ప్రారంభించిన తొలి ఏడాది ప్రారంభ ఆఫర్ కింద ఆర్డీ, సిప్ మొత్తాన్ని బట్టి నాలుగు నుంచి ఎనిమిది దాకా పీవీఆర్ థియేటర్ సినిమా టికెట్లు లేదా ల్యాండ్‌మార్క్ బుక్ వోచర్లు కొటక్ మహీంద్రా బ్యాంక్ అందిస్తోంది. యాక్సిస్ ఫ్యూచర్ స్టార్స్ ఖాతా.. పద్దెనిమిదేళ్ల లోపు వారి కోసం యాక్సిస్ బ్యాంక్ ఈ ఖాతాను అందిస్తోంది. పిల్లల పేరిట మూడు నెలలకొకటి చొప్పున ఉచితంగా ఎట్ పార్ చెక్‌బుక్‌లను ఇస్తుంది. కనీసం రూ. 25,000 మేర ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా (ఆర్నెల్ల పాటు), రూ. 2,000 చొప్పున ఏడాదిపాటు రికరింగ్ డిపాజిట్ చేసినా కనీస నెలవారీ బ్యాలెన్స్ నిబంధన నుంచి మినహాయింపు లభిస్తుంది. పదేళ్ల పైబడిన పిల్లలకోసం వారు కోరిన చిత్రాన్ని డెబిట్ కార్డుపై ముద్రించి బ్యాంకు అందిస్తుంది. ఆర్నెల్లకోసారైనా డెబిట్ కార్డును స్వైప్ చేసిన పక్షంలో కొన్ని షరతులకు లోబడి రూ. 2 లక్షల దాకా వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీ లభిస్తుంది. డెబిట్ కార్డు మోసాలు జరిగిన పక్షంలో రూ.50,000 దాకా పర్చేజ్ ప్రొటెక్షన్, లాస్ట్ కార్డ్ లయబిలిటీ కవరేజీ ఉంటుంది. ఐసీఐసీఐ యంగ్ స్టార్స్ ఒక్క రోజు నుంచి పద్దెనిమిదేళ్ల దాకా వయస్సు గల పిల్లల కోసం ఐసీఐసీఐ బ్యాం క్ ఈ ఖాతాను ప్రవేశపెట్టింది. పేరెంట్స్ కోరితే ఏడేళ్లు పైబడిన పిల్లలకు డెబిట్ కార్డును ఇస్తుంది బ్యాంకు. రోజువారీ షాపింగ్ లేదా విత్‌డ్రాయల్ కోసం రూ. 1,000 నుంచి రూ. 5,000 దాకా వీటిపై పరిమితులను ఎంచుకోవచ్చు. ప్రయోజనాలు.. ఈ తరహా అకౌంట్లు పిల్లలకు చిన్నప్పట్నుంచి ఆర్థిక క్రమశిక్షణ అలవర్చేందుకు ఉపయోగపడతాయి. నగదు డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్, చెక్‌బుక్కులు, డెబిట్ కార్డులు వాడటం మొదలైన బ్యాంకింగ్ లావాదేవీల గురించి అవగాహన ఏర్పడుతుంది. అయితే, కిడ్స్ అకౌంట్స్ అంటూ బ్యాంకులు ప్రత్యేకత చూపించినా.. బ్యాలెన్సులు, ఫీజులు మొదలైన వాటి విషయంలో మిగతా సాధారణ ఖాతాల తరహాలో వీటి ట్రీట్మెంటు ఉంటుంది. ఇక, పిల్లలు ఆర్థిక క్రమశిక్షణ నేర్చుకోవాలంటే.. తల్లిదండ్రులు కూడా వారితో కాస్త సమయం గడపాలి. డిపాజిట్, విత్‌డ్రాయల్స్ చేయడం, స్లిప్స్ నింపడం మొదలైనవి వారికి నేర్పాలి. అకౌంటు మనదే కదా అని వృథా ఖర్చులు చేస్తున్నారా లేదా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారా అన్నది పరిశీలిస్తూ ఉండాలి. అలాగే ఈ అకౌంట్లు మూడు నాళ్ల ముచ్చట కాకుండా కొనసాగించగలగాలి. ఇవన్నీ జరగాలంటే పేరెంట్స్‌కి కూడా క్రమశిక్షణ ఉండాలి. -
దుర్గగుడి అధికారుల నిర్లక్ష్యాన్ని కడిగేసిన కాగ్
డబ్బు వసూలులో నిర్లక్ష్యం ‘అకౌంట్స్’ రికార్డులు అధ్వానం బంగారం భద్రపరచడంలోనూ మీనమేషాలు భక్తుల రక్షణా ప్రశ్నార్థకమే! నివేదికలో స్పష్టంచేసిన ‘కాగ్’ సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో రెండో అతిపెద్ద దేవాలయమైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థాన అధికారుల నిర్లక్ష్యం, అక్రమాలను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) బట్టబయలు చేసింది. గత ఏడాది మార్చి వరకు జరిగిన సాక్షి, విజయవాడ : దసరా ఉత్సవాలు మరో 20 రోజుల్లో ప్రారంభమవుతున్నప్పటికీ ఇంకా పనులు వేగవంతం కాలేదు. ఉత్సవ ఏర్పాట్లపై రెవెన్యూ, దేవస్థానం అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. సకాలంలో పనులు పూర్తికాకపోతే చివర్లో ఎప్పటిలాగానే హడావుడి నిర్ణయాలు తీసుకుని భక్తులకు ఇబ్బంది కలించే అవకాశం ఉంది. సమావేశాల్లో తీవ్ర జాప్యం.. అధికారులు ఇప్పటివరకు కేవలం ఒక్కసారి మాత్రమే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉత్సవ ఏర్పాట్లను సమీక్షించే సబ్‌కలెక్టర్ హరిచందన బదిలీ కావడంతో ఆమె స్థానంలో కొత్తగా నాగలక్ష్మి బాధ్యతలు చేపట్టారు. ఆమె ఉత్సవాలపై అవగాహన పెంచుకుని వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి వారికి తగిన ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఇన్చార్జి ఈవో త్రినాథరావు ద్వారకాతిరుమల దేవస్థానానికీ ఇన్చార్జిగా వ్యవహరిస్తుండడమే కాకుండా గుంటూరులో దేవాదాయ శాఖ డెప్యూటీ కమిషనర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనపై పని ఒత్తిడి ఎక్కువగా ఉంది. పూర్తిస్థాయి ఈవో లేకపోవడంతో నిర్ణయాలు తీసుకోవడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. వీటికితోడు దేవస్థానం సిబ్బందికి వారం రోజుల్లో బదిలీలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. అందుకే వారు ఉత్సవ ఏర్పాట్లపై శ్రద్ధ చూపడం లేదు. అందుబాటులో లేని మంత్రి.. దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు విదేశీ పర్యటనకు వెళ్లారు. ఆయన వచ్చేసరికి ఉత్సవాలకు సమయం దగ్గర పడుతుంది. ఇక ఆయన వచ్చినా సమీక్ష సమావేశాల్లో మొక్కుబడిగానే పాల్గొంటారు. జిల్లా మంత్రులు కూడా ఉత్సవ ఏర్పాట్లపై ఆసక్తిచూపడం లేదు. మంత్రి విదేశీ పర్యటనకు వెళ్లేముందే పాలకమండలిని కాని, ఉత్సవ కమిటీని కాని వేస్తారని అందరూ భావించారు. ఇప్పటి వరకు ఆ ముచ్చటా తీరలేదు. ఉత్సవాలకు ముందు కమిటీలను వేసినా భక్తులకు ఏమాత్రం ఉపయోగం ఉండదు. రాజగోపురం నుంచి దర్శనం లేనట్లే గత ఏడాది కంటే భిన్నంగా ఈ ఏడాది భక్తుల్ని రాజగోపురం నుంచి అమ్మవారి దర్శనానికి పంపాలని దేవస్థానం అధికారులు తొలుత నిర్ణయించారు. రాజగోపురం నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో ఆ ఆలోచనకు స్వస్తిపలికి ఘాట్‌రోడ్డు, మెట్ల మార్గం నుంచి భక్తుల్ని దర్శనానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాఫిక్ కష్టాలు... గతంలో దుర్గాఘాట్ నుంచి భక్తుల్ని నేరుగా ఘాట్‌రోడ్డు మీదుగా కొండపైకి పంపేవారు. ఈ ఏడాది ట్రాఫిక్ విషయంలో మార్పులు చేర్పులు చేయడంతో భక్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఉత్సవాల నాటికి జాతీయ రహదారి ట్రాఫిక్‌ను దారి మళ్లించి, అమ్మవారి దర్శనం సులభంగా అయ్యేలా చూడాలని భక్తులు కోరుతున్నారు. టెండర్లు ప్రక్రియ షురూ దసరా ఉత్సవాల విధులు నిర్వహించే ఇతర శాఖల సిబ్బందికి భోజనాలు ఏర్పాట్లు, భక్తుల సామాన్లు భద్రపరుచుకునే క్లోక్ రూమ్‌ల నిర్వహణ, ప్రసాదాల తయారీ, క్యూలైన్లు ఏర్పాటు పనుల్ని కాంట్రాక్టు ఇస్తారు. ప్రస్తుతానికి ఈ వర్క్‌లకు టెండర్లు పిలిచారు. ఈ నెల 9న టెండర్లు ఖరారు చేస్తారు. ఆ తర్వాతే పనులు ప్రారంభం అవుతాయని సిబ్బంది చెబుతున్నారు. దసరా ఏర్పాట్లపై సబ్ కలెక్టర్ ఆరా దసరా ఉత్సవాల్లో భాగంగా ఆలయ అధికారులు చేపట్టిన వివిధ పనులను సబ్ కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఆమెకు దసరా ఉత్సవాల ఏర్పాట్ల గురించి ఆలయ అధికారులు వివరించారు. అర్బన్ తహశీల్దార్ శివరావ్, ఈవో త్రినాథరావు, ఈఈ కోటేశ్వరరావులు ఉత్సవాల రూట్‌మ్యాప్‌ను వివరించారు. దుర్గా ఘాట్‌కు చేరుకుని ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆలయంలో క్యూలైన్ల గురించి ఆరా తీశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. -
కొత్త బ్యాంకు ఖాతాలు...
పాలమూరు : కేంద్రం ఇటీవల ప్రారంభించిన ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన ద్వారా జిల్లాలో 3లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. బ్యాంకు ఖాతాలేని కుటుంబాలకు కొత్తగా ఆ సౌకర్యాన్ని కల్పించనున్నారు. 3లక్షల ఖాతాల కింద *5వేల చొప్పున *50 కోట్ల వరకు లావాదేవీలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా నూతనంగా ఖాతాలు తెరవడం ప్రారంభమైంది. ప్రారంభమైన అయిదు రోజుల్లోనే జిల్లాలో దాదాపు 70 వేల ఖాతాలు ప్రారంభించారు. అందరికీ బ్యాంకు సేవలు అందుబాటులోకి తీసుకురావడం, ఆర్థిక అసమానతలు తొలగింపు, సంక్షేమ పథకాల లబ్ధిని నేరుగా అర్హులకు అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. కేంద్రం ఆదేశాలతో బ్యాం కుల శాఖలు ఖాతాలు నమోదు చేస్తున్నాయి. గ్రామా లు, పట్టణాల్లోని వివిధ వార్డుల్లోని ప్రజల చెంతకు వెళ్లి ఖాతాలు తెరుస్తున్నారు. గతంలో ఖాతాలు కావాలంటే బ్యాంకు శాఖలు అనేక కొర్రీలు పెట్టాయి. ప్రస్తుతం వారే ప్రజల చెంతకు వెళ్లి ఖాతాలు ఇస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 41 లక్షలు కాగా.. కుటుంబాల సంఖ్య 9.50 లక్షలు అగస్టు 19న రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వేలో మాత్రం 10.17 లక్షల కుటుంబాలు నమోదయ్యాయి. జనాభాలో 40 శాతానికి బ్యాంకు ఖాతాలు లేవని అధికారవర్గాల అంచనా.. కుటుంబాల ప్రకారం చూస్తే జిల్లాలో 3లక్షల కుటుంబాలకు పైగా ఖాతాలు లేవని అంచనా.. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో మొత్తం 514 బ్యాంకు శాఖలున్నాయి. ఒక్కో శాఖలో సరాసరి 3వేలమంది వరకు ఖాతాదారులున్నారు. జిల్లాలో 6.50 లక్షలకు పైగా ఖాతాలున్నట్లు అంచనా.. ఇందులో కొందరికి రెండు, మూడు ఖాతాలున్నాయి. తాజా పథకం నేపథ్యంలో భారీ మొత్తంలో ఖాతాలు పెరగనున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని వచ్చే ఏడాది అగస్టు 15 నాటికి పెద్ద సంఖ్యలో బ్యాంకు కరస్పాండెంట్లను నియమించాలని నిర్ణయించారు. కొత్తగా వివిధ ప్రాంతాల్లో బ్యాంకు శాఖలను కూడా ప్రారంభించాలని చర్యలు చేపట్టారు. ప్రస్తుతమైతే గ్రామ కరస్పాండెంట్లను నియమిస్తున్నారు. ప్రతి 2వేల జనాభాకు ఒక గ్రామ కరస్పాండెంట్‌ను నియమిస్తున్నారు. ఇప్పటికే వివిధ బ్యాంకులు గ్రామాల్లో 300మంది కరస్పాండెంట్లను నియమించినట్లు తెలుస్తోంది. సేవలు మరింత మెరుగు - శ్రీనివాసరావు, జిల్లా లీడ్‌బ్యాంక్ మేనేజర్. జన్‌ధన్ యోజన ద్వారా బ్యాంకు సేవలు మరింత విసృ్తతమవుతాయి. ప్రతి కుటుంబానికి రెండు ఖాతాలు ఇస్తాం. ఇప్పటికే ఖాతాలున్న పేదలు కూడా మరో ఖాతా పొందవచ్చు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందడానికి ఇది పనిచేస్తుంది. శాఖలు తక్కువగా ఉన్న బ్యాంకులు గ్రామాల్లో కరస్పాండెంట్లను నియమించుకుంటున్నాయి. ఖాతా తీయడం చాలా సులువు. జిల్లాలో ఈ పథకానికి మంచి స్పందన ఉంది. -
నల్లధనం రికవరీకి నయా పంథా!
నల్ల కుబేరుల నుంచే సమాచారం సేకరిస్తున్న అధికారులు న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకుల్లో నల్లధనాన్ని దాచిన భారతీయుల నుంచి సమాచారం రాబట్టడంలో దర్యాప్తు అధికారులు కొత్త పంథాలో వెళ్తున్నారు. అధికారిక, అనధికారిక మార్గాల ద్వారా తమకందిన నల్ల కుబేరుల జాబితాలో నుంచి 100 మందిని గుర్తించి.. తమ అకౌంట్ల సమాచారం ఇవ్వాల్సిందిగా వారినే అడిగారు. సమాచారం ఇస్తే.. వారిని కఠిన శిక్షలు విధించే చట్టాల ప్రకారం కాకుండా, కఠినం కాని పన్ను ఎగవేత చట్టాల పరిధిలో విచారిస్తామని హామీ ఇచ్చారు. దాంతో హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చండీగఢ్‌లకు చెందిన ఆ అకౌంట్ హోల్డర్లు ఐటీ, ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు, కేంద్ర ఆర్థిక శాఖలకు చెందిన దర్యాప్తు అధికారులకు వారడిగిన సమాచారమిచ్చారు. స్థానిక చట్టాలను కారణంగా చూపి భారత్‌కు సమాచారం ఇచ్చేందుకు స్విట్జర్లాండ్ నిరాకరించడంతో.. ఈ పంథాలో ముందుకు వెళ్తున్నారు. ఇలా రూ. 50 కోట్ల నుంచి రూ. 80 కోట్ల వరకు పన్నుగా వచ్చే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. ఈ సమాచారాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) సుప్రీంకోర్టుకు అందించిందన్నాయి. ఆ నల్లధనానికి సంబంధించిన ఆదాయ వనరులపై ఐటీ అధికారులు దర్యాప్తు ప్రారభించారని, తద్వారా పన్ను ఎగవేతకు సంబంధించిన కొత్త విషయాలు బయటపడే అవకాశముందన్నాయి. హెచ్ఎస్బీసీ బ్యాంక్ ఉద్యోగి ద్వారా ఫ్రాన్స్‌కు, అక్కడి నుంచి భారత్‌కు ‘హెచ్ఎస్బీసీ జాబితా’లోని భారతీయ నల్ల కుబేరుల వివరాలు చే రాయి. -
కొత్త..కొత్తగా..
జూన్ 2 నుంచి జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖల్లో కొత్త పాలన అకౌంట్లు, రికార్డులు నిర్వహణ అన్నీ కొత్తగానే ప్రారంభం మారనున్న వాహన రిజిస్ట్రేషన్ సిరీస్ సాక్షి, విశాఖపట్నం: జూన్ 2 నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా ఏర్పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాలన కూడా కొత్తగా ప్రారంభం కాబోతోంది. జిల్లాలోని సుమారు 52 ప్రభుత్వ శాఖలు ఆ రోజు నుంచి పూర్తిగా అకౌంట్లు, రికార్డుల నిర్వహణ అంతా కొత్తగా మొదలు పెట్టనున్నాయి. జిల్లాకు సంబంధించిన వివిధ గణాంకాలు మినహా ప్రభుత్వం నుంచి రావలసిన నిధులు, అవసరమైన నిధులు అన్ని వివరాలు ఇప్పటికే కొత్తగా నమోదు చేశారు. ప్రస్తుత పాత రికార్డులన్నీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి నిర్వహించగా, ఇకపై నూతన ఆంధ్రప్రదేశ్‌ను దృష్టిలో ఉంచుకుని తయారు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా ప్రభుత్వ శాఖల కొత్త వెబ్సైట్లు కూడా తయారవుతున్నాయి. సర్వర్లు కూడా వేటికవే విడివిడిగా సిద్ధం చేస్తుండడంతో ఆ మేరకు జిల్లా ప్రభుత్వ కార్యాలయాల్లో సాంకేతిక విధానాన్ని మార్చుతున్నారు. రవాణా, ట్రెజరీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖల్లో మరిన్ని భారీ మార్పులు వస్తున్నాయి. రెండో తేదీ నుంచి కొత్త పాలన మొదలు కానుండడంతో జిల్లాలో అన్ని కొత్త వాహనాలకు ఇకపై కొత్త తరహా రిజిస్ట్రేషన్ నంబర్లు కేటాయించనున్నారు. ప్రస్తుతమున్న రిజిస్ట్రేషన్ సిరీస్‌లు కూడా మారబోతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇటువంటి మార్పుల కోసమే శుక్రవారం నుంచి పలు సర్వర్లు, మీసేవా కేంద్రాలు సైతం మూతపడ్డాయి. ఇంకో పక్క జిల్లాలోని అన్ని ప్రభుత్వశాఖల అధికారులు తక్షణ నిధుల కోసం ప్రస్తుతం నివేదికలు తయారుచేసే పనిలో పడ్డారు. వ్యవసాయశాఖ, పశుసంవర్థక, విద్యా, వైద్య శాఖలు నూతన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొలువైన తర్వాత తక్షణ నిధులు తెచ్చుకునేందుకు వీలుగా ప్రతిపాదనలు తయారు చేస్తున్నాయి. ప్రాంతీయ కంటి ఆస్పత్రి, వైద్య ఆరోగ్యశాఖ, రిజిస్ట్రేషన్ల శాఖ, ఎక్సయిజ్, పోలీసు విభాగాలు విభజన నేపథ్యంలో జిల్లాలో తమ తమ విభాగాలను బలోపేతం చేసేందుకు ఇప్పటికే ప్రతిపాదనలను ఆయా రాష్ట్ర ఉన్నతాధికారులకు పంపించాయి. ఇకపై హైదరాబాద్‌కు ఫోన్ చేయాల్సిన ఉన్నతాధికారుల వివరాలు, ఫోన్ నంబర్లు, ల్యాండ్ నంబర్లు మారుతుండడంతో ఆ వివరాలను శాఖల వారీగా జిల్లాలో మార్చారు. ప్రజలకు, ఇతర ముఖ్యులకు వాటిని ఇవ్వాల్సిన అవసరమున్నచోట అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. పలు రికార్డులు, ఫైళ్లపై వేసే స్టాంపులను సైతం ఇప్పటికే మార్చే పనిలో పడ్డారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హైదరాబాద్ చిరునామాతో స్టాంపింగ్ వేస్తుండగా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పేరును కొనసాగించి రాజధాని పేరును మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్త రాజధాని ఖరారైన వెంటనే స్టాంపింగ్‌లో మార్పులు చేయనున్నారు. అటు రిజిస్ట్రేషన్ల శాఖలోనూ వెండింగ్ పేపర్లపైనా చిరునామాలు మార్చి అమల్లోకి తీసుకువస్తున్నారు. పరిశ్రమలశాఖ, ఉపాధి, బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లలో ఇప్పటికే స్వయం ఉపాధి రుణాల కోసం చేసుకున్న నిరుద్యోగ యువత, కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసి ప్రభుత్వ రాయితీల కోసం ఆయా వర్గాలు కొన్నాళ్ల కిందట జిల్లా అధికారులకు దరఖాస్తులు పెట్టుకున్నారు. వీటిని హైదరాబాద్‌లోని ఉన్నతాధికారులకు పంపారు. కానీ ఇప్పుడు శాఖల విభజన జరగడం, ఉన్నతాధికారులు మారడంతో పెట్టుకున్న దరఖాస్తులన్నీ రద్దుకానున్నాయి. దీంతో నిరుద్యోగులు, చిన్న తరహా పారిశ్రామిక వేత్తలు ఇప్పుడు తమ పరిస్థితి ఏంటోనని అధికారులు చుట్టూ తిరుగుతున్నారు. -
అక్రమాలకు నిలయమైన నిమ్స్
ఆస్పత్రి అకౌంట్స్ నిర్వహణపై ఆడిట్ విభాగం అభ్యంతరం వైద్య పరికరాల కొనుగోళ్లు, నిర్మాణపు పనుల్లో అవినీతే కారణం సాక్షి, సిటీబ్యూరో : గత కొంతకాలంగా ప్రతిష్టాత్మక నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (నిమ్స్) అవినీతికి నిలయంగా మారింది. కొంతమంది అధికారులు రోగుల సొమ్మును పందికొక్కుల్లా మింగేస్తున్నారు. కొత్త భవనాల నిర్మాణం, వైద్య పరికరాల కొనుగోళ్లు, అకౌంట్స్ నిర్వహణ, బకాయిల వ సూళ్లు, చెల్లింపుల్లో భారీఎత్తున అక్రమాలు జరిగాయి. ప్రభుత్వ అనుమతి లేకుండా, కనీసం టెండర్ కూడా పిలవకుండానే ఇష్టం వచ్చినట్లు నిర్మాణపు పనులు కేటాయించడం, వైద్య పరికరాలు కొనుగోలు చేయడం వల్ల ఆస్పత్రికోట్లాది రూపాయలు నష్టపోవాల్సి వచ్చింది. గత 13 నెలల నుంచి ఆస్పత్రి ఆదాయ, వ్యయాలపై ఆడిట్స్ నిర్వహించకపోగా, ఫైనాన్స్ కంట్రోలర్ శ్రీధర్ ప్రభుత్వానికి సమర్పించిన బిల్లుల్లో అన్ని లోపాలే ఉన్నట్లు విజిలెన్స్ విభాగం స్పష్టం చేసింది. అన్ని అవకతవకలే... బీబీనగర్‌లో రూ.93 కోట్లతో, నిమ్స్‌లో రూ.100 కోట్లతో సూపర్‌స్పెషాలిటీ, ట్రామాకేర్ బ్లాక్‌లను నిర్మించారు. రూ.3 కోట్లతో మిలీ నియం బ్లాక్ నిర్మించారు. మిలీనియం బ్లాక్‌తో పాటు బీబీనగర్ నిమ్స్ నిర్మాణపు పనుల్లో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారు. సూపర్ స్పెషాలిటీ, ట్రామా బ్లాక్ నిర్మాణ సమయంలో ప్రభుత్వ అనుమతి లేకుండా టెండర్లో ఐదు శాతం ఎక్కువ కోడ్ చేసినట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. అప్పటి డెరైక్టర్ ప్రసాదరావు, డిప్యూటీ డెరైక్టర్ కేటీరెడ్డి, ఫైనాన్సియల్ కంట్రోలర్ శ్రీధర్, టెక్నికల్ అడ్వైజర్ మజారుద్దీన్, ఇంజనీర్ సమ్‌దానీలపై అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. గతంలో విజిలెన్స్ అధికారులు ఇచ్చిన నివేదికలపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో స్పష్టం చేయాలని ఇటీవల ఓ కేసు విషయంలో కోర్టుకు హాజరైన నిమ్స్ అధికారులను న్యాయమూర్తి ప్రశ్నించడం విశేషం. ఈ మేరకు ఇటీవల జరిగిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో ఇదే అంశాన్ని ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది. ఫైనాన్స్ కంట్రోలర్ శ్రీధర్‌పై వేటు నిమ్స్ ఫైనాన్స్ కంట్రోలర్ శ్రీధర్‌పై ఆస్పత్రి యాజమాన్యం శనివారం వేటు వేసింది. విధి నిర్వహణలో అలసత్వం, రికార్డుల నిర్వ హణ, అకౌంట్స్, ఆడిటింగ్‌లో లోపాలకు ఆయన్ను బాధ్యుడిని చేస్తూ ఈ మేరకు చర్యలు తీసుకుంది. ప్రభుత్వానికి ఆయన పంపిన ఆడిట్స్‌పై విజిలెన్స్ విభాగం అనేక అభ్యంతరాలు చెప్పడంతో పాటు ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆదేశించడం వల్లే ఈ పని చేయాల్సి వచ్చిందని నిమ్స్ డెరైక్టర్ డాక్టర్ నరేంద్రనాధ్ స్పష్టం చేశారు. -
పీఎఫ్.. ఉఫ్
కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఇటీవలకాలం వరకు పనిచేసిన అకౌంటెంట్లకు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ శఠగోపం పెట్టింది. పీఎఫ్ చెల్లించకుండా నానా తిప్పలు పెడుతోంది. ఇప్పటికీ పనిచేస్తున్న ఇతర సిబ్బందికి పీఎఫ్ జమ చేస్తున్న దాఖలాలు లేవు. ఆర్వీఎం ఉన్నతాధికారుల అండదండలు ఉండడంతో ఆ ఏజెన్సీ నిర్వాహకులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఈ ఏజెన్సీ.. రాజీవ్ విద్యా మిషన్ (ఆర్వీఎం)లో అవుట్ సోర్సింగ్ పద్ధతిన పనిచేసి రెండు రోజుల క్రితం తొలగింపునకు గురైన వ్యక్తిదే కావడం గమనార్హం. సాక్షి, నల్లగొండ: జిల్లాలో ఆర్వీఎం పరిధిలో 18 కేజీబీవీలు ఉన్నాయి. ఈ విద్యాలయాలకు కావాల్సిన అకౌంటెంట్లు, ఏఎన్ఎం, స్వీపర్, నైట్ వాచ్మన్లను గత పీఓకు కావాల్సిన వ్యక్తికి చెందిన అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ సమకూర్చింది. వీరంతా 2011 జూన్‌లో నియామకమయ్యారు. అప్పటి నుంచి ఒక్కొక్కరి వేతనంలో పీఎఫ్ కింద 13.61 శాతం, ఈఎస్ఐ కింద 4.75 శాతం, ఇతరత్రాలను కలిపి కట్ చేశారు. రూ.1600 చొప్పున 72 మంది వేతనాల్లో ప్రతినెలా రూ.1.30 లక్షలు కోత విధించారు. కట్ చేసిన పీఎఫ్ మొత్తాన్ని సంబంధిత ఉద్యోగి/సిబ్బంది ఖాతాల్లో విధిగా జమ చేయాలి. కానీ ఇంతవరకు చేసిన దాఖలాలు లేవు. అంతేగాక ెహ ల్త్కార్డు కూడా అందజేసిన దాఖలా ఒక్కటీ లేదు. రూ.15 లక్షలకుపైగా.... కేజీబీవీల్లో పనిచేస్తున్న 17మంది అకౌంటెంట్లను అనర్హత కారణంగా గతేడాది ఆగస్టులో విధుల నుంచి ఆర్వీఎం అధికారులు తొలగించారు. తమకు పీఎఫ్ అందజేయాలని సదరు అభ్యర్థులు ఆర్వీఎం అధికారులు, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. అయినా వారిలో చలనం లేకపోయింది. దీంతో గత్యంతరం లేక వారు సీఎం కార్యాలయంలో గత నవంబర్ నెలాఖరులో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టాలని అక్కడి నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఆదేశాలు అందాయని సమాచారం. పీఎఫ్ అందజేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కార్యాలయం నుంచి ఆర్వీఎంకు సూచనలు అందాయి. అయితే సదరు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ తన అనుయాయుడు కావడంతో ఆర్వీఎం ఉన్నతాధికారి చేష్టలుడిగారు. పెద్దాయన ఆశీస్సులు తమకుండగా... నాకేంటి అన్న ధీమాలో ఉన్నాడు. విధుల్లో చేరినప్పటి నుంచి 72 మందికి చెందిన దాదాపు రూ.15 లక్షల పీఎఫ్ అందజేయాల్సి ఉంది. ఆర్వీఎంలో అవుట్ సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్న ఈయన రెండు రోజుల క్రితం విధుల నుంచి తొలగింపునకు గురైన విషయం తెలిసిందే. దీంతో తమకు పీఎఫ్ వస్తుందో రాదోనన్న భయాందోళనలో ఉద్యోగులు ఉన్నారు. ఈ విషయంపై కలెక్టర్ దృష్టి సారించి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. -
రూ.1కి రూ.10 ఖర్చు!
బి.కొత్తకోట, న్యూస్‌లైన్ : పావలా కోడికి ముప్పావలా మసాలా అన్నట్టుంది తిరుపతి టెలికం అధికారుల తీరు. ఖాతాదారుల లావాదేవీల పట్ల ఎంత చిత్తశుద్ధితో ఉంటారో చేతల్లో చూపించారు. బి.కొత్తకోటకు చెందిన బి.చాంద్‌బాషా జ్యోతిచౌక్‌లో ఎస్టీడీ బూత్ నిర్వహణకు రెండు టెలిఫోన్ కనెక్షన్లు తీసుకున్నాడు. కాలగమనంలో వీటికి ఆదరణ తగ్గింది. 2007లో ఎస్టీడీ నిర్వహణను మానుకున్నాడు. తనకున్న ఫోన్ కనె క్షన్లను తొలగించాలని అధికారులకు విన్నవించాడు. తర్వాత కనెక్షన్ కట్‌చేశారు. ఇది జరిగి ఐదేళ్లవుతోంది. టెలికం అధికారులు వారికి రావాల్సిన బకాయిలను డిపాజిట్ నుంచి తీసుకున్నారు. మిగిలిన రూ.1ని నవంబర్ 14న తిరుపతి టెలికం జనరల్ మేనేజర్ కార్యాలయ అకౌంట్స్ అధికారి చెక్కు రూపంలో నవంబర్ 14న పంపారు. ఇది శుక్రవారం చాంద్‌బాషాకు చేరింది. దీన్ని చూసి ఆయన అవాక్కయ్యారు. కాగా ఈ చెక్కు విలువ రూ.2.5 పైసలు. దీనికి రూ.2 విలువైన ఒక లేఖ, రూ.5 స్టాంపు, రూ.1 విలువైన కవర్‌ను ఖర్చుచేశారు. రూపాయి పంపేందుకు రూ.10.5 పైసలు వ్యయం చేశారు. స్టేట్ బ్యాంకులో ఖాతా ఉంటే ఖర్చులేకుండా రూపాయిని చెల్లిస్తామని స్థానిక ఎస్బీఐ మేనేజర్ మారెడ్డి జగదీశ్వర్‌రెడ్డి చెప్పడం కొసమెరుపు. -
లాకప్పా.. లాకరా
ఈ ఫొటోలో ఉన్నది బద్వేలు పోలీస్‌స్టేషన్‌లోని లాకప్ గది. అక్కడ టేబుల్‌పై సీల్‌వేసిన ఒక బాక్స్ ఉంది కదూ.. అందులో అక్షరాలా రూ. 25 లక్షలు ఉన్నాయి. ఇదేమిటి లాకప్‌లో దొంగలు, నిందితులు ఉంటారు గానీ రూ.లక్షలు ఉంటాయా అని అనుకుంటున్నారా.. అవును నిజమే.. నెల కాదు రెండు నెలలు కాదు మూడేళ్లుగా రూ. 25 లక్షలు ఉన్న బాక్స్ లాకప్ గదిలోనే మగ్గుతోంది.శుక్రవారం ఈ బాక్స్‌ను కోర్టు స్వాధీనం చేసుకుంది. బద్వేలు, న్యూస్‌లైన్: బద్వేలు ట్రెజరీ కార్యాలయంలో కృష్టంరాజు అనే జూనియర్ అకౌంటెంట్ 2010లో విధులు నిర్వహించేవారు. పలువురు ఉద్యోగులకు చెందిన రుణాలు, పదవీ విరమణ సమయంలో వచ్చిన నగదును చాకచక్యంగా ఇతరుల అకౌంట్లకు మార్పు చేశాడు. కృష్ణంరాజు తల్లి ఈశ్వరి పెన్షనర్‌గా ట్రెజరీ నుంచి పెన్షన్ పొందుతుండేవారు. ఈమె అకౌంట్‌కు రూ.6.37లక్షలు, సుధ పేరుతో ఉన్న అకౌంట్‌కు రూ. 19.28 మళ్లించాడు. అనంతరం మొత్తం రూ.25.65 లక్షలను డ్రా చేసుకుని స్వాహా చేశాడు. ఐదారు నెలల అనంతరం ఈ విషయం బయటపడింది. దీనిపై ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. విచారించిన పోలీసులు 2010 డిసెంబరులో నిందితుడు కృష్ణంరాజు నుంచి రూ.25.65లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఈశ్వరి, సుధలకు సంబంధం లేదని తేల్చి వారిని కేసు నుంచి తొలగించారు. పోలీసులు పంచాయతీ చేసి నిందితుడిని తప్పించేందుకు సహకరించారనే విమర్శలు ఉన్నాయి. నిందితుడిని విలేకరులకు కూడా చూపించకుండా జాగ్రత్త పడ్డారు. దాదాపు రూ.5లక్షలు చేతులు మారాయనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. నిందితుడితో పాటు నగదును కోర్టులో ప్రవేశపెట్టారు. పోలీస్‌స్టేషన్‌లోనే నగదు ఉంచాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఆ నగదుకు సీలు వేసి పట్టణ పోలీస్‌స్టేషన్‌లోని లాకప్‌లో ఉంచారు. నిందితుడు మాత్రం కేసు నుంచి తప్పించుకుని మళ్లీ ఉద్యోగంలో చేరినట్లు సమాచారం. కాగా బద్వేలు పోలీస్‌స్టేషన్‌లోని లాకప్‌లో మూడేళ్లుగా మూలుగుతున్న రూ.25లక్షల నగదు శుక్రవారం కోర్టుకు చేరింది. కోర్టు ఆదేశాల మేరకు స్థానిక స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియాలోని ప్రభుత్వ ఖాతాలో దీనిని జమ చేశారు. -
ఎస్పీడీసీఎల్కు సమ్మె ఎఫెక్ట్
సాక్షి, తిరుపతి: సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎస్పీడీసీఎల్) పరిధిలోని చిత్తూరు, కడప, నెల్లూరు, కృష్ణా, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో సేవలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విద్యుత్ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు 72 గంటల సమ్మెలో అటెండర్ నుంచి డీఈల వరకు క్లర్కుల నుంచి జీఎం క్యాడర్ అధికారుల వరకు పాల్గొంటుండటంతో విద్యుత్ సేవల నిర్వహణ నిలిచిపోయిం ది. ఓవైపు బిల్లింగ్, మరోవైపు చెల్లింపులు నిలిచి పోయాయి. డిస్కం ఉన్నతాధికారులు ప్రత్యామ్నాయం కోసం ఆలోచిస్తున్నారు. కంపెనీ పరి ధిలో 12,500 మంది ఉద్యోగులు ఉంటే 97 శాతం మంది సమ్మెలో పాల్గొన్నారు. రెండో రో జుశుక్రవారం ఆరు జిల్లాల్లో ఎస్ఈ కార్యాల యాల నుంచి విద్యుత్ జేఏసీల ఆధ్వర్యంలో ర్యాలీలు, కార్యాలయాల వద్ద ధర్నాలు చేశారు. నిలిచిన రూ.30 కోట్ల చెల్లింపులు రోజువారీ విద్యుత్ వినియోగదారుల నుంచి వసూలు కావాల్సిన రూ.15 కోట్లు చొప్పున రెండు రోజులకు రూ.30 కోట్ల రూపాయలు డిస్కంకు రాకుండా నిలిచిపోయాయి. ఈ-సేవలు, విద్యుత్ వినియోగదారుల చెల్లింపు కేం ద్రాల ద్వారా విద్యుత్ చార్జీలు వసూలు చేస్తుం టారు. ఆరు జిల్లాల్లో 48 గంటలుగా బిల్లింగ్ వసూలు ఆపేశారు. అకౌంట్స్ విభాగానికి చెం దిన అధికారులు కూడా సమ్మెలో పాల్గొంటుండటంతో ఈ ప్రభావం పడింది. సెప్టెంబరులో వినియోగించే విద్యుత్‌కు రూపొందించాల్సిన బిల్లుల తయారీ కూడా పెండింగ్ పడింది. ఈ-సేవల నుంచి ఆన్లైన్ చెల్లింపుల ద్వారా ఎన్నికోట్ల రూపాయల చార్జీలు వసూలయ్యాయనే లెక్కలు సీఎండీకి కూడా తెలియని పరిస్థి తి. ఈ వివరాలు మేనేజ్మెంట్కు అందించాల్సిన అధికారులు కూడా సమ్మెలో ఉన్నారు. వరుసగా బ్రేక్డౌన్లు.. ప్రకృతి బీభత్సం సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన సమ్మె ప్రభావం ఆరు జిల్లాల్లో హెచ్.టీ సర్వీసులు, విద్యుత్ ఫీడర్లు బ్రేక్‌డౌన్ అయితే గంటల తరబడి పునరుద్ధరించే పరిస్థితి లేదు. జిల్లాకు ఒక ఎస్ఈ మాత్రమే విధుల్లో ఉండటంతో వారు ప్రైవేట్ కాంట్రాక్టర్లను బతిమాలి సర్వీసు బ్రేక్డౌన్లు పునరుద్ధరణ చేస్తున్నారు. సబ్స్టేషన్ల నిర్వహణ గాలిలో దీపంలా మారిం ది. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల మీదే ఆధారపడి చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్పోతే ఎప్పటికొస్తుందో తెలియని పరిస్థితి. నెల్లూరు జిల్లా గూడూరులో మైన్స్‌లో సర్వీసు బ్రేక్ డౌన్ కావడంతో సమస్య ఏర్పడింది. గుంటూరు జిల్లా నల్లపాడులోనూ ఫీడర్లో సమస్య ఏర్పడటంతో అర్ధరాత్రి వరకు పునరుద్ధరణ పనులు చేస్తూనే ఉన్నారు. గుంటూరు, కడప, కృష్ణా జిల్లాల్లో గాలీవాన బీభత్సానికి విద్యుత్ లైన్లు తెగిపడ్డాయి. చాలా ఫీడర్లు నీటమునిగి పని చేసే పరిస్థితి లేదు. వీటిని పునరుద్ధరించడం, తెగిన విద్యుత్ తీగలను సరిచేయడం ఇప్పట్లో జరిగేలా లేదని ఉన్నతాధికారులు చెబుతున్నా రు. గతంలో 2 గంటల్లో సర్వీసు బ్రేక్డౌన్లు మరమ్మతు చేస్తే ప్రస్తుతం 6 గంటలు పడుతోంది. -
హైదరాబాద్ ఆదాయాల పై తర్జన భర్జన