న్యూఢిల్లీ: సోషల్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ జూలైలో భారతదేశంలో 23.87 లక్షలకు పైగా ఖాతాలను నిషేధించింది. ఈ ఖాతాలపై వచ్చిన ఫిర్యాదులు ఆధారంగా ఈచర్చ తీసుకుంది. ఇదే ఏడాది జూన్‌లో 22 లక్షలకు పైగా ఖాతాలను, మేలో 19 లక్షల ఖాతాలు బ్యాన్ చేసింది.
ఇది చదవండి : 100 డాలర్లు రీఫండ్ అడిగితే, కోటి ఇచ్చారా? ఇదెక్కడి చోద్యం రా మామా!
మార్గదర్శకాలు,నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ ఖాతాలను బ్యాన్ చేసినట్టు ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ వెల్లడించింది. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్-2021 నిబంధనల కింద తాజా నివేదికలో వాట్సాప్ఈవివరాలను అందించింది. అలాగే యూజర్ల ఫిర్యాదులు దానిపై తాము తీసుకున్న చర్యల వివరాలు కూడా పొందుపరిచామని వాట్సాప్ తెలిపింది.
ఇదీ చదవండి: WhatsApp:బీ అలర్ట్: ఈ ఫోన్లలో వాట్సాప్ అక్టోబరు నుంచి పనిచేయదు
జూలైలో అందిన 574 ఫిర్యాదుల నివేదికల్లో 392 నివేదికలు 'బ్యాన్ అప్పీల్' గాను, మిగిలినవి ఖాతా,ప్రొడక్ట్స్, భద్రత లాంటివి వచ్చాయని చెప్పింది. జూలై 1, 2022 , జూలై 31, 2022 మధ్య, 23,87,000 వాట్సాప్ ఖాతాలు నిషేధించామని, వీటిలో 14,16,000 ఖాతాలు ముందుగా బ్యాన్ చేశామని నెలవారీ నివేదిక పేర్కొంది. అంతకుముందు జూన్‌లో వాట్సాప్‌కు 632 ఫిర్యాదుల నివేదికలు అందగా, మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాటిలో 64పై చర్య తీసుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment