
న్యూఢిల్లీ: మెసేజింగ్ యాప్ వాట్సాప్ మే నెలలో భారత్‌కు చెందిన 19.10 లక్షల ఖాతాలను నిషేధించింది. ఉల్లంఘనలను నిరోధించడానికి, గుర్తించడానికి ఏర్పాటు చేసిన సొంత యంత్రాంగంతోపాటు వినియోగదారుల ఫిర్యాదుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వాట్సాప్ ప్రకటించింది.
ఈ ఏడాది మార్చిలో 18.05 లక్షలు, ఏప్రిల్‌లో 16 లక్షల భారతీయ ఖాతాలను వాట్సాప్ నిషేధించింది. గతేడాది అమల్లోకి వచ్చిన నూతన ఐటీ నియమాల ప్రకారం 50 లక్షలకు పైగా వినియోగదారులు ఉన్న పెద్ద డిజిటల్ వేదికలు ప్రతి నెలా ఫిర్యాదుల నివేదికలను ప్రచురించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment