దుర్గగుడి అధికారుల నిర్లక్ష్యాన్ని కడిగేసిన కాగ్ | CAG officials' ignorance durgagudi dishwashers | Sakshi
Sakshi News home page

దుర్గగుడి అధికారుల నిర్లక్ష్యాన్ని కడిగేసిన కాగ్

Published Mon, Sep 8 2014 1:39 AM | Last Updated on Sat, Sep 2 2017 1:01 PM

దుర్గగుడి అధికారుల నిర్లక్ష్యాన్ని కడిగేసిన కాగ్

దుర్గగుడి అధికారుల నిర్లక్ష్యాన్ని కడిగేసిన కాగ్

  •   డబ్బు వసూలులో నిర్లక్ష్యం
  •   ‘అకౌంట్స్’ రికార్డులు అధ్వానం
  •   బంగారం భద్రపరచడంలోనూ మీనమేషాలు
  •   భక్తుల రక్షణా ప్రశ్నార్థకమే!
  •   నివేదికలో స్పష్టంచేసిన ‘కాగ్’
  • సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో రెండో అతిపెద్ద దేవాలయమైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థాన అధికారుల నిర్లక్ష్యం, అక్రమాలను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) బట్టబయలు చేసింది. గత ఏడాది మార్చి వరకు జరిగిన సాక్షి, విజయవాడ : దసరా ఉత్సవాలు మరో 20 రోజుల్లో ప్రారంభమవుతున్నప్పటికీ ఇంకా పనులు వేగవంతం కాలేదు. ఉత్సవ ఏర్పాట్లపై రెవెన్యూ, దేవస్థానం అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. సకాలంలో పనులు పూర్తికాకపోతే చివర్లో ఎప్పటిలాగానే హడావుడి నిర్ణయాలు తీసుకుని భక్తులకు ఇబ్బంది కలించే అవకాశం ఉంది.
     
    సమావేశాల్లో తీవ్ర జాప్యం..

    అధికారులు ఇప్పటివరకు  కేవలం ఒక్కసారి మాత్రమే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉత్సవ ఏర్పాట్లను సమీక్షించే సబ్‌కలెక్టర్ హరిచందన బదిలీ కావడంతో ఆమె స్థానంలో కొత్తగా నాగలక్ష్మి బాధ్యతలు చేపట్టారు. ఆమె ఉత్సవాలపై అవగాహన పెంచుకుని వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి వారికి తగిన ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఇన్‌చార్జి ఈవో త్రినాథరావు ద్వారకాతిరుమల దేవస్థానానికీ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తుండడమే కాకుండా గుంటూరులో దేవాదాయ శాఖ డెప్యూటీ కమిషనర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనపై పని ఒత్తిడి ఎక్కువగా ఉంది. పూర్తిస్థాయి ఈవో లేకపోవడంతో  నిర్ణయాలు తీసుకోవడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. వీటికితోడు దేవస్థానం సిబ్బందికి వారం రోజుల్లో బదిలీలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. అందుకే వారు ఉత్సవ ఏర్పాట్లపై శ్రద్ధ చూపడం లేదు.
     
    అందుబాటులో లేని మంత్రి..


    దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు విదేశీ పర్యటనకు వెళ్లారు. ఆయన వచ్చేసరికి ఉత్సవాలకు సమయం దగ్గర పడుతుంది. ఇక ఆయన వచ్చినా సమీక్ష సమావేశాల్లో మొక్కుబడిగానే పాల్గొంటారు. జిల్లా మంత్రులు కూడా ఉత్సవ ఏర్పాట్లపై ఆసక్తిచూపడం లేదు. మంత్రి విదేశీ పర్యటనకు వెళ్లేముందే పాలకమండలిని కాని, ఉత్సవ కమిటీని కాని వేస్తారని అందరూ భావించారు. ఇప్పటి వరకు ఆ ముచ్చటా తీరలేదు. ఉత్సవాలకు ముందు కమిటీలను వేసినా భక్తులకు  ఏమాత్రం ఉపయోగం ఉండదు.
     
    రాజగోపురం నుంచి దర్శనం లేనట్లే


    గత ఏడాది కంటే భిన్నంగా ఈ ఏడాది భక్తుల్ని రాజగోపురం నుంచి అమ్మవారి దర్శనానికి పంపాలని దేవస్థానం అధికారులు తొలుత నిర్ణయించారు. రాజగోపురం నిర్మాణ  పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో ఆ ఆలోచనకు స్వస్తిపలికి ఘాట్‌రోడ్డు, మెట్ల మార్గం నుంచి భక్తుల్ని దర్శనానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
     
    ట్రాఫిక్ కష్టాలు...

    గతంలో దుర్గాఘాట్ నుంచి భక్తుల్ని నేరుగా ఘాట్‌రోడ్డు మీదుగా కొండపైకి పంపేవారు. ఈ ఏడాది ట్రాఫిక్ విషయంలో మార్పులు చేర్పులు చేయడంతో భక్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఉత్సవాల నాటికి జాతీయ రహదారి ట్రాఫిక్‌ను దారి మళ్లించి, అమ్మవారి దర్శనం సులభంగా అయ్యేలా చూడాలని భక్తులు కోరుతున్నారు.  
     
    టెండర్లు ప్రక్రియ షురూ

    దసరా ఉత్సవాల విధులు నిర్వహించే ఇతర శాఖల సిబ్బందికి భోజనాలు ఏర్పాట్లు, భక్తుల సామాన్లు భద్రపరుచుకునే క్లోక్ రూమ్‌ల నిర్వహణ, ప్రసాదాల తయారీ, క్యూలైన్లు ఏర్పాటు  పనుల్ని కాంట్రాక్టు ఇస్తారు. ప్రస్తుతానికి ఈ వర్క్‌లకు టెండర్లు పిలిచారు. ఈ నెల 9న టెండర్లు ఖరారు చేస్తారు.  ఆ తర్వాతే పనులు ప్రారంభం అవుతాయని సిబ్బంది చెబుతున్నారు.  
     
    దసరా ఏర్పాట్లపై సబ్ కలెక్టర్ ఆరా  

    దసరా ఉత్సవాల్లో భాగంగా ఆలయ అధికారులు చేపట్టిన వివిధ పనులను సబ్ కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఆమెకు దసరా ఉత్సవాల ఏర్పాట్ల గురించి ఆలయ అధికారులు వివరించారు. అర్బన్ తహశీల్దార్ శివరావ్, ఈవో త్రినాథరావు, ఈఈ కోటేశ్వరరావులు ఉత్సవాల రూట్‌మ్యాప్‌ను వివరించారు. దుర్గా ఘాట్‌కు చేరుకుని ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం  ఆలయంలో క్యూలైన్ల గురించి ఆరా తీశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement