సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియా యాప్ ‘టిక్ టాక్’లో అధికారిక ఖాతా ఉన్న తొలి రాజకీయ పార్టీగా ఎంఐఎం రికార్డుకెక్కింది. ఈ మేరకు మంగళవారం ఆ పార్టీ కేంద్ర కార్యాలయమైన దారుస్సలాం నుంచి ఒక ప్రకటన విడుదలైంది. దేశంలోని యువ ఇంటర్నెట్ వినియోగదారులను టిక్‌టాక్ ద్వారా చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టం చేసింది. పార్టీ అధికారిక ‘టిక్‌టాక్’ఖాతాను సుమారు 7000 మంది అనుసరిస్తుండగా, 60 వేల మంది లైక్‌లు, 75 వీడియోలు వచ్చాయన్నారు. యువత తమ భావ స్వేచ్ఛను పంచుకునేందుకు ఇది ఒక వేదికగా పనిచేస్తోందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment