
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఓటర్లు ఎంఐఎంకు వ్యతిరేకంగా ఓటువేసి బీజేపీని గెలిపించాలని కిషన్‌రెడ్డి కోరారు.
కేందమంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘హైదరాబాద్ లోకల్ బాడీ ఎన్నికలలో ఎంఐఎం వ్యతిరేకులంతా బీజేపీ వైపు నిలబడాలి. ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మూడు పార్టీలు ఒక్కటే. లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా గెలుస్తోంది. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయవచ్చు. సంఖ్యా బలంతో సంబంధం లేకుండా మేము పోటీ చేస్తున్నాం. ఒక్క బీఆర్‌ఎస్ ఓటర్లనే కాకుండా కాంగ్రెస్ ఓటర్లను కూడా ఎంఐఎంకు వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరుతున్నాం. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతీ బూత్‌లో పార్టీ జెండా ఎగురవేస్తాం. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం తర్వాత రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తవుతుంది’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
