MIM party
-
మజ్లిస్ దూకుడు
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల కోసం మజ్లిస్ పార్టీ దూకుడు పెంచింది. ఇప్పటికే పాదయాత్రలతో ముందస్తు ప్రచారానికి శ్రీకారం చుట్టిన మజ్లిస్ పార్టీ.. రంజాన్ మాసం ఇఫ్తార్ విందులను సైతం సద్వినియోగం చేసుకుంటోంది. రోజుకో డివిజన్లో ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందులో ఆ పార్టీ అధినేత అసదుద్దీన్, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు హాజరు కావడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. మజ్లిస్ పార్టీకి హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుపుపై ఎలాంటి అనుమానాలు లేనప్పటికీ.. పోలింగ్ భారీగా జరిగేలా సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఇఫ్తార్ విందుల్లో సైతం పోలింగ్ ప్రస్తావన తీసుకొని రావడం ఇందుకు బలంచే కూరుతోంది. గత ఎన్నికల్లో సైతం పాదయాత్రలు, బహిరంగ సభల్లో పోలింగ్ శాతం పెంపు ప్రస్తావన ప్రధానాంశంగా కొనసాగించింది. ఈసారి సైతం పోలింగ్ పెంపుపై దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. మెజారిటీ కోసం.. హైదరాబాద్ లోక్‌సభ పరిధిలో మెజారిటీ ఓటర్లు ముస్లిం సామాజిక వర్గం వారే. పోలింగ్ ఎంత ఎక్కువగా నమోదైతే అంతే స్థాయిలో మెజారిటీ పెరుగుతుందని మజ్లిస్ పార్టీ భావిస్తోంది. ఎన్నికల్లో మజ్లిస్ పార్టీకి పోలింగ్ శాతమే మెజారిటీపై ప్రభావం చూపుతోంది. హైదరాబాద్ లోక్‌సభకు తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో మజ్లిస్ పక్షాన అప్పట్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగిన అబ్దుల్ వాహెద్ ఓవైసీ, ఆ తర్వాత బరిలో దిగిన సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీల ఓటములకు పోలింగ్ శాతమే ప్రభావం చూపింది. ఆ తర్వాత పోలింగ్ శాతం పెంపుపై దృష్టి సారించడంతో సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ జైత్రయాత్ర ప్రారంభమైంది. అనంతరం అసదుద్దీన్ ఒవైసీ విజయ పరంపర కొనసాగుతోంది. క్రమంగా పెరుగుతున్న పోలింగ్ శాతం మజ్లిస్‌ను ఎదురు లేని శక్తిగా తయారు చేసినట్లయింది. గత నాలుగు పర్యాయాల్లో పాతబస్తీపై గట్టి పట్టు సాధించి ఎన్నికలను ఏకపక్షంగా మార్చినప్పటికీ పెరుగుతున్న ఓటర్లకు అనుగుణంగా మెజారిటీ పెరగకపోవడం మింగుడు పడని అంశంగా తయారైంది. దీంతో అత్యధిక మెజారిటీ కోసం పోలింగ్ శాతం పెంపుపై ప్రత్యేక దృష్టి సారించి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది మజ్లిస్ పార్టీ. -
హాట్ సీట్.. హైదరాబాద్
హైదరాబాద్: చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ అనూహ్యంగా పెరుగుతోంది. సాధారణంగా ఇక్కడ ఎన్నికలు ఎప్పుడూ ఏకపక్షమే అని చెప్పొచ్చు. ముస్లింలు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఎంఐఎందే ఆధిపత్యం. గతంలో జరిగిన ఎన్నికల సరళిని పరిశీలిస్తే..మజ్లిస్ పార్టీ అభ్యరి్థకి బీజేపీ అభ్యర్థికి మాత్రమే ప్రధాన పోటీ ఉండేది. ఈసారి మాత్రం హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో ఎన్నికల పోరు రసవత్తరంగా ఉండనుంది. మజ్లిస్ పార్టీ ఇక్కడి నుంచి ఈజీగా విజయం సాధిస్తామని అనుకుంటున్నప్పటికీ..రోజు రోజుకు రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. మజ్లిస్ పార్టీని ధీటుగా ఎదుర్కోవడానికి బీజేపీతో పాటు కాంగ్రెస్, బీఎస్పీ, ఎంబీటీ పారీ్టలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. ► తాజాగా తెరపైకి బీఎస్పీ వచ్చింది. ఎన్ని పార్టీలు ఎన్నికల బరిలో ఉన్నా తమ విజయాన్ని ఆపలేరని మజ్లిస్ అధినేత, సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల పొత్తులో భాగంగా తమకు దక్కిన హైదరాబాద్ స్థానాన్ని వదులుకోమని బీఎస్పీ నేత ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అంటున్నారు. దళిత, బడుగు, బలహీన వర్గాల ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నందున తమ పారీ్టకి ఆదరణ లభిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ► ఇక ప్రధాన పోటీ మజ్లిస్, బీజేపీల మధ్యనే ఉన్నప్పటికీ ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ గాలివీస్తోందని అంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి కూడా ఇక్కడ బలమైన అభ్యర్థి బరిలో ఉంటారని భావిస్తున్నారు. అలీ మస్కతీని కాంగ్రెస్ పార్టీ తరపున రంగంలోకి దింపే చాన్స్ ఉందని పార్టీ వర్గాల సమాచారం. ► బీజేపీ అధిష్టానం ఇక్కడ మహిళా అభ్యర్థిని రంగంలోకి దింపింది. ఆ పార్టీ నుంచి మాధవీలత పోటీ చేస్తున్నారు. ఆమె ఇప్పటికే పలు ఆధ్యాతి్మక కార్యక్రమాలతో పాతబస్తీ ప్రజలకు సుపరిచితులయ్యారు. మంచి వాగ్ధాటితో ఆకట్టుకుంటున్నారు. దీంతో ఆమె గట్టి పోటీ ఇవ్వొచ్చనే టాక్ వినపడుతోంది. ► గతంలో మజ్లిస్ పారీ్టతో దోస్తానా కొనసాగించిన బీఆర్ఎస్..ఇక్కడ ఓ డమ్మీ అభ్యర్థని ఎన్నికల బరిలోకి దింపేది. మజ్లిస్ పార్టీ ఆదేశాల మేరకు నామ్కేవాస్తేగా వ్యవహరించేది. అయితే ఈసారి అలా జరగదని ఆ పార్టీ అధిష్టానం చెబుతోంది. పొత్తులో భాగంగా బీఎస్పీకి ఈ స్థానం కేటాయించినందున అనివార్యంగా బీఆర్ఎస్ నేతలు కూడా మజ్లిస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయాల్సి వస్తుంది. ► ఇక ముస్లిం వర్గానికే చెందిన ఎంబీటీ కూడా ఎన్నికల బరిలోకి దిగుతోంది. ఎంఐఎంకు పోటీగా ఇక్కడ ఎంబీటీ నుంచి ఆ పార్టీ అధికారప్రతినిధి అంజదుల్లాఖాన్ పోటీ చేస్తారని తెలుస్తోంది. బీఎస్పీ నుంచి చాట్ల చిరంజీవి? హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బీఎస్పీ అభ్యరి్థగా ఎన్నికల బరిలోకి దిగడానికి చాట్ల చిరంజీవి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీఎస్పీ హైదరాబాద్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న చాట్ల చిరంజీవి వృత్తిరీత్యా న్యాయవాది. బీఎస్పీ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు అత్యంత ప్రియ శిష్యుడు కూడా. ఏడేళ్లుగా పారీ్టలో ఉన్నందున చిరంజీవికి పోటీ చేసే చాన్స్ లభిస్తుందని అంటున్నారు. ఆరి్థక, కొన్ని సాంకేతిక కారణాలు ఎదురైతే మాత్రం ఆయన స్థానంలో కాస్త ఆరి్థకంగా బలంగా ఉ న్న బీసీ అభ్యరి్థని ఎన్నికల బరిలోకి దింపే అవకాశాలు కూడా లేకపోలేదని చెబుతున్నారు. -
దోస్త్ మేరా దోస్త్..?
చార్మినార్: పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పాతబస్తీ రాజకీయం రసవత్తరంగా మారనున్నదా... సరికొత్త ఎత్తులు, పొత్తులకు రంగం సిద్ధమవుతున్నదా... కాంగ్రెస్ పార్టీకి మజ్లిస్ స్నేహహస్తం అందించనున్నదా.. మెట్రోరైలు పనుల శంకుస్థాపన వేదిక సరికొత్త రాజకీయ పరిణామాలకు అంకురార్పణ చేసిందా... అంటే అవుననే అంటున్నాయి తాజా రాజకీయ పరిణామాలు. ఇటీవల పాతబస్తీలో మెట్రో రైలు పనుల శంకుస్థాపన సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు ఊతమిస్తున్నాయి. ఇవి ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఓటమి ఎరుగని మజ్లిస్ పార్టీ ఈసారీ నూటికి నూరు శాతం విజయం సాధిస్తాననే ధీమాతో ఉన్నప్పటికీ ఇటు బీజేపీని, అటు ఎంబీటీనీ ఎదుర్కోవడానికి ఎత్తుగడలను మారుస్తోంది. విరించి ఆసుపత్రి చైర్పర్సన్ మాధవీలతను బీజేపీ అధిష్టానం హైదరాబాద్ నుంచి ఎన్నికల బరిలో దింపుతుండటంతో మజ్లిస్ పార్టీ అప్రమత్తమైంది. దీనికి శుక్రవారం పాతబస్తీ ఫలక్‌నుమాలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్న మెట్రో రైలు పనుల శంకుస్థాపన సభలో ఎంఐఎం సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యవహరించిన తీరే నిదర్శనమని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్‌తో స్నేహం కలిసి వస్తుందని... కాంగ్రెస్ పార్టీతో కొన్నేళ్లుగా ఎడమొహం పెడమొహంగా ఉన్న అసదుద్దీన్ దోస్తానా కోసం స్వరం మార్చారు. ఆయన తాజా బహిరంగ సభలో మాట్లాడుతూ ‘సీఎం రేవంత్‌రెడ్డి మొండి ఘటం. ఆ మొండితనమే ఆయనను సీఎం పదవి వరకు తెచ్చింది. అయితే నేను, నా పార్టీవాళ్లు కూడా తలతిక్కోళ్లం. అయినప్పటికీ ఐదేళ్లపాటు హాయిగా ప్రభుత్వాన్ని నడిపేటట్లు పూర్తిగా సహకరిస్తాం’ అని ప్రకటించడం గమనార్హం. అసద్ మాటలపై సీఎం రేవంత్ స్పందిస్తూ ‘మజ్లిస్ పార్టీని ఓడించడానికి నేను కూడా ప్రయత్నించా. కానీ, వీలు కాలేదు. ఎన్నికలప్పుడే రాజకీయాలు. ఆ తర్వాత అభివృద్ధిపైనే దృష్టి సారిస్తా’ అని పేర్కొంటూ పరోక్షంగా స్నేహహస్తం అందించారు. డమ్మీలతో డబుల్ గేమ్... ఒకవేళ ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకి దగ్గరైతే హైదరాబాద్ పార్లమెంటరీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున డమ్మీ అభ్యర్థిని ఎన్నికల బరిలోకి దించేటట్లు పావులు కదుపుతుందా..? అదే నిజమైతే మరి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏమిటని చర్చ పాతబస్తీలో జోరుగా జరుగుతోంది. బీఆర్ఎస్తో కూడా దోస్తానా కొనసాగించి హైదరాబాద్ వరకు తమకు అనుకూలంగా ఉండే అభ్యర్థిని ఎన్నికల బరిలోకి దించేటట్లు చేస్తుండొచ్చని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ల నుంచి డమ్మీ అభ్యర్థులు ఎన్నికల బరిలోకి దిగితే తమకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని మజ్లిస్ పార్టీ భావిస్తోంది. ఎంబీటీకి చెక్ పెట్టే దిశగా... హైదరాబాద్ పార్లమెంటరీ స్థానం నుంచి బరిలో నిలిచేందుకు ప్రయత్నిస్తున్న మజ్లిస్ బాచావో తెహ్రీఖ్(ఎంబీటీ) పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి తనకు పూర్తిస్థాయిలో మద్దతు లభిస్తుందని గంపెడాశతో ఉంది. ఇటీవలి శాసనసభ ఎన్నికలలో యాకుత్‌పురా నియోజకవర్గం నుంచి కేవలం 878 ఓట్ల తేడాతో పరాజయం పొందినా, మజ్లిస్ పార్టీకి చుక్కలు చూపించిన ఆ పార్టీ అధికార ప్రతినిధి అంజదుల్లాఖాన్ ఈసారి హైదరాబాద్ పార్లమెంటరీ స్థానంపై కన్నేశారు. స్థానిక ప్రజాసమస్యలను తెలుసుకుని ప్రజలకు దగ్గరవుతున్నారు. అటు ఎంబీటీతోపాటు ఇటు బీజేపీ అభ్యర్థిని ఎన్నికల బరిలో ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీకి దగ్గరవడమే రాజకీయంగా కలిసి వస్తుందని భావించిన మజ్లిస్ పార్టీ ఆ దిశగా ముందుకెళుతూ తన ఎన్నికల వ్యూహాన్ని మార్చినట్లు కనిపిస్తోంది. -
అక్బరుద్దీన్ ఒవైసీ మెజారిటీపై సర్వత్రా ఆసక్తి
చాంద్రాయణగుట్ట: వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. డబుల్ హ్యాట్రిక్ కొట్టేందుకు ఆరోసారి బరిలోకి దిగిన చాంద్రాయణగుట్ట ఎంఐఎం పార్టీ అభ్యర్థి అక్బరుద్దీన్ ఒవైసీ ఎంత మెజార్టీతో గెలుస్తారన్న విషయం ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారింది. గత ఎన్నికల సమయంలో అక్బరుద్దీన్ ఒవైసీ 95,339 ఓట్లు రాబట్టి బీజేపీ అభ్యర్థి సయ్యద్ షహజాదిపై 80,264 ఓట్ల మెజార్టీ సాధించారు. ద్వితీయ స్థానంలో సయ్యద్ షహజాదీ 15,075, తర్వాతి స్థానాలలో బీఆర్ఎస్ అభ్యర్థి ముప్పిడి సీతారాంరెడ్డి 14,224, కాంగ్రెస్ అభ్యర్థి ఇసా బిన్ ఒబేద్ మిశ్రీ 11,309ల ఓట్లు మాత్రమే రాబట్ట గలిగారు. గతంతో పోలిస్తే ఈసారి 12 వేల ఓట్లు అధికంగా పోలవ్వడం.. ప్రధాన పారీ్టల అభ్యర్థులు హిందువులు కావడంతో ముస్లిం ఓట్లు తమకు గంపగుత్తగా పడి లక్ష మెజార్టీ వస్తుందని మజ్లిస్ శ్రేణులు అంచనాలు వేసుకుంటున్నాయి. వారి అంచనాలు ఎంత వరకు నిజం అవుతాయన్నది ఆదివారం వెలువడే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. -
పాతబస్తీలో పతంగ్ జోరేనా...!
చార్మినార్: పాతబస్తీలోని చార్మినార్, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పురా, యాకుత్‌పురా నియోజకవర్గాలు మజ్లిస్ పార్టీకి కంచుకోటగా ఉన్నాయి. ఈసారి జరిగిన ఎన్నికల్లో గతంలో లాగే మజ్లిస్ పార్టీ అభ్యర్థుల విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పాతబస్తీ నియోజకవర్గాల్లో మజ్లిస్ పార్టీ బలం–అత్యధిక సంఖ్యలో ముస్లిం ఓటర్లు ఉండటమే. చార్మినార్ నియోజకవర్గం నుంచి మజ్లిస్ పార్టీ అభ్యరి్థకి గట్టి పోటీ ఎదురైనప్పటికీ.. మధ్యాహ్నం తర్వాత పోలింగ్ సరళి మారి మజ్లిస్ పార్టీకి అనుకూలంగా ఏర్పడింది. యథేచ్ఛగా బోగస్ ఓట్లు పోలయ్యాయి. ఎక్కడా గుర్తింపు కార్డుల కోసం సంబంధిత అధికారులు విచారణ (అడగకపోవడం) చేయకపోవడంతో ఎవరు పడితే వారు స్లిప్‌లతో బోగస్ ఓట్లు వేశారు. యాకుత్‌పురాలో మజ్లిస్ పారీ్టకి ఎంబీటీ గట్టి పోటీనిచి్చంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల పోటీ నామమాత్రమే.. ► యాకుత్‌పురా నియోజకవర్గం నుంచి ఎంబీటీ అభ్యరి్థగా ఎన్నికల బరిలో నిలిచిన మాజీ కార్పొరేటర్ అంజదుల్లాఖాన్, మజ్లిస్ పార్టీ అభ్యర్థి మాజీద్ హుస్సేన్ మేరాజ్‌కి గట్టి పోటీ నిచ్చారు. నిజానికి ఈ నియోజకవర్గం మజ్లిస్ పార్టీకి కంచుకోట. అయితే ఈసారి జరిగిన ఎన్నికల్లో నియోజకవర్గం ఓటర్లు మార్పును కోరుతుండటంతో మజ్లిస్ పార్టీకి కాకుండా ఎంబీటీకి అధిక సంఖ్యలో ఓట్లు పోలైనట్లు సమాచారం. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీకి ఈసారి యాకుత్‌పురా నుంచి టికెట్ దక్క లేదు. ఆయన స్థానంలో నాంపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ మేరాజ్‌కు టికెట్ లభించడం.. ఆయన స్థానికేతరుడు కావడంతో ఎంబీటీ అభ్యర్థి అంజదుల్లాఖాన్ కు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ► అయితే ఇక్కడి నుంచి ఎన్నికల బరిలోకి దిగిన మజ్లీసేతర పారీ్టలైన బీఆర్ఎస్ అభ్యర్థి సామా సుందర్‌రెడ్డి కేవలం ఐఎస్ సదన్ డివిజన్, గౌలిపురా డివిజన్లలో మాత్రమే ఎన్నికల ప్రచారం నిర్వహించి.. మిగిలిన డివిజన్లలోని ఓటర్లకు అతని ముఖం ఎలా ఉంటుందో చూపించ లేదు. ► ఇక బీజేపీ అభ్యర్థి వీరేందర్ యాదవ్ సైతం గౌలిపురా, కుర్మగూడ డివిజన్లకే పరిమితమయ్యారు. అప్పుడప్పుడు ఐఎస్‌సదన్ డివిజన్లోని కొన్ని ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించి చేతులు దులుపుకున్నారు. ► యాకుత్‌పురా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రవిరాజ్ అసలు ఎన్నికల ప్రచారమే నిర్వహించ లేదు. కేవలం ఒకటి రెండు చోట్ల పాదయాత్రలు నిర్వహించిన ఆయన ఒక దశలో ఎన్నికల కార్యాలయానికి తాళాలు వేసి ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ► ఇలా యాకుత్‌పురాలో మజ్లీసేతర పారీ్టలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల పోటీ నామమాత్రమే. చారి్మనార్‌లో మజ్లిస్‌కు గట్టి పోటీనిచి్చన కాంగ్రెస్, బీజేపీ.. ► చార్మినార్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహ్మద్ ముజీబ్ ఉల్లా షరీఫ్‌తో పాటు బీజేపీ అభ్యర్థి మెఘారాణి అగర్వాల్ పోటాపోటీగా ఎన్నికల బరిలో ఉన్నప్పటికీ..మజ్లిస్ పార్టీ అభ్యర్థి మీర్ జులీ్ఫకర్ అలీ విజయం సాధించనున్నారు. ► ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి మహ్మద్ సలావుద్దీన్ లోధీ నామమాత్రమే. చాంద్రాయణగుట్టలో మజ్లిస్‌కు పోటీ నిచ్చిన బీజేపీ.. ► చాంద్రాయణగుట్టలో ఈసారి కూడా మజ్లిస్ పార్టీ అభ్యర్థి అక్బరుద్దీన్ ఒవైసీ విజయం సాధించనున్నారు. ► బీజేపీ తరఫున భాగ్యనగర్ గణేష్‌ఉత్సవ సమితి కార్యదర్శి కౌడి మహేందర్ ఎన్నికల బరిలో ఉండి ప్రచారంలో దూసుకు పోయారు. అయినప్పటికీ ఇక్కడి నుంచి అక్బరుద్దీన్ ఒవైసీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ► చాంద్రాయణగుట్టలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం సక్రమంగా నిర్వహించకపోవడంతో వీరిరువురి ముఖాలు సైతం నియోజకవర్గం ఓటర్లకు తెలియకుండా పోయింది. బహదూర్‌పురాలో కనిపించని బీఆర్ఎస్.. ► బహదూర్‌పురా నియోజకవర్గం మజ్లిస్ పార్టీకి కంచుకోట. ఇక్కడి నుంచి మజ్లిస్ పార్టీ జెండాపై ఎవరూ పోటీ చేసినా గెలిచే అవకాశాలున్నాయి. ఇప్పటికే నియోజకవర్గం నుంచి హాట్రిక్ సాధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే మొజంఖాన్‌కు ఈసారి టికెట్ లభించ లేదు. ఈయన స్థానంలో మోబిన్ ఎన్నికల బరిలో దిగగా.. భారీ మెజారిటీతో విజయం సాధించనున్నారు. ► ఈ ఎన్నికల్లో నియోజకవర్గం నుంచి ఆయనకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పులిపాటి రాజేష్‌కుమార్ గట్టిగా పోటీనిచ్చారు. ► ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి మీర్ ఇనాయత్ అలీ బాక్రీతో పాటు బీజేపీ అభ్యర్థి వై.నరేష్‌ల పోటీ నామమాత్రమే. -
జూబ్లీహిల్స్ బరిలో కరాటే క్వీన్?
హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ స్థానానికి మహిళా అభ్యర్థని రంగంలో దింపేందుకు మజ్లిస్ పార్టీ కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ నుంచి భారత క్రికెట్ మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ బరిలో దిగుతుండటంతో ఈ స్థానం ప్రధాన రాజకీయ పక్షాలకు ప్రతిష్టాత్మకంగా మారింది. తొలిసారిగా నగర అసెంబ్లీ ఎన్నికల్లో ఓ మహిళకు అవకాశం ఇచ్చేందుకు మజ్లిస్ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానాన్ని జాతీయ కరాటే చాంపియన్‌ను సాధించిన సయ్యదా ఫలక్ అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తోంది. మూడేళ్ల క్రితమే సయ్యదా ఫలక్ మజ్లిస్ పారీ్టలో చేరారు. పార్లమెంట్లో ముస్లిం గొంతుకగా అసదుద్దీన్ ప్రజా అంశాలను లేవనెత్తే ఏకైక నాయకుడు’ అంటూ కొనియాడి పార్టీ అధిష్టానాన్ని ఆకట్టుకున్నారు ఆమె. ఉమ్మడి పౌరసత్వానికి వ్యతిరేకంగా హైదరాబాద్‌తో దేవబంద్, ఢిల్లీ, షాహీన్న్బాగ్లలో జరిగిన నిరసన కార్యక్రమాలకు నాయకత్వం వహించి పార్టీ దృష్టిని ఆకర్షించారు. దీంతో ఫలక్ అభ్యరి్థత్వం వైపు మజ్లిస్ మొగ్గు చూపి ఆమె పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. -
మౌనంగా ఉండటమా.. లేక బరిలో దిగడమా.. ముంతాజ్ ఖాన్ దారెటు?
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో తొమ్మిది నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్లు మజ్లిస్ (ఎంఐఎం) పార్టీ ప్రకటించింది. నగరంలోని పాత బస్తీలోని ఏడు సిట్టింగ్ స్థానాలతో పాటు జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ స్థానాల్లో సైతం బరిలో దిగనున్నట్లు వెల్లడించింది. శుక్రవారం దారుస్సలాంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తొలి జాబితాలో ఆరు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. చాంద్రాయణగుట్ట స్థానానికి అక్బరుద్దీన్ ఒవైసీ, మలక్‌పేట స్థానానికి అహ్మద్ బలాల, కార్వాన్కు కౌసర్ మోహియుద్దీన్, నాంపల్లికి మాజీద్ హుస్సేన్, చార్మినార్‌కు జుల్ఫీకర్, యాకుత్‌పురాకు జాఫర్ హుస్సేన్ మేరాజ్ అభ్యర్థిత్వాలను ఖరారు చేశారు. త్వరలో బహదూర్‌పురా, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ అభ్యర్థులను ప్రకటిస్తామని అసదుద్దీన్ ఒవైసీ వెల్లడించారు. మజ్లిస్ పోటీ చేయని స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు ఇస్తామన్నారు. ఉద్దండులకు మొండిచేయి.. రాజకీయ ఉద్దండులు, ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలకు మజ్లిస్ పార్టీ మొండిచేయి చూపించింది. చార్మినార్ సిట్టింగ్ ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్, యాకుత్‌పురా సిట్టింగ్ ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రీలకు సీటు కేటాయించ లేదు. నాంపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్ అభ్యర్థిత్వం యాకుత్‌పురా స్థానానికి మారింది. ఈసారి కొత్తగా ఇద్దరు మాజీ మేయర్లకు అవకాశశం లభించింది. నాంపల్లి సిట్టింగ్ స్థానానికి మాజీ మేయర్ మాజీద్ హుస్సేన్‌కు, చార్మినార్ సిట్టింగ్ స్థానాన్ని జుల్ఫీకర్లకు కేటాయించారు. 2018 ఎన్నికల తర్వాత తీసుకున్న నిర్ణయం ప్రకారమే ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలకు ఎన్నికల బరి నుంచి తప్పించి పార్టీలో వారి సేవలు తీసుకోవాలని నిర్ణయించినట్లు పార్టీ అధినేత అసదుద్దీన్ ప్రకటించారు. కొత్తగా జూబ్లీహిల్‌లో.. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పక్షాన భారత క్రికెట్ మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ బరిలో దిగుతుండగా.. ఏఐఎంఐఎం కూడా పోటీ చేస్తామని ప్రకటించటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి.. ఈసారి పోటీ నిర్ణయం వెనుక మతలబు అర్థం కాని పరిస్థితి నెలకొంది. అత్యంత సంపన్నలున్న ప్రాంతంగా పేరొందిన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మజ్లిస్ గతంలో పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైంది. 2014 ఎన్నికల్లో మజ్లిస్ తరఫున రంగంలో దిగిన నవీన్ యాదవ్ టీడీపీ అభ్యర్థి మాగంటికి ఢీ అంటే ఢీ అనేంతలా పోటీ ఇచ్చారు. గత ఎన్నికల్లో మజ్లిస్ పోటీకి దూరం పాటించి అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థి మాగంటికి మద్దతు ఇచ్చింది. అయినప్పటికీ నవీన్ యాదవ్ ఇండిపెండెంట్‌గా బరిలో దిగి గట్టి పోటీ ఇచ్చి మూడో స్థానంలో నిలిచారు. ఈసారి తిరిగి మిత్ర పక్షమైన బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానంలో పోటీకి దిగడం ఆసక్తి రేపుతోంది. డబుల్ హ్యాట్రిక్.. 'ఓటమి ఎరగని నేతగా యాకుత్‌పురా నుంచి ఐదుసార్లు, చార్మినార్ నుంచి ఒకసారి వరుసగా విజయంసాధించి డబుల్ హ్యాట్రిక్ కొట్టిన అనంతరం ముంతాజ్ ఖాన్‌కు టికెట్ దక్కకపోవడంతో ఆయన రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థంగా మారింది. పార్టీ అధిష్టానం ప్రతిపాదన మేరకు రిటైర్మెంట్కు సిద్ధమంటూనే తన కొడుకుకు టికెట్ ఇవ్వాలని మెలికపెట్టినా ఫలితం లేకుండా పోయింది. ఏకంగా టికెట్ ఇవ్వకున్నా బరిలో దిగుతానని అల్టిమేటం ఇవ్వడంతో పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ రంగంలో దిగినట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్, ఎంబీటీలు సంప్రదింపులు చేస్తూ పార్టీ పక్షాన రెండు సీట్ల బంపర్ ఆఫర్ హామీ ఇచ్చినట్లు సమాచారం. తాజాగా చార్మినార్ అసెంబ్లీ స్థానానికి మాజీ మేయర్ జుల్ఫీకర్ అభ్యర్థిత్వం ఖరారు కావడంతో పార్టీ నిర్ణయం మేరకు మౌనంగా ఉండటమా? లేక బరిలో దిగడమా? ముంతాజ్ ఖాన్ ఎటూ తేల్చుకోలేక మౌనంగా ఉండిపోయినట్లు తెలుస్తోంది. ఒకవేళ తిరుగుబాటు బావుటా ఎగరవేస్తే మాత్రం పాతబస్తీ రాజకీయాల్లో సంచలన మార్పులు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చార్మినార్ అసెంబ్లీ స్థానంపై దృష్టి సారించింది. ఇంకా అభ్యర్థి ప్రకటించలేదు. ఇవి చదవండి: అందోల్ కోటలో గెలుపెవరిది..? తీవ్రంగా శ్రమిస్తున్న ప్రధాన పార్టీలు! -
మజ్లిస్ సిట్టింగ్ ఎమ్మెల్యేకు నో ఛాన్స్!
హైదరాబాద్: చార్మినార్ నియోజకవర్గం నుంచి ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థుల పేర్లు ఖరారు కాగా.. మజ్లిస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లు ఇంకా ఖరారు కాలేదు. ఈసారి చార్మినార్ సిట్టింగ్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్‌కు టికెట్ లభించదని ప్రచారాలు జరగుతుండడంతో.. ముంతాజ్ అహ్మద్ ఖాన్ కాకుండా మరెవరికి టికెట్ కేటాహిస్తారోనని చార్మినార్నియోజకవర్గం మజ్లిస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఈసారి ముంతాజ్ అహ్మద్ ఖాన్‌కు పార్టీ టికెట్ లభించకపోతే.. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకుని మరీ పోటీ చేయించడానికి ఆయన కుమారులు పట్టుబడుతున్నట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇప్పటికే పార్టీ అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చారి్మనార్, యాకుత్‌పురా నుంచి కొత్త వారికి అవకాశం కల్పించనున్నట్లు గతంలోనే చెప్పారని.. దీంతో ముంతాజ్ అహ్మద్ ఖాన్‌తో పాటు సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీలకు ఈసారి టికెట్లు లభించవని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. చివరి నిమిషం వరకు వేచి ఉండి.. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు యాకుత్‌పురా సిట్టింగ్ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ నిశబ్దంగా ఉన్నప్పటికీ.. ముంతాజ్ అహ్మద్ ఖాన్ మాత్రం తనకు టికెట్ ఇవ్వకపోతే.. తన తనయునికి టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. చివరి నిమిషం వరకు వేచి ఉండి.. ఇక టికెట్ రాదని తెలిస్తే తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీలోకి పార్టీ మారడం తప్పా.. ఆయన వద్ద మరో మార్గం లేదంటున్నారు. ముంతాజ్ అహ్మద్ ఖాన్ పార్టీ మారడానికి సిద్ధంగా ఉంటే.. తమ పార్టీలోకి ఆహా్వనించి చార్మినార్ నుంచి టికెట్ ఇచ్చి ఎన్నికల బరిలో దింపడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సిద్ధంగా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటికే టీటీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న అలీ మస్కతిని చార్మినార్ నియోజకవర్గం నుంచి పోటీలోకి దింపుతున్నట్లు రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ప్రకటించినప్పటికీ.. ఇప్పటికే రెండు దఫాలుగా విడుదలైన అధికారిక లిస్టులలో ఎక్కడా అలీ మస్కతి పేరు లేకపోవడంతో ముంతాజ్‌ఖాన్ కోసం ఈ సీటు రిజర్వ్ పెట్టినట్లు పాతబస్తీలో ప్రచారం జరుగుతోంది. ఒకవేళ చార్మినార్ నుంచి ముంతాజ్ ఖాన్‌కు టికెట్ లభిస్తే.. అలీ మస్కతిని హైదరాబాద్ పార్లమెంట్‌కు పోటీ చేయించే యోచనలో పార్టీ ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే ఇంత వరకు అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పార్టీ చార్మినార్ అభ్యరి్థని ప్రకటించడం లేదని అంటున్నారు. ఈసారి మజ్లిస్ పార్టీకి దీటుగా.. కాంగ్రెస్ చార్మినార్ నుంచి మజ్లిస్ పార్టీకి దీటుగా తమ అభ్యర్థని ఎన్నికల బరిలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. 2009, 2014, 2018 ఎన్నికల్లో మజ్లిస్ పార్టీతో మజ్లిసేతర పార్టీలు హోరాహోరి ఎన్నికల పోరాటం చేసినప్పటికీ.. అంతిమ విజయం మజ్లిస్ పార్టీకే దక్కింది. మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా ఈసారి పాతబస్తీలో కూడా ఊహించని రాజకీయ పరిణాలు ఎదురవుతాయని రాజకీయ పరిశీలకు భావిస్తున్నారు. మజ్లిస్ పార్టీలో సిట్టింగ్‌లకు టికెట్లు లభించకపోతే.. పాతబస్తీ రాజకీయ ముఖ చిత్రం మారుతుందని అంటున్నారు. ముంతాజ్ అహ్మద్ ఖాన్ రాజకీయ అరంగేటం బజ్లిస్ బజావ్ తెహ్రీఖ్(ఎంబీటీ)తో మొదలైంది. ఎంబీటీ పార్టీ టికెట్‌పై యాకుత్‌పురా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన అనంతరం పార్టీ ఫిరాయించి మజ్లిస్ పారీ్టలో చేరారు. అప్పటి నుంచి పోటీ చేసిన ప్రతి ఎన్నికలో విజయం సాధించారు. ప్రస్తుతం చారి్మనార్ నియోజకవర్గం నుంచి మజ్లిస్ పార్టీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ముంతాజ్ అహ్మద్ ఖాన్ పార్టీ మారే ప్రసక్తే ఉండదని.. ఇవన్నీ రాజకీయ ఊహాగానాలేనని దారుస్సలాం నాయకులు అంటున్నారు. -
ఆ పార్టీ ముగ్గురు ఎమ్మెల్యేలకు సీటు డౌటే!!
హైదరాబాద్: పాతబస్తీ రాజకీయాలను శాసించే మజ్లిస్ పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ గుబులు పట్టుకుంది. ఈసారి ముగ్గురు సిట్టింగులకు ఉద్వాసన పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పార్టీ అధిష్టానం ఇద్దరు ఎమ్మెల్యేలకు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయం తీసుకోగా, తాజాగా మరో ఎమ్మెల్యేకు సైతం రిటైర్మెంట్ ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. మరో ఎమ్మెల్యేకు మాత్రం సీటు మార్పు ఉంటుందని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే అధికార టీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించగా మజ్లిస్ పార్టీ మాత్రం అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదు. మరో రెండు మూడు రోజుల్లో ప్రకటించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తం ఏడు సిట్టింగ్ స్థానాల్లో రెండు మినహా మిగతా స్థానాల అభ్యర్థిత్వాలపై చివరి వరకు ఉత్కంఠ కొనసాగడం సర్వసాధారణమే. పార్టీ నిర్ణయం రాజకీయ పరిశీలకులకే అంతుపట్టని విధంగా ఉంటోంది. పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ నిర్ణయమే ఫైనల్. పార్టీ రాజకీయ వ్యూహంలో భాగంగానే ఈసారి సీనియర్ ఎమ్మెల్యేల వయోభారం దృష్ట్యా మార్పు అనివార్యంగా కనిపిస్తోంది. వారి స్థానంలో కొత్తగా యువతరానికి అవకాశం కల్పించాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. రిటైర్మెంట్ బాటలో.. ఎన్నికల రిటైర్మెంట్ బాటలో సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. పాత బస్తీలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలు అహ్మద్ పాషా ఖాద్రీ, ముంతాజ్ ఖాన్, మౌజం ఖాన్లకు ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే చాన్స్ లభించే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం చార్మినార్ అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముంతాజ్ ఖాన్ ఎమ్మెల్యేగా డబుల్ హ్యాట్రిక్ కొట్టారు. యాకుత్‌పురా నుంచి ఐదు పర్యాయాలు, చార్మినార్ నుంచి ఒక పర్యాయం ఎన్నికయ్యారు. అహ్మద్ పాషా ఖాద్రీ నాలుగుసార్లు చార్మినార్ నుంచి, ఒకసారి యాకుత్‌పురా నుంచి ఎన్నికయ్యారు. బహదూర్‌పురా నుంచి మౌజం ఖాన్ నాలుగుసార్లు ఎన్నికయ్యారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త వారికి చాన్స్.. మజ్లిస్ పార్టీలో ఈసారి కొత్తవారి అభ్యర్థిత్వాలు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాంపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్‌కు ఈసారి స్థాన చలనం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆయన అభ్యర్థిత్వాన్ని యాకుత్‌పురా స్థానానికి మార్చి నాంపల్లి స్థానానికి మాజీ మేయర్ మాజీద్ హుస్సేన్ అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. చార్మినార్ నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ కుమారుడు నూరుద్దీన్ లేదా కుమార్తె ఫాతిమా అభ్యర్థిత్వం ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ బహదూర్‌పురా సిట్టింగ్ ఎమ్మెల్యేకు రిటైర్మెంట్ ప్రకటిస్తే అక్కడి నుంచి మరో మాజీ మేయర్ జుల్పేఖార్ అలీ లేదా మరో యువనేత అభ్యర్థిత్వాన్ని పరిశీలించే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
మజ్లిస్ పార్టీలో ‘చార్మినార్ అసెంబ్లీ సీటు’ చిచ్చు
హైదరాబాద్: పాతబస్తీ రాజకీయాలను శాసిస్తున్న మజ్లిస్ పార్టీలో ‘చార్మినార్ అసెంబ్లీ సీటు’ చిచ్చు రాజేస్తోంది. మరోమారు పార్టీ అంతర్గత సంక్షోభం పునరావృతమయ్యే ప్రమాదం పొంచి ఉంది. పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలను వయోభారం దృష్ట్యా ఈసారి ఎన్నికల బరి నుంచి తప్పించి కొత్తగా యువతకు అవకాశం కల్పించాలన్న నిర్ణయం మజ్లిస్‌కు తలనొప్పిగా తయారైంది. అధిష్టానం ప్రతిపాదనల మేరకు ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా ఎన్నికల్లో పోటీకి రిటైర్మెంట్ ప్రకటించేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నప్పటికీ.. అందులో ఒకరు మాత్రం తన కుమారుడికి టికెట్ ఇవ్వాలన్న మెలిక పెట్టడం పార్టీని చిక్కుల్లో పడేసినట్లయింది. అవకాశం ఇవ్వకున్నా.. ఎన్నికల బరిలో దిగడం ఖాయమన్న అల్టిమేటం తిరుగుబాటు సంకేతాన్ని సూచించడం పార్టీలో చర్చనీయాంశమైంది. మూడు దశాబ్దాల క్రితం మజ్లిస్ అధినేత సలావుద్దీన్ ఒవైసీతో ఏర్పడిన విభేదాలతో సీనియర్ ఎమ్మెల్యే అమానుల్లా ఖాన్ ఏకంగా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని ఆరోపిస్తూ బయటకు వచ్చి మజ్లిస్ బచావో తెహరిక్ను స్థాపించారు. పాతబస్తీలో ఏకపక్ష రాజకీయాలు చెల్లవని 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్‌ను ఓడించి కేవలం చార్మినార్ అసెంబ్లీ సీటుకే పరిమితం చేసి ముచ్చెమటలు పట్టించారు. అప్పటి అమానుల్లాఖాన్ సహచరుడైన సీనియర్ ఎమ్మెల్యే తాజాగా చార్మినార్కి అల్టిమేటం ఇవ్వడం ఆందోళన కలిగిస్తోంది. సంప్రదింపుల్లో కాంగ్రెస్ .. మజ్లిస్ పార్టీని పాతబస్తీలో దెబ్బతీసేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్.. ప్రతి అవకాశాన్ని అనుకూలంగా మల్చుకునేందుకు సిద్ధమవుతోంది. మజ్లిస్ తమను ప్రధాన శత్రువు పక్షంగా పరిగణించి వ్యతిరేక ప్రచారం చేయడం కాంగ్రెస్‌కు మింగుడు పడని అంశంగా తయారైంది. ఇప్పటికే చార్మినార్ నుంచి బలమైన ముస్లిం అఅభ్యర్థని రంగంలోని దింపేందుకు అలీ మస్కతీ పేరును పరిశీలిస్తోంది. తాజాగా నెలకొన్న పరిస్థితులతో కాంగ్రెస్ పార్టీ ముంతాజ్ అహ్మద్ ఖాన్‌తో సంప్రదింపుల కోసం ముస్లిం సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రిని రంగంలోకి దింపినట్లు సమాచారం. కాంగ్రెస్ పక్షాన చార్మినార్‌తో పాటు యాకుత్‌పురా అసెంబ్లీ స్థానాలు తండ్రీకొడుకులకు కేటాయిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఎన్నికల నోటిఫికేషన్ వరకు వేచి చూడాలనే యోచనలో ముంతాజ్ ఖాన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఓటమెరుగని ముంతాజ్ ఖాన్‌కు చార్మినార్‌తో పాటు యాకుత్‌పురా అసెంబ్లీ సెగ్మెంట్లలో వ్యక్తిగతంగా గట్టి పట్టు ఉంది. దానిని అనుకూలంగా మల్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ముంతాజ్ అహ్మద్ ఖాన్‌పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇదీ పరిస్థితి.. మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా సిట్టింగ్ స్థానాల అభ్యర్థుల మార్పు, వయోభారం దృష్ట్యా సీనియర్ ఎమ్మెల్యేను పోటీ నుంచి తప్పించి కొత్తవారికి అవకాశం కల్పించాలన్న మజ్లిస్ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఈసారి ఎన్నికల్లో చార్మినార్ అసెంబ్లీ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్, యాకుత్‌పురా స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అహ్మద్ పాషాఖాద్రీలకు బదులుగా కొత్తవారి అభ్యర్థిత్వాలను ఖరారు చేయాలని పార్టీ భావిస్తోంది. నాంపల్లి స్థానంలో రెండు పర్యాయాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్ అభ్యర్థిత్వాన్ని ఈసారి యాకుత్‌పురా అసెంబ్లీ సెగ్మెంట్‌కు మార్చు చేసి, నాంపల్లి నుంచి మాజీ మేయర్ మాజీద్ హుస్సేన్‌ను బరిలో దింపాలని యోచిస్తోంది. చార్మినార్ అసెంబ్లీ స్థానం నుంచి పార్టీ ద్వితీయ అగ్రనేత అక్బరుద్దీన్ ఒవైసీ కుమారుడు డాక్టర్ నూరుద్దీన్ లేదా కూతురు ఫాతిమాను రాజకీయ అరంగ్రేటం చేయించాలని మజ్లిస్ భావిస్తోంది. రంగంలోకి అక్బరుద్దీన్ ► అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నిర్ణయం మేరకు సీనియర్ ఎమ్మెల్యేలతో చర్చించేందుకు పార్టీ ద్వితీయ అగ్రనేత అక్బరుద్దీన్ ఒవైసీ రంగంలోకి దిగారు. ఇటీవల సీనియర్ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి పార్టీ ప్రతిపాదనలపై వారితో చర్చించారు. వయోభారం, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా స్వచ్ఛందంగా ఎన్నికల బరి నుంచి తప్పుకునేందుకు యాకుత్‌పురా ఎమ్మెల్యే అహ్మద్ పాషాఖాద్రీ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిసింది. చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్‌తో అక్బరుద్దీన్ ఓవైసీ సుదీర్ఘంగా మూడు గంటల పాటు చర్చలు జరిపినా ఫలప్రదం కానట్లు తెలుస్తోంది. ►వయోభారం దృష్ట్యా యువతకు అవకాశం కల్పించేందుకు ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని అక్బరుద్దీన్ సూచించగా, స్వచ్ఛందంగానే తప్పుకునేందుకు ముంతాజ్ ఖాన్ సంసిద్ధత వ్యక్తం చేస్తూనే గత ఎనిమిదేళ్లుగా రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న తన కుమారుడు డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ఖాన్‌కు అవకాశం కల్పించాలని విజ్ఙప్తి చేశారు. మూడు దశాబ్దాల క్రితం ఎంబీటీ నుంచి ఎంఐఎంలోకి తిరిగి వచ్చేందుకు ‘జీవితకాలం సీటు ఖాయం’ అన్న అప్పటి పార్టీ అధినేత సలావుద్దీన్ ఒవైసీ ఇచ్చిన నోటి మాట కూడా ఈ సందర్భంగా ముంతాజ్ అహ్మద్ ఖాన్.. అక్బరుద్దీన్ ఒవైసీకి గుర్తు చేసినట్లు సమాచారం. ఒకవేళ కుమారుడికి సీటు ఇవ్వకుంటే చార్మినార్, యాకుత్పురాల నుంచి ఎన్నికల బరిలో ఉండటం ఖాయమని ముంతాజ్ అహ్మద్ ఖాన్ అల్టిమేటం ఇవ్వడం పార్టీలో చర్చనీయాంశంగా తయారైంది. -
మరో రెండింటిపై మజ్లిస్ నజర్
హైదరాబాద్: పాతనగరానికే పరిమితమైన మజ్లిస్ పార్టీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మరో రెండు స్థానాలను తన ఖాతాలో వేసుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మజ్లిస్– బీఆర్ఎస్ మధ్య స్నేహపూర్వక పోటీ ఉంటుందని, తాము పోటీ చేయని స్థానాల్లో మాత్రం అధికార బీఆర్ఎస్కు మద్దతు ఇస్తామని ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ స్వయంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తమ రెండు పార్టీల మధ్య ఓట్లు చీలకుండా మజ్లిస్ అడుగులేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ముస్లిం మైనారిటీ ఓట్లు మళ్లకుండా చేయడంతో పాటు పాతబస్తీ పార్టీగా ఉన్న పేరును చెరిపివేసుకునేందుకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంంది. పాతబస్తీలో తాము కచ్చితంగా గెలిచే 7 స్థానాలతో పాటు మరో రెండింటిలో బలమైన అభ్యర్థులు, మిగతా స్థానాల్లో మొక్కుబడిగా రంగంలోకి దింపాలని యోచిస్తున్నట్లు సమాచారం. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పాతబస్తీ స్థానాలతో పాటు జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ స్థానాలను లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ రెండు స్థానాల్లో పార్టీకి బలమైన పట్టు ఉంది. వాస్తవంగా కూడా ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థి గెలుపు, ఓటములలో మైనార్టీ ఓటర్లు కీలక పాత్ర పోషిస్తాయి. ముస్లిం సామాజికవర్గం ఓటర్లు ఎవరికి మొగ్గు చూపితే వారినే విజయం వరించనుంది. కాగా.. రాజేంద్రనగర్ నుంచి శాస్త్రిపురం కార్పొరేటర్ మహమ్మద్ ముబీన్, సులేమాన్‌నగర్ కార్పొరేటర్ అబేదా సుల్తానా భర్త నవాజుద్దీన్, అహ్మద్‌నగర్ కార్పొరేటర్ సోదరుడు గోల్డెన్ హైట్స్ కాలనీ నివాసి సర్ఫరాజ్ సిద్ధిఖీ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. -
రంగంలోకి నూరుద్దీన్..
పాత బస్తీని శాసిస్తున్న ఎంఐఎం పార్టీ కొత్త తరం నుంచి ఒకరిని ఈసారి రంగంలో దింపనున్నట్లు తెలుస్తోంది. ఒవైసీల కుటుంబంలో నాలుగోతరం రాజకీయ వారసునిగా అక్బరుద్దీన్ తనయుడు డాక్టర్ నూరుద్దీన్ ఒవైసీని చార్మినార్ నియోజకవర్గం నుంచి బరిలో దింపే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఎంఐఎం పార్టీని అబ్దుల్ వాహెద్ ఒవైసీ స్థాపించగా, తర్వాత ఆయన కుమారుడు సలావుద్దీన్ ఒవైసీ, అనంతరం ఆయన కుమారులు అసదుద్దీన్, అక్బరుద్దీన్లు రాజకీయాల్లోకి రావడం తెలిసిందే. నూరుద్దీన్ రాజకీయాల్లోకి వస్తే నాలుగో తరానికి ప్రాతినిధ్యం వహించే అవకాశముంది. -
తెలంగాణను నాశనం చేయడమే వారిపని
సాక్షి, న్యూఢిల్లీ: ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో బీఆర్ఎస్, ఎంఐఎం కలసి విధ్వంసం సృష్టించేందుకు కుట్ర చేస్తున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. ‘‘ఎంఐఎం కార్యకర్తలు నా ఇల్లు, ఆఫీస్‌పైకి ర్యాలీగా వెళ్లి దాడికి యత్నిస్తే పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదు. ఆత్మరక్షణ కోసం యత్నించిన బీజేపీ కార్యకర్తలపై ఉల్టా కేసులు పెట్టడం ద్వారా సమాజానికి ఏ సంకేతాలు పంపుతున్నారు? మా సహనాన్ని చేతగానితనంగా భావిస్తే.. ఖబడ్దార్..’’అని హెచ్చరించారు. శనివారం ఢిల్లీలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.కొందరు పోలీసులు ప్రమోషన్లు, పోస్టింగుల కోసం బీఆర్ఎస్ చెప్పుచేతల్లో పనిచేస్తున్నారని.. బీజేపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేసి కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అదే బీఆర్ఎస్, ఎంఐంఎం నేతలు, కార్యకర్తలు కుట్రలు చేస్తున్నా పట్టించుకోవట్లేదని పేర్కొన్నారు. ఎంఐఎం అడ్డా అని చెప్పుకుంటున్న పాతబస్తీకి వెళ్లి కాషాయ జెండా ఎగరేసిన చరిత్ర తమదని.. ఒక పార్టీకి, వర్గానికి కొమ్ము కాస్తే దీటుగా ఎదుర్కొనే సత్తా బీజేపీకి ఉందనే సంగతిని పోలీసులు, బీఆర్ఎస్ నేతలు గుర్తుంచుకోవాలని సంజయ్ వ్యాఖ్యానించారు. ముస్లిం మేధావులు కూడా ఎంఐఎం ఆగడాలను చీదరించుకుంటున్నారని విమర్శించారు. ఎంఐఎం, బీఆర్ఎస్ అరాచకాలను, ఆగడాలను ఆపేదాకా బీజేపీ పోరాడుతుందన్నారు. బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. -
ఎంఐఎంలో వారసులకు చాన్స్?.. రేసులో అక్బరుద్దీన్ కుమారుడు!
హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్ ఎమ్మెల్యేల వారసులతో పాటు యువతరానికి పెద్దపీట వేయాలని మజ్లిస్ పార్టీ యోచిస్తోంది. సిట్టింగ్ స్థానాలతో అదనపు స్థానాలను సైతం తమ ఖాతాల్లో పడే విధంగా వ్యూహ రచన చేస్తోంది. నగరంలో పార్టీకి కంచుకోట లాంటి ఏడు సిట్టింగ్ స్థానాలుండగా కొత్తగా మరికొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలపై కూడా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అయితే సిట్టింగ్ స్థానాల్లోని ముగ్గురు ఎమ్మెల్యేలు వయోభారం దృష్ట్యా అభ్యర్థిత్వాలు మార్పు అనివార్యం కాగా, మరో స్థానంలో సైతం రాజకీయ పరిస్థితులను బట్టి అభ్యర్థి మార్పు జరిగే అవకాశాలు లేకపోలేదని పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది. మొత్తం మీద ఖాళీ అయ్యే స్థానాల్లో సిట్టింగ్‌ల వారసులతో పాటు కొత్త వారికి కూడా అవకాశం దక్కవచ్చని చర్చ జరుగుతుంది. గత పర్యాయం జరిగిన ఎన్నికల్లో ఏడుగురు సిట్టింగ్‌లకు అవకాశం లభించగా, అందులో అప్పటి యాకుత్‌పురా ఎమ్మెల్యే అభ్యర్థిత్వం చార్మినార్ స్థానానికి, చార్మినార్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వం యాకుత్‌పురా స్థానాలకు మార్చి అవకాశం కల్పించారు. కానీ ఈసారి ఎన్నికల్లో మాత్రం ముగ్గురు నుంచి నలుగురు సిట్టింగుల అభ్యర్థిత్వాలే మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారసుల అరంగేట్రం? కొత్తగా పార్టీ సీనియర్ నేతల వారసుల పేర్లు తెరపైకి వచ్చాయి. పార్టీ ద్వితీయ అగ్రనేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్‌ఖాన్‌ల కుమారులు కూడా ఈసారి పోటీలో ఉంటారని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్‌ఖాన్, యాకుత్‌పురా ఎమ్మెల్యే అహ్మద్ పాషాఖాద్రిలు వయోభారం దృష్ట్యా పోటీపై పెద్దగా అసక్తి కనబర్చడం లేదు. అధిష్టానం మాత్రం మరో పర్యాయం వారి సేవలు వినియోగించుకోవాలని యోచిస్తోంది. ముంతాజ్‌ఖాన్ మాత్రం తన కుమారుడికి అవకాశం కల్పించాలని అదిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. నాలుగు స్థానాల్లో.. మజ్లిస్ పార్టీ సిట్టింగ్ స్థానాలైన ఏడింటిలో నాలుగింటిలో మార్పులు చేయాలని భావిస్తోంది. చాంద్రాయణగుట్ట నుంచి ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఈసారి కూడా పోటీ చేస్తారనడంలో ఎలాంటి అనుమానం లేదు. సిట్టింగ్‌లున్న మలక్‌పేట నుంచి అహ్మద్ బలాల, కార్వాన్ నుంచి కౌసర్ మోయినుద్దీన్‌లు పోటీలో ఉండటం ఖాయమే. ఇక మిగిలిన నాలుగు స్థానాల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ పరిస్థితులను బట్టి నాంపల్లి నియోజకవర్గం నుంచి జాఫర్‌హుస్సేన్ మేరాజ్ అభ్యర్థిత్వం మార్పు జరిగితే ఆ స్థానంలో మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్ అభ్యర్థిత్వం ఖరారయ్యే అవకాశం కూడా లేకపోలేదని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇక బహదూర్‌పురా ఎమ్మెల్యే మోజంఖాన్ వయోభారం దృష్ట్యా ఆయనను తప్పిస్తే ఆ స్థానం నుంచి అక్బరుద్దీన్ కుమారుడు నూరుద్దీన్ ఒవైసీ పేరు పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మోజంఖాన్ బరిలో ఉంటే నూరుద్దీన్ ఒవైసీని చార్మినార్ లేదా యాకుత్‌పురా నుంచి పోటీలోకి దింపే అవకాశాలు లేకపోలేదన్న చర్చ సాగుతోంది. ఆ రెండింటిపై కూడా పాత నగరంలో చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, బహదూర్‌పురాతోపాటు కార్వాన్, నాంపల్లి, మలక్‌పేట నియోజకవర్గాల్లో వరుస విజయాలతో కై వసం చేసుకుంటూ వస్తున్న మజ్లిస్ ఈసారి రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్‌పై కన్నేసినట్లు తెలుస్తోంది. రాజేంద్రనగర్ అసెంబ్లీ పరిధిలో పార్టీ అధినేత అసదుద్దీన్ నివాసం ఉండటంతో ఆ స్థానం కూడా పార్టీ ఖాతాలో వేసుకునేందుకు వ్యూహ రచన సాగుతున్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్‌లో గట్టి పట్టు ఉండటంతో బలమైన అభ్యర్థిని బరిలో దింపాలని యోచిస్తోంది. -
కమ్యూనిస్టులకు కేసీఆర్ పంగనామాలు
సాక్షి, హైదరాబాద్: బీజేపీతో పొత్తు ఖాయమైంది కాబట్టే కమ్యూనిస్టులకు కేసీఆర్ పంగనామాలు పెట్టారని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ‘మునుగోడులో కమ్యూనిస్టులతో కలిసిన సందర్భంలో వారితో పొత్తు పెట్టుకుని బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా పోటీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. కానీ ఢిల్లీ వెళ్లి మోదీని కలిసిన కేసీఆర్ అమిత్‌షాతో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారు. అందుకే కమ్యూనిస్టులను కరివేపాకులా వాడుకుని వదిలేశారు’అని చెప్పారు. బుధవారం గాం«దీభవన్‌లో మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ తన అనుచరులతో కలిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ, బీజేపీతో ఒప్పందం మేరకే కమ్యూనిస్టుల కు సీట్లు ఇవ్వకుండా ఏకపక్షంగా కేసీఆర్ అసెంబ్లీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారని అన్నారు. తెలంగాణ సాధనలో కీలకపాత్ర పోషించిన చంద్రశేఖర్ కాంగ్రెస్‌లోకి రావడం సంతోషకరమని, ఆయనకు పార్టీలో సముచిత స్థానం ఉంటుందని చెప్పారు. సాగర్ కట్టమీద చర్చిద్దాం వస్తారా? కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారని, చరిత్ర తిరిగేసి చూస్తే కాంగ్రెస్ ఏం చేసిందో బీఆర్ఎస్ నేతలకు అర్థమవుతుందని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్ట మీద కూర్చుని చర్చిద్దాం వస్తారా? అని బీఆర్ఎస్ నేతలకు ఆయన సవాల్ విసిరారు. కాంగ్రెస్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తే.. కేసీఆర్ 7,500 కోట్లకు తెగనమ్ముకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తే కాళేశ్వరం పేరుతో కేసీఆర్ లక్షకోట్లు మింగాడని, కాంగ్రెస్ హయాంలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తే, డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో పేద ప్రజల ఓట్లను దండుకునేందుకు వారిని కేసీఆర్ మోసం చేస్తున్నారని చెప్పారు. డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిన చోట తాము ఓట్లు అడగబోమని, ఇందిరమ్మ ఇళ్లు కట్టిన చోట్ల బీఆర్ఎస్ ఓట్లు అడగకుండా ఉంటారా అని రేవంత్ సవాల్ విసిరారు. తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ బొందలగడ్డ అయిందని విమర్శించారు. కామారెడ్డికి గోదావరి నీళ్లు తెచ్చిన తర్వాతే కేసీఆర్ అక్కడ పోటీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంలు ఒక్కటేనన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని, రూ.5 లక్షల వరకు పేదల వైద్య ఖర్చులను ఆరోగ్యశ్రీ ద్వారా భరిస్తామని, రూ.500కే గ్యాస్ సిలెండర్ ఇస్తామని, ప్రతి పేద వ్యక్తి ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షల సాయం అందిస్తామని పునరుద్ఘాటించారు. ఈనెల 26న చేవెళ్లలో జరిగే బహిరంగసభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. -
కరీంనగర్లో మారుతున్న పాలిట్రిక్స్.. ఈ సారి గంగుల కమాలకర్‌కు కష్టమే!
సాక్షి, కరీంనగర్: రాజకీయాలు ఎప్పుడెలా మారతాయో చెప్పడం కష్టం. మార్పులు ఒకోసారి స్థానిక నేతలకు చుక్కలు చూపిస్తాయి. ఇప్పుడు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో షాక్‌కు గురవుతున్న ఆ నేత ఎవరు? షాక్‌లు సొంత పార్టీ నుంచి కాకుండా మిత్రపక్షంగా ఉన్న పార్టీ నుంచి అయితే పరిస్తితి ఎలా ఉంటుంది? ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో వస్తున్న మార్పులేంటని తెలుసుకుందాం. కరీంనగర్ నగరానికి అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తూ.. మంత్రిగా కొనసాగుతున్న గంగుల కమలాకర్‌కు ఆయన చుట్టూ ఉన్నవారి నుంచే సమస్యలు మొదలయ్యాయా? ఆయన కోటరీయే ఇప్పుడాయన కొంప ముంచుతోందా అంటే అవును అనేలా ప్రస్తుత పరిణామాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొన్ని సెగ్మెంట్లలో పార్టీల గెలుపోటములను ప్రభావితం చేయగల స్థితిలో మైనారిటీలు ఉన్నారు. గత రెండుసార్లు మైనారిటీల మద్దతుతోనే గంగుల కమలాకర్ గులాబీ పార్టీ తరపున విజయం సాధించారు. అయితే ఈసారి పరిస్థితి అలా లేదంటున్నారు స్థానిక మజ్లిస్ పార్టీ నాయకులు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి గంగుల కమలాకర్ తీరుపై వారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. గత కొంత కాలంగా సామాన్యులనే కాదు.. మిత్రపక్షంగా ఉన్న తమను పట్టించుకోవడంలేదని మజ్లిస్ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో వార్ ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ మైనార్టీ లీడర్స్, ఎంఐఎం నేతలకు మధ్య సోషల్ మీడియా వార్ పెద్ద ఎత్తున నడిచింది. ఇదంతా మంత్రి గంగుల కమలాకర్ కావాలనే చేయిస్తున్నారనే అనుమానాలూ ఎంఐఎం నేతలు వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం సమావేశం నిర్వహించుకున్న ఎంఐఎం నేతలు.. వెయ్యి కోట్ల రూపాయల విరాళాలు సేకరించైనా కరీంనగర్ లో గాలిపటం జెండా ఎగరేస్తామని చాలెంజ్ చశారు. కొందరు నేతలు పైసలు చల్లితే ఏదైనా జరుగుతుందని అనుకుంటున్నారని.. అంతకుమించిన సినిమా తాము చూపిస్తామనీ సవాల్ విసిరారు. ఇప్పటికే నగరంలోని 35 డివిజన్లలో ముస్లిం మైనార్టీల ఓట్ బ్యాంక్ ప్రభావిత శక్తిగా మారినట్లు వారు చెప్పుకొచ్చారు. ఎంఐఎం పార్టీ నగర అధ్యక్షుడు, తెలంగాణా హజ్ కమిటీ సభ్యుడైన సయ్యద్ గులాం హుస్సేన్ నోటే ఈ సంచలన వ్యాఖ్యలు వెలువడటంతో.. కరీంనగర్ లో పొలిటికల్ డైమెన్షన్స్ మారిపోతున్నాయన్న టాక్ నడుస్తోంది. సవాల్ విసిరారు అయితే కరీంనగర్ కేంద్రంగా జరిగిన ఈద్ మిలాప్ పార్టీలో మాట్లాడిన నేతలు.. గులాబీ బాస్ పైనా, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ పైనా తమకున్న సాఫ్ట్ కార్నర్ ను బయటపెట్టారే తప్ప.. ఇప్పుడున్న ఎమ్మెల్యేకు సానుకూలంగా ఒక్క మాటా మాట్లాడకపోగా.. సవాల్ విసరడం చర్చనీయాంశంగా మారింది. వినోద్ చొరవ వల్లే స్మార్ట్ సిటీ పనులు శరవేగంగా జరుగుతున్నాయంటూనే.. ఎమ్మెల్యే నిధులతో తమ డివిజన్లను అభివృద్ధి చేయాల్సిందేనన్న డిమాండ్ వారి మాటల్లో వినిపించింది. అంతేకాదు, ఎంఐఎం అండదండలతో గెల్చి ఎమ్మెల్యేలు, మంత్రులై ఇవాళ చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్న వారికి రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా బుద్ధి చెప్పుతామని వార్నింగ్ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో దమ్ముంటే ఎంఐఎం అండ లేకుండా గెలిచి చూపించాలనీ గంగులకు ఎంఐఎం నేతలు సవాల్ కూడా విసిరారు. కరీంనగర్ నగరంలోని ముస్లిం మైనార్టీలెక్కువగా ఉండే ప్రాంతాల్లో అభివృద్ధి కొరవడిందని.. దర్గాలు, షాదీఖానాలు, కమ్యూనిటీ హాల్స్ వంటివాటిని కనీసం పట్టించుకోవడంలేదంటూ స్థానిక ఎమ్మెల్యే అయిన మంత్రి గంగుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థిని బట్టే ఎంఐఎం నిర్ణయం కరీంనగర్లో ప్రస్తుత రాజకీయ వాతావరణం గమనిస్తుంటే....వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం కరీంనగర్ నుంచి పోటీకి సిద్ధమవుతోందనే ప్రచారం సాగుతోంది. ఇలా ఉంటే..గంగులను ఎంపీ స్థానానికి పంపించి.. మాజీ ఎంపీ వినోద్ ను కరీంనగర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేయించే అవకాశాలూ ఉన్నట్టు టాక్ నడుస్తోంది. అయితే వినోద్ మాత్రం ఎంపీ స్థానానికే మొగ్గు చూపుతుండగా.. హుస్నాబాద్ నుంచి వినోద్ ను గెలిపించాలన్న కేటీఆర్ ప్రకటనతో ఇక కరీంనగర్ అసెంబ్లీ టిక్కెట్ రేసులో వినోద్ ఉంటాడా అన్నది డౌటే..? వినోద్ పోటీలో ఉంటే ఎంఐఎం నేతల ఆలోచనలో ఏదైనా మార్పు రావచ్చునేమో గాని..గంగుల కనుక మళ్ళీ పోటీ చేస్తే మాత్రం మజ్లిస్ బరిలో దిగడం ఖాయమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక అంతిమంగా బీఆర్ఎస్ అభ్యర్థిని బట్టే ఎంఐఎం నిర్ణయం ఆధారపడి ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. -
అమిత్ షాకు వరుసగా కౌంటర్లు
-
ఎమ్ఐఎమ్ తో ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో టీఆర్ఎస్
-
ఊహించిందే జరిగింది; ఎన్నిక లేదు.. ఏకగ్రీవమే!
సాక్షి, హైదరాబాద్: ఊహించినట్లే జరిగింది. అధికార టీఆర్ఎస్.. దాని మిత్రపక్ష ఎంఐఎం ఒప్పందంలో భాగంగా రెండు పార్టీల నుంచి 15 మంది జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎన్నికయ్యారు. మొత్తం 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులకు టీఆర్ఎస్ నుంచి 11 మంది, ఎంఐఎం నుంచి ఏడుగురు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఉపంహరణలకు చివరిరోజైన సోమవారం టీఆర్ఎస్ నుంచి ముగ్గు రు ఉపసంహరించుకోవడంతో, పోటీలో మిగిలిన 15 మంది ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ ప్రకటించారు. ► జీహెచ్ఎంసీలో 47 మంది కార్పొరేటర్లతో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ, టీఆర్ఎస్– ఎంఐఎంలకు కలిపి ఉమ్మడిగా వంద మంది కార్పొరేటర్లు ఉండటంతో, ఎలాగూ గెలవలేమని తెలిసి బీజేపీ బరిలోనే దిగలేదు. ► గత పాలకమండలిలో సైతం టీఆర్ఎస్– ఎంఐఎంల పొత్తు ఒప్పందానికనుగుణంగా మొత్తం 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులు ఆ రెండు పార్టీల వారే ఉన్నారు. ► అప్పట్లో టీఆర్ఎస్ కార్పొరేటర్లు 99 మంది, ఎంఐఎం కార్పొరేటర్లు 44 మంది ఉండటంతో టీఆర్ఎస్నుంచి 9 మందికి, ఎంఐఎం నుంచి ఆరుగురికి స్టాండింగ్ కమిటీలో స్థానం కల్పించా రు. ఈసారి టీఆర్ఎస్ బలం 56 మాత్రమే ఉండటంతో, ఒకడుగు వెనక్కు తగ్గి ఎనిమిది మంది స్టాండింగ్ కమిటీ సభ్యులతో సరిపెట్టుకుంది. ► ఆ మేరకు ఎంఐఎంకు ఒక స్థానం అదనంగా లభించింది. ఎంఐఎంకు గత పాలకమండలిలో, ఇప్పుడు కూడా 44 మంది కార్పొరేటర్ల బలం ఉండటం విశేషం. ఒప్పందానికనుగుణంగా టీఆర్ఎస్ నుంచి 8 మంది,ఎంఐఎంనుంచి ఏడుగురు స్టాండింగ్ కమిటీ సభ్యులయ్యారు. ► ఊహించినట్లుగానే పార్టీ పెద్దలు నచ్చజెప్పడంతో టీఆర్ఎస్ నుంచి నామినేషన్లు వేసిన వారిలో జగదీశ్వర్‌గౌడ్, రాగం నాగేందర్ యాదవ్, వనం సంగీతయాదవ్లు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. స్టాండింగ్ కమిటీ ఏం చేస్తుంది? ► స్టాండింగ్ కమిటీ సభ్యులుగా వీరి పదవీకాలం ఒక సంవత్సరం. ► జీహెచ్ఎంసీలో రూ. 2 కోట్ల నుంచి రూ. 3 కోట్ల మేర విలువైన పనులకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తప్పనిసరి. ► సాధారణంగా స్టాండింగ్ కమిటీ వారానికోసారి సమావేశమవుతుంది. అందుకు వారంలో ఏదో ఒక రోజును ఎంపిక చేసుకోవడం ఆనవాయితీ. గత పాలకమండలిలో ప్రతి గురువారం నిర్వహించేవారు. ► కొత్త స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎన్నికైనప్పటికీ, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో దాదాపు నెలరోజుల పాటు వీరు ఏ పనులకూ ఆమోదం తెలిపేందుకు అవకాశం ఉండదని సంబంధిత అధికారి తెలిపారు. -
కారు స్టీరింగ్ మజ్లిస్ చేతిలోనే ఉందని రుజువైంది
సాక్షి, న్యూఢిల్లీ: ఎంఐఎంతో అధికార టీఆర్ఎస్ పార్టీ అనైతిక పొత్తు కుదుర్చుకోవడంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు మజ్లిస్‌తో విభేదించినట్లు నటించిన కారు పార్టీ.. మేయర్ ఎన్నిక సందర్భంగా వారి సహాయం తీసుకోవడంపై ఆయన ధ్వజమెత్తారు. ఈ రెండు పార్టీల మధ్య కొనసాగుతున్న అనైతిక సంబంధాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో ప్రజలే వారికి తగిన గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు. జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక జరిగిన ప్రక్రియను బట్టి చూస్తే, కారు స్టీరింగ్ మజ్లిస్ చేతిలోనే ఉందని మరోమారు బహిర్గతమైందన్నారు. టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలతో హైదరాబాద్ అభివృద్ధి చెందదని, మజ్లీస్‌కు హైదరాబాద్ అభివృద్ధితో అసలు అవసరమే లేదని ఆయన విమర్శించారు. హిందూ దేవుళ్లను, హిందువులను అవహేళన చేసే మజ్లిస్ పార్టీతో టీఆర్ఎస్ పార్టీ ఎలా పొత్తు పెట్టుకుంటుందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర క్యాబినెట్‌తో చర్చించకుండా, కేవలం మజ్లీస్ సూచనల మేరకే కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. హైదరాబాదులో పోలీసులు ఎవరు ఉండాలి, అధికారులు ఎవరు ఉండాలనేది మజ్లీస్ పార్టీనే నిర్ణయిస్తుందన్నారు. మజ్లీస్ అడ్డు పడడం వల్లే మెట్రో పనులు ముందుకు సాగడం లేదని ఆరోపించారు. కశ్మీర్లో పీడీపీతో పొత్తు వేరే అంశమని పేర్కొన్నారు. రానున్న ఎంఎల్సీ ఎన్నికల్లో రెండు సీట్లలో బీజేపీదే విజయమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. -
రెండో రోజు ఎంఐఎం గైర్హాజరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ సమావేశాల రెండో రోజు మంగళవారం దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా జరిగిన చర్చలో ‘భారతరత్న’ఇవ్వాలనే తీర్మానాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రతిపాదించారు. తీర్మానాన్ని బలపరుస్తూ పలువురు మంత్రులతో పాటు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన 12 మంది సభ్యులు ప్రసంగించారు. ఏఐఎంఐఎం సభ్యులు తీర్మానంపై చర్చ సందర్భంగా సభకు గైర్హాజరయ్యారు. రెండో రోజు సమావేశంలో ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ప్రస్తావన లేకుండా పీవీకి భారతరత్న ఇవ్వాలనే తీర్మానానికే సభా వ్యవహారాలు పరిమితమయ్యాయి. సుమారు రెండు గంటలపాటు సాగిన అసెంబ్లీని బుధవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. శాసనసభ వర్షాకాల సమావేశాల నిర్వహణకు సంబంధించి నలుగురు సభ్యులను ప్యానెల్ చైర్మన్లుగా నామినేట్ చేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. టీఆర్ఎస్ శాసనసభ్యులు హన్మంతు షిండే (జుక్కల్), మంచిరెడ్డి కిషన్‌రెడ్డి (ఇబ్రహీంపట్నం), డీఎస్ రెడ్యానాయక్ (డోర్నకల్), ఏఐఎంఐఎం శాసనసభ్యుడు మహ్మద్ మౌజంఖాన్ (బహదూర్‌పురా) ఈ జాబితాలో ఉన్నారు. కాగా, బుధవారం ఉదయం ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ అనంతరం కరోనాపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. బీఏసీ సమావేశంలో కరోనాపై చర్చించేందుకు అధికార, విపక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చిన విషయం తెలిసిందే. కరోనాపై జరిగే చర్చలో ముఖ్యమంత్రి సమాధానం అనంతరం.. రెవెన్యూ చట్టాన్ని సభలో ప్రవేశపెడతారు. అనంతరం సభను మరుసటి రోజుకు వాయిదా వేస్తారు. రెండు రోజులు రెవెన్యూ చట్టంపై చర్చ జరగనుంది. -
ఎంఐఎం ఎమ్మెల్యేపై రాజాసింగ్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలాపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే దబీర్‌పుర ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఉన్నబారికేడ్‌ను బలవంతంగా తొలగించారు. దీంతో బలాలాతోపాటు ఎంఐఎం మిగతా ఎమ్మెల్యేలు హైదరాబాద్ ఓల్డ్ సీటీలో లాక్డౌన్ నిబంధనలను పాటించడం లేదని, వీరిపై చర్చలు రాజా సింగ్ కోరారు. కాగా బారికేడ్లు తొలిగించే ముందు మజ్లిస్ ఎమ్మెల్యే అహ్మద్ బలాలా మీర్‌చౌక్ ఏసీపీ నుంచి అనుమతి తీసుకున్నారని దబీర్‌పుర పోలీసులు తెలిపారు. (యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం: 21 మంది మృతి ) రాజాసింగ్ మాట్లాడుతూ.. ఓ వైపు కరోనాతో దేశం పోరాడుతుంటే బలాలా వంటి ఎంఐఎం పార్టీ నేతలు లాక్డౌన్ నిబంధనలను పాటించడం లేదని మండిపడ్డారు. అధికారుల ఆదేశాలు పాటించకుండా పోలీసులకు, డాక్టర్లకు ఇబ్బంది కలిగిస్తున్నారని దుయ్యబట్టారు. అసలు ఈ చర్యలన్నింటి వెనక ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ హస్తం ఉందని ఆరోపించారు. ఓ వైపు ప్రజలకు మంచిగా కనిపిస్తూ మరోవైపు తన ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో నిబంధనలను ఉల్లంఘించమని ఒవైసి ప్రేరేపిస్తున్నారని విమర్శించారు. లాక్డౌన్ నిబంధనలను అతిక్రమించిన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజాసింగ్ కోరారు. (గ్రేటర్ ఆర్టీసీ.. కండక్టర్ లెస్ సర్వీసులు! ) ఫ్లైఓవర్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అబ్దుల్లా బలాలా -
భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు
సాక్షి, హైదరాబాద్ : మతపరమైన నిర్ణయంతో దేశంలో వాతావరణ కలుషితం చేస్తున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. కేంద్రం తీసుకువచ్చిన ఎన్నార్సీ, సీఏఏలపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు ఉగ్రరూపం దాల్చాయని పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన మట్లాడుతూ.. పౌరసత్వ సవరణ చట్టం ద్వారా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన వారు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొక తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న ఫాసిస్టు నిర్ణయాలను ఖండించాలన్నారు. బీజేపీ అధికారంలోకి రావడానికి, వివిధ రాష్ట్రాల్లో బీజేపీ గెలవడానికి ఎంఐఎం పరోక్షంగా కారణమని ఆరోపించారు. ఎంఐఎం బీజేపీకి రహస్య మిత్రుడని, కోట్లాదిమంది ముస్లింలకు అగ్నిపరీక్షగా మారిందని మండిపడ్డారు. లౌకికవాద శక్తులను దూరంగా పెట్టడంతోనే ఈ దుస్థితి ఏర్పడిందని, వీటిపై టీఆర్ఎస్, ఎంఐఎం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇది ఒక్క ముస్లింల సమస్య కాదని, అందరి సమస్య అని పేర్కొన్నారు. బీజేపీ తీసుకున్న నిర్ణయాలపై పునరాలోచించాలని సూచించారు. ఈ నెల 28న గాందీ భవన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహిస్తున్నామని, సీఏఏని వ్యతిరేకిస్తూ చేస్తున్న ర్యాలీని విజయవంతం చేయాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. -
ఎంఐఎం టిక్ టాక్
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియా యాప్ ‘టిక్ టాక్’లో అధికారిక ఖాతా ఉన్న తొలి రాజకీయ పార్టీగా ఎంఐఎం రికార్డుకెక్కింది. ఈ మేరకు మంగళవారం ఆ పార్టీ కేంద్ర కార్యాలయమైన దారుస్సలాం నుంచి ఒక ప్రకటన విడుదలైంది. దేశంలోని యువ ఇంటర్నెట్ వినియోగదారులను టిక్‌టాక్ ద్వారా చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టం చేసింది. పార్టీ అధికారిక ‘టిక్‌టాక్’ఖాతాను సుమారు 7000 మంది అనుసరిస్తుండగా, 60 వేల మంది లైక్‌లు, 75 వీడియోలు వచ్చాయన్నారు. యువత తమ భావ స్వేచ్ఛను పంచుకునేందుకు ఇది ఒక వేదికగా పనిచేస్తోందని పేర్కొంది. -
గాడ్సే వారసులు నన్ను హతమారుస్తారేమో?
సాక్షి, హైదరాబాద్: గాడ్సే వారసులు తనను హతమార్చినా ఆశ్చర్యపోనవసరం లేదని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. మహాత్మా గాంధీనే చంపేసిన వారికి అసదుద్దీన్ ఒవైసీ ఒక లెక్కా? అని ప్రశ్నించారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం మాత్రం తాను ఆపబోనని స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని ఎంఐఎం పార్టీ కార్యాలయం దారుస్సలాంలో అసద్ జాతీయ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్లో ప్రజలు సంతోషంగా ఉన్నారన్న బీజేపీ వ్యాఖ్యలు హాస్యాస్పదమని ఎద్దేవాచేశారు. కశ్మీరీలు సంతోషంగా ఉంటే ఆ సంతోషాన్ని పంచుకునేందుకు ఫోన్లు ఎందుకు కట్ చేశారని ప్రశ్నించారు. -
మజ్లిస్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండో అతి పెద్దపార్టీగా మజ్లిస్ అవతరించిన కారణంగా ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించాలని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ కంటే మజ్లిస్ (ఎంఐఎం) సభ్యుల సంఖ్య అధికంగా ఉన్నందున ప్రతిపక్ష హోదా ఇవ్వాలని శాసనసభ స్పీకర్‌ను కలిసి విజ్ఞప్తి చేస్తా మని చెప్పారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయ మైన దారుస్సలాంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్ష హోదాకు మొత్తం స్థానాల్లో పదిశాతం సంఖ్యాబలం అవసరంలేదని, ఢిల్లీలో మొత్తం 70 సీట్లు ఉండగా కేవలం 3 సీట్లు గల బీజేపీకి ప్రతిపక్ష హోదా కల్పించడం జరిగిందని గుర్తు చేశారు. స్పీకర్ కూడా తమ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ సభ్యులు చేజారుతున్నారని కాంగ్రెస్ బాధ పడుతోందని, తాండూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా మజ్లిస్‌కు చెందిన నలుగురు కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకొని చైర్మన్ పదవి దక్కకుండా చేసింది మరచిపోయా రా అని విమర్శించారు. గత పర్యా యం ఏపీలో అప్పటి అధికార టీడీపీ వైఎస్సార్సీపీకి చెందిన 19 మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎంపీలను పార్టీలో చేర్చుకున్నప్పుడు కాంగ్రెస్ ఎందుకు ప్రశ్నించలేదన్నారు. జగన్ మంత్రి వర్గం అభినందనీయం ఏపీ సీఎం జగన్ తన మంత్రి వర్గంలో అన్ని వర్గాలు, కులాలకు సముచిత స్థానం కల్పించడం అభినందనీయమని అసదుద్దీన్ ప్రశంసించారు. గతంలో చంద్రబాబు ఒకే కులంపై ఫోకస్ పెట్టి ప్రాధాన్యత ఇచ్చాడని విమర్శించారు. ఐదు ఉప ముఖ్యమంత్రి పదవులతోపాటు మంత్రి వర్గంలో సైతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అవకాశం ఇవ్వడం మంచి పరిణామమన్నారు. దీంతో ప్రజలందరికి ప్రభుత్వంపై నమ్మకం, విశ్వాసం ఏర్పడుతుందన్నారు. ఏపీ సీఎం తీసుకుంటున్న నిర్ణయాలను తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. జగన్ పాలన అంటే ఏమిటో ప్రజలకు స్పష్టమవుతున్నదని, సీఎంగా ఇంకా మంచి పేరు తెచ్చుకోవడం ఖాయమని అసదుద్దీన్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
మళ్లీ కేసీఆరే సీఎం .. ప్రభుత్వంలో చేరబోం!
సాక్షి, హైదరాబాద్: ‘‘టీఆర్ఎస్ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారు... మేం మాత్రం ప్రభుత్వంలో చేరబోం’’అని ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. మజ్లిస్ పార్టీ 8 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆ స్థానాలు మినహా మిగతా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు. బుధవారం ఇక్కడ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన ‘మీట్ ది ప్రెస్’కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘కాంగ్రెస్ సారథ్యంలోని కూటమి.. ప్రజాకూటమి కాదు, అది ఈస్టిండియా కంపెనీ– 2018’అని విమర్శించారు. పక్క రాష్ట్రం సీఎం చంద్రబాబు భవిష్యత్ తెలంగాణ రాజకీయాలను ఎలా నియంత్రించగలరని ప్రశ్నించారు. ఎన్నికల్లో కూటమికి ఓటమి ఖాయమని, తెలంగాణ ప్రజలు చంద్రబాబును నమ్మబోరని స్పష్టం చేశారు. రాహుల్ సెక్యులరిజం మోసపూరితం ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీ చెప్పే సెక్యులరిజం మోసపూరితమైనదని అసదుద్దీన్ ఎద్దేవా చేశారు. ఇస్లామిక్ షరియత్‌లో జోక్యం కల్పించుకునే ట్రిపుల్ తలాక్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు చర్చలో పాల్గొనవద్దని రాహుల్‌గాంధీ ఎంపీలకు సూచించారని ఆరోపించారు. రాహుల్ తీరుతోనే పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి పాలైందన్నారు. ‘కాంగ్రెస్‌తో కలసి ఉన్నంత వరకు మజ్లిస్ మంచిదైంది.. ఆ తర్వాత చెడ్డదైందా’అని ఆయన సూటిగా ప్రశ్నించారు. తనపై ఆరోపణలు చేసే కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ తమ్ముడు బీజేపీలో ఉన్నారని దుయ్యబట్టారు. ఇన్నేళ్లు పాలించిన కాంగ్రెస్ అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. దేశంలో, తెలంగాణలో ప్రాంతీయ పార్టీల అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల సర్వేలు గందరగోళానికి గురిచేస్తున్నాయన్నారు. ఎప్పుడూ పేరు వినని సంస్థలు కూడా సర్వేలు విడుదల చేస్తున్నాయని, వీటిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని అన్నారు. మజ్లిస్ చొరవతోనే తెలంగాణలో మజ్లిస్ పార్టీ చొరవతోనే ముస్లింలకు విద్య, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని అసద్ అన్నారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ముస్లింల గురించి పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 50 వేల మంది ముస్లిం విద్యార్థుల కోసం మైనారిటీ గురుకుల పాఠశాలలను నెలకొల్పిందని, ఒక్కో విద్యార్థిపై రూ.1.20 లక్షలు ఖర్చు చేస్తోందని తెలిపారు. 900 మంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లగలిగారని అన్నారు. నాలుగున్నరేళ్ల కేసీఆర్ పాలనలో హైదరాబాద్‌లో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని, ఒక్క హింసాత్మక ఘటన కూడా జరగలేదని ఆయన గుర్తు చేశారు. పాతికేళ్లుగా గార్డు లేకుండా: పాతికేళ్లుగా తాను సెక్యూరిటీగార్డు లేకుండా తిరుగుతున్నానని అసద్ చెప్పారు. ‘బీజేపీ నాయకుడు రాజాసింగ్ తలలు నరుకుతామంటూ సవాల్ విసురుతున్నారు. నేను సిద్ధంగా ఉన్నా.. రా చంపేయ్’అని ప్రతి సవాల్ విసిరారు. కొట్టేస్తా. చంపేస్తానంటున్న అభ్యర్థికి మద్దతుగా ప్రధాని మోదీ ప్రచారం చేశారని, ఇదేనా ‘సబ్ కా సాత్ సబ్ కా వికాస్’అని ఒవైసీ ప్రశ్నించారు. మజ్లిస్‌ను వంశవార్ పార్టీగా అభివర్ణిస్తున్న మోదీకి.. తన పార్టీలో ఎన్నో కుటుంబాలు వారసత్వంగా కొనసాగడం కనిపించడంలేదా.. అని దుయ్యబట్టారు. తమ గ్రాఫ్ పెంచుకునేందుకు ప్రత్యర్థులు తనపై విమర్శలు చేస్తుంటారని ఎద్దేవా చేశారు. -
వైఎస్ జగన్‌కు 25 ఎంపీ సీట్లు ఖాయం
సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 25 ఎంపీ సీట్లు గెలవబోతోందని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అభిప్రాయపడ్డారు. ముస్లింలకు 4 రిజర్వేషన్లు కల్పించిన ఘనత ముమ్మాటికీ దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయకుడికి ఓటమి భయం పట్టుకుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఓడిపోతున్నానన్న ఆందోళనతోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పంచన చేరారని ఆరోపించారు. ఈ మేరకు అసద్ ‘సాక్షి’ఇంటర్వ్యూలో మరిన్ని విషయాలు పంచుకున్నారు. ఎంఐఎం పార్టీ బీజేపీకి బీ–టీమ్ అని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. దీనిపై మీరేమంటారు? అసద్: 1998 నుంచి 2012 దాకా కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం పార్టీ ఎఫ్–టీమ్‌గా ఉంది. 2014–2018 నాటికి బీ–టీమ్ అంటోంది. అంటే, రాజకీయాల్లో మా పరిధి పెరిగినట్లేగా! తెలంగాణలో చంద్రబాబు– కాంగ్రెస్ పొత్తును మీరెలా చూస్తారు? అసద్: చంద్రబాబు నాయకుడికి నేను ఈ సందర్భంగా ఒక్కటే చెప్పదలుచుకున్నాను. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ 25 పార్లమెంటు స్థానాలు గెలవబోతోంది. ఏపీలో ఓడిపోతానన్న భయంతోనే చంద్రబాబు మూటముల్లె సర్దుకుని తెలంగాణకు వచ్చి ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ కూడా ఆయన ఓడిపోతారు. జాతీయస్థాయిలో సెక్యులర్ ఓట్లను చీలుస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ మీపార్టీపై ఆరోపణలు చేస్తోంది కదా! అసద్: క్రితంసారి ఢిల్లీ, కశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో మేం పోటీ చేయలేదు. అయినా అక్కడ కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయినట్లు? వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి విజయంపై విశ్వాసం లేదు. అందుకే తెలంగాణలో చంద్రబాబు చేయి పట్టుకుని నడుస్తోంది. ఈసారి అదనంగా ఒకస్థానంలో పోటీ చేస్తున్నారు. అన్ని స్థానాల్లోనూ విజయావకాశాలు ఉన్నాయా? అసద్: దేవుడి దయవల్ల ఈసారి ఒక స్థానం ఎక్కువగా అంటే, 8 స్థానాలు గెలుచుకుంటాం. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు.. మా గొప్పతనమని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది, ఇందులో వాస్తవమెంత? అసద్: ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ల ఘనత ముమ్మాటికీ అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిదే. 2003 డిసెంబర్లో మా పార్టీ అధ్యక్షుడు సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ, వైఎస్, ఖమ్మం ఎమ్మెల్యే యూనిస్ సుల్తాన్ ఇంట్లో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని వైఎస్‌కు సలావుద్దీన్ విజ్ఞప్తి చేశారు. దానికి అంగీకరించిన ఆయన అధిష్టానానికి వివరిస్తానని హామీ ఇచ్చారు. కాబట్టి, ముస్లిం రిజర్వేషన్ల ఘనత వైఎస్‌దే. -
‘ముస్లింలు అందరూ టీఆర్ఎస్కే ఓటేయాలి’
హైదరాబాద్ : ముస్లింలు తప్పనిసరిగా టీఆర్ఎస్కు ఓటు వేసి బీజేపీ, కాంగ్రెస్‌లకు గుణపాఠం చెప్పాలని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్ చేపట్టిన పథకాలే మరోసారీ కేసీఆర్‌ను సీఎంను చేస్తాయని వ్యాఖ్యానించారు. శనివారం రాత్రి భోలక్‌పూర్‌లో ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో ముషీరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్‌కు మద్దతుగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మైనార్టీల సంక్షేమానికి, పేద కుటంబాల పిల్లలు విద్యను అభ్యసించేందుకు 201 రెసిడెన్షియల్ మైనార్టీ పాఠశాలలు ఏర్పాటు చేసి 50 వేల మంది ముస్లిం పిల్లలు చదువుకోవడానికి అవకాశం కల్పించారని కేసీఆర్‌ను కొనియాడారు. ముస్లింలు విదేశాల్లో చదివేందుకు స్కాలర్షిప్లు ఇవ్వడంతో సుమారు 900 మంది విద్యార్థులు వివిధ దేశాల్లోని యూనివర్సిటీల్లో విద్యనభ్యసిస్తున్నారని గుర్తుచేశారు. రాహుల్‌గాంధీ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు తెలంగాణకు ఇప్పటి వరకు ఏం చేశారో తెలపాలని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నాలుగున్నరేళ్ల పాలనలో ఎలాంటి మతఘర్షణలు జరగలేదని గుర్తుచేశారు. ముస్లింలు టీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్‌కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. -
‘మజ్లిస్‌ను బతికించి తప్పు చేశాం’
సాక్షి,హైదరాబాద్ : ‘‘మజ్లిస్ పార్టీని బతికించి తప్పు చేశాం.. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎన్నికల్లో గట్టి అభ్యర్థులను సైతం పోటీకి పెట్టకుండా దాన్ని ప్రోత్సహించిన తప్పిదాన్ని అంగీకరిస్తున్నాం... ఇందులో తాను భాగస్వామి అయినందుకు చింతిస్తున్నా’’అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ అజాద్ పశ్చాత్తాప పడ్డారు. హైదరాబాద్ పాతబస్తీ పేదరికం, అభివృద్ధి మజ్లిస్‌కు అవస రం లేదని, కావాల్సిందల్లా భూ కబ్జాల్లో పోలీసుల సహకారమని, ఇందుకోసమే కేంద్రం, రాష్ట్రాల్లో అధికారంలో గల పార్టీలతో జతకట్టి వాడుకుంటోందని ధ్వజమెత్తారు. గురువారం గాంధీభవన్‌లో విలేకరులతో అజాద్ మాట్లాడారు. బీజేపీ,టీఆర్ఎస్, ఎంఐఎంలు మూడు ఒకటే అని ఆరోపించారు. ఢిల్లీలో ఆ మూడు పార్టీలకు ప్రధాని నరేంద్ర మోదీ నాయకుడని అభివర్ణించారు. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పగలు తిట్టుకుంటాయని, రాత్రయితే ఒప్పందాలు చేసుకుంటాయని విమర్శించారు. అబద్ధాల్లో ఇద్దరూ ఇద్దరే ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేయడం, అబద్ధాలు చెప్పడంలో మోదీ, కేసీఆర్‌లిద్దరూ కవలలని గులాం నబీ అజాద్ అభివర్ణించారు. భేటీ బచావో.. భేటీ పడావో అన్నారు.. కానీ మహిళలు, ఆడపిల్లల మీద అత్యాచారాలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు.కేసీఆర్ దళితుడ్ని సీఎం చేస్తా.. వారికి మూడెకరాల భూమి ఇస్తా.. హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తానన్నారనీ.. కానీ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని దుయ్యబట్టారు. ఆయన విద్యా వ్యతిరేకి అని, ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఇవ్వక పోవడంతో ఇంజనీరింగ్ కళాశాలలు మూత పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో సచివాలయానికి రాని సీఎం ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆరేనని ఎద్దేవా చేశారు. ఇంట్లో కూర్చోవడానికి ఇష్టపడేవారిని ప్రజలు కూడా ఇంట్లోనే కూర్చోపెట్టడం ఖాయమన్నారు. ఐదు రాష్ట్రాల్లో విజయం తథ్యం ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు వస్తాయని అజాద్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రజా కూటమి ప్రభుత్వం గెలుపు తథ్యమన్నా రు.కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను, జాతులను, ధర్మాలను గౌరవిస్తుందని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ బీజేపీతో కలిసి వెళ్లడం ఖాయమని చెప్పారు. వైఎస్సార్ పుణ్యమే 4 శాతం రిజర్వేషన్.. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యమే ముస్లింలకు 4% రిజర్వేషన్ అమలు అని గులాం నబీ అజాద్ స్పష్టం చేశారు. వైఎస్సార్ మన మధ్యలో లేకున్నా రిజర్వేషన్ అమలు చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. 2004లో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జిగా తాను చేపట్టిన బస్సు యాత్రలో ఎవరిని అడగకుండా అధికారంలోకి వస్తే ముస్లింలకు ఐదు శాతం రిజర్వేషన్ వర్తింప చేస్తామని ప్రకటించానని, వెంటనే అప్పటి ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి ఫోన్ చేసి విషయం చెప్పగా అందుకు ఆయన అంగీకరించారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దానిని అమలు చేశారని చెప్పారు. కోర్టు నాలుగు శాతానికే రిజర్వేషన్ పరిమితం చేసిందన్నారు. 5% శాతం పెంపునకే కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు 12% అమలు ఎలా సాధ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతీ హామీ అమలు చేయడమే కాకుండా అవసరమైతే అదనపు వాగ్దానాలను సైతం అమలు చేసి చూపిస్తుందన్నారు. -
స్పెషల్ చాలీస్
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింలు కీలకపాత్ర పోషించనున్నారు. మూడింట ఒక వంతు అసెంబ్లీ సెగ్మెంట్లలో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో వీరు ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలుంటే, అందులో దాదాపు 40 నియోజకవర్గాల్లో ముస్లిం మైనారిటీ ఓటర్లు అధిక సంఖలో ఉన్నారు. ఒక్క హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోనే దాదాపు 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లింలు బలంగా ఉన్నారు. వీటిలో కనీసం ఏడు స్థానాల్లో ‘ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇత్తెహాదుల్ ముస్లిమీన్’ (ఏఐఎంఐఎం) పాగా వేయడం లాంఛనమే. ఇవి కాకుండా ఇతర ప్రాంతాల్లో అభ్యర్థులను నిలబెడితే.. ఇతర పార్టీల గెలుపోటములు తారుమారయ్యే అవకాశం ఉంది. ఆ నలభై కీలకం.. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు ఉన్నా.. నిర్ణయాత్మక శక్తిగా ఉన్నవి మాత్రం 40 నియోజకవర్గాలు ఉంటాయి. రాష్ట్ర జనాభాలో దాదాపు 12.7 శాతం మేరకు ముస్లిం జనాభా ఉంది. గతంలో ముస్లింలు కాంగ్రెస్‌కు పెట్టని కోటగా ఉండేవారు. అయితే బాబ్రీ మసీదు విధ్వంసం తరువాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ముస్లిం ఓట్లను ప్రభావితం చేసే స్థాయిలో ఎంఐఎం ఎదిగింది. ఒకప్పుడు కేవలం హైదరాబాద్ నగరానికి మాత్రమే పరిమితమైన మజ్లిస్ పార్టీ తరువాత తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలు ఎక్కువగా నివసించే ప్రాంతాలకూ విస్తరించింది. అక్కడ రాజకీయంగా నిలదొక్కుకోలేకపోయినప్పటికీ.. ప్రతి ఎన్నికల సమయంలో ఆ ప్రాంతాల ముస్లింలను ప్రభావితం చేయడంలో మాత్రం సఫలీకృతమవుతోంది, ఎంఐఎం నేరుగా ప్రధాన రాజకీయ పక్షాలతో పొత్తుపెట్టుకోకున్నా.. ‘ఫ్రెండ్లీ పార్టీ’గా మద్దతు ఇస్తోంది. ప్రస్తుతం అధికార పార్టీకి అండగా ఎంఐఎం మెలుగుతోందని విశ్లేషకుల అభిప్రాయం. ఉమ్మడి జిల్లా్లలైన నల్లగొండ, మెదక్, రంగారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మంలలో ముస్లిం మైనారిటీ ఓటర్లు అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే సంఖ్యలోఉన్నారు. మొగ్గు ఎటువైపో..?! తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన ఎంఐఎం పార్టీ.. రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఆ అంశాన్ని పక్కన పెట్టేసి, అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీతో సన్నిహితంగా మెలుగుతూ వస్తోంది. దానికి తోడు తెలంగాణ రాష్ట్ర సమితి మైనారిటీలను ఆకట్టుకునే విధంగా పలు కార్యక్రమాలను చేపట్టింది. గత ఎన్నికల మేనిఫెస్టోలో.. ముస్లింలకు విద్య, ఉపాధి రంగాల్లో 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీనిచ్చింది. అధికారంలోకి వచ్చిన తరువాత ఆ ప్రక్రియను కొనసాగించింది. అయితే అది న్యాయస్థానంలో నిలబడలేదు. డాక్టర్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముస్లింలకు విద్య, ఉద్యోగాల్లో నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు కూడా ముస్లింలు కాంగ్రెస్‌తోనే ఉన్నారు. ఆయన మరణానంతరం వారంతా కాంగ్రెస్ పార్టీకి దూరమవుతూ వచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై చిత్తశుద్ధితో పనిచేయలేదని ప్రతిపక్షం ప్రధానంగా విమర్శిస్తోంది. మైనారిటీలకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించడంలో విఫలమైందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వ మేనిఫెస్టోలో లేకపోయినా.. కల్యాణలక్ష్మి తరహాలో ముస్లింలకు షాదీ ముబారక్, రంజాన్ తోఫా పథకాలను ప్రవేశపెట్టింది. ముస్లిం మైనారిటీలు విద్యాపరంగా బాగా వెనుకబడిన విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ఆ వర్గం విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రాష్ట్రంలో 200 గురుకుల పాఠశాలలు ప్రారంభించడంతో ప్రభుత్వంపై ఆ వర్గం ప్రజలకు నమ్మకం పెరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా ముస్లింలను తన వైపునకు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ స్థానాల్లో హవా.. - హైదరాబాద్ పాతబస్తీలోని ఏడు నియోజకవర్గాలతో పాటు ఖైరతాబాద్, ముషీరాబాద్, అంబర్‌పేట, కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్ స్థానాల్లో ముస్లిం ఓట్లు అధికం. - నల్లగొండ జిల్లాలో నల్లగొండ, సూర్యాపేట, కోదాడ, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో 20 వేల నుంచి 28 వేల చొప్పున ముస్లిం ఓటర్లు ఉంటారు. ఇంకా నాగార్జునసాగర్, హుజూర్నగర్ నియోజకవర్గాల్లోనూ వారి ప్రభావం ఉంది. - ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, జహీరాబాద్, పటాన్చెరు, మెదక్, సిద్దిపేట నియోజకవర్గాల్లో పది వేల నుంచి 30 వేల చొప్పున ముస్లిం ఓటర్లు ఉంటారు. - వరంగల్ జిల్లాలోని వరంగల్ తూర్పు, మహబూబాబాద్ స్థానాల్లో బలంగా ఉన్నారు. - ఖమ్మం, కొత్తగూడెం నియోజకవర్గాల్లో, మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో 30 వేల వరకు ముస్లిం ఓటర్లు ఉంటారు. మక్తల్‌లోనూ ప్రభావం చూపేస్థాయిలో ఉన్నారు. - కరీంనగర్, జగిత్యాల సెగ్మెంట్లలోనూ అధిక సంఖ్యలో ఉన్నారు - ఆదిలాబాద్ జిల్లాలోని ముథోల్, ఆదిలాబాద్ సెగ్మెంట్లలో వీరిది నిర్ణయాత్మక పాత్ర. ముథోల్‌లో 1.72 లక్షల ఓటర్లలో 38 వేల వరకు ముస్లింలు ఉంటారు. ఆదిలాబాద్ సెగ్మెంట్లో 1.96 లక్షల మంది ఉంటే 35 వేల మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు - రంగారెడ్డి జిల్లా వికారాబాద్, తాండూర్‌లో వీరి ఓట్లే కీలకం. రాజేంద్రనగర్‌లోనూ ఎంఐఎంకు గెలిచే సత్తా ఉంది. - ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని.. నిజామాబాద్ అర్బన్‌లో 40 వేల మంది ముస్లింలు ఉంటారు. 2014 ఎన్నికల్లో ఎంఐఎం ఇక్కడ రెండో స్థానంలో నిలిచింది. బోధన్ నియోజకవర్గంలోనూ 35 వేల మంది, కామారెడ్డి నియోజకవర్గంలో 25 వేల మేరకు ముస్లిం ఓటర్లు ఉన్నారు. ముస్లిం ప్రభావిత నియోజకవర్గాలు: 40 వీటిలో హైదరాబాద్ పరిధిలోని స్థానాలు: 15 (వీటిలో పూర్తిగా ముస్లిం ఆధిక్యత గల స్థానాలు 7) రాష్ట్రంలో ముస్లిం జనాభా శాతం: 12.7 -
హాట్ టాఫిక్; మజ్లిస్‌కు పోటీగా మహిళ
సాక్షి, హైదరాబాద్: చాంద్రాయణగుట్ట నియోజకవర్గం బీజేపీ టికెట్ ఆశిస్తూ ఓ ముస్లిం మహిళ ముందుకు రావడంతో పాతబస్తీ అంతటా చర్చనీయాంశమయింది. మజ్లిస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి తనకు టికెట్ ఇస్తే సత్తా చాటుతానంటూ బీజేపీ విద్యార్థి విభాగమైన ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు షహజాది పార్టీ అధిష్టానం వద్ద దరఖాస్తు చేశారు. ఇప్పటి వరకు విద్యార్థి విభాగంలో ఉన్న ఆమె ఇందుకోసమే పార్టీ కండువాను సైతం ధరించారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన షహజాది బీజేపీ విద్యార్థి విభాగమైన ఏబీవీపీలో తొమ్మిదేళ్లుగా చురుగ్గా పనిచేస్తున్నా. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థిగా ఉన్నారు. ఎన్నికల సమయంలో ముస్లిం ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్పి ముస్లింల సంక్షేమం గురించి పట్టించుకోని ఎంఐఎం పార్టీని ఓడించాలన్న లక్ష్యంతోనే ఎన్నికల బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు షహజాది ‘సాక్షి’కి తెలిపారు. కాగా, ఎంఐఎం పార్టీతో టీఆర్ఎస్ అంటకాగుతోందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే ఎంఐఎం పార్టీకి వేసినట్టేనని ప్రచారం చేస్తున్నారు. మజ్లిస్‌ను ఓడించగల సత్తా తమకే ఉందని అంటున్నారు. -
పాత ‘బస్తీ మే సవాల్’..!
సాక్షి, హైదరాబాద్: మజ్లిస్ పార్టీతో అమీతుమీకి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఎంఐఎంకు పట్టున్న పాతబస్తీలో సత్తా చాటేందుకు హస్తం పార్టీ వ్యూహం రచిస్తోంది. ఇన్నాళ్లూ ఎంఐఎంతో అవగాహన కుదుర్చుకుని పాతబస్తీ రాజకీయాలు చేసిన కాంగ్రెస్ ఇప్పుడు ఆ పార్టీని లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, అనంతర పరిణామాలతో పాటు దేశవ్యాప్తంగా ఎంఐఎం అనుసరిస్తున్న తీరును దృష్టిలో ఉంచుకుని మజ్లిస్‌తో తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో మజ్లిస్ గెలిచే అవకాశమున్న అసెంబ్లీ స్థానాల్లో కనీసం నాలుగింటికైనా ఎసరు పెట్టేలా ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటి నుంచే అభ్యర్థుల వేటలో దిగిన పీసీసీ పెద్దలు.. దారుస్సలాంను దెబ్బతీసే బాధ్యతలను భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్‌కు అప్పగించనున్నారు. ఆ నాలుగింటిలో.. పాతబస్తీలో ఎంఐఎం ఆధిపత్యానికి గండికొట్టడం అంత సులువైన పనేమీ కాదు. దశాబ్దాలుగా ఆ పార్టీకి అండగా నిలుస్తున్న ఆరేడు నియోజకవర్గాల్లో దారుస్సలాం మాటే వేదం. అలాంటి చోట ఇన్నాళ్లూ మిత్రపక్షంగా ఉండి ఇప్పుడు టార్గెట్ చేయాల్సి రావడాన్ని కాంగ్రెస్ సవాల్‌గా తీసుకుంది. మజ్లిస్ గెలిచే అవకాశమున్న యాకుత్‌పుర, బహుదూర్‌పుర స్థానాల్లో కదిలించడం కష్టమేననే అంచనాకు వచ్చిన కాంగ్రెస్ మిగిలిన స్థానాలపై గురిపెట్టింది. ఎంఐఎంకు ఆయువుపట్టు లాంటి చార్మినార్, చాంద్రాయణగుట్ట, నాంపల్లి అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవాలని, ఆయా స్థానాల్లో సామాజిక, రాజకీయ పరిస్థితులు తమకు కలసి వస్తాయని అంచనా వేస్తోంది. చార్మినార్‌లో ఎంఐఎంకు చెందిన మాజీ కార్పొరేటర్ మహ్మద్‌గౌస్, చాంద్రాయణగుట్టలో ఎంఐఎం బద్ధశత్రువు మహ్మద్ పహిల్వాన్‌ను రంగంలోకి దింపాలని భావిస్తోంది. నాంపల్లి స్థానం నుంచి మంచి పట్టున్న ఇటీవలే పార్టీలో చేర్చుకున్న ఫిరోజ్ఖాన్కు నాంపల్లి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. కార్వాన్, మలక్‌పేట స్థానాల్లో ఇతర పార్టీలు గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో నేరుగా బరిలోకి దిగాలా.. లేక గట్టి అభ్యర్థులకు మద్దతిచ్చి ముందుకు నడిపించాలా అనే దానిపై పీసీసీ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు. అజారుద్దీన్ నేతృత్వంలో.. పాతబస్తీ రాజకీయాలను పూర్తిగా మార్చేయాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌ను తురుపుముక్కగా భావిస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సూచన మేరకు హైదరాబాద్‌లోని ఎంఐఎం ప్రభావిత నియోజకవర్గాల పార్టీ బాధ్యతలను పూర్తిగా ఆయనకు అప్పగించే అవకాశాలున్నాయి. దీనిలో భాగంగానే పీసీసీ చేపట్టిన బస్సుయాత్రలోనూ అజర్‌కు తగిన ప్రాధాన్యమిస్తున్నారు. బస్సు యాత్ర ప్రారంభమైన చేవెళ్లలో జరిగిన తొలి బహిరంగసభలో అజారుద్దీన్‌తో మాట్లాడించడమే కాక.. రాహుల్ సూచన మేరకు ఈసారి అజర్ కీలకపాత్ర పోషిస్తారని బహిరంగంగా ప్రకటించారు. అజారుద్దీన్ పట్ల ఎంఐఎంకు మద్దతు పలికే వర్గాల్లోనూ సానుభూతి ఉంటుందని, ఆయనను హైదరాబాద్ పార్లమెంటు బరిలోకి దింపితే అసెంబ్లీ అభ్యర్థులకూ బలం చేకూరుతుందని కాంగ్రెస్ యోచిస్తోంది. త్వరలోనే అజర్‌తో పాతబస్తీలో కార్యక్రమాలు నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. అయితే ఎంఐఎంను లక్ష్యంగా చేసుకోవాలనేది రాహుల్ నిర్ణయమేనని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎంఐఎం వైఖరి తమను దెబ్బతీసిందని ఏఐసీసీ పెద్దలు భావించారని, అందుకే ఎంఐఎంను ప్రత్యర్థిగా భావించాలని రాహుల్ డైరెక్షన్ ఇచ్చినట్టు పీసీసీ నేతలు చెబుతున్నారు. -
దళితులకంటే దీనంగా ముస్లింలు
సాక్షి, హైదరాబాద్: ఈ ప్రాంతాన్ని 400 ఏళ్లు పాలించిన ముస్లింలు స్వాతంత్య్రానంతరం 70 ఏళ్లలో ఎస్సీ, ఎస్టీలకంటే వెనుకబాటుకు గురవటానికి.. మరింత బీదరికంలోకి నెట్టేయబడటానికి గత పాలకుల విధానాలే కారణమని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ విమర్శించారు. ముస్లింల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం పాటుపడుతోందని, ప్రభుత్వ పథకాలను ముస్లింలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. నగరంలో రెండు రోజుల పాటు జరిగిన జమాత్ ఇస్లామీ హింద్ సదస్సులో ఆదివారం మహమూద్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలకంటే వెనుకబడిన ముస్లింల సంక్షేమం, అభివృద్ధికి ముస్లింలు సైతం పాటుపడాలని, ముస్లిం వర్గాలు తమలో ఉన్న విభేదాలను పక్కనపెట్టి సంఘటితం అవ్వాలని సూచించారు. ముస్లిం యువత వృత్తి నైపుణ్యాలను పెంపొందిం చుకుని వ్యాపార రంగంలో ముందుకెళ్లాలని, మహిళలు కూడా అన్నిరంగాల్లో ముందడుగు వేసి భర్తకు చేదోడువాదోడుగా నిలవాలన్నారు. ముస్లింలు తమ పిల్లల విద్యపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ముస్లిం పిల్లల విద్యకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 204 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశామని, వీటిలో 50 వేల మంది మైనారిటీ విద్యార్థులు కార్పొరేట్ స్థాయి సౌకర్యాలతో విద్యను అభ్యసిస్తున్నారని చెప్పారు. ముస్లింల పాత్ర చిరస్మరణీయం శాసనమండలిలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్‌అలీ మాట్లాడుతూ.. దేశ నిర్మాణంలో ముస్లింల పాత్ర చిరస్మరణీయమని, దేశ స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేసిన ముస్లిం యోధుల జీవితాలను నేటి తరానికి తెలియజేయాలని సూచించారు. ముస్లింలు తమ సంస్కృతీ సంప్రదాయాలతో దేశానికి ఎనలేని సేవలందించారన్నారు. ఇస్లాం ధర్మం దేశంలో కత్తిబలంతో వ్యాపించలేదని, ప్రేమ, సోదరభావం, త్యాగస్ఫూర్తితో విస్తరించిందని చెప్పారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన మొట్టమొదటి యోధుడు టిప్పుసుల్తాన్ను లక్ష్యంగా చేసుకోవడం విషాదకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం భారతదేశ చరిత్రను మార్చే కుట్రలు పన్నుతోందని, ఇలాంటి హేయమైన చర్యలకు పాల్పడితే చరిత్ర క్షమించదని హితవు పలికారు. కార్యక్రమంలో జమాత్ ఇస్లామీ ఉపాధ్యక్షుడు సాదతుల్లా హుస్సేనీ, రాష్ట్ర అధ్యక్షుడు హమీద్ మహ్మద్ ఖాన్, కార్యదర్శులు, వివిధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. జమాత్ ఇస్లామీ హింద్ సదస్సు విజయవంతంగా పూర్తయిందని, జమాత్ ఇస్లామీ హింద్ నగర అధ్యక్షుడు హఫీజ్ రషాదుద్దీన్ అన్నారు. దేశాన్ని బలహీనపరుస్తున్నారు.. ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. దేశంలోని ముస్లింలను అభద్రతాభావానికి గురిచేసే ఘటనలు తీవ్రమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముస్లిం పాలకులను, యోధులను దేశద్రోహులుగా చిత్రీకరించి విద్వేష వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నాలను తిప్పికొట్టాలని సూచించారు. విభజన రాజకీయాలు, గోరక్షణ, లవ్‌జిహాద్ తదితర సాకులతో విద్వేషం చిమ్మి.. మనుషుల ప్రాణాలను బలిగొని దేశాన్ని బలహీనపరుస్తున్నారని ఆయన విమర్శించారు. షరియత్ చట్టాల్లో జోక్యం సరికాదని, షరియత్ పరిరక్షణకు ధార్మిక, సామాజిక, రాజకీయ పార్టీల్లో ఉన్న ముస్లింలు ఏకతాటిపైకి వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రేమకు చిహ్నంగా కట్టిన తాజ్‌మహల్‌పై విషం చిమ్మే నీచ రాజకీయాలకు పాల్పడటం దారుణ మన్నారు. మత రాజకీయాలతో పబ్బం గడుపుకునే బీజేపీకి ప్రజలే బుద్ధిచెబుతారని, గుజరాత్లో బీజేపీ ఓటమి ఖాయమని అన్నారు. -
ఎంఐఎం పార్టీ ఉగ్రవాదులకు నీడనిస్తోంది: బీజేపీ
హైదరాబాద్: తెలంగాణలో రాష్ట్ర పరిపాలనను తమ కుటుంబ పరిపాలనగా భావిస్తున్న పార్టీలకు ఇక భవిష్యత్తు ఉండదని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు పేర్కొన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ భారతీయ జనతాపార్టీ విస్తరణే ధ్యేయంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాష్ట్రంలో మూడు రోజుల పాటు పర్యటిస్తారని చెప్పారు. అమిత్‌షా పర్యటనతో రాష్ట్రంలో రాజకీయ స్పష్టత రాబోతోందన్నారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా సర్కార్ నిద్రపోతోందని, పాతబస్తీలో ఐఎస్ఐఎస్ ప్రచారం చేస్తుంటే తెలంగాణ పోలీసులు ధర్నా చౌక్‌లో ప్టకార్డులు పట్టుకుని ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని, ప్రభుత్వం పోలీసులతో, అధికారులతో డ్రామాలు వేయిస్తోందని ఘాటుగా విమర్శించారు. రైతుల విషయంలో ప్రభుత్వం అధ్వాన్నంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ధాన్యానికి మద్దతు ధర ఉన్నా ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయడంలేదని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం సీఎం పాతబస్తీని ఎంఐఎంకు తాకట్టు పెట్టారని ఒవైసీ బ్రదర్స్‌కు , ఉగ్రవాదులకు నీడనిచ్చే పార్టీకి కేసీఆర్ మద్దతు ఇస్తున్నారని దుయ్యబట్టారు. భవిష్యత్తులో యోగిలాంటి నాయకులు రాష్ట్రానికి వస్తారని అన్నారు. -
బీజేపీతో ఎంఐఎం కుమ్మక్కు
అమిత్‌షాతో అక్బరుద్దీన్ రహస్య భేటీ..రూ.400 కోట్ల ముడుపులు ⇒ కాంగ్రెస్ జన ఆవేదన సమ్మేళనం ప్రారంభ సభలో దిగ్విజయ్‌సింగ్ ⇒ కేసీఆర్ పాలనకు కౌంట్‌డౌన్ షురూ అయింది: ఉత్తమ్ కుమార్‌రెడ్డి ⇒ ప్రశ్నించిన ప్రజాసంఘాలపై కేసీఆర్ దబాయింపులా?: జానారెడ్డి సాక్షి, నిజామాబాద్: బీజేపీతో ఎంఐఎం పార్టీ కుమ్మక్కైందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ ఆరోపించారు. ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో ముస్లింలను రెచ్చగొట్టి వారి ఓట్లలో చీలిక తెచ్చేందుకు ఎంఐఎం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ముస్లింలు ఎంఐఎం ఉచ్చులో పడొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించతలపెట్టిన జన ఆవేదన సమ్మేళన సభ ఆదివారం నిజామాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో దిగ్విజయ్‌సింగ్ మాట్లాడుతూ.. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ బిహార్‌లో అర్ధరాత్రి మూడు గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షాను కలసి రూ.400 కోట్ల ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్ హయాంలో అభివృద్ధి పనులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని దిగ్విజయ్‌సింగ్ పేర్కొ న్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అయినప్పటికీ లాభపడింది మాత్రం టీఆర్ఎస్ అని వ్యాఖ్యానించారు. సీఎం కేసీ ఆర్ తీరుపైన విమర్శలు చేసిన దిగ్విజయ్‌సింగ్ కేసీఆర్‌కు తన కుటుంబ సభ్యుల ప్రయోజనాలపై ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రజల సంక్షేమంపై చూపడం లేదని అన్నారు. పెద్దనోట్ల రద్దుపై మాట మార్చిన కేసీఆర్.. పెద్ద నోట్ల చలామణిని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ముందుగా వ్యతి రేకించిన సీఎం కేసీఆర్.. ప్రధాని మోదీని కలిశాక మాటమార్చారని దిగ్విజయ్‌సింగ్ ఆరోపించారు. ముందు వ్యతిరేకించి, తర్వాత మాట మార్చడం వెనుక ఏం జరిగిందని ఆయన ప్రశ్నించారు. పెద్ద నోట్ల చలామణి రద్దు నిర్ణయంతో సామాన్యులు బ్యాంకు క్యూలైన్లలో ఇబ్బందులు పడితే, బ్యాంకు మేనేజర్లు బడాబాబుల ఇండ్లకు వెళ్లి కొత్త నోట్ల కట్టలు ఇచ్చి వచ్చారని దుయ్యబట్టారు. ఈ నిర్ణయంతో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు తీవ్ర నష్టం కలిగితే.. పేటీఎం, వీసా, మాస్టర్ కార్డుల యాజమాన్యాలకు ఎంతో ప్రయోజనం కలిగిందన్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల హామీలను విస్మరించారని విమర్శించారు. అంతర్జాతీయ కార్డు మాఫియాకు ప్రయోజనం: ఆర్సీ కుంతియా పెద్ద నోట్ల చలామణి రద్దు నిర్ణయం పేద, మధ్యతరగతి ప్రజలను తీవ్ర ఇబ్బందులను గురిచేయగా, పేటీఎం వంటి అంతర్జాతీయ కార్డు మాఫియాకు మాత్రం ఎంతో ప్రయోజనం చేకూర్చిందని ఏఐసీసీ కార్యదర్శి రామచంద్ర కుంతియా ఆరోపించారు. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా 150 మంది నిరుపేదలు చనిపోయారని, దేశ జాతీయ ఉత్పత్తి నాలుగేళ్ల కనిష్టానికి పడిపోయిందని విమర్శించారు. టూరిజం, టెక్స్టైల్ వంటి రంగాలపై కొలుకోలేని దెబ్బపడిందన్నారు. సీఎం నేనంటే.. నేనంటున్నరు: వీహెచ్ కాంగ్రెస్ పార్టీలో తమ నేతల మధ్య ఉన్న విభేదాలను కూర్చుండి పరిష్కరించుకుందా మని మాజీ ఎంపీ వి.హనుమంతరావు పేర్కొ న్నారు. టీపీసీసీ సమన్వయ కమిటీని వెంటనే సమావేశ పరచాలని వీహెచ్ ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌ను కోరారు. గత ఆరు నెలలుగా ఈ కమిటీ సమావేశం కాలేదని, చివరి సారిగా ఆదిలాబాద్‌లో ఈ సమావేశం జరిగిందన్నారు. ‘‘నేను సీఎం అంటే.. నేను సీఎం అని అంటున్నరు.. ముఖ్యమంత్రిని ప్రజలు చేస్తారు..’’ అని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ కులాలను అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని, బీసీలు గొర్లు కాయాలి.. చేపలు పట్టాలి.. మీరు మాత్రం రాజ్యం ఏలుతారా? అని ప్రశ్నించారు. బీసీలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. నిజామాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్ అధ్యక్ష తన జరిగిన ఈ బహిరంగ సభలో పార్టీ రాష్ట్ర నేతలు పొన్నాల లక్ష్మయ్య, పి.సుదర్శన్ రెడ్డి, కేఆర్.సురేశ్‌రెడ్డి, వి.హనుమంతరావు, మధు యాష్కిగౌడ్, పొన్నం ప్రభాకర్, షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ ఆకుల లలిత, ఈరవత్రి అనిల్, శనిగరం సంతోశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భ్రష్ట తెలంగాణగా మార్చుతున్నారు: జానారెడ్డి రాష్ట్రంలో టీఆర్ఎస్ అహంకార పూరిత ధోరణితో పాలన సాగిస్తోందని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత జానారెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్ ఫిరాయింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. వైఫల్యాలను ప్రశ్నించిన ప్రజాసంఘాలపై దబా యింపులకు పాల్పడుతున్నారన్నారు. బంగారు తెలంగాణ పేరు తో భ్రష్టుపట్టిన తెలంగాణగా మార్చేదిశగా పాలన ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి: ఉత్తమ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పాలనకు కౌంట్‌డౌన్ షురూ అయిందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి విమర్శించారు. ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న టీఆర్ఎస్ సర్కారుకు రానున్న ఎన్నికల్లో ఓటమి ఖాయమన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేసీఆర్ విస్మరిస్తున్నారని అన్నారు. -
అక్బరుద్దీన్‌పై కేసుల్లో దర్యాప్తు పూర్తి చేశాం
హైకోర్టుకు పోలీసుల నివేదన సాక్షి, హైదరాబాద్ : మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేసిన ఎంఐఎం పార్టీ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీపై నిజామాబాద్, నిర్మల్‌ల్లో నమోదయిన కేసుల్లో సంబంధిత కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశామని పోలీసులు సోమవారం హైకోర్టుకు నివేదించారు. దీనిని రికార్డ్ చేసుకున్న హైకోర్టు ఈ వ్యాజ్యంపై ఇక తదుపరి విచారణ అవసరం లేదంటూ దానిని పరిష్కరించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అక్బరుద్దీన్‌పై నమోదు చేసిన కేసులో ఎటువంటి పురోగతి లేదని, పోలీసులు దర్యాప్తును పక్కన పెట్టేశారని ఆరోపిస్తూ నగరానికి చెందిన సయ్యద్ తరాక్ ఖాద్రీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా హోంశాఖ తరఫు న్యాయవాది పి.వేణుగోపాల్ స్పందిస్తూ, అక్బరుద్దీన్ కేసుల్లో సత్వరమే దర్యాప్తును పూర్తి చేసి సంబంధిత కోర్టుల్లో చార్జిషీట్లు దాఖలు చేశామని కోర్టుకు నివేదించారు. -
ఈ విద్వేషాన్ని సహించగలమా?
దేశాన్ని అస్థిరపర్చేందుకు అసహనం అనే ఒక వైరస్‌ను ప్రవేశపెట్టి హిందుత్వంపై ద్వేషంతో భారతదేశంపై దాడి చేస్తున్నారు. నక్సలైట్లపై కేసులు పెట్టే మనం తిన్నింటి వాసాలు లెక్కపెట్టే జాతి వ్యతిరేకులపై కేసులు పెట్టకూడదా? ఎంఐఎం పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ వివాదాస్పద ప్రసంగాలకు పెట్టింది పేరు. ఒక వ్యక్తినో, పార్టీనో, చివరకు వ్యవస్థనో విమర్శిస్తే, అలాంటి విమర్శ ద్వారా వివాదాన్ని సృష్టించి లబ్ధి పొందుదాం అనుకుంటే వేరు. ఆయన చేసే విమర్శ లకు ఆయా సంస్థలో, వ్యక్తులో సమాధానమిస్తారు. అక్కడితో అది సమసిపోతుంది. కానీ ఈసారి ఆయన హద్దు మీరారు. గొంతు మీద కత్తి పెట్టినా ‘భారత్ మాతా కీ జై’ అనేది లేదని ప్రకటించి ఒక పెద్ద వివాదానికి తెరతీశారు. ఏం చేసింది ఆ నినాదం? అందులో తప్పేముంది? స్వాతంత్య్ర సంగ్రామంలో అది కోట్లాదిమంది భారతీయులను ఏకం చేసిన నినాదం. స్వాతంత్య్రానంతరం ఈ దేశ పౌరుల ఐక మత్యాన్ని చాటుతున్న నినాదం. ‘తల్లి భారత దేశానికి జయం కలగాలి’ అన్నదే ఆ నినాదంలోని అంతరార్ధం. దేశానికి జయం కలగాలని కోరుకోవడమంటే దేశా భివృద్ధిని కాంక్షించడం. మన ఇల్లు, తల్లి బాగుండాలని కోరుకోవడం. అలా కోరుకోకపోవడమంటే బాహా టంగా దేశ వినాశనాన్ని, విచ్ఛిన్నాన్ని కోరుకోవడమే. భరతమాతకు ఎందుకు జై కొట్టాలి? భరత మాత విజయాన్ని ఎందుకు మనం కాంక్షించాలి? మన దేశంలో 29 రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలు వాటిలో ఎన్నో మతాలు, కులాలు, జాతులు, వందలాది భాషలు ఉన్నాయి. వీరందరినీ కడుపులో పెట్టుకుని కాపాడుతున్నది కాబట్టి జై కొట్టాలి. ఆమె విజయం సాధించటం అంటే.. వీరంతా సుఖ సంతోషాలతో, భోగ భాగ్యాలతో వర్థిల్లటమే కాబట్టి. సర్వేజనా స్సుఖినో భవంతు అని.. అంతా బాగుండాలని కోరుకునే మంచి తల్లి కాబట్టి. ఎన్నో ముస్లిం దేశాల్లో పేదరికం తాండవ మాడుతోంది. రెండు వర్గాలై ఘర్షణలు పడుతుండటం వల్ల చాలాచోట్ల అరాచకం రాజ్యమేలుతోంది. ఉగ్ర వాదం విస్తరిస్తోంది. ఒకే భాష, ఒకే దేశం, ఒకే మతం అయినా ఇలాంటి అనారోగ్యకరమైన పరిస్థితులు అక్క డున్నాయి. భిన్నత్వంలో ఏకత్వాన్ని నింపుకుని, 125 కోట్ల మందిని ఒకేతాటిపైకి తెచ్చి ముందుకు నడిపిస్తున్న మాత భరతమాత. ప్రపంచ వినువీధుల్లో ప్రతి భారతీ యుడూ గర్వంగా ఎలుగెత్తి చాటగల నినాదం. ఒవైసీ అభిప్రాయాలు ఆయన వ్యక్తిగతానికో లేక పార్టీకో పరిమితమైతే జాతి వ్యతిరేకులపై ఏం చర ్యలు తీసుకోవాలో వాటిని ప్రభుత్వమే తీసుకుంటుంది. కానీ, ఒక వర్గానికి ప్రతినిధిగా ఆయన ఈ వైఖరిని ప్రచారం చేయాలనుకుంటే, దేశాన్ని అస్థిరపరచాలని చూస్తే మాత్రం భారతీయులు తిరగబడతారు. ఆయన ఆ ఒక్క మాట అని ఆగలేదు. పవిత్రమైన రాజ్యాంగాన్ని కూడా తన తప్పుడు ఆలోచనకు అడ్డం పెట్టుకున్నారు. రాజ్యాం గంలో చెప్పలేదు కాబట్టి భరతమాత వర్థిల్లాలని తాను నినదించనని ఆయన అన్నారు. అంటే, ఆయన చేస్తున్న దంతా రాజ్యాంగంలో పేర్కొన్నారా? ప్రసిద్ధ గేయ రచయిత జావేద్ అక్తర్ రాజ్యసభలో ప్రసంగించినట్లుగా.. కుర్తా, షేర్వాణీ వేసుకోమని, టోపీ పెట్టుకోమని ఒవైసీకి రాజ్యాంగంలో చెప్పారా? మరి ఆయన ఎందుకు అవి ధరిస్తున్నారు? మన ఇంట్లో ఎన్నో సమస్యలు ఉండవచ్చు. వాటిని పరిష్కరించుకోవటానికి కుటుంబ సభ్యులు విభేదించు కోవచ్చు. ఒక్కోసారి గొడవ పడటం కూడా సాధార ణమే! కానీ, కుటుంబాన్నే కూల్చాలని చూసే జాతి వ్యతి రేకులు ఈ మధ్యకాలంలో తయారయ్యారు. హింసకు పాల్పడటాన్ని పక్కన పెడితే నక్సలైట్లు దేశభక్తులే అనిపిస్తుంది. ఎందుకంటే వారు రాజ్యం మీద ఎదురు తిరుగుతున్నారు తప్ప జాతి వ్యతిరేకులు కాదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. నక్సలైట్లపై కేసులు పెడుతున్న మనం జాతి వ్యతిరేకులపై ఎందుకు పెట్టకూడదు? తిన్నింటి వాసాలు లెక్కపెడుతున్న వారు దేశద్రోహులు కాదా? దేశాన్ని అస్థిరపర్చేందుకు అసహనం పేరిట ఒక వైరస్‌ను ప్రవేశపెట్టారు. హిందుత్వంపై ద్వేషంతో భార తదేశంపై దాడి చేస్తున్నారు. జాతికి తూట్లు పొడవాలని చూస్తున్నారు. యూనివర్సిటీల్లో ఉన్నత విద్యను అభ్య సించాల్సిన విద్యార్థులు నోటికొచ్చినట్లు మాట్లాడటమే ప్రజాస్వామ్యమా? వీరు చేసింది పక్కనపెట్టి వారిని హీరోలుగా తీర్చిదిద్దాలని చూస్తున్న వారు సెక్యుల రిస్టులు అవుతారా? రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు గులాంనబీ ఆజాద్ ఆర్ఎస్ఎస్ను ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్తో పోల్చారు. దేశ ంలో కొన్నివేల పాఠశాలలు స్థాపించి, లక్షలాది మంది పిల్లలకు విద్యను అందిస్తూ, దేశానికి డాక్టర్లు, ఇంజనీర్లను అందిస్తున్న సంస్థను.. దేశంలో సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ జాతి ఐక్యతను కాపాడుతున్న సంస్థను.. మతం పేరుతో అరాచకం సృష్టిస్తూ మానవత్వమనేదే లేకుండా మానవ జాతిపై యుద్ధానికి దిగిన ఉగ్రవాద సంస్థతో పోల్చటం ఆయన పెద్దరికాన్ని దిగజారుస్తోంది. మెజార్టీ ఉంది కదా అని దేశాభివృద్ధికి పాటుపడే, ప్రజల సంక్షేమాన్ని చేపట్టే ముఖ్యమైన బిల్లులను అడ్డుకుంటూ.. ప్రభుత్వం పైన, ఆర్‌ఎస్‌ఎస్‌పైన అభాండాలు వేసి తప్పించుకో వాలని ఆయన చూస్తున్నారు. ఇలాంటివారిని ప్రజలు క్షమించరు. అయినా, హిందుత్వం పట్ల వారికెందుకంత అక్కసు? హిందుత్వం అనేది ఒక మతం కాదు. అదొక సంస్కృతి. ప్రపంచమంతా కుటుంబం అనుకునే ఒక భావన. హిందూ సంప్రదాయాన్ని అనుసరించటమే తమ సమస్యలకు పరిష్కారమని పాశ్చాత్యులు భావి స్తున్న నేపథ్యంలో భారతీయులు మాత్రం వ్యతిరేకిం చటం విడ్డూరం. మన సంప్రదాయాన్ని, సంస్కృతిని కించపర్చాలని చూసే కుహనా మేధావులు సిగ్గు పడాలి. తలదించుకోవాలి. భరత మాత వర్థిల్లాలి. భారతీయు లకు జయం కలగాలి. భారత్ మాతాకీ జై.. వ్యాసకర్త బీజేపీ నాయకుడు - పురిఘళ్ల రఘురామ్ ఈమెయిల్: raghuram.bjp@gmail.com -
ఎంఐఎంకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ధర్నా
ఇటిక్యాల (మహబూబ్‌నగర్ జిల్లా) : కాంగ్రెస్ నాయకులపై ఎంఐఎం దాడిని నిరసిస్తూ ఇటిక్యాల మండలం ఎర్రవల్లి చౌరస్తాలో గురువారం ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం ఎంఐఎం అధినేత అసదుద్దీన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ పార్లమెంట్ యూత్ ప్రెసిడెంట్ స్నిగ్ధారెడ్డి. శివసేనా రెడ్డి, పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంఐఎంకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
సెక్షన్ -8 అమలు చేయండి
గవర్నర్ నరసింహన్‌కు అఖిలపక్ష నేతల వినతి మజ్లిస్ ఆగడాలపై అఖిలపక్ష నేతల ఆగ్రహం జాతీయస్థాయిలో ఎండగట్టాలని నిర్ణయం ఎంపీ అసదుద్దీన్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ 3 డివిజన్లలో రీ పోలింగ్ జరిపించాలని ఈసీకి విజ్ఞప్తి టీఆర్ఎస్కు అనుకూలంగా పనిచేశారంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను విమర్శించిన చింతల గులాబీ చొక్కా వేసుకోవాలని ఎద్దేవా.. రాజ్యాంగ పదవిలో ఉన్నవారిపై అభాండాలొద్దన్న ఎంపీ వీహెచ్ సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్, మజ్లిస్ ఆగడాలను ఐక్యంగా ఎదుర్కోవాలని ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి. హైదరాబాద్‌లో శాంతి భద్రతల పరిరక్షణకు రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపర్చిన సెక్షన్ 8 అమలు చేయాలని డిమాండ్ చేశాయి. గ్రేటర్ ఎన్నికల్లో పాతబస్తీలో మూడు డివిజన్లలో రిగ్గింగ్ జరిగిందని, ఆ ప్రాంతాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని స్పష్టంచేసింది. బుధవారం శాసనసభ ఆవరణలోని కాంగ్రెస్ శాసనసభాపక్ష కార్యాలయంలో అఖిలపక్ష నేతలు సమావేశమయ్యారు. ఎంఐఎం ఆగడాలను జాతీయ స్థాయిలో ఎండగట్టాలని ఈ భేటీలో నిర్ణయించారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీపై ఎంఐఎం నేతల దాడిని తీవ్రంగా ఖండించారు. దాడికి కారకుడైన ఆ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వారంతా గవర్నర్‌ను కలిశారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలను అదుపు చేసేందుకు రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపర్చిన సెక్షన్ 8ని అమలు చేయాలని, దాడులకు పాల్పడ్డ ఎంఐఎం నేతలను అరెస్ట్ చేయాలని కోరారు. ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ అఖిలపక్ష సమావేశంలో ఎల్.రమణ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎ.రేవంత్‌రెడ్డి(టీడీపీ), కె.లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి(బీజేపీ), ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, వి.హనుమంతరావు, రామ్మోహన్ రెడ్డి, వంశీచంద్ రెడ్డి(కాంగ్రెస్), కె.శివకుమార్(వైఎస్సార్ కాంగ్రెస్) పాల్గొన్నారు. పాతబస్తీ తమ సొత్తు అన్నట్టుగా ఎంఐఎం నేతలు వ్యవహరించడాన్ని ఈ సమావేశంలో నేతలు దుయ్యబట్టారు. ఆ ప్రాంతంలో ఇతర పార్టీల నేతలను అడ్డుకోవడం ద్వారా ఎంఐఎం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తోందని విరుచుకుపడ్డారు. ఎంఐఎం ఆగడాల కారణంగా పోలింగ్ నిలిచిపోవడం, రిగ్గింగ్‌కు పాల్పడటం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. మూడు డివిజన్లలో రీ పోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డిని కోరారు. దాడికి ప్రభుత్వానిదే బాధ్యత: జానా ఎంఐఎం దాడి ప్రభుత్వ వైఫల్యానికి పరాకాష్ట అని, ఈ దాడికి సర్కారే బాధ్యత వహించాలని ప్రతిపక్ష నేత జానారెడ్డి డిమాండ్ చేశారు. అఖిలపక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంఐఎం అరాచకాలు అత్యంత హేయమైనవని, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, షబ్బీర్‌పై దాడికి పాల్పడ్డ వారిని, వారిని రెచ్చగొట్టిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా ఉపేక్షిస్తే భవిష్యత్తులో హైదరాబాద్ ప్రతిష్టకు భంగం కలుగుతుందన్నారు. హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న తరుణంలో శాంతిభద్రతల పరిరక్షణలో విఫలమైతే పెట్టుబడులు రాకుండా పోతాయని, సామాన్య ప్రజల్లోనూ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగంపై నమ్మకం సడలిపోతుందని హెచ్చరించారు. సెక్షన్ 8 ప్రకారం సంక్రమించిన అధికారాలను వినియోగించుకుని హైదరాబాద్‌లో శాంతిభద్రతలను పరిరక్షించాలన్నారు. గవర్నర్ తగిన రీతిలో స్పందించకపోతే జాతీయస్థాయిలో రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రిని కలిసి ఎంఐఎం ఆగడాలు, అరాచకాలపై ఫిర్యాదు చేస్తామన్నారు. కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో: కె.లక్ష్మణ్ పాతబస్తీలో ఎన్నికల ప్రకియ అంతా మజ్లిస్ కనుసన్నల్లోనే నడిచిందని, ఆ పార్టీ నేతల ఆదేశాల ప్రకారమే అధికారులు, పోలీసులు పనిచేశారని బీజేపీ శాసనసభా పక్షం నేత లక్ష్మణ్ ఆరోపించారు. మజ్లిస్ దాడులపై ప్రభుత్వ యంత్రాంగం వెంటనే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర గవర్నర్‌పై ఉందని, అవసరమైతే సెక్షన్ 8 ఇచ్చిన అధికారాలను వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల్లో ప్రచారం చేసుకోనివ్వకుండా అభ్యర్థులను అడ్డుకోవడం, ఇతర పార్టీలపై దాడులకు దిగి భయభ్రాంతులను చేసి రిగ్గింగ్ చేసుకోవడం మజ్లిస్‌కు అలవాటుగా మారిందని మండిపడ్డారు. ఎంపీగా ఉన్న అసదుద్దీన్ ఒవైసీ ఈ దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నాడని, వెంటనే ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్.. అభినవ నిజాం: ఎల్.రమణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పట్నుంచీ అభినవ నిజాంలా నియంతృత్వ వైఖరితో వ్యవహరిస్తున్నారని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఆరోపించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్, ఎంఐఎం దాడులు అత్యంత దుర్మార్గమని విమర్శించారు. టీడీపీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మంత్రివర్గంలో చేర్చుకోవడం, ప్రశ్నించిన ఎమ్మెల్యేలు చిన్నారెడ్డి, రామ్మోహన్‌రెడ్డిపై సభల్లోనే దాడులకు దిగడం, గ్రేటర్ ఎన్నికల్లో మజ్లిస్‌తో భౌతికదాడులు చేయించడం వంటి అప్రజాస్వామిక చర్యలకు సీఎం దిగుతున్నారని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్ మినహా ఇతర పార్టీలు ఉండొద్దన్న రీతిలో సీఎం వ్యవహరిస్తున్నారన్నారు. కేసీఆర్ ఆగడాలను అన్ని పార్టీలతో కలిసి ఐక్యంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంపై దాడి: కె.శివకుమార్ ఉత్తమ్, షబ్బీర్‌పై మజ్లిస్ దాడి చేయడం ప్రజాస్వామ్యంపై దాడి అని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ దుయ్యబట్టారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో దాడులకు పాల్పడిన మజ్లిస్ నేతలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైతే మినీ ఇండియా లాంటి హైదరాబాద్ అభివృద్ధికి విఘాతం కలుగుతుందని హెచ్చరించారు. మూడు డివిజన్లలో రీ పోలింగ్ జరపాలి: ఈసీకి వినతి ఎన్నికల్లో అక్రమాలు జరిగిన మూడు డివిజన్లలో రీ పోలింగ్ నిర్వహించాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డికి అఖిలపక్షం నేతలు వినతిపత్రం సమర్పించారు. పురానాపూల్, మన్సూరాబాద్, జంగంమెట్ డివిజన్లలో ఎన్నికల సందర్భంగా అక్రమాలు జరిగాయని వివరించారు. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిపించడంలో అధికార యంత్రాంగం విఫలమైందన్నారు. ఈ మూడు డివిజన్లలో రీ పోలింగ్ నిర్వహించాలని అఖిలపక్ష నేతలు కోరారు. సమగ్ర విచారణ జరపాలి : గవర్నర్‌కు విన్నపం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా జరిగిన అన్ని ఘటనలపై సమగ్ర విచారణ జరిపించాలని గవర్నర్ నరసింహన్‌కు అఖిలపక్ష నేతలు వినతిపత్రాన్ని సమర్పించారు. ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కె.జానా రెడ్డి, షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఫారూఖ్ హుస్సేన్, అంజన్‌కుమార్ యాదవ్, గౌస్‌ఖాన్(కాంగ్రెస్), ఎల్.రమణ, ఎర్రబెల్లి దయాకర్‌రావు(టీడీపీ), ఎన్.రామచందర్‌రావు, చింతల రామచంద్రా రెడ్డి(బీజేపీ), కె.శివకుమార్(వైఎస్సార్ కాంగ్రెస్) తదితరులు బుధవారం సాయంత్రం గవర్నర్‌తో సమావేశమయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా పాతబస్తీలో అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులపై జరిగిన దాడిని వివరించారు. మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఒవైసీ, పాషా ఖాద్రీ, బలాలా, వారి అనుచరులు దాడులకు దిగారని ఫిర్యాదు చేశారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, రాష్ట్ర మంత్రులు కూడా ఈ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు. అన్ని ఘటనలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరారు. జంగంమెట్‌లో ఎస్సీకి చెందిన మహేందర్ అనే అభ్యర్థిని దూషిస్తూ, దాడికి దిగినవారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయాలని డిమాండ్ చేశారు. చింతల వర్సెస్ వీహెచ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వి.నాగిరెడ్డిని అఖిలపక్ష నేతలు కలిసిన సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంతరావు మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ‘గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు అనుకూలంగా పనిచేశావు.. గులాబీ చొక్కా వేసుకో..’ అని కమిషనర్ నాగిరెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నాగిరెడ్డి నొచ్చుకున్నారు. ‘మీరలా మాట్లాడితే నేను చేయగలిగిందేం లేదు..’ అని బదులిచ్చారు. ఈ దశలో కాంగ్రె స్ ఎంపీ వి.హనుమంతరావు జోక్యం చేసుకుని రాజ్యాంగ పదవిలో ఉన్నవారి పట్ల అనుచితంగా మాట్లాడటం మంచిది కాదన్నారు. దీంతో చింతలకు, వీహెచ్‌కు మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. అఖిలపక్ష నేతలు సముదాయించడంతో వివాదం సద్దుమణిగింది. -
'హైదరాబాద్‌ను అభివృద్ధి చేసేది టీడీపీ-బీజేపీనే'
హైదరాబాద్: హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసేది టీడీపీ, బీజేపీనేనని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ, బీజేపీ ఒక జట్టు, టీఆర్ఎస్, ఎంఐఎం ఒక జట్టుగా ఆయన పేర్కొన్నారు. బుధవారం రేవంత్ హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ టీఆర్ఎస్కు ఓటేస్తే ఎంఐఎంకు వేసినట్లేనని అన్నారు. భారతదేశాన్ని పది నిమిషాల్లో శ్మశానంగా మారుస్తానన్న వారికి ఓటు వెయ్యాలా వద్దా అనేది ఓటర్లు ఆలోచించుకోవాలని ఆయన అన్నారు. కాంగ్రెస్‌కు ఓటేసినా పరోక్షంగా ఎంఐఎంకే ఓటేసినట్లు అవుతుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ పాత్రేంటో ఆయనకే తెలియదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. -
ఎంఐఎం అవకాశవాద పార్టీ: వీహెచ్
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ వి.హనుమంతరావు.. ఒవైసీ కుటుంబం మీద, ఎంఐఎం పార్టీ మీద విరుచుకుపడ్డారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎంఐఎం అవకాశవాద పార్టీ అని, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చాలా లాభపడిందని..కానీ ఇప్పుడు టీఆర్ఎస్ గెలవగానే ఆ పార్టీ పంచన చేరిందని అన్నారు. కాంగ్రెస్ వల్ల దారూసలాంతోపాటు ఒవైసీ కుటుంబానికి పలు విద్యాసంస్ధలు చేకూరాయని, అలాంటి ఒవైసీ కుటుంబం పేద ముస్లింలకు చేసిందేమిటో చెప్పాలని ఆయన పశ్నించారు. ఆ మాటకొస్తే అసలు ఒవైసీ కుటుంబానిది హైదరాబాదే కాదని అన్నారు. వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నా ఎంఐఎం ఏనాడూ పట్టించుకోలేదని వీహెచ్ దయ్యబట్టారు. -
కిష్టారెడ్డి తనయుడికే పార్టీ టికెట్: ఉత్తమ్
న్యూఢిల్లీ: వరంగల్ ఉప ఎన్నిక ఫలితాలు తమకు బాధ కలిగించాయని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్‌తో భేటీ అనంతరం ఆయన సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. వరంగల్ ఓటమి, ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించినట్లు తెలిపారు. ఇతర పార్టీల సహకారం తీసుకుని శాసన మండలి ఎన్నికల్లో ముందుకు వెళతామన్నారు. సమన్వయ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఉత్తమ్ తెలిపారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్ శాసనసభ ఉప ఎన్నికలో దివంగత మాజీ ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి కుమారుడే పార్టీ అభ్యర్థి అని ఆయన వెల్లడించారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంఐఎంతో ఎలాంటి పొత్తు ఉండదని స్పష్టం చేశారు. -
కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం షాక్
మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్-ఎన్సీపీ కూటమికి మజ్లిస్ పార్టీ షాకిచ్చింది. అక్కడ ప్రధాన ప్రతిపక్ష హోదాను సాధించింది. మొత్తం 113 స్థానాలున్న ఔరంగాబాద్ కార్పొరేషన్లో బీజేపీ- శివసేన కూటమి 51 స్థానాలు సాధించి అతిపెద్ద కూటమిగా అవతరించింది. మజ్లిస్ పార్టీ ఒక్కటే 25 స్థానాలు పొందింది. కాంగ్రెస్ పార్టీ కేవలం 10 చోట్ల మాత్రమే గెలవగా, దాని మిత్రపక్షమైన ఎన్సీపీ మూడు చోట్లే జయకేతనం ఎగరేసింది. మరో 24 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు, ఇతర చిన్న పార్టీల వాళ్లు గెలిచారు. బీజేపీ కూటమి అతిపెద్ద పార్టీగా అవతరించినా, దానికి సాధారణ మెజారిటీ కంటే ఆరు స్థానాలు తగ్గాయి. దాంతో స్వతంత్రులు లేదా ఇతర చిన్న పార్టీల అభ్యర్థుల మద్దతు తప్పనిసరి అవుతోంది. -
‘రిజర్వేషన్ల’ మాటున విస్తరణ యత్నాలు
నేడు ముంబైలో ఎంఐఎం సభ సాక్షి, ముంబై: మరాఠాలకు ఇస్తున్నట్టుగానే ముస్లిమ్‌లకు కూడా విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్‌పై రాష్ట్రమంతటా సభలు నిర్వహిస్తున్న ఎంఐఎం క్రమంగా పార్టీ పునాదులను పటిష్ట పరచుకుంటోంది. నగరంలోని నాగపాడ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఎంఐఎం సభ ఏర్పాటు చేసింది. అయితే ఈ సభలో ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీకి బదులుగా ఆయన సోదరుడు, తెలంగాణ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ పాల్గొననున్నారు. ఈ సభకు పోలీసుల అనుమతి కూడా లభించింది. పుణేలో బహిరంగ సభకు అనుమతి లభించనప్పటికీ నాలుగు గోడల మధ్య ఓ హాలులో రెండు వేల మంది మద్దతుదారులతో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సభను కొనసాగించారు. అయితే పుణే పోలీసులు ఎంఐఎం సభకు అనుమతి నిరాకరించడం ద్వారా ఆ పార్టీ కోరుకున్న దానికంటే పరోక్షంగా అధిక ప్రచారం కల్పించారు. పుణేలో బహిరంగసభకు అడ్డు తగిలిన శివసేన నాగపాడ విషయంలో ఎలా స్పందిస్తుందన్న దానిపైనే ఉత్కంఠ నెలకొంది. విస్తరణలో బాగంగానే.... మహారాష్ట్రలో ఎంఐఎం పార్టీని విస్తరించేందుకు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాలను కైవసం చేసుకున్న అనంతరం ఎంఐఎంలో నూతన ఉత్సాహం కన్పిస్తోంది. ఇదివరకు హైదరాబాద్ నగరానికే పరిమితమైన మజ్లిస్ పార్టీ అటు తెలంగాణలో ఇటు మహారాష్ట్రలోనూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలో 24 సీట్లలో పోటీ చేసిన ఎంఐఎం రెండింట్లో గెలుపొందడమే కాకుండా అనేక స్థానాల్లో ద్వితీయ, తృతీయ స్థానాల్లో తన సత్తా చాటుకుంది. ఇక మాలేగావ్‌లో డిప్యూటి మేయర్ పదవిని కూడా ఆ పార్టీకి చెందిన వ్యక్తి నిర్వహిస్తున్నారు. దీంతో రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కూడా తమ సత్తా చాటుకోవాలని భావిస్తున్న ఎంఐఎం ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ముంబైలోని ముంబాదేవి, తూర్పు బాంద్రా, కుర్లా, వర్సోవాలతోపాటు ఠాణే జిల్లాలోని తూర్పు భివండీ, ముంబ్రా-కల్వా తదితర అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంఐఎం అభ్యర్థులు తృతీయ స్థానంలో నిలిచారు. దీన్నిబట్టి 2017లో జరగబోయే ముంబై, ఠాణే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఎంఐఎం పార్టీ ప్రభావం చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. -
'జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిపోరు'
హైదరాబాద్: మహారాష్ట్రలో ఎంఐఎం పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా వ్యవహరించారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. ఢిల్లీలో జరగనున్న ఎన్నికల్లో బీజేపీకి లాభం చేకూరేలా ఎంఐఎం పోటీ చేయబోతోందని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందని వెల్లడించారు. అన్ని డివిజన్లలో తమ పార్టీకి బలమైన అభ్యర్థులు ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ మొదటి నుంచి మతతత్వ శక్తులతో శక్తులతో పోరాడుతూనే ఉందని దిగ్విజయ్ గుర్తుచేశారు. -
ఎంఐఎంకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ
నాందేడ్, న్యూస్‌లైన్: ఎంఐఎం పార్టీని నిషేధించాలంటూ వివిధ పార్టీలు గురువారం భారీ ర్యాలీ నిర్వహించాయి. దీంతో పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, శివసేన, హిందూరక్ష, ఎమ్మెన్నెస్ తదితర పార్టీల ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. పట్టణంలోని మహవీర్ చౌక్‌లోని పంచముఖి హనుమాన్ మందిరంలో తొలుత హారతి కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం ఈ ర్యాలీ ప్రారంభించారు. ముందుగా నిర్దేశించిన ప్రకారం గాడిపురలోని మాతా రేణుకాదేవి మందిరం నుంచి ర్యాలీ ప్రారంభం కావాల్సి ఉంది.అయితే పోలీసు శాఖ అందుకు నిరాకరించడంతో మహావీర్ చౌక్ నుంచి చేపట్టారు. ముందుజాగ్రత్తగా అనేక మంది వ్యాపారులు తమ దుకాణాలను మూసివేశారు. డీఎస్పీ, ముగ్గురు పోలీసు ఇన్స్పెక్టర్లు, ఎనిమిది మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 350 మంది పోలీసులతోపాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ట్రాఫిక్ సిబ్బంది కూడా బందోబస్తు బాధ్యతల్లో పాలుపంచుకున్నారు. ర్యాలీ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకున్న అనంతరం ధర్నా చేశారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌తోపాటు ఎంఐఎం పార్టీకి వ్యతిరేకంగా నినదించారు. కాగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో హిందూ దేవతలను అవమానపరిచే విధంగా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు చేశారని, అందువల్ల ఆ పార్టీని నిషేధించాలని ఆందోళనకారులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. గతంలో ఎంఐఎం పార్టీ కార్యకర్తలు చేసిన అనేక దాడుల్లో హిందువులు గాయపడ్డారని, వివిధ హత్యలు, నేరాల్లో అరెస్టయిన వారిలో కూడా వారే ఉన్నారని ఆరోపించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ధీరజ్‌కుమార్‌కు ఓ వినతి పత్రం అందజేశారు. -
వచ్చే ఏడాది జనవరిలో ఎంఐఎం మహిళా శాఖ
సాక్షి, ముంబై: ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో రెండు స్థానాలు గెలుచుకున్న ఎంఐఎం రాష్ట్రంలో పార్టీని మరింత విస్తరించేందుకు నడుం బిగించింది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది జనవరిలో ఆ పార్టీ తొలి మహిళా శాఖను నగరంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ముస్లిం మహిళల సారథ్యానికి ప్రాధాన్యమివ్వాలనే ఆలోచనలో భాగంగాపూ ఈ శాఖను ప్రారంభిస్తున్నట్లు ఆ పార్టీ నాయకులు చెప్పారు. కేవలం ముస్లింలే కాకుండా ఇతర మతాలకు చెందిన మహిళల సమస్యలపై చర్చించి వారికి న్యాయం జరిగేలా చేస్తామని ఇటీవల బైకలా నియోజక వర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే వారిస్ యూసుఫ్ పఠాన్ తెలిపారు. మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు, ఆరోగ్యం, విద్య, ఉపాధి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని పఠాన్ తెలిపారు. మిహ ళా శాఖను తొలుత రాష్ట్ర రాజధానిలో ప్రారంభిస్తామని, ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం తమ పార్టీ హైదరాబాద్‌లో పుంజుకుంటోందని, తాజాగా మహారాష్ట్రంలో రెండు స్థానాలు గెలుచుకోవడం ఇది శుభ సూచకమని ఆయన పేర్కొన్నారు. -
ఎంఐఎం ఎంట్రీతో ప్రధాన పార్టీల బెంబేలు
సాక్షి, ముంబై: ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎంఐఎం రెండు సీట్లు గెలుచుకోవడంతో ఇప్పటివరకు ముస్లిం ఓట్లపై ఆధారపడిన వివిధ పార్టీలు ఇబ్బందుల్లో పడిపోయాయి. హైదరాబాద్‌కు చెందిన ఎంఐఎం పార్టీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 24 మంది అభ్యర్థులను బరిలో దింపింది. ఇందులో ఇద్దరు అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుపొందారు. మిగతా చోట్ల కూడా ఆ పార్టీ అభ్యర్థులు రెండు, మూడో స్థానంలో నిలి చారు. ఈ ఫలితాలవల్ల రాష్ట్రంలో ఎంఐఎం పార్టీకి మంచి పట్టు సంపాదించిందని స్పష్టమైంది. దీంతో ఇప్పటివరకు మైనార్టీల ఓట్లపై ఆధారపడుతున్న పార్టీలు ఖంగుతిన్నాయి. తమ పార్టీకి ఎవరు ఓటు వేసినా...వేయకపోయినా మైనార్టీల ఓట్లు మాత్రం తప్పకుండా వస్తాయనే ధీమాతో ఉన్న పార్టీలు వచ్చే ఎన్నికల నుంచి మైనారిటీ ఓట్లపై ఆశ వదులుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ముఖ్యంగా దీని ప్రభావం కాంగ్రెస్ పార్టీపై చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బైకలా, ఔరంగాబాద్ శాసన సభ నియోజక వర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులకు భారీగా ఓట్లు వేయడంతో రాష్ట్రంలో ఖాతా తెరిచారు. అలాగే ముంబాదేవి, తూర్పు బాంద్రా, కుర్లా, వర్సోవా, తూర్పు భివండీ, ముంబ్రా-కల్వా, ఉత్తర నాందేడ్, దక్షిణ నాందేడ్, షోలాపూర్ సిటీ తదితర నియోజక వర్గాలలో ఆ పార్టీ అభ్యర్థులు మూడో స్థానంలో నిలిచారు. దీని బట్టి చూస్తే వచ్చే ముంబై, ఠాణే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఎంఐఎం ప్రభావం చూపే అవకాశముంది. -
కాంగ్రెస్ పార్టీకి ఎమ్ఐఎమ్ స్ట్రోక్
-
'తెలంగాణ ప్రభుత్వంలో చేరాలనే ఆసక్తి లేదు'
-
'తెలంగాణ ప్రభుత్వంలో చేరాలనే ఆసక్తి లేదు'
తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసే ప్రభుత్వంలో చేరాలనే ఆసక్తి తమకు లేదని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీతో పాటు చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్‌లో ఓవైసీ సోదరులు టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఓవైసీ సోదరులు మీడియాతో మాట్లాడుతూ... హైదరాబాద్ నగర అభివృద్ధే తమ లక్ష్యమన్నారు. రూ. వెయ్యి కోట్లతో భాగ్యనగరం అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు కేసీఆర్‌కు అందజేసినట్లు చెప్పారు. తాము ఆశించిన స్థాయిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అభివృద్ధి జరగడం లేదని ఓవైసీ ఈ సందర్బంగా ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నంలో చార్మినార్ చిహ్నంగా ఉంచాలని కేసీఆర్‌ను కోరినట్లు ఓవైసీ సోదరులు వెల్లడించారు. -
నిరాశే మిగిలింది
నిజామాబాద్‌సిటీ, న్యూస్‌లైన్ : నిజామాబాద్ కార్పొరేషన్ ఈ దఫా కూడా కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నం విఫలమైంది. మేయ ర్ పీఠాన్ని రెండవ సారి దక్కిం చుకునేందుకు ఆ పార్టీ వుహ్యరచన చేసింది. వారం రోజుల క్రి తం కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల అభ్యర్థులను మహారాష్ట్రకు తీసుకువెళ్లారు. కార్పొరేషన్ ఎన్నిక ల్లో ఆయా పార్టీలు గెలుచుకున్న స్థానాలు పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్తో జతకడితే మేయరు స్థానాన్ని కైవసం చేసుకుంటుదని అంతా భావించారు. కాని గత సోమవారం హై దరాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎంతో పొత్తు ఖరారు కావటంతో మున్సిపల్ కార్పొరేషన్లో పరిస్థితులు చిన్నాభిన్నమైనవి. ఎంఐఎం పార్టీకి కూడా కాంగ్రెస్ పార్టీతో సమానంగా 16 సీట్లు వచ్చాయి. దాంతో ఎంఐ ఎం నిజామాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీ కి మద్దతు తెలిపి పొ త్తులో భాగంగా బోధన్ చైర్మన్ పదవి ఎంఐఎం తీసుకోనుంది. మారిన ఈ సమీకరణాల తో మొదటినుంచి నిజామాబాద్ మే యర్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీయే కైవ సం చేసుకుంటుందనుకు న్న ఆ పార్టీ నేతలు ఖంగుతిన్నారు. మున్సిపల్ ఎ న్నికల ఫలితాలు వెలువడిన మరుక్ష ణం నుంచే మేయర్ స్థా నాన్ని దక్కిం చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పలు వి దాలుగా ఆలోచన చేసినప్పటికి ఫలి తం లేకుండాపోయింది. టీఆర్ఎస్ త మకే మద్దతు ఇస్తుందనుకున్న ఆ పా ర్టీకి టీఆర్ఎస్ షాక్ ఇ చ్చింది. టీఆర్ఎస్ ఎంఐఎం పార్టీల పొత్తు ఖరారు అయిన నేపథ్యంలో మహారాష్ట్రలో మేయర్ అభ్యర్థి కాపర్తి సుజాత ఆధ్వర్యంలో విహారయాత్రకు వెళ్లిన వా రిని తక్షణమే నిజామాబాద్‌కు రావాల్సిందిగా పార్టీనుంచి ఆదేశాలు వెళ్లటంతో కార్పొరేటర్లు మంగళవారం తెల్లవారుజామున నిజామాబాద్‌కు చేరుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మేయర్ పదవిని దక్కించుకునేందు కు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలు ఫలించకపోవటంతో పార్టీ నాయకు లు, కార్యకర్తలు డీలా పడిపోయారు. నగరంలో 2004లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచింది. అనంత రం 2005లో కార్పొరేషన్ ఎన్నికల్లో 31 స్థానాలు గెలుచుకుని మేయర్ ప దవిని కైవసం చేసుకుంది. ఇలా 200 4 నుంచి 2010 వరకు నగరంలో కాం గ్రెస్ పార్టీ తన అధిపత్యాన్ని కొనసాగించింది. ఇప్పుడు నగరంలో కాంగ్రె స్ పార్టీ ఏవిధంగా ముందుకు వెళ్తుం దోనని ప్రజలు అసక్తిగా చూస్తున్నారు. -
అక్బరుద్దీన్‌పై దాడులు జరిగితే ఊరుకోం
ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్ హెచ్చరిక నాంపల్లి, న్యూస్‌లైన్ : చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసిపై దాడులు జరిగితే ఊరుకోమని, హైదరాబాద్ అగ్నిగుండంలా మారుతుందని నాంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్ అన్నారు. ఆదివారం రాత్రి దారుస్సలాంలోని ఎంఐఎం పార్టీ కార్యాలయంలో జరిగిన మజ్లిస్ ఎమ్మెల్యేల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం మైనార్టీలపై దాడులు పెరుగుతాయన్నారు. ఇప్పటికే అక్బరుద్దీన్ ఒవైసిని టార్గెట్‌గా చేసుకుని హతమార్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అక్బరుద్దీన్‌కు ఎలాంటి హాని జరిగినా తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పూర్తి బాధ్యత వహించాలన్నారు. మోడీ అధికారంలోకి వస్తే సరిపోదని ఇలాంటి వారు ఎంతోమంది వచ్చిపోయారని ఎద్దేవా చేశారు. జడ్ ప్లస్ భద్రతను కల్పించాలి అక్బరుద్దీన్ ఒవైసీకి జడ్ ప్లస్ క్యాటగిరీ భద్రతను కల్పిం చాలని ఎంఐఎం నేత నార్ల మోహన్‌రావు డిమాండ్ చేశారు. సోమవారం నాంపల్లి నియోజకవర్గం పోచమ్మ బస్తీలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పార్టీ నేతలు వేణుగోపాల్, స్వరూపరాణితో కలిసి ప్రసంగించారు. అక్బరుద్దీన్‌పై దాడి కుట్రను తీవ్రంగా ఖండించారు. అసదుద్దీన్, అక్బరుద్దీన్‌లకు ఎలాంటి హాని జరిగినా దానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి పనిచేస్తామని పేర్కొన్నారు. మోడీ హవా వీస్తున్న సమయంలో ఎంపీగా పోటీ చేశానని, ఈ తుఫాన్లో గెలిచే అవకాశం లభించలేదని చెప్పారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం మీద తనకు ఒక లక్షా యాభై వేలు ఓట్లు వచ్చాయని తెలిపారు. ఎంఐఎం పార్టీ తరపున పోటీ చేసిన తనకు ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో గెలిచినా, ఓడినా ప్రజలతోనే ఉంటానని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు. మజ్లిస్ పార్టీ నాయకునికి బెదిరింపు కాల్ చార్మినార్: తనకు ఆదివారం రాత్రి బెదిరింపు కాల్ వచ్చిందని మజ్లిస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రవీణ్ నావేందర్ హుస్సేనీఆలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహారాష్ట్రలోని ధర్మబాద్ నుంచి శ్రీను అని పేరు చెప్పి ఫోన్ చేశారని, ఒకరి తర్వాత మరొకరు ముగ్గురు అగంతకులు ఆరు నిమిషాల పాటు అసభ్యకరమైన పదజాలంతో చంపేస్తామంటూ బెదిరించారని ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ అగంతకుల ఫోన్ కాల్‌ను పూర్తిగా రికార్డు చేశానని... దీనిని హుస్సేనీఆలం ఇన్స్పెక్టర్కు అందజేశానని తెలిపారు. -
శివారు తీర్పు.. విలక్షణం
సరూర్‌నగర్‌లో ఎంఐఎం రికార్డు రాజేంద్రనగర్‌లో స్వతంత్రులదే కీలక పాత్ర కుత్బుల్లాపూర్‌లో ఖాతా తెరిచిన వైఎస్సార్సీపీ హయత్నగర్లోటీడీపీకి చాన్స్ ఘట్కేసర్లో కారు జోరు సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో శివారు ఓటర్లు విలక్షణ తీర్పునిచ్చారు. మంగళవారం విడుదలైన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలపై నగరంలో ఆద్యంతం ఉత్కంఠ నె లకొంది. హోరాహోరీగా జరిగిన స్థానిక పోరులో ప్రధాన రాజకీయ పార్టీల జాతకాలు తారుమార య్యాయ్యన్న సంకేతాలు వెలువడ్డాయి. మరో రెండు రోజుల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో జరిగిన ఈ కౌంటింగ్‌పై అన్ని వర్గాలు ఆసక్తి చూపాయి. స్థానిక పోరులో మొన్నటివరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి శివారు ఓటర్లు షాక్‌నిచ్చారు. రాజేంద్రనగర్ , సరూర్‌నగర్ మండలాల్లో స్వతంత్రుల మద్దతు లేనిదే మండల ప్రజాపరిషత్ అధ్యక్ష స్థానాలను హస్తం పార్టీ చేజిక్కించుకునే అవకాశాలు లేని పరిస్థితి నెల కొంది. కుత్బుల్లాపూర్ ఎంపీపీ పదవిని తెలుగుదేశం కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మండలంలో అత్యంత కీలకమైన నిజాంపేట్ ఎంపీటీసీ పదవిని వైఎస్సార్సీపీ గెలుపొందడం విశేషం. ఇక ఘట్కేసర్ మండలంలో టీఆర్ఎస్ దూకుడు ప్రదర్శించింది. ఓటర్లు ఆ పార్టీ అభ్యర్థులను 18 ఎంపీటీసీ స్థానాల్లో గెలిపించడంతో ఎంపీపీ పదవిని గులాబీ దళం గెలుచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. స్థానిక తీర్పు నేపథ్యంలో శివార్లలోని పలు మండలాల్లో తాజా పరిస్థితి ఇదీ.. కుత్బుల్లాపూర్: మండలంలో 33 ఎంపీటీసీ స్థానాలుండగా.. టీడీపీ 17 స్థానాలను గెలుపొంది అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఆ తరువాత స్థానంలో నిలిచిన కాంగ్రెస్ ఐదు చోట్ల గెలుపొందింది. బీజేపీ 2 స్థానాల్లో నెగ్గింది. స్వతంత్రులు 8 చోట్ల గెలుపొంది అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ మండలంలో కీలకమైన నిజాంపేట్ ఎంపీటీసీ స్థానాన్ని వైఎస్సార్సీపీ గెలుపొంది రికార్డు సృష్టించింది. హయత్‌నగర్: ఈ మండలంలో 23 ఎంపీటీసీ స్థానాలుండగా.. కాంగ్రెస్ 9 స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించింది. టీడీపీ 8, బీజేపీ 4 స్థానాల్లో గెలుపొందాయి. ఈ రెండు పార్టీల కూటమి ఎంపీపీ పదవిని కైవసం చేసుకునే అవకాశాలున్నాయి. ఇక స్వతంత్రులు రెండు స్థానాల్లో గెలుపొందారు. ఘట్కేసర్: మండలంలో మొత్తం 46 ఎంపీటీసీ స్థానాలుండగా.. టీఆర్ఎస్ 18 స్థానాల్లో గెలుపొందడంతో కారు జోరు సుస్పష్టమైంది. ఇక్కడ ఎంపీపీ పదవిని గులాబీ పార్టీ చేజిక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా టీడీపీ 13 ఎంపీటీసీ స్థానాలతో ద్వితీయస్థానం సాధించింది. కాంగ్రెస్ 9 చోట్ల, బీజేపీ 3 చోట్ల, స్వతంత్రులు మూడు చోట్ల గెలుపొందారు. రాజేంద్రనగర్: మండలంలో మొత్తం 22 ఎంపీటీసీలకుగాను కాంగ్రెస్ పార్టీ 10 స్థానాల్లో గెలుపొంది పెద్ద పార్టీగా అవతరించినా.. స్వతంత్రులుగా గెలుపొందిన నలుగురు అభ్యర్థుల మద్దతు లేనిదే ఎంపీపీ పోస్టు దక్కించుకోవ డం కష్టసాధ్యమే. ఈ మండలంలో టీడీపీ ఏడు, బీజేపీ ఒక ఎంపీటీసీ స్థానాన్ని దక్కించుకున్నాయి. కా గా మండలంలో భారీ స్థాయిలో చెల్లని ఓట్లు నమోదయ్యాయి. 22 ఎంపీటీసీ స్థానాల్లో 1349 ఓట్లు, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపులో 1434 ఓట్లు చెల్లని ఓట్లుగా నమోదయ్యాయి. వీటి కారణంగా అభ్యర్థుల ఫలితాలు తారుమారయ్యాయి. సరూర్‌నగర్: మండలంలో మొత్తం 49 స్థానాలుండగా.. ఎంఐఎం ఏకంగా 14 ఎంపీటీసీ స్థానాలు గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. కాంగ్రెస్ 12, టీడీపీ 10, బీజేపీ 8, సీపీఐ 2, స్వతంత్రులు మూడు చోట్ల గెలుపొం దారు. స్వతంత్రులు, సీపీఐ మద్దతుతోనే కాం గ్రెస్ ఎంపీపీ పదవిని చేజిక్కించుకునే అవకాశాలున్నాయి. కాగా సార్వత్రిక ఎన్నికల్లో మహేశ్వరం నియోజకర్గం నుంచి ఏ పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే అదే పార్టీ అభ్యర్థి ఎంపీపీ పదవిని దక్కించుకునే అవకాశాలూ కనిపిస్తున్నాయి. -
పాగా వేద్దాం..!
పాతబస్తీ నుంచి న్యూసిటీలోకి మజ్లిస్ 18 అసెంబ్లీ, మూడు లోక్‌సభ స్థానాలకు పోటీ బీసీ,ఎస్సీ,క్రిస్టియన్లకు రెండు లోక్‌సభ, ఐదు అసెంబ్లీ సీట్లు మహిళలకు దక్కని ప్రాధాన్యం సాక్షి,సిటీబ్యూరో: ఇప్పటివరకు పాతబస్తీకే పరిమితమైన మజ్లిస్ పార్టీ ఈసారి గ్రేటర్‌వ్యాప్తంగా ఎన్నికల బరిలో దిగింది. మొత్తం మూడు లోక్‌సభ, 18 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈసారి జరుగుతున్న ఎన్నికలు రసవత్తరంగా ఉండడంతో సాధ్యమైనంత వరకు పోటీలో ఉంచింది. ఎస్సీ,బీసీ,మైనార్టీ ఐక్యత పేరుతో లోక్‌సభ,అసెంబ్లీ సీట్ల కేటాయింపులో ఆయా సామాజికవర్గాలకు తగిన ప్రాధాన్యం కల్పించింది. గ్రేటర్లో మొత్తం 24 నియోజకవర్గాలకుగాను పోటీకి దిగిన 18 స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపగా..అందులో ఐదుస్థానాలను బీసీ,ఎస్సీ,క్రిస్టియన్ మైనార్టీలకు కేటాయించి, మిగిలిన 13 సీట్లలో ముస్లిం మైనార్టీలకు ప్రాధాన్యం కల్పించింది. రెండు లోక్‌సభ, ఐదు అసెంబ్లీల్లో : మజ్లిస్ పార్టీలో బీసీ,ఎస్సీ,క్రిస్టియన్ మైనార్టీవర్గాలకు రెండు లోక్‌సభ, ఐదు అసెంబ్లీసీట్లు దక్కాయి. సికింద్రాబాద్ లోక్‌సభ నుంచి దళితుడైన నార్ల మోహన్‌రావు, మల్కాజిగిరి లోక్‌సభకు వెనుకబడిన తరగతులకు చెందిన దివాకర్ ధరణికోటలకు అవకాశం కల్పించింది. అంబర్‌పేట, ఉప్పల్ నియోజకవర్గాల నుంచి దళితులైన నలిగంటి శరత్, యుగేందర్లకు అవకాశం దక్కగా, జూబ్లీహిల్స్ స్థానానికి చిన్నశ్రీశైలంయాదవ్ కుమారుడైన నవీన్‌యాదవ్, మల్కాజిగిరి సీటు ధరణికోట సుధాకర్‌కు కేటాయింపుతో బీసీలకు ప్రాధాన్యం కల్పించినట్లయ్యింది. అలాగే సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి క్రిస్టియన్ మైనార్టీవర్గానికి చెందిన జెమ్స్సిల్వెస్టర్కు అవకాశం కల్పించారు. ఐదుగురు సిట్టింగులే : నగరంలో మజ్లిస్ పార్టీ తరఫున ఒక ఎంపీ, ఐదుగురు ఎమ్మెల్యేలు తిరిగి సిట్టింగ్ స్థానాల నుంచే నామినేషన్ల దాఖలు చేశారు. అదేవిధంగా జీహెచ్ఎంసీ కార్పొరేటర్‌తోపాటు మరో కార్పొరేటర్ భర్త అసెంబ్లీస్థానాలకు, మరో మాజీకార్పొరేటర్ భర్త లోక్‌సభ నుంచి పోటీలో ఉన్నారు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి రెండుసార్లు ప్రాతినిధ్యం వహించిన అసదుద్దీన్ ఒవైసీ మళ్లీ బరిలో దిగారు. చాంద్రాయణగుట్ట నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ, చార్మినార్ నుంచి పాషాఖాద్రీ, మలక్‌పేట నుంచి అహ్మద్బలాల, యాకుత్‌పురా నుంచి ముంతాజ్‌ఖాన్, బహుదూర్‌పురా నుంచి మోజంఖాన్‌లు మరోమారు అదృష్టం పరీక్షించుకోనున్నారు. మరో రెండు సిట్టింగ్ స్థానాలైన కార్వాన్ నుంచి కార్పొరేటర భర్త కౌసర్ మొయినోద్దీన్, నాంపల్లి నుంచి డిప్యూటీ మాజీమేయర్, కార్పొరేటర్ జాఫర్‌హుస్సేన్ మేరాజ్లు తలపడుతున్నారు. సాధారణ కార్యకర్తలకే : ఈసారి ఎన్నికల్లో పార్టీ సాధారణ కార్యకర్తలకు కూడా అవకాశం కల్పించింది. సిట్టింగ్ స్థానాలను వదిలి మిగిలిన లోక్‌సభ,అసెంబ్లీ స్థానాలకు కొత్తవారినే బరిలోకి దించింది. శేరిలింగంపల్లి నుంచి నజీర్‌ఖాన్, పటాన్చెరు నుంచి సయ్యద్హ్రమత్, కుత్బుల్లాపుర్ నుంచి మహ్మద్గౌసోద్దీన్, మహేశ్వరం నుంచి షేక్‌అహ్మద్, ముషీరాబాద్ నుంచి ఖాసీంషాహీన్, రాజేంద్రనగర్ నుంచి జాకీర్ హుస్సేన్జావిద్లకు అవకాశం దక్కింది. ఇప్పటివరకు ఉన్న స్థానాలతోపాటు ఈసారి కొత్తగా సీట్లను కైవసం చేసుకునేందుకు పార్టీ శ్రేణులు సమాయత్తమవుతున్నారు. -
దళితులు, ముస్లింలు ఏకం కావాలి
ఎదులాపురం/కాగజ్‌నగర్, న్యూస్‌లైన్ : రాజ్యాధికారం సాధించాలంటే దళితు లు, వెనుకబడిన తరగతులవారు, ముస్లింలు ఏకం కావాలని ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం భాగంగా బుధవారం ఆదిలాబాద్‌లోని తిర్పెల్లి, కాగజ్‌నగర్‌లోని సంతోష్ ఫంక్షన్హాల్లో నిర్వహించిన సభల్లో ఆయన మాట్లాడారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో దళితులు, ముస్లింలు ఒక్కటయ్యారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ టీర్ఎస్ ముస్లిం లకు చేసిందేమీ లేదని విమర్శించారు. ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధిస్తే రైల్వే ఓవర్‌బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తానని హామీనిచ్చారు. పట్టణంలో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణం చేపడుతామని అన్నారు. ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలను తొలగించినప్పుడు ఏ పార్టీ నాయకులు చిరువ్యాపారులకు అం డగా నిలువలేదని, జిల్లా ఇన్చార్జి ఫా రుఖ్‌అహ్మద్ నిరాహార దీక్ష చేపట్టార ని గుర్తు చేశా రు. ఎంపీ, ఎమ్మెల్యేలకు దమ్ముంటే ఎంఐఎం అభ్యర్థులు బరిలో ఉన్న స్థానాల్లో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. ఆదిలాబాద్ చరిత్రలో మసూద్ అహ్మద్ ఒక్కరే ఎమ్మెల్యేగా ఉండిపోయారని, ఇది ముస్లింలకు అన్యాయం కాదా అని దు య్యబట్టారు. 2006 జెడ్పీటీసీ ఎన్నికల్లో జిల్లాలోని 52 మండలాల్లో ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా ఏ రాజకీయ పార్టీలు గెలిపించుకోలేదని అన్నారు. 12.5శాతం జనాభా ఉన్నారని, కొన్ని చోట్ల మైనార్టీ ఓటర్లు కీలక భూమిక పోషిస్తున్నారని చెప్పారు. బీజేపీ మతతత్వ పార్టీ అని, సామాన్య ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే ఆ పార్టీ నాయకత్వాన్ని తరిమికొట్టాలని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. తెలంగాణ అభివృద్ధిపై ఆలోచించకుండా అన్ని పార్టీలు తామే తెలంగాణ తెచ్చామని గొప్పలకు పోతూ ఓట్ల కోసం వెంపర్లాడుతున్నాయని విమర్శించారు. కాగా, ఆదిలాబాద్‌లోని తాటిగూడలో ఉన్న మసీదులో ప్రార్థనలు చేశారు. అనంతరం వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా ఇన్చార్జి ఫారుఖ్ అహ్మద్, హైదరాబాద్ కార్పొరేటర్ సమద్ వరాసి, ఎంఐఎం నాయకులు జాకీర్ ఖురేషి, జావిద్, జమీర్, ముజీబ్, నయీం, గఫ్ఫార్, మల్లిక్, నియాజ్, వసీఖాన్, షేరు అహ్మద్ పాల్గొన్నారు. కాగజ్‌నగర్‌లో మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. -
'పతంగి' తెగిపోనుంది..!
-
ఎంఐఎంకు ‘గుర్తు’ తిప్పలు
సాక్షి, హైదరాబాద్: ఎంఐఎం పార్టీకి ప్రతిసారి ఎన్నికల్లో ‘ఎవ్వరికీ కేటాయించని’ చిహ్నాల్లో (ఫ్రీ సింబల్స్) పతంగిని ఎన్నికల కమిషన్ కేటాయిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఎంఐఎం.. చిహ్నం కోసం ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించడంలో జాప్యం చేసింది. దీంతో పతంగి కోసం దరఖాస్తు చేసుకున్న సమైక్యాంధ్ర పరిరక్షణ సమితికి ఆ చిహ్నాన్ని ఎన్నికల కమిషన్ కేటాయించింది. రాష్ట్రంలోని 294 అసెంబ్లీ, 42 లోక్ స్థానాలకు పతంగి గుర్తును సమితి పొందింది. ఈ విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. ఇప్పుడు ఏమి చేయాలనే విషయంపై ఎన్నికల కమిషన్ వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. సాధారణ ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో ఆరు శాతం లేదా అసెంబ్లీ స్థానాల్లో మూడు శాతం సీట్లను గెలిచి ఉంటేనే, ఒకసారి కేటాయించిన చిహ్నాన్ని శాశ్వతంగా ఆ పార్టీకే ఉంచుతారు. 3 శాతం సీట్లు అంటే 9 అసెంబ్లీ స్థానాలు గెలవాలి. ఎంఐఎం 7 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే గెలిచినందున శాశ్వత చిహ్నం కేటాయింపునకు అవకాశం లేదు. మోడీ వస్తే అరాచకమే: ఒవైసీ గుజరాత్‌ను అభివృద్ధి చేశానంటూ నరేంద్ర మోడీ ప్రచారం చేసుకుంటున్నారని.. కానీ అక్కడ జరిగింది అరాచక పాలనేనని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. మోడీ ప్రధాని అయితే భారత్‌లో జరిగేది కూడా అరాచకపాలనేనని విమర్శించారు. శుక్రవారం రాత్రి ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గుజరాత్లో రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను కూడా అడిగే పరిస్థితి లేదన్నారు. ఇళ్లు అమ్మాలన్నా, కొనాలన్నా ఆ ప్రభుత్వానికి తెలియపరచాలని, నచ్చిన మతాన్ని స్వీకరించాలన్నా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలనే షరతులు విధించారని విమర్శించారు. -
ఒంటరి పోరుకు సై: అసద్
సాక్షి, హైదరాబాద్: ‘‘మున్సిపల్ ఎన్నికల్లో పొత్తులతో సంబంధం లేకుండా ఒంటరి పోరుకు సిద్ధంకండి. ఒకవేళ పొత్తులు కుదిరితే చివరి క్షణంలో ఆలోచిద్దాం’’ అని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. గురువారమిక్కడి పార్టీ కేంద్ర కార్యాలయంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన పార్టీ బాధ్యులతో వేర్వేరుగా భేటీ నిర్వహించి మున్సిపల్ ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించారు. మున్సిపల్ ప్రాంతాల్లో పార్టీ పరిస్థితి, ఎన్నికల బరిలో దిగే స్థానాలు, విజయావకాశాలు, అభ్యర్థుల గురించి ఆరా తీశారు. జిల్లా బాధ్యులకే అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను అప్పగించి పార్టీ ‘బి’ ఫామ్‌లను సైతం ముందుగానే అందజేశారు. ఈ సందర్భంగా ఒవైసీ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ పొత్తులపై ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఒకవేళ పొత్తులు కుదిరినా, కుదరకపోయినా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎన్నికల బాధ్యులు సమన్వయంతో వ్యవహరించి అభ్యర్థుల ఎంపిక వివాదాస్పదం కాకుండా అన్నివిధాలా సమర్థులకు టికెట్ ఇవ్వాలని పేర్కొన్నారు. పార్టీలో పనిచేసే సమర్థులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, ఒకవేళ పార్టీ శ్రేణుల కంటే సమర్థవంతులై, స్థానికంగా పట్టున్న తటస్థులు ఉంటే వారిని బరిలో దింపేందుకు ప్రయత్నించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వ్డ్ వార్డుల్లో సైతం పార్టీకి పట్టు, సమర్థులైన అభ్యర్థులుంటే వారికి అవకాశం ఇవ్వాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేశామన్నది ముఖ్యం కాదని.. ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తామన్నదే ముఖ్యమని పేర్కొన్నారు. అలాంటి వార్డులను మాత్రమే గుర్తించి బరిలో దిగాలని స్పష్టంచేశారు. జిల్లా బాధ్యులు తమ పరిధిలోని పట్టణాల్లో విసృ్తతంగా పర్యటించి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలన్నారు. ప్రత్యర్థుల వ్యూహాలను పసిగడుతూ సరికొత్త వ్యూహంతో ముందుకెళ్లి విజయకేతనం ఎగురవేయాలని అసదుద్దీన్ పిలుపునిచ్చారు. వేర్వేరుగా జరిగిన ఈ భేటీల్లో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, తిరుపతి, కర్నూలు, అనంతరపురం జిల్లాల బాధ్యులు పాల్గొన్నారు. -
ఉనికిని చాటుకున్న వైఎస్సార్సీపీ, ఎంఐఎం..
ఈ ఏడాది జిల్లాలో వైఎస్సార్సీపీ, ఎంఐఎంలు తమ ఉనికిని చాటుకునే కార్యక్రమాలు చేపట్టాయి. వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ పర్యటించడం ప్రాథమిక, పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీకి కలిసొచ్చింది. అలాగే ఎంఐఎం అగ్రనాయకులు అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఒవైసీ పలు కార్యక్రమాలలో పాల్గొంటూ జిల్లాకు అధిక సమయం కేటాయించారు. వైఎస్సార్సీపీ జిల్లాలో బలమైన పార్టీగా ఎదిగెందుకు ప్రయత్నించింది. పంచాయతీ ఎన్నికల్లో 14 గ్రామాల్లో జెండా ఎగురవేసింది. సహకార సంఘాల ఎన్నికల్లో కూడా పది సంఘాల్లో విజయం సాధించింది. తృ టిలో డీసీఎంఎస్ చైర్మన్ పదవిని పొగొట్టుకుంది. - వైఎస్సాఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ రెండు పర్యాయాలు జిల్లాలో పర్యటించారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన భారీ సభలో ఆమె పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ మధుశేఖర్ ఈ ఏడాదిలోనే బాధ్యతలను స్వీకరించారు. బోధన్, నిజామాబాద్, కామారెడ్డి తదితర నియోజకవర్గాలతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో తమ ఉనికి నిలుపుకునేందుకు ఎంఐఎం ప్రయత్నం చేసింది. పార్టీ రాష్ట్ర నేతలు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జిల్లాకు వచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో ఒక గ్రామంలో విజయం సాధించింది. నిజామాబాద్, బోధన్‌లలో జరిగిన బహిరంగసభలకు ఆ పార్టీ అగ్రనేతలు అసదుద్దీన్ఓవైసీ, అక్బరుద్దీన్ఓవైసీలు హాజరయ్యారు. రానున్న సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్నామన్న సంకేతాలను ఎంఐఎం ఇవ్వగలిగింది. -
ఎంఐఎం చూపు బోధన్ వైపు
బోధన్, న్యూస్‌లైన్ : ఎంఐఎం పార్టీ బోధన్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈ స్థానం నుంచి అభ్యర్థిని బరిలో నిలపాలనే యోచనలో ఆ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగా కసరత్తు చేస్తోంది. బోధన్ నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసేలా ముస్లింలు గణనీయ సంఖ్యలో ఉన్నారు. అందుకే ఇక్కడ తమ అభ్యర్థిని బరిలో నిలపాలన్న లక్ష్యంతో ఎంఐఎం సాగుతోంది. సభలు, సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తలను సమాయత్తం చేస్తోంది. శనివారం రాత్రి బోధన్‌లో నిర్వహించిన సభలో పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు. ఐక్యతతో సాగి సత్తా చాటుదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సభను సద్వినియోగం చేసుకుంటూ.. నిజాం షుగర్స్ ప్రైవేట్ జాయింట్ వెంచర్‌పై శనివారం నాటి సభలో అసదుద్దీన్ ఘాటుగా స్పందించారు. ఈ ప్రాంత రైతులు, కార్మికుల కష్టాలను ప్రస్తావించారు. తాజాగా కిరణ్‌కుమార్‌రెడ్డి నియమించిన మంత్రి వర్గ ఉప సంఘాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నియమించిన శాసనసభా సంఘం సిఫారసులను ప్రస్తావించారు. త్వరలో ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో వాటిపై తేల్చుకుంటామన్నారు. నిజాం షుగర్స్‌ను వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజాప్రతినిధులకు ఈ ఫ్యాక్టరీ సమస్యగా కనిపించడం లేదా అని ప్రశ్నించారు. సంప్రదాయ ఓటు బ్యాంక్ నియోజకవర్గంలోని బోధన్, ఎడపల్లి, నవీపేట, రెంజల్ మండలాల్లో ఎంఐఎం పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంక్ ఉంది. 1999 నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రస్తుత భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి విజయం సాధిస్తూ వస్తున్నారు. ఆయా ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ కాంగ్రెస్‌కు సహకరించింది. ఇక్కడ ముక్కోణపు పోటీ ఉండడం కూడా ఆయనకు కలిసి వచ్చింది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, టీఆర్ఎస్ ఉమ్మడి అభ్యర్థిగా టీఆర్ఎస్ నాయకుడు మహ్మద్ షకీల్, ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా కెప్టెన్ కరుణాకర్‌రెడ్డి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి కేవలం 1,200 ఓట్ల మెజారిటీతో గట్టెక్కారు. షకీల్ ద్వితీయ స్థానంలో నిలిచారు. ఘన చరిత్ర మున్సిపాలిటీ ఏర్పడిన నాటి నుంచి ఆధిక్యత చాటిన కాంగ్రెస్‌కు 1995 బల్దియా ఎన్నికల్లో ఎంఐఎం షాక్ ఇచ్చింది. మొత్తం 35 కౌన్సిలర్ స్థానాల్లో ఎంఐఎం 14 స్థానాలు గెలుచుకుంది. చైర్మన్‌గా ఆ పార్టీ అభ్యర్థి ఇబ్రహీం గెలిచారు. ఆ తర్వాత 2000 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. 2005లో కాంగ్రెస్ గెలుపొందింది. ఈ ఎన్నికల్లో ఎంఐఎం నుంచి ఏడుగురు కౌన్సిలర్లు విజయం సాధించారు. ఇటీవల అక్బరుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు ఆయనను అరెస్టు చేయించడం వంటి ఘటనలతో కాంగ్రెస్, ఎంఐఎం సంబంధాలు దెబ్బతిన్నాయి. దీంతో ఈ నియోజకవర్గంలో ఈసారి బరిలో నిలవాలని ఎంఐఎం యోచిస్తోంది. ఆరు నెలలుగా చాపకింద నీరులా నియోజకవర్గంలో విస్తరిస్తోంది. పార్టీ నిర్మాణంపై దృష్టి సారించి నూతన కమిటీలను ఏర్పాటు చేస్తోంది. నియోజక వర్గం పరిధిలోని మండలాలపైనా దృష్టి సారించింది.