ఎదులాపురం/కాగజ్‌నగర్, న్యూస్‌లైన్ : రాజ్యాధికారం సాధించాలంటే దళితు లు, వెనుకబడిన తరగతులవారు, ముస్లింలు ఏకం కావాలని ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం భాగంగా బుధవారం ఆదిలాబాద్‌లోని తిర్పెల్లి, కాగజ్‌నగర్‌లోని సంతోష్ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన సభల్లో ఆయన మాట్లాడారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో దళితులు, ముస్లింలు ఒక్కటయ్యారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ టీర్‌ఎస్ ముస్లిం లకు చేసిందేమీ లేదని విమర్శించారు. ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధిస్తే రైల్వే ఓవర్‌బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తానని హామీనిచ్చారు.
పట్టణంలో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణం చేపడుతామని అన్నారు. ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలను తొలగించినప్పుడు ఏ పార్టీ నాయకులు చిరువ్యాపారులకు అం డగా నిలువలేదని, జిల్లా ఇన్‌చార్జి ఫా రుఖ్‌అహ్మద్ నిరాహార దీక్ష చేపట్టార ని గుర్తు చేశా రు. ఎంపీ, ఎమ్మెల్యేలకు దమ్ముంటే ఎంఐఎం అభ్యర్థులు బరిలో ఉన్న స్థానాల్లో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. ఆదిలాబాద్ చరిత్రలో మసూద్ అహ్మద్ ఒక్కరే ఎమ్మెల్యేగా ఉండిపోయారని, ఇది ముస్లింలకు అన్యాయం కాదా అని దు య్యబట్టారు. 2006 జెడ్పీటీసీ ఎన్నికల్లో జిల్లాలోని 52 మండలాల్లో ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా ఏ రాజకీయ పార్టీలు గెలిపించుకోలేదని అన్నారు. 12.5శాతం జనాభా ఉన్నారని, కొన్ని చోట్ల మైనార్టీ ఓటర్లు కీలక భూమిక పోషిస్తున్నారని చెప్పారు.
బీజేపీ మతతత్వ పార్టీ అని, సామాన్య ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే ఆ పార్టీ నాయకత్వాన్ని తరిమికొట్టాలని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. తెలంగాణ అభివృద్ధిపై ఆలోచించకుండా అన్ని పార్టీలు తామే తెలంగాణ తెచ్చామని గొప్పలకు పోతూ ఓట్ల కోసం వెంపర్లాడుతున్నాయని విమర్శించారు. కాగా, ఆదిలాబాద్‌లోని తాటిగూడలో ఉన్న మసీదులో ప్రార్థనలు చేశారు. అనంతరం వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా ఇన్‌చార్జి ఫారుఖ్ అహ్మద్, హైదరాబాద్ కార్పొరేటర్ సమద్ వరాసి, ఎంఐఎం నాయకులు జాకీర్ ఖురేషి, జావిద్, జమీర్, ముజీబ్, నయీం, గఫ్ఫార్, మల్లిక్, నియాజ్, వసీఖాన్, షేరు అహ్మద్ పాల్గొన్నారు. కాగజ్‌నగర్‌లో మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
దళితులు, ముస్లింలు ఏకం కావాలి
Published Thu, Mar 27 2014 2:39 AM | Last Updated on Wed, Aug 29 2018 6:13 PM
Advertisement
Advertisement