కిష్టారెడ్డి తనయుడికే పార్టీ టికెట్: ఉత్తమ్ | congress party no Alliance with mim in greater elections says by t pcc chief | Sakshi
Sakshi News home page

కిష్టారెడ్డి తనయుడికే పార్టీ టికెట్: ఉత్తమ్

Published Mon, Nov 30 2015 6:50 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

కిష్టారెడ్డి తనయుడికే పార్టీ టికెట్: ఉత్తమ్ - Sakshi

కిష్టారెడ్డి తనయుడికే పార్టీ టికెట్: ఉత్తమ్

న్యూఢిల్లీ: వరంగల్ ఉప ఎన్నిక ఫలితాలు తమకు బాధ కలిగించాయని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్తో భేటీ అనంతరం ఆయన సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. వరంగల్ ఓటమి, ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించినట్లు తెలిపారు.

 

ఇతర పార్టీల సహకారం తీసుకుని  శాసన మండలి ఎన్నికల్లో ముందుకు వెళతామన్నారు. సమన్వయ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఉత్తమ్ తెలిపారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్ శాసనసభ ఉప ఎన్నికలో దివంగత మాజీ ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి కుమారుడే పార్టీ అభ్యర్థి అని ఆయన వెల్లడించారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంఐఎంతో ఎలాంటి పొత్తు ఉండదని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement