T PCC Chief
-
ప్రధాని మోదీకి రేవంత్‌రెడ్డి లేఖ
హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఓ లేఖ రాశారు. తెలంగాణ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని, ఎన్డీఆర్ఎఫ్ విస్తరణ, రైతులు, మృతుల బంధువులకు ఆర్థిక పరిహారం ప్రకటించాలని కోరారు. అలాగే వీటితో పాటు రోడ్ల మరమ్మతులు, నిర్మాణం కోసం తక్షణ సహాయ ప్యాకేజీని రూ.2,000 కోట్లు విడుదల చేయాలని లేఖలో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. Telangana Congress chief Revanth Reddy writes to PM Modi, requesting to declare Telangana floods a National Disaster, along with NDRF deployment, financial compensation to farmers & kin of deceased & an immediate relief package of Rs 2000cr for repair & construction of roads pic.twitter.com/jissNY9M1x — ANI (@ANI) July 16, 2022 -
మంత్రులను బర్తరఫ్ చేయాల్సిందే: ఉత్తమ్
తెలంగాణ ఎంసెట్ మెడికల్ పేపర్ లీకేజికి ముఖ్యమంత్రి కేసీఆర్‌దే బాధ్యత అని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. దానికి బాధ్యులైన మంత్రులను బర్తరఫ్ చేయాలని గవర్నర్‌ను కోరుతామన్నారు. ఈ ప్రభుత్వానికి పరిపాలించే సత్త లేక విద్యార్థులను ఇబ్బంది పెడుతోందని ఆయన మండిపడ్డారు. లీకేజికి బాధ్యులు ఎవరో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. వైస్ చాన్స్లర్ల నియామకాన్ని కూడా కోర్టు తప్పు పట్టిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఇలావ్యవహరించడం దారుణమని, ప్రభుత్వం చేసేది మంచిదైతే ఎమ్మెల్యేలను ఎందుకు అరెస్టు చేయిస్తున్నారని ప్రశ్నించారు. ఇలాంటి వికృత చేష్టలు ఎక్కడా చూడలేదని ఉత్తమ్ మండిపడ్డారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టుతో మంచి చేస్తుంటే ప్రజలను ఒప్పించాలి కానీ.. బలవంతంగా బెదిరించడం ఎందుకని ఆయన నిలదీశారు. సోమవారం తాము మల్లన్నసాగర్ ముంపు ప్రాంత గ్రామాల్లో పర్యటిస్తామని చెప్పారు. అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌ను ఆయన నియోజకవర్గంలోకి వెళ్లనీయకపోవడం దారుణమని అన్నారు. -
పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కు కేటీఆర్ సవాల్
ఖమ్మం : పాలేరు ఉపఎన్నికల్లో వ్యక్తిగత విమర్శలు తగవని కాంగ్రెస్ పార్టీ నేతలకు తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. ఆదివారం ఖమ్మంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేటీఆర్ విలేకర్లలో మాట్లాడుతూ... పాలేరు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ స్పష్టం చేశారు. మరి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే.. పీసీసీ అధ్యక్ష ప్రదవికి రాజీనామా చేస్తారా ? అని ఉత్తమ్‌కుమార్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. నైతిక విలువల గురించి మాట్లాడే అర్హత టీడీపీ, కాంగ్రెస్‌కు లేవన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టీడీపీ ఎందుకు పోటీ చేసిందని ప్రశ్నించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు సముచిత గౌరవం ఇవ్వని నీచ సంస్కృతి కాంగ్రెస్ పార్టీదే అని కేటీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
రంగంలోకి దిగిన ఉత్తమ్
హైదరాబాద్ : ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ ప్రతీష్టాత్మకంగా తీసుకుంది. మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయ కేతనం ఎగురవేసింది. ఈ నేపథ్యంలో పాలేరు ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పావులు కదుపుతున్నారు. అందులోభాగంగా టీడీపీ, వామపక్ష పార్టీలను ఒకే తాటిపైకి తీసుకువచ్చేందుకు తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రంగంలోకి దిగారు. ఆ క్రమంలో శుక్రవారం టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణకు ఉత్తమ్ కుమార్ ఫోన్ చేశారు. ఈ ఉప ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. అందుకు వెంటనే నిర్ణయం చెప్పలేమని.. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబుతో సంప్రదించి.. చెబుతానని చెప్పారు. అయితే పాలేరులో గెలుపు మాదే అని ఇప్పటికే తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పార్టీలన్నీ ఏకమైనా టీఆర్ఎస్ విజయాన్ని అడ్డుకోలేవని... గురువారం మంత్రి తుమ్మలతో భేటీ అనంతరం కేటీఆర్ విలేకర్ల సమావేశంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. -
కిష్టారెడ్డి తనయుడికే పార్టీ టికెట్: ఉత్తమ్
న్యూఢిల్లీ: వరంగల్ ఉప ఎన్నిక ఫలితాలు తమకు బాధ కలిగించాయని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్‌తో భేటీ అనంతరం ఆయన సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. వరంగల్ ఓటమి, ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించినట్లు తెలిపారు. ఇతర పార్టీల సహకారం తీసుకుని శాసన మండలి ఎన్నికల్లో ముందుకు వెళతామన్నారు. సమన్వయ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఉత్తమ్ తెలిపారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్ శాసనసభ ఉప ఎన్నికలో దివంగత మాజీ ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి కుమారుడే పార్టీ అభ్యర్థి అని ఆయన వెల్లడించారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంఐఎంతో ఎలాంటి పొత్తు ఉండదని స్పష్టం చేశారు. -
'రాష్ట్రంలో సమస్యలు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం'
హైదరాబాద్: రైతులకు భరోసా ఇవ్వడంలో కేసీఆర్ సర్కార్ పూర్తిగా విఫలమైందని పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. మంగళవారం గవర్నర్ నరసింహన్‌తో పొన్నాల లక్ష్మయ్యతోపాటు తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ అయ్యారు. అనంతరం పొన్నాల విలేకర్లతో మాట్లాడుతూ... రాష్ట్రంలో కరెంట్ కోతలతో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లామని చెప్పారు. రైతుల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరీపై గవర్నర్‌కు ఈ సందర్భంగా వివరించినట్లు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాడిన తర్వాత రాష్ట్రంలో 250 మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని విమర్శించారు. సీఎం సొంత జిల్లా సొంత నియోజకవర్గంలోనే ఆత్మహత్యలు జరిగాయని ఆయన వివరించారు. ఇప్పటికీ రైతుల ఆత్మహత్యలను నివారించడంలో కేసీఆర్ ప్రభుత్వం చర్యలు చేపట్టలేదని వివరించారు. రెండు రాష్ట్రాలకు గవర్నర్‌గా ఉన్నందున ఏపీ నుంచి తెలంగాణకు రావాలసిన విద్యుత్ అంశంలో జోక్యం చేసుకోవాలని గవర్నర్ నరసింహన్‌ను కోరమని చెప్పారు. అలాగే తెలంగాణలో విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం చోరవ తీసుకునే చూడాలని... విభజన చట్టం ప్రకారం 54 శాతం విద్యుత్ తెలంగాణకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ నరసింహన్‌కు విజ్ఞప్తి చేసినట్లు పొన్నాల తెలిపారు. -
'బంగారు తెలంగాణకు కాంగ్రెస్సే పునాదులు వేసింది'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య వెల్లడించారు. శుక్రవారం గాంధీభవన్‌లో 68వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పొన్నాల లక్ష్మయ్య జాతీయ జెండాను పొన్నాల ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ... తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినా... ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో విఫలమయ్యామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్లే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఒడిపోయిందని ఆయన విశ్లేషించారు. బంగారు తెలంగాణకు కాంగ్రెస్ పార్టీనే పునాదులు వేసిందని పొన్నాల స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ వేసిన పునాదులను టీఆర్ఎస్ పార్టీ కొనసాగించలేకపోతుందని విమర్శించారు. అదికాక టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారాన్ని చేపట్టి రాజకీయాలే కేంద్రంగా పని చేస్తూ... ప్రజల ఆశయాలకు గండి కొడుతుందని పొన్నాల ఆరోపించారు.