ఖమ్మం : పాలేరు ఉపఎన్నికల్లో వ్యక్తిగత విమర్శలు తగవని కాంగ్రెస్ పార్టీ నేతలకు తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. ఆదివారం ఖమ్మంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేటీఆర్ విలేకర్లలో మాట్లాడుతూ... పాలేరు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ స్పష్టం చేశారు. మరి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే.. పీసీసీ అధ్యక్ష ప్రదవికి రాజీనామా చేస్తారా ? అని ఉత్తమ్కుమార్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు.
నైతిక విలువల గురించి మాట్లాడే అర్హత టీడీపీ, కాంగ్రెస్‌కు లేవన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టీడీపీ ఎందుకు పోటీ చేసిందని ప్రశ్నించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు సముచిత గౌరవం ఇవ్వని నీచ సంస్కృతి కాంగ్రెస్ పార్టీదే అని కేటీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.