రంగంలోకి దిగిన ఉత్తమ్ | uttam kumar phone to L Ramana | Sakshi
Sakshi News home page

రంగంలోకి దిగిన ఉత్తమ్

Published Fri, Apr 22 2016 11:51 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

రంగంలోకి దిగిన ఉత్తమ్ - Sakshi

రంగంలోకి దిగిన ఉత్తమ్

హైదరాబాద్ : ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ ప్రతీష్టాత్మకంగా తీసుకుంది. మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయ కేతనం ఎగురవేసింది. ఈ నేపథ్యంలో పాలేరు ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పావులు కదుపుతున్నారు. అందులోభాగంగా టీడీపీ,  వామపక్ష పార్టీలను ఒకే తాటిపైకి తీసుకువచ్చేందుకు తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రంగంలోకి దిగారు. ఆ క్రమంలో శుక్రవారం టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణకు ఉత్తమ్ కుమార్ ఫోన్ చేశారు.

ఈ ఉప ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. అందుకు వెంటనే నిర్ణయం చెప్పలేమని.. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబుతో సంప్రదించి.. చెబుతానని చెప్పారు. అయితే పాలేరులో గెలుపు మాదే అని ఇప్పటికే తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పార్టీలన్నీ ఏకమైనా టీఆర్ఎస్ విజయాన్ని అడ్డుకోలేవని... గురువారం మంత్రి తుమ్మలతో భేటీ అనంతరం కేటీఆర్ విలేకర్ల సమావేశంలో వెల్లడించిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement