l ramana
-
కేసినో వ్యవహారంలో ఈడీ విచారణ
సాక్షి, హైదరాబాద్: విదేశాలకు తీసుకెళ్లి కేసినోలు ఆడించిన చీకోటి ప్రవీణ్‌కుమార్ కేసుకు సంబంధించి పూర్తిస్థాయిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కూపీ లాగు తోంది. ఫెమా నిబంధనల ఉల్లంఘన, మనీ లాండరింగ్, హవాలా లావాదేవీలు తదితర అంశాలు ఇందులో ముడిపడి ఉన్న నేపథ్యంలో ఈడీ అధికారులు ఈ కేసినోలో పాలుపంచుకున్న వారందరికీ నోటీసులు జారీ చేసి క్షుణ్ణంగా విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. ఇదివరకే నోటీసులు అందుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ శుక్రవారం ఈడీ ఎదుట హాజరయ్యారు. తన బ్యాంకు లావాదేవీల పత్రాలతో వచ్చిన రమణ తాను కేసినోలో పాలు పంచుకోలేదని స్పష్టం చేసినట్లు సమాచారం. నేపాల్‌లోని డాడీ గ్యాంగ్ కేసినోకు సంబంధించి తనకు ఆహ్వానం అందిన విషయం వాస్తవమే అయినా.. తాను వ్యక్తిగత కారణాలతో హాజరుకాలేదని చెప్పినట్లు తెలిసింది. ఈడీ అధికారులు మాత్రం నేపాల్‌కు వెళ్లడానికి తీసుకున్న విమాన టికెట్ల ఆధారంగా ఆయనను ప్రశ్నించినట్లు చెబుతున్నారు. ఉదయం పది గంటల సమయంలోనే రమణ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. బ్యాంకు లావాదేవీల పత్రాలను అధికారులకు అందించినట్లు సమాచారం. మూడంతస్తులు మెట్లు ఎక్కి వెళ్లిన ఆయన.. ఈడీ అధికారులు ప్రశ్నలు సంధిస్తున్న సమయంలో ఘగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురయ్యారు. దీనితో అధికారులు ఆయనను సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. మంత్రి తలసాని పీఏకు కూడా .. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పీఏ హరీశ్‌ను విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల వ్యవహారం ఇంకా ఎక్కడి దాకా వెళ్తుందోనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కేసినో వ్యవహారంలో మొత్తం 18 మంది రాజకీయ నేతలకు సంబంధం ఉందని అధికారులు గుర్తించినట్లు సమాచారం. వీరందరికీ నోటీసులు జారీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. చీకోటి ప్రవీణ్‌కుమార్ తన సన్నిహితుడు మాధవరెడ్డితో జరిపిన సంభాషణలో బయటపడిన వివరాలు, నేపాల్, ఇండోనేషియా, శ్రీలంక, గోవాకు కేసినో ఆడటానికి విమానాల్లో వెళ్లిన టికెట్ల ఆధారంగా వీరిని ప్రశ్నించనున్నట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే చీకోటి ప్రవీణ్‌కుమార్, మాధవరెడ్డిలతోపాటు తలసాని సోదరులు మహేశ్, ధర్మేందర్, మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, ఊర్వశీ బార్ యజమాని యుగంధరను ప్రశ్నించిన విషయం విదితమే. మెదక్ డీసీసీబీ చైర్మన్ దేవందర్రెడ్డిని కూడా విచారించనున్నారు. -
ఈడీ విచారణలో ఎల్ రమణకు తీవ్ర అస్వస్థత
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన క్యాసినో కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇవాళ(శుక్రవారం) విచారణకు హాజరైన తెలంగాణ ఎమ్మెల్సీ ఎల్ రమణ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయన్ని ఈడీ అధికారులు ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. తీవ్ర అస్వస్థతలకు గురైన ఎమ్మెల్సీ రమణను హైదర్గూడా అపోలో ఆస్పత్రికి తరలించారు ఈడీ అధికారులు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం కుటుంబ సభ్యులు ఆయన్ని సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. చికోటీ ప్రవీణ్ సారథ్యంలో విదేశాల్లో అక్రమ క్యాసినో వ్యవహారంలో ఈడీ దర్యాప్తు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తవ్వేకొద్దీ రాజకీయ ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో వంద మందితో కూడిన ఓ జాబితా లిస్ట్‌ను రూపొందించింది ఈడీ. శుక్రవారం ఎమ్మెల్సీ రమణను విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు పంపింది. దీంతో హైదరాబాద్ ఈడీ ఆఫీస్‌కు వచ్చారు ఆయన. అయితే విచారణ సమయంలో రమణ అస్వస్థతకు గురికాగా.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ వ్యవహారంలో మంత్రి తలసాని యాదవ్ ఇద్దరు సోదరులను ఇదివరకే ఈడీ విచారించిన సంగతి తెలిసిందే. -
కేంద్రం క్రూరంగా వ్యవహరిస్తోంది
సాక్షి,గన్‌ఫౌండ్రీ/హైదరాబాద్/సనత్‌నగర్: చేనేత కళాకారుల పట్ల కేంద్రం అత్యంత క్రూరంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్సీ ఎల్.రమణ మండిపడ్డారు. చేనేత ఉత్పత్తులపై కేంద్రం విధిస్తున్న 5శాతం జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నేత కళాకారులు రాసిన లక్షలాది ఉత్తరాలతో నిజాం కళాశాల మైదానం నుంచి అబిడ్స్‌లోని జనరల్ పోస్టాఫీసు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్.రమణ మాట్లాడుతూ... చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని రద్దు చేసి నేత కార్మికుల జీవితబీమా, సబ్సిడీ, హ్యాండ్లూమ్, పవర్ లూమ్ బోర్డు వంటి సంక్షేమ కార్యక్రమాలు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ మాట్లాడుతూ చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని రద్దు చేసే వరకు పోరు కొనసాగిస్తామన్నారు. పోస్ట్‌కార్డులతో నిరసన తెలుపుతున్నఎల్.రమణ తదితరులు తెలంగాణ వచ్చాకే చేనేతకు పూర్వవైభవం సంక్షోభంలో ఉన్న చేనేత రంగానికి తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ పూర్వ వైభవం తెచ్చా రని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. హైదరాబాద్‌లో తనను కలిసిన చేనేత సంఘం ప్రతినిధులతో ఆయన చర్చించారు. చేనేతపై కేంద్రం విధించిన 5 శాతం జీఎస్టీని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రధాని మోదీకి పోస్ట్‌కార్డు రాశారు. -
టీఆర్ఎస్ నుంచి ఇద్దరి పేర్లు ఖరారు.. సీఎం నిర్ణయమే ఫైనల్..
స్థానిక సంస్థల కోటాలో ఈసారి భానుప్రసాద్, ఎల్.రమణ పేర్లు దాదాపుగా ఖరారయ్యాని సమాచారం. వీరిద్దరి పేర్లను ఖరారు చేస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుందని తెలిసింది. వాస్తవానికి ఎల్.రమణను మొన్న జరిగిన ఎమ్మెల్యే కోటాలోనే ఎమ్మెల్సీగా పంపుతారని ప్రచారం సాగినా.. ఉమ్మడి జిల్లా నుంచి పాడి కౌశిక్‌రెడ్డి, సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి నామినేషన్లు వేశారు. దీంతో మాజీ మంత్రి ఎల్.రమణ వర్గం తీవ్ర నిరాశలో కూరుకుపోయింది. తాజాగా మరోసారి ఎల్.రమణ పేరు అధిష్టానం.. పరిగణనలోకి తీసుకుందని సమాచారం. స్థానిక సంస్థల కోటాలో ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఒకటి బీసీ, మరొకటి ఓసీలకు ఇవ్వాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ సమీకరణాల్లో భాగంగానే భానుప్రసాద్ రావు మూడోసారి ఎమ్మెల్సీ స్థానానికి పోటీ పడుతున్నారు. బీసీ కోటాలో ఈసారి మాజీ మంత్రి ఎల్.రమణకు అవకాశం ఇచ్చారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. చదవండి: తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక ఉత్తర్వులు.. సాక్షి, కరీంనగర్: మొన్నటి దాకా హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక రణరంగం నడిచిన కరీంనగర్లో రెండువారాలు తిరక్కముందే స్థానిక సంస్థల ఎన్నికల భేరీ మోగింది. జాతీయస్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించిన ఆ ఉప ఎన్నికలో అభ్యర్థుల ఎంపిక, రెబెల్స్, తిరుగుబాటుదారులు, బుజ్జగింపు పర్వాలు ఏ పార్టీలో అణువంతైనా కనిపించలేదు. కానీ.. ప్రస్తుతం నడుస్తున్న స్థానిక సంస్థల నామినేషన్ల ప్రక్రియలో మాత్రం ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అధికార పార్టీకి స్థానిక ప్రజాప్రతినిధుల ఓట్ల విషయంలో తిరుగులేని బలం ఉన్నప్పటికీ.. బరిలో నిలిచేవారి సంఖ్య పెరుగుతుండటం ఇందుకు కారణం. ఈసారి టీఆర్ఎస్ ఎంపీపీ (సైదాపూర్), రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సారాబుడ్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ వేశారు. చదవండి: నిప్పులాంటి నిజం! సిలిండర్‌పై ఎక్స్ట్రా వసూళ్లు, మొత్తం లెక్కిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే! రోజురోజుకూ దిగజారిపోతున్న ఎంపీటీసీలకు పూర్వవైభవం తీసుకురావాలన్న లక్ష్యంతోనే తాను నామినేషన్ వేశానని చెబుతున్నారు. వాస్తవానికి ఇంతవరకూ తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి అభ్యర్థుల ప్రకటనపై ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. కానీ.. ఈయన మాత్రం తమ డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదని, వాటిపై స్పష్టమైన హామీ దొరికే వరకు నామినేషన్ వెనక్కి తీసుకోనని ఖరాఖండిగా చెబుతున్నారు. జిల్లా నుంచి రెండుసార్లు ఎమ్మెల్సీలుగా ఎన్నికైన నారదాసు లక్ష్మణరావు, భానుప్రసాద్ ఏనాడైనా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమస్యలను మండలివేదికగా ప్రస్తావించారా? అని ప్రశ్నిస్తున్నారు. మిగిలిన ఐదుగురి డిమాండ్లు కూడా కాస్త అటూఇటూగా ఇవే కావడం గమనార్హం. బరిలో మరికొందరు... ►ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. ►ఈ నెల 16 నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలైంది. నామినేషన్ల స్వీకరణకు 23వ తేదీ ఆఖరు. ► ఇప్పటిదాకా మొత్తం ఆరుగురు అభ్యర్థులు తొమ్మిదిసెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. ►వీరిలో ప్రభాకర్‌రెడ్డి ఒకరు మాత్రమే పార్టీ నుంచి బరిలో ఉన్నారు. ►ఇక మునిగాల విజయలక్ష్మి, మసార్తి రమేశ్, బొమ్మరవేని తిరుపతి, నలమాచు రామకృష్ణ, పురం రాజేశం ఇండిపెండెంట్లుగా నామినేషన్లు దాఖలు చేశారు. ►మంగళవారం నామినేషన్ల స్వీకరణకు ఆఖరు రోజు కావడంతో చివరి రెండురోజుల్లో మరికొందరు నామినేషన్లు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ►ముఖ్యంగా జగిత్యాల, పెద్దపల్లి నుంచి కొందరు ఇండిపెండెంటుగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ►ఇప్పటివరకూ దాదాపు 70 వరకు నామినేషన్ పత్రాలను కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం నుంచి తీసుకెళ్లడమే ఇందుకు నిదర్శనం. ఇందులో కొందరు నాలుగేసి సెట్లు, మరికొందరు ఒకటి, రెండు సెంట్లు తీసుకెళ్లినట్లు సమాచారం. నామినేషన్ దాఖలు చేసేవారిలో బలమైన అభ్యర్థులకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మద్దతిచ్చేందుకు సుముఖంగా ఉన్నాయని ఇండిపెండెంట్లు ధీమాతో ఉన్నారు. అయితే.. అన్ని పార్టీల్లో తిరుగుబాట్లు, అలకలు సహజమేనని, ఎవరికైనా పార్టీ ఆదేశాలు శిరోధార్యమని సీనియర్ టీఆర్ఎస్ నేతలు ‘సాక్షి’కి తెలిపారు. సీఎం నిర్ణయమే ఫైనల్.. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని శనివారం కరీంనగర్లో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి గంగుల కమలాకర్ నిర్వహించారు. కరీంనగర్ నగర పాలక, కొత్తపల్లి పురపాలక సంఘాలకు చెందిన డిప్యూటీ మేయర్, చైర్మన్, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు, మంత్రి గంగుల పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికను పార్టీ అధిష్టానానికి అప్పగిస్తూ, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించే అభ్యర్థికి మద్దతు తెలపాల్సిందిగా సూచించారు. సమావేశంలో పాల్గొన్న పాలకవర్గాల సభ్యులు ఈ ప్రతిపాదనకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, సిరిసిల్ల నియోజకవర్గాలకు మంత్రి గంగుల ఎన్నికల ఇన్చార్జిగా, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలకు మంత్రి కొప్పుల ఈశ్వరు బాధ్యులుగా వ్యవహరిస్తున్నారు. సమావేశంలో కరీంనగర్ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూప రాణి హరిశంకర్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు తదితరులు పాల్గొన్నారు. -
పెరిగిన ఎమ్మెల్సీ వేడి.. తెరపైకి ఆ ముగ్గురి పేర్లు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి పెరిగింది. ఎమ్మెల్యే కోటాలో అభ్యర్థుల జాబితా ఖరారైన నేపథ్యంలో పలువురికి ప్రగతిభవన్ నుంచి సీఎం నేరుగా ఫోన్‌చేసినట్లు సమాచారం. స్థానిక సంస్థల కోటాలో పన్నెండు, ఎమ్మెల్యే కోటాలో ఆరు సీట్లను దక్కించుకునేందుకు గులాబీ పార్టీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఉమ్మడి జిల్లా నుంచి మొత్తం నాలుగు సీట్లు దక్కనున్నాయి. వాస్తవానికి ఆరుగురు అభ్యర్థుల్లో బీసీ సామాజికవర్గం నుంచి ఎల్.రమణ, రెడ్డి సామాజిక వర్గం నుంచి పాడి కౌశిక్‌రెడ్డికి స్థానాలు ఖరారయ్యాయని సమాచారం. ఇటీవల గవర్నర్ కోటాలో పాడి కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేట్చేసినా.. ఆయనపై ఉన్న కేసుల కారణంగా అది వాస్తవరూపం దాల్చలేదు. దీంతో ఎమ్మెల్యే కోటాలో అధిష్టానం కౌశిక్‌కు బెర్త్ కన్ఫర్మ్ చేసిందని ప్రచారం జరుగుతోంది. చదవండి: సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామా.. వెంటనే ఆమోదం స్థానిక సంస్థల కోటాలో తెరపైకి ముగ్గురు! త్వరలో స్థానిక సంస్థల కోటాలో ఉమ్మడి జిల్లా నుంచి రెండు స్థానాలు ఖాళీ అవనున్నాయి. ఈనెల 16వ తేదీన నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో రెండుస్థానాల ఆశావహుల జాబితా కూడా రెడీ అయిందని సమాచారం. ప్రస్తుతం ఓసీ (వెలమ సామాజికవర్గం) భానుప్రసాదరావు, బీసీ (ఎల్లాపు) నుంచి నారదాసు లక్ష్మణరావు ఎమ్మెల్సీలుగా ఉన్నారు. ఈసారి వెలమసామాజికవర్గానికి చెందిన చెన్నాడి సుధాకర్‌రావు, బీసీ (యాదవ) నుంచి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌తోపాటు, మాజీ జెడ్పీటీసీ వీర్ల వెంకటేశ్వరరావు పేర్లు పరిశీలనలో ఉన్నాయని సమాచారం. భాను ప్రసాద్‌కు ఎమ్మెల్యే టికెట్హామీ దక్కడంతో ఆయన పోటీ చేయడం లేదని ప్రచారం జరుగుతోంది. మరోవైపు నారదాసు లక్ష్మ ణరావుకు ఇప్పటికే రెండుసార్లు అవకాశం కల్పించిన నేపథ్యంలో మూడోసారి ఎమ్మెల్సీ టికెట్ దక్కే చాన్స్‌లు దాదాపుగా లేవనే చెబుతున్నారు. పార్టీ మొత్తంగా భర్తీ చేయనున్న 18 సీట్లలో నాలుగు సీట్లు ఉమ్మడి జిల్లా నుంచి భర్తీ కానుండటం గమనార్హం. హుజూరాబాద్ ఓటమిని మరిచిపోయేలా.. మరోవైపు పార్టీలో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓ టమి తీరని నైరాశ్యాన్ని నింపింది. నాలుగైదు నెలలపాటు భారీ మెజారిటీతో గెలుస్తామన్న ధీమాగా ఉన్న పార్టీకి ఈటల విజయం సాధించడంతో ఊ హించని భంగపాటు ఎదురైంది. దీంతో గులాబీ శ్రేణులు ఒక్కసారిగా ఢీలా పడ్డాయి. అందుకే, ఆ నష్టాన్ని పూడ్చాలంటే.. రాబోయే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కోటాలో సీట్లు కైవసం చేసుకుని తిరిగి పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపాలి. అందుకే, పకడ్బందీగా ప్లాన్ చేసి ప్రతిపక్షాలను తిరిగి ఆత్మరక్షణ ధోరణిలో పడేసేలా పావులు కదుపుతోంది. తెలంగాణ ఉద్యమకాలం నుంచి ఆది నుంచి టీఆర్ఎస్కు కంచుకోటగా ఉన్న కరీంనగర్ జిల్లాపై ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టు సడలనీయవద్దన్న పట్టుదలతో పకడ్బందీగా ముందుకు సాగుతోంది. -
హుజురాబాద్ ఉపఎన్నిక: కౌన్ బనేగా టీఆర్ఎస్ క్యాండిడేట్?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిపై నెలకొన్న ఉత్కంఠ వీడడం లేదు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూనే చివరి నిమిషంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయాలని భావించిన పాడి కౌశిక్‌రెడ్డి వ్యవహారం ఫోన్ సంభాషణల రూపంలో బహిర్గతం కావడం అధికార పార్టీని ఇరకాటంలో పెట్టింది. ఫోన్ సంభాషణ లీక్ అనంతర పరిణామాలతో కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన పాడి కౌశిక్‌రెడ్డి శుక్రవారం టీఆర్ఎస్లో చేరుతారని భావించినప్పటికీ, ఏవో కారణాల వల్ల వీలు కాలేదు. ఈనెల 21న భారీ ర్యాలీగా హైదరాబాద్ వెళ్లి పార్టీలో చేరాలని ఆయన భావిస్తున్నారు. శుక్రవారం ఎల్.రమణతోపాటు టీఆర్ఎస్లో చేరితే తనకు ప్రాధాన్యత ఉండదని భావించిన కౌశిక్ రెడ్డి.. 21వ తేదీని ఎంచుకున్నట్లు సమాచారం. అయితే.. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా కౌశిక్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తారా? అనే అంశం చర్చనీయాంశమైంది. కౌశిక్ రెడ్డికి హుజూరాబాద్ టికెట్టు ఇవ్వాలని కేసీఆర్ భావిస్తేనే స్వయంగా తానే పార్టీ కండువా కప్పి పార్టీలోకి తీసుకునే అవకాశం ఉంది. లేదంటే ఈ సస్పెన్స్ మరికొంత కాలం కొనసాగుతుందని పార్టీ వర్గాల అంచనా. కౌశిక్ అభ్యర్థిత్వంపై తర్జనభర్జన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతూ ‘హుజూరాబాద్ టీఆర్ఎస్ టికెట్ నాకే’ అని పాడి కౌశిక్ రెడ్డి మాజీ టీఆర్ఎస్ నాయకుడితో జరిపిన ఫోన్ సంభాషణ రచ్చకెక్కడంతో గులాబీ నేతలు విస్తుపోయారు. దీంతో కౌశిక్‌రెడ్డికి టీఆర్ఎస్ అధిష్టానం పార్టీ టికెట్టుపై కచ్చితమైన హామీ ఇచ్చిందనే సంకేతాలు జనంలోకి వెళ్లాయి. అదే సమయంలో కౌశిక్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ టీఆర్ఎస్కు కోవర్టుగా వ్యవహరించారనే అపవాదు కూడా వచ్చింది. టీఆర్ఎస్లో చేరిన వెంటనే కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను ఒక్కొక్కరికి రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఇచ్చి లాగాలని, మద్యం, ఇతర ఖర్చులకు డబ్బులు ఇవ్వాలని లీకైన ఫోన్ సంభాషణల్లో ఉండడంతో టీఆర్ఎస్ నేతలు నోరు మెదపలేదు. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తరువాత మంత్రులు, ముఖ్య నాయకులు ప్రచారానికి కూడా హుజూరాబాద్ వైపు వెళ్లకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో కౌశిక్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరినా, పార్టీ టికెట్టు ఇస్తారా అనే విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కౌశిక్ పార్టీలో చేరితే ఎలాంటి ఫలితం ఉంటుందనే విషయంలో టీఆర్ఎస్ ఇంటలిజెన్స్ విభాగం నుంచి నివేదిక తెప్పించుకున్నట్లు సమాచారం. కౌశిక్‌రెడ్డి ఫోన్ సంభాషణల లీక్‌తో పార్టీ ప్రతిష్టకు ఇబ్బంది కలిగిందా? ప్రజలు పార్టీని చూసి ఓటేస్తారా.. అభ్యర్థిని చూశా? అనే విషయమై అధిష్టానం దృష్టి పెట్టింది. కౌశిక్‌రెడ్డి కాకపోతే ఈటలను ఢీకొట్టే గట్టి అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై కూడా అధిష్టానానికి స్పష్టత ఉన్నట్లు తెలుస్తోంది. ఫోన్ సంభాషణతో టీఆర్ఎస్ అభ్యర్థి కాగల అవకాశాలకు కౌశిక్‌రెడ్డి స్వయంగా గండి కొట్టుకున్నట్లు పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. ఎల్.రమణపై కేసీఆర్ వ్యాఖ్యల్లో అంతరార్థం..? ‘రమణ టీఆర్ఎస్లో చేరడం వల్ల పార్టీకి చేనేత వర్గానికి చెందిన నాయకుడు లేడనే లోటు భర్తీ అయింది. గతంలో ఈ వర్గం నుంచి ఒక నాయకుడు ఎమ్మెల్యేగా ఉండేవారు. గత ఎన్నికల్లో ఓడిపోయారు. దాంతో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. రమణ విషయంలో త్వరలోనే గుడ్ న్యూస్ వింటారు. ఆయనకు తగిన పదవి ఇస్తా’ అని శుక్రవారం టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్.రమణ పార్టీలో చేరిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన చింత ప్రభాకర్ 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి చేతిలో ఓడిపోయిన తరువాత అసెంబ్లీలో ఈ వర్గానికి ప్రాతినిధ్యం లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఎల్.రమణకు హుజూరాబాద్ నుంచి పోటీ చేసే అవకాశం ఇస్తారా! అనే చర్చ మొదలైంది. అయితే.. జగిత్యాలకు చెందిన ఎల్.రమణ స్థానికేతర అభ్యర్థి కావడం మైనస్ అవుతుందని, ఆయన ద్వారా చేనేత, బీసీ వర్గం ఓటర్లను ఆకర్షించాలని పార్టీ భావిస్తోందని టీఆర్ఎస్ నేతలు విశ్లేషిస్తున్నారు. ఇతర నాయకుల ప్రయత్నాలు కౌశిక్‌రెడ్డి వ్యవహారం రచ్చకెక్కిన నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పలువురు నాయకులు ప్రయత్నిస్తున్నారు. 2009, 2010లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయి, ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్న బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణ మోహన్ రావు తన అవకాశాలు సజీవంగా ఉన్నాయని భావిస్తున్నారు. బీసీ నాయకుడిగా, గతంలో రాజేందర్‌కు గట్టి పోటీ ఇచ్చిన వ్యక్తిగా తనకు అవకాశం ఉంటుందని ఆయన భావిస్తున్నారు. టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ కూడా పార్టీ అభ్యర్థిత్వంపై ఆశతో ఉన్నారు. మాజీ మంత్రి, బీజేపీ నేత ఇనుగాల పెద్దిరెడ్డి టీఆర్ఎస్ టికెట్టు ఇస్తే పోటీ చేయాలని భావిస్తున్నప్పటికీ, ఆయనతో సంప్రదింపులు జరగలేదు. మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి కుటుంబాన్ని ఎంత మేర పరిగణలోకి తీసుకుంటారో తెలియదు. ఏదేమైనా.. హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిత్వం విషయంలో పార్టీ అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తోంది. పార్టీ నియోజకవర్గం ఇన్చార్జిగా ఉన్న మాజీ మంత్రి టి.హరీశ్‌రావు, జిల్లాకు చెందిన మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ కూడా ఈ విషయంలో ఏమీ మాట్లాడకుండా ‘పార్టీ చీఫ్ కేసీఆర్ నిర్ణయమే శిరోధార్యమని’ అంటున్నారు. -
తెలంగాణ: ముగిసిన టీడీపీ అధ్యాయం
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చరిత్ర ముగిసినట్లయింది. 2014 నుంచి టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీ, మాజీ మంత్రులు, ముఖ్య నాయకులు అంతా వెళ్లిపోయినా.. ఎల్.రమణ మాత్రం ఇన్నాళ్లు ఎన్టీఆర్ భవన్‌కే అంకితమై ఉన్నారు. చివరికి ఆయన కూడా ఆ పార్టీకి నీళ్లొదిలారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తన రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారడం తప్ప మరో మార్గం లేదని భావించి.. కొద్దిరోజుల క్రితమే టీడీపీ నుంచి బయటకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు జిల్లాకు చెందిన మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, వరంగల్ జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో చర్చించి ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి భవిష్యత్ హామీ తీసుకున్నారు. అనంతరం టీడీపీకి రాజీనామా చేసి, నాలుగు రోజుల క్రితం కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ సభ్యత్వం పొందారు. శుక్రవారం టీఆర్ఎస్ బాస్ కేసీఆర్ సమక్షంలో ఎన్టీఆర్ భవన్లో గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో తెలంగాణ తెలుగుదేశం పార్టీకి ఉత్తర తెలంగాణలో మిగిలిన ఏకైక పెద్ద నాయకుడు, మాజీ మంత్రి కూడా టీఆర్ఎస్లో చేరారు. ఇక తెలుగుదేశం పార్టీ కరీంనగర్‌లోనే గాక తెలంగాణలోనే చరిత్ర పుటల్లోకి చేరుకున్నట్లయింది. హైదరాబాద్, మహబూబ్‌నగర్ వంటి జిల్లాల్లో మినహా ఆపార్టీకి ఉనికి లేకుండా పోయింది. సాధారణ నాయకుడి నుంచి టీటీడీపీ అధ్యక్షుడిగా.. 1994 సాధారణ ఎన్నికల్లో జగిత్యాల నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన ఎల్.రమణ.. 1995లో చంద్రబాబు నాయుడు కేబినెట్లో మంత్రిగా నియమితులయ్యారు. చేనేత వర్గానికి చెందిన బీసీ నాయకుడిగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కీలకంగా వ్యవహరించారు. 1996లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో అనూహ్యంగా కరీంనగర్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ సీనియర్ నేత జువ్వాడి చొక్కారావును ఓడించి ఎంపీగా ఎన్నికయ్యారు. కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో తొలి బీసీ ఎంపీగా చరిత్ర సృష్టించారు. 1998 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేత విద్యాసాగర్ రావు చేతిలో ఓటమి పాలయ్యారు. నాలుగేళ్లలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ సీనియర్ నేత టి.జీవన్‌రెడ్డి చేతిలో ఓటమి పాలైన రమణ.. కరీంనగర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా, టీడీపీ రాష్ట్ర శాఖలో బీసీ నాయకుడిగా కొనసాగారు. 2009లో మహా కూటమి తరఫున పోటీ చేసి జీవన్‌రెడ్డిపై ఘన విజయం సాధించారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత 2014 ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ నుంచి ఆహ్వానం వచ్చినా.. కాదని టీడీపీ తెలంగాణ అధ్యక్షుడి హోదాలో పోటీ చేసి మూడో స్థానానికి పరిమితమయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాల పొత్తులో భాగంగా జగిత్యాలలో పోటీ చేయకుండా కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డికి మద్దతు ఇచ్చారు. తాజాగా ఇటీవల జరిగిన హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో టీడీపీ తరఫున ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయారు. 2014 ఎన్నికల తరువాత కూడా టీఆర్ఎస్లోకి ఆహ్వానం అందినా.. కాదని టీటీడీపీ అధ్యక్షుడిగానే వ్యవహరించారు. రమణకు తగిన ప్రాధాన్యత ఇస్తానన్న సీఎం కేసీఆర్ ‘ఏ పార్టీలో ఉన్నా, ఆ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే నాయకుడు ఎల్.రమణ. ఆయన 25 ఏళ్లుగా వ్యక్తిగతంగా నాకు మంచి మిత్రుడు. ఇలాంటి వారు రాజకీయ పార్టీలకు అవసరం. టీఆర్ఎస్లో చేనేత వర్గం నేత వెలితి ఉండె. రమణ రూపంలో మంచి రాజకీయ నాయకుడిని చూస్తారు. త్వరలోనే రమణకు మంచి పదవి ఇస్తాం’ అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నిక నేపథ్యంలో చేనేత వర్గాన్ని ఆకట్టుకునే ఉద్దేశంతో రమణను పార్టీలోకి తీసుకుంటున్నట్లు ఇన్నాళ్లు భావించినప్పటికీ, రాష్ట్రంలో ఓ వర్గాన్ని టార్గెట్ చేసుకున్నట్లు కేసీఆర్ మాటలతో అర్థమవుతోంది. హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనే విషయంలో ఇప్పటివరకు స్పష్టత లేదు. కాంగ్రెస్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి తాను టీఆర్ఎస్లో చేరుతున్నట్లు చెప్పిన ఆడియో లీక్ కావడంతో హుజూరాబాద్ అభ్యర్థిపై పీఠముడి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎల్.రమణను కూడా అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘రమణ గురించి త్వరలోనే మంచి వార్త వింటారు’ అని కేసీఆర్ చెప్పడం వెనుక ఆంతర్యం ఇదేనని తెలుస్తోంది. -
దొరల గడీలో మరో గుమాస్తా ఎల్.రమణ
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్లో ఎల్.రమణ చేరిక దొరల గడీలో మరో గుమాస్తా చేరినట్లుగా ఉందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ (టీటీడీపీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిలయ్య యాదవ్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో లాక్డౌన్ కారణంగా ఎక్కువగా నష్టపోయింది చేనేత కార్మికులేనని, వారిని ఆదుకోవాలని 10 రోజులు నిరాహార దీక్షలు చేసినా సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని శుక్రవారం ఒక ప్రకటనలో ఆయన వాపోయారు. వస్త్రాలు కొనుగోలు చేయాలని ప్రాధేయపడినా పట్టించుకోలేదని, టీఆర్ఎస్ హయాంలో చేనేతలకు ఒనగూరింది శూన్యమని అయిలయ్య విమర్శించారు. -
ఎల్ రమణకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేసీఆర్
-
ఎల్. రమణ నాకు మంచి స్నేహితుడు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్. రమణ జూలై 12న టీఆర్ఎస్లో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్, ఎల్.రమణకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘ఎల్.రమణ నాకు మంచి స్నేహితుడు. తనకు మంచి రాజకీయ భవిష్యత్ ఉంటుంది. ఎల్.రమణ తాను నమ్ముకున్న సిద్ధాంతం కోసం పనిచేస్తారు. చేనేత వర్గానికి రాజకీయ ప్రాధాన్యత కావాలి. చేనేతలను బాధల నుంచి విముక్తి కలిగించేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని తెలిపారు. -
కౌశిక్ చేరిక వాయిదా: టీఆర్ఎస్ మౌనం.. ఏం జరుగుతోంది?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఒక్కరోజులో చోటుచేసుకున్న నాటకీయ పరిణామాలతో గులాబీదళం మౌనం దాల్చింది. మాజీమంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్‌లో కారుదే జోరు అని తిరిగిన టీఆర్ఎస్ నేతల కాళ్లకు బ్రేక్ పడింది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఈటలపై కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన పాడి కౌశిక్ రెడ్డి ‘టీఆర్ఎస్ టికెట్టు నాకే కన్ఫర్మ్ అయింది’ అని మాట్లాడిన కాల్ రికా ర్డులు వైరల్ కావడమే ఇందుకు కారణం. రెండు నెలలుగా టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనే విషయంలో గోప్యత పాటిస్తూ వచ్చిన ఆ పార్టీ నాయకులు కౌశిక్‌రెడ్డి కమలాపూర్ మండలం మాదన్నపేట యువకుడు విజేందర్కు స్వయంగా ఫోన్‌చేసి చెప్పుకున్న ఆడియో లీక్ కావడంతో కంగుతి న్నారు. కౌశిక్ మాటల్లో మాదన్నపేట గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ నాయకుడు చరణ్ దగ్గరున్న యూత్ ను లాగాలని, అందుకోసం రూ.3వేల నుంచి రూ.5వేల వరకు ఇవ్వాలని చెప్పడం తెలిసిందే. రిఫరెన్స్‌గా చెప్పిన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాజిరెడ్డి కూడా అదే యువకుడికి ఫోన్ చేసి ‘చరణ్ పటేల్ దగ్గరున్న ఒక్కొక్కరికి రూ.5వేలు, మందు, ఖర్చులకు పైసలు ఇస్తాం. అందరినీ గుంజుకు రావాలె..’ అనడం వివాదాస్పదమైంది. డబ్బులతో కాంగ్రెస్ కార్యకర్తలను కొనుగోలు చేసుకుని కౌశిక్‌రెడ్డి టీఆర్ఎస్లోకి వెళుతున్నారనే ప్రచారం సోషల్‌మీడియా వేదికగా సాగింది. ఈ పరిణా మంతో గులాబీ నేతల్లో అంతర్మథనం మొదలైనట్లు సమాచారం. ఈ క్రమంలో 16న కేసీఆర్ సమక్షంలోఎల్.రమణతో కలిసి టీఆర్ఎస్లో చేరుతారని భావించిన కౌశిక్ రెడ్డి కూడా తన అంతరంగీకులతో భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. తాను 16న టీఆర్ఎస్లో చేరడం లేదని, నియోజకవర్గంలోని సన్నిహితులతో మాట్లాడిన తరువాతే నిర్ణయం తీసుకుంటానని ‘సాక్షి’కి తెలిపారు. నేటి కార్యనిర్వాహక సమావేశంలో స్పష్టత? రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, పార్టీ సంస్థాగత అంశాలపై చర్చించేందుకు బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో సమావేశం జరగనుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఆరు అంశాలపై చర్చిస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇదే సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుమతితో ‘ఇతర వ్యవహారాలపై’ కూడా చర్చించనున్నారు. ఆ వ్యవహారాల్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యవహారంతోపాటు కౌశిక్‌రెడ్డి ఎపిసోడ్, హుజూరాబాద్ ఉప ఎన్నిక గురించి కూడా చర్చించే అవకాశం ఉందని సమాచారం. కౌశిక్‌రెడ్డి పార్టీలో చేరుతారా..? పార్టీలో చేరినా టికెట్టు ఆయనకే ఇస్తారా..? ప్రత్యామ్నా య ఆలోచనలు ఏమిటనే విషయాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా.. 16న కేసీఆర్ సమక్షంలో టీడీపీ మాజీ నేత ఎల్.రమణ టీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. ఇతర పార్టీల్లోని మరికొందరు ముఖ్య నేతలు కూడా జిల్లా నుంచి వెళ్లి టీఆర్ఎస్లో చేరేలా ప్రయత్నాలు సాగుతున్నాయి. కౌశిక్ వ్యవహారంపై నోరెత్తని అధికార పార్టీ ఏం చేద్దాం..? కాంగ్రెస్‌లో కొనసాగుతూనే తనకే టీఆర్ఎస్ టికెట్ ఖరారైందని పాడి కౌశిక్‌రెడ్డి చేసిన ఫోన్ సంభాషణ రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ కావడం.. ఆ వెంటనే ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం.. కాంగ్రెస్ ఆయనను బహిష్కరించడం వంటి పరిణామాలను టీఆర్ఎస్ నాయకత్వం క్షుణ్ణంగా పరిశీలించింది. కౌశిక్‌రెడ్డి, ఆ యన అనుచరుడు రాజిరెడ్డి ఫోన్ సంభాషణలతో పార్టీ ఇమేజ్‌కు ఏమైనా నష్టం కలిగిందా..? అనే కోణంలో కూడా పార్టీ నేతలు ఆరా తీస్తున్నారు. కౌశిక్‌ను టీఆర్ఎస్లోకి తీసుకుని టికె ట్టు ఇస్తే హుజూరాబాద్‌లో కాంగ్రెస్ నామరూపాల్లేకుండా పోతుందని, కాంగ్రెస్ ఓటు బ్యాంకు కూడా తమకే అనుకూలంగా మారుతుందని టీఆర్ఎస్ అధిష్టానం భావించింది. ఉప ఎన్నిక కోసం చేయించిన ఇంటలిజెన్స్, వ్యక్తిగత సర్వేల్లో కూడా ఈటలకు పోటీగా కౌశిక్‌రెడ్డి బలమై న నాయకుడిగా నివేదికలు వచ్చాయి. ఈ మే రకు సాక్షాత్తు ముఖ్యమంత్రే ఆదివారం నాటి హుజూరాబాద్ సమావేశంలో ‘కౌశిక్ రెడ్డి వస్తానంటున్నాడు.. ఎలా ఉంటది’ అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో మంత్రులు గంగుల కమలాకర్, కొప్పు ల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు వంటి నేతలు చేస్తున్న ప్రచారానికి కూడా పార్టీ యంత్రాంగం నుంచి పాజిటివ్ స్పందనే కనిపించింది. ఈ పరిణామాల క్రమంలో కౌశిక్‌రెడ్డి ఫోన్ సంభాషణ టీఆర్ఎస్ నేతల ఉత్సాహాన్ని నీరుగార్చినట్లయింది.మంగళవారం హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ మినహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర పెద్ద నాయకులెవరూ నియోజకవర్గంలో కనిపించకపోవడం గమనార్హం. -
టీఆర్ఎస్లో చేరిన ఎల్. రమణ
-
టీఆర్ఎస్ దూకుడు.. రమణ రాకతో ప్రయోజనం ఉంటుందా?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అందరి దృష్టిని ఆకర్షిస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం అధికార టీఆర్ఎస్ దూకుడు పెంచింది. మాజీ మంత్రి ఈటలను అష్టదిగ్బంధం చేసేందుకు అవకాశం ఉన్న అన్ని వనరులను వాడుతోంది. ఇప్పటికే నియోజకవర్గంలో మోహరించిన మంత్రులు, ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ క్యాడర్ ఈటల వెంట వెళ్లకుండా చూడడంలో తొలి విజయం సాధించారు. అదే ఊపులో మండల కేంద్రాలు, గ్రామాల వారీగా స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశమవుతూ ప్రజలు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెడుతున్నారు. ఇంటర్నల్ రోడ్లు, భగీరథ నీళ్లు మొదలుకొని డబుల్ బెడ్రూం ఇళ్ల వరకు జనం కోరికలు తీర్చేందుకు హామీలు గుప్పిస్తున్నారు. గ్రామాల్లో ఇంకా సమస్యలు రాజ్యమేలడానికి ఇన్నాళ్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ కారణమని తమ ప్రసంగాల ద్వారా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. శుక్రవారం హుజూరాబాద్‌లో పర్యటించిన మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు నియోజకవర్గ వెనుకబాటుకు ఈటలే కారణమని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలకు అవసరమైన అన్ని వనరులు సమకూర్చే అవకాశం ఉండి కూడా ఏమీ చేయలేదని, తన ఆస్తులు పెంచుకునేందుకు మాత్రమే ఈటల ప్రయత్నించారని విమర్శించారు. మంత్రి గంగుల కమలాకర్ కలెక్టర్ శశాంకతో కలిసి సిరసపల్లిలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించారు. హుజూరాబాద్‌లో అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లను ఇప్పించేందుకు ప్రయత్నిస్తామని, ముందుగా సిరిసపల్లిలోని రెండు ప్రాంతాల్లో నిర్మిస్తున్న 500 ఇళ్లను అర్హులకు అందించి, మిగతా వారికి కూడా దశలవారీగా ఇళ్లు ఇప్పిస్తామని మంత్రి గంగుల హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఎక్కడికక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలను కలుస్తూ, స్థానిక సమస్యలను ఎత్తి చూపుతున్నారు. ఆరుసార్లు గెలిచిన ఈటల రాజేందర్ కారణంగానే వెనుకబాటుకు గురైనట్లు స్థానికులను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అధికార యంత్రాంగం అండతో.. మండలాలు, గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు తీసుకొచ్చిన పెండింగ్ సమస్యలను వీలైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించేలా మంత్రులు యాక్షన్‌లోకి దిగుతున్నారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఇతర అధికారులకు ఫోన్లు చేసి సంబంధిత సమస్యను తక్షణమే పరిష్కరించేలా ఆదేశాలు జారీ చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రావడం లేదన్న సర్పంచుల ఫిర్యాదులు, రైతుబంధు, పట్టా భూముల విషయంలో రెవెన్యూ తిరకాసులు, పింఛన్లు, సీఎంఆర్ఎఫ్, కళ్యాణలక్ష్మి వంటి ఏ సమస్యనైనా తక్షణమే పరిష్కారమయ్యేలా అధి కార యంత్రాంగాన్ని ఆదేశిస్తున్నారు. ‘మీరు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన నాయకుడు ఈ చిన్న సమస్యలను కూడా పరిష్కరించలేదు’ అంటూ ఈటలకు వ్యతిరేక భావన కలిగేలా వ్యవహరిస్తున్నారు. ఎల్.రమణతో బీసీల్లోకి.. నియోజకవర్గంలో బీసీ కులాలపై ప్రధానంగా అధికార పార్టీ దృష్టి పెట్టింది. ఇక్కడ పద్మశాలి వర్గం ఓట్లు అధికంగా ఉండడంతో టీటీడీపీకి రాజీనామా చేసిన అధ్యక్షుడు ఎల్.రమణను రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం టీడీపీకి రాజీనామా చేస్తూ పార్టీ అధినేత చంద్రబాబుకు లేఖ పంపిన రమణ రెండు రోజుల్లో టీఆర్ఎస్లో అధికారికంగా చేరనున్నారు. ఆయనను పద్మశాలి వర్గానికే పరిమితం చేయకుండా మంత్రి గంగులతోపాటు బీసీ నాయకుడిగా జనంలోకి తీసుకెళ్లాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. రమణ రాకతో బీసీ వర్గాల్లో కొంత పాజిటివ్ ఇమేజ్ పెరుగుతుందని అధికార పార్టీ అంచనా. సామాజిక సమీకరణాలతో.. గతంలో ఎన్నడూ లేని విధంగా హుజూరాబాద్‌లో ఈసారి సామాజిక సమీకరణల అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. బీసీ, ఎస్సీ వర్గానికి చెందిన మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ ఆయా కులాలకు చెందిన ముఖ్య నాయకులు, సంఘాలతో సమావేశమై ఈటల తీరును విమర్శిస్తున్నారు. ఈటలను ‘దొర’గా అభివర్ణిస్తున్న మంత్రి గంగుల బీసీ వర్గానికి చెందిన ఒక్కో సామాజికవర్గంతో సమావేశమై తాయిలాలు ప్రకటిస్తున్నారు. మంత్రి కొప్పుల సైతం ఎస్సీ వర్గాలను ఒకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని మండలాలకు చెందిన కుల సంఘాల నాయకులతో మంత్రులు సమావేశాలు జరిపారు. స్థానిక ఎంపీపీలు, జెడ్పీటీసీల సహకారంతో కులాల వారీగా గ్రామాల్లో కూడా ఓటర్లను ఆకర్షించేందుకు పలు తాయిలాలు ప్రకటిస్తున్నారు. -
టీడీపీకి ఎల్.రమణ గుడ్‌బై
సాక్షి, హైదరాబాద్: టీడీపీకి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు పంపిన తన రాజీనామా లేఖను శుక్రవారం మీడియాకు విడుదల చేశారు. ‘తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రజలకు మరింత చేరువగా రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావాలనే భావనతో టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నాను. టీడీపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నాను. గత 30 ఏళ్లుగా నా ఎదుగుదలకు సహకరించిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు’అని చంద్రబాబుకు పంపిన ఆ లేఖలో ఎల్.రమణ పేర్కొన్నారు. తెలంగాణ భవన్ వేదికగా చేరిక ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో గురువారం భేటీ అయిన ఎల్.రమణ అధికారికంగా టీఆర్ఎస్లో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో ఎల్.రమణ సన్నిహితుడు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తీరిక లేకుండా ఉన్నారు. దీంతో పల్లె ప్రగతి కార్యక్రమం ముగిసిన తర్వాత తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ముహూర్తం ఎప్పుడనేది ఇంకా నిర్ణయించుకోలేదని ఎల్.రమణ ‘సాక్షి’కి వెల్లడించారు. నాలుగైదు రోజుల్లో టీఆర్ఎస్లో చేరే అవకాశముందని, చేరిక తేదీపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని చెప్పారు. -
టీఆర్ఎస్ గూటికి టీటీడీపీ చీఫ్ ఎల్.రమణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ టీఆర్ఎస్లో చేరుతున్నారు. గురువారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి ప్రగతిభవన్‌కు వెళ్లిన రమణ.. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. సుమారు గంటన్నర పాటు వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు గతంలో టీడీపీలో కలిసి పనిచేసిన రోజులను గుర్తు చేసుకోవడంతోపాటు ఉద్యమం, తర్వాతి రాజకీయ పరిణామాలపై మాట్లాడుకున్నట్టు తెలిసింది. తెలంగాణ ఏర్పాటయ్యాక టీడీపీ ప్రజల్లోకి వెళ్లలేకపోయిందని, రమణ ఎంత కష్టపడినా ఫలితం లేకుండా పోయిందని వారు అభిప్రాయపడ్డట్టు సమాచారం. అయితే సామాజిక తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాలను వివరించిన సీఎం కేసీఆర్.. ఆ లక్ష్య సాధన కోసం కలిసి పనిచేద్దామని రమణకు ప్రతిపాదించినట్టు తెలిసింది. రమణ రాజకీయ భవిష్యత్తుకు భరోసా ఇవ్వడంతోపాటు ఆయన వెంట వచ్చే వారికి సముచిత అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చినట్టు సమాచారం. ఎల్.రమణ టీఆర్ఎస్లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారని, అనుచరులతో చర్చించి ముహూర్తం నిర్ణయించుకుంటానని చెప్పినట్టు తెలిసింది. త్వరలో జరుగనున్న ఎమ్మెల్యే కోటా శాసనమండలి ఎన్నికల్లో రమణకు ఎమ్మెల్సీగా అవకాశమిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్టు సమాచారం. రమణ చేరికపై ఆది, సోమవారాల్లో ప్రకటన రానున్నట్టు తెలిసింది. టీటీడీపీ శాసనసభాపక్షం గతంలోనే టీఆర్ఎస్లో విలీనమైంది. తాజాగా రమణ వెళ్లిపోతుండటంతో తెలంగాణలో ఆ పార్టీ ఉనికి కోల్పోయినట్టేనని నేతలు అంటున్నారు. రమణ బాటలో మరికొందరు మాజీలు ఎల్.రమణ టీఆర్ఎస్లో చేరుతుండటంతో టీడీపీకి చెందిన మరికొందరు కూడా టీఆర్ఎస్లో చేరేందుకు ప్రయత్నిన్నట్టు తెలిసింది. హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన ఓ మాజీ మంత్రితోపాటు, ఆలేరు ప్రాంతానికి చెందిన ఓ ముఖ్య నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు కూడా టీఆర్ఎస్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. కేసీఆర్ ఆహ్వానించారు: రమణ సీఎం కేసీఆర్‌తో భేటీలో రాష్ట్రంలో అమలవుతున్న కార్యక్రమాలు, సామాజిక తెలంగాణగా తీర్చిదిద్దేందుకు జరుగుతున్న ప్రయత్నాలు, అభివృద్ధి తదితరాలపై చర్చ జరిగింది. 27 ఏళ్లుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను. నేను మంత్రిగా ఉన్నప్పుడు చేనేత పరిశ్రమను ప్రోత్సహించిన తీరును సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ఈ రంగంలో మరింత సేవ చేసే అవకాశం ఉందన్నారు. పార్టీలో చేరాలనే కేసీఆర్ ఆహ్వానంపై మా మిత్రులతో మాట్లాడి నిర్ణయానికి వస్తా. టీటీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు ఇచ్చిన అవకాశంతోనే ఈ స్థాయికి ఎదిగా. ఉద్యమ సహచరుడు: ఎర్రబెల్లి రమణ నాకు మంచి మిత్రుడు. ఉద్యమ సమయంలో తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు లేఖ ఇవ్వడంలో మేం ప్రముఖ పాత్ర పోషించాం. తెలంగాణలో టీడీపీకి మనుగడ లేదు. -
ఎల్.రమణ కారెక్కడమే ఆలస్యమా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఎల్.రమణ త్వరలో టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఎల్.రమణ ప్రగతిభవన్‌కు వెళ్లారు. దీంతో ఆయన టీఆర్ఎస్లో చేరబోతున్నాడనే వార్తలకు మరింత బలం చేకూరుతోంది. టీఆర్ఎస్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి ఎల్.రమణ ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. ఇక తెలంగాణ తెలుగుదేశం శాసనసభాపక్షం(టీడీఎల్పీ) ఇటీవలే అధికార టీఆర్ఎస్ పక్షంలో విలీనం కాగా, ఎల్.రమణ కూడా గుడ్‌బై చెబితే రాష్ట్రంలో టీడీపీ పూర్తిగా కనుమరుగైనట్టేనని చెప్పవచ్చు. టీఆర్ఎస్లో చేరికకు సంబంధించి పార్టీ నేతలు కొందరు రమణతో కొంతకాలంగా మంతనాలు సాగిస్తున్నారని సమాచారం. అయితే, తాజాగా ఈ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. దీనిపై రెండు మూడురోజుల్లోనే పూర్తి స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక ఎల్.రమణ అంటే సీఎం కేసీఆర్‌కు అభిమానం అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. చేనేత వర్గాలకు చాలా చేశాం.. ఇంకా చేయాల్సి ఉందని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రతిపాదనకు ఎల్.రమణ సానుకూలంగా స్పందించారని మంత్రి ఎర్రబెల్లి వెల్లడించారు. -
తెలంగాణ: టీడీపీకి భారీ షాక్
-
కారెక్కనున్న రమణ?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకు పోనుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఎల్.రమణ టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు సమాచారం. తెలంగాణ తెలుగుదేశం శాసనసభాపక్షం(టీడీఎల్పీ) ఇటీవలే అధికార టీఆర్ఎస్ పక్షంలో విలీనం కాగా, ఎల్.రమణ కూడా గుడ్‌బై చెబితే రాష్ట్రంలో టీడీపీ పూర్తిగా కనుమరుగైనట్టేనని చెప్పవచ్చు. టీఆర్ఎస్లో చేరికకు సంబంధించి పార్టీ నేతలు కొందరు రమణతో కొంతకాలంగా మంతనాలు సాగిస్తున్నారు. అయితే, తాజాగా ఈ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. దీనిపై రెండు మూడురోజుల్లోనే పూర్తి స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అధినేత కేసీఆర్ పచ్చజెండా టీఆర్ఎస్లో రమణ చేరికకు సంబంధించి గతంలో తెలుగుదేశం పార్టీలో కీలకనేతగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్‌రావు మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. పార్టీలోకి రావాల్సిందిగా ఎల్.రమణకు గతంలోనూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ నుంచి ప్రతిపాదన వెళ్లింది. అయితే తాజాగా మరోసారి రమణను టీఆర్ఎస్ గూటికి చేర్చే బాధ్యతను ఎర్రబెల్లి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావుతో రమణ మాట్లాడినట్లు తెలిసింది. దీంతో పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు త్వరలో జరిగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ ప్రతిపాదనకు రమణ కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం పొరుగు రాష్ట్రంలో ఉన్న ఎర్రబెల్లి దయాకర్‌రావు రెండు మూడురోజుల్లో హైదరాబాద్‌కు చేరుకున్న తర్వాత రమణ చేరిక ప్రక్రియ ఊపందుకోనుంది. రమణ చేరికకు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కూడా పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. కలిసిరానున్న ఎమ్మెల్సీ ఎన్నికలు ఎమ్మెల్యే కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఈ నెల 3న ఖాళీ అయినా.. కరోనా పరిస్థితుల్లో ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఖాళీ అయ్యే స్థానాల్లో పద్మశాలి సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పిస్తామని గతంలో కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ సామాజికవర్గం నుంచి ఎమ్మెల్సీ పదవిని ఆశించిన మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ ఇటీవల తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా నియమి తులయ్యారు. మరో నేత, మాజీ ఎంపీ గుండు సుధారాణి వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఇదే సామాజికవర్గానికి చెందిన ఎల్.రమణను పార్టీలో చేర్చుకుని ఎమ్మెల్సీ పదవిని అప్పగిస్తే బహుళ ప్రయోజనాలు ఉంటాయని టీఆర్ఎస్ భావిస్తున్నట్లు సమాచారం. చదవండి: ఊపిరి ఉన్నంతవరకూ కేసీఆర్ వెంటే.. -
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక బరిలో టీడీపీ
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో పోటీ చేయాలని టీటీడీపీ నిర్ణయించింది. మువ్వా అరుణ్‌కుమార్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. నియోజకవర్గంలోని అనుముల మండలం చింతగూడెం గ్రామానికి చెందిన అరుణ్‌కుమార్ గతంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా, టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర నాయకుడిగా పనిచేశారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ అసెంబ్లీ పార్టీ ఇన్చార్జిగా ఉన్నారు. రంగారెడ్డి –హైదరాబాద్–మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎల్.రమణ బరిలో ఉంటారనే ప్రచారం జరుగుతోంది. -
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు
సాక్షి, హైదరాబాద్/సాక్షి, అమరావతి: టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. పార్టీ కేంద్ర కమిటీ, ఏపీ, తెలంగాణ రాష్ట్ర కమిటీలను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సోమవారం ప్రకటించారు. 27 మందితో కేంద్ర కమిటీ, 25 మందితో పొలిట్ బ్యూరోను ప్రకటించారు. పొలిట్‌బ్యూరోలో తొమ్మిది మంది బీసీలతో కలిసి మొత్తం 60 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను నియమించినట్లు టీడీపీ రాష్ట్ర కార్యాలయం తెలిపింది. కేంద్ర కమిటీలో 49 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కేటాయించినట్లు పేర్కొంది. ఎల్.రమణను మరోసారి తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా నియమించారు. కేంద్ర కమిటీ: టీడీపీ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షులుగా ప్రతిభా భారతి, గల్లా అరుణకుమారి, డీకే సూర్యప్రభ, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, మచ్చా నాగేశ్వరరావు, చిలువేరు కాశీనాథ్.. ప్రధాన కార్యదర్శులుగా నారా లోకేశ్, వర్ల రామయ్య, రామ్మోహన్ నాయుడు, నిమ్మల రామానాయుడు, బీద రవిచంద్ర, కొత్తకోట దయాకర్‌రెడ్డి, బక్కని నరసింహులు, కంభంపాటి రామ్మోహనరావు (జాతీయ రాజకీయ వ్యవహారాలు).. రాజకీయ కార్యదర్శిగా టీడీ జనార్దనరావు, అధికార ప్రతినిధులుగా గునపాటి దీపక్‌రెడ్డి, కొమ్మారెడ్డి పట్టాభిరాం, మహ్మద్ నజీర్, ప్రేమ్‌కుమార్ జైన్ , టి.జ్యోత్స్న, నన్నూరి నర్సిరెడ్డి, కేంద్ర కార్యాలయ కార్యదర్శిగా అశోక్‌బాబును నియమించారు. క్షమశిక్షణా కమిటీ చైర్మన్‌గా బచ్చుల అర్జునుడు, సభ్యులుగా మునిరత్నం, గుంటుపల్లి నాగేశ్వరరావు, బంటు వెంకటేశ్వరరావును, కోశాధికారిగా శ్రీరాం రాజగోపాల్‌ను నియమించారు. పొలిట్‌బ్యూరో ఇదీ: పొలిట్‌బ్యూరో సభ్యులుగా యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజు, అయ్యన్నపాత్రుడు, కేఈ కృష్ణమూర్తి, చినరాజప్ప, సోమిరెడ్డి చంద్రమోహ¯Œ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, బాలకృష్ణ, వర్ల రామయ్య, కళా వెంకట్రావు, నక్కా ఆనంద్‌బాబు, బుచ్చయ్య చౌదరి, బొండా ఉమా, ఎన్ ఎండీ ఫరూక్, గల్లా జయదేవ్, రెడ్డపగాని శ్రీనివాసరెడ్డి, పితాని, కొల్లు రవీంద్ర, అనిత, సంధ్యారాణి, ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, అరవింద్‌కుమార్ గౌడ్‌ను నియమించారు. లోకేష్, అచ్చెన్నకు పొలిట్ బ్యూరోలోనూ అవకాశమిచ్చారు. -
తెలంగాణ టీడీపీలో తిరుగుబాటు
-
తెలంగాణ టీడీపీలో తిరుగుబాటు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. ప్రస్తుతం టీటీడీపీ అధ్యక్షుడుగా ఉన్న ఎల్.రమణ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న పార్టీ నేతలు తిరుగుబాటుకు ఉపక్రమించారు. తెలంగాణ పార్టీ నాయకత్వ మార్పు కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. గత ఏడేళ్లుగా ఒకే వ్యక్తి అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారని, రాష్ట్రంలో పార్టీ ఉనికి ఆందోళనలో పడిందని, ఇప్పటికైనా అధ్యక్షుడిని మార్చాలంటూ విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో టీడీపీ పరిస్థితిని వివరిస్తూ, కింది స్థాయి కార్యకర్త నుంచి పార్లమెంటు ఇంఛార్జి, కోర్ కమిటీ వరకు ఈ మేరకు తమ డిమాండ్లు తెలుపుతూ లేఖ రాశారు.(చదవండి: చంద్రబాబు వ్యాఖ్యలు హాస్యాస్పదం..) కాగా ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ టీడీపీ ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన సమయంలో రెండు కళ్ల సిద్ధాంతాన్ని అవలంబించిన చంద్రబాబు విధానంతో, పార్టీ నుంచి వలసలే తప్ప, చెప్పుకోదగ్గ స్థాయిలో కొత్తగా ఎవరూ పార్టీలో చేరిన దాఖలాలు లేవు. అంతేగాక ప్రతీ ఎన్నికల్లోనూ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకునే చంద్రబాబు, గత ఎన్నికల్లో ఏకంగా కాంగ్రెస్ పార్టీతో జట్టుకట్టడంతో టీడీపీ మద్దతుదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన సంగతి తెలిసిందే. -
సామ్రాజ్యవాద కొత్త ముసుగులో అశాంతికి కుట్రలు
సాక్షి, హైదరాబాద్: సామ్రాజ్యవాదం కొత్త ముసుగులో అణ్వాయుధాలతో విధ్వంసాలు, మతాల పేరిట ఘర్షణలు సృష్టించేందుకు ప్రపంచ వ్యాప్తంగా కుట్రలు సాగుతున్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. శాంతి, సౌభ్రాతృత్వం కోసం విద్యార్థులు, యువతను తగిన రీతిలో తీర్చిదిద్ది, వారిని ఈ రంగంలో ఉపయోగించే విషయంలో మేధావులు కృషి చేయాలని ఆయన కోరారు. శనివారం ఒక ప్రైవేట్ హోటల్లో ఆల్ ఇండియా పీస్, సాలిడారిటీ ఆర్గనైజేషన్ ద్వితీయ మహాసభలో ఆయన మాట్లాడుతూ అమెరికా వంటి సామ్రాజ్యవాద దేశాలు, దోపిడీని, అశాంతిని నెలకొల్పే స్వభావం ఉన్న దేశాల విషయంలో లోతుగా ఆలోచించే సమయం ఆసన్నమైందన్నారు. ఇటీవలి తన అమెరికా పర్యటనలో ఆసక్తికరమైన విషయాలు దృష్టికి వచ్చాయని, అక్కడి యువత ఆర్థికంగా ఎదగడం కన్నా సోషలిజం వైపు మొగ్గుచూపుతున్నారని ఆయన ప్రస్తావించారు. ఆహ్వాన సంఘం చైర్మన్ కాచం సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కాంగ్రెస్ నాయకుడు, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, శాంతి సంఘీభావ సంఘం నాయకులు పల్లబ్ సేన్ గుప్తా, అరుణ్ కుమార్, తిప్పర్తి యాదయ్య, జగన్మోహన్, రఘుపాల్ పాల్గొన్నారు. -
రోగాల నగరంగా మార్చారు
హైదరాబాద్: విశ్వనగరంగా హైదరాబాద్‌ను మారుస్తామన్న టీఆర్ఎస్ ప్రభుత్వం అవగాహనలేమితో రోగాల నగరంగా మార్చిందని అఖిలపక్ష నేతలు ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు రోగాలతో విలవిలలాడుతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని ధ్వజమెత్తారు. సీజనల్ వ్యాధుల కారణంగా నగరంలోని నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి రోగుల తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో శనివారం అఖిలపక్ష నేతలు ఆ ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రి ఆర్ఎంవో డాక్టర్ పద్మజతో సమావేశమైన నేతలు రోగులకు అందిస్తున్న వైద్యం, సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం వార్డు–2లోకి వెళ్లి రోగులను పరామర్శించారు. ‘ఫీవర్’కే ఫీవర్: కోదండరాం ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ధర్మాసుపత్రి గా పేరుగాంచిన ఫీవర్ ఆస్పత్రికే జ్వరం వచ్చినట్లుందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. విషజ్వరాల నేపథ్యంలో మంత్రులు, అధికారులు ఆస్పత్రుల సందర్శనలు, పరామర్శలతో సమస్యలు పరిష్కారం కావన్నారు. రోగుల తాకిడి దృష్ట్యా ఓపీ కౌంటర్లలో ఉన్న వైద్యులపై అధిక పని భారం పడుతోందన్నారు. దీంతో అదనపు ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేసి అందుకనుగుణంగా సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. అన్ని ప్రభుత్వ విభాగాల్లోని ఉద్యోగ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలన్నారు. చోద్యం చూస్తోంది: ఎల్.రమణ రాష్ట్రమంతా విషజ్వరాలతో అల్లాడుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు నగరం నాలుగు దిక్కుల్లో వెయ్యి పడకల ఆస్పత్రులు నాలుగు ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు ప్రయత్నాలు చేయలేదని ప్రశ్నించారు. రూ.కోట్లు ఖర్చు చేసి ప్రగతి భవన్ నిర్మించింది విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకేనన్నారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సరైన కార్యాచరణ లేదు: చాడ వైద్యం పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వానికి సరైన కార్యాచరణ లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. రోగుల తాకిడి దృష్ట్యా ఫీవర్ ఆస్పత్రికి అదనపు సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. విషజ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, సాయిబాబా, సీపీఐ నేత అజీజ్ పాషా, డాక్టర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
టీటీడీపీ వాషవుట్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిపోతోంది. రాష్ట్రంలో దాదాపు అడుగంటిన ఆ పార్టీలో మిగిలిపోయిన నియోజకవర్గ, మండలస్థాయి నేతలంతా బీజేపీ బాటపడుతున్నారు. బీజేపీ అధిష్టానం ప్రత్యేక ఆపరేషన్‌తో రాష్ట్రంలో నలుగురైదుగురు ముఖ్య నేతలు మినహా అందరూ త్వరలోనే కమలదళంలో చేరనున్నారు. ఈ మేరకు నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లా ల్లోని పార్టీ నేతలు మూకుమ్మడి రాజీనామాలు ప్రకటించగా, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల్లో మిగిలిన నేతలు కూడా నేడో, రేపో పార్టీని వీడనున్నారు. 2023 నాటికి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలన్న ఆకాంక్షతో బీజేపీ అధిష్టానం టీడీపీ నేతలపై దృష్టిపెట్టి ఆ పార్టీని దాదాపు వాషవుట్ చేస్తుండడం గమనార్హం. మునిగిపోయిన నావలో మురవలేం తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో టీడీపీ మనుగడ ప్రశ్నార్థకమైపోయింది. ఐదారేళ్లుగా జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీని నానాటికీ కుదేలు చేశాయి. దీంతో పార్టీలో ని మెజారిటీ నేతలు వేరేదార్లు వెతుక్కుంటున్నా రు. కొందరు మాత్రం పార్టీపై ఉన్న అభిమానంతో పాటు ఏ పార్టీలోకి వెళ్లే అవకాశం లేక పచ్చజెండా నే పట్టుకుని ఉన్నారు. ఇప్పుడు బీజేపీ రూపంలో వారికి ప్రత్యామ్నాయం కనిపిస్తుండడంతో నిండా మునిగిపోయిన నావలో ఇంకా మురవలేమంటూ ఆ పార్టీ బాట పడుతున్నారు. బుధవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాల ఇంచార్జ్‌లు, ముఖ్యనేతలు సమావేశమై తాము టీడీపీకి రాం రాం చెప్పి బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. పార్టీ సభ్యత్వం, పదవులకు రాజీ నామా చేస్తున్నామని వెల్లడించారు. వరంగల్, ఖమ్మం జిల్లా నేతలు కూడా వీడ్కోలు తప్పదనే సంకేతాలిచ్చారు. రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి కూడా తాను బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల్లో మిగిలిపోయిన నేతలతో కూడా బీజేపీ నాయకత్వం సంప్రదింపులు జరుపుతుండటంతో వారు కూడా నేడో, రేపో పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. వీరంతా ఈనెల18న నాంపల్లిలో జరిగే సభలో బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, కొత్తకోట దయాకర్‌రెడ్డి, దేవేందర్‌గౌడ్ వంటి నలుగురైదుగురు నేతలు మినహా టీటీడీపీ నేతలంతా బీజేపీలో కలిసిపోతుండటం, పార్టీ అధినేత చంద్రబాబు పార్టీని పట్టించుకోకపోవడంతో ఇక రాష్ట్రంలో టీడీపీ కనుమరుగైపోతుందనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ నేతలకూ గాలం! జాతీయాధ్యక్షుడు అమిత్‌షా నేతృత్వంలో జరుగుతున్న ఆపరేషన్‌తో గట్టి పునాదులు వేసుకోవాలనుకుంటున్న బీజేపీ.. కాంగ్రెస్ నేతలకూ గాలమేస్తోంది. బీజేపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం కాంగ్రెస్ నుంచి ఆ పార్టీలోకి వెళ్లాలను కుంటున్న వారి జాబితా చాంతాడంత ఉంది. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహతో పాటు ఇద్దరు మాజీ ఎంపీలు, 10 మందికి పైగా మాజీ ఎమ్మెల్యేలతో తాము చర్చలు జరుపుతున్నామని, వారంతా పార్టీలోకి వచ్చేందుకు రంగం సిద్ధమవుతోందని బీజేపీ నేతలు చెపుతున్నారు. అయితే, అదంతా బీజేపీ ప్రచారం మాత్రమేనని కాంగ్రెస్ నేతలంటున్నారు. కాగా, రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ ఎంపీ ఒకరు బీజేపీ అధిష్టానంతో పూర్తిస్థాయిలో టచ్‌లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ను ఆయన కలిశారని, ఇటీవలే హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌తోనూ ఆయన భేటీ అయ్యారని తెలుస్తోంది. ఆయన దాదాపు బీజేపీలోకి వెళ్లేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని, అమిత్‌షా పర్యటనలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం. బాబు అనుమతితోనేనా? టీటీడీపీ నేతలు బీజేపీలోకి వెళుతుండటం వెనుక చంద్రబాబు వ్యూహముందనే చర్చ జరుగుతోంది. ఆయన అనుమతితోనే కమ లతీర్థం పుచ్చుకుంటున్నారని, తనకెలాంటి ఇబ్బందుల్లేకుండా ఉండేందుకు తెలంగాణ పార్టీని చంద్రబాబు పణంగా పెడుతున్నార ని ‘తమ్ముళ్లు’బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. బాబు సూచనల మేరకు ఆయన వ్యాపారభాగస్వామి, రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు టీడీపీలోకి వెళుతున్నారంటున్నారు. ఏపీటీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్‌లు కూడా బాబు కనుసన్నల్లో కాషాయ కండువా కప్పుకున్నారంటూ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. -
ఏం చేద్దాం.. ఎటువెళ్దాం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అస్తిత్వంకోసం కొట్లాడుతున్న తెలుగుదేశం పార్టీలో ఇంకా కొనసాగుతున్న రాజకీయ నాయకుల భవిష్యత్తేంటో వారికే అర్థం కావడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో పార్టీలో కీలక నేతలుగా, రాష్ట్ర మంత్రులుగా పలు హోదాల్లో.. ఓ వెలుగు వెలిగిన వీరు మారిన రాజకీయ పరిస్థితుల్లో చట్రబంధంలో ఇరుక్కుపోయారనే భావన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో దాదాపు టీడీపీ ఖాళీ అయినా.. వేళ్ల మీద లెక్కపెట్టగలిగినంత మంది నేతలు ఇంకా అదే పార్టీలో కొనసాగుతున్నారు. అయితే ఇలాంటి నేతలకు రాజకీయ భవిష్యత్తు మాత్రం కనుచూపుమేరలో కూడా కనిపించడం లేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇలాంటి కొందరు నేతలు పోటీకి దూరంగా ఉన్నారు. ఎంపీ ఎన్నికల్లో పార్టీ పోటీలోనే లేదు. దీనికి తోడు ప్రస్తుతం జరుగుతున్న పరిషత్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ చాలా తక్కువ స్థానాలకు పోటీచేస్తుండటం, ప్రస్తుతం పార్టీలో ఉన్న నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కూడా బీఫారాలు అడిగే నాయకుడు కూడా కనిపించలేదు. ఈ నేపథ్యంలో మే 23న ఎన్నికల ఫలితాల తర్వాత వీరి నిర్ణయం ఎలా ఉంటుందనేదే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. చెట్టుకొకరు.. పుట్టకొకరు! తెలంగాణ ఏర్పాటైన తర్వాత టీడీపీ ప్రభ మసకబారుతూ వస్తోంది. పార్టీ నేతలంతా అటు టీఆర్ఎస్లోకి లేదంటే కాంగ్రెస్‌లోకి.. మరికొందరు బీజేపీలోకి వెళ్లిపోయారు. రాష్ట్రస్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు ఇదే పరిస్థితి నెలకొంది. మొన్నటి పార్లమెంటు ఎన్నికల సమయంలో నిజామాబాద్‌కు చెందిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావులు కూడా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, వేళ్ల మీద లెక్కపెట్టగలిగినంత మంది నేతలు మాత్రం ఇంకా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. వారిలో.. ఒకప్పుడు టీడీపీ నం 2గా వెలుగొందిన మాజీ హోంమంత్రి టి.దేవేందర్‌గౌడ్, ఆయన రాజకీయ వారసుడు వీరేందర్‌గౌడ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఇనుగాల పెద్దిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి దంపతులు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, హైదరాబాద్‌కు చెం దిన అరవింద్‌కుమార్ గౌడ్ లాంటి నాయకులు అనివార్య పరిస్థితుల్లో పార్టీలో ఉంటున్నారు. టీడీపీ అ ధ్యక్షుడి హోదాలో ఎల్.రమణ అడపాదడపా బయట కనిపిస్తున్నా మిగిలిన నేతలు దాదాపుగా అజ్ఞాతంలోనే ఉండి రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పుడు వీరి పరిస్థితి ఏంటనేది దానిపై పార్టీలోపలా బయటా చర్చ జరుగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఫలితాలతో ఆశాభంగం కాగా.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఫలితాలు కీలకంగా మారనున్నాయి. ఏపీలో అధికారం దక్కకపోతే.. వీరిలో కొందరు ఈనెల 23 తర్వాత ఇతర పార్టీల్లో చేరే నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ‘మా పార్టీ చాలా గడ్డు పరిస్థితుల్లో ఉంది. తెలంగాణలో ఉనికిని చాటుకునేందుకు అవకాశం కూడా లేకుండా పోయింది. పార్టీలో ఉన్న నలుగురైదుగురు నేతలను కూడా లాగేసుకుంటే ఇక టీడీపీ గొడవ ఉండదని టీఆర్ఎస్, ఇతర పార్టీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మా పార్టీ త్వరలోనే పూర్తిగా ఖాళీ అయినా ఆశ్చర్యం లేదు’అని టీడీపీలో చాలాకాలంగా ఉన్న రాష్ట్ర స్థాయి నేత ఒకరు వ్యాఖ్యానించడం పార్టీ పరిస్థితికి అద్దం పడుతోంది. కాంగ్రెస్‌కు బీటీం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణలో పార్టీని వదిలేశారని టీడీపీ వర్గాల్లో బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్‌కు టీటీడీపీ బీ–టీంగా మారిందని పార్టీ నేతలే అంటున్నారు. కీలక నేతలు పోటీకి దూరంగా ఉండటం, లోక్‌సభ ఎన్నికల్లో అసలు పోటీనే చేయకపోవడంతో ఎవరూ పార్టీలో ఉండలేని పరిస్థితికి టీటీడీపీని చంద్రబాబు తీసుకువచ్చారంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో మిగిలిన నేతలైనా ఇంకెన్నాళ్లు పార్టీని పట్టుకుని ఉంటారు.. ఎప్పుడు జంప్‌జిలానీ అంటారో వేచి చూడాల్సిందే! -
మూకుమ్మడిగా ఉద్యమిద్దాం
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కోటాను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్సు జారీచేయడంపై అన్ని రాజకీయ పక్షాలు మండిపడ్డాయి. జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేష న్లు పెంచాల్సి ఉండగా, అనూహ్యంగా తగ్గించడాన్ని తీవ్రంగా తప్పుబట్టాయి. వెనుకబడిన తరగతులను అణగదొక్కాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని.. అందువల్ల రిజర్వేషన్ల సాధనలకు మూకుమ్మడిగా ఉద్యమించాలని నిర్ణయించాయి. ఇంతకుముందు జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 34% శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయగా.. ప్రస్తుతం దీన్ని 22 శాతానికే కుదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఆర్డినెన్సు సైతం జారీ చేసి రిజర్వేషన్లు ఖరారు చేయడాన్ని నిరసిస్తూ బుధవారం మాసబ్‌ట్యాంక్‌లోని గోల్కొండ హోటల్ లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరకు సుధాకర్, వీహెచ్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో మూడ్రోజుల కార్యాచరణను ఖరారు చేశారు. ఈ నెల 27న రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చెపట్టాలని నిర్ణయించాయి. ఈ నెల 28న అఖిలపక్ష నేతలు గవర్నర్ నరసింహన్, ప్రభుత్వ సీఎస్ ఎస్కే జోషిలను కలిసి పరిస్థితిని వివరించి రిజర్వేషన్లను పెంచాలని డిమాండ్ చేస్తారు. ఈ నెల 29న జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించనున్నారు. పార్టీలకతీతంగా ఉద్యమించాలి బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల అమలు సంగతి సరే.. పంచాయతీ ఎన్నికల్లో ఉన్న రిజర్వేషన్లు తగ్గించడం అన్యాయం. ఈ నిర్ణయంతో బీసీలు తీవ్రంగా నష్టపోతారు. నాయకుడిగా ఎదిగేందుకు దారిచూపే పంచాయతీ ఎన్నికల్లోనే బీసీలకు అవకాశాలు తగ్గితే వారి అభివృద్ధి కష్టమే. బీసీ రిజర్వేషన్లపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ను కోరినా ఆయన స్పందించలేదు. బీసీ రిజర్వేషన్లు తగ్గితే ఊరుకోం. కచ్చితంగా పోరాడతాం. పార్టీలకు అతీతంగా ఉద్యమిస్తాం. – ఎల్.రమణ, టీటీడీపీ అధ్యక్షుడు కులసంఘాలే ఓడించాయి బీసీలకు ఎక్కువ సీట్లివ్వాలని అన్ని కుల సంఘాలు డిమాండ్ చేశాయి. ఈమేరకు బీజేపీ ఏ పార్టీ ఇవ్వనన్ని సీట్లను బీసీలకు కేటాయించింది. కానీ ఆ బీసీ అభ్యర్థులను ఓడించింది బీసీ కుల సంఘాల నేతలే. వీరంతా తీర్మానించుకుని టీఆర్ఎస్ను గెలిపిస్తే.. బీసీల రిజర్వేషన్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పార్టీలకతీతంగా బీసీలంతా కలిసికట్టుగా ఉంటేనే న్యాయం జరుగుతుంది. సమగ్ర కుటుంబ సర్వేలో వెల్లడైన లెక్కలను సర్కారు బయటపెట్టడం లేదు. రిజర్వేషన్లు 50% మించకూడదని సుప్రీంకోర్టు ఏనాడూ చెప్పలేదు. జనగణన వివరాలను సమర్పిస్తే రిజర్వేషన్లు పెంచుకోవచ్చని కోర్టులే స్పష్టం చేశాయి. కలిసి పోరాడకుంటే బీసీలకు తీవ్ర అన్యాయం తప్పదు. – డాక్టర్ కె.లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభుత్వానివి కుంటిసాకులు బీసీ జనాభా ఎంతుందో ప్రభుత్వం చెప్పడం లేదు. కానీ రిజర్వేషన్లు మాత్రం అడ్డదిడ్డంగా తగ్గించింది. జనగణన లేనందునే 50% రిజర్వేషన్లు మించొద్దని కోర్టు చెప్పింది. వివరాలు సమర్పిస్తే పెంచొద్దని కోర్టులు చెప్పవు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కుంటి సాకులు చెబుతున్న ప్రభుత్వం.. కోర్టు ఆర్డర్‌ను బూచిగా చూపి ఆర్డినెన్స్ తీసుకొచ్చి రిజర్వేషన్లు అమలు చేస్తోంది. ముందుగా జనగణన చేసి వివరాలు వెల్లడించిన తర్వాతే పంచాయతీ ఎన్నికలకు వెళ్ళాలి. 2016లో ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ వేసి.. రిజర్వేషన్లపై స్టే తెచ్చుకోవచ్చు. ఆమేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఒక్కరోజులో సమగ్ర కుటుంబ సర్వే చేసిన కేసీఆర్ బీసీల లెక్కలు ఎందుకు చెప్పడం లేదు. బీసీలకు ప్రభుత్వం ద్రోహం చేస్తోంది. అన్ని పార్టీలు కలిసి ప్రధానికి వివరిస్తే రాజ్యాంగ సవరణ చేసే అవకాశం ఉంటుంది. – జస్టిస్ వి. ఈశ్వరయ్య న్యాయ పోరాటం చేద్దాం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం న్యాయపోరాటం చేయాలి. అదేవిధంగా రాజకీయ పార్టీలు క్షేత్రస్థాయిలో ప్రజా ఉద్యమాలు చేయాలి. పాలనను గాలికొదిలేసిన సీఎం కేసీఆర్ పొరుగురాష్ట్రాల చుట్టూ తిరుగుతున్నారు. అసలు ఇలా రాష్ట్రాలు పట్టుకుని సీఎం ఎందుకు తిరుగుతున్నాడో ప్రజలకు సమాధానం చెప్పాలి. బీసీ రిజర్వేషన్ల తగ్గింపు ఆర్డినెన్సును ఉపసంహరించుకున్న తర్వాత పర్యటనలు చేసుకోవాలి. – పొన్నాల – పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు సర్కారు కళ్లు తెరిపిద్దాం బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తూ ప్రభుత్వం ఆర్డి నె న్స్ జారీ చేయడాన్ని ఖండిస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి స్టే తెచ్చి ఎన్నికలు నిర్వహించారు. ఇప్పుడు కూడా స్టే తీసుకొచ్చి ఎన్నికలు నిర్వహించాలి. ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలి. అన్ని పార్టీలు ఐక్యంగా ఉద్యమించి ప్రభుత్వం కళ్లు తెరిపించాలి. – చాడ వెంకట్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జనాభా ప్రాతిపదికనే రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని రాజ్యాంగం చెబుతుంది. ఈ విధమైన రిజ ర్వేషన్ల ద్వారానే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది. వీటిని సాధించుకునేందుకు పార్టీలకతీ తంగా ఉద్యమం చేపట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కనీస విలువనివ్వడం లేదు. – చెన్నయ్య, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు రిజర్వేషన్ల కోసం కలిసి పోరాడదాం బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని పార్టీలు, సం ఘాలు ఒకే వేదిక ద్వారా పోరాడాలి. కాసాని జ్ఞానేశ్వర్, ఆర్.కృష్ణయ్య తదితరులంతా కలిసిరావాలి. ఒక పార్టీ టిక్కెట్ ఇవ్వనందుకు రాష్ట్ర బం ద్‌కు పిలుపునిచ్చి తర్వాత ఉపసంహరించుకోవడంలా బీసీ ఉద్యమాన్ని నడపొద్దు. బీసీ రిజర్వేషన్లను పంచాయతీలతోపాటు.. చట్టసభల్లోనూ అమలుచేసుకునేలా ఐక్యంగా ఉద్యమిద్దాం. – జాజుల శ్రీనివాస్‌గౌడ్ -
ఇందిరా పార్క్ వద్ద బీసీల మహా ధర్నా
హైదరాబాద్: రాబోయే పంచాయతీ రాజ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 23 శాతానికి తగ్గించడాన్ని నిరసిస్తూ బీసీలు మహా ధర్నాకు దిగారు. ధర్నాలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు, జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, పీసీసీ మాజీ ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. బీసీలపై కేసీఆర్ కక్ష కట్టారు: జాజుల ఎన్నికల్లో ఆశీర్వదించిన బీసీలపైనే కేసీఆర్ కక్ష కట్టారని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన గంటల వ్యవధిలోనే బీసీల రిజర్వేషన్లను 34 నుంచి 23 శాతానికి తగ్గిస్తూ ఆర్డినెన్స్ చేశారని విమర్శించారు. బీసీల రిజర్వేషన్ల సమస్యపై 24 గంటల్లోగా శాశ్వత పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. బీసీల రిజర్వేషన్లను రక్షించుకునేందుకు జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు. సమస్యకు పరిష్కారం చూపకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బలహీనవర్గాలకు రాయితీలు..దొరలకు అధికారమా?: ఎల్ రమణ బలహీనవర్గాలకు రాయితీలు..దొరలకు అధికారం అనే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ విమర్శించారు. సీఎం అఖిలపక్ష సమావేశం నిర్వహించి సమస్య పరిష్కరించాలన్నారు. ఎస్సీ, ఎస్టీలను కలుపుకునిపోయి బీసీ రిజర్వేషన్లను రక్షించుకోవాలని సూచించారు.బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టును ప్రశ్నించిన కేసీఆర్ తన నిర్ణయానికి కట్టుబడి ఉండాలని కోరారు. రిజర్వేషన్ల పోరాటంలో టీటీడీపీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రాణం పోయినా ఊరుకునేది లేదు:వీహెచ్ ప్రాణం పోయినా ఊరుకునేది లేదు..బీసీలకు రిజర్వేషన్ల పెంపు కోసం పోరాటం ఆపేది లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు స్పష్టం చేశారు. టీఆర్ఎస్లోని బీసీ ఎమ్మెల్యేలు రిజర్వేషన్లపై మాట్లాడాలని కోరారు. సకల జనుల సర్వేలో బీసీల లెక్కలు ఇప్పటికీ బయట పెట్టలేదని చెప్పారు. బీసీల ఓట్ల కోసం స్కీమ్‌లు పెట్టారు...ఎన్నికల్లో గెలిచాక బీసీల రిజర్వేషన్లు తగ్గించారు. బీసీల పట్ల సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదు..బీసీలు అధికారంలో భాగస్వామ్యం కావాలని కోరారు. సమగ్ర కుటుంబసర్వేలో 54 శాతం బీసీలు ఉన్నారని ప్రకటించిన వాస్తవమా కాదా చెప్పాలన్నారు. బీసీలు చట్టసభల్లోకి వెళ్లకుండా గొర్లు,బర్లు కాసుకునే బతకాలా అని సూటిగా అడిగారు. కేసీఆర్ పిట్టల దొర : షబ్బీర్ కేసీఆర్ ఒక పిట్టల దొర అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. బీసీలకు రిజర్వేషన్లను పెంచేందుకు కాంగ్రెస్ పార్టీ మద్ధతు ఉంటుందని స్పష్టం చేశారు. 34 శాతం కోసం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. సీఎం నిర్ణయం హాస్యాస్పదం: పొన్నాల సీఎంగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయం హాస్యాస్పదంగా ఉందని పీసీసీ మాజీ ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. బీసీ రిజర్వేషన్లపై ఇచ్చిన ఆర్డినెన్స్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమగ్ర కుటుంబ సర్వే చేసి చట్టబద్దం చేయలేదని వెల్లడించారు. బీసీలు రాజ్యాధికారం కోసం పోరాటం చెయ్యాలని సూచించారు. -
బీసీల రిజర్వేషన్లకు పోరాటం
హైదరాబాద్: స్థానిక సంస్థల్లో బీసీలకు ప్రస్తుతం ఉన్న 34 శాతం రిజర్వేషన్లు కొనసాగించాలనే డిమాండ్‌కు పార్టీలు, జెండాలు పక్కనబెట్టి తెలం గాణ ఉద్యమాన్ని స్పూర్తిగా తీసుకుని పోరాడాలని బీసీ సంఘాల నేతలు పిలుపునిచ్చారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అధ్యక్షతన ‘ఇప్పుడున్న బీసీల 34 శాతం రిజర్వేషన్లు రాబోయే గ్రామపంచాయతీ ఎన్నికల్లో అమలు చేయాలి’ అనే అంశంపై రౌండ్‌టేబుల్ సదస్సు జరిగింది. ఐక్యమైతేనే రాజ్యాధికారం: జస్టిస్ ఈశ్వరయ్య సమావేశంలో జాతీయ బీసీ కమిషన్ మాజీ అధ్యక్షుడు, రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. లెక్కల ప్రకారం 18 జిల్లాల్లో బీసీలు 55 శాతంకన్నా ఎక్కువగా ఉన్నారని, మిగిలిన జిల్లా ల్లో కూడా 50 శాతం ఉన్నామని తెలిపారు. అయితే సీఎం కేసీఆర్ తన సొంత లెక్కల ద్వారా ఎస్సీ, ఎస్టీలు పెరిగారని చెప్తూ వారికి రిజర్వేషన్లు పెంచి, బీసీలకు తగ్గించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలు ఇప్పుడు చైతన్యం కాకపోతే ఎప్పటికీ కాలేరని అంతా ఐక్యమై రాజ్యాధికారం దక్కేలా కృషిచేయాలన్నారు. ఉత్తరభారత దేశంలో మాదిరి ఇక్కడకూడా బీసీలపార్టీ ఒకటి ఏర్పాటు చేయాలన్నారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలకు 26 శాతం పోతే మిగిలిన 74 శాతం బీసీలే కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ.. వివిధ బీసీ కుల సంఘా ల ఆశీర్వాద సభలు పెట్టి అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు రాజ్యాధికారం దూరం చేసే కుట్ర లు పన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. రిజర్వేషన్లు తగ్గించడం చారిత్రాత్మక తప్పని, దీన్ని బడుగు, బలహీనవర్గాలవారు సహించరని నిరూపించాలన్నారు. వెంటనే ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వీహెచ్ మాట్లాడుతూ .. సీఎం కేసీఆర్‌కు బీసీలంటే ఎందుకు ఇంత కక్షో అర్థం కావడంలేదన్నారు. ఈ అంశంపై ఓ వైపు న్యాయబద్ధంగా పోరాడుతూనే తెలంగాణ ఉద్యమస్పూర్తితో ఉద్యమాలు చేద్దామని, ప్రతీ జిల్లాలో నిరసనలు చేద్దామని పిలుపునిచ్చారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ .. ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్‌బాపూజీ, ఆలె నరేంద్ర లాంటి బీసీ నేతల పునాదులమీద పుట్టిన టీఆర్ఎస్ పార్టీ, చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్లు బీసీలకే ద్రోహం చేస్తోందని ఆగ్రహంవ్యక్తం చేశారు. రిజర్వేషన్లపై కేసు వేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన స్వప్నా రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ కి చెందిన గోపాల్ రెడ్డిలను ఆయా పార్టీలు సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆకుల లలిత, కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్ చిత్తరంజన్ దాస్ తదితరులు పాల్గొన్నారు. రిజర్వేషన్ల సాధనకోసం జాజుల శ్రీనివాస్ నేడు ధర్నాచౌక్ వద్ద చేపట్టనున్న ధర్నాకు అన్ని పార్టీలు, సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. పార్టీలు, జెండాలు పక్కన పెట్టి అందరూ రిజర్వేషన్ కోసం పోరాడాలని సదస్సులో తీర్మానించారు. -
రేపు గవర్నర్‌ను కలిసే అవకాశముంటుందో లేదోనని..!
సాక్షి, హైదరాబాద్ : రేపు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగానే గవర్నర్ నరసింహన్‌ను కలిసినట్లు ప్రజాకూటమి నేతలు తెలిపారు. గవర్నర్‌తో భేటీ ముగిసిన అనంతరం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, టీజేఎస్ కన్వీనర్ కోదండరాం, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ విలేకరులతో మాట్లాడారు. ప్రజాకూటమికి రాజ్యాంగబద్ధత ఉంది : ఉత్తమ్ ఎన్నికలకు ముందే సమూహంగా ఏర్పడిన ప్రజాకూటమికే రాజ్యాంగబద్ధత ఉంటుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. రేపు(మంగళవారం) ఫలితాలు వెలువడగానే అతిపెద్ద పార్టీగా అవతరించిన పార్టీనే ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానం పలకాల్సిన సందర్భం వస్తే కూటమిని ఒకే పార్టీగా పరిగణించాలని గవర్నర్‌కు విఙ్ఞప్తి చేశామని తెలిపారు. రేపటి రోజున గవర్నర్‌ను కలిసే అవకాశం దక్కుతుందో లేదోననే ఉద్దేశంతోనే ముందస్తు జాగ్రత్తగా ఆయనను కలిశామన్నారు. ఒకవేళ ఫలితాలు దగ్గరదగ్గరగా వస్తే మాకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశమివ్వాలని కోరామన్నారు. పొత్తుకు సంబంధించిన డాక్యుమెంట్స్ కు గవర్నర్ కు అందజేశామని తెలిపారు.గెలిచిన అభ్యర్థులకు భద్రత కల్పించాలని విఙ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. కూటమికే సంపూర్ణ మెజారిటీ : కోదండరాం కాంగ్రెస్, టీజేఎస్, టీడీపీ, సీపీఐలతో కూడిన ప్రజాకూటమికే సంపూర్ణ మెజారిటీ వస్తుందని కోదండరాం అన్నారు. హంగ్ ఏర్పడే పరిస్థితే గనుక వస్తే ఇలాంటి విషయాల్లో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు, సర్కారియా కమిషన్ నివేదికను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ ఏర్పాటు చేయాలన్నారు. కీడెంచి మేలు ఎంచాలి కదా : రమణ ప్రజాకూటమిని తెలంగాణ ప్రజలు ఆదరించారని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపొందారని ఆరోపించారు. ఇదే తరహాలో ఇప్పుడు కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉన్నందున కీడెంచి మేలు ఎంచాలనే తీరుగా ముందుగానే గవర్నర్‌ను కలిశామన్నారు. తన రాజకీయ మనుగడ కోసం, అధికార దాహంతో కేసీఆర్ ప్రతిపక్ష నేతలపై దాడులు చేయించిన విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. -
వాగ్దాన శూరుడు కేసీఆర్
హుస్నాబాద్ : ఎన్నికల్లో మోసపూరిత వాగ్ధానాలు చేసి గెలిచాక నెరవేర్చకపోవడంలో కేసీఆర్‌ను మించిన వారు మరొకరు ఉండరని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం హుస్నాబాద్ పట్టణంలో ప్రజాకూటమి బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ జీఎస్టీతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు. మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కేసీఆర్ మద్దతు పలుకుతున్నాడని, కేసీఆర్‌కు ఓటేస్తే అది బీజేపీకి ముట్టినట్టవుతుందని అన్నారు. కేసీఆర్ పాలనలో ప్రజలు ఎక్కువగా నష్టపోయారని అన్నారు. ప్రాజెక్టులు పూర్తి కాలేదన్నారు. ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ పథకం ద్వారా నీళ్లు ఇవ్వనిదే ఓట్లు అడగనని చెప్పిన కేసీఆర్.. నీళ్లు ఇవ్వకుండా ప్రజాక్షేత్రంలోకి ఎలా వస్తారని ప్రశ్నించారు. నాలుగున్నర సంవత్సరాలు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవెల్లి, గండిపెల్లి ప్రాజెక్టులను పూర్తి చేయలేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ కుటుంబం తప్ప ఏ ఒక్కరూ సంతోషంగా లేరని అన్నారు. టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ మాట్లాడుతూ రాష్ట్రంలో పెద్ద దొర, నియోజకవర్గంలో చిన్న దొర ఉన్నాడని.., దొరల రాజ్యం పోవాలంటే పేదల రాజ్యం రావాలని అందుకు ప్రజలు ఆలోచించాలని కోరారు. కొండగట్టులో బస్సు ప్రమాదంలో పదుల సంఖ్యలో చనిపోతే వారిని పరామర్శించలేదని అన్నారు. టీడీపీ ఆధ్వర్యంలో చనిపోయిన ప్రతి కుటుంబానికి రూ.25వేల ఆర్థిక సాయం చేశామని అన్నారు. కేసీఆర్ అక్రమాలపై ఒక్కొక్కటి బయటకు తీస్తున్నామని జీవితాంతం జైలులో పెడతామని హెచ్చరించారు. ప్రజాకూటమిలో భాగంగా తాను జగిత్యాల సీటును త్యాగం చేశానని, ప్రజా కూటమి అధికారంలోకి రాబోతుందని, నావంతు సాయంగా ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేయించి హుస్నాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు. ప్రజాకూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలే నాలుగు రోజులు నిద్రాహారాలు మాని, కూటమిగా ఏర్పడ్డ నాలుగు జెండాలను హుస్నాబాద్‌లో ఎగురవేయాలని రమణ పిలుపునిచ్చాడు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాట్లాడుతూ తెలంగాణలో దొరల అహంకారం పెరిగిందని, దళితుడిని సీఎం చేస్తానని మోసం చేసిన మోసగాడు కేసీఆర్ అని విమర్శించాడు. అందరి త్యాగాల ఫలితంగానే తెలంగాణ వచ్చిందని.. చారిత్రాత్మక భద్రతగా గుర్తించి చాడ వెంకట్‌రెడ్డిని గెలిపించాలని అన్నారు. హుస్నాబాద్ సీపీఐ అభ్యర్థి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజాకూటమి కేసీఆర్‌ను ఇంటికి పంపే కూటమిగా మారాలని అన్నారు. 2007లో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గౌరవెల్లి, గండిపెల్లి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేశాడు. రీ డిజైన్ల పేరుతో టీఆర్ఎస్ నాయకులు దోచుకుంటున్నారని, తాను గెలిస్తే సంవత్సరంలోపు ఈ ప్రాజెక్టులను పూర్తి చేయించి నీరందిస్తానని అన్నారు. ప్రజాకూటమిలో ఉన్న కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలు సంపూర్ణ సహకారం అందిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర ఇన్చార్జి కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు మృత్యుంజయం, మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మ శ్రీరాంచక్రవర్తి, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల సీపీఐ కార్యదర్శులు మంద పవన్, రాంగోపాల్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు శ్రీనివాసరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొయ్యడ సృజన్‌కుమార్, గడిపె మల్లేష్, శోభారాణి, డీసీసీ అధికార ప్రతినిధి కేడం లింగమూర్తి, సింగిల్ విండో అధ్యక్షుడు శివయ్య, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, టీడీపీ నాయకులు ప్రవీణ్‌కుమార్, బత్తుల శ్రీనివాస్, వరయోగుల శ్రీనివాస్, దొమ్మాటి మల్లేశం, తెలంగాణ జనసమితి నాయకులు కొంరెల్లి, చింతల రామచంద్రం, జీవన్‌రెడ్డి తదితరులున్నారు. ఆకట్టుకున్న వందేమాతరం శ్రీనివాస్ పాటలు హుస్నాబాద్ పట్టణంలో నిర్వహించిన ప్రజాకూటమి బహిరంగ సభకు వందేమాతరం శ్రీనివాస్ పాటలు హైలెట్‌గా నిలిచాయి. రాములమ్మ ఓ రాములమ్మ, ఎర్రజెండ.. ఎర్రజెండ ఎనియలో.. వంటి పాటలకు కళాకారులతో పాటు సభకు వచ్చిన జనం కోరస్ పాడుతూ ఉత్సాహంగా కనిపించారు. సభకు నియోజకవర్గం నుంచి జనం పెద్దఎత్తున తరలివచ్చారు. హుస్నాబాద్ బహిరంగ సభలో పాటలు పాడుతున్న సినీ గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ . -
దొర పాలనకు మరో అవకాశమా..?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దొర పాలనకు మరో అవకాశం ఇవ్వొద్దని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులకు తన ను కలిసేందుకు సమయం ఇవ్వని సీఎం దేశంలో కేసీఆర్ ఒక్కరేనని విమర్శించారు. ధర్నాచౌక్‌ను ఎత్తేసి ప్రజల గొంతును నొక్కేశారని, ప్రతిపక్షాలు లేకుండా చేసి రాష్ట్రాన్ని దొరతనంలోకి నెట్టేసేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేశారని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు 4 పార్టీలు కలసి కూటమిని ఏర్పాటు చేశాయని, ప్రజలు మద్దతిచ్చి ప్రజా ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మంగళవా రం టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ దివాలా తీయించారని అన్నారు. టీఆర్ఎస్ నలుగురు కుటుం బ సభ్యుల పార్టీ అని, 4 పార్టీల జట్టు కూటమి అని చెప్పారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా 53 నెలలు పబ్బం గడిపారని విమర్శించారు. వచ్చే నెల 4న సీఎంపీ అంశాల ప్రకటన రాజకీయ జీవితాన్ని ఇచ్చిన టీడీపీని రాష్ట్రంలో లేకుండా చేస్తానన్న కేసీఆర్ విశ్వసనీయత ఏమిటో ప్రజలకు అర్థమవుతోందని రమణ చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతూ టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టిందన్నారు. గత ఎన్నికల్లో కేసీఆర్ అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చారన్నారు. నాలుగు పార్టీలతో ఏర్పడిన కూటమి సుదీర్ఘంగా చర్చించి ఆచరణ సాధ్యమయ్యే కార్యక్రమాలే చేపట్టిందని.. పార్టీల వారీగా మేనిఫెస్టోలు ప్రకటించినప్పటికీ వచ్చే నెల 4న సీఎంపీ (కామన్ మినిమమ్ ప్రోగాం) అంశాలను విడుదల చేస్తామని చెప్పారు. జమిలి ఎన్నికలకు ముందు మద్దతు పలికిన కేసీఆర్.. ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లాడో సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్ దోచుకున్న ప్రజాధనాన్ని కూటమి ప్రభుత్వం రాగానే బయటకు వెలికితీస్తుందని తెలిపారు. ప్రజాపాలన కోసం సీటు త్యాగం కూటమిలో టీడీపీ కీలకంగా వ్యవహరిస్తున్నప్పటికీ సీట్ల సర్దుబాటులో భాగంగా తాను పోటీ చేయడం లేదని రమణ స్పష్టం చేశారు. ప్రజాపాలన కోసమే తను సీటును త్యాగం చేశానని చెప్పారు. సిరిసిల్లలో ఇసుక మాఫియాను నడిపించిన కేటీఆర్ నిజస్వరూపమేమిటో ప్రజలు గుర్తించాలన్నారు. టీఆర్ఎస్ టికెట్లు పొందిన అభ్యర్థులను నియోజకవర్గాల్లో ప్రజలు ప్రతిఘటిస్తున్నారని, కేసీఆర్ నిరంకుశ పాలనతో ఆ పార్టీ అభ్యర్థులు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. ఆ పార్టీల దోస్తీతో ముంచే ప్రయత్నం ఓ వైపు బీజేపీ, మరోవైపు ఎంఐఎం పార్టీలను పెట్టుకుని కేసీఆర్ ప్రజలను నిలువునా ముంచే ప్రయత్నం చేస్తున్నారని రమణ దుయ్యబట్టారు. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీకి భయపడుతున్నారని విమర్శించారు. అసెంబ్లీ రద్దు చేసిన తర్వాత 100 సీట్లలో గెలుస్తామన్న కేసీఆర్ ధీమా క్రమంగా సన్నగిల్లిందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని, రైతు సంక్షేమమే ఎజెండాగా పాలన సాగుతుందని చెప్పారు. ఒకే దఫాలో రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ, రూ.10 వేల కోట్లతో మార్కెట్ స్థిరీకరణ నిధి, ప్రతి పంటకు మద్దతు ధర, ఆర్టీసీ ఉద్యోగులకు భద్రత, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని చెప్పారు. -
‘కేసీఆర్ పిచ్చి కుక్కలా తయారయ్యాడు’
సాక్షి, హైదరాబాద్ : ప్రజాకూటమి అధికారంలోకి వస్తే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సూచనలతో పాలన సాగుతుందని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. మంగళవారం ‘మీట్ ద ప్రెస్’ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ... కూటమి అధికారంలోకి వచ్చేందుకు తాను కృషి చేస్తున్నానని తెలిపారు. తాను ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేయకుంటే వచ్చే నష్టమేమీ లేదని వ్యాఖ్యానించారు. ఎటువంటి పట్టింపులు లేకుండా టీఆర్ఎస్ను ఓడించడమే లక్ష్యంగా కూటమిలో అన్ని పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. టీఆర్ఎస్ నాయకులను ప్రజలు సన్నాసులుగా భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. వారికి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. కేసీఆర్ పిచ్చి కుక్కలా తయారయ్యాడు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా వాచ్‌డాగ్‌లా ఉంటానని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఇప్పుడు పిచ్చి కుక్కలా తయారయ్యాడని రమణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘ బొంబాయి, బొగ్గు బావి, దుబాయ్ అని ప్రగల్బాలు పలికి ఒక్కరికి కూడా న్యాయం చేయలేదు. రైతులను నిండా ముంచారు. ప్రజలు మరోసారి అవకాశం ఇస్తే తన మనవడిని కూడా రాజకీయాల్లోకి దింపుతాడు. స్వార్థ రాజకీయాల్లో ఆయనను మించిన వారు లేరు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నా ఒక్కసారి కూడా విమర్శించలేదు. తన తప్పులు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతో మోదీతో కుమ్మక్కై తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నాడు’ అని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించారు. చంద్రబాబు వాస్తవాలకు దగ్గరగా ఉంటారు తమ పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వాస్తవాలకు దగ్గరగా ఉంటారని రమణ అన్నారు. టీడీపీని హైదరాబాద్‌లోనే ప్రారంభించారని, ఇక్కడ ఎలాంటి విపత్తు వచ్చినా స్పందించే గుణం తమ నాయకులకు ఉందని పేర్కొన్నారు. అన్ని వర్గాల వారికి న్యాయం చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ లేకుండా చేయాలని కేసీఆర్ చేసిన కుట్రలన్నీ బెడిసి కొట్టాయని అన్నారు. లక్షల సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారని ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చి తీరతామని రమణ ధీమా వ్యక్తం చేశారు. కూకట్పల్లి విజయంతో కేసీఆర్ పతనానికి నాంది పలుకుతామని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం అంటే.... ప్రత్యేక రాజ్యాంగం కాదు లక్షల మంది పోరాటంతో తెలంగాణ వచ్చిందని, కేసీఆర్ మాత్రం తానొక్కడినే తెలంగాణ తెచ్చినట్టు మాట్లాడుతారని రమణ ఎద్దేవా చేశారు. అయినా ప్రత్యేక రాష్ట్రం అంటే ప్రత్యేక రాజ్యాంగం ఉండదని వ్యాఖ్యానించారు. కూటమిలోని అన్ని పార్టీల మేనిఫెస్టోలకు విలువ ఇస్తూనే ఉమ్మడి మేనిఫెస్టో రూపొందిస్తున్నామని తెలిపారు. ఆచరణ సాధ్యమయ్యే హామీలను మాత్రమే ఇచ్చామని, వచ్చే నెల 4న సాయంత్రం పూర్తి మేనిఫెస్టో విడుదల చేస్తామని పేర్కొన్నారు. -
‘ప్రజలకు జవాబుదారీ కోసమే కామన్ మేనిఫెస్టో’
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ నాలుగున్నరేళ్ల పాలనలో చిన్నాభిన్నమైన అన్ని వ్యవస్థలను పటిష్టం చేసేవిధంగా ఉమ్మడి మేనిఫెస్టో రూపిందించామని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం పేర్కొన్నారు. సోమవారం స్థానిక గోల్కొండ హోటల్లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు రమణ, సీపీఐ నేత పళ్లా వెంకట్ రెడ్డిలతో కలిసి మహాకూటమి కామన్ మినిమమ్ ప్రోగ్రామ్(ఉమ్మడి ప్రణాళిక)ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. పది భాగాలుగా పలు అంశాలతో కామన్ మేనిఫెస్టో విడుదల చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు అభివృద్ది విస్తరిస్తామని తెలిపారు. పారిశ్రామిక అభివృద్ధితో పాటు వ్యవసాయరంగం బలోపేతం, సంక్షేమ రంగాన్ని సైతం మరింత మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. మాది ‘ప్రజా ఫ్రంట్’: ఉత్తమ్ టీఆర్ఎస్ను గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడిన కూటమికి ‘ప్రజా ఫ్రంట్’గా నామకరణం చేశారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక నుంచి అందరూ అలాగే అభివర్ణించాలని ఆయన కోరారు. అన్ని పార్టీలు ఒప్పుకున్న వాటిని కామన్ మినిమమ్ ప్రోగ్రాంను విడుదల చేస్తున్నామన్నారు. అందరి ఆశీర్వాదంతో తమ కూటమి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కోదండరాం కన్వీనర్‌గా కేబినెట్ హోదాలో మేనిఫేస్టో అమలుకు కృషి చేస్తారని ఉత్తమ్ తెలిపారు. విధానపరమైన డాక్యుమెంట్ అని ఎన్నికల నాటికి అవసరమైన మరిన్ని జోడించి ప్రజల్లోకి వెళతామని రమణ వివరించారు. కామన్ మేనిఫెస్టోతో ప్రజలకు జవాబుదారీ భరోసా కల్పిస్తున్నామని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రస్తుతమున్న సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగుతాయని వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు. -
‘కూటమి ప్రతిపాదన తెచ్చింది నేనే’
సాక్షి, మేడ్చల్: తెలంగాణ సమాజానికి కల్వకుంట్ల రాజ్యాంగం అవసరం లేదని అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే కావాలని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. శుక్రవారం మేడ్చల్‌లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ సమాజ శ్రేయస్సు కోసం కాంగ్రెస్‌తో కలిసి కూటమిగా ఏర్పడాలన్న ప్రతిపాదనను తానే తెచ్చానని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడితే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న దొర తానే పీఠమెక్కి మాట తప్పాడని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించారు. దొర పాలనలో తెలంగాణకు ఆత్మగౌరవం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో 8 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా పేదలకు ఏమాత్రం న్యాయం జరగలేదన్నారు. ప్రజలను అడుగడునా మోసం చేసిన టీఆర్ఎస్కు చరమగీతం పాడి ప్రజాకూటమిని ఆశీర్వదించాలని కోరారు. కేసీఆర్‌ది నిరంకుశ పాలన: చాడ ప్రజాస్వామ్య విలువలకు కేసీఆర్ పాతరవేశారని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. పార్టీ ఫిరాయింపులను కేసీఆర్ ప్రోత్సహించారని ఆరోపించారు. తెలంగాణ ధనిక రాష్ట్రమంటూనే అప్పులు చేశారని వెల్లడించారు. కేసీఆర్ నిరంకుశంగా పాలిస్తున్నారని ధ్వజమెత్తారు. సంబంధిత కథనాలు ముందుస్తు ఎన్నికలు మన అదృష్టం: కోదండరాం ‘కేసీఆర్ కుటుంబం కాళ్లు ఎందుకు అడ్డం పెట్టలేదు’ దానికోసమే సోనియా గాంధీ వచ్చారు: రేవంత్ రెడ్డి -
టీటీడీపీ మేనిఫెస్టో ఇదే
సాక్షి, హైదరాబాద్ : నామినేషన్ల పర్వం ముగియడంతో రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలు ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా మహాకూటమిలో భాగమైన తెలంగాణ టీడీపీ తమ మేనిఫెస్టోను బుధవారం విడుదల చేసింది. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ఈ మేనిఫెస్టోను ప్రకటించారు. ప్రజాకూటమి అధికారంలోకి వస్తే ఏటా ఉద్యోగ క్యాలెండర్‌ను ప్రకటిస్తామని, ప్రగతి భవన్‌ను ప్రజాస్పత్రిగా మారుస్తామన్నారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తమ మేనిఫేస్టో రూపకల్పనకు స్ఫూర్తి అని ఈ సందర్భంగా టీడీపీ నేతలు తెలిపారు. గతం, వర్తమానం, భవిష్యత్తు అంశాలను పరిగణనలోకి తీసుకుని మేనిఫేస్టో రూపొందించామని వెల్లడించారు. మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు రూ.2లక్షల వరకు రైతులకు రుణమాఫీ, దీన్ని కౌలు రైతులకు కూడా వర్తింపు. అన్నా క్యాంటీన్ల ద్వారా రూ.5లకే భోజనం, ఇంటర్ నుంచే విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు పంపిణీ. విభజన బిల్లులో అంశాల అమలుకు కేంద్రంపై ఒత్తిడి. అమరవీరుల కుటుంబాల్లో ఇంటికో ఉద్యోగం, ఇల్లు, వారి సంక్షేమానికి ప్రాధాన్యత. అన్ని జిల్లాల్లో పూలే, అంబేడ్కర్ నాలెడ్జ్ కేంద్రాలు, హైద్రాబాద్ ధర్నా చౌక్ పునరుద్దరణ, లోకాయుక్త ఏర్పాటు, లోకాయుక్త పరిధిలోకి ప్రజాప్రతినిధులు, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు భృతి బెల్ట్ షాపుల రద్దు, విద్యారంగానికి బడ్జెట్లో అదనంగా రూ.5వేల కోట్లు కేటాయింపు, అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే లక్ష ఉద్యోగాలు, ప్రొఫెసర్ జయశంకర్ పేరిటి విద్యా సంస్థలు ఏర్పాటు పేద యువతుల వివాహానికి రూ.1.50 లక్షల ఆర్థికసాయం, ఎస్సీ వర్గీకరణ, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్, బీసీలకు సబ్‌ప్లాన్, ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు. 58 ఏళ్లు నిండిన అనాథలు, వితంతువులు, వృద్ధులకు నెలకు రూ.2వేల పింఛన్. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల సంక్షేమానికి చర్యలు. పక్కా ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల సాయం, ప్రతి ఇంటికీ మంచినీరు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, దివ్యాంగులకు రూ.3వేలు పించన్. -
ఆ నలుగురు ఎందుకు పోటీ చేయడం లేదు..!!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీలో కొందరు పెద్దల తీరుపై ఆ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. కాంగ్రెస్‌తో పొత్తు కొంత ఆగ్రహానికి ప్రధాన కారణమైతే, నేతలు వ్యవహరిస్తున్న తీరు దానికి ఆజ్యం పోస్తోంది. టీటీడీపీలో కీలక నేతలుగా వ్యవహరిస్తున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మండవ వెంకటేశ్వరరావు ఎన్నికల్లో పోటీ చేయకపోవడంపై కార్యకర్తల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనికి తోడు క్యాడర్ లేని కొన్ని అసెంబ్లీ స్థానాలను పొత్తుల్లో కోరడం మరింత రెచ్చగొట్టేలా చేస్తోంది. ఇటు టీడీపీ తెలంగాణ తమ్ముళ్లు, అటు కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు సైతం ఈ నలుగురి వ్యవహార శైలిపై గుర్రుగా ఉన్నారు. అసలు వారిది త్యాగమా..లేక పలాయనమా అని ప్రశ్నిస్తున్నారు. వీరి చర్యల వల్ల ఎవరికి లాభం చేకూరుతోందని నిలదీస్తున్నారు. అనుచరుల వాదన ఇలా..? కోరుట్లలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ పోటీచేస్తారని మహాకూటమి ఏర్పాటు కొత్తలో ప్రతిపాదిం చారు. తాను పోటీచేయడంలేదని,ఆ సీటు కూటమి గెలుపు కోసం త్యాగం చేస్తున్నట్టు రమణ ప్రకటించడం జగిత్యాల, కోరుట్లలో ఉన్న రమణ అనుచరులు, కార్యకర్తలను విస్మయానికి గురిచేసింది. దీనికి తోడు ఆ సీటుపై ఇప్పటివరకు కాంగ్రెస్ తరఫున ఎవరు పోటీచేస్తారో తేలకపోవడం రెండు పార్టీల్లోనూ ఉత్కంఠ కలిగిస్తోంది. ఇటు జగిత్యాలలో జీవన్‌రెడ్డికి మద్దతు తెలపడం పైనా తెలుగు తమ్ముళ్లు రగిలిపోతున్నారు. రమణ వెంట ఉన్న ప్రధాన సామాజిక వర్గం నేతల్లోనూ గందరగోళం నెలకొంది. ఇదే రీతిలో నిజామాబాద్ రూరల్ నుంచి మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పోటీచేస్తారని తెలుగు తమ్ముళ్లు ప్రచారం చేసుకున్నారు. తీరా ఆ టికెట్ టీఆర్ఎస్ మాజీ నేత, ఎమ్మెల్సీ భూపతిరెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. దీనితో తెలుగు తమ్ముళ్లు భగ్గుమంటున్నారు. మరో సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి వ్యవహారం రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. తాను హుజూరాబాద్‌లో పోటీచేయలేనని, కూకట్‌పల్లిలో పోటీచేస్తానని ప్రకటించుకున్న పెద్దిరెడ్డికి పార్టీ ఏ టికెట్ కేటాయించలేదు. ఇక కూకట్‌పల్లినుంచి దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినిని ఆ పార్టీ అధినేత చంద్రబాబు రంగంలోకి దింపారు. పెద్దిరెడ్డి హుజూరాబాద్నుంచి పోటీకి ఒప్పుకుంటే ఈ పాటికి ప్రచారంలో ముం దుండే వాళ్లమని ఇప్పుడు ఎటూకాని స్థితిలో ఉండిపోయామని ఆ కార్యకర్తలు అంటున్నారు. అదే రీతిలో మహబూబ్‌నగర్ చెందిన టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి సైతం పోటీచేయకుండా సాగదీత తంతు నడిపిస్తుండటంతో వనపర్తిలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే చిన్నారెడ్డిలో ఆందోళన మొదలైనట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఈ నలుగురు టీడీపీ పెద్దలు పోటీలో ఉండి ఉంటే పార్టీకి మేలు జరిగేదనీ, వారు బరిలో లేకపోవడం వల్ల క్యాడర్ పక్కచూపులు చూడాల్సి వస్తోందని టీటీడీపీ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. ఆ సీట్లు మనకెందుకు? టీడీపీ లెక్క ప్రకారం ఖమ్మంలోని కొన్ని నియోజకవర్గాలు, హైదరాబాద్, రంగారెడ్డిలోని కొన్ని, నిజామాబాద్‌లో రెండు, మహబూబ్‌నగర్‌లో రెండింటిలో బలంగా ఉన్నట్టు చెప్పుకుంటోంది. అయితే ఉద్యమ ప్రాంతంగా ఉన్న వరంగల్ జిల్లాలో అదికూడా యూనివర్సిటీ, ఉద్యోగులు ఎక్కువగా ఉన్న వరంగల్ వెస్ట్‌లో టీడీపీ పోటీచేయడం సొంత పార్టీ నేతలకే రుచించడం లేదు.తన నియోజకవర్గం కాకుండా వెస్ట్‌లో రేవూరి ప్రకాశ్‌రెడ్డి పోటీచేయడం ఏమిటని ఆయన అనుచరులే అంటున్నారు. ఇక ఎల్బీనగర్ సీటు కోసం పట్టుబడతారని భావిస్తే ఏమాత్రం క్యాడర్‌లేని ఇబ్రహీంపట్నం తీసుకోవడంపైనా వారు ఆశ్చర్యపోతున్నారు. నిజామాబాద్ రూరల్ లేదా బాల్కొండ తీసుకోవాలని నేతలు కోరినా పార్టీ పెద్దలు పట్టించుకోలేదన్న ఆరోపణ వినిపిస్తోంది. కాంగ్రెస్ నేతల్లో మరో వాదన... తమ పార్టీ గెలుస్తుందని భావించిన స్థానాల్లో టీడీపీ అనవసరంగా 14 టికెట్లు అని డిమాండ్ పెట్టి నష్టపరిచిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. రమణ, మండవ, పెద్దిరెడ్డి, రావులతో పాటు మరో ఆరుగురు పోటీచేస్తే సరిపోయేదని, అసలు నేతలే పక్కకు జరిగి బలంలేని వారిని పోటీలో పెట్టి కాంగ్రెస్‌కు నష్టం చేకూర్చారని, దీనిపై అనేక అనుమానాలున్నాయని వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. టీడీపీని చూసి తెలంగాణ జనసమితి సైతం 8 నుంచి 12 సీట్లు డిమాండ్ పెట్టిందనీ. మిర్యాలగూడ, వరంగల్ వెస్ట్‌లో కనీసం టీజేఎస్‌కు నాయకులే లేరని కాంగ్రెస్ మదనపడుతోంది. మహబూబ్‌నగర్‌లో టీడీపీ మరో నియోజకవర్గ నేతను తెచ్చి పోటీలో పెట్టడం వెనుక టికెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ రెండుపార్టీల్లో పరిస్థితి ఎన్నికల వేళ ఎలాంటి సునామీకి దారితీస్తుందన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. -
కేసీఆర్ బద్దకిస్టు సీఎం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అత్యంత బద్దకస్తుడని, సచివాలయానికి రాకుండా ఫాంహౌస్‌కే పరిమితమయ్యారని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఆరోపించారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా పైరవీ భవన్ ఏర్పాటు చేసుకుని దొరపాలన సాగించారని విమర్శించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో శనివారం జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నా రు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు 2019లో ఒకేసారి వస్తాయని భావించామని, కానీ కేసీఆర్ అసమర్థత వల్ల డిసెంబర్లోనే ముందస్తు ఎన్నికలు అనివార్యమయ్యాయని అన్నారు. ఒకేసారి ఎన్నికలు వస్తే ప్రజాధనం భారీగా మిగిలేదని, అలాకాకుండా వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించడంతో ఖజానా పై తీవ్ర భారం పడుతుందన్నారు. తెలంగాణలో ప్రతిపక్షాలే లేవన్న కేసీఆర్.. ప్రతిపక్షాలు ఇబ్బందులకు గురిచేస్తున్నందునే ఎన్నికలకు వెళ్తున్నట్లు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశా రు. ప్రతిపక్షాలకు చెందిన దాదాపు 30 మంది ఎమ్మెల్యేలను తన పార్టీ లోకి చేర్చుకుని ఎలా బలహీనుడయ్యాడో అర్థంకావడం లేదని వాపోయా రు. కేసీఆర్ మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్‌లా భావించి వాటిని అమలు చేయడం లేదన్నారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వడంలో కేసీఆర్ పూర్తి గా విఫలమయ్యారని, బీజేపీతో లోపాయికారీ ఒప్పందంతో ప్రజలను వెర్రివాళ్లని చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ఐదు సార్లు రూ. 6.5 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారని, కానీ కాళేశ్వరంప్రాజెక్టును మాత్రం పూర్తి చేయలేదన్నారు. కమీషన్ల కోసమే నీటిపారుదల ప్రాజెక్టులను రీడిజైనింగ్ చేస్తున్నారని ఆరోపించారు. వార్ వన్‌సైడ్ ఉంటుందన్న కేసీఆర్ ఒకసారి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెళ్లిరావాలని సూచించారు. రాష్ట్రంలో పెరుగుతోన్న మాఫియాలు.. రాష్ట్రంలో ల్యాండ్, ఇసుక మాఫియాలు పెరిగిపోయాయని రమణ ఆరోపించారు. పబ్ కల్చర్ కూడా పెరగడంతో యువత పెడదోవ పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని సమస్యలు పరిష్కరిస్తానన్న కేసీఆర్.. ప్రజల గొంతు వినిపించే ధర్నాచౌక్‌ను ఎత్తేశారని విమర్శించారు. కేటీఆర్‌కు రాజకీయ సన్యాసం ఇప్పించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నా రని, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను ఎదుర్కొనేందుకే మహాకూటమి ఏర్పాటైందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు ఎం.సోమయ్య, బసవపున్నయ్య, హైదరాబాద్ జర్నలిస్టు యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు చంద్రశేఖర్, పద్మరాజు, విజయానంద్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్టీఆర్ ట్రస్టు భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్ : అభ్యర్థుల ఖరారు, నామినేషన్ల పర్వం మొదలైన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి అసమ్మతి సెగ తగిలింది. రాష్ట్ర నాయకత్వం డబ్బులు తీసుకుని టిక్కెట్లు అమ్ముకుందని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. తమ నాయకులకు న్యాయం జరగకపోతే రాజీనామాలకు, ఆత్మహత్యలకు వెనుకాడబోమని పార్టీ అధినాయకత్వాన్ని హెచ్చరించారు. మరోవైపు.. శేరిలింగంపల్లి టికెట్ భవ్యా ఆనంద్ ప్రసాద్‌కు ఇవ్వడంతో నిరసనలు మిన్నంటాయి. ఆమె స్థానంలో మువ్వా సత్యనారాయణకు టికెట్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఓ కార్యకర్త పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్ ట్రస్టు భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. ఇదిలా ఉండగా.. యాదవులకు టిక్కెట్లు ఇవ్వలేదనే కారణంతో ఎన్టీఆర్ ట్రస్టు భవన్ ముందు ఓయూ యాదవ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అర్థనగ్న ప్రదర్శనలతో నిరసన తెలిపారు. యాదవ, గొల్ల కురుమ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ డబ్బులు తీసుకుని టిక్కెట్లను అగ్రవర్ణాలకు అమ్ముకున్నారని ఆరోపించారు. -
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే..నా!
సాక్షి, హైదరాబాద్ : పదకొండు అసెంబ్లీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఖమ్మంలో నామా నాగేశ్వరరావు, సత్తుపల్లి- సండ్ర వెంకట వీరయ్య, అశ్వరావు పేట- మచ్చ నాగేశ్వరరావు, వరంగల్ పశ్చిమ- రేవూరి ప్రకాశ్ రెడ్డి, మక్తల్-కొత్తకోట దయాకర్ రెడ్డి, మహబూబ్ నగర్- ఎర్ర శేఖర్, ఉప్పల్- వీరేందర్ గౌడ్, శేరిలింగంపల్లి- భవ్య ఆనంద్ ప్రసాద్, కూకట్పల్లి- పెద్దిరెడ్డి, నిజామాబాద్ రూరల్- మండవ వెంకటేశ్వరరావుల పేర్లను టీడీపీ ఖరారు చేసినట్లు సమాచారం. ఇవే కాకుండా ఆలేరు, నకిరేకల్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, కోదాడ, పఠాన్ చెరువు, నారాయణ ఖేడ్‌లలో ఏవైనా నాలుగు స్థానాలలో టీడీపీ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా టీడీపీ నుంచి అధికారికంగా అభ్యర్థు పేర్లను ప్రకటించలేదని టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ పేర్కొన్నారు. పదకొండు మంది పేర్లను ప్రకటించారడనం అసత్య ప్రచారం అని తెలిపారు. అభ్యర్థుల పూర్తి జాబితాను మంగళవారం ప్రకటిస్తామని రమణ పేర్కొన్నారు. సీట్ల సర్దుబాటుపై ఈ రోజు సాయంత్రానికి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో కూటమి నేతలంతా కలిసి ఒకే వేదికపై అభ్యర్థులను ప్రకటిస్తామని ఆయన చెప్పారు. -
అభ్యర్థులను ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తాం: రమణ
సాక్షి, అమరావతి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడే తమ పార్టీ అభ్యర్థులను ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తామని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ వెల్లడించారు. మహాకూటమిలో భాగం గా సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై గురువారం వెలగపూడి సచివాలయంలో రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, అరవింద్‌కుమార్ గౌడ్, సారంగపాణి, దీపక్‌రెడ్డితోపాటు పలువురు టీటీడీపీ నేతలు ఏపీ సీఎం చంద్రబాబును కలసి చర్చించారు. అనంతరం రమణ మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వేదికగా టీటీడీపీ అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. -
పోటీలో లేను..!
సాక్షి, జగిత్యాల : ఊహించినట్టే జరిగింది. జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు.. టీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎలగందుల రమణ వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలో లేరని తేలిపోయింది. ఎన్నికల్లో తాను ఎక్కడ్నుంచి బరిలో దిగాలో మహాకూటమే నిర్ణయిస్తుందని.. ఆ నిర్ణయం మేరకే పోటీలో ఉంటానని నిన్నటివరకు చెప్పిన రమణ.. తాను రాష్ట్రంలో ఏ నియోజకవర్గం నుంచీ పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రమణ తన పోటీ విషయంపై మీడియా ముందు నోరువిప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో.. తాను పోటీ చేయడం కంటే కూటమి గెలుపుపైనే దృష్టిపెట్టానని చెప్పారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ను ఓడించడమే లక్ష్యంగా కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తానని వివరించారు. దీంతో రమణ ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారు..? అసలు పోటీలో ఉంటారా..? లేదా..? అనే చర్చకు తెరపడింది. ఇక్కడివరకు బాగానే ఉన్నా.. తమ నాయకుడు బరిలో ఉంటారని ఇన్నాళ్లూ ఆయన ప్రకటన కోసం ఎదురుచూసిన తమ్ముళ్లు మాత్రం ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. నిన్నటివరకు రమణ కోరుట్ల నుంచి పోటీ చేస్తారని భావించిన పార్టీ శ్రేణులు ఆయన పోటీలో ఉండరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మరోపక్క.. తెలుగు ప్రజల ఆత్మగౌరవం పేరిట ఏర్పాటైన తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడుగా కొనసాగుతున్న రమణ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే బాగుండేదని టీడీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. ‘కూటమి’లో మరింత కీలకం రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జన సమితితో ఏర్పాటైన మహాకూటమిలో కీలకంగా ఉన్న ఎల్.రమణ ఇకపై మరింత ప్రధాన పాత్ర పోషించనున్నారు. కూటమిలోని అన్ని పార్టీల సీనియర్లు, టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు తాను రాష్ట్ర రాజకీయాలకే పరిమితమవుతున్నట్లు ఆయన ‘సాక్షి’కి వివరించారు. 60 అసెంబ్లీ స్థానాలకూ తగ్గకుండా పర్యటించాలని నిర్ణయించినట్లు చెప్పారు. వాస్తవంగా కోరుట్ల నియోజకవర్గం నుంచి బరిలో నిలవాలని పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఆకాంక్షించారన్నారు. కానీ ఎన్నికల్లో పోటీలో నిలబడితే కేవలం ఆ ఒక్క నియోజకవర్గానికే పరిమితం కావల్సి వస్తుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. తనకు అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తూ.. కూటమి అభ్యర్థుల కోసం శక్తివంచనా లేకుండా కృషి చేస్తానన్నారు. ఇదే క్రమంలో జగిత్యాల కూటమి అభ్యర్ధి జీవన్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తానని మంగళవారం జిల్లా కేంద్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకటించారు. 24 ఏళ్ల తర్వాత తొలిసారిగా.. మహాకూటమి ఏర్పాటు పుణ్యమా అని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ 24 ఏళ్ల తన రాజకీయ జీవితంలో తొలిసారిగా ఎన్నికల పోటీకీ దూరమయ్యారు. 1994 నుంచి 2014 వరకు అసెంబ్లీ (1996లో కరీంనగర్ లోక్‌సభ) ఎన్నికల్లో వరుసగా పోటీ చేశారు. ఇందులో భాగంగా తొలిసారిగా 1994 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డిపై పోటీ చేసి 45,610 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత 1996లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి జువ్వాడీ చొక్కారావుపై 51,761 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ జీవన్‌రెడ్డిపై పోటీ చేసిన రమణ 48,574 ఓట్లతో ఓటమి పాలయ్యారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసి జీవన్‌రెడ్డి చేతిలో 55,678 ఓట్లతో ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో పోటీ చేసి జీవన్‌రెడ్డిపై 43,415 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసి 8,600 ఓట్ల తేడాతో జీవన్‌రెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. కాగా.. 1996లో కరీంనగర్ నుంచి లోక్‌సభకు పోటీచేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థి జువ్వాడి చొక్కారావుపై 51,761 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. -
చేనేత కార్మికులకు అండగా ఉంటాం
సాక్షి, యాదాద్రి: మహాకూటమి అధికారంలోకి వస్తే చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించి అండగా ఉంటామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో 15 రోజులుగా చేనేత కార్మికులు చేస్తున్న రిలే నిరాహా ర దీక్షను బుధవారం రాత్రి ఆయన టీటీడీపీ అధ్యక్షు డు ఎల్.రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, టీజేఎస్ నాయకుడు ప్రభాకర్‌రెడ్డితో కలసి విరమింపజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఉత్తమ్ మాట్లాడుతూ పోచంపల్లి చేనేత కార్మికుల 12 డిమాండ్లను మహాకూటమి ఎజెండాలో చేర్చి అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. చేనేత కార్మికులకు ప్రస్తుతం ఇస్తున్న రూ.1,000 పింఛన్‌ను రూ.2,000కు పెంచుతామన్నా రు. భువనగిరికి చెందిన గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్కౌంటర్ తర్వాత స్వాధీనం చేసుకున్న భూములు, బంగారం, ఆస్తులు ఏమయ్యాయని ప్రశ్నించారు. నయీం ఆస్తులపై టీఆర్ఎస్ను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అన్నీ చేస్తానని ప్రజలకు హామీలు ఇచ్చి ఏమీ చేయని కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వానికి గోరీ కట్టాలని, మహాకూటమిని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. కేసీఆర్ సీఎం అయితే ఏదో ఉద్ధ రిస్తాడని, ప్రజల బతుకులు బాగుపడతాయని గెలి పిస్తే వాటన్నింటినీ మరిచిపోయారన్నారు. నాలుగున్నర కోట్ల ప్రజలను మోసం చేశారని విమర్శించారు. మహాకూటమి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో పేద ప్రజలకు వారి సొంత స్థలంలో రూ.5 లక్షలతో ఇల్లు కట్టిస్తామని తెలిపారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ టీఆర్ఎస్ అధికారంలో ఉన్న నాలుగున్నరేళ్లలో చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేయలేకపోయారన్నారు. మహాకూటమి అధికారంలోకి వస్తే రుణాలు మాఫీ చేస్తామని, చేనేత సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. పేద ల బాధలు తొలగాలన్నా, ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరాలన్నా మహాకూటమి అధికారంలోకి రావడం అవసరమని పేర్కొన్నారు. సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలపై కేసీఆర్ సిగ్గుపడాలన్నారు. కేసీఆర్ వైఫల్యం వల్లే చేనేత కార్మికుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి రాష్ట్ర నాయకుడు ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్ భువనగిరి నియోజకవర్గ ఇన్చార్జి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్, నేతలు చింతకింది రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
‘కేసీఆర్ కుటుంబపాలన అంతానికే మహాకూటమి’
సాక్షి, జగిత్యాల : అకారణంగా అసెంబ్లీని రద్దు చేసి.. అపద్ధర్మ ముఖ్యమంత్రిగా 20 రోజులుగా బయటికిరాని కే చంద్రశేఖర్ రావు, ఆయన కుటుంబపాలన అంతానికే మహాకూటమిగా ఒక్కటయ్యామని టీటీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ అన్నారు. నమ్మిన తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేశారని ఆయన మండిపడ్డారు. సోమవారం కాంగ్రెస్ మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ మీడియా ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎల్ రమణ మాట్లాడుతూ.. మహాకూటమి ఏర్పాటుతో ప్రజలకు ధైర్యం వచ్చిందన్నారు. డీకే అరుణ బండారం బయట పెడతానని హీనంగా మాట్లాడిన కేసీఆర్! .. నీ కూతురు బండారం బయట పెడితే సహించగలవా అని ప్రశ్నించారు. జగిత్యాలలో జీవన్ రెడ్డి మీద తమకు నమ్మకం ఉందని అన్నారు. జీవన్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటారని తెలిపారు. వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే మహాకూటమిపై మండిపాటు జగిత్యాల : టీఆర్ఎస్ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మహాకూటమిపై మండిపడుతున్నారని మాజీమంత్రి జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబపాలన నుంచి విముక్తి పొందేందుకు అన్ని పార్టీలు ఏకమవుతున్నాయని అన్నారు. నిరుద్యోగ యువకులకు ఉద్యోగం కల్పించటానికి, రైతులకు, మహిళలకు అండగా నిలువటానికి మహాకూటమి ఏర్పడిందని పేర్కొన్నారు. -
సీట్లపై చర్చ జరగలేదు: ఉత్తమ్
హైదరాబాద్: ఎన్నికల తర్వాత ఏర్పడే ప్రభుత్వంలో కామన్ పోగ్రాం అజెండాపై చర్చించామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్, తెలంగాణ జన సమతి, టీడీపీ, సీపీఐ పార్టీల అగ్రనేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. రెండు మూడు రోజుల్లో కామన్ అజెండా ఫైనల్ చేసి, ఆ తర్వాత విడుదల చేస్తామన్నారు. ఇప్పటి వరకు సీట్ల చర్చ జరగలేదని వివరించారు. కేసీఆర్ ఏం చేసినా ఓటమి ఖాయమన్నారు. నోటిఫికేషన్ వచ్చే నాటికి సీట్ల సర్దుబాటు ఫైనల్ అవుతుందని తెలిపారు. ఎన్నికల షెడ్యూలే ఇంకా ప్రకటించలేదు..సీట్లు, మ్యానిఫెస్టో గురించి తొందరపాటు ఎందుకని అన్నారు. వివిధ పార్టీలకు వివిధ మ్యానిఫెస్టోలు ఉంటాయి కాబట్టి అందరం కలిసి చర్చించి ముందుకు వెళ్తామన్నారు. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ.. ఉద్యమ ఆకాంక్షలకి అనుగుణంగా కామన్ అజెండా ఉంటుందని వెల్లడించారు. ఈ కూటమి మహాకూటమి కాదని, దీనికి ఇంకా పేరు పెట్టలేదని చెప్పారు. బీజేపీతో వెళతారన్న ప్రశ్నకి కోదండరాం సమాధానం దాటవేశారు. సీట్లపై ఇంకా చర్చ జరగలేదని చెప్పారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ..ప్రజల అజెండా అమలు చేస్తామని వివరించారు. కోడ్ అమలులో ఉండగా మంత్రులు ఎలా ప్రారంభోత్సవాలు చేస్తారని ప్రశ్నించారు. ఒక అవగాహనకు రాకుండా ఏ పార్టీ వాళ్లు ప్రచారం చేసుకోవడం మంచిది కాదన్నారు. తెలంగాణ ప్రజలు నిరాశతో ఉన్నారు..అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా మ్యానిఫెస్టో ఉంటుందన్నారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ మాట్లాడుతూ... కేసీఆర్ అన్ని వర్గాల వారిని మోసం చేశారని విమర్శించారు. నష్టపోయిన అన్ని వర్గాల వారికి మ్యానిఫెస్టోలో న్యాయం చేస్తామని అన్నారు. తమది గ్రాండ్ అలయన్స్ అన వ్యాఖ్యానంచారు. -
సీట్ల కేటాయింపు పై ఎలంటి చర్చా జరగలేదు
-
బీజేపీ గెలుపు గుర్రాల వేట
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఎన్నికల్లో గెలుపు ముంగిట బోర్లా పడుతున్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఈసారి పక్కా వ్యూహంతో ఫలితాలు సాధించాలనే పట్టుదలతో ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో పార్టీకి ఆదరణ ఉన్నా, దానిని ఎన్నికల వేళ అనుకూలంగా మలుచుకోవడంలో గత కొన్నేళ్లుగా పార్టీ వెనుకబడిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో మిత్రపక్షంగా పోటీ చేసిన స్థానాల్లో కూడా జిల్లా నుంచి ఈ పార్టీ ఏనాడూ గెలుపు దరి చేరలేదు. గత 2014 ఎన్నికల్లో జిల్లాలోని నాలుగు స్థానాల నుంచి బీజేపీ పోటీ చేయగా, ముథోల్, ఆదిలాబాద్ నియోజకవర్గాల్లో 15వేల ఓట్లలోపు స్వల్ప తేడాతో ఓటమి పాలైంది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో విజయమే లక్ష్యంగా ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా బీజేపీని ముందుకు నడిపిస్తున్న నేపథ్యంలో ఈసారి తెలంగాణపై ఆశలు పెరిగాయి. బీజేపీ అధికారంలో ఉన్న మహారాష్ట్రకు ఆనుకొని ఉన్న ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కూడా బీజేపీ నాయకత్వం ‘విన్నింగ్ ప్లాన్’ అమలు చేస్తుందన్న ధీమాతో ఆ పార్టీ నాయకులు ఉన్నారు. బీజేపీకి సహకరించే సంఘ్ పరివార్, భజరంగ్‌దళ్ వంటి సంస్థల కార్యకర్తలు బీజేపీతో సంబంధం లేకుండా ఇప్పటికే నియోజకవర్గాల వారీగా తమ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తుండడం కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. అదే సమయంలో ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు పార్టీకి బలమున్న స్థానాలతోపాటు మిగతా నియోజకవర్గాల్లో కూడా టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులను తట్టుకునే ధీటైన అభ్యర్థుల కోసం వెతుకులాట ప్రారంభించింది. పార్టీ రాష్ట్ర కోర్ కమిటీతో ఉమ్మడి జిల్లా నాయకుల భేటీకి మరో వారం రోజులు గడువు ఉన్న నేపథ్యంలో బలహీన స్థానాల్లో బలమైన అభ్యర్థులను వెతికే పనిలో కూడా పడ్డట్టు తెలిసింది. 4న జిల్లా నేతలతో కోర్‌కమిటీ సమావేశం బీజేపీ అభ్యర్థుల ఎంపిక, వడబోత కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ అక్టోబర్ 3 నుంచి శ్రీకారం చుట్టింది. 6వ తేదీ వరకు జరిగే ఈ సమావేశాల్లో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా అభ్యర్థుల పరిశీలన, తుది ఎంపిక ఉంటుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, మాజీ ఫ్లోర్ లీడర్ జి.కిషన్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, జాతీయ నాయకుడు మురళీధర్‌రావు, సంఘటనా మంత్రి శ్రీనివాస్ తదితరులతో కూడిన కోర్ కమిటీ ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించనుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమావేశం 4వ తేదీన జరుగనుంది. నియోజకవర్గాల వారీగా పోటీకి ఆసక్తి చూపుతున్న అభ్యర్థుల నుంచి గెలుపు గుర్రాల ఎంపిక అప్పుడే మొదలవనుంది. ఇందుకోసం జిల్లా నేతల వద్ద ఉన్న జాబితా, రాష్ట్ర పార్టీ వద్ద ఉన్న జాబితాను పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. బలమైన అభ్యర్థులు ఉన్న స్థానాల్లో వారినే ఎంపిక చేసి, మిగతా చోట్ల అవసరమైతే కొత్తవారిని తెరపైకి తెచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒకరిద్దరు నాయకులు ఉమ్మడి జిల్లాలో బీజేపీలో చేరగా, టికెట్ల కోసం పార్టీలోకి వచ్చేందుకు పలు స్థానాల్లో కొత్త నాయకులు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. పార్టీ కోర్ కమిటీ నిర్ణయం మేరకే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని సమాచారం. నియోజకవర్గాల వారీగా ఆశావహుల జాబితా నుంచి బలమైన పోటీదారుల పేర్లను ఎంపిక చేసి అక్టోబర్ 7న ఢిల్లీకి పంపే అవకాశం ఉందని హైదరాబాద్ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. నాలుగు చోట్ల అభ్యర్థులు ఖరారే.. 2014 ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో భాగంగా బీజేపీ ఐదు స్థానాల్లోనే పోటీ చేసింది. మంచిర్యాల, ఆదిలాబాద్, ముథోల్, చెన్నూరులలో పోటీ చేసిన బీజేపీ కేవలం ఆదిలాబాద్, ముథోల్లలోనే గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచింది. మంచిర్యాల, చెన్నూరులలో మూడో స్థానానికి పరిమితమైంది. అప్పట్లో టీడీపీతో పొత్తు తమను దెబ్బతీసిందని భావిస్తున్న కమలనాథులు ఈసారి ఈ నాలుగు స్థానాలతోపాటు మిగతా ఆరింట కూడా పోటీ చేసే వ్యూహంతోనే ముందుకు పోతున్నారు. ఆదిలాబాద్ నుంచి పాయల్ శంకర్, ముథోల్ నుంచి డాక్టర్ రమాదేవి, మంచిర్యాల నుంచి ముల్కల్క మల్లారెడ్డి పోటీ చేయడం ఖాయమైనట్టే. ఈ నియోజకవర్గాల్లో వీరే బలమైన నాయకులు కాగా, వీరికి పోటీగా కూడా ఎవరూ లేకపోవడం గమనార్హం. అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి ఆసిఫాబాద్ జెడ్పీటీసీగా ఎన్నికై, రాష్ట్ర జెడ్పీటీసీల ఫోరం అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న కొయ్యల ఏమాజీ ఏడాదిన్నర క్రితం బీజేపీలో చేరారు. బెల్లంపల్లి నుంచి పోటీ చేయడమే లక్ష్యంగా ఆయన క్షేత్రస్థాయిలో బలం పెంచుకున్నారు. బెల్లంపల్లిలో కాంగ్రెస్, మిత్రపక్షాలకు బలమైన అభ్యర్థి లేని పరిస్థితుల్లో తమకు కలిసి వస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. ఈ నాలుగు సీట్లకు వేరే నాయకుల నుంచి పోటీ లేదు. కాగా గత ఎన్నికల్లో చెన్నూరు నుంచి రామ్‌వేణు పోటీ చేయగా, ఈసారి ఆయనకు అందుగుల శ్రీనివాస్ నుంచి పోటీ ఉంది. ఈసారి బీజేపీ మరిన్ని సీట్లపై ప్రత్యేక దృష్టి పెట్టింది. నిర్మల్ నియోజకవర్గంలో గత కొన్నేళ్లుగా మల్లికార్జున్‌రెడ్డి బీజేపీ కోసం పనిచేస్తుండగా, తాజాగా మాజీ డిప్యూటీ స్పీకర్ భీంరెడ్డి కూతురు స్వర్ణారెడ్డి రాజకీయాల్లోకి వస్తూ బీజేపీలో చేరారు. ఇక్కడున్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో టీఆర్ఎస్, కాంగ్రెస్‌కు బీజేపీ గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. ఆసిఫాబాద్‌లో ప్రస్తుత సిర్పూరు–టి జెడ్పీటీసీ రాంనాయక్ పోటీ చేయాలని పట్టుదలతో ఉన్నారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కోవ లక్ష్మి సోదరి మాజీ సర్పంచి మర్సుకోల సరస్వతి పార్టీలో చేరి సీటు తెచ్చుకుంటారనే ప్రచారం జరుగుతోంది. సిర్పూరు, బోథ్ , ఖానాపూర్ సీట్లలో పోటీకి పార్టీ నుంచి అభ్యర్థులుగా స్థానికులు ప్రచారంలో ఉన్నప్పటికీ, బలమైన అభ్యర్థుల కోసం ఇంకా వేచి చూస్తున్నట్లు సమాచారం. -
‘తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించండి’
సాక్షి, హైదరాబాద్ : ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను అఖిల పక్షం నేతలు మంగళవారం కలిశారు. ఆపద్ధర్మ సీఎంగా కేసీఆర్‌ను కొనసాగించొద్దని కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్, టీడీపీ పార్టీల నాయకులు గవర్నర్‌ను కోరారు. తెలంగాణలో స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగాలంటే రాష్ట్ర పతి పాలన విధించాలని గవర్నర్‌ను విపక్షాలు కోరాయి. రాజీవ్ శర్మ బ్రోకరా? : ఉత్తమ్ కుమార్ రెడ్డి మోదీ, కేసీఆర్, ఎన్నికల కమిషన్ కలిసి తెలంగాణ ప్రజల హక్కును కాలరాసేలా నిర్ణయం తీసుకున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎన్నికలు ఎలా జరగాలో కూడా కేసీఆర్ ముందే షెడ్యూల్ విడుదల చేశారన్నారు. ఓటర్ లిస్టులో 20 లక్షల ఓట్లు తగ్గించి వాటిని సవరించకుండా ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారని మండిపడ్డారు. 6న గవర్నర్‌ను కలిసిన తరువాత కేసీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్‌తో మాట్లాడాను అని చెప్పారని, ఆన్ రికార్డ్ ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మతో కూడా మాట్లాడానని చెప్పారన్నారు. టీఆర్ఎస్ పార్టీ తరపున రాజీవ్ శర్మ ఎన్నికల కమిషన్‌ను ఎలా కలుస్తారు, ఆయన ఏమైనా బ్రోకరా అని నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రజలు జరుగుతున్న అన్యాయాన్ని గ్రహించి ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. జగ్గారెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. పోలీసులు కేసీఆర్‌కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆపద్ధర్మ ప్రభుత్వంలో అధికార దుర్వినియోగం : కోదండ రామ్ ప్రస్తుతం ఉన్న ఆపద్ధర్మ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తుందని గవర్నర్‌ను కలిశామని టీజేఎస్ అధ్యక్షుడు కోదండ రామ్ అన్నారు. ఓటర్ల పేర్లు ఓటర్ లిస్ట్‌లో గల్లంతయ్యాయన్నారు. వినాయక చవితి, దసరా పండుగలలో ప్రజలు బిజీగా ఉంటారు అందువల్ల ఓటరు నమోదు కార్యక్రమం సరిగా జరిగే అవకాశం లేదని పేర్కొన్నారు. ఇష్టానుసారంగా కేసీఆర్ పాలన : ఎల్ రమణ తెలంగాణలోని రాజ్యాంగ సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని ఇష్టానుసారంగా కేసీఆర్ పరిపాలన కొనసాగిస్తున్నారని టీటీడీపీ అధ్యక్ష్యుడు ఎల్ రమణ అన్నారు. ఎన్నికల సంఘాన్ని సంప్రదించామని కేసీఆర్ చెప్పడం చూస్తే కేంద్రంతో కుమ్మక్కై,రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తున్నారన్నారు. సచివాలయానికి రాకుండా పరిపాలన చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. టీజేఎస్, సీపీఐ, కాంగ్రెస్, టీడీపీ అన్ని పార్టీలు కలిసి రాష్ట్రపతిని కలిసి రాష్ట్రపతి పాలనను విధించమని కోరుతామని పేర్కొన్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్ కొనసాగడానికి వీలు లేదన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా తెలంగాణలో పాలన : చాడ వెంకట్ రెడ్డి తెలంగాణలో రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగుతుందని సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలతో కలిసి 100 సీట్లు గెలుస్తామంటున్నారని, మోదీతో కలిసి ఎన్నికల షెడ్యూల్ కూడా కేసీఆర్ ఎలా ప్రకటించారని ప్రశ్నించారు. రేపు కేసీఆర్ తను అనుకున్నది చేయడానికి ఎంతమంది పైన కేసులు పెట్టడానికైనా వెనకాడరన్నారు. కేసీఆర్‌పై ఫిర్యాదు చేస్తే గవర్నర్ ఏమాత్రం స్పందించలేదన్నారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర పతికి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. నవంబర్‌లో ఎన్నికలు రావడానికి అనేక అక్రమాలు చేస్తున్నారని తెలిపారు. చట్టపరమైన చర్యలు తీసుకునేలా కూడా ఆలోచిస్తామన్నారు. -
చేయి కలుపుదాం
సాక్షి, హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదుర్చుకునేందుకు తెలంగాణ టీడీపీ నేతలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు పూర్తి స్థాయి క్లియరెన్స్ ఇచ్చారు. శనివారం జరిగిన పార్టీ నేతల సమావేశాల్లో కాంగ్రెస్‌తో కలసి వెళ్లాల్సిన ఆవశ్యకతను వివరించిన బాబు.. ఆదివారం తన నివాసంలో జరిగిన సమావేశంలో పొత్తుపై మరింత స్పష్టతనిచ్చారు. ‘కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకోండి. ఆ దిశగా చర్చలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోండి. మీరు ముందుకెళ్లండి. నేనున్నాను..’అని టీటీడీపీ చీఫ్ ఎల్.రమణతో పాటు ఇతర ముఖ్య నేతలకు స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలను కలుపుకొని పోయే విషయంలో చొరవ తీసుకుని వ్యవహరించాలని సూచించారు. చంద్రబాబు నుంచి పూర్తిస్థాయిలో ఆమోదం రావడంతో ఎల్.రమణ కూడా వేగంగా పావులు కదిపారు. వెంటనే కాంగ్రెస్, సీపీఐ, జనసమితి నేతలకు ఫోన్లు చేసి కలసి వెళ్లడం కోసం మాట్లాడుకుందాం రమ్మని ఆహ్వానించడం గమనార్హం. కాగా పార్టీ సమావేశంలో భాగంగా ఎన్నికల సమన్వయ కమిటీ, మేనిఫెస్టో, ప్రచార కమిటీల ఏర్పాటుపై రాష్ట్ర నేతలు ప్రతిపాదించిన జాబితాకు కూడా బాబు ఆమోదం తెలిపారు. పార్టీ మేనిఫెస్టో తయారు చేసే బాధ్యతలను పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ టి.దేవేందర్‌గౌడ్‌కు అప్పగించారు. - ఎన్నికల సమన్వయ కమిటీ: ఎల్.రమణ, టి.దేవేందర్‌గౌడ్, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, నామా నాగేశ్వరరావు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, పెద్దిరెడ్డి, మండవ వెంకటేశ్వరరావు - మేనిఫెస్టో కమిటీ: టి.దేవేందర్‌గౌడ్ (చైర్మన్), రావుల చంద్రశేఖర్‌రెడ్డి, బక్కని నర్సింహులు, అలీ మస్కతి, బండ్రు శోభారాణి - ప్రచార కమిటీ: గరికపాటి మోహన్‌రావు, సండ్ర వెంకటవీరయ్య, కొత్తకోట దయాకర్‌రెడ్డి, అరవింద్‌కుమార్‌గౌడ్, రమావత్ లక్ష్మణ్‌నాయక్ టీడీపీ–సీపీఐ పొత్తు ఖరారు వచ్చే ఎన్నికల్లో కలసి పనిచేయాలని తెలుగుదేశం, భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నిర్ణయించాయి. ఈ మేరకు ఆదివారం ఇరు పార్టీల నేతలు ఎన్టీఆర్ భవన్లో సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ ఫోన్ చేసి ఆహ్వానించడంతో సీపీఐ నేతలు భవన్‌కు వచ్చి చర్చలు జరిపారు. భేటీ అనంతరం కలసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరు పార్టీల నేతలు ప్రకటించారు. అందరితో మాట్లాడదాం: రమణ రమణతో పాటు పార్టీ నేతలు నామా నాగేశ్వరరావు, పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, అమరనాథ్బాబు.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, పార్టీ నేత పల్లా వెంకటరెడ్డి ఎన్టీఆర్ భవన్లో సమావేశమయ్యారు. గంట పాటు జరిగిన చర్చలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, ఇరు పార్టీలు కలసి పనిచేయాల్సిన ఆవశ్యకతపై చర్చించారు. తమతో పాటు కాంగ్రెస్, ఇతర భావసారూçప్య పార్టీలను కలుపుకుని పోయేలా చర్చలు జరపాలని నిర్ణయించారు. ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలంటూ చర్చించడానికి బదులు అన్ని పార్టీలను పొత్తుకు ఒప్పించాలని.. ఆ తర్వాత సీట్లు, సర్దుబాట్లపై చర్చించాలని అవగాహనకు వచ్చినట్లు తెలిసింది. కేసీఆర్‌ను గద్దె దింపుతాం: రమణ రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగిస్తున్న కేసీఆర్‌ను గద్దె దింపుతామని రమణ అన్నారు. కేసీఆర్‌కు రాజకీయ, నైతిక విలువల్లేవని విమర్శించారు. ఆయన కు సభలపై ఉన్న దృష్టి రైతులపై లేదన్నారు. రానున్న రోజుల్లో మహాకూటమి రాష్ట్రలో జెండా ఎగరేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నేడు, రేపు ఇతర పార్టీలతో కూడా చర్చిస్తామని.. కాంగ్రెస్‌కు ఇప్పటికే సమాచారం ఇచ్చామని వెల్లడించారు. గెలిచే స్థానాలే అడుగుతాం: చాడ కలసి వచ్చే అన్ని పార్టీలతో చర్చిస్తామని, మహాకూటమి దిశగా అడుగులు వేస్తున్నామని చాడ వెంకటరెడ్డి చెప్పారు. కేసీఆర్‌కు అధికారమే తప్ప రైతుల మీద ఆసక్తి లేదని విమర్శించారు. పోటీ చేయాల్సిన స్థానాలు ముఖ్యం కాదని, పోటీ చేసిన చోట గెలవాలని, చర్చల్లో గెలిచే స్థానాలే అడుగుతామని చెప్పారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కృషి చేస్తామన్నారు. నేడు కాంగ్రెస్‌తో చర్చలు! సోమవారం ఉదయం టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంతో టీడీపీ నేతలు సమావేశ మయ్యే అవకాశం ఉంది. సోమవారం సాయంత్రం కాంగ్రెస్, టీడీపీల మధ్య చర్చలు జరిగే అవకాశముంది. బంద్ నేపథ్యంలో ఒకవేళ సోమవారం చర్చలకు వీలు కాకపోతే మంగళవారం జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. -
కూటమి ఏర్పాటు దిశగా టీడీపీ.. చాడకు రమణ ఫోన్
సాక్షి, హైదరాబాద్ : ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీటీడీపీ నేతలు మరో సారి సమావేశం కానున్నారు. కాంగ్రెస్‌తో పొత్తు తప్పదని పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేయడంతో మిగతా పార్టీలతో కూటమి కట్టేందుకు టీటీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు పొత్తులపై చర్చలకు రావాలంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డికి టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ఆహ్వానించారు. సాయంత్రం సీపీఐ నేతలతో టీడీపీ నేతలు సంప్రదింపులు జరుపనున్నారు. సోమవారం ఉదయం టీజేఎస్ అధినేత కోదండరాంతో కూడా టీడీపీ నేతల సమావేశం కానున్నారు. మంగళవారం జరిగే ఆల్‌పార్టీ సమావేశం తర్వాత పొత్తులపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కమిటీల ఏర్పాటు ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టీటీడీపీ మూడు కమిటీలను ఏర్పాటు చేసింది. పొత్తుల సంప్రదింపుల కమిటీ, మేనిఫెస్టో కమిటీ, ప్రచార కమిటీల జాబితాను సిద్ధం చేసింది. పొత్తుపై సంప్రదింపులకు ఎల్.రమణ నేతృత్వంలో ఏడుగురితో కమిటీ వేశారు. దేవేందర్‌గౌడ్ నేతృత్వంలో ఐదుగురితో మేనిఫెస్టో కమిటీ, గరికపాటి మోహన్‌రావు నేతృత్వంలో ఎన్నికల ప్రచార కమిటీని ఏర్పాటు చేశారు. -
సమన్యాయం చేయమన్నా..
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తే ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని కోరానే తప్ప తెలంగాణ ఏర్పాటును తాను వ్యతిరేకించలేదని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలతో తనకు విడదీయరాని అవినాభావ సంబంధం 35 ఏళ్లుగా కొనసాగుతోందని, తాను రాష్ట్రాన్ని విభజిం చవద్దని కానీ, విభజించమని కానీ చెప్పలేదని అన్నారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అధ్యక్షతన శనివారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్లో జరిగిన పార్టీ రాష్ట్రస్థాయి విస్తృత కార్యవర్గ సమావేశానికి చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలో టీడీపీ ఉండటం చారిత్రక అవసరమని, తెలంగాణ ధనిక రాష్ట్రం అయ్యేందుకు టీడీపీ కష్టపడిందని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డు, సైబరాబాద్, అంతర్జాతీయ విమానాశ్రయం, జీనోమ్ వ్యాలీ, ట్రిపుల్ ఐటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి.. ఇలా అన్నీ టీడీపీ ప్రారంభించిన ప్రాజెక్టులేనని చెప్పారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసినట్టు ఏపీని అభివృద్ధి చేయాలని, మంచి రాజధానిని నిర్మించాలని కృషి చేస్తున్నామని చెప్పారు. కేంద్రం తెలంగాణకు ఏమీ చేయలేదు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను మోసం చేసిందని, అలాగని తెలంగాణకు ఏమీ చేయలేదని చంద్రబాబు ఆరోపించారు. ‘‘తెలంగాణకు ఏమైనా ఇచ్చారా..? డబ్బులన్నీ హైదరాబాద్ నుంచే వెళ్తున్నాయి. దేశంలోనే ఎక్కువ పన్నులు కట్టే నగరం హైదరాబాద్. ఈ రాష్ట్రానికి ఏదైనా ప్రయోజనం చేసే బాధ్యత కేంద్రానికి లేదా? ఎందుకివ్వరు?’’అని ప్రశ్నించారు. విభజన చట్టంలోని అంశాలను ఏ మాత్రం పట్టించుకోకుండా, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీలను ఏర్పాటు చేయలేదని, కనీసం ఒక్క జాతీయ ప్రాజెక్టును కూడా ప్రకటించలేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతోపాటు తెలంగాణ కోసం విభజన చట్టంలో పెట్టిన అంశాల కోసం టీడీపీ పక్షాన తాను పోరాటం చేశానని చెప్పారు. నోట్ల రద్దు, జీఎస్టీ, పెట్రో ధరల పెంపుతో కేంద్ర ప్రభుత్వం ప్రజల నడ్డివిరుస్తున్నదన్నారు. పొత్తుపై మీ నిర్ణయమే ఫైనల్ పార్టీ ప్రయోజనాలు, తెలంగాణ ప్రయోజనాల కోసం ఏం చేస్తే బాగుంటుందో ఓ నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ టీడీపీ నేతలకు చంద్రబాబు సూచించారు. ‘‘రేపు, ఎల్లుండి రాష్ట్ర నేతలు కూర్చుని ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటారు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సహకరిస్తాను’’అని అన్నారు. తెలంగాణలో పార్టీ నిలదొక్కుకుని బలోపేతం కావాల్సి ఉన్న నేపథ్యంలో అందరికీ అవకాశం ఇవ్వలేమని వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీడీపీ ఉండాలని, ఆ అవసరాన్ని కాపాడేలా ఇక్కడి నేతలు నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ‘జై తెలంగాణ.. జై తెలంగాణ.. జై తెలంగాణ’అని ప్రసంగాన్ని ముగించారు. సమావేశంలో మాజీ ఎంపీ దేవేందర్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, నేతలు నామా, రేవూరి, రావుల, మండవ వెంకటేశ్వరరావు, అన్నపూర్ణమ్మ, అరవింద్ కుమార్‌గౌడ్, బి.మల్లయ్యయాదవ్, వీరేందర్‌గౌడ్, బండ్రు శోభారాణి, నన్నూరి నర్సిరెడ్డి, జక్కిలి అయిలయ్య యాదవ్, యూసుఫ్, తాజుద్దీన్ పాల్గొన్నారు. అది రాజకీయమా? ‘‘నేను ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, తెలంగాణ ప్రయోజనాల గురించి ప్రధాని మోదీపై అవిశ్వాసం పెడితే.. నాకు పరిపక్వత లేదని, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. తద్వారా మా ఇద్దరి మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నించారు. అది రాజకీయమా.. అది న్యాయమా?’’అని చంద్రబాబు ప్రశ్నించారు. తనకు పరిపక్వత లేదన్న మోదీ 2002లో ముఖ్యమంత్రి అయితే.. తాను 1994లోనే అయ్యానని అన్నారు. రాజకీయ మిత్రులుగా టీడీపీ, బీజేపీ ఉన్నప్పుడే.. తెలంగాణ బీజేపీ కనీస ధర్మం పాటించకుండా తెలంగాణలో టీడీపీతో పొత్తు ఉండదని ఏకపక్షంగా ప్రకటించిందని చెప్పారు. తెలంగాణలో మళ్లీ తాను అధికారంలోకి రావాలని కొందరు అన్నారని, ఇక్కడ తాను సీఎంగా ఉండటం కుదరదని చంద్రబాబు స్పష్టం చేశారు. సమష్టిగా, సమర్థంగా ముందుకెళ్లే అలవాటు తెలంగాణ నేతలు నేర్చుకోవాలని, పూర్తిగా అండగా ఉండి ముందుకు తీసుకెళ్లే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు. -
ఎగ్జిబిషన్ గ్రౌండ్లో టీటీడీపీ మహానాడు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహానాడుకు సర్వం సిద్ధమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో గురువారం మహానాడు జరుగనుంది. ఈమహానాడులో మొత్తం 8 తీర్మానాలపై నేతలు చర్చించనున్నారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపే ఎండగట్టడం తదితర అంశాలపై చర్చలు సాగనున్నాయి. ఈ నేపధ్యంలో టీటీడీపీ నేతలు ఎల్ రమణ, రావు చంద్రశేఖర్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య ఇతర నేతలు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళలర్పించి అనంతరం మహానాడుకు బయల్దేరారు. ఈ సందర్భంగా ఎల్ రమణ మాట్లాడుతూ..‘17 పార్లమెంట్ స్థాయి, రెండు జిల్లా స్థాయి మహానాడులు నిర్వహించాం. నేడు 8లక్షల మంది కార్యకర్తలు, నాయకులందరి సాక్షిగా తెలంగాణ మహానాడు జరుగుతోంది. దేశంలోనే సెక్రటేరియట్‌కు రానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే. సెక్రటేరియట్‌కు రాకుండా ఇంటి నుంచి పాలన వల్ల పరిపాలన గాడి తప్పింది. సీఎం రాకపోవటంతో అజమాయిషీ లేకుండా పాలన పడకేసింది. ప్రగతిభవన్ పైరవీభవన్‌గా మారిపోయింది. టీడీపీ వల్లనే పేదవాళ్లకు న్యాయం జరగుతుంది’ అని తెలిపారు. కాగా తెలంగాణలోని అన్ని జిల్లాలు, గ్రేటర్ హైదరాబాద్‌లోని పార్టీ నాయకులు భారీగా మహానాడుకు తరలివచ్చారు. పూర్వ వైభవానికి కృషి 35 ఏళ్లుగా మహానాడు ఆనవాయితీగా నిర్వహిస్తున్నామని, ఈసారి కూడా 27, 28, 29 లో విజయవాడలో మహానాడు నిర్వహిస్తున్నట్టు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో రమణ నాయకత్వంలో తెలుగు దేశం మహానాడు జరుగుతోందని, అనేక తీర్మానాలతో పాటు, భవిష్యత్ కార్యచరణ రూపొందించుకుంటామన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ సుస్థిరంగా తెలుగు వారి గుండెల్లో నిలిచి పోయిందని తెలిపారు. తెలంగాణ మహానాడుకు వెళ్లేముందు ఎన్టీఆర్‌కు నివాళులర్పించి ఆయన ఆశయాలు అభ్యర్థించేందుకు ఘాట్‌కు వచ్చామన్నారు. ఎన్టీఆర్ ఆశయాలు, చంద్రబాబు అండదండలతో తెలంగాణలో తెలుగుదేశం పూర్వ వైభవానికి కృషిచేస్తామని పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా చంద్రబాబు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగే మహానాడు చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ చేరుకుని మహానాడులో పాల్గొంటారు. విజయవాడ నుంచి నేరుగా బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న చంద్రబాబు అక్కడి నుంచి రోడ్డు మార్గాన మహానాడుకు చేరుకుంటారు. దాదాపు 5 గంటల పాటు మహానాడులో ఉండనున్న చంద్రబాబు కార్యకర్తలకు భరోసా కల్పిస్తూ, పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రసంగించనున్నారు. -
టీఆర్ఎస్ది నిరంకుశ పాలన
రాజేంద్రనగర్: రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కార్ నిరంకుశ పాలన కొనసాగిస్తుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ విమర్శించారు. శివరాంపల్లి నిర్వహించిన ఇంటింటికీ టీడీపీ కార్యక్రమానికి రమణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సంద ర్భంగా శివరాంపల్లి చౌరస్తాలో ఆ పార్టీ జెండా ఎగురవేసి స్థానిక బస్తీ ల్లో పర్యటించారు. అనంతరం ఆయ న మాట్లాడుతూ.. ప్రజల స్వేచ్ఛను టీఆర్ఎస్ అణచివేస్తోందన్నారు. ఏ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు, కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే ధర్నాలు, నిరసన కార్యక్రమాలను ఏ ప్రభుత్వాలు ఆటంకం సృష్టించవన్నారు. కానీ టీఆర్ఎస్ ధర్నాచౌక్‌తో పాటు ప్రతిపక్షాల ధర్నాలు, నిరసన కార్యక్రమాలను అడ్డుకుంటూ నేతలను ముందస్తుగా అరెస్ట్‌లు చేసి భయాం దోళన సృష్టిస్తుందని మండిపడ్డారు. 12 వందల మంది విద్యార్థుల త్యా గంతో రాష్ట్రం సిద్ధించిందని, నేటికీ బాధిత కుటుంబాలకు న్యాయం జరగలేదన్నారు. కార్యక్రమంలో నాయకులు మ్యాడం రామేశ్వర్రావు, ఆర్. గణేష్‌గుప్తా, కృష్ణాగౌడ్, రాజ్‌కుమార్, వెంకటేష్, శ్రీనివాస్‌రెడ్డి, శ్యామల, బాల్‌రాజ్, రాజు పాల్గొన్నారు. -
ప్రగతి భవన్‌ను ఆసుపత్రిగా మారుస్తాం
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ప్రగతి భవన్‌ను ప్రజా ఆసుపత్రిగా మారుస్తామని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ తెలిపారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని విమర్శించారు. కూకట్పల్లి నియోజకవర్గం కేపీహెచ్‌బీ కాలనీలో కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘బస్తీబస్తీకి తెలుగుదేశం పార్టీ’కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ ప్రభు త్వం మాటలకే పరిమితం అయ్యిందని ఎద్దేవా చేశారు. పొలిట్‌బ్యూరో సభ్యుడు ఇనుగాల పెద్దిరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం తరఫున గెలిచి, టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఎన్నికల్లో ప్రజలు తగురీతిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. -
వచ్చే ఎన్నికల్లో సొంతంగా పోటీచేస్తాం..
సారంగాపూర్: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీతో పొత్తు లేకుండా అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు టీడీపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ చెప్పారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్‌లో ఆయన ఆదివారం విలేక రులతో మాట్లాడారు. తెలంగాణలో టీడీపీని బలహీనపరచ డానికి టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుట్రలు పన్నాయని ఆరోపించారు. ఆయా పార్టీల్లోకి టీడీపీ నేతలను చేర్చుకోవడం ఇందులో భాగమేనని చెప్పారు. బీజేపీతో పొత్తు పార్టీ అధినేత చంద్రబాబు ఆలోచనావిధానంపై ఆధారపడి ఉంటుందన్నారు. టీడీపీ వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్తో పొత్తుపెట్టుకుంటున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. నాయకుల కొనుగోళ్లకు టీఆర్ఎస్ తెరలేపిందని, ఉద్యమపార్టీ ముసుగులో లాభ పడిందని విమర్శించారు. తెలంగాణలో తెలుగుదేశంపార్టీ బలహీ నంగా ఉందన్న విషయం వాస్తవంకాదని, పార్టీని బలహీనపరిచి, తమ బలం పెంచుకోవడానికి ఎదుటి పార్టీలు పనిచేస్తున్నాయని రమణ విమర్శించారు. -
రేవంత్ రాజీనామా ఇవ్వలేదు: ఎల్.రమణ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత రేవంత్ రెడ్డి స్థాయి పడిపోయిందని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామాను చంద్రబాబుకు ఇచ్చానని రేవంత్‌రెడ్డి చెప్పడంలో వాస్తవంలేద న్నారు. టీఆర్ఎస్కు టీడీపీయే ప్రత్యామ్నాయమన్నారు. కొడంగల్‌లో త్వరలోనే సభను ఏర్పాటు చేస్తామని, పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. కాగా, తమకున్న సమాచారం ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉందన్నారు. -
ఆయనతో కలిసి రేవంత్ కుట్ర పన్నాడు
-
రేవంత్‌కు నా గురించి మాట్లాడే అర్హత లేదు
-
రేవంత్ ఎక్కడి నుంచి వచ్చాడో అందరికీ తెలుసు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నిర్ణయాలు తీసుకునే హక్కు తనకు ఉందని ఎల్ రమణ అంటున్నారు. రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణల ఖండించిన టీటీడీపీ చీఫ్ రమణ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. గతంలో స్టార్ హోటళ్లలో నిర్వహించిన పార్టీ సమావేశాలకు రేవంత్ కూడా హాజరయ్యాడని.. అప్పుడు ఎవరు డబ్బులు పెట్టారని వచ్చాడంటూ ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం కాంగ్రెస్ కబంధహస్తాల్లో ఇరుక్కుపోయి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడని, నిన్నటి సమావేశంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు చెప్పారు. డబ్బు కోసం చీకటి ఒప్పందాలు చేసుకునే రకం తాను కాదని ఈ సందర్భంగా రమణ తెలిపారు. ‘‘ఆర్థికంగా ఉన్న కుటుంబం మాది. నాపై ఆరోపణలు చేసే వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడో అందరికీ తెలుసు’’ అని రేవంత్‌ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. గతంలో ఎర్రబెల్లిపై ఆరోపణలు చేసిన సమయంలో తన కూతురిపై రేవంత్ ప్రమాణం చేసి మరీ తర్వాత గప్ చుప్ అయిపోయాడన్న విషయాన్ని గుర్తు చేశాడు. ఇప్పుడు రేవంత్ చేస్తున్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలనే తాము కోరుతున్నామని, అది జరిగేంత వరకు పార్టీ కార్యక్రమాలకు రేవంత్‌ను ఆహ్వనించమని రమణ స్పష్టం చేశారు. ప్రస్తుతం తమ పార్టీలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారని.. వారే ప్రభుత్వం తరపున పోరాటాన్ని కొనసాగిస్తారని చెప్పారు. తానెవరి దగ్గర రూపాయి తీసుకోలేదని.. తప్పు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగిత్యాల నుంచే పోటీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. కాగా, నేడు ఉదయం 11 గంటలకు లేక్‌వ్యూ గెస్ట్ హౌజ్‌లో చంద్రబాబుతో భేటీలో నిర్ణయం తీసుకుంటామని రమణ చెప్పారు. అసెంబ్లీ సమావేశాలకు రేవంత్ రెడ్డి హాజరుకావటంతో.. ప్రత్యేకంగా బాబుతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
రేవంత్ రెడ్డిని వివరణ కోరా
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేతలను, ఆ పార్టీ ఏఐసీసీ ఉపాధ్య క్షుడు రాహుల్‌ను కలసినట్లు వస్తున్న వార్తలపై వివరణ ఇవ్వాలని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిని కోరినట్లు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ చెప్పారు. రేవంత్ రెడ్డి సహా పార్టీ నేతలు ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘించినా చర్యలు తప్పవన్నారు. రేవంత్‌రెడ్డి పార్టీ మారనున్నారని చర్చ జరుగుతున్న నేపథ్యంలో తాను వివరణ కోరినట్లు మంగళవారం విలేకరులకు చెప్పారు. అయితే ఆయన నుంచి ఇప్పటివరకు సమాధానం రాలేదన్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళుతున్నామన్నారు. 27 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున టీడీఎల్పీ సమావేశం నిర్వహించే అంశంపై నిర్ణయం తీసుకోలేదన్నారు. -
క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
సాక్షి, హైదరాబాద్: పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఏ స్థాయి నాయకుడైనా కఠిన చర్యలు తీసుకుంటా మని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ హెచ్చరిం చారు. అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకే ముందుకెళ్తున్నామని చెప్పారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో పార్టీ నేతలు మోత్కుపల్లి నర్సిం హులు, పెద్దిరెడ్డితో కలసి విలేకరులతో మాట్లా డారు. భావసారూప్యత ఉన్న పార్టీలతోనే వచ్చే ఎన్నికల్లో కలసి పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 8న చంద్రబాబు తో జరిగిన సమావే శంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం పార్టీ నేత లు నడుచుకోవాలని సూచించారు. గతంలో తనపై కూడా ఆరోపణలొస్తే వివరణ ఇచ్చానని గుర్తు చేశారు. కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌ను కలిసినట్లు వస్తున్న వార్తలపై రేవంత్ రెడ్డి స్పందించాలన్నారు. కాగా, తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు నిజం కాదని పెద్దిరెడ్డి చెప్పారు. టీడీపీలో రేవంత్ మాట వినేవారు ఎవరూ లేరని, అందరూ అధినేత చంద్రబాబు మాటకు కట్టుబడి ఉండే వారే ఉన్నారని మోత్కుపల్లి పేర్కొన్నారు. -
టీటీడీపీ జిల్లా అధ్యక్షుల జాబితా ఖరారు
విజయవాడ: టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో తెలంగాణ టీడీపీ నేతల భేటీ ముగిసింది. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో రేవంత్‌రెడ్డి, ఎల్.రమణ, మోత్కుపల్లి నర్సింహులు తదితరులు హాజరయ్యారు. తెలంగాణలోని 25 జిల్లాల అధ్యక్షుల పేర్లు ఖరారుకాగా ఆరు జిల్లాలను పెండింగ్‌లో పెట్టారని ఎల్.రమణ తెలిపారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై చంద్రబాబుతో తాము చర్చించామని వివరించారు. తెలంగాణ జిల్లాల టీడీపీ అధ్యక్షులు వీరే.. 01. నిర్మల్- వేలం శ్యాం సుందర్ 02. ఆదిలాబాద్- సోయం బాపూరావు 03. మంచిర్యాల- బోడ జనార్దన్ 04. ఆసిఫాబాద్- గుళ్లపల్లి ఆనంద్ 05. నిజామాబాద్- అరికెల నర్సారెడ్డి 06. కామారెడ్డి- సుభాష్ రెడ్డి 07. పెద్దపల్లి- విజయ రమణరావు 08. కరీంనగర్- కవ్వంపల్లి సత్యనారాయణ 09. జగిత్యాల- ఐలినేని సాగర్ రావు 10. సిరిసిల్ల- అన్నంనేని నర్సింగరావు 11. సంగారెడ్డి- శశి కళా యాదవ్ రెడ్డి 12. సిద్దిపేట- ఒంటేరు ప్రతాప్ రెడ్డి 13. వికారాబాద్- సుభాష్ యాదవ్ 14. రంగారెడ్డి- సామా రంగారెడ్డి 15. మేడ్చెల్- తోటకూర జంగయ్య యాదవ్ 16. వరంగల్ రూరల్- గన్నోజు శ్రీనివాసచారీ 17. వరంగల్ అర్బన్- ఈగ మల్లేశం 18. భూపాలపల్లి- గండ్ర సత్యనారాయణ రావు 19. జనగాం- కొండా మధుసూదన్ రెడ్డి 20. సూర్యాపేట్- పటేల్ రమేష్ రెడ్డి 21. మెదక్- ఏ.కె. గంగాధరరావు 22. హైదరాబాద్- ఎంఎన్ శ్రీనివాస్ 23. యాదాద్రి- ఎలిమినేటి సందీప్ రెడ్డి 24. మహబూబాబాద్- చుక్కల విజయ్ చందర్ 25. నల్గొండ- బిల్యా నాయక్ -
దళితులపై దాడిని ఖండిస్తున్నాం
► టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ► సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో నేరెళ్ల ఘటనపై ఫొటో ఎగ్జిబిషన్ ► అన్ని పార్టీలు ఒక్కటై పోరాడాలి: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ► ఇసుక దందాపై విచారణ జరగాలి: కోదండరాం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రి కేటీఆర్ సొంత నియోజకవర్గంలో దళితులపై జరిగిన దమనకాండను ఖండిస్తున్నామని, బాధితు లకు నష్టపరిహారం చెల్లించాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ విమర్శించారు. నేరెళ్ల ఘటనపై గురువారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో టీడీపీ ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. వివిధ పార్టీల నేతలు ఈ కార్య క్రమంలో పాల్గొన్నారు. నేరెళ్ల ఘటనపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసి బాధితులకు న్యాయం జరిగేలా ప్రయత్నం చేసిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నా రు. లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ బాధితులను చూసి కంట తడిపెడితే సీఎం కేసీఆర్ హేళన చేశారని, ఇలాంటి సంఘట నలపై అన్ని పార్టీలు ఏకమై పోరాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఒక్కటైన పార్టీలకు అభినందన.. అట్టడుగు వర్గాల మీద జరిగిన దాడులను ఖండించడానికి ఏకతాటిపైకి వచ్చిన అన్ని పార్టీలను అభినందిస్తున్నానని టీజేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. లారీని తగుల బెట్టా రన్న నెపంతో పది కుటుంబాలను టార్గెట్ చేశా రని ఆరోపించారు. కులం పేరుతో దూషించిన తర్వాత ఇది దళితులపై జరిగిన దాడి కాదని ఎలా అంటారని, బాధ్యులపై అట్రాసిటీ కేసులు కూడా పెట్టాలని అన్నారు. ఇసుక దందాపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నేరేళ్ల బాధితులను తాను స్వయంగా కలిశానని, పోలీసులు వారిని చిత్రహింసలు పెట్టారని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. ప్రభుత్వానికి మానవత్వం ఉందా అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రజా పరిపాలన కాకుండా పోలీస్ పాలన సాగిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి విమర్శించారు. దళితులను ఎందుకు చిత్రహింసలకు గురిచేయాల్సి వచ్చిందో చెప్పాలని, చలో సిరిసిల్ల పాదయాత్ర కార్యక్రమానికి అన్ని పార్టీల సహకారం ఉంటుందని ఆశిస్తున్నామన్నారు. ఇసుక మాఫియాతో కేటీఆర్‌కు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని, కేసీఆర్ కుటుంబమే ఇసుక మాఫియాను నడిపిస్తోందని, ఇందుకు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి అన్నారు. నేరెళ్ల బాధితులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నేరేళ్ల ఘటనను బీజేపీ ఖండిస్తోందని ఆ పార్టీ నాయకుడు చింతా సాంబమూర్తి పేర్కొన్నారు. నేరేళ్లలో జరిగిన దాడులను సీపీఐ ఖండిస్తోందని ఆ పార్టీ నేత బాలస్వామి అన్నారు. -
సీఎం నోరెందుకు విప్పడంలేదు?
మియాపూర్ భూ కుంభకోణంపై రేవంత్, రమణ సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మియాపూర్ ప్రభుత్వ భూముల కుంభకోణం కేసును సీబీఐకి అప్పగించి సీఎం కేసీఆర్ తన చిత్త శుద్ధి నిరూపించుకోవాలని టీటీడీపీ అధ్యక్షు డు ఎల్.రమణ డిమాండ్ చేశారు. 700 ఎకరాల ప్రభుత్వ భూకుంభకోణం వెలుగు లోకి వచ్చి 20 రోజులు గడుస్తున్నా సీఎం ఎందుకు నోరు విప్పడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ కేసును సీఐడీకి అప్పగిస్తే కేసు నీరుగార్చినట్లేనన్నారు. సోమవారం టీడీపీ ఆధ్వర్యంలో మియాపూర్ భూ కుంభకోణం నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభు త్వ అండదండలతోనే గోల్డ్‌స్టోన్ ప్రసాద్ ఈ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ అక్రమాల్లో సీఎం పేషీలోని ఆయన సమీప బంధువు కీలకంగా వ్యవహరించారన్నారు. ఎంసెట్ లీకేజీ, నయీమ్ కేసులను అట కెక్కించిన సీఎం.. తాజాగా మియాపూర్ భూముల వ్యవహారాన్ని కూడా బుట్టదాఖలు చేసే యత్నం చేస్తున్నారన్నారు. మియాపూర్ భూ కుంభకోణం రూ.15 వేల కోట్లని, ఇవే కాకుండా.. మణికొండలోని కాందీశీకుల భూములనూ కాజేశారన్నారు. -
ఎస్సీ సబ్‌ప్లాన్ నిధుల ఖర్చులో విఫలం
హైదరాబాద్: అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వల్ల ఏర్పడ్డ ప్రభుత్వాలు చట్టాలకు అనుగుణంగా పనిచేయాల్సిందిపోయి.. వాటిని తుంగలో తొక్కుతున్నాయని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కమీషన్లు వచ్చే కార్యక్రమాల కోసం బడ్జెట్ నిధులు ఖర్చు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ సర్కార్ ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను సరిగ్గా ఖర్చు పెట్టడంలో విఫలమైంది. మంత్రివర్గ కూర్పులో దళితులు, మహిళలకు చోటు ఇవ్వనేలేదు.. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని మోసం చేశారన్నారు. యాల్సి ఉంది. -
తిరోగమనంలో తెలంగాణ: రమణ
కోదాడ, అర్బన్: టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందక పోగా తిరోగమనంలో పయనిస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ విమర్శించారు. గురువారం సూర్యాపేట జిల్లా కోదాడలో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాన్ని పూర్తిగా విస్మరించిందని చెప్పారు. నకిలీ విత్తనాలతో రైతులు పూర్తిగా నష్టపోయారని, వాటిని అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. -
ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకే ధర్నా
రైతులు ఎక్కడ సంతోషంగా ఉన్నారో చెప్పాలి ఓరుగల్లు ప్రజలే కేసీఆర్ మెడలు వంచుతారు నకిలీ విత్త్తన కంపెనీలపై చర్యలేవి టీటీడీపీ నేతలు వరంగల్: రాష్ట్రంలో అకాల వర్షాలతో, నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకే ధర్నా కార్యక్రమం చేపట్టినట్లు టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. రైతాంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీటీడీపీ అధ్వర్యంలో గురువారం చేపట్టిన కలెక్టరేట్ ధర్నా, ముట్టడి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు కష్టాలు ఉండవని చెప్పిన సీఎం కేసీఆర్ ప్రస్తుతం వారిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. వ్యవసాయ నిర్లక్ష్యం, విత్తన కంపెనీలపై ప్రభుత్వ అజామారుుషీ లేక పోవడంతోనే హైబ్రిడ్ పేరుతో నాణ్యతలేని నకిలీ మిర్చి విత్తనాలను డీలర్లు రైతులకు అంటగడుతున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి మాట్లాడుతూ నకిలీ విత్తనాలపై పూర్తి స్థారుులో విచారణ జరిపి క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. అధికారులు నకిలీ విత్తనాలపై అందజేసిన నివేదకలను ప్రభుత్వం తొక్కిపెడుతోందన్నారు. అనంతరం టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట ఏర్పాటు ఉద్యమంలో ముందుండి పోరాడిన ఓరుగల్లు ప్రజలే హామీలతో గద్దెనెక్కి పట్టించుకోని సీఎం కేసీఆర్ వంచుతారన్నారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలతో రైతులు సంతోషంగా ఉన్నారని సీఎం కేసీఆర్ చెబుతున్నారని ఎక్కడ సంతోషంగా ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలను అపహాస్యం చేయడం తగదు...రేవూరి రైతు సమస్యలు. ఇతర విషయాలపై ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలను అపహస్యం చేయడం సీఎంకు తగదని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. నకిలీ విత్తనాల కంపెనీలపై కేసులు పెట్టి చట్టరీత్యా చర్య తీసుకోవాలన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబానికి రూ.3లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి సీతక్క డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో దెబ్బతిన పంటలకురూ.25వేల చొప్పున, నకిలీ విత్తనాలతో మోస పోరుున రైతులకు ఎకరాలకు రూ.40వేల చొప్పున పరిహారం అందించాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు అన్నారు. కార్యక్రమంలో వేం నరేందర్‌రెడ్డి, నర్సిరెడ్డి, చిలుక మధుసూదన్, జాటోతు ఇందిర, గట్టు ప్రసాద్‌బాబు, గన్నోజు శ్రీనివాసచారి, రాంచంద్రునాయక్, తుళ్లూరు బ్రహ్మయ్య, తదితరులు పాల్గొన్నారు. -
సంక్షేమాన్ని ఫ్రీజ్ చేసి పండుగా?
టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ సాక్షి, హైదరాబాద్ : సంక్షేమ నిధులపై ఫ్రీజింగ్ విధించి, కేటాయింపులు అమలు చేయలేని అసమర్థ పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ ప్రజలు సంబురాలు చేసుకోమనడం దారుణమని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. కొత్త బట్టలు కొనడానికి డబ్బుల్లేక, పండగ వంటకాలకు దిక్కులేక ప్రజలు పస్తులుంటుంటే సీఎం సంబురాలు, సోకులకు ప్రజల సొమ్మును మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆరోగ్యశ్రీ, ఫీజుల రీయింబర్స్మెంట్ బకాయిలు, వృద్ధులు, వితంతు,వికలాంగుల పెన్షన్ల బకాయిలు, ఇలా అనేక సంక్షేమపథకాల బకాయిలు పేరుకుపోతున్నాయన్నారు. డి గ్రీ,పీజీ కాలేజీల ఫీజు బకాయిల కోసం యాజమాన్యాలు సమ్మె బాట పట్టాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఇలాంటి ఆర్థిక అసమర్థతను దాచి పెట్టి, పండగలు సంతోషంగా జరుపుకోవాలని కేసీఆర్ పిలుపునివ్వడం ప్రజల దృష్టిని మళ్లించడానికేనని తన ప్రకటనలో పేర్కొన్నారు. -
'బాధితులను ఆదుకోవటంలో సర్కారు విఫలం'
హైదరాబాద్: భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించినా పాలకులు పెడచెవిన పెట్టారని టీటీడీపీ విమర్శించింది. ముంపు బాధితులను ఆదుకోవడంలోనూ, కనీసం మంచినీళ్లు, ఆహారపొట్లాలు, మందులను అందించడంలోనూ అధికారులు విఫలమయ్యారని ఆ పార్టీ నాయకులు ఎల్.రమణ, రేవంత్‌రెడ్డి విమర్శించారు. మూడురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్‌లో పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు, బస్తీలు జలదిగ్భంధంలో చిక్కుకుని ప్రజలు విలవిల్లాడుతుంటే ప్రభుత్వం బాధితుల వైపు కన్నెత్తి చూడడం లేదన్నారు. ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు. శుక్రవారం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నాయకులతో వారు టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన సందర్భంగా ముంపు బాధితులకు ఆపన్నహస్తం అందించేందుకు నాయకులు, అనుబంధ విభాగాలు, కార్యకర్తలు, టీఎన్ఎస్ఎఫ్, తెలుగుయువత నాయకులు సహాయచర్యల్లో పాల్గొనాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన టోల్ ప్రీ నెంబర్‌కు బాధితులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించడం లేదన్నారు. బాధితులను ఆదుకునేందుకు రాష్ర్ట కార్యాలయంలోని హెల్ప్‌లైన్ సెంటర్‌కు సమాచారాన్ని ఇవ్వాలని కోరారు. కేవలం ప్రచారానికి పరిమితం: రావుల వరద బాధితులకు సహాయాన్ని అందించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని, కేవలం ప్రచార ఆర్భాటాలకే పరిమితమై కంటి తుడుపు చర్యలు చేపడుతోందని టీటీడీపీ నేత రావుల చంద్రశేఖరరెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వం అందించే సహాయం కిందివరకు వెళ్లడం లేదన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతోనే గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావల్సి వస్తోందన్నారు. ఢిల్లీ నుంచి సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇవ్వడమే కాకుండా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
సుచరితకు మద్దతు తెలపాలని కోరుతున్నాం: ఎల్.రమణ
హైదరాబాద్ : గత సాంప్రదాయాలను అనుసరించి ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఆదివారం హైదరాబాద్‌లో స్పష్టం చేశారు. ఎవరైనా ప్రజాప్రతినిధులు చనిపోతే... ఆ ఎన్నిక ఏకగ్రీవం చేయాలని గతంలో ప్రతిపాదనను తీసుకువచ్చింది... టీడీపీనే అని ఆయన గుర్తు చేశారు. పాలేరు ఉప ఎన్నికఓ పోటీ చేయొద్దని అనేక సార్లు టీపీసీసీ నేతలు ఉత్తమ్, భట్టి విజ్ఞప్తి చేశారని గుర్తు చేశారు. ఈ ఉప ఎన్నికల్లో రాంరెడ్డి వెంకట్‌రెడ్డి భార్య సుచరితకు మద్దత తెలుపుతున్నామన్నారు. అన్ని రాజకీయ పార్టీలు సుచరితకు మద్దతు ఇవ్వాలనీ ఎల్.రమణ సూచించారు. -
రంగంలోకి దిగిన ఉత్తమ్
హైదరాబాద్ : ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ ప్రతీష్టాత్మకంగా తీసుకుంది. మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయ కేతనం ఎగురవేసింది. ఈ నేపథ్యంలో పాలేరు ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పావులు కదుపుతున్నారు. అందులోభాగంగా టీడీపీ, వామపక్ష పార్టీలను ఒకే తాటిపైకి తీసుకువచ్చేందుకు తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రంగంలోకి దిగారు. ఆ క్రమంలో శుక్రవారం టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణకు ఉత్తమ్ కుమార్ ఫోన్ చేశారు. ఈ ఉప ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. అందుకు వెంటనే నిర్ణయం చెప్పలేమని.. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబుతో సంప్రదించి.. చెబుతానని చెప్పారు. అయితే పాలేరులో గెలుపు మాదే అని ఇప్పటికే తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పార్టీలన్నీ ఏకమైనా టీఆర్ఎస్ విజయాన్ని అడ్డుకోలేవని... గురువారం మంత్రి తుమ్మలతో భేటీ అనంతరం కేటీఆర్ విలేకర్ల సమావేశంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. -
'ప్రజలకు గులాబీ రంగుల కలలు చూపిస్తుంది'
హైదరాబాద్ : హైదరాబాద్ నగర ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ గులాబీ రంగుల కలలు చూపిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ ఎద్దేవా చేశారు. శుక్రవారం హైదరాబాద్ నగరంలో వారిద్దరు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అక్రమార్కులకు హైదరాబాద్ ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. రాజ్యాంగ వ్యతిరేకంగా జీహెచ్ఎంసీని గెలవాలని టీఆర్ఎస్ యత్నిస్తోందని వారు ఆరోపించారు. ప్రధాని వాజ్‌పేయ్, చంద్రబాబు హయాంలోనే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందని వారు స్పష్టం చేశారు. కేసీఆర్ మైండ్ గేమ్‌లో పడొద్దు అని హైదరాబాద్ నగర ప్రజలుకు కిషన్‌రెడ్డి, ఎల్ రమణ హితవు పలికారు. -
టీడీపీ నేతల మధ్య జిల్లాల చిచ్చు
నల్లగొండ : జిల్లాల ఏర్పాటు అంశంపై నల్లగొండ జిల్లా టీడీపీ నేతల మధ్య చిచ్చు నెలకొంది. కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై ఆ జిల్లా నేతల నుంచి భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ టెంపుల్ సిటీ 'యాదాద్రి'ని జిల్లాగా చేయాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు చేపట్టిన దీక్షకు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మద్దతు తెలిపారు. అయితే, దీక్ష చేస్తున్న మోత్కుపల్లికి తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు మద్దుతు ఇవ్వడంపై ఆ పార్టీ నాయకురాలు ఉమా మాదవరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎవరికి వారుగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని ఉమా మాదవరెడ్డి అభిప్రాయపడ్డారు. భువనగిరిని జిల్లాగా ప్రకటించేవరకు పోరాడుతానని ఆమె స్పష్టంచేశారు. యాదాద్రిని జిల్లా చేయాలని కోరుతూ మంగళవారం యాదగిరిగుట్టలో మోత్కుపల్లి నర్సింహులు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. -
'కేసీఆర్ ఫాంహౌస్‌లో నిద్రపోతున్నారు'
కరీంనగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ మంగళవారం కరీంనగర్ లో నిప్పులు చెరిగారు. కేసీఆర్ అసమర్ధత వల్లే రాష్ట్రం అప్పులపాలైందని ఎల్ రమణ ఆరోపించారు. కరీంనగర్లో ఎల్ రమణ విలేకర్లతో మాట్లాడుతూ... రైతుల ఆత్మహత్యలు చేసుకుంటుంటే... కేసీఆర్ మాత్రం ఫాంహౌస్‌లో నిద్రపోతున్నారని ఎద్దేవా చేశారు. వరంగల్ ఉప ఎన్నికలో టీడీపీ - బీజేపీ ఉమ్మడి అభ్యర్థి దేవయ్యను గెలిపించుకుంటామని ఎల్ రమణ స్పష్టం చేశారు. -
'సీఎంకు ప్రజలే బుద్ధి చెబుతారు'
వరంగల్: వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజలే బుద్ధి చెబుతారని టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకరరావు వ్యాఖ్యానించారు. వరంగల్ పట్టణంలో ఆయన ఆదివారం నాడు మీడియాతో మాట్లాడారు. తెలంగాణాలో పాలన బాగుంటే కేసీఆర్ కార్పొరేషన్ ఎన్నికలను ఎందుకు పెట్టడం లేదంటూ ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందని ఈ సందర్భంగా ఎర్రబెల్లి గుర్తుచేశారు. -
తెలంగాణ తమ్ముళ్లకు చంద్రబాబు క్లాస్ !
-
తెలంగాణ తమ్ముళ్లకు చంద్రబాబు క్లాస్ !
సమన్వయంతో కలసి పనిచేయండి పరస్పరం గౌరవించుకోకుంటే కేడర్ ఎలా గౌరవిస్తుంది విజయవాడ భేటీలో టీటీడీపీ నేతలతో బాబు సాక్షి, హైదరాబాద్: స్థాయిని మరిచి ఒకరిపై ఒకరు తిట్లదండకం అందుకుంటున్న తెలంగాణ తెలుగుదేశం నాయకులను పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రంగా మందలించారని తెలిసింది. మంగళవారం విజయవాడలో చంద్రబాబుతో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి భేటీ అయ్యారు. విశ్వసనీయవర్గాలు చెబుతున్న వివరాల మేరకు... ‘రాష్ట్రస్థాయి నాయకుల మధ్య ‘ కమ్యూనికేషన్ గ్యాప్ ’ ఉంటే ఎలా..? అంతా కలసి ఉం డండి. తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్నామన్న సం గతి మరిచిపోవద్దు. నాయకులు పరస్పరం గౌరవించుకోవాలి. మిమ్ముల్ని మీరు గౌరవించుకోకుంటే పార్టీ కేడర్ ఎలా మిమ్ముల్ని గౌరవిస్తుంది..’ అని రమణ, ఎర్రబెల్లి, రేవంత్‌కు చంద్రబాబు క్లాస్ తీసుకున్నట్టు తెలిసింది. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి జరగాల్సిన కృషిపైనా వీరికి హితబోధ చేశారు. వరంగల్ ఉప ఎన్నికల్లో టీడీపీకి టికెట్ ఇవ్వమని మిత్రపక్షమైన బీజేపీని అడుగుతానని, అయితే ఏ పార్టీ పోటీచేసినా విజయం కోసం శ్రమించాలని టీటీడీపీ నాయకులకు బాబు సూచించారు. మరోవైపు రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి టీఆర్ఎస్లోకి వెళుతున్న అం శాన్నీ చంద్రబాబు ఆరా తీశారు. వచ్చే నెల 7న తెలంగాణ రాష్ట్ర కమిటీ జనరల్ బాడీ సమావేశం హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్టు తెలిసింది. బాబుతో రేవంత్ భేటీ టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మంగళవారం ఉదయం ఏపీ సీఎం, పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబుతో భేటీ అయ్యారు. గుంటూరు జిల్లా ఉండవల్లి సమీపంలోని సీఎం విశ్రాంతి గృహంలో చంద్రబాబును కలిసిన ఆయన 15 నిమిషాలపాటు సమావేశమయ్యారు. శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పార్టీ నాయకుల మధ్య గొడవ నేపథ్యంలో రేవంత్ పార్టీ అధినేతతో ఒంటరిగా భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదిలాఉండగా, సోమవారమే విజయవాడ వెళ్లిన ఆయన చంద్రబాబును కలిసేందుకు అపాయింట్మెంట్ కోరితే నిరాకరించినట్టు సమాచారం. -
ఎంపీ కవిత వసూళ్లకు పాల్పడుతున్నారు: టీడీపీ
హైదరాబాద్ : రైతు కుటంబాలకు నష్టపరిహారం పేరుతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎంపీ కవిత వసూళ్లకు పాల్పడుతున్నారని టీ-టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఆరోపించారు. రైతుల ఆత్మహత్యలపై కేసీఆర్‌కు కనువిప్పు కలిగించాలని ఆయన కవితకు సూచించారు. ఏక కాలంలో రైతులకు రుణమాఫీ చేయాలని ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 1500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. . మాట నిలబెట్టుకునే అలవాటు కేసీఆర్‌కి లేదని ఆయన ఎద్దేవా చేశారు. మంగళవారం హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద టీడీపీ, బీజేపీ నేతల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం సహకార బ్యాంకు వద్ద ధర్నాకు వెళ్తున్న క్రమంలో టీడీపీ, బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. -
ప్రొ.కోదండరామ్‌తో టీటీడీపీ అధ్యక్షుడు భేటీ
హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ .రమణ మంగళవారం ఉదయం ప్రొ. కోదండరామ్ నివాసానికి చేరుకుని ఆయనతో భేటీ అయ్యారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంభిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలపై... తాము చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని ఎల్ రమణ.. ప్రొ.కోదండరామ్ ని కోరినట్లు సమాచారం. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్లు అన్న చందంగా వ్యవహారిస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. రైతులకు ఒకే దఫా రుణమాఫీ చేయాలంటూ ఇటీవల అసెంబ్లీలో డిమాండ్ చేసిన ప్రతిపక్షా పార్టీల సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేసిన విషయం విదితమే. అలాగే ఒకే దఫా రుణమాఫీ చేయాలంటూ తెలంగాణ బంద్‌కు ప్రతిపక్షాలు పిలుపు నిచ్చాయి. అయినా టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు నడిపింది. దీంతో బంద్ అంతాగా విజయం సాధించలేకపోయింది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొ.కోదండరామ్ మద్దతు తీసుకుని... టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని టీటీడీపీ భావిస్తుంది. ఆ క్రమంలో ప్రొ. కోదండరామ్‌ను మద్దతు కోరేందుకు ఎల్ రమణ భేటీ అయ్యారు. -
'సీఎం చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు'
వరంగల్ : తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రతిపక్షాల గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఆరోపించారు. పట్టణంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాల గొంతునొక్కే ప్రయత్నం చేయడం అనేది సీఎం బలహీనతని, కేసీఆర్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతారంటూ ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ, బీజేపీ నేతలు వరంగల్ జిల్లాలో చేపట్టిన నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. హన్మకొండ నుంచి ఆత్మకూరు వరకు పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర రైతుల కోసం తాము తలపెట్టిన బంద్‌ను విజయవంతం చేసి తీరుతామని రమణ పేర్కొన్నారు.