టీఆర్‌ఎస్‌ది నిరంకుశ పాలన | Telangana TDP President Ramana Fires On TRS | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ది నిరంకుశ పాలన

Published Mon, Mar 26 2018 5:59 PM | Last Updated on Fri, Aug 10 2018 8:42 PM

Telangana TDP President Ramana Fires On TRS - Sakshi

మాట్లాడుతున్న రమణ

రాజేంద్రనగర్‌: రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ సర్కార్‌ నిరంకుశ పాలన కొనసాగిస్తుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌. రమణ విమర్శించారు. శివరాంపల్లి నిర్వహించిన ఇంటింటికీ టీడీపీ కార్యక్రమానికి రమణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సంద ర్భంగా శివరాంపల్లి చౌరస్తాలో ఆ పార్టీ జెండా ఎగురవేసి స్థానిక బస్తీ ల్లో పర్యటించారు. అనంతరం ఆయ న మాట్లాడుతూ.. ప్రజల స్వేచ్ఛను టీఆర్‌ఎస్‌ అణచివేస్తోందన్నారు.

ఏ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు, కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే ధర్నాలు, నిరసన  కార్యక్రమాలను ఏ ప్రభుత్వాలు ఆటంకం సృష్టించవన్నారు. కానీ టీఆర్‌ఎస్‌ ధర్నాచౌక్‌తో పాటు ప్రతిపక్షాల ధర్నాలు, నిరసన కార్యక్రమాలను అడ్డుకుంటూ నేతలను ముందస్తుగా అరెస్ట్‌లు చేసి భయాం దోళన సృష్టిస్తుందని మండిపడ్డారు. 12 వందల మంది విద్యార్థుల త్యా గంతో రాష్ట్రం సిద్ధించిందని, నేటికీ బాధిత కుటుంబాలకు న్యాయం జరగలేదన్నారు.  కార్యక్రమంలో నాయకులు మ్యాడం రామేశ్వర్‌రావు, ఆర్‌. గణేష్‌గుప్తా, కృష్ణాగౌడ్, రాజ్‌కుమార్, వెంకటేష్, శ్రీనివాస్‌రెడ్డి, శ్యామల, బాల్‌రాజ్, రాజు పాల్గొన్నారు.  
 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement