ganesh gupta
-
ప్రజలే నా ధైర్యం.. నమ్మకం! : బిగాల గణేశ్‌గుప్తా
సాక్షి, నిజామాబాద్: 'ప్రజలే తన ధైర్యం.. నమ్మకమని నిజామాబాద్ అర్బన్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా అన్నారు. తెలంగాణ రాకముందు ఇందూర్ నగరం ఏ విధంగా ఉందో.. ఇప్పుడు ఎలా ఉందో అందరికి తెలుసని పేర్కొన్నారు. తనకన్న ముందు ఉన్నవారు నగరాన్ని అభివృద్ధి చేయలేదన్నారు. పక్కా ప్రణాళికతో నగరాన్ని అభివృద్ధి చేశానని చెప్పారు. మళ్లీ అవకాశం ఇస్తే ఇందూరును దేశంలో మొదటి స్థానంలో ఉంచడానికి అనుక్షణం శ్రమిస్తానని హామీ ఇచ్చారు.' ఎన్నికల నేపథ్యంలో గణేశ్‌గుప్తాతో సాక్షి ఇంటర్వ్యూ.. – నిజామాబాద్ నాగారం నగర అభివృద్ధికి ఎన్ని నిధులు ఖర్చు చేశారు? ► నిజామాబాద్ నగరాన్ని ఇప్పటి వరకు రూ.వేయి కోట్లతో అభివృద్ధి చేశాను. విశాలమైన రోడ్లు, డివై డర్లు, పార్కులు, ఓపెన్‌జిమ్‌లు, మినీ ట్యాంక్‌బండ్, సమీకృత మార్కెట్ సముదాయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వే అండర్ బ్రిడ్జి, ఐటీ హబ్, వైకుంఠధామాలు తదితర పనులు పూర్తి చేశాను. 2018 ఎన్నికల సమయంలో ప్రజలకు నును చేయబోయే అభివృద్ధి పనులకు సంబంధించి మోడల్ బుక్లెట్ పంపిణీ చేశా. దానిని ఐదేళ్లలో పూర్తి చేసి ప్రజల కళ్ల ముందు ఉంచాను. యూజీడీ పనులు పూర్తయ్యాయా? ► ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు నేను ఎమ్మెల్యే కాకముందు నుంచే జరిగా యి. రోడ్లను మధ్యలో తవ్వేయడంతో రాకపోకలు నానా ఇబ్బందులు పడ్డారు. దీంతో సీఎం కేసీఆర్ ను అడిగి నిధులు తెచ్చి 2019లో యూజీడీ పనులు పూర్తి చేయించాను. ప్రతి ఇంటి నుంచి యూజీడీకి కనెక్షన్ ఇవ్వాలి. దీనికి ఒక్కొక్కరికి రూ.8 వేలకు పై గా ఖర్చు అవుతుంది. ప్రజలకు ఇబ్బందులు లేకుండా కేసీఆర్‌ను ఒప్పించి రూ.45కోట్ల నిధులు తెచ్చి టెండర్ ప్రక్రియ పూర్తి చేయించాను. ఎన్నికలు పూ ర్తి కాగానే ఈ పనులు ప్రారంభం అవుతాయి. ప్రస్తుతం నగరంలో తాగునీటి సమస్య ఉందా? ► నగరంలో ఇంటింటికి తాగునీరు సరఫరా అవుతోంది. ట్యాంకర్ల ద్వారా సరఫరాకు చెక్ పెట్టడానికే మిషన్ భగీరథ ద్వారా పైపులైన్లు వేశాం. 24గంటల పాటు మంచినీరు సరఫరా చేయడానికి కార్యాచరణ రూపొందించాం. ప్రచారంలో ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? ► నేను అనుక్షణం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నా. నగరంలో ఉన్న పరిస్థితులు, సమస్యలు పరిశీలించి పరిష్కరించా. నేను చేసిన అభివృద్ధిపై బుక్లెట్ ప్రింట్ చేసి ఇంటింటికి పంచుతూ ఓట్లు అడుగుతున్నా. ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. ప్రజలే నా ధైర్యం, నమ్మకం.. మూడోసారి గెలిపిస్తారని నమ్ముతున్నా. ఆత్మీయ సమ్మేళనాలతో ప్రచారం చేపట్టారు. అన్ని కులాలకు దగ్గరయ్యారా? ► నేను ఎల్లవేళలా ప్రజలతో ఉన్నా. నగరంలోని అ న్ని డివిజన్లలో పర్యటించాను. కులమతాలకు అతీతంగా కుల సంఘాలకు, ఆలయాలు, మసీదులు, చర్చిలకు నిధులు ఇచ్చి భవనాలు పూర్తి చేయించాను. ఆత్మీయ సమ్మేళనాలతో నేను ఏం చేశానో ప్రజలకు వివరించాను. ఎన్నికల మేనిఫెస్టో ఏ విధంగా ఉంది? ► సీఎం కేసీఆర్ ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. మరోసారి అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి రూ.5లక్షల కేసీఆర్ భీమా, సన్నబియ్యం, ఆసరా పెన్షన్ రూ.5వేలు, దివ్యాంగులకు రూ. 6వేలు, రైతు బంధు రూ.16వేలు, మహిళలకు రూ. 3 వేలు అందిస్తాం. చేసిన అభివృద్ధి, సంక్షేమంతో పాటు మేనిఫెస్టోను వివరిస్తూ ప్రచారం చేస్తున్నాం. ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ► ఎన్నికలు వస్తాయి, పోతాయి. రకరకాల పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తారు. ఒక్కసారి గుండె మీద చె య్యి వేసి మనస్ఫూర్తిగా ఆలోచన చేయండి. నేను తొమ్మిదిన్నర ఏళ్లలో నగరాన్ని ఎవరూ చేయని వి ధంగా అభివృద్ధి చేశా. నా కన్న ముందు పెద్ద పెద్ద నాయకులు పోటీ చేసినా అభివృద్ధి చేయలేదు. అ నుక్షణం ప్రజల్లో ఉండి ప్రభుత్వం ద్వారా సంక్షేమ ఫలాలు అందిస్తూ, సదుపాయాలు కల్పించా. నగరాన్ని రాష్ట్రంలో, దేశంలో నంబర్ వన్‌గా ఉంచడాని కి కష్టపడుతునే ఉన్నాను. ఏ కష్టం వచ్చినా ప్రజల కు అండగా ఉంటున్నా. అందుకే ఈ నెల 30న కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నా. ఇవి కూడా చదవండి: త్రిముఖ పోరు! ఆర్మూర్‌లో అనూహ్యంగా దూసుకొచ్చిన బీజేపీ.. -
270కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూర్తి చేయించిన: ఎమ్మెల్యే గణేష్ గుప్తా
-
బహిరంగ చర్చకు వస్తానని అంటున్న ధన్ పాల్
-
కారు నడిపిన ఎమ్మెల్సీ కవిత.. కార్యకర్తల్లో న్యూ జోష్..
-
ఏడాదికి ముందే బలప్రదర్శనలు.. సిట్టింగ్‌ను కాదని.. మాజీ ఎమ్మెల్యే హడావుడి
సాక్షి, నిజామాబాద్ : ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండగానే నిజామాబాద్‌లో నాయకుల బలప్రదర్శనలు షురూ అయ్యాయి. తాజాగా ఎంపీ అర్వింద్, ఎమ్మెల్సీ కవిత మధ్య నువ్వా నేనా అనేవిధంగా మాటలయుద్ధం ముదిరింది. ఈ నేపథ్యంలో రాజధాని హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వరకు బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాడి వేడి వాతావరణం నెలకొంది. ఇదిలా ఉండగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ స్థానంలో మరోరకమైన రాజకీయ వాతావరణం ఏర్పడింది. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కోవిధంగా తమ బలాన్ని ప్రదర్శించుకునేందుకు తాపత్రయపడుతున్నారు. టీఆర్ఎస్ నుంచి సిట్టింగులకు మళ్లీ టిక్కెట్లు అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినప్పటికీ పలువురు ఎమ్మెల్యేల్లో ఒకింత అనుమానాలు ఉన్నాయి. ఈ క్రమంలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో టీఆర్ఎస్లో టిక్కెట్టు రేసు మొదలైందనేలా నాయకుల కార్యక్రమాలు ఉంటున్నాయి. నిజామాబాద్ అర్బన్‌లో మైనారిటీల తరువాత మున్నూరుకాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా ఉన్నప్పటికీ మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఆకుల లలిత సైతం ఈ స్థానం నుంచి టిక్కెట్టు ఆశిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే లలిత నగరంలో మున్నూరుకాపు కార్తీక వనభోజనాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటూ వస్తున్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న లలిత, మరోసారి ఎమ్మెల్సీ హామీని కేసీఆర్ నుంచి పొంది టీఆర్ఎస్లో చేరారు. చివరి నిముషంలో సదరు ఎమ్మెల్సీ స్థానం కల్వకుంట్ల కవితకు కేటాయించారు. లలితకు రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా అవకాశం ఇచ్చారు. అయితే లలిత తన సొంత నియోజకవర్గం ఆర్మూర్ బదులు తన సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న నిజామాబాద్ అర్బన్‌ను ఆశిస్తున్నట్లు సమాచారం. మున్నూరుకాపు నుంచి మహిళగా తనకు అవకాశం లభిస్తుందనే ఆశాభావంతో ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: రొటీన్‌గా చేస్తే పట్టించుకోం.. కానీ టార్గెట్‌గా నడుస్తోంది: మంత్రి తలసాని పట్టు జారకుండా.. ఆకుల లలిత కార్యక్రమాల్లో పాల్గొంటుండగానే ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా కార్యక్రమాల్లో దూకు డు పెంచారు. నగర అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం జీవో ఇచ్చిన నేపథ్యంలో నగరంలో ఈ నెల 16న భారీ ప్రదర్శన చేయించారు. మళ్లీ తనదే టిక్కెట్టు అన్న ధీమాతో ఉన్న గణేశ్‌గుప్తా పట్టు ఏమాత్రం జారకూడదనే సంకల్పంతో ముందుకు కదులుతున్నారు. ఇదిలా ఉండగా వైశ్య సామాజిక వర్గం నుంచి బీజేపీ తరపున ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా బలంగా దూసుకొస్తున్నారు. ధన్‌పాల్‌కు అన్నివర్గాల్లో తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. ఈసారి ఆయనకు బీజేపీ నుంచి టిక్కె ట్టు కచ్చితంగా వస్తుందని వివిధ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటు నుంచి బీజేపీ ద్వారా తన సామాజిక వర్గానికే చెందిన నాయకుడు బరిలో దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటుండగా, మరోవైపు టీఆర్ఎస్ నుంచి ఓట్ల శాతం ఎక్కువగా ఉన్న మున్నూరుకాపు సామాజిక వర్గం నాయకురాలు టిక్కెట్టు ఆశించే పరిస్థితి ఎమ్మెల్యే గణేశ్ గుప్తాకు నెలకొంది. నిజామాబాద్ అర్బన్ నియాజకవర్గంలో టిక్కెట్ల వేట ఇప్పటి నుంచే ప్రారంభమైందని వివిధ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి. కాంగ్రెస్ తరపున బరిలోకి దిగేదెవరు, ఎంఐఎం బరిలోకి దిగితే ఎవరికి లాభం, ఎవరికి నష్టం చోటుచేసుకుంటుందనే రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
గణేష్ గుప్తాకు సీఎం కేసీఆర్ పరామర్శ
సాక్షి, నిజామాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. మాక్లూర్ మండల కేంద్రానికి వచ్చి అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా ను పరామర్శించారు. గణేష్ గుప్తా తండ్రి బిగాల కృష్ణమూర్తి ఇటీవల మరణించారు. ఇవ్వాళ మాక్లురుకు వచ్చిన సీఎం కృష్ణమూర్తి చిత్రపటం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. మ్మెల్యే గణేష్ గుప్తా కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు. సీఎం తో పాటు పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. మంత్రులు హరీష్ రావ్, ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ, ఎంపీలు సురేష్ రెడ్డి, బిబి పాటిల్ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, గంప గోవర్ధన్, బాజిరెడ్డి గోవర్దన్ తదితరులు కూడా గణేష్ గుప్తా ను పరామర్శించారు. అనంతరం కృష్ణమూర్తి స్మారక ప్రకృతి వనాన్ని సీఎం ప్రారంభించారు. -
నాలాగా కోవిడ్ బారిన పడకండి : ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్ : నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ద్వారానే వైరస్ సోకినట్టు తెలుస్తోంది. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ఆయన హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తన నివాసంలోనే చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని, త్వరలోనే కరోనా నుంచి కోలుకొని నియోజకవర్గ ప్రజలను కలుస్తానని గణేష్ గుప్తా చెప్పారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ వాట్సప్ సందేశాన్ని విడుదల చేశారు. (చదవండి : కరోనా వైరస్ బారిన మరో ఎమ్మెల్యే) ‘నాపై ప్రేమ చూపిన ప్రజలకు, అభిమానులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు. నేను బాగానే ఉన్నాను. ఎవరూ అధైర్యపడొద్దు. త్వరలో నేను చేయించుకోబోయే టెస్ట్‌లో నెగెటివ్ వస్తుందని ఆశిస్తున్నాను. మీ ముందుకు త్వరలోనే వస్తాను. అందరు తప్పకుండా మాస్కులు ధరించండి. సామాజిక దూరం పాటించండి. అన్ని జాగ్రత్తలు తీసుకున్న నేనే కరోనా బారిన పడ్డాను. దయచేసి జాగ్రత్తగా ఉండండి. నిజామాబాద్ నగర ప్రజలు ఎవరూ కూడా నాలాగా కరోనా బారిన పడొద్దని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను’ అని గణేష్ గుప్తా ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. -
కరోనా వైరస్ బారిన మరో ఎమ్మెల్యే
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో మరో ఎమ్మెల్యే కరోనా బారినపడ్డారు. ఆదివారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. సోమవారం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తాకు కూడా వ్యాధి నిర్ధారణ అయ్యింది. బాజి రెడ్డి గోవర్ధన్‌కు కరోనా పాజిటివ్ రావడంతో బిగాల కూడా పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు కూడా వ్యాధి సోకినట్లు తేలింది. వైద్యుల సూచనల మేరకు ఆయన హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తన నివాసంలోనే చికి త్స పొందుతున్నట్లు తెలిసింది. అధికారులు ఆయన కుటుంబసభ్యుల నుంచి కూడా శాంపిళ్లు సేకరించి, పరీక్షలకు పంపించారు. ముత్తిరెడ్డి ద్వారానేనా? నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్‌కు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ద్వారానే వైరస్ సోకినట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో వీరిద్దరు పాల్గొన్నట్లు తెలుస్తోంది. గణేశ్‌గుప్తా శనివారం నిజామాబాద్ నగరంలోని తన క్యాంపు కార్యాలయం ఆవరణలో కార్పొరేటర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్థానికంగా నిర్వహించిన ఓ ప్రైవేటు కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. ఆయనకు పాజిటివ్ రావడంతో ఆయా సమావేశాల్లో పాల్గొన్న వారంతా కలవరపడుతున్నారు. -
ఎంపీ అర్వింద్‌కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే సవాల్
సాక్షి, నిజామాబాద్ : బీజేపీ చేసే రెచ్చగొట్టే వ్యాఖ్యలను నమ్మొద్దని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఉన్నవి లేనట్లు.. లేనివి ఉన్నట్లు నిజామాబాద్ ఎంపీ అర్వింద్ మోసపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్రం నుంచి 42 శాతం నిధులు, తెలంగాణ ప్రజల సొత్తు అని, 42 శాతం కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఇచ్చినట్లు రుజువు చేస్తే దేనికైనా సిద్దమని స్పష్టం చేశారు. బీజేపీ ఎంపీ దర్మపురి ఆర్వింద్ కుల మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా మండిపడ్డారు. అర్వింద్ నీచ రాజకీయాలు మానుకోవాలని మేయర్ స్థానం టీఆర్ఎస్ పార్టీదేనని ఆశాభావం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ మజ్లిస్‌తో ఒప్పందం అయ్యిందంటూ హిందువులను మాయ మాటలతో రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఇచ్చిన మాట తప్పితే తాను రాజీనామా చేస్తానని.. రాజీనామాకు ఎంపీ అర్వింద్ సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. -
దమ్ముంటే రా.. ఎంపీకి ఎమ్మెల్యే సవాల్
సాక్షి, నిజామాబాద్ : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేడి పెరిగింది. అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సవాళ్ళు, బహిరంగ విమర్శలతో నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. తాజాగా నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎంపీ అరవింద్‌కు దమ్ముంటే అభివృద్ధిపై చర్చించేందుకు రేపు (శనివారం) రావాలని సవాలు విసిరారు. నిజామాబాద్ మేయర్ సీటును ఎంఐఎంకు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ రెడీ అయ్యారని అరవింద్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. పరోక్షంగా టీఆర్ఎస్ గెలుపు ఖాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక మేయర్ టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటరే అవుతారనీ, ఎంఐఎంకు ఇచ్చే ప్రసక్తే లేదని గణేష్ గుప్తా తేల్చి చెప్పారు. ఎన్నికల ప్రచారంలోభాగంగా పలు వార్డుల్లో శుక్రవారం గణేష్ గుప్తా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..‘పసుపు బోర్డ్ గురించి బాండ్ పేపర్ రాసి ఇచ్చి అరవింద్ మాట తప్పారు. మేము అలా తప్పుడు హామీలు ఇవ్వం. చెప్పింది చేసి చూపిస్తాం. మేము చేపట్టిన పనులు పూర్తి చేస్తాం అని బీజేపీ మేనిఫెస్టోలో పెట్టడం శోచనీయం. ఎన్నికల ఓటమి భయంతో ఎంపీ అరవింద్ ఏదేదో మాట్లాడుతున్నారు. ఎంఐఎంకు మేయర్ సీట్ ఇస్తే కంఠశ్వర్ గుడి వరకు ముక్కు నెలకు రాస్తా. భైంసా ఘర్షణ విషయంలో నిరాహార దీక్ష చేసే ఆలోచన, వెనుక ఉన్న కుట్ర ఏంటి?. నిరాహార దీక్ష పేరుతో.. అరెస్ట్ చేస్తే ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు. దయచేసి మత విద్వేషాలు, వర్గాలు, కులాల మధ్య చిచ్చు పెట్టకండి. ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకండి’ అని అన్నారు. -
దేశానికి ఆదర్శంగా ఇందూరు యువత
సాక్షి, నిజామాబాద్: ఇందూరు యువత కార్యక్రమాలు దేశ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు మాజీ ఎంపీ కవిత. విలేకరులతో మాట్లాడుతూ.. ఇందూరు యువత చేస్తోన్న మంచి కార్యక్రమాలను కొనసాగించాలని కోరారు. యువత చేస్తోన్న కార్యక్రమాలకు తాము అండగా నిలుస్తామన్నారు. ఎంతో మంది అనాథలను మంచి మనసుతో చేరదీస్తున్నారని ప్రశంసించారు. యువత చదువుతో పాటు సమాజ సేవలో కూడా పాల్గొనాలని ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పిలుపునిచ్చారు. -
ప్రజలే గెలిపిస్తారు: బిగాల గణేశ్‌గుప్తా
సాక్షి, నిజామాబాద్‌అర్బన్: టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదల అభ్యున్నతి కోసం అమలు చేసిన సంక్షేమం పథకాలు, నిజామాబాద్ నగర అభివృద్ధి కోసం చేపట్టిన పనులను చూసి నగర వాసులు మరోమారు తనను ఆశీర్వదిస్తారని టీఆర్ఎస్ అభ్యర్థి బిగాల గణేశ్‌గుప్తా పేర్కొన్నారు. నగరంలో రూ.850 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ఆసరా పింఛన్లు, షాదీముబారక్, కళ్యాణ లక్ష్మీ వంటి సంక్షేమ పథకాల లబ్ధిదారులు, అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ను ఆదరిస్తున్నారని ఆయన అన్నారు. సోమవారం గణేష్‌గుప్త ‘సాక్షి’తో మాట్లాడారు. అడుగడుగునా ప్రజాదరణ లభిస్తుందని, మరో మారు టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటామని ప్రజలు పేర్కొంటున్నారని అన్నారు. ఇలాంటి ప్రజాస్పందన చూచి ఎంతో ఆనందం కలుగుతోందన్నారు. ప్రజల ఆదరణ ఎంతో బాగుంది..... అర్బన్‌లోని ప్రతి గల్లీలో, కాలనీల్లో ప్రజల ఆదరణ ఎంతగానో బాగుంది. టీఆర్ఎస్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, ప్రజలకు ఎంతగానో లబ్ధిచేకూర్చాయి. మళ్లీ టీఆర్ఎస్నే గెలిపించుకుంటామని అంటున్నారు. పేద, మధ్యతరగతి స్థాయి అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందారు. షాదీముబారక్, కళ్యాణలక్ష్మీ వంటి పథకాలు వరంగా మారాయి. ప్రచారంలో భాగంగా ప్రతి గల్లీలోను ఆదరణ చూపుతున్నారు. అన్ని వర్గాల వారికి కేసీఆర్ అందించిన సంక్షేమ పథకాలు కొనసాగాలని కోరుకుంటున్నారు. మళ్లీ టీఆర్ఎస్ను భారీ మెజారిటీతో గెలిపిస్తారు. నాలుగేళ్లలో ఎంతో అభివృద్ధి.... నగరంలో రూ.850 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టాము. గతంలో ఏ ప్రభుత్వాలు, ఏ పాలకులు చేయని పనులు నాలుగేళ్లలో నేను ఎమ్మెల్యేగా ఉండి చేశాను. పార్క్‌ల నిర్మాణాలు, యూజీడీ పనులు, మిషన్ భగీరథ పనులు పూర్తి అయ్యాయి. అలాగే ఆర్యూబీ పనులు కొనసాగుతున్నాయి. కేటీఆర్, ఎంపీ కవిత సహకారంతో నిధుల కొరత లేకుండా అభివృద్ధి పనులు వేగం గా జరిగాయి. ఐటీ హబ్ అందుబాటులోకి వ స్తుంది. ఇలా అభివృద్ధి చేసి మరింత సుందరం గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. పట్టణం రూ పురేఖలు మారనున్నాయి. హైదరాబాద్ తరువా త నిజామాబాద్ పట్టణంలో అద్భుతంగా తీర్చిదిద్దుతాం. రెండవ దఫా మరిన్ని నిధులు తీసుకువచ్చి ఉపాధి అవకాశాలు సైతం కల్పిస్తాం. సంక్షేమ పథకాలు మేలు చేస్తున్నాయి.... పట్టణంలో చాలామంది ప్రజలు సంక్షేమ పథకాలు ఎంతో మేలు చేస్తున్నాయని అంటున్నారు. షాదీముబారక్, కళ్యాణలక్ష్మీ, పెన్షన్లు అందిస్తున్నాం. గత ప్రభుత్వాల కంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్లు ఎంతగానో ఆసరాగా నిలిచాయి. మళ్లీ ప్రభుత్వం వచ్చిన తరువాత పెన్షన్లు పెంచుతున్నాం. దీనిపై కూడా లబ్ధిదారులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ కేసీఆర్‌కు ముఖ్యమంత్రికావాలని కోరుకుంటున్నారు. డబుల్బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. నిజామాబాద్ పట్టణంలోనే అధిక ఇల్లు ఉన్నాయి. ఆలస్యం అవుతున్నా అందుబాటులోకి ఇళ్లను తీసుకువచ్చి ఇస్తాం. అలాగే సొంత భూమి ఉన్నవారు ఇళ్లు కట్టుకుంటే ఆర్థిక సహాయం చేస్తాం. గురుకుల పాఠశాలల ఏర్పాటు, మైనార్టీ పాఠశాలల ఏర్పాటు , ఆసుపత్రుల అభివృద్ధి ఎంతో జరిగింది. మహాకూటమి కాదు అవకాశ కూటమి... మహాకూటమి కాదు అది అవకాశకూటమి.. కేవలం రాజకీయ లబ్ధికోసమే, అవకాశాల కోసం ఏర్పడిన కూటమి. ప్రజలు ఈ మహాకూటమిని విశ్వసించరు. అసలు మహాకూటమికి ప్రజా ఆదరణ లేదు. కూటమితో పోటీ కూడా ఉండదు. ప్రజలందరు టీఆర్ఎస్వైపు ఉన్నారు. ఇలాంటి అవకాశ వాదులను నమ్మరు. అభివృద్ధిని చూచి టీఆర్ఎస్కు ఓటువేయనున్నారు. శివారుప్రాంతాలపై ప్రత్యేక దృష్టి నగరం రోజు రోజుకూ విస్తరిస్తోంది. శివారు కాలనీలు, ప్రాంతాల్లో అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నాం. ఇదివరకే సగం పనులు పూర్తి అయ్యాయి. వీటిని మరింత అభివృద్ధి చేస్తాం. ఒక ప్రణాళిక ప్రకారం రోడ్లు, డ్రైనేజీలు భవిష్యత్తు రోజుల్లో గుర్తుండిపోయేలా చేపడుతున్నాం. నీటి సౌకర్యం సైతం అందుబాటులో ఉంది. ఆదాయం పెరుగుతుంది కాబట్టి పట్టణాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించాము. ఇందులో భాగంగానే ఆయా ప్రాంతాల్లో అద్భుతమైన అభివృద్ధి చేస్తున్నాం. ఉపాధి అవకాశాలు కల్పిస్తాం... పట్టణంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఐటీ హబ్ అందుబాటులోకి తీసుకువచ్చి ఉపాధి అవకాశం కల్పించి అలాగే నిరుద్యోగ భృతి అందిస్తాం. ఐటీ హబ్ అందుబాటులోకి రాగానే పరిశ్రమలు సైతం ఏర్పాటు అవుతాయి. దీని ద్వారా ప్రైవేట్ రంగంలో ఉద్యోగుల కల్పన ఏర్పడుతుంది. తద్వారా పట్టణ ప్రజలకు వివిధ ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే ఉండి ఉద్యోగం చేసుకునే వీలు ఉంటుంది. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాము. ఇప్పటికే వివిధ కంపెనీలు నిజామాబాద్‌కు వచ్చేందుకు ఒప్పందం చేసుకున్నాయి. దీనిని పకడ్బందీగా అమలుచేస్తాం. -
మారుతున్న రాజకీయ రూపురేఖలు
సాక్షి, నిజామాబాద్‌అర్బన్: నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులతో నగర రూపురేఖలు మారుతున్నాయి. ప్రభుత్వం నగరాభివృద్ధికి గతంలో ఎన్నడూ లేని విధంగా నాలుగేళ్లలో ఏకంగా 850 కోట్ల రూపాయలు కేటాయించింది. దీంతో అనేక అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. అయినా కూడా కొన్ని సమస్యలు దీర్ఘకాలికంగా పరిష్కారానికి నోచుకోవడం లేదు. వీటిని కూడా పరిష్కరించాలని అర్బన్ ప్రజలు కోరుతున్నారు. 2014లో అర్బన్ నియోజక వర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి బిగాల గణేశ్‌గుప్తా ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొట్టమొదటిసారిగా టీఆర్ఎస్ అర్బన్‌లో గెలిచింది. అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆయా నియోజక వర్గాల్లో పలు అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధులను కేటాయించింది. అందులో భాగంగానే నిజామాబాద్ అర్బన్‌కు ప్రత్యేక నిధులతో ప్రముఖ పనులను చేపట్టేందుకు నిర్ణయించింది. ప్రస్తుతం ఈ పనులు కొనసాగుతున్నాయి. కొనసాగుతున్న అభివృద్ధి పనులు నిజామాబాద్ అర్బన్‌లో నాలుగున్నరేళ్లలో రూ. 850 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తాజా మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా పేర్కొంటున్నారు. ఇందులో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ పనులు రూ. 200 కోట్లు, మిషన్‌భగీరథకు రూ. 9 కోట్లు, రోడ్ల సుందరీకరణకు రూ. 14 కోట్లు, డ్రెయినేజీల నిర్మాణానికి రూ. 10 కోట్లు, చౌరస్తాల అభివృద్ధికి 7 కోట్లు, శ్మశానవాటికల అభివృద్ధి, పార్కుల అభివృద్ధి, సృతివనాల ఏర్పాటుకు, రఘునాథ చెరువు అభివృద్ధికి రూ. 23 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ పనులు 90 శాతం వరకు పూర్తయ్యాయి. మిషన్‌భగీరథ పనులు 90 శాతం వరకు పూర్తయ్యాయి. ప్రస్తుతం నగరంలో రోడ్ల మరమ్మత్తులు, చౌరస్తాల అభివృద్ధి, శ్మశాన వాటిక అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. అలాగే అర్బన్ పరిధిలో 1,100 డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు మంజూరయ్యాయి. వీటి నిర్మాణ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. కొత్త కలెక్టరేట్ నిర్మాణం, ఐటీ హబ్ భవనాల పనులు నిర్మాణ దశలో ఉన్నాయి. అలాగే డివిజన్లలో కులసంఘాల భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అలాగే 14 పార్క్‌లను అభివృద్ధి పరుస్తున్నారు. అమృత్ కింద 4 అధునాతన నీటి ట్యాంకుల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న మున్సిపల్ భవన నిర్మాణం, రాజీవ్‌గాంధీ ఆడిటోరియం మరమ్మతులు చేపడుతున్నారు. ప్రతి డివిజన్లో సీసీ రోడ్డు, తారు రోడ్ల నిర్మాణాలు, కొన్ని చోట్ల పూర్తికాగా, మరికొన్ని చోట్ల కొనసాగుతున్నాయి. మరికొన్ని రోజుల్లో పనులన్నీ పూర్తయితే నగరం సుందరంగా మారనుంది. ప్రధాన రహదారుల వెంట, చౌరస్తాల వద్ద డివైడర్ల విస్తరణ, సెంట్రల్‌లైటింగ్ వ్యవస్థ పనులు జరుగుతున్నాయి. మహిళల కోసం ప్రత్యేకంగా స్టేడియం కూడా మంజూరైంది. మైనారిటీ గురుకులాల ఏర్పాటు జరిగింది. పరిష్కరించాల్సిన సమస్యలు నగరంలో ప్రస్తుతం జరుగుతున్న పనులే కాకుండా మరికొన్ని సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా నిజామాబాద్ నగరంలో ప్రభుత్వ మహిళ డిగ్రీ కాలేజీ ఏర్పాటు కావాల్సి ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా సమస్య ఉంది. అలాగే నగరానికి కొత్త మాస్టర్ ప్లాన్ అందుబాటులోకి రావాల్సి ఉంది. ఇది కూడా కొన్నేళ్లుగా పరిష్కారం కావడంలేదు. అలాగే శివారు కాలనీల్లో రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాలు, తాగునీటి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఫ్లైఓవర్‌బ్రిడ్జిలు, డబుల్బెడ్రూంల ఇళ్లు అందుబాటులోకి రావాల్సి ఉంది. ప్రసూతి ఆస్పత్రి ఏర్పాటు కావాల్సి ఉంది. అలాగే ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. దీనికి పరిష్కార మార్గాలు, ప్రత్యామ్నాయ సౌకర్యాలు అందుబాటులోకి రావాలి. అమలవుతున్న పథకాలు పింఛన్లు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్టు, షాదీముబారక్ తదితర పథకాలు అమలవుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే వివరాలు నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా 2009 సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో నిజామాబాద్ ఎంపీ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం 2014లో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కారు గుర్తుపై బరిలో దిగి విజయం సాధించారు. ప్రస్తుతం అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి టీఆర్ఎస్ నుంచి తిరిగి పోటీ చేస్తున్నారు. 2018 ఓటర్ల జాబితా.. మొత్తం ఓటర్లు 2,41,562 పురుషులు 1,18,773 స్త్రీలు 1,22,606 ఇతరులు 46 మంది పోలింగ్ స్టేషన్లు 218 -
నరసింహస్వామి ఆశీర్వాదం..
సాక్షి,భీమ్‌గల్(నిజామాబాద్): బాల్కొండ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం 10 గంటలకు భీమ్‌గల్‌కు చేరుకున్న ఆయన ప్రముఖ పుణ్యక్షేత్రం లింబాద్రి గుట్టకు చేరుకుని నరసింహ స్వామి పాదాల చెంత నామినేషన్ పత్రాలు ఉంచి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆయన భీమ్‌గల్‌లోని ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకున్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం 200 మీటర్ల దూరంలో వాహనం దిగి సతీమణి నీరజారెడ్డి, ఎంపీపీ కొండ గోదావరి, డాక్టర్ మధుశేఖర్, పెర్కిట్‌కు చెందిన బంధువుతో కలిసి కార్యాలయంలోకి వెళ్లారు. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం 12.45 గంటలకు రిటర్నింగ్ అధికారి, జెడ్పీ సీఈవో వేణుకు నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్ వేసి వచ్చిన అనంతరం నాయకులు, కార్యకర్తలు ప్రశాంత్‌రెడ్డిని పూలమాలలతో అభినందించారు. అనంతరం ఆయన స్థానిక చర్చిలో ప్రార్థనలు జరిపి దైవజనుల ఆశీస్సులు తీసుకున్నారు. అవకాశమిస్తే మరింత అభివృద్ధి చేస్తా : బిగాల గణేషగుప్తా సాక్షి,చంద్రశేఖర్‌కాలనీ(నిజామాబాద్): నిజామాబాద్ అర్బన్ టీఆర్ఎస్ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చిన ఆయన రెండు సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఆయనతో పాటు టీఆర్ఎస్ అనుబంధ అభ్యర్థిగా బిగాల కృష్ణమూర్తి కూడా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం గణేశ్‌గుప్తా విలేకరులతో మాట్లాడుతూ.. 2014లో తనపై అపారమైన విశ్వాసం ఉంచి నగర ప్రజలు తనను ఎమ్మెల్యేగా గెలిపించారని తెలిపారు. రూ. 950 కోట్లతో ఇందూరు నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ ఎన్నికల్లో తనకు ఓటు వేసి మరోమారు ఆశీర్వదించాలని కోరారు. ఎంపీ కవితతో కలిసి గుప్తా గురువారం మరో రెండు సెట్ల నామినేషన్ పత్రాలుదాఖలు చేయనున్నారు. -
నామినేషన్ కార్యక్రమంలో కారు నడిపిన ఎంపీ కవిత
-
టీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్.. ఆసక్తికర దృశ్యం
సాక్షి నిజామాబాద్ : నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరపున గణేష్ గుప్తా పోటీచేస్తున్న విషయం తెలిసిందే. గణేష్ గుప్తా గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఎంపీ కల్వకుంట్ల కవిత స్వయంగా కారు నడిపి అక్కడున్న వారందర్నీ ఆశ్చర్యంలో ముచెత్తారు. గులాబీ రంగులో ఉన్న అంబాసిడర్ కారును గణేష్ గుప్తా ఇంటి నుంచి నగరపాలక సంస్థ కార్యాలయం వరకు ఆమె డ్రైవింగ్ చేశారు. మహిళలు డ్రైవింగ్ చేయటం సాధారణమే. కానీ, ఎంపీగా ఉన్న ఓ మహిళ కారు నడపడం, అందులో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ పని చేయడం అందరినీ ఆకర్షించింది. అనంతరం కార్యకర్తలు, అభిమానులు, పార్టీ అభ్యర్థులతో కలిసి పాదయాత్రగా ఎంపీ కవిత తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. కల్వకుంట్ల కవిత, మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి సమక్షంలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ అభ్యర్థిగా గణేష్ గుప్తా, ఆర్మూర్ నియోజకవర్గ అభ్యర్థిగా ఆశన్నగారి జీవన్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్‌లో అసంతృప్తులు.. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ టికెట్‌ను నల్లమడుగు సురేందర్‌కు కేటాయించడం పట్ల వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యకర్తలతో సమావేశమైన సుభాష్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయనున్నట్టు నిర్ణయించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
టీఆర్ఎస్ది నిరంకుశ పాలన
రాజేంద్రనగర్: రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కార్ నిరంకుశ పాలన కొనసాగిస్తుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ విమర్శించారు. శివరాంపల్లి నిర్వహించిన ఇంటింటికీ టీడీపీ కార్యక్రమానికి రమణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సంద ర్భంగా శివరాంపల్లి చౌరస్తాలో ఆ పార్టీ జెండా ఎగురవేసి స్థానిక బస్తీ ల్లో పర్యటించారు. అనంతరం ఆయ న మాట్లాడుతూ.. ప్రజల స్వేచ్ఛను టీఆర్ఎస్ అణచివేస్తోందన్నారు. ఏ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు, కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే ధర్నాలు, నిరసన కార్యక్రమాలను ఏ ప్రభుత్వాలు ఆటంకం సృష్టించవన్నారు. కానీ టీఆర్ఎస్ ధర్నాచౌక్‌తో పాటు ప్రతిపక్షాల ధర్నాలు, నిరసన కార్యక్రమాలను అడ్డుకుంటూ నేతలను ముందస్తుగా అరెస్ట్‌లు చేసి భయాం దోళన సృష్టిస్తుందని మండిపడ్డారు. 12 వందల మంది విద్యార్థుల త్యా గంతో రాష్ట్రం సిద్ధించిందని, నేటికీ బాధిత కుటుంబాలకు న్యాయం జరగలేదన్నారు. కార్యక్రమంలో నాయకులు మ్యాడం రామేశ్వర్రావు, ఆర్. గణేష్‌గుప్తా, కృష్ణాగౌడ్, రాజ్‌కుమార్, వెంకటేష్, శ్రీనివాస్‌రెడ్డి, శ్యామల, బాల్‌రాజ్, రాజు పాల్గొన్నారు. -
‘కాళేశ్వరం’వద్ద ఎమ్మెల్యే బృందం
నిజామాబాద్‌అర్బన్: కరీంనగర్ జిల్లాలోని రామడుగు వద్ద ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనుల ను అర్బన్ ఎమ్మెల్యేబిగాల గణేశ్‌గుప్తా బృందం గురువారం పరిశీలించింది. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నగర మేయర్ ఎ.సుజాత, కార్పొరేటర్లు ప్రాజెక్టు 8వప్యాకేజీ వద్ద నిర్మాణం పనులను పరిశీలించారు. ప్రాజెక్టు పను లు ఏవిధంగా జరుగుతున్నాయి.. సిబ్బంది పనితీరు ను ప్రాజెక్టుఅధికారులను అడిగి తెలుసుకున్నారు. డిప్యూటీ మేయర్ ఫయీమ్, కార్పొరేటర్లు సాయిలు, తదితరులు ఉన్నారు. -
నిజామాబాద్ మీదుగా మరిన్ని రైళ్లు
సాక్షిప్రతినిధి, నిజామాబాద్/నిజామాబాద్‌కల్చరల్(నిజామాబాద్‌అర్బన్): ముథ్కేడ్ – మనోహరాబాద్ రైల్వేలైన్ డబ్లింగ్, విద్యుద్ధీకరణ పనులను దశల వారీగా నాలుగేళ్లలో పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ పేర్కొన్నారు. 780 కి.మీల మేరకు ఉన్న సికింద్రాబాద్ – మన్మాడ్, ముథ్కేడ్ – ఆదిలాబాద్ లైన్లకు డబ్లింగ్, విద్యుద్ధీకరణ పనులు ఇప్పటికే మంజూర్యయని అన్నారు. నిజామాబాద్ వైపు మరిన్ని రైళ్లు నడిపేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం నాందేడ్ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న జీఎం నిజామాబాద్ రైల్వేస్టేషన్‌ను తనిఖీ చేశారు. హెల్త్ యూనిట్, రైల్వే క్వార్టర్స్ కాలనీ, రైల్వే స్టేషన్ పరిసరాలను ఆయన పరిశీలించారు. ఆలాగే ఆర్పీఎఫ్ స్టేషన్‌లోని వంట గదిని పరిశీలించిన జీఎం.. ఆధునికీకరించిన రన్నింగ్ రూంలో డ్రైవర్లు, గార్డులతో కలిసి భోజనం చేశారు. లోకో పైలట్ల కోసం ఓం శాంతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈశ్వరీయ బ్రహ్మకుమారీలు ఏర్పాటు చేసిన మెడిటేషన్ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. నిజామాబాద్, మాధవనగర్, నవీపేట, డిచ్పల్లి వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జీల నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభిస్తామని జీఎం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తమ వంతు వాటా అందిస్తే అవసరమైన చోట రైల్వే ఓవర్ బ్రిడ్జీలు (ఆర్వోబీ), రైల్వే అండర్ బ్రిడ్జీలు (ఆర్యూబీ) నిర్మిస్తామని చెప్పారు. అవసరమున్న లెవల్ క్రాసింగ్‌ల వద్ద అండర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేస్తామన్నారు. జీఎంను కలిసిన ప్రజాప్రతినిధులు నిజామాబాద్ మీదుగా పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపాలని, పలుచోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు, ఆర్వోబీలు, ఆర్‌యూబీలు నిర్మించాలని రూరల్, అర్బన్ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్ గుప్తా, డీసీసీ అధ్యక్షుడు తాహెర్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి విఠల్‌రావు, నిజామాబాద్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్ట్రీస్ ప్రతినిధులు తదితరులు జీఎంకు వినతిపత్రాలు సమర్పించారు. డబ్లింగ్ లైన్ పనులు త్వరగా చేపట్టాలని కోరారు. సానుకూలంగా స్పందించిన జీఎం.. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కోరిన విధంగా నిజామాబాద్ మీదుగా పలు రైళ్లను నడిపేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే, ముంబై నుంచి నిజామాబాద్ వరకు నడుస్తున్న లోకమన్య తిలక్ రైలును, కాచిగూడ నుంచి నిజామాబాద్ వరకు నడుస్తున్న రైళ్లను కరీంనగర్ వరకు పొడిగిస్తామన్నారు. మార్చిలోగా వైఫై.. నిజామాబాద్ రైల్వేస్టేషన్లో మార్చిలోపు వైఫై సదుపాయాన్ని ప్రారంభిస్తామని వినోద్‌కుమార్ యాదవ్ తెలిపారు. ఈ రైల్వేస్టేషన్లో అదనంగా రెండు ప్లాట్‌ఫామ్స్‌ను నిర్మిస్తామని, నాలుగు ఎస్కలేటర్స్, సీసీ టీవీలను ఏర్పాటు చేస్తామన్నారు. అంతకుముందు జీఎం స్టేషన్ ఆవరణలోని పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. లోకో పైలెట్, గార్డ్లతో కలిసి జీఎం భోజనం చేశారు. డీఆర్ఎం ఆరుణ్‌కుమార్ జైన్, ఆయా విభాగాల అధికారులు, నిజామాబాద్ స్టేషన్ మేనేజర్ బబ్లు మీనా తదితరులు పాల్గొన్నారు. -
నిజం ఒప్పుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్‌లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు జరుగుతున్నాయి. దీంతో ఎక్కడ చూసినా రోడ్లు గుంతలు పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశంపై బుధవారం నిజామాబాద్ అర్బన్ ఎమ్మల్యే గణేష్ గుప్తా స్పందించారు. పనుల కారణంగా రోడ్లు పాడయ్యాయని.. దీంతో జనం ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమేనని ఆయన తెలిపారు. అయితే ఎంత ఇబ్బంది ఉన్నా తమకు సహకరిస్తున్నందుకు నగర ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. జూన్ లోపు అన్ని పనులు పూర్తవవుతాయన్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా రూ. 800 కోట్లతో నిజామాబాద్ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. యూజీడీ పనుల కారణంగా గత నాయకులు అబాసుపాలయ్యారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. పనులన్నీ పూర్తై తాము చేసిన అభివృద్ధి ప్రజలకు నచ్చితే ఓట్లు వేస్తారని గణేష్ వ్యాఖ్యానించారు. -
దేశంలోనే ఐలయ్య ప్రమాదకరమైన వ్యక్తి
హైదరాబాద్: సామాజిక స్మగ్లర్లు ‘కోమటోళ్లు’ పుస్తక రచయిత కంచ ఐలయ్య దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని ఆయనను ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేర్పించాలని నిజామాబాద్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా డిమాండ్ చేశారు. ఐలయ్య పుస్తకానికి కౌంటర్‌గా వైశ్య ఐక్య కార్యాచరణ సమితి (ఐకాస) వేదిక కన్వీనర్, తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కాచం సత్యనారాయణగుప్తా ‘సామాజిక సేవకులు వైశ్యులు’ అనే పేరుతో రాసిన పుస్తకాన్ని ఐజేయూ సెక్రటరీ దేవులపల్లి అమర్ శనివారం ఆవిష్కరించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా మాట్లాడుతూ..ఐలయ్య ప్రధాని మోదీ గురించి కూడా తప్పుగా మాట్లాడిన వ్యక్తి అని..అతనిపై రాజద్రోహం కేసు పెట్టి దేశం నుంచి బహిష్కరించాలన్నారు. ఆర్యవైశ్యులు మాంసం తింటారంటూ పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్న ఐలయ్య సరైన చికిత్స తీసుకుని బయట ప్రపంచంలోకి రావాలన్నారు. ఐలయ్య అనే పెద్ద పిచ్చోడు బయట తిరుగుతుంటే ఎర్రగడ్డ పిచ్చాసుపత్రి వాళ్లు ఎందుకు చేర్చుకోవడం లేదో అర్థం కావడం లేదని..ఐలయ్యను త్వరగా ఆస్పత్రిలో చేర్పించుకోవాలని ఆ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను కోరుతున్నామన్నారు. ఆర్యవైశ్యులపై ఐలయ్య చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ అన్ని పార్టీలు స్పందించినప్పటికీ కాంగ్రెస్ మాత్రం ఇంత వరకు నోరు మెదపలేదన్నారు. ఐలయ్య బేషరతుగా క్షమాపణలు చెప్పకుంటే మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. నిందించే హక్కు లేదు.. ఐజేయూ సెక్రటరీ దేవులపల్లి అమర్ మాట్లాడుతూ..ఐలయ్య గతంలో కూడా చాలా పుస్తకాలు రాసి ఎన్నో కులాల్ని దూషించారన్నారు. ఇప్పుడు కూడా అదే ధోరణిలో ఉన్నట్లు స్పష్టమవుతుందన్నారు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని.. ఒకర్ని నిందించే హక్కు ఇంకొకరికి లేదన్నారు. ఎదుటి వ్యక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించడం చాలా ప్రమాదకర మన్నారు. ఆయన రాసిన ఈ పుస్తకాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. పుస్తక రచయిత కాచం సత్యనారాయణగుప్తా మాట్లాడుతూ.. ఐలయ్య రాసిన పుస్తకంలో ఉన్న ప్రతి అక్షరానికి జవాబుగా తాను కూడా ఈ పుస్తకాన్ని రాశానన్నారు. ఉపాధ్యాయ ముసుగులో ఉన్న ఉన్మాది ఐలయ్య అంటూ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్‌గుప్తా, తెలంగాణ హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ బొల్లం సంపత్, వైశ్య ఐకాస వేదిక గౌరవ సలహాదారు సోమ భరత్‌కుమార్, ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ తదితరులు ప్రసంగించారు. ఐలయ్యను అడ్డుకున్న ఆర్యవైశ్యులు పోలీసులకు ఫిర్యాదు.. దళితులు, ఆర్యవైశ్యుల పోటాపోటీ నినాదాలు పరకాల: వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో ప్రొఫెసర్ కంచ ఐలయ్యను శనివారం ఆర్యవైశ్యులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. భూపాలపల్లిలో టీ–మాస్ కార్యక్రమం లో పాల్గొని హన్మకొండకు వెళ్తున్న క్రమంలో పరకాల అంబేడ్కర్ సెంటర్ వద్ద ఐలయ్యను ఆర్యవైశ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆయన పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ప్రాణభయం ఉందని ఫిర్యాదు చేశారు. ఠాణా వద్దకు వచ్చిన ఆర్యవైశ్యులు ఐలయ్య క్షమాపణ చెప్పాలని నినాదాలు చేశారు. దళితులు సైతం పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో ఐలయ్యను పోలీసులు ఎస్కార్ట్ మధ్య అక్కడి నుంచి పంపించారు. ఈ క్రమంలో దళితులు, ఆర్యవైశ్యులు పోటాపోటీగా నినాదాలు చేస్తూ ఊరేగింపుగా వెళ్లారు. పోలీసులు వారికి నచ్చజెప్పి పంపించారు. డ్రైవర్ అప్రమత్తం కావడంతో బతికిపోయా.. డ్రైవర్ అప్రమత్తమై కారును వేగంగా నడపడంతో బతికిపోయానని ప్రొఫెసర్ కంచ ఐలయ్య అన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. పరకాలలో ఆర్యవైశ్యులు దూసుకొచ్చి కారుపై బలంగా బాదుతూ బయటకు లాగి కొట్టే ప్రయత్నం చేశారన్నారు. అవి చీరలు కావు.. మసిబొంతకు వాడుకునేవి భూపాలపల్లి: ప్రభుత్వం చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ ఓ సామాజిక స్మగ్లింగేనని.. అవి చీరలు కావు.. మసిబొంతకు వాడుకునేవని భూపాలపల్లిలో ఐలయ్య అన్నారు. రూ.25 విలువ చేసే బతుకమ్మ చీరకు.. రూ.200 అని చెప్పి సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత రూ.100 కోట్లు దండుకున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో గద్దర్, తమ్మినేని వీరభద్రం, ప్రొఫెసర్ విశ్వేశ్వర్రావు పాల్గొన్నారు. ఐలయ్యపై సుప్రీంకోర్టులో పిటిషన్ ప్రపంచ ఆర్యవైశ్యమహాసభ అధ్యక్షుడు రామకృష్ణ వెల్లడి సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆర్యవైశ్యుల మనో భావాలను కించపర చడమే కాకుండా సమాజంలోని కొన్ని వర్గాలను దాడులకు పురిగొల్పే విధంగా వ్యవహరిస్తున్న కంచ ఐలయ్యపై తగిన చర్య తీసుకోవాల్సిం దిగా కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తున్నట్లు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ (వామ్) అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ తెలిపారు. ఐలయ్య పోకడలను ఖండిస్తూ ఆర్యవైశ్య మహాసభ తరఫున ఇటీవల నిర్వహించిన ఆందోళన కార్యక్రమాల్లో పొల్గొన్న వారికి కృతజ్ఞతలు తెలిపేందుకు శనివారమిక్కడ∙వామ్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఐలయ్యపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఫిర్యాదు చేసి సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తున్నట్లు ఆయన చెప్పారు. అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను కూడా కలవబోతున్నామని తెలిపారు. -
అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్ర మాలకు నిజామాబాద్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా శుక్రవారం శంకుస్థాపనలు చేశారు. పట్టణంలో నిర్మించనున్న సీసీ డ్రైనేజీతో పాటు బీటీ రోడ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు జిల్లా నాయకులు పాల్గొన్నారు. -
‘కారు’ ఖరారు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఇద్దరు ఎంపీలు, ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని ఖరారు చేసింది. దీంతో జిల్లాలో రెండు లోక్‌సభ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యింది. తొలి విడతలో ఎనిమిది శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మంగళవా రం నిజామాబాద్, జహీరాబాద్ లోక్‌సభ, నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ స్థానానికి అభ్యర్థులను ప్రకటించారు. తె లంగాణ జాగృతి అధ్యక్షురాలు, కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితకు నిజా మా బాద్ ఎంపీ స్థానానికి టికెట్ దక్కింది. అందరూ ఊహించినట్లు మహారాష్ట్రలో వ్యాపారవేత్తగా స్థిరపడిన భీంరావ్ బ స్వంత్రావు పాటిల్‌కు టీఆర్ఎస్ జహీరాబాద్ ఎంపీ టికెట్‌ను కట్టబెట్టారు. 2009 లో పోటీ చేసిన ఓటమిపాలైన బిగాల గణేశ్ గుప్తకు కవిత ప్రవేశంతో నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి అవకాశం చే జారిపోగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మె ల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించారు. దీంతో టీఆర్ఎస్ అర్బన్ ఇన్చార్జిగా ఉన్న బస్వ లక్ష్మీనర్సయ్యకు షాక్ ఇచ్చినట్లయ్యింది. అర్బన్ స్థానం పై కోటి ఆశలు పెట్టుకున్న ఆయనకు కవిత, బీబీ పాటిల్‌ల ఆగమనంతో భంగపాటు కలిగింది. తనకు టికెట్ కేటాయించక పోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైన లక్ష్మీనర్సయ్య రెబల్ అభ్యర్థిగా బుధవారం నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ నగర కమిటీ సభ్యులు మంగళవారం విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు.