
సాక్షి, నిజామాబాద్ : బీజేపీ చేసే రెచ్చగొట్టే వ్యాఖ్యలను నమ్మొద్దని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఉన్నవి లేనట్లు.. లేనివి ఉన్నట్లు నిజామాబాద్ ఎంపీ అర్వింద్ మోసపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్రం నుంచి 42 శాతం నిధులు, తెలంగాణ ప్రజల సొత్తు అని, 42 శాతం కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఇచ్చినట్లు రుజువు చేస్తే దేనికైనా సిద్దమని స్పష్టం చేశారు.
బీజేపీ ఎంపీ దర్మపురి ఆర్వింద్ కుల మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా మండిపడ్డారు. అర్వింద్ నీచ రాజకీయాలు మానుకోవాలని మేయర్ స్థానం టీఆర్‌ఎస్ పార్టీదేనని ఆశాభావం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ మజ్లిస్‌తో ఒప్పందం అయ్యిందంటూ హిందువులను మాయ మాటలతో రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఇచ్చిన మాట తప్పితే తాను రాజీనామా చేస్తానని.. రాజీనామాకు ఎంపీ అర్వింద్ సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment