సాక్షి, నిజామాబాద్: వందరోజుల్లో అమలు కాని కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు.. ఆగస్టు తర్వాత ఎలా సాధ్యమవుతాయని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ అర్వింద్. లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారనున్నాయన్నారు. హస్తం పార్టీకి ఇవే చివరి ఎన్నికలని అన్నారు. ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి సీటుకే గ్యారంటీ లేదని విమర్శించారు.
తెలంగాణలో బీజేపీ రోజురోజుకీ ఎదుగుతుందన్నారు. ఇతర పార్టీలతో లాలూచీ పడే అవసరం బీజేపీకి లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీకి 12 సీట్లు వస్తాయని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారన్నారు. వారు చెప్పినట్లు బీజేపీ 12 సీట్లు వస్తే సీఎం రేవంత్‌ను దేవుడే కాపాడాలని పెటైర్లు వేశారు.
నిజామాబాద్ నగరంలో ఇంటింటి ప్రచారం ప్రారంభించిన బీజేపీ అభ్యర్థి, ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్ధుడే కానీ.. ఆయన కాంగ్రెస్‌లో ఉండటమే పెద్ద తప్పని అన్నారు. కాంగ్రెస్ నేతలు రేవంత్‌ను పనిచేయకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌లో ఉంటే ఎవరికైనా రాజకీయ భవిష్యత్తు ఉండదని అన్నారు.
ఎంపీ అర్వింద్ కామెంట్స్
- కాంగ్రెస్ 100 రోజుల్లో ఏ గ్యారెంటీ నెరవేర్చలేదు.
- ఇప్పుడు ఆగస్టులో రుణమాఫీ అని మరోసారి మోసానికి తెరలేపింది.
- అవినీతి చేసిన వారికి శిక్ష తప్పదు.
- బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఇప్పట్లో బెయిల్ వచ్చే పరిస్థితి లేదు.
- ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే షుగర్ ఫ్యాక్టరీలు నెల రోజుల్లో పనిచేసే ప్రక్రియను ప్రారంభిస్తాం.
- నిజామాబాదు పార్లమెంటు పరిధిలో ఆధ్యాత్మిక, టూరిజం కారిడార్‌ను ఏర్పాటు చేస్తాం
- మా ఏకైక గ్యారెంటీ మోదీనే.
- మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని మోడీ ప్రభుత్వం నెరవేర్చుతుంది.
- మోదీ మూడో టర్మ్‌లో కామన్ సివిల్ కోడ్ అమలు చేస్తాం.
- రైల్వే విభాగంలో కొత్త విప్లవం రాబోతుంది.
- రానున్న రోజుల్లో 25 వేల కి.మీ.ల కొత్త రైల్వే లైన్లు వస్తాయి.
- కాంగ్రెస్ పార్టీ హిందు వ్యతిరేక పార్టీ.
Comments
Please login to add a commentAdd a comment