![MLA Bigala Ganesh Gupta Tests Corona Positive - Sakshi](/styles/webp/s3/article_images/2020/06/16/Bigala-Ganesh-Gupta.jpg.webp?itok=4q1XJPep)
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో మరో ఎమ్మెల్యే కరోనా బారినపడ్డారు. ఆదివారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. సోమవారం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తాకు కూడా వ్యాధి నిర్ధారణ అయ్యింది. బాజి రెడ్డి గోవర్ధన్‌కు కరోనా పాజిటివ్ రావడంతో బిగాల కూడా పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు కూడా వ్యాధి సోకినట్లు తేలింది. వైద్యుల సూచనల మేరకు ఆయన హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తన నివాసంలోనే చికి త్స పొందుతున్నట్లు తెలిసింది. అధికారులు ఆయన కుటుంబసభ్యుల నుంచి కూడా శాంపిళ్లు సేకరించి, పరీక్షలకు పంపించారు.
ముత్తిరెడ్డి ద్వారానేనా?
నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్‌కు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ద్వారానే వైరస్ సోకినట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో వీరిద్దరు పాల్గొన్నట్లు తెలుస్తోంది. గణేశ్‌గుప్తా శనివారం నిజామాబాద్ నగరంలోని తన క్యాంపు కార్యాలయం ఆవరణలో కార్పొరేటర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్థానికంగా నిర్వహించిన ఓ ప్రైవేటు కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. ఆయనకు పాజిటివ్ రావడంతో ఆయా సమావేశాల్లో పాల్గొన్న వారంతా కలవరపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment