bigala ganesh
-
ప్రజలే నా ధైర్యం.. నమ్మకం! : బిగాల గణేశ్‌గుప్తా
సాక్షి, నిజామాబాద్: 'ప్రజలే తన ధైర్యం.. నమ్మకమని నిజామాబాద్ అర్బన్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా అన్నారు. తెలంగాణ రాకముందు ఇందూర్ నగరం ఏ విధంగా ఉందో.. ఇప్పుడు ఎలా ఉందో అందరికి తెలుసని పేర్కొన్నారు. తనకన్న ముందు ఉన్నవారు నగరాన్ని అభివృద్ధి చేయలేదన్నారు. పక్కా ప్రణాళికతో నగరాన్ని అభివృద్ధి చేశానని చెప్పారు. మళ్లీ అవకాశం ఇస్తే ఇందూరును దేశంలో మొదటి స్థానంలో ఉంచడానికి అనుక్షణం శ్రమిస్తానని హామీ ఇచ్చారు.' ఎన్నికల నేపథ్యంలో గణేశ్‌గుప్తాతో సాక్షి ఇంటర్వ్యూ.. – నిజామాబాద్ నాగారం నగర అభివృద్ధికి ఎన్ని నిధులు ఖర్చు చేశారు? ► నిజామాబాద్ నగరాన్ని ఇప్పటి వరకు రూ.వేయి కోట్లతో అభివృద్ధి చేశాను. విశాలమైన రోడ్లు, డివై డర్లు, పార్కులు, ఓపెన్‌జిమ్‌లు, మినీ ట్యాంక్‌బండ్, సమీకృత మార్కెట్ సముదాయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వే అండర్ బ్రిడ్జి, ఐటీ హబ్, వైకుంఠధామాలు తదితర పనులు పూర్తి చేశాను. 2018 ఎన్నికల సమయంలో ప్రజలకు నును చేయబోయే అభివృద్ధి పనులకు సంబంధించి మోడల్ బుక్లెట్ పంపిణీ చేశా. దానిని ఐదేళ్లలో పూర్తి చేసి ప్రజల కళ్ల ముందు ఉంచాను. యూజీడీ పనులు పూర్తయ్యాయా? ► ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు నేను ఎమ్మెల్యే కాకముందు నుంచే జరిగా యి. రోడ్లను మధ్యలో తవ్వేయడంతో రాకపోకలు నానా ఇబ్బందులు పడ్డారు. దీంతో సీఎం కేసీఆర్ ను అడిగి నిధులు తెచ్చి 2019లో యూజీడీ పనులు పూర్తి చేయించాను. ప్రతి ఇంటి నుంచి యూజీడీకి కనెక్షన్ ఇవ్వాలి. దీనికి ఒక్కొక్కరికి రూ.8 వేలకు పై గా ఖర్చు అవుతుంది. ప్రజలకు ఇబ్బందులు లేకుండా కేసీఆర్‌ను ఒప్పించి రూ.45కోట్ల నిధులు తెచ్చి టెండర్ ప్రక్రియ పూర్తి చేయించాను. ఎన్నికలు పూ ర్తి కాగానే ఈ పనులు ప్రారంభం అవుతాయి. ప్రస్తుతం నగరంలో తాగునీటి సమస్య ఉందా? ► నగరంలో ఇంటింటికి తాగునీరు సరఫరా అవుతోంది. ట్యాంకర్ల ద్వారా సరఫరాకు చెక్ పెట్టడానికే మిషన్ భగీరథ ద్వారా పైపులైన్లు వేశాం. 24గంటల పాటు మంచినీరు సరఫరా చేయడానికి కార్యాచరణ రూపొందించాం. ప్రచారంలో ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? ► నేను అనుక్షణం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నా. నగరంలో ఉన్న పరిస్థితులు, సమస్యలు పరిశీలించి పరిష్కరించా. నేను చేసిన అభివృద్ధిపై బుక్లెట్ ప్రింట్ చేసి ఇంటింటికి పంచుతూ ఓట్లు అడుగుతున్నా. ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. ప్రజలే నా ధైర్యం, నమ్మకం.. మూడోసారి గెలిపిస్తారని నమ్ముతున్నా. ఆత్మీయ సమ్మేళనాలతో ప్రచారం చేపట్టారు. అన్ని కులాలకు దగ్గరయ్యారా? ► నేను ఎల్లవేళలా ప్రజలతో ఉన్నా. నగరంలోని అ న్ని డివిజన్లలో పర్యటించాను. కులమతాలకు అతీతంగా కుల సంఘాలకు, ఆలయాలు, మసీదులు, చర్చిలకు నిధులు ఇచ్చి భవనాలు పూర్తి చేయించాను. ఆత్మీయ సమ్మేళనాలతో నేను ఏం చేశానో ప్రజలకు వివరించాను. ఎన్నికల మేనిఫెస్టో ఏ విధంగా ఉంది? ► సీఎం కేసీఆర్ ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. మరోసారి అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి రూ.5లక్షల కేసీఆర్ భీమా, సన్నబియ్యం, ఆసరా పెన్షన్ రూ.5వేలు, దివ్యాంగులకు రూ. 6వేలు, రైతు బంధు రూ.16వేలు, మహిళలకు రూ. 3 వేలు అందిస్తాం. చేసిన అభివృద్ధి, సంక్షేమంతో పాటు మేనిఫెస్టోను వివరిస్తూ ప్రచారం చేస్తున్నాం. ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ► ఎన్నికలు వస్తాయి, పోతాయి. రకరకాల పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తారు. ఒక్కసారి గుండె మీద చె య్యి వేసి మనస్ఫూర్తిగా ఆలోచన చేయండి. నేను తొమ్మిదిన్నర ఏళ్లలో నగరాన్ని ఎవరూ చేయని వి ధంగా అభివృద్ధి చేశా. నా కన్న ముందు పెద్ద పెద్ద నాయకులు పోటీ చేసినా అభివృద్ధి చేయలేదు. అ నుక్షణం ప్రజల్లో ఉండి ప్రభుత్వం ద్వారా సంక్షేమ ఫలాలు అందిస్తూ, సదుపాయాలు కల్పించా. నగరాన్ని రాష్ట్రంలో, దేశంలో నంబర్ వన్‌గా ఉంచడాని కి కష్టపడుతునే ఉన్నాను. ఏ కష్టం వచ్చినా ప్రజల కు అండగా ఉంటున్నా. అందుకే ఈ నెల 30న కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నా. ఇవి కూడా చదవండి: త్రిముఖ పోరు! ఆర్మూర్‌లో అనూహ్యంగా దూసుకొచ్చిన బీజేపీ.. -
అమరుల కుటుంబాలను గౌరవించాలి
సుభాష్‌నగర్ : ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఆత్మబలిదానాలు చేసుకున్న అమరుల త్యాగాలు స్మరించు కోవడానికే సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు తెలిపారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం కలెక్టరేట్లో అమరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, నగర మేయర్ దండు నీతూకిరణ్, అదనపు కలెక్టర్ చిత్ర మిశ్రా, అధికారులు హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ కోసం త్యాగం చేసిన వారి కుటుంబాలను గౌరవించుకోవడం కోసమే కార్యక్రమం చేపట్టామన్నారు. ఉద్యమంలో జిల్లాలో 32 మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారని, వారి కు టుంబానికి రూ.10 లక్షల చొప్పున నగదు అందించామని, 30 మందికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించా మన్నారు. మరో రెండు కుటుంబాలకు కూడా ఉ ద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. 21 రోజుల పా టు గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారులు దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అండగా సీఎం కేసీఆర్ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదుకుంటున్నారని జెడ్పీ చైర్మన్ విఠల్‌రావు అన్నారు. 2001 నుంచి కేసీఆర్‌తో అడుగులో అడుగు వేసి ఉద్యమంలో పాల్గొన్నామన్నారు. అన్ని వర్గాల ప్రజల సహకారంతో తెలంగాణ సాధించి 9 ఏళ్లలో ఎంతో అభివృద్ధి సాధించామన్నారు. అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ అమరుల త్యాగంతోనే తెలంగాణ ఏర్పడిందని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా అన్నారు. నిజామాబాద్ నగరంలో 8 మంది యువకులు ఆత్మబలిదానం చేసుకున్నారని గుర్తుచేశారు. వారి లోటు మరువలేనిదని, బాధిత కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల నగదు అందజేసి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించామన్నారు. మేయర్ నీతూకిరణ్ మాట్లాడుతూ అమరవీరులను స్మరించుకోవడం, వారి కుటుంబాలను సన్మానించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఉద్యోగ సంఘాల నాయకులను విస్మరించడం సరికాదని, కార్యక్రమ సమాచారం, ఆహ్వానం అందలేదని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్ పేర్కొన్నారు. అనంతరం అమరుల కుటుంబ సభ్యులను సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ రజిత యాదవ్, నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. -
తెలంగాణ వైద్యరంగం దేశానికి ఆదర్శం
నిజామాబాద్ సిటీ: ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ వైద్య రంగం విప్లవాత్మక మార్పుల తో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని న్యూ అంబేడ్కర్ భవన్లో బుధవారం వైద్య ఆరోగ్య దినో త్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎ మ్మెల్యే హాజరై, జ్యోతి వెలిగించి, పోస్టర్లను ఆవిష్క రించారు. సీఎం మార్గదర్శకత్వంలో వైద్య సిబ్బంది కృషితో తెలంగాణ వైద్య రంగం దేశానికి దిక్సూచిగా మారిన శుభసందర్భంగా, వైద్యులకు, వైద్య సిబ్బందికి ఎమ్మెల్యే ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రయివేట్ ఆస్పత్రిలకు ధీటుగా కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నామన్నారు. మన రాష్ట్రంలో అందుతున్న వైద్య సే వల తీరు ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలలో అమలు చే స్తామని ఆ రాష్ట్రాల సీఎంలు కేజ్రీవల్, భగవంత్ మాన్సింగ్ తెలుపటం దీనికి నిదర్శనమన్నారు. ను డా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మహిళ కమిషన్ సభ్యురా లు సూదం లక్ష్మీ, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఇందిరా, డీఎంహెచ్‌వో సుదర్శనం పాల్గొన్నారు. జీజీహెచ్‌లో రోగులకు పండ్ల పంపిణీ వైద్య ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే జీజీహెచ్‌లోని రోగులకు పండ్లు, కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసిన ‘కేసీఆర్ బువ్వ కుండ‘ కేంద్రంలో రోగులకు వారి సహాయకులకి భోజనాన్ని వితరణ చేశారు. -
కరోనా వైరస్ బారిన మరో ఎమ్మెల్యే
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో మరో ఎమ్మెల్యే కరోనా బారినపడ్డారు. ఆదివారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. సోమవారం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తాకు కూడా వ్యాధి నిర్ధారణ అయ్యింది. బాజి రెడ్డి గోవర్ధన్‌కు కరోనా పాజిటివ్ రావడంతో బిగాల కూడా పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు కూడా వ్యాధి సోకినట్లు తేలింది. వైద్యుల సూచనల మేరకు ఆయన హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తన నివాసంలోనే చికి త్స పొందుతున్నట్లు తెలిసింది. అధికారులు ఆయన కుటుంబసభ్యుల నుంచి కూడా శాంపిళ్లు సేకరించి, పరీక్షలకు పంపించారు. ముత్తిరెడ్డి ద్వారానేనా? నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్‌కు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ద్వారానే వైరస్ సోకినట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో వీరిద్దరు పాల్గొన్నట్లు తెలుస్తోంది. గణేశ్‌గుప్తా శనివారం నిజామాబాద్ నగరంలోని తన క్యాంపు కార్యాలయం ఆవరణలో కార్పొరేటర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్థానికంగా నిర్వహించిన ఓ ప్రైవేటు కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. ఆయనకు పాజిటివ్ రావడంతో ఆయా సమావేశాల్లో పాల్గొన్న వారంతా కలవరపడుతున్నారు. -
తెలంగాణ: మరో ఎమ్మెల్యేకు పాజిటివ్
సాక్షి, నిజామాబాద్ : తెలంగాణలో ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరూ కరోనా బారినపడుతున్నారు. తాజాగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గత రెండు రోజులుగా కోవిడ్ లక్షణాలు కనిపించడంతో ఎమ్మెల్యే పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. ఇప్పటికే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిగిరిరెడ్డికి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. బాజిరెడ్డి గోవర్ధన్‌తో ఎమ్మెల్యే బిగాల కాంటాక్ట్ అయినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇటీవల కరోనా సోకిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని ఎమ్మెల్యే గోవర్ధన్ కలిసినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌లో జరిగిన ఓ సమీక్షా సమావేశం సందర్భంగా బాజిరెడ్డి, ముత్తిరెడ్డితో మాట్లాడినట్లు తెలిసింది. (చదవండి: ఎమ్మెల్యే బాజిరెడ్డికి కరోనా పాజిటివ్) -
బ్రిటన్ పార్లమెంట్లో నిజామాబాద్ ఎమ్మెల్యే
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ తన వ్యక్తిగత పర్యటనలో భాగంగా బ్రిటన్‌లోని లండన్ నగరాన్ని సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా మంగళవారం భారత సంతతికి చెందిన ఎంపీ, అఖిల పక్ష ఇండో-బ్రిటన్ ఎంపీల చైర్మన్ వీరేంద్ర శర్మ ఆహ్వానం మేరకు పార్లమెంట్‌ను సందర్శించారు. పార్లమెంటులోని వివిధ విభాగాలను చూపించి, వాటి చరిత్ర గురించి శర్మ వివరించారు. ఎమ్మెల్యే గణేశ్ బిగాల కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ, ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ గురించి, రాష్ట్రం సాధించిన విజయాల గురించి వివరించారు. ఈ సందర్భంగా వీరేంద్ర శర్మను తెలంగాణాకు రావాల్సిందిగా ఎమ్మెల్యే ఆహ్వానించారు. ఈ సందర్శనలో ఎమ్మెల్యేతో పాటు ఆయన సోదరుడు మహేశ్ బిగాలా, ఎన్నారై టీఆర్ఎస్ సెల్ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, తెలంగాణ ఎన్నారైఫోరం-హెడ్ ఆఫ్ అడ్వైసరీ బోర్డు ఉదయ్ నాగరాజు, ఎన్నారై టీఆర్ఎస్ సెల్ సెక్రటరీ నవీన్ రెడ్డి తదితరులు ఉన్నారు. -
'సీమాంధ్రులు మీ వాళ్లు కాదు.. మా వాళ్లే'
హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రాల రాజధాని హైదరాబాద్ నగరంలో ఉన్న సీమాంధ్రలు తమ వాళ్లేనని టీఆర్ఎస్ నేతలు బిగాల గణేష్, గువ్వల బాలరాజు అన్నారు. గురువారం వారిద్దరూ ఇక్కడ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ నగరంలో అన్ని ప్రాంతాల వారు హాయిగా జీవిస్తున్నారని వారు చెప్పారు. తప్పు చేసిన ఏపీ సీఎం చంద్రబాబు వివాదం నుంచి తప్పించుకునేందుకే అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సీబీఐ కేసుల్లో సైతం తప్పించుకున్న చరత్ర చంద్రబాబుదేనని వారు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు సీఎం పదవికి వెంటనే రాజీనామా చేసి వాయిస్ టెస్టుకు హాజరవ్వాలని వారు డిమాండ్ చేశారు.