నిజామాబాద్ సిటీ: ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ వైద్య రంగం విప్లవాత్మక మార్పుల తో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని న్యూ అంబేడ్కర్ భవన్‌లో బుధవారం వైద్య ఆరోగ్య దినో త్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎ మ్మెల్యే హాజరై, జ్యోతి వెలిగించి, పోస్టర్లను ఆవిష్క రించారు. సీఎం మార్గదర్శకత్వంలో వైద్య సిబ్బంది కృషితో తెలంగాణ వైద్య రంగం దేశానికి దిక్సూచిగా మారిన శుభసందర్భంగా, వైద్యులకు, వైద్య సిబ్బందికి ఎమ్మెల్యే ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రయివేట్ ఆస్పత్రిలకు ధీటుగా కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నామన్నారు. మన రాష్ట్రంలో అందుతున్న వైద్య సే వల తీరు ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలలో అమలు చే స్తామని ఆ రాష్ట్రాల సీఎంలు కేజ్రీవల్, భగవంత్ మాన్‌సింగ్ తెలుపటం దీనికి నిదర్శనమన్నారు. ను డా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మహిళ కమిషన్ సభ్యురా లు సూదం లక్ష్మీ, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఇందిరా, డీఎంహెచ్‌వో సుదర్శనం పాల్గొన్నారు.
జీజీహెచ్‌లో రోగులకు పండ్ల పంపిణీ
వైద్య ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే జీజీహెచ్‌లోని రోగులకు పండ్లు, కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసిన ‘కేసీఆర్ బువ్వ కుండ‘ కేంద్రంలో రోగులకు వారి సహాయకులకి భోజనాన్ని వితరణ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment