new ambedkar bhavan
-
తెలంగాణ వైద్యరంగం దేశానికి ఆదర్శం
నిజామాబాద్ సిటీ: ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ వైద్య రంగం విప్లవాత్మక మార్పుల తో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని న్యూ అంబేడ్కర్ భవన్లో బుధవారం వైద్య ఆరోగ్య దినో త్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎ మ్మెల్యే హాజరై, జ్యోతి వెలిగించి, పోస్టర్లను ఆవిష్క రించారు. సీఎం మార్గదర్శకత్వంలో వైద్య సిబ్బంది కృషితో తెలంగాణ వైద్య రంగం దేశానికి దిక్సూచిగా మారిన శుభసందర్భంగా, వైద్యులకు, వైద్య సిబ్బందికి ఎమ్మెల్యే ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రయివేట్ ఆస్పత్రిలకు ధీటుగా కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నామన్నారు. మన రాష్ట్రంలో అందుతున్న వైద్య సే వల తీరు ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలలో అమలు చే స్తామని ఆ రాష్ట్రాల సీఎంలు కేజ్రీవల్, భగవంత్ మాన్సింగ్ తెలుపటం దీనికి నిదర్శనమన్నారు. ను డా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మహిళ కమిషన్ సభ్యురా లు సూదం లక్ష్మీ, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఇందిరా, డీఎంహెచ్‌వో సుదర్శనం పాల్గొన్నారు. జీజీహెచ్‌లో రోగులకు పండ్ల పంపిణీ వైద్య ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే జీజీహెచ్‌లోని రోగులకు పండ్లు, కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసిన ‘కేసీఆర్ బువ్వ కుండ‘ కేంద్రంలో రోగులకు వారి సహాయకులకి భోజనాన్ని వితరణ చేశారు. -
సదస్సు విఫలం
- ముందస్తు సమాచారం ఇవ్వడంలో అధికారుల నిర్లక్ష్యం - పూర్తి స్థాయిలో హాజరు కాని బీసీ సంచార జాతులు ఇందూరు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచార జాతుల కోసం ఏర్పాటు చేస్తున్న సమీక్షలు, సమావేశాలు తూతూ మంత్రంగానే సాగుతున్నాయి. సమీక్షలు, సదస్సులే ఇలా ఉంటే ఇక సంచార జాతుల స్వావలంబన ఎలా ఉంటుందో మంగళవారం స్థానిక న్యూ అంబేద్కర్ భవన్లో చేపట్టిన సదస్సును చూస్తే తెలుస్తుంది. సంచార జాతుల అభివృద్ధికి ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై సదస్సు నిర్వహించి వారికి అవగాహన కల్పించాలని ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించింది. ఈ బాధ్యతను జిల్లా స్థాయి అధికారి తీసుకుని, సంచార జాతుల వారికి, సంబంధిత అధికారులకు, ముఖ్య అతిథులకు ఒకటి రెండు రోజుల ముందు సమాచారం అందించాలి. ఒక రోజు ముందే కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలి. అరుుతే మంగళవారం నిర్వహించిన సదస్సు గురించి ముందస్తుగా సమాచారం ఇవ్వలేదు. దీంతో సదస్సు విషయం తెలియక జిల్లాలోని బీసీ సంచార జాతుల వారికి తెలియక చాలా మంది సదస్సుకు హాజరు కాలేదు. దాదాపు 36 బీసీ సంచార జాతుల కుస్తులుంటే పది జాతుల లోపే హాజరయ్యారు. దీంతో కుర్చీలన్నీ ఖాళీగా బోసిపోయి కనిపించాయి. బ్యానరు లేదు... ముఖ్య అతిథికి గౌరవం లేదు ఉదయం 10:30 గంటలకు సదస్సు ప్రారంభం కావాలి. కాని సమాచారం లేకపోవడంతో చాల మంది సమయానికి హాజరు కాలేదు. దీంతో సమావేశాన్ని 1 గంటకు వాయిదా వేశారు. ఏజేసీ రాజారాంకు కూడా ఆలస్యంగా సమాచారం ఇవ్వడంతో సదస్సు చాల ఆలస్యంగా ప్రారంభమయింది. అలాగే ప్రభుత్వం తరపున సదస్సు నిర్వహిస్తున్నట్లు కనీసం బ్యానరు కూడా ఏర్పాటు చేయలేదు.కనీసం ప్రభుత్వ పథకాలు తెలిపే విధంగా కర పత్రాలు పంచకుండా సదస్సులో చేతులు దులుపుకోవడంపై అసహనం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. సంచార జాతుల వారికి ప్రత్యేక పథకాలు సంచార జాతుల వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టిందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ రాజారాం సూచించారు. ఆర్థికాభివృద్ధికి బీసీ కార్పోరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలను అందజేస్తున్నట్లు తెలిపారు. బీసీలకు కళ్యాణ లక్ష్మి, సబ్‌ప్లాన్ విషయంలో ప్రభుత్వం ఆలోచించి త్వరలో నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారులు, సంచార జాతుల కులస్తులు, తదితరులు పాల్గొన్నారు. -
జీవుడిలోనే దైవం ఉంది
నిజామాబాద్ కల్చరల్, న్యూస్‌లైన్ : జీవుడిలోనే దైవం ఉందని మత గురువులు పేర్కొన్నారు. ఆధ్యాత్మికతతోనే శాంతి సాధ్యమన్నారు. ఆదివా రం రాత్రి జిల్లాకేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియం ప్రాంగణంలో ఉన్న న్యూ అంబేద్కర్ భవన్లో జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో ఈద్ మిలాప్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ డీఎస్పీ అనిల్‌కుమార్, గౌరవ అతిథులుగా వివిధ మతాల ప్రతినిధులు శక్చంద్ హజూర్ సహాబ్ జ్ఞానీ అమర్జీత్సింగ్, శ్రీరామానంద సరస్వతి, ఫాస్టర్ పాల్, జెమాతె ఇస్లామీ హింద్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ సుబాన్ సాహెబ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని మతాలు దేవుడొక్కడేనని చెబుతున్నాయన్నారు. కాకపోతే మనషుల్లోనే రాగద్వేషాలతో మనస్పర్ధలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రేమతో అందరినీ సంఘటితం చేయొచ్చన్నారు. అన్ని మతాల్లో మంచే ఉందని, హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు మత గ్రంథాలు దానిని బోధిస్తున్నాయని పేర్కొన్నారు. మతగురువులు చెప్పే మంచి మాటలను పెడచెవిన పెట్టడంతోనే అరాచకం పెరిగిపోతోందన్నారు. చెడును రూపు మాపేందుకు అన్ని మతాలవారు ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు. జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర అధ్యక్షుడు ఖాజా అరీఫుద్దీన్ సాహెబ్ అధ్యక్షతన సాగిన ఈ కార్యక్రమంలో సంస్థ నిజామాబాద్ కన్వీనర్ షేక్ హుస్సేన్, నగర అధ్యక్షుడు రహమాన్ దావూదీ తదితరులు పాల్గొన్నారు.