సాక్షి నిజామాబాద్ : నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ తరపున గణేష్ గుప్తా పోటీచేస్తున్న విషయం తెలిసిందే. గణేష్ గుప్తా గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఎంపీ కల్వకుంట్ల కవిత స్వయంగా కారు నడిపి అక్కడున్న వారందర్నీ ఆశ్చర్యంలో ముచెత్తారు. గులాబీ రంగులో ఉన్న అంబాసిడర్ కారును గణేష్ గుప్తా ఇంటి నుంచి నగరపాలక సంస్థ కార్యాలయం వరకు ఆమె డ్రైవింగ్ చేశారు.
మహిళలు డ్రైవింగ్ చేయటం సాధారణమే. కానీ, ఎంపీగా ఉన్న ఓ మహిళ కారు నడపడం, అందులో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ పని చేయడం అందరినీ ఆకర్షించింది. అనంతరం కార్యకర్తలు, అభిమానులు, పార్టీ అభ్యర్థులతో కలిసి పాదయాత్రగా ఎంపీ కవిత తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. కల్వకుంట్ల కవిత, మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి సమక్షంలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ అభ్యర్థిగా గణేష్ గుప్తా, ఆర్మూర్ నియోజకవర్గ అభ్యర్థిగా ఆశన్నగారి జీవన్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు.
కాంగ్రెస్‌లో అసంతృప్తులు..
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ టికెట్‌ను నల్లమడుగు సురేందర్‌కు కేటాయించడం పట్ల వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యకర్తలతో సమావేశమైన సుభాష్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయనున్నట్టు నిర్ణయించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment