trs candidates
-
మున్సిపల్ పోరు: అభ్యర్థులకు కేటీఆర్ దిశానిర్దేశం
సాక్షి, హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థులతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గురువారం నిర్వహించిన ఈ కాన్ఫరెన్స్‌లో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచారం నిర్వహించాల్సిన తీరుపై అభ్యర్థులకు దిశానిర్ధేశం చేశారు. అదే విధంగా వివిధ పట్టణాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. గత ఆరు సంవత్సరాలుగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అందించిందని, ప్రభుత్వం అందించిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేస్తే సరిపోతుందని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వ పథకాలను అభ్యర్థులకు కేటీఆర్ వివరించారు. పెన్షన్ల నుంచి మొదలుకొని సాగునీటి ప్రాజెక్టుల దాకా కేసీఆర్ కిట్లు, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, జిల్లాల వికేంద్రీకరణ.. ఇలా అనేక కార్యక్రమాలను జనాల్లోకి తీసుకెళ్లాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు రూ. 45 వేల కోట్ల రుపాయలతో సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తుందని, పట్టణాల కోసం ఇప్పటికే మిషన్ భగీరథలో భాగంగా బల్క్ వాటర్‌ను అందిస్తున్నామన్నారు.(ఎవరి సత్తా ఏంటో గల్లీలో తేలుతది) పట్టణాల కోసం 3,75,000 వేల ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. పట్టణాలకు ప్రత్యేక నిధులు, కార్పొరేషన్లకు బడ్జెట్లో నిధులు ఇస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్దేనని పేర్కొన్నారు. ఇప్పటికే టీయూఎఫ్ఐడీసీ ద్వారా రూ.25 వందల కోట్ల రూపాయలతో పట్టణాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించామని అన్నారు. స్వచ్, హరిత పట్టణాల కోసం చెత్త తరలింపు ఆటోలు, ఇతర వాహనాలను సమకూర్చారని, ప్రతి పట్టణంలో నర్సరీ ఏర్పాటు చేయడంతోపాటు హరితహార కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో పోల్చితే టీఆర్ఎస్ ప్రభుత్వం పది రెట్లు ఎక్కువ నిధులను ఖర్చు చేసిందని తెలిపారు. కాంగ్రెస్ పాలనను.. టీఆర్ఎస్ పాలనను బేరీజు వేసుకుని ఓటు వేయాలని ప్రజలను కోరాలని అభ్యర్థలకు సూచించారు. నూతన మున్సిపాలిటీ చట్టాన్ని కఠినంగా అమలు చేసి ప్రజలకు మరింత పారదర్శక, వేగవంతమైన పౌర సేవలను అందిస్తామని తెలిపారు.(నన్ను చూసి.. వారికి ఓటేయండి: ఈటల) కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు కొన్ని స్థానాల్లో అభ్యర్థులు కూడా లేనిపరిస్థితి ఉందని ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయం అని ఆశాభావం వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఎన్నికల్లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని సూచించారు. పార్టీ బీ ఫారం కోసం ప్రయత్నం చేసిన తోటి నాయకులతో కలుపుకుని సమిష్టిగా ఐక్యంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలని హితవు పలికారు. పార్టీ అభ్యర్థులు ఈ నాలుగు రోజుల్లో కనీసం మూడు నుంచి అయిదు సార్లు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాల సమాచారాన్ని అందించి ఓట్లు అడగాలని సూచించారు. ప్రతి వార్డు, పట్టణాల అవసరాల మేరకు స్థానిక మేనిఫెస్టోను విడుదల చేయాలని, ఎన్నికలకు సంబంధించి కేంద్ర పార్టీ కార్యాలయం ఎప్పటికప్పుడు నివేదిక తెప్పించుకుంటుందని తెలిపారు. ప్రస్తుత స్థాయి నుంచి నివేదికల ప్రకారం టీఆర్ఎస్ పార్టీకి పురపాలక ఎన్నికలలో విజయం తథ్యమన్నారు. ఫలితాల తర్వాత గెలిచిన అందరూ అభ్యర్థులతో మరోసారి సమావేశం అవుతానని స్పష్టం చేశారు. -
మున్సిపల్ ఎన్నికలు: టీఆర్ఎస్ అభ్యర్థులకు బీ ఫారాల జారీ
-
టీఆర్ఎస్ అభ్యర్థుల ఖరారు!
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువుకు కేవలం రెండ్రోజుల వ్యవధి మాత్రమే మిగిలి ఉండ టంతో అధికార టీఆర్ఎస్ పార్టీ శరవేగంగా పావులు కదుపుతోంది. రిజర్వేషన్ల జాబితా వెలువడిన మరుక్షణం నుంచే అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించిన టీఆర్ఎస్, బుధవారం రాత్రికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను దాదాపు పూర్తి చేసింది. అభ్యర్థుల ఖరారు బాధ్యతను పార్టీ ఎమ్మెల్యేలకు పూర్తి స్థాయిలో అప్పగించడంతో వార్డులు, డివిజన్ల వారీగా రిజర్వేషన్ కేటగిరీలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థుల ఎంపిక కసరత్తు ముగింపు దశకు చేరుకుంది. పార్టీ టికెట్ల కోసం తీవ్ర స్థాయిలో పోటీ ఉండటంతో సర్వే లను ప్రామాణికంగా తీసుకుని ఎంపిక చేస్తున్నట్లు ఆశావహులకు ఎమ్మెల్యేలు సర్దిచెప్తున్నారు. టికెట్లు దక్కని నేత లు ఇతర పార్టీలోకి వెళ్లడమో, స్వతంత్రులుగా బరిలో నిలవడమో జరగకుండా ఎమ్మెల్యేలు బుజ్జగిస్తున్నారు. టికెట్ ఆశించి భంగపడిన ఔత్సాహికులు తమ నిర్ణయాన్ని ధిక్కరించకుండా అధికారిక అభ్యర్థి గెలుపు కోసం పనిచేసేలా నయానో భయానో ఒప్పిస్తున్నారు. మరోవైపు పార్టీ నియమించిన మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జులు కూడా ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయి పరిస్థితిని పార్టీ అధిష్టానానికి నివేదిస్తున్నారు. నేడు తెలంగాణ భవన్లో కీలక భేటీ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి గురువారం టీఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణభవన్‌లో కీలక భేటీ జరగనుంది. ఉదయం 10 గంటలకు జరిగే సమావే శంలో పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు పాల్గొం టారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలో గురువారం కేంద్ర పౌర విమానయాన శాఖ ఆధ్వర్యంలో జరిగే వింగ్స్ ఇండియా 2020 సన్నాహక సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తున్నందున పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు తెలంగాణ భవ న్లో జరిగే సమావేశంలో పాల్గొనే అవకాశం కనిపించడం లేదు. కాగా గురువారం తెలంగాణభవన్‌లో జరిగే సమావేశానికి మున్సిపల్ ఎన్నికలు జరిగే అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. పార్టీ ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం లేని నియోజకవర్గాలకు సంబంధించి నియోజకవర్గ ఇన్చార్జులకు ఆహ్వానం పంపారు. నామినేషన్ల దాఖలుకు తక్కువ సమయం ఉండటంతో బుధవారం రాత్రికే హైదరాబాద్‌కు చేరుకోవాల్సిందిగా పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జులకు పార్టీ కార్యాలయం టీఆర్ఎస్భవన్ నుంచి స్పష్టమైన సందేశం పంపారు. ‘తాండూరు’లో నేతల రాజీ.. తాండూరు మున్సిపాలిటీ పరిధిలో మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి నడుమ టికెట్ల పంపిణీపై నెలకొన్న వివాదాలకు ఫుల్స్టాప్ పడింది. గురువారం తెలంగాణభవన్‌లో కేసీఆర్‌తో జరిగే సమావే శానికి ఎమ్మెల్యే హోదాలో రోహిత్‌రెడ్డికి ఆహ్వానం అందిన నేపథ్యంలో, ఆలోపే ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చాలని పార్టీ అధిష్టానం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే టికెట్ల పంపిణీపై వీరిద్దరి నడుమ బుధవారం రాజీ కుదరడంతో, తలసాని ఇద్దరిని వెంట బెట్టుకుని తెలంగాణభవన్‌కు వచ్చారు. తమ ఇద్దరి నడుమ విభేదాల్లేవని, కలసికట్టుగా పనిచేస్తామని వారితో ప్రకటన ఇప్పించారు. ఎమ్మెల్యేల చేతికి బీ ఫారాలు మున్సిపోల్స్‌లో పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యతను ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించినందున, బీ ఫారాలనూ వారి చేతికే అందజేయాలని పార్టీ నిర్ణయించింది. అభ్యర్థుల ఎంపికలో విపక్ష పార్టీలు అనుసరిస్తున్న తీరు, ప్రచార వ్యూహంపై ఇప్పటికే వివిధ వర్గాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా, టీఆర్ఎస్ అనుసరించాల్సిన ప్రచార వ్యూహంపై పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఇన్చార్జులకు దిశానిర్దేశం చేస్తారు. అభ్యర్థుల ఎంపికలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనుసరిస్తున్న తీరునూ రాష్ట్రస్థాయిలో పార్టీ అధిష్టానం నిశితంగా పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికలో తడబడుతున్న కొందరు ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ సూచనలు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి ఎమ్మెల్యేలు, ఇన్చార్జులకు ‘ఏ’ఫారాలు, ‘బీ’ఫారాలు అందజేస్తారు. -
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా.. పట్నం, పోచంపల్లి, తేరా
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు టీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారయ్యారు. టీఆర్ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆది వారం సాయంత్రం అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. వరంగల్ స్థానానికి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, రంగారెడ్డి స్థానానికి పట్నం మహేందర్‌రెడ్డి, నల్లగొండ స్థానానికి తేరా చిన్నపరెడ్డిలను అభ్యర్థులుగా ఎంపిక చేశారు. మూడు జిల్లాల మంత్రులు, ముఖ్యనేతలు, ముగ్గురు అభ్యర్థులు ఆదివారం మధ్యాహ్నం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. అనంతరం కేటీఆర్ వీరిని సీఎం కేసీఆర్ దగ్గరికి తీసుకెళ్లారు. అభ్యర్థుల ఖరారును అధికారికంగా సీఎం వారితో చెప్పారు. మూడు స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం పని చేయాలని ఆదేశించారు. అభ్యర్థులకు బీ–ఫామ్‌లు అందజేశారు. మంత్రులు సమన్వయంతో పనిచేసి ఎన్నికల బాధ్యతలను నిర్వర్తించాలని సూచించారు. ప్రజలు ఓటేస్తున్న అన్ని ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ గెలుస్తోందని.. ప్రజాప్రతినిధులు ఓటేసే ఈ ఎన్నికల్లోనూ అదే ఫలితాలు రావాలని సీఎం సూచించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు ఓటర్లతో సమన్వయం చేయా లని అన్నారు. ఓటర్లుగా ఉండే జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో నేరుగా మాట్లాడాలని అభ్యర్థులను ఆదేశించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, జి.జగదీశ్‌రెడ్డి, చామకూర మల్లారెడ్డి తదితరులు సీఎం కేసీఆర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. నేడు నామినేషన్లు.. వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు మంగళవారంతో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది. కాగా సోమవారం మంచిరోజు కావడంతో ఈ ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. 2015లో జరిగిన సాధారణ ఎన్నికలలో కొండా మురళీధర్‌రావు (వరంగల్), కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (నల్లగొం డ), పట్నం నరేందర్‌రెడ్డి (రంగారెడ్డి) స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేలుగా ఎన్నికైనందున రాజగోపాల్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి.. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారడంతో కొండా ముర ళీధర్‌రావు డిసెంబరులో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఈ మూడింటికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. గత ఎన్నికలలో వరంగల్ టీఆర్ఎస్ అభ్యర్థి మురళీధర్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రంగారెడ్డి ఎమ్మెల్సీ స్థానాన్ని టీఆర్ ఎస్, నల్లగొండ స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకున్నాయి. అభ్యర్థుల వివరాలు ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల మండలం వరికోల్ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి సొంత ఊరు. పూణేలోని వీకే పటేల్ ఫౌండేషన్ కాలేజీలో ఎంబీఏ చదివారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌లతో ఒకే రూమ్‌లో ఉండేవారు. 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో పని చేస్తున్నారు. ఉద్యమ సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు అండగా నిలిచారు. వారిని జైలు నుండి బయటికి తీసుకురావడంలో అనేకసార్లు కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా పని చేస్తున్నారు. వరంగల్ స్థానిక సంస్థల ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా శ్రీనివాస్‌రెడ్డిని కేసీఆర్ ఎంపిక చేశారు. ►ఉమ్మడి రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం గొల్లూరుగూడ పట్నం మహేందర్‌రెడ్డి సొంత గ్రామం. టీడీపీలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1994, 1999, 2009 ఎన్నికలలో తాండూరులో టీడీపీ తరుఫున ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల ముందు టీఆర్ఎస్లో చేరి ఆ పార్టీ తరుపున తాండూరులో ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 నుంచి 2018 వరకు కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయారు. రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికయ్యారు. పట్నం మహేందర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయన సోదరుడు పట్నం నరేందర్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు. నరేందర్‌రెడ్డి గెలిచారు. మహేందర్‌రెడ్డి ఓడిపోయారు. తాజాగా నరేందర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తుండగా.. మహేందర్‌రెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. ►తేరా చిన్నపరెడ్డి సొంత ఊరు ఉమ్మడి నల్లగొండ జిల్లా పెదవూర మండలం పినవూర. ఆయన టీడీపీలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2009లో నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానంలో 2014 నల్లగొండ లోక్‌సభ స్థానంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2015లో నల్లగొండ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అదే స్థానానికి ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా చిన్నపరెడ్డిని అధినేత కేసీఆర్ ఎంపిక చేశారు. -
నేడు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు టీఆర్ఎస్ ఆదివారం అభ్యర్థులను ప్రకటించనుంది. వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల స్థానిక సంస్థలకు మంగళవారం నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగియనుంది. అభ్యర్థుల ఖరారుపై సీఎం కేసీఆర్ మూడు జిల్లాల మంత్రులతో మాట్లాడారు. ఈమేరకు శనివారం మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, జి.జగదీశ్‌రెడ్డి, సి.హెచ్.మల్లారెడ్డిలు ప్రగతి భవన్లో కేసీఆర్‌ను కలిశారు. మూడు జిల్లాల నుంచి ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్న వారి పేర్లను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా రాజకీయ పరిస్థితులను మంత్రులు వివరించారు. అభ్యర్థులు ఎవరైనా కచ్చితంగా గెలిచేలా మంత్రులు బాధ్యతలు తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. ఓటర్ల సంఖ్యకనుగుణంగా ఎన్నికల వ్యూహం ఉండాలని సూచించారు. -
వలస ఓటర్లు ఓటేస్తారా?
సాక్షి, హైదరాబాద్: గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపిన వలస ఓటర్లు ఈ మారు ఎంతమేర ప్రభావం చూపుతారన్నది ప్రస్తు తం ప్రధానాంశంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25 లక్షల మంది వరకు పొరుగు రాష్ట్రాలు, పట్టణాల్లో ఉన్న వలస ఓటర్లు ఉన్నారు. వీరు సొంత గ్రామాలకు తరలివచ్చి ఏ మేరకు ఓటు వినియోగించుకుంటారన్నది కీలకం కానుంది. ప్రస్తుతం వలస ఓటర్లను పోలింగ్‌బూత్‌కు రప్పించేందుకు టీఆర్ఎస్ అభ్యర్థులు కొంత మేర చొరవ చూపగా, ఇతర పార్టీ లు వారిని పట్టించుకున్న దాఖలాల్లేవు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చూపిన ఉత్సాహం ఈసారి వలస ఓటర్లలో కనిపించకపోవడంతో ఈ ప్రభావం గెలుపోటములపై ఏమాత్రం ఉంటుందన్నది ప్రశ్నగా మారింది. అప్పుడైతే పోటెత్తారు.. ఇప్పుడేమిటో? డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ, తాజా పంచాయతీ ఎన్నికల్లో వలస ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోటెత్తారు. ఆ ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకంగా మారడంతో వలస ఓటర్ల లెక్క లు తీసి వారికి సకల సౌకర్యాలు సమకూర్చి పార్టీలు పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చాయి. నారాయణపేట, మక్తల్, గద్వాల, అలంపూర్, జుక్కల్, నారాయణఖేడ్, జహీరాబాద్, ఆదిలాబాద్, బోధ్, నిర్మల్, వికారాబాద్, కొల్లాపూర్, మెదక్, సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్లు పెద్ద సంఖ్యలో కర్ణాటక, మహారాష్ట్రల్లో ఉండటంతో వారిని రప్పించేందుకు ప్రత్యేకంగా బస్సు వసతి కల్పించి తీసుకొచ్చారు. దీనికి తోడు హైదరాబాద్‌లో సెటిలైన ఓటర్లు తమ పల్లెలకు తరలి ఓటు వినియోగించుకున్నారు. మొత్తంగా 25 లక్షల మంది వలస ఓటర్లు పోలింగ్‌లో పాల్గొనడంతో రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం 85 నుంచి 94శాతం పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం పార్టీలు వలస ఓటర్లపై పెద్దగా శ్రద్ధ పెట్టినట్లు కనిపించడం లేదు. ఒక్క అధికార పార్టీ మాత్రం పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా మెజార్టీ ఎంత ఉండాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది. భారీ మెజార్టీ రావాలంటే అందుకు తగ్గట్టే పోలింగ్ శాతం పెరగాలని, వలస ఓటర్లపై దృష్టి పెట్టాలని అభ్యర్థులను ఆదేశించింది. -
టీఆర్ఎస్ వ్యూహాత్మక జాప్యం
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన విషయంలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల అంచనాలకు అందకుండా క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసుకుంటూనే అభ్యర్థుల ప్రకటనలో జాప్యం చేస్తున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం నుంచి లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు. ఆలోపే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని టీఆర్ఎస్లోని ఎంపీ టికెట్ ఆశావహులు, ఎమ్మెల్యేలు భావించారు. అయితే, అభ్యర్థుల ప్రకటనతో సంబంధం లేకుండానే కరీంనగర్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. అనంతరం ఈ నెల 19న నిజామాబాద్‌లో నిర్వహించే బహిరంగసభలో పాల్గొననున్నారు. నిజామాబాద్ బహిరంగసభకు ముందు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంటుందని టీఆర్ఎస్ ముఖ్యనేతలు చెబుతున్నారు. అయితే, దీనిపై మాత్రం ఇప్పటికీ స్పష్టత లేదని అంటున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థుల ఖరారులో సీఎం కేసీఆర్ తనదైన శైలితో వ్యవహరిస్తున్నారని పార్టీ ముఖ్యులు వ్యాఖ్యానిస్తున్నారు. 16 లోక్‌సభ స్థానాల్లో విజయానికి అవసరమైన వ్యూహాలను సిద్ధం చేస్తున్నారని చెబుతున్నారు. సిట్టింగ్లతో భేటీ డౌటే టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలతో కేసీఆర్ సమావేశం ఉంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, ఈ సమావేశం సైతం ఉండబోదని తెలిసింది. సీఎం కేసీఆర్ ప్రస్తుతం సొంత నియోజకవర్గంలోనే ఉన్నారు. అక్కడి నుంచే కరీంనగర్ బహిరంగసభకు వెళ్తారని తెలుస్తోంది. ఆ తర్వాతే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల తరహాలో టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన ముందస్తుగానే ఉంటుందని భావించిన సిట్టింగ్ ఎంపీలు, ఆశావహులలో ప్రస్తుత జాప్యం వల్ల వారిలో ఆందోళన పెరుగుతోంది. నియోజకవర్గంలో ప్రచార ఏర్పాట్లను పక్కనబెట్టి హైదరాబాద్‌లో కేసీఆర్ పిలుపు కోసం వీరంతా వేచి చూస్తున్నారు. నామినేషన్ల దాఖలు ప్రక్రియ మార్చి 18న మొదలుకానుంది. అరోజు వరకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన ఆలస్యమైతే టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన సైతం మరింత ఆలస్యం కానుంది. సిట్టింగ్ ఎంపీల్లో గరిష్టంగా ముగ్గురికి మళ్లీ అవకాశం ఉండబోదని తెలుస్తోంది. ఖమ్మం, మహబూబ్‌నగర్ సిట్టింగ్‌లకు తిరిగి అవకాశం ఇచ్చే విషయంపై కేసీఆర్ ఇంకా తుది నిర్ణయానికి రాలేదని సమాచారం. ఖమ్మంలో సిట్టింగ్ ఎంపీ స్థానంలో మరో సామాజికవర్గానికి చెందిన వారికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది. మిగిలిన రెండు స్థానాల్లో కొత్తవారికి అవకాశం ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నారు. -
చాన్స్ దక్కేనా?
జోగిపేట(అందోల్): కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ పదవీకాలం ముగియడంతో ఆ స్థానానికి తిరిగి మార్చిలో ఎన్నికలు జరుగనున్నాయి. స్వామిగౌడ్ ఈ స్థానం నుంచి తిరిగి పోటీ చేయకపోవచ్చని, ఆయన లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిత్వం కోసం ఆశావహులు ఎవరికి వారు తమ ప్రయత్నాలు సాగిస్తున్నారు. పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల పేర్లను సీఎం కేసీఆర్ బుధవారం ప్రకటించే అవకాశముందన్న నేపథ్యంలో జిల్లా నుంచి ఎవరికి బెర్త్ దక్కుతుందోనని ఎదురు చూస్తున్నారు. ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ, సరోజినిదేవి కంటి ఆస్పత్రి మాజీ సూపరింటెండెంట్ ఎస్.రవీందర్‌గౌడ్ ఎవరికి వారు ప్రయత్నాలు సాగిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకపాత్ర పోషించిన సీనియర్ జర్నలిస్టు ఆర్.సత్యనారాయణ ఎమ్మెల్సీగా ఎన్నికై ఆరు సంవత్సరాల పదవీకాలం ఉన్నా పార్టీ అధినేత కేసీఆర్ పిలుపునివ్వడమే తడువుగా గెలిచిన ఆరు నెలల్లోనే ఆరేళ్లపాటు ఉండే పదవికి రాజీనామా చేశారు. తిరిగి ఆ స్థానానికి ఎన్నికలు జరిగినా అధిష్టానం నిర్ణయానుసారం ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2013లో ఈ స్థానం నుంచి స్వామిగౌడ్ ఎన్నికయ్యారు. దీంతో సత్యనారాయణ సంగారెడ్డి ఎమ్మెల్యే టికెట్‌ను ఆశించారు. తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యేకే అవకాశం ఇవ్వడంతో ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ తరఫున టికెట్‌ను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పోటాపోటీగా ప్రయత్నాలు ఈసారి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి చాలామంది పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. ఎవరికి వారు తమ నాయకుల ద్వారా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, సరోజిని దేవి ఆస్పత్రి మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ రవీందర్‌గౌడ్‌తో పాటు కరీంనగర్ మేయర్ రవీందర్‌సింగ్, గ్రూపు–1అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్, తెలంగాణ ప్రైవేట్ విద్యా సంస్థల సంఘం (ట్రెస్మా) ప్రధాన కార్యదర్శి శేఖర్‌రావు ఈ లిస్ట్‌లో ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్‌పార్టీ నుంచి జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పోటీ చేయనున్నట్లు ప్రకటనలు రావడంతో పోటీ ఆసక్తికరంగా ఉండొచ్చని భావిస్తున్నారు. -
ఆ గ్రామానికి మెదటి సర్పంచ్‌గా..
కట్టంగూర్ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా కట్టంగూర్ మండలంలో 22 జీపీలకు నూతనంగా ఏర్పడిన రామచంద్రాపురం గ్రామం ఏకగ్రీవం అయ్యింది. రామచంద్రాపురం గ్రామానికి మెదటి సర్పంచ్‌గా టీఆర్ఎస్ అభ్యర్థి సూరారపు ప్రియాంకగణేశ్ ఎన్నికకావడం పట్ల ఆ గ్రామ ప్రజలు, వైస్‌ఎంపీపీ బొడ్డుపల్లి జానయ్య శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఈనెల 30న 22 జీపీలకు గాను 21 జీపీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఉపసంహరణల ప్రక్రియ మంగళవారం ముగిసింది. మండలంలోని 22 జీపీలకు 121 మంది సర్పంచ్‌లు నామినేషన్ వేయగా 57 మంది ఉపసంహరించుకోవడంతో 64 మంది బరిలో ఉన్నారు. 206 వార్డులకు గాను 631 నామినేషన్లు వేయగా 158 మంది ఉపసంహరించుకోగా 473 మంది వార్డు సభ్యులు బరిలో ఉన్నారు. రామచంద్రాపురం గ్రామంలో 8 వార్డులు సభ్యులు నందికొండ పార్వతమ్మ, రేకల చందన, సూరారపు మహేందర్, మహేశ్వరం మహేందర్, బొడ్డుపల్లి రేణుక, నీలం గణేశ్, అనంతుల సురేశ్, బోయపల్లి పద్మ, మల్లారం గ్రామంలో 5 వార్డులు, కట్టంగూర్ గ్రామంలో 13వ వార్డు సభ్యులు నిమ్మల యాదయ్య, గార్లబాయిగూడెం గ్రామంలో 6వ వార్డు, నల్లగుంటబోలు గ్రామంలో 6 వార్డులు చొప్పున మొత్తం 21 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. బరిలో ఉన్న సర్పంచ్‌లకు, వార్డు సభ్యులకు గుర్తులు కేటాయించడంతో గ్రామాల్లో ఎన్నికల వాతావరణం వేడిక్కింది. -
పోలింగ్ పెరగాలి: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేలా చర్యలు తీసు కోవాలని సీఎం కె. చంద్రశేఖర్‌రావు టీఆర్ఎస్ అభ్యర్థులను ఆదేశించారు. నియోజక వర్గాల్లో ఎక్కువ మంది ఓటు వేసేలా పార్టీ నేతలతో, కార్యకర్తలతో సమన్వయం చేసు కోవాలని సూచించారు. ఓటింగ్ శాతం పెరి గితే టీఆర్ఎస్కు గెలుపు అవకాశాలు పెరుగు తాయని అన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం పలువురు పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో పోలింగ్ ముందు రోజు సరళిపై సేకరించిన సమాచారాన్ని పరిశీలించారు. ఈ నివేదికల ఆధారంగా అభ్యర్థులకు సూచనలు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు కచ్చితంగా ఓటింగ్‌లో పాల్గొనేలా గ్రామస్థాయిలో చర్యలు తీసుకోవాలని సూచించారు. లబ్ధిదారులు ఓటింగ్‌లో పాల్గొంటే గెలుపు సునాయాసం అవుతుందని చెప్పారు. పోలింగ్ శాతం ఎంత పెరిగితే టీఆర్ఎస్కు అంత ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అందరు అభ్యర్థులు పోలింగ్ రోజున నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించాలని అన్నారు. టీఆర్ఎస్ శ్రేణులు, ద్వితీయశ్రేణి నేతల నుంచి వచ్చే సమాచారంపై ఎప్పటికప్పడు స్పందించాలని ఆదేశించారు. గ్రామాల్లో పోలింగ్ ఊహించినట్లుగానే ఉంటుందని... పట్టణాలు, నగరాల్లో ఓటింగ్ శాతం పెరిగేందుకు టీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించేలా అభ్యర్థులు చొరవ తీసుకోవాలని సూచించారు. ప్రచారం పూర్తి చేసిన తర్వాత వచ్చిన సమాచారం ప్రకారం టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత ఉందని చెప్పారు. కాగా పోలింగ్ పరిస్థితులను పర్యవేక్షించి ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకునేందుకు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక బృందాన్ని సిద్ధం చేసింది. అభ్యర్థులతో ఈ బృందం ఎప్పటికప్పుడు సమన్వయం చేయనుంది. -
నామినేషన్ కార్యక్రమంలో కారు నడిపిన ఎంపీ కవిత
-
టీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్.. ఆసక్తికర దృశ్యం
సాక్షి నిజామాబాద్ : నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరపున గణేష్ గుప్తా పోటీచేస్తున్న విషయం తెలిసిందే. గణేష్ గుప్తా గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఎంపీ కల్వకుంట్ల కవిత స్వయంగా కారు నడిపి అక్కడున్న వారందర్నీ ఆశ్చర్యంలో ముచెత్తారు. గులాబీ రంగులో ఉన్న అంబాసిడర్ కారును గణేష్ గుప్తా ఇంటి నుంచి నగరపాలక సంస్థ కార్యాలయం వరకు ఆమె డ్రైవింగ్ చేశారు. మహిళలు డ్రైవింగ్ చేయటం సాధారణమే. కానీ, ఎంపీగా ఉన్న ఓ మహిళ కారు నడపడం, అందులో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ పని చేయడం అందరినీ ఆకర్షించింది. అనంతరం కార్యకర్తలు, అభిమానులు, పార్టీ అభ్యర్థులతో కలిసి పాదయాత్రగా ఎంపీ కవిత తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. కల్వకుంట్ల కవిత, మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి సమక్షంలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ అభ్యర్థిగా గణేష్ గుప్తా, ఆర్మూర్ నియోజకవర్గ అభ్యర్థిగా ఆశన్నగారి జీవన్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్‌లో అసంతృప్తులు.. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ టికెట్‌ను నల్లమడుగు సురేందర్‌కు కేటాయించడం పట్ల వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యకర్తలతో సమావేశమైన సుభాష్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయనున్నట్టు నిర్ణయించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
టీఆర్ఎస్ జాబితాలో ఏ వర్గానికి ఎన్ని సీట్లు?
టీఆర్ఎస్ ఇప్పటివరకు ప్రకటించిన 117 సీట్లలో ఓసీలకు 58, బీసీలకు 24, ఎస్సీలకు 19, ఎస్టీలకు 12, ముస్లింకు 3, సిక్కు వర్గానికి ఒకటి చొప్పున స్థానాలను కేటాయించింది. టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో సామాజికవర్గాల వారీగా వివరాలివి.. రెడ్డి – 37, వెలమ– 12, కమ్మ– 6, బ్రాహ్మణ– 1, వైశ్య– 1, ఠాకూర్ –1, మున్నూరుకాపు– 8, గౌడ– 6, యాదవ– 5, ముదిరాజ్– 1, పద్మశాలి– 1, విశ్వబ్రాహ్మణ –1, పెరిక– 1, వంజర– 1, మాదిగ– 11, మాల– 7, నేతకాని– 1, లంబాడ–7, కోయ–4, గోండు–1, ముస్లిం–3, సిక్కు–1. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి మరో పది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు ఈ మేరకు బుధవారం రాత్రి ప్రకటన జారీ చేశారు. కోదాడ, ముషీరాబాద్ స్థానాలకు ఒకటిరెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలిపారు. తాజాగా ప్రకటించిన జాబితాతో టీఆర్ఎస్ అభ్యర్థుల సంఖ్య 117కు చేరింది. సెప్టెంబర్ 6న ఒకేసారి 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అక్టోబర్ 21న మలక్‌పేట, జహీరాబాద్ స్థానాల అభ్యర్థులను ఖరారు చేశారు. తాజాగా పది మంది పేర్లతో జాబితా విడుదల చేశారు. మల్కాజ్గిరి లోక్‌సభ సభ్యుడు చామకూర మల్లారెడ్డికి మేడ్చల్ స్థానంలో అవకాశం కల్పించారు. గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్‌ను వరంగల్ తూర్పు అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఎమ్మెల్సీ మైనంపల్లి హనుమంతరావును మల్కాజ్‌గిరిలో పోటీకి దింపారు. అనూహ్యంగా చార్మినార్ స్థానంలో ముస్లిం అభ్యర్థిని ఎంపిక చేశారు. రాజేంద్రనగర్‌లో ఎంఐఎం పార్టీ అభ్యర్థిని ప్రకటించడం వల్లే చార్మినార్‌లో ముస్లిం అభ్యర్థిని ప్రకటించినట్లు తెలుస్తోంది. కోదాడకు వేనపల్లి చందర్రావు, ముషీరాబాద్‌కు ముఠా గోపాల్ పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. టీఆర్ఎస్ ఇప్పటి వరకు ప్రకటించిన 117 సీట్లలో ఓసీలకు 58, బీసీలకు 24, ఎస్సీలకు 19, ఎస్టీలకు 12, ముస్లింకు 3, సిక్కు వర్గానికి ఒకటి చొప్పున స్థానాలను కేటాయించింది. అభ్యర్థుల తాజా జాబితా ఇదీ మేడ్చల్ – చామకూర మల్లారెడ్డి, గోషామహల్ – ప్రేమ్‌సింగ్‌రాథోడ్, చార్మినార్ – మహ్మద్ సలావుద్దీన్ లోడీ, వరంగల్ తూర్పు – నన్నపునేని నరేందర్, హుజూర్నగర్ – శానంపూడి సైదిరెడ్డి, వికారాబాద్ – డాక్టర్ మెతుకు ఆనంద్, అంబర్‌పేట – కాలేరు వెంకటేశ్, మల్కాజ్గిరి – మైనంపల్లి హనుమంతరావు, చొప్పదండి – శొంకె రవిశంకర్, ఖైరతాబాద్ – దానం నాగేందర్ -
ప్రచార దూకుడు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ఎన్నికల ప్రచారం జోరందుకుంది.. సమ యం సమీపిస్తుండడం, దసరా హడావుడి ముగియడంతో ప్రజలను మచ్చిక చేసుకోవడం కోసం అన్ని రాజకీయపార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. ఇప్పటికే నెలన్నర రోజులుగా ప్రజాక్షేత్రంలో ఉన్న టీఆర్ఎస్ రూటు మారుస్తోంది. హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ భవన్లో ఆదివారం సీఎం కేసీఆర్ పార్టీ అభ్యర్థులకు చేసిన పలు సూచనల మేరకు ప్రచార పర్వాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. అలాగే ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ దూకుడు పెంచింది. అదే విధంగా కాంగ్రెస్ తరఫున దాదాపు టికెట్లు ఖరారు అనుకున్న నేతలు కూడా ప్రచారపర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇక ప్రచారానికి ఊపు తీసుకొచ్చేందుకు వీఐపీల పర్యటనలు కూడా పెరుగుతున్నాయి. అందులో భాగంగా మంగళవారం జరగనున్న నారాయణపేట, మహబూబ్‌నగర్, మక్తల్ నియోజకవర్గాల బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశాలకు కేంద్ర మంత్రి ఎం.నడ్డా, ఆ పార్టీ శాసనసభాపక్ష మాజీ నేత జి.కిషన్‌రెడ్డి హాజరుకానున్నారు. అలాగే, ఈనెల 24న బుధవారం నాగర్‌కర్నూల్‌లో జరిగే టీఆర్ఎస్ యువ గర్జన సమావేశానికి మంత్రి హరీశ్‌రావు హాజరవుతున్నారు. ఇలా మొత్తం మీద సార్వత్రిక ఎన్నికల మలి విడత ప్రచారం జోరందుకుంది. వ్యూహం మారుస్తున్న టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని ప్రణాళికాబద్ధంగా ముందు కు తీసుకెళ్లాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మెజారిటీ స్థానాలు గెలుపొందాలన్న లక్ష్యంతో పార్టీ అధి ష్టానం పావులు కదుపుతోంది. అందులో భాగం గా పాలమూరు ప్రాంతంలోని నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ భవన్లో ఆదివారం సీఎం కేసీఆర్... బరిలో నిలిచే అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. ప్రతీ నియోజకవర్గంలో ప్రభుత్వం తరఫున లబ్ధి పొందిన వారిని అభ్యర్థులు కలిసి ఓటు అభ్యర్థించాలని సూచించారు. అందులో భాగంగా ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, సీఎం రిలీప్ ఫండ్, వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన జాబితానుగ్రామాల వారీగా సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారందరికీ సీఎం కేసీఆర్ పేరుతో రాసిన లేఖలను కూడా అందజేయాలని నిర్ణయించారు. అంతేకాదు కార్యకర్తలందరితో సమావేశాలు ఏర్పాటుచేసి ఓటింగ్ విధానంపై శిక్షణ ఇస్తున్నారు. ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వారిని పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చేలా చూడాలని సూచించారు. అంతేకాదు కార్యకర్తల్లో జోష్ నింపేందుకు తరచుగా పార్టీ ముఖ్యనేతల పర్యటనలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఈ నెల 24న నాగర్‌కర్నూల్‌లో నిర్వహించనున్న టీఆర్ఎస్ యువగర్జన సమావేశానికి హాజరవుతున్నారు. అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ ఓట్లు, సీట్లే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ కూడా దూకుడు పెంచింది. నవరాత్రి ఉత్సవాలు ముగియడం, అభ్యర్థుల ప్రకటన నేపథ్యంలో వ్యూహాలకు పదును పెడుతోంది. ఉమ్మడి జిల్లాలో ఎలాంటి వివాదాలు లేకుండా సింగిల్ అభ్యర్థిత్వం ఉన్న వాటికి అభ్యర్థులను ఖరారు చేసిన విషయం తెలిసిందే. కల్వకుర్తికి తన్నోజు ఆచారి, అచ్చంపేటకు మల్లేశ్వర్, గద్వాలకు రాజా వెంకటాద్రిరెడ్డి, మక్తల్‌కు కొండయ్య, నారాయణపేటకు రతంగ్‌పాండురెడ్డి అభ్యర్థిత్వాలను అధిష్టానం ప్రకటించింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ప్రచార పర్వాన్ని ముమ్మరం చేసింది. ఈసారి పోటాపోటీ ఉన్న నేపథ్యంలో కొన్ని స్థానాలైనా గెలుపొందాలని కమలం పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అనుగుణంగా ఇప్పటికే క్షేత్రస్థాయిలో కార్యాచరణ చేపట్టింది. కార్యకర్తలను మరింత అప్రమత్తం చేసేందుకు పార్టీ ముఖ్యులు రంగంలోకి దిగారు. నారాయణపేట నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి రతంగ్‌పాండు రెడ్డికి మద్దతుగా ప్రచారం కోసం మంగళవారం తాజా మాజీ ఫ్లోర్ లీడర్ జి.కిషన్‌రెడ్డి రానున్నారు. నియోజకవర్గంలోని మొత్తం 263 బూత్‌ల ఉండగా.. ఒక్కొక్క బూత్‌నుంచి 25 మంది ముఖ్య కార్యకర్తలు పాల్గొనేలా చర్యలు చేపట్టారు. ఇలా మొత్తం మీద ఒక్క నియోజకవర్గం నుంచి 7వేల మంది కార్యకర్తలతో సమావేశం ఏర్పాటుచేసి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని చర్చించనున్నారు. అలాగే, మక్తల్, మహబూబ్‌నగర్‌లో కూడా మంగళవారమే సమావేశాలు ఏర్పాటుచేశారు. ఈ సమావేశాలకు కేంద్ర మంత్రి నడ్డా, కిషన్‌రెడ్డి హాజరుకానున్నారు. ఇలాగే ప్రతీ నియోజకవర్గంలో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి ఎన్నికల ఫలితాలు పొందేందుకు కసరత్తు చేస్తున్నారు. ‘హస్తం’లో ఉత్సాహం పాలమూరు ప్రాంతంలో కాంగ్రెస్‌కు బలమైన ఫునాది ఉండడంతో మంచి ఫలితాలు సాధించాలని కసరత్తు చేస్తోంది. ఇప్పటికే జిల్లాలో కాంగ్రెస్ చైతన్యయాత్రను దాదాపు అన్ని నియోజకవర్గాల మీదుగా చేపట్టడంతో కార్యకర్తల్లో జోష్ నెలకొంది. ఎన్నికల బరిలో ఎవరెవరు బరిలో నిలుస్తారో అధిష్టానం ప్రకటించకపోయినా.. చూచాయగా పేర్కొనడంతో ఆయా అభ్యర్థులు ప్రచారంలో మునిగిపోయారు. కొన్ని నియోజకవర్గాల్లో అధికార టీఆర్ఎస్ ధీటుగా కాంగ్రెస్ అభ్యర్థులు కూడా ప్రచారాన్ని చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఆరు నియోజకవర్గాలు గద్వాల, కొడంగల్, వనపర్తి, అచ్చంపేట, అలంపూర్, కల్వకుర్తిలో అభ్యర్థులెవరనేది స్పష్టం కావడంతో వారు ప్రచారంలో మునిగిపోయారు. అలాగే మిగతా కొన్ని నియోజకవర్గాల్లో ఇన్చార్జిలుగా ఉన్న వారు ప్రచారం చేసుకుంటున్నారు. తాజాగా రాష్ట్రంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సుడిగాలి పర్యటనతో కేడర్‌లో జోష్ వచ్చినట్లయింది. త్వరలో మరో సారి రాహుల్ రాష్ట్రానికి రానుండడంతో కాంగ్రెస్ నేతలు ఉత్సాహంతో ప్రచారంలో నిమగ్నమయ్యారు. -
మేనిఫెస్టో అదిరింది
సాక్షి, హైదరాబాద్: ముందస్తు ఎన్నికల్లో విజయంపై తెలంగాణ రాష్ట్ర సమితిలో జోష్ పెరిగింది. పాక్షిక మేనిఫెస్టో ప్రకటనతో టీఆర్ఎస్పై ప్రజల్లో ఒక్కసారిగా సానుకూల స్పందన పెరిగిందని టీఆర్ఎస్ అంచనాకు వచ్చింది. టీఆర్ఎస్ అభ్యర్థులు, నేతలు, వివిధ సంస్థలతోపాటు నిఘావర్గాలు ఇచ్చిన స్పందనలోనూ మేనిఫెస్టోపై అన్ని వర్గాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయని సమాచారం వచ్చింది. ముందస్తు ఎన్నికల్లో ముందున్న తమ పార్టీకి పాక్షిక మేనిఫెస్టోతో మరింత ఊపు వచ్చిందని టీఆర్ఎస్ భావిస్తోంది. తెలంగాణ భవన్లో మంగళవారం సాయంత్రం పాక్షిక మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత సీఎం కేసీఆర్ పలువురు టీఆర్ఎస్ అభ్యర్థులతో ఫోన్లో మాట్లాడారు. బుధవారం సైతం స్పందనలు తెలుసుకున్నారు. పాక్షిక మేనిఫెస్టోపై ప్రజల్లో ఎలాంటి చర్చ జరుగుతోందని ఆరా తీయగా బాగా అనుకూల స్పందన ఉందని అభ్యర్థులు వివరించారు. ‘రుణమాఫీ, రైతుబంధు, రైతుబీమా పథకాలతో రైతులందరూ టీఆర్ఎస్ వెంటే ఉన్నారు. రుణమాఫీ మరోసారి చేస్తామనే హామీ గొప్ప నిర్ణయం. 42 లక్షలకు మరోసారి గొప్ప ఉపశమనం కలుగుతుంది. రైతుబంధు సాయాన్ని ఎకరాకు రూ.10 వేలకు పెంచడంతో మరింత మేలు జరుగుతుంది. రైతులు గ్రామాల నుంచి మాకు ఫోన్లు చేస్తున్నారు. కేసీఆర్‌కే మా మద్దతు అని చెబుతున్నారు. గ్రామాల్లో అద్భుత స్పందన ఉంది’అని పలువురు అభ్యర్థులు సీఎం కేసీఆర్‌కు వివరించారు. ఆసరా పింఛన్ల పెంపుతో అన్నివర్గాల్లోని ప్రజల్లో కేసీఆర్‌పట్ల కృతజ్ఞతాభావం ఏర్పడిందని పలువురు వివరించారు. ఆసరా పింఛన్ల పెంపు ఉంటుందని ఆశించాం, అయితే, వయోపరిమితిని తగ్గించడం గొప్ప నిర్ణయం. 57 ఏళ్లు దాటినవారందరికీ పింఛన్లు ఇస్తామని చెప్పడంతో ఆధారంలేని వారికి ఆసరా దొరికింది. కొత్త నిర్ణయంతో మరో ఎనిమిది లక్షల మందికి బతుకుపై భరోసా పెరుగుతుంది’అని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ పథకంపై ఎక్కువ చర్చ జరుగుతోందని ఆదిలాబాద్, వరంగల్ ఉమ్మడి జిల్లాల అభ్యర్థులు వివరించారు. రూ.16 వేల కోట్లతో చేపట్టే ఈ పథకం విధివిధానాలు వెల్లడించాక ప్రజల్లో స్పందన మరింత పెరుగుతుందని చెప్పారు. భృతిపై యువతకు భరోసా... టీఆర్ఎస్ అభ్యర్థులతో కాకుండా నిఘా వర్గాలతో, ప్రైవేటు సంస్థలతోనూ పాక్షిక మేనిఫెస్టోపై ప్రజల స్పందనను సీఎం కేసీఆర్ తెలుసుకున్నారు. ఈ సంస్థలు సేకరించిన సమాచారం ప్రకారం నిరుద్యోగభృతి విషయంలో ఎక్కువమంది యువకులు సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హామీని కచ్చితంగా అమలు చేస్తారనే నమ్మకముందని, ఎక్కువమంది యువకులు దీనిపై సానుకూలంగా ఉన్నారని నివేదికలో తేలింది. నిరుద్యోగభృతి చెల్లింపు విషయంలో కేసీఆర్‌పై నమ్మకముందని టీఆర్ఎస్ అధిష్టానానికి సమాచారమందింది. ప్రతి నెలా రూ.3,016 చొప్పున భృతి చెల్లింపు వల్ల నిరుద్యోగుల్లో మానసిక స్థైర్యం ఉంటుందని యువత అభిప్రాయపడినట్లు నివేదికలో పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లో హర్షం టీఆర్ఎస్ మేనిఫెస్టోపై అన్ని జిల్లాల్లోని ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. పలు వర్గాలు కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు తెలంగాణభవన్‌లో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఆర్యవైశ్యుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ప్రకటించినందుకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా కృతజ్ఞతలు తెలిపారు. ‘అగ్రవర్ణ పేదలను గుర్తించి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నాలుగేళ్ల నుంచి కోరుతున్నాం. అగ్రకులాల్లో పుట్టడం శాపం కాకూడదని సీఎం కేసీఆర్ గుర్తించి మాకు ఓ కార్పొరేషన్ ప్రకటించారు. తెలంగాణ ఆర్యవైశ్య భవన్ కోసం ఐదెకరాల భూమి ఇచ్చారు. ఆర్యవైశ్యులకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర చరిత్రలో ఎవరూ చేయని విధంగా రెండు కార్పొరేషన్ చైర్మన్, మూడు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు, వివిధ కార్పొరేషన్లలో 84 డైరెక్టర్ పదవులను వైశ్యులకు ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైశ్యులమంతా టీఆర్ఎస్ కే మద్దతుగా నిలుస్తాం’అన్నారు. -
‘ప్రతి ఓటరు దగ్గరికి వెళ్లాలి’
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందాలంటే ప్రతి ఓటరు దగ్గరికి వెళ్లేలా కార్యాచరణ రూపొందించుకోవాలని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంపై అనుసరించాల్సిన వ్యూహాలపై ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అభ్యర్థులతో కలిసి హైదరాబాద్‌లోని పోచారం నివాసంలో ఎంపీ కల్వకుంట్ల కవితతో బుధవారం సమావేశమయ్యారు. -
వ్యూహమా.. సహజమా?
సాక్షి ప్రతినిధి, వరంగల్: స్టేషన్ ఘన్పూర్ టీఆర్ఎస్లో ఏం జరుగుతోంది? ప్రజా ప్రతినిధులు అధినేత నిర్ణయాన్ని ఎందుకు ధిక్కరిస్తున్నారు? వేలాది మంది కార్యకర్తలు హన్మకొండలోని సర్క్యూట్ హౌస్‌ను ముట్టడించడం వ్యూహమా? ఆపద్ధర్మ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మౌనం వెనుక మతలబు ఏమిటి? మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో పెల్లుబికిన ఆగ్రహజ్వాలను ఒక్కరోజులో పరిష్కరించిన ‘గులాబీ’ దళపతి స్టేషన్‌ఘన్‌పూర్ విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారు? అంతో ఇంతో రాజకీయ పరిజ్ఞానం ఉన్న ప్రతి వ్యక్తి మదినీ తొలుస్తున్న ప్రశ్నలు ఇవి. టీఆర్ఎస్ స్టేషన్ ఘన్పూర్ నియోజకర్గ అభ్యర్థిని ఖరారు చేసిన నాటి నుంచి ఇక్కడ రోజురోజుకూ రాజకీయం వేడెక్కుతోంది. నిజానికి రాజయ్యకు టికెట్ కేటాయించగానే రాజారపు ప్రతాప్ తిరుగుబాటు చేశారు. అవినీతిపరులకు టికెట్లు ఇవ్వొద్దంటూ బహిరంగ ప్రకటనలు చేశారు. తనకు పార్టీ నుంచి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తనకు పార్టీ నుంచి టికెట్ రాకపోతే స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలో ఉంటానని ఊళ్లలో తిరుగుతూ చెబుతున్నారు. తన వర్గానికి చెందిన కార్యకర్తలతో నిత్యం ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉన్నారు. మూడు, నాలుగు రోజుల తర్వాత.. టీఆర్ఎస్ స్టేషన్ ఘన్పూర్ అభ్యర్థిగా తాటికొండ రాజయ్యను ప్రకటించిన మూడు, నాలుగు రోజుల తర్వాత కడియం శ్రీహరి అనుచరులు ఒక్కసారిగా వేడి పుట్టించారు. రాజయ్యకు వ్యతిరేకంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ముఖ్యుల సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. రాజయ్యకు టికెట్ ఇస్తే ఓట్లు వేయమని తీర్మానం చేశారు. అనంతరం చిల్పూరు మండలం పల్లగుట్టలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, మాజీ సర్పంచులతో కలిసి ఓ సమావేశం నిర్వహించారు. రాజయ్య మీద అవినీతి ఆరోపణలు చేశారు. ఆయనకు టికెట్ రద్దు చేయాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. అదే వేదిక మీద నుంచి కడియం శ్రీహరి కుమార్తె కావ్యకు గానీ, తిరుగుబాటు నేత రాజారపు ప్రతాప్‌కు గానీ టికెట్ ఇవ్వాలనే డిమాండ్‌ను తెర మీదకు తీసుకొచ్చారు. మరోసారి మండలస్థాయి నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. 10 వేల మందితో హైదరాబాద్‌కు వెళ్లి కడియం శ్రీహరి ఇంటిని ముట్టడించాలని ప్రణాళిక వేసుకుని, ఆగిపోయారు. ఆశీర్వాదం తర్వాతే.. ఈ క్రమంలో రాజయ్య గొంతును పోలిన స్వరంతో ఓ మహిళతో శృంగార పరమైన ముచ్చట్లకు సంబంధించిన ఆడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దీంతో కంగుతిన్న రాజయ్య మరుసటి రోజే నేరుగా హైదరాబాద్‌లోని కడియం శ్రీహరి ఇంటికి వెళ్లి తనను ఆశీర్వదించాలంటూ కాళ్లు çమొక్కారు. రాజకీయంగా సహకరించమని కోరారు. ఇక అప్పటి నుంచే నిరసన జ్వాలలు ఊపందుకున్నాయి. తాజాగా శనివారం స్టేషన్ ఘన్పూర్ నుంచి వేలాది మంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వాహనాల్లో హన్మకొండకు చేరుకుని కడియం శ్రీహరి బస చేసిన సర్క్యూట్ అతిథి గృహాన్ని ముట్టడించారు. దాదాపు రెండు గంటల పాటు ధర్నా చేశారు. అయితే ఈసారి వారి డిమాండ్ మారింది. నిన్న మొన్నటి వరకు కడియం కావ్యకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేయగా.. ఈ రోజు కడియం శ్రీహరే అభ్యర్థిగా నిలబడాలని, ఆయనకే టికెట్ ఇవ్వాలనే నినాదాలతో హోరెత్తించారు. ప్లకార్డులు ప్రదర్శించడంతోపాటు కరపత్రాలను వాహనాలకు అతికించారు. కార్యకర్తల ధర్నాతో అతిథి గృహం నుంచి బయటకు వచ్చిన కడియం శ్రీహరి వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘ క్రమశిక్షణ గల నాయకుడిగా, పార్టీ కార్యకర్తగా అధ్యక్షుడి నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. నియోజకవర్గంలో కొంత అసంతృప్తి ఉంది. ఆశించిన అభివృద్ధి జరగలేదనే బాధ ఉందని, కడియం శ్రీహరి మళ్లీ వస్తే నియోజకవర్గం బాగుపడుతుందనే నమ్మకంతో నా దగ్గరకు వచ్చినట్లు నేను భావిస్తున్నాను. వారి బాధను నాకు, పార్టీకి చెప్పుకోవటానికి ఇక్కడకు వచ్చారు. వారి బాధను, ఆవేశాన్ని, ఆవేదనను, అభిప్రాయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తా.’ అని హామీ ఇచ్చారు. ఇంటెలిజెన్సీ చూస్తోంది..! టికెట్ల కేటాయింపుల అనంతరం జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు పసిగట్టి కేసీఆర్‌కు చేరవేసేందుకు పోలీసు ఇంటెలిజెన్సీ కార్యచరణలోకి దిగినట్లు తెలుస్తోంది. అభ్యర్థులపై పెల్లుబికిన అసమ్మతి, అందుకు గల కారణాలు? టికె ట్లు ఆశించి భంగపడిన అభ్యర్థుల ప్రమేయం, ఇ తరత్రా అంశాలను ఎప్పటికప్పుడు సేకరించి నివేదిస్తున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో హల్చల్ చేసిన ఆడియో క్లిప్పింగ్‌ను, స్టేషన్ ఘన్‌పూర్‌లో తిరుగుబాటు స్వరాల ఉనికిని ఇప్పటికే ఇంటెలిజెన్స్ అపద్ధర్మ సీఎం కేసీఆర్‌కు చేరవేసినట్లు తెలుస్తోంది. అన్ని అంశాలకు నిశితంగా గమనిస్తున్న ముఖ్యమంత్రి.. స్టేషన్ ఘన్పూర్ అభ్యర్థిత్వంపై ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే. -
టీఆర్ఎస్లో చల్లారని అసంతృప్తి..!
గులాబీ గూటిలో అసంతృప్తి జ్వాలలు ఆరడం లేదు. టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన వెలువడి వారంరోజులు దాటినా.. అధికార పార్టీలో కొన్ని నియోజకవర్గాల్లో టికెట్ ఆశించి దక్కని నేతలు అసంతృప్తి చర్యలు సాగిస్తూనే ఉన్నారు. టికెట్ ఆశించి భంగపడిన నేతలు అసమ్మతి వర్గంగా జట్టు కడుతున్నారు. ఆరునూరైనా బరిలో ఉంటామని తెగేసి చెబుతున్నారు. తమకు ఇదే ఆఖరిమోఖా అని, చావోరేవో తేల్చుకుంటామనీ స్పష్టం చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అసంతృప్తుల సంఖ్య పెరుగుతుండగా.. వాటిని ఆపేందుకు అధిష్టానం ప్రయత్నించడం లేదు. అభ్యర్థుల ప్రకటన తర్వాత అసమ్మతి నేతలుగా ఆందోళనబాట పట్టిన చర్యలు లేవు.. బుజ్జగింపులూ లేవు. దీంతో ‘రెబెల్స్’గా పోటీ చేస్తామంటున్నవారు ఇప్పుడు అధిష్ఠానం పిలిచినా ససేమిరా అంటామంటున్నారు. తమకు టికెట్ దక్కలేదని కొందరు, దక్కిన వారి టికెట్ రద్దు చేయాలంటూ మరికొందరు పలుచోట్ల నిరసనల పర్వం కొనసాగిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అభ్యర్థుల ప్రకటన నుంచే అసమ్మతికి ఆజ్యం‘ముందస్తు’ ఖాయమని తేలడంతో ఆశావహులంతా ఎవరికీ వారుగా టికెట్ కోసం ప్రయత్నాలు చేసుకున్నారు. ఎవరూ ఊహించనివిధంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈనెల 6న ప్రకటించిన 105 మందిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక్క చొప్పదండి మినహాయిస్తే 12 నియోజకవర్గాల్లో పాతకాపులకే మళ్లీ అవకాశం కల్పించారు. కొత్తగా టికెట్ ఆశించిన వారు, గతంలో పోటీ చేసి ఓడిపోయినవారు, ఈ సారి టికెట్ ఖాయమనుకున్నవారు తమ పేర్లు కానరాక పోవడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో అభ్యర్థుల ప్రకటన వెలువడిన రోజే రామగుండం, వేములవాడలో అసంతృప్తి నేతలు నిరసన స్వరం వినిపించారు. ఆ తర్వాత మానకొండూరు, మంథని, పెద్దపల్లిలో అభ్యర్థులను మార్చాలని, తమకే అవకాశం ఇవ్వాలని ఆందోళనలు చేపట్టారు. రామగుండంలో సోమారపు సత్యనారాయణకు టికెట్ ప్రకటించడంపై ఏకంగా సీనియర్ నాయకులు, కార్యకర్తలు పార్టీలో తిరుగుబాటుకు తెరతీశారు. వేములవాడలో వెయ్యిమందికిపైగా హాజరై సభ నిర్వహించి చెన్నమనేని రమేష్‌బాబు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. మానకొండూరు, మంథనిలో ఆశావహుల అనుచరులు కిరోసిన్ డబ్బాలతో వాటర్‌ట్యాంక్‌లు, విద్యుత్ టవర్లు ఎక్కి ఆత్యాహత్యాయత్నం చేశారు. మరికొన్ని చోట్ల అసంతృప్తి ఉన్నా... చాపకింద నీరులా సాగుతోంది. వీటన్నింటిపై అధిష్టానం స్పందించకపోవడంతో రోజు రోజుకు నిరసనలు ఆందోళనలు పెరుగుతున్నాయి. ‘అసమ్మతి’పై చర్చలు లేవు.. చర్యలూ లేవు ఉమ్మడి జిల్లాలో రామగుండం, వేములవాడ, మానకొండూరు, మంథని, పెద్దపల్లి తదితర చోట్ల టీఆర్ఎస్ టికెట్ల కోసం ఆశావహులు చేస్తున్న అసమ్మతి ఆందోళనలు, కార్యకలాపాల విషయంలో ఇంకా ఎలాంటి చర్చలూ స్థానికంగా చేపట్టలేదు. వేములవాడలో తాజా మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు అభ్యర్థిత్వాన్ని మార్చాలని ఆయన వ్యతిరేకవర్గం పట్టుబడుతోంది. శనివారం మేడిపెల్లి మండలకేంద్రంలో గల పీఎన్ఆర్ గార్డెన్లో భారీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన దాదాపు 2500 మంది ఇందులో పాల్గొన్నారు. వేములవాడ వరకు పాదయాత్ర కూడా చేపట్టారు. అలాగే రామగుండం తాజా మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ వ్యతిరేకులు ఏకమయ్యారు. వారం క్రితం ఎన్టీపీసీ రామగుండం కృష్ణానగర్‌లోని టీవీ గార్డెన్లో అసమ్మతి నేతలంతా సమావేశం నిర్వహించారు. చొప్పదండి టీఆర్ఎస్ అభ్యర్థిపై సందిగ్ధత కొనసాగుతోంది. అధినేత కేసీఆర్ చొప్పదండిపై స్పష్టత ఇవ్వకపోవడంతో ఎవరికి టికెట్ దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభతోపాటు టీఆర్ఎస్ రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు సుంకె రవిశంకర్, మాజీమంత్రి గడ్డం వినోద్, తెలంగాణ సాంస్కృతిక మండలి కళాకారిణి వొల్లాల వాణి సైతం టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రెండుమూడు రోజుల్లో చొప్పదండి అభ్యర్థిత్వంపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉండడంతో ఆశావహుల్లో ఆందోళన నెలకొం ది. చివరి నిమిషంలో హైదరాబాద్‌లో మకాం వేసి పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. -
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే
-
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను సీఎం కేసీఆర్ ఆదివారం ప్రకటించారు. ఎమ్మెల్యే కోటాలో గంగాధర్ గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి, మైనంపల్లి హనుమంతరావులను అభ్యర్థులుగా ఖరారు చేశారు. గవర్నర్ కోటాలో డి. రాజేశ్వరరావు, ఫారూఖ్ హుస్సేన్ మరోసారి అవకాశం దక్కించుకున్నారు. ఎమ్మెల్యే కోటా అభ్యర్థులు రేపు(సోమవారం) నామినేషన్లు దాఖలు చేయనున్నారు. సామాజిక సమీకరణలు, పనితీరు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసినట్టు టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ఎలిమినేటి కృష్ణారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి సోదరుడు. -
టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు వీరే
టీఆర్ఎస్ తరఫున రాజ్యసభకు పోటీచేసే అభ్యర్థుల పేర్లను పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. రెండు రోజులుగా ఫాంహౌస్‌లోనే ఉన్న కేసీఆర్.. పలువురు నేతలతో మంతనాలు నిర్వహించిన తర్వాత పార్టీ నుంచి కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డి.శ్రీనివాస్‌లకు రాజ్యసభ అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. వాస్తవానికి టీఆర్ఎస్లో రాజ్యసభ సీటు కోసం పోటీ గట్టిగానే కనిపించింది. సీఎల్ రాజం, కేసీఆర్ సన్నిహితుడు దామోదరరావు తదితరుల పేర్లు కూడా వినిపించినా, అన్ని లెక్కలను దృష్టిలో పెట్టుకుని పై రెండు పేర్లను కేసీఆర్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. డి.శ్రీనివాస్ ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారు పదవిలో కేబినెట్ హోదాలోనే ఉన్నా, కేంద్రంలో ఆయనకున్న సంబంధాలను పరిగణనలోకి తీసుకుని.. కేంద్ర రాజకీయాల్లో టీఆర్ఎస్ పోషించే పాత్ర దృష్ట్యా ఆయనను రాజ్యసభకు పంపాలని నిర్ణయించారు. ఇక కెప్టెన్ లక్ష్మీకాంతరావు టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన గతంలో మంత్రిగా పనిచేశారు. అసెంబ్లీలో టీఆర్ఎస్కు ఉన్న బలాన్ని బట్టి చూస్తే ఇద్దరిని గెలిపించుకునే బలం ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థిని నిలబెట్టాలని చూస్తున్నా, ప్రతిపక్షాల సభ్యులతో కలుపుకొన్నా కూడా కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ అవకాశం దాదాపు లేనట్లే కనిపిస్తోంది. మరోవైపు తుమ్మల నాగేశ్వరరావు పాలేరు ఉప ఎన్నికలో గెలిచిన తర్వాత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో.. ఆ స్థానానికి జరిగే ఎన్నికకు మెదక్ జిల్లాకు చెందిన మైనారిటీ నేత ఫరీదుద్దీన్‌కు అవకాశం కల్పించారు. ఆయన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మైనారిటీ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. -
ఐదుగురూ గెలిచారు!
-
ఐదుగురూ గెలిచారు!
తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీచేసిన ఐదుగురు అభ్యర్థులూ విజయం సాధించారు. శాసన మండలిలోని ఆరు ఖాళీ స్థానాలకు సోమవారం నిర్వహించిన ఎన్నికల్లో.. టీఆర్ఎస్ ఐదు స్థానాలను, కాంగ్రెస్ పార్టీ ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి. టీడీపీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డి ఓడిపోయారు. టీడీపీ - బీజేపీ ఎమ్మెల్యేల ఓట్లలో ఐదు 'నోటా'కు పడ్డాయి. అయితే ఇవి బీజేపీ ఎమ్మెల్యేలు వేసినవా, టీడీపీ వాళ్లు వేసినవా అనేది తెలియడంలేదు. కాంగ్రెస్ నుంచి మొత్తం 18 ఓట్లు ఆకుల లలితకే పడ్డాయి. వాస్తవానికి టీఆర్ఎస్ పార్టీకి నలుగురు అభ్యర్థులను మాత్రమే గెలిపించుకునేందుకు తగినంత బలం ఉంది. కానీ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు.. ఎలాగైనా ఐదుగురినీ గెలిపించాల్సిందేనని, లేకపోతే అసెంబ్లీని సైతం రద్దుచేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్తానని కూడా పార్టీ అంతర్గత సమావేశాల్లో హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈలోపు నామినేటెడ్ ఎమ్మెల్యే ఓటును కొనుగోలు చేసేందుకు వెళ్లిన టీ-టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి దొరికిపోవడం లాంటి సంచలన విశేషాలు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగానే జరిగాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు.. కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, బి.వెంకటేశ్వర్లు, నేతి విద్యాసాగర్, కె.యాదవ్రెడ్డి (టీఆర్ఎస్) ఆకుల లలిత (కాంగ్రెస్) తెలంగాణ అసెంబ్లీలో ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేతో కలిపి మొత్తం 120 మంది సభ్యులున్నారు. వీరిలో ఇద్దరు వామపక్ష సభ్యులు ఓటింగుకు దూరంగా ఉన్నారు. మొత్తం 118 మంది (రేవంత్‌రెడ్డి సహా) తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. -
ఉప ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొంటాం
టీడీపీకి ప్రజామోదం లేదు: డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సాక్షి, హైదరాబాద్: ఎలాంటి ఉప ఎన్నికలు ఎదురైనా, సమర్థంగా ఎదుర్కొనేందుకు తమ పార్టీ సదా సిద్ధంగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. రాష్ట్రంలో టీడీపీకి స్థానం లేదని, ప్రజామోదం లేద ని వ్యాఖ్యానించారు. కడియం అసెంబ్లీలో గురువారం విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. అసెంబ్లీలో సబ్జెక్టు పరంగా మాట్లాడేవారు ఒక్కరూ టీడీపీలో లేరని అభిప్రాయపడ్డారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాల్లో ఒక్కచోట కూడా గెలవదనిఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థులు సరిగా పనిచేసుకోలేక పోయినచోట మాత్రమే వారు గెలిచారన్నారు. ప్రస్తుతం జరుగుతున్న రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తంచేశారు. ఈ ఎన్నికల్లో పోలైన ఓట్లలో తమకు కనీసం 60శాతం ఓట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కచ్చితంగా ఉద్యోగాల భర్తీ జరుగుతుందని, రాష్ట్రంలో వేలాది పాఠశాలల్లో 20 శాతానికి మించి విద్యార్థుల ఎన్రోల్మెంటు లేకపోవడం దారుణమని పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీలో చర్చ కేవలం వ్యక్తిగత అంశాలపై జరుగుతోందని, సబ్జెక్టు పరంగా జరగడం లేదని అభిప్రాయపడ్డారు. ఉద్యమ కారులనే ఎన్నుకోండి: కేకే రాష్ట్ర పున ర్నిర్మాణం కోసం, తెలంగాణ ఉద్యమకారులనే మండలి ఎన్నికల్లో గెలిపించాలని టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు కోరారు. టీఆర్ఎస్ చెప్పిన ప్రతి మాటను, ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుందని అన్నారు. తెలంగాణ భవన్లో గురువారం ఆయన పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి దేవీప్రసాద్, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాల చారితో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం తపన పడే వారికే అవకాశం ఇవ్వాలని, దేవీప్రసాద్ పేరును ప్రకటించిన వెంటనే పార్టీలు ఆయన పై తమ అభ్యర్థులను పోటీకి పెట్టకుండా ఏకగ్రీవం చేస్తే బాగుండేదని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ కూడా పాల్గొన్నారు. -
హైదరాబాద్‌లో దేవీప్రసాద్.. నల్లగొండలో పల్లా
అట్టహాసంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లు సాక్షి, హైదరాబాద్: శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు బుధవారం అట్టహాసంగా నామినేషన్లు దాఖ లు చేశారు. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గ అభ్యర్థి దేవీప్రసాద్ గన్‌పార్కు నుంచి ర్యాలీగా తరలి వెళ్లి జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఎన్నికల రిట ర్నింగ్ అధికారి నవీన్‌మిట్టల్‌కు నామినేషన్ పత్రాలు అందజేశారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్, మహేందర్‌రెడ్డి, డాక్టర్ లక్ష్మారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా అగిరు రవికుమార్, ఎ.సునీల్‌కుమార్, సిల్వేరు శ్రీశైలం,సిద్ధి లక్ష్మణ్‌గౌడ్,ఎల్.గౌరీశంకర్‌ప్రసాద్, షేక్ షబ్బీ ర్ అలీ నామినేషన్లు వేశారు. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థి దేవీప్రసాద్‌తో సహా ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి. వరంగల్-ఖమ్మం-నల్లగొం డ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిగా డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి నల్లగొండలోని నాగార్జున డిగ్రీ కాలేజీ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్, ఎన్నికల అధికారి అయిన సత్యనారాయణ వద్ద నామినేషన్ దాఖలు చేశారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రు లు హరీష్‌రావు, తుమ్మల నాగేశ్వర్రావు, జగదీశ్వర్‌రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దేవీప్రసాద్ విజయం ఖాయం: నాయిని సకలజనుల సమ్మెతో చరిత్ర సృష్టించిన దేవీప్రసాద్, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ భారీ మెజార్టీతో గెలిచి చరిత్ర సృష్టిస్తారని హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు. బుధవారం దేవీప్రసాద్ నామినేషన్ వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేవీప్రసాద్‌తో పోటీ పడగల అభ్యర్థులే లేరన్నారు. ప్రభుత్వోద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎంతో కృషిచేసిన ఆయనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఉద్యోగులు, పట్టభద్రులు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాజకీయ జేఏసీ నుంచి మరో అభ్యర్థి పోటీ చేయనున్నారనే ప్రచారం జరుగుతోందన్న ప్రశ్నకు బదులిస్తూ రాజకీయ జేఏసీ అభ్యర్థే దేవీప్రసాద్ అని, మరొకరు పోటీచేసే ప్రసక్తే లేదన్నారు. దేవీప్రసాద్ మాట్లాడుతూ నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి, సంక్షేమ పథకాన్నీ అర్హులకే అందేందుకు, ఉద్యమంలో పాల్గొన్నవారు చట్టసభల్లోనూ ఉండాలనే తలంపుతో సీఎం కేసీఆర్ తనకు అవకాశమిచ్చారన్నారు. సెటిల ర్స్, ఆంధ్రా ఉద్యోగులపై తనకెలాంటి వివక్ష లేదన్నారు. మూడు జిల్లాల ఉద్యోగులు, గ్రాడ్యుయేట్లు ఓటింగ్‌లో పాల్గొని తనను గెలిపించాలని దేవీప్రసాద్ విజ్ఞప్తి చేశారు. గులాబీ సైనికులకు, తెలంగాణ ద్రోహులకు మధ్య పోరు : మంత్రి హరీశ్‌రావు నల్లగొండ: ఈ ఎన్నికలు రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన గులాబీ సైనికులకు, తెలంగాణ ద్రోహులకు మధ్య జరుగుతున్నాయని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం నల్లగొండలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి నామినేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరిగిన కేబినెట్ సమావేశంలోనే పోల వరం ముంపు పేరుతో ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపి ఖమ్మం జిల్లా ప్రజల గుండెలు గాయపర్చారని మండిపడ్డారు. తాజాగా మరికొన్ని మండలాలను ఏపీలో కలిపేందుకు బీజేపీ మద్దతుతో చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి కరెంట్ ఇవ్వాలని అనేకమార్లు కేంద్రమంత్రి వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నా తమ గోడును పట్టించుకోలేదని వాపోయారు. అందుకే ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని మంత్రి పిలుపునిచ్చారు. తెలంగాణ పునర్నిర్మాణం, బంగారు తెలంగాణ కల సాకారం చేసుకునేందుకు సీఎం కేసీఆర్‌కు, టీఆర్ఎస్కు అండా నిలవాలని హరీష్ విజ్ఞప్తి చేశారు. -
మండలి రేసులో గులాబీ గుర్రాలెవరో..!
- పట్టభద్రుల నియోజకవర్గాల్లో పోటీకి భారీ క్యూ - తెరపైకి తటస్థుల పేర్లు - అధినేత ఆశీస్సులున్న వారికే చాన్స్? హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిలో మండలి టికెట్ల లొల్లి గుబులు రేపుతోంది. వచ్చే నెలలో ఖాళీ అవుతున్న రెండు పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ రెండు నియోజకవర్గాల నుంచి పోటీకి అధికార పార్టీ ఎవరికి అవకాశం ఇస్తుందనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. దీనికి అనుగుణంగానే టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్యా అధికంగానే ఉండడం... పార్టీతో సంబంధం లేని తటస్థుల పేర్లూ తెరపైకి రావడంతో ఇది మరింత రసవత్తరంగా సాగుతోంది. నెల రోజుల వ్యవధిలోనే ఈ ఎన్నికలు ఉండడంతో పార్టీ ఆసాంతం మండలి ముచ్చట్లలో నే మునిగిపోయింది. పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్సీలుగా ఉన్న డాక్టర్ కె.నాగేశ్వర్ (మహబూబ్‌నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్), కపిలవాయి దిలీప్ కుమార్ (వరంగల్ - ఖమ్మం - నల్లగొండ )ల పదవీ కాలం మార్చి 29వ తేదీతో ముగుస్తోంది. ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ఏడుగురు ఎమ్మెల్సీల పదవీకాలం కూడా అదేరోజు ముగియనుంది. మండలి ఎన్నికల్లో బరిలో దిగాలనుకునేవారు ముందునుంచే ఏర్పాట్లు చేసుకున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించడంపై దృష్టి పెట్టారు. అధికార టీఆర్ఎస్లో ప్రస్తుత పరిస్థితి చూస్తే పట్టభద్రుల నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక అంత తేలిక కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘కడియం’ ైవె పే మొగ్గు! వరంగల్ ఎంపీగా ఉన్న కడియం శ్రీహరిని ఇటీవలే రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుని ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. దీంతో ఆయనకు మండలిలో చోటు కల్పిస్తారని ముందునుంచీ ప్రచారం జరుగుతోంది. అయితే, ఎలాంటి ఇబ్బంది ఉండని ఎమ్మెల్యే కోటా నుంచే ఆయనను మండలికి పంపుతారని భావించినా... వరంగల్-ఖమ్మం-నల్లగొండ నియోజకవర్గం నుంచి కడియం పేరు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో వివిధ రాజకీయ సమీకరణల వల్ల టికెట్లు ఇవ్వలేకపోయిన వారికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు టి.రవీందర్రావు పోటీ పడుతున్నారు. వరంగల్ జిల్లాకే చెందిన తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ నాయకుడు మర్రి యాదవరెడ్డి కూడా తనకు అవకాశం ఇవ్వాల్సిందిగా టీఆర్ఎస్ అధినేతను కోరినట్లు తెలుస్తోంది. ప్రచారంలో సుద్దాల అశోక్‌తేజ పేరు మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్యా ఎక్కువగానే ఉంది. ఇందులో సినీ పాటల రచయిత సుద్దాల అశోక్‌తేజ పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. వామపక్షాల కూటమి ఈసారి ప్రస్తుత ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను కాదని సుద్దాల అశోక్‌తేజను బరిలోకి దింపాలని యోచిస్తుండగా... ఆయన మాత్రం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మద్దతుతోనే పోటీ చేస్తానని, లేదంటే పోటీలో ఉండనని చెబుతున్నట్టు సమాచారం. మరోవైపు కేసీఆర్ మద్దతు ఇస్తే నాగేశ్వర్ కూడా బరిలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. అయితే, వారిద్దరూ ఈ విషయమై ఎక్కడా బహిరంగంగా మాట్లాడలేదు. మరోవైపు టీఎన్జీవో నేత దేవీప్రసాద్‌ను ఇదే నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలన్న వ్యూహంలో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు. కానీ, దేవీప్రసాద్ తనకు ఎమ్మెల్యే కోటాలో అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. ఎమ్మెల్సీ పూల రవీందర్ ద్వారా పీఆర్టీయూ అధ్యక్షుడు వెంకటరెడ్డి, మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి ద్వారా టీపీఆర్టీయూ అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి కూడా తమకు అవకాశం ఇవ్వాలని ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. -
సీఎం మదిలో ఎవరో?
కేసీఆర్ చెంతకు జడ్పీ చైర్మన్ ఎంపిక వ్యవహారం - మెజార్టీ ఉన్నా గుంభనంగా గులాబీ దళపతి - అనుచరుల కోసం నలుగురు ఎమ్మెల్యేల యత్నం - తొందరపడుతున్న ఆశావహ జడ్పీటీసీలు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఇందూరు జడ్పీ పీఠం ఎవరిని వరిస్తుంది..? పోటాపోటీగా ప్రయత్నిస్తున్న ఆ నలుగురిలో ఎవరికి దక్కుతుంది..? స్పష్టమైన మెజార్టీ ఉన్నా చైర్మన్ అభ్యర్థి ఎంపికలో టీఆర్ఎస్ ఎందుకు జాప్యం చేస్తోంది..? జిల్లా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఎవరికి మద్దతిస్తారు..? గులాబీ దళపతి గుంభనంగా ఎందుకుంటున్నారు..? ఆయన మదిలో ఎవరున్నారు..? ఎన్నికల సంఘం త్వరలోనే జడ్పీ, మున్సిపల్ చైర్మన్లపై ఓ నిర్ణయానికి వస్తుందన్న ప్రచారం నేపథ్యంలో.. టీఆర్ఎస్ జిల్లా నేతలతో పాటు రాజకీ య విశ్లేషకుల్లో సాగుతున్న ఆయా అంశాలు ఆసక్తి రేపుతున్నాయి. మండల పరిషత్, జిల్లా పరిష త్ సభ్యుల ఎన్నికలు జరిగి మూడు నెలలు కా వస్తుండగా.. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎంపీపీ, జడ్పీ చైర్మన్ల ఎన్నికపై అనిశ్చితి నెల కొంది. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసి రాష్ట్రంలో కొత్త సర్కారు ఏర్పాటైంది. ఇక మేయర్, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీ, జడ్పీ చైర్మన్ల ఎంపికపై త్వరలోనే ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అత్యధిక జడ్పీటీసీ స్థానాలు కైవసం చే సుకున్న టీఆర్ఎస్లో జడ్పీ చైర్మన్ అయ్యే అదృష్టం ఎవరిని వరిస్తుందోనన్న చర్చ జోరందుకుంది. కేసీఆర్ పేషీకి చైర్మన్ వ్యవహారం ఇందూరు జడ్పీ చైర్మన్ వ్యవహారం చివరకు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పేషీకి చేరింది. ఈవిషయంలో కొంతకాలంగాకేసీఆర్ మౌనం వహిస్తునాడొఒ్నరు. జడ్పీటీసీ సభ్యులైన తమ అనుచరుల పేర్లను సూచించిన పలువురు ఎమ్మెల్యేలు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇలా కీలకంగా మారిన నిజామాబాద్ జడ్పీ చైర్మన్ వ్యవహారంపై చివరకు కేసీఆర్ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే కొందరు ఎమ్మెల్యేలతో పాటు పలువురు జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్ మాట్లాడినట్లు చెబుతున్నారు. చైర్మన్ పదవి కోసం ప్రధానంగా నలుగురు పోటీ పడుతుండగా.. ఆయా నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు ఎమ్మెల్యేలు తమ అనుచరుడికే ఇవ్వాలని ఎవరికీ వారుగా కేసీఆర్‌కు ప్రతిపాదించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేల ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఆ నలుగురిలో పీఠమెవరికో జిల్లాలోని 36 మండలాలకు గాను 24 జడ్పీటీసీ స్థానాలను టీఆర్ఎస్ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. మిగితా 12స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోగా.. టీ డీపీ, బీజేపీలకు ఒక్కస్థానం కూడా దక్కలేదు. స్పష్టమైన మెజార్టీ సాధించిన టీఆర్ఎస్ సభ్యుల్లో నలుగురు చైర్మన్ పదవి కోసం పోటీ పడుతున్నారు. ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో అన్ని స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో గాంధారి మండల జడ్పీటీసీ సభ్యుడు హరాలే తానాజీరావు, కోటగిరి జడ్పీటీసీ పుప్పాల శంకర్, భిక్కనూరు, నిజాంసాగర్ల నుంచి ఎన్నికైన నంద రమేశ్, డి.రాజు జడ్పీ పీఠం కోసం పోటీ పడుతున్నారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, గంప గోవర్ధన్, హన్మంత్షింధే తమ తమ అనుచరులకు జడ్పీ పీఠం కట్టబెట్టాలని ఎవరికి వారు తాజాగా కేసీఆర్‌ను కోరినట్లు తెలిసింది. పోచారం శ్రీనివాస్‌రెడ్డికి మంత్రి పదవి కట్టబెట్టడంతో జడ్పీ చైర్మన్ విషయంలో మిగతా ముగ్గురు ఎమ్మెల్యేల సిఫారసులను కేసీఆర్ పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందని పార్టీవర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్నికల ఫలితాల అనంతరం మే 14న పార్టీ అధిష్టానం 24 మంది జడ్పీటీసీలను క్యాంపునకు తరలించింది. వారితో హైదరాబాద్‌లో ని తాజ్‌కృష్ణ హోటల్లో సమావేశం ఏర్పాటు చేసింది. అక్కడ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు, జడ్పీటీసీ సభ్యులతో మాట్లాడిన టీఆర్ఎస్ సీనియర్ నేత ఈటెల రాజేందర్.. చైర్మన్ అభ్యర్థి విషయంలో తుది నిర్ణయం కేసీఆర్‌దేనని స్పష్టంచేశారు. ఆ తర్వాత తాజ్‌కృష్ణలో జరిగిన మంతనాల వెనుక మతలబు ఏమిటి..? చివరకు జడ్పీ చైర్మన్ ఎవరవుతారు..? అన్న అంశాలు మాత్రం పార్టీవర్గాల్లో కలకలం రేపుతున్నాయి.Follow @sakshinews -
‘కారు..’ టాప్‌గేర్
నవ తెలంగాణ నిర్మాణంలో ‘గులాబీ’ వికసించాలని పాలమూరు ప్రజలు తీర్పునిచ్చారు. జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో ఏడు అసెంబ్లీ స్థానాలు, మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం కట్టబెట్టి జిల్లా ఆకాంక్షలు తీర్చమని కోరారు. పేదరికంతో మగ్గుతున్న జిల్లాను ప్రగతి పట్టాలపై నడిపించాలని ఓటింగు ద్వారా తమ మనోగతాన్ని స్పష్టీకరించారు. ఇక ‘హస్తా’నికి నాలుగుచోట్ల ఎమ్మెల్యే, ఒక పార్లమెంటు స్థానాల్లో గెలిపించి రెండోస్థానంలో నిలబెట్టి రాష్ట్రం ఇచ్చిన కృతజ్ఞతను చూపించారు. మేము సైతం పోరాడామని చెప్పుకున్నందుకు ‘సైకిల్’కూ రెండు చోట్ల అవకాశం కల్పించి అసెంబ్లీకి పంపారు. ఇక కల్వకుర్తి ఫలితం నిలచి పోవడంతో అక్కడి ఓటర్ల మొగ్గు తేలలేదు. మొత్తానికి పరిణితి చెందిన జడ్జిమెంట్‌తో ఓటరంటే అసామాన్యుడని నిరూపించారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : సాధారణ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి మహబూబ్‌నగర్ జిల్లా పట్టం కట్టింది. మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానంతో పాటు మరో ఏడు అసెంబ్లీ నియోజవకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధిం చారు. నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానం తో పాటు మరో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పాగా వేశారు. 2009 ఎన్నికల్లో జిల్లాలో మెజారిటీ స్థానాలు దక్కించుకున్న తెలుగుదేశం ప్రస్తుతం రెండు అసెంబ్లీ స్థానాలతో సరిపెట్టుకుంది. మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానంలో కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి 2590 స్వల్ప ఓట్ల తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థి ఏపీ జితేందర్‌రెడ్డి చేతిలో ఓటమి చవి చూశారు. క్రాస్ ఓటింగ్‌పై భారీ ఆశలు పెట్టుకున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి నాగం జనార్దన్‌రెడ్డి మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానంలో అనూహ్యంగా కాంగ్రస్ అభ్యర్థిగా రంగ ప్రవేశం చేసిన సీనియర్ పార్లమెంటేరియన్ నంది ఎల్లయ్య గెలుపు సాధించారు. వరుసగా మూడు పర్యాయాలు నాగర్‌కర్నూలు నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహించిన మంద జగన్నాధ్ చివరి రౌండ్లలో వెనుకబడి ఓటమి పాలయ్యారు. మహబూబ్‌నగర్‌లో టీజీఓ మాజీ అధ్యక్షుడు వి.శ్రీనివాస్‌గౌడ్ విజయం సాధించారు. షాద్‌నగర్‌లో అంజయ్య యాదవ్, జడ్చర్లలో మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, దేవరకద్రలో ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, అచ్చంపేట (ఎస్సీ) నియోజకవర్గంలో గువ్వల బాలరాజు, కొల్లాపూర్‌లో జూపల్లి కృష్ణారావు, నాగర్‌కర్నూలులో మర్రి జనార్దన్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థులుగా విజయం సాధించారు. గద్వాలలో డీకే అరుణ పాగా తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ దిగ్గజాలు ఓటమి పాలైనప్పటికీ గద్వాల నియోజకవర్గంలో మాత్రం మాజీ మంత్రి డీకే అరుణ వరుసగా మూడో సారి ఎన్నికై హ్యాట్రిక్ సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన డీకే అరుణ మేనల్లుడు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి చివరి వరకూ తీవ్ర పోటీ ఇచ్చారు. మక్తల్‌లో డీకే అరుణ సోదరుడు, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి కూడా విజయం సాధించారు. వనపర్తిలో మాజీ మంత్రి చిన్నారెడ్డి , అలంపూర్ (ఎస్సీ) నియోజకవర్గంలో సంపత్ కుమార్ గెలుపొందారు. కల్వకుర్తి నియోజకవర్గంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు 32 ఓట్ల స్వల్ప మెజారిటీ సాధించారు. అయితే వెల్దండ మండలం జూపల్లి పోలింగ్ కేంద్రంలోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం మొరాయించడంతో ఓట్ల లెక్కింపు నిలిపివేసి ఫలితాన్ని ప్రకటించలేదు. ఎన్నికల కమిషన్ నిర్ణయం ఆధారంగా తిరిగి రీపోలింగ్ నిర్వహించే అవకాశం వుందని అధికారులు వెల్లడించారు. రెండు స్థానాలకే పరిమితం బీజేపీతో ఎన్నికల అవగాహన కుదుర్చుకుని నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానంతో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసిన తెలుగుదేశం నామమాత్ర ఫలితం సాధించింది. కొడంగల్, నారాయణపేట అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. టీడీపీతో పొత్తు కుదుర్చుకుని మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానంతో పాటు, మరో ఆరు అసెంబ్లీ స్తానాల్లో బరిలోకి దిగింది. కల్వకుర్తిలో బీజేపీ అభ్యర్థి తల్లోజు ఆచారి నువ్వా నేనా అనే రీతిలో పోటీ ఇచ్చారు. అయితే ఫలితం వెల్లడి నిలిచిపోవడంతో ఉత్కంఠ నెలకొంది. మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానంలోనూ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి టీఆర్ఎస్కు గట్టి పోటీ ఇచ్చినా ఓటమి పాలయ్యారు. -
హతవిధీ..!
గద్వాల/నాగర్‌కర్నూల్, న్యూస్‌లైన్: తాజా మాజీఎమ్మెల్యేల సొంత మండలాల్లో తాము ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు ఆధిక్యతను చాటుకోలేక చతికిలపడ్డాయి. హోరాహోరీగా సాగిన ప్రాదేశిక పోరులో ఎదురుగాలి తప్పలేదు. మంగళవారం వెలువడిన ఫలితాల్లో గద్వాల నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో మొత్తం 69 ఎంపీటీసీ స్థానాలకు గాను 47 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. మాజీమంత్రి డీకే.అరుణ ప్రాతినిథ్యం ఇక్కడి నుంచి పట్టణంలో ఘనవిజయం సాధించిన కాంగ్రెస్‌కు మండలాల్లో ఎదురుగాలి వీచింది. నాలుగు మండలాల్లోరి అన్ని ఎంపీటీసీ స్థానాల్లో ఆధిక్యం చూపిన టీఆర్ఎస్ నాలుగు ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకుంది. గద్వాల, ధరూరు, గట్టు జెడ్పీటీసీ స్థానాలను గులాబీదళం నిలబెట్టుకుంది. కాంగ్రెస్ కేవలం మల్దకల్ జెడ్పీటీసీ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నారాయణపేట తాజా మాజీ ఎమ్మెల్యే వై.ఎల్లారెడ్డి సొంత మండలం ఊట్కూర్‌లో టీఆర్ఎస్కు ఎదురుగాలి వీచింది. జెడ్పీటీసీ స్థానాన్ని కాంగ్రెస్ హస్తగం చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా సూర్యప్రకాష్‌రెడ్డి 5,350 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. కల్వకుర్తి తాజా మాజీ ఎమ్మెల్యే సొంత మండలం తలకొండపల్లి జెడ్పీటీసీ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి పి.నరసింహా సమీప టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్‌పై 1719 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మండలంలో మొత్తం 14 ఎంటీసీ స్థానాలకు 10 కాంగ్రెస్ , నాలు టీఆర్ఎస్లు గెలుపొందాయి. దేవరకద్ర, మక్తల్ తాజా మాజీ ఎమ్మెల్యేలు సీతమ్మ, కె.దయాకర్‌రెడ్డి సొంత మండలం చిన్నచింతకుంటలో టీడీపీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగలింది. జెడ్పీటీసీ సభ్యురాలిగా టీఆర్ఎస్ అభ్యర్థి వడ్డెమాన్ లక్ష్మి ఘనవిజయం సాధించారు. నారాయణపేటలో రాత్రి వరకు హోరాహోరీగా ఉత్కంఠభరితంగా జరిగిన ఓట్ల లెక్కింపులో తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అంజనమ్మపై 1084 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తన సత్తాచాటింది. టీఆర్ఎస్ ఆరు, కాంగ్రెస్ మూడు, బీజేపీ రెండు, టీడీపీ ఒకటి, ఇండింపెండెంట్లు మరో రెండు స్థానాల్లో విజయం సాధించారు. నాగర్‌కర్నూల్ ఎంపీ మందా జగన్నాథం, అలంపూర్ తాజా మాజీ ఎమ్మెల్యే వీఎం అబ్రహాం సొంతమండలం ఇటిక్యాలలో కాంగ్రెస్ విజ యం సాధించింది. కాంగ్రెస్ జె డ్పీటీసీ అభ్యర్థిగా ఖగ్‌నాథ్‌రెడ్డి సమీప టీఆ ర్ఎస్ అభ్యర్థిపై విజయం సాధించారు. మండలంలో అలాగే కాంగ్రెస్ 11 ఎంపీటీసీ స్థానాల్లో గెలుపొంది.. ఎంపీపీ సీటును చేజిక్కించుకోనుంది. నాగం, కూచకుళ్లకు షాక్! నాగర్‌కర్నూల్ నుంచి ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డికి, రెండు దశాబ్దాలుగా రాజకీయ పోరాటం చేస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి జెడ్పీ చైర్మన్‌గా పనిచేసిన కూచకుళ్ల దామోదర్‌రెడ్డికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. గతంలో నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోని ఐదు జెడ్పీటీసీ స్థానాల్లో నాలుగు కాంగ్రెస్‌కు, ఒకటి టీడీపీకి ఉండగా, ప్రస్తుతం ఎన్నికల్లో కాంగ్రెస్ రెండుస్థానాలను మాత్రమే దక్కించుకోగలిగింది. మిగతా మూడు స్థానాల్లో టీఆర్ఎస్ పాగావేసింది. నాగం పార్టీ బీజేపీకి ఒక్క జెడ్పీటీసీ స్థానం కూడా దక్కలేదు. ఎంపీపీల విషయానికి వస్తే గతంలో మూడు కాంగ్రెస్‌కు కాగా, రెండుస్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. ప్రస్తుతం టీడీపీ గానీ, నాగం ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీకి గానీ ఒక్కస్థానం కూడా దక్కే పరిస్థితి లేదు. రాత్రి పొద్దుపోయే వరకు తెలిసిన ఫలితాల మేరకు నాగర్‌కర్నూల్ స్థానం కాంగ్రెస్‌కు ఎంపీపీ స్పష్టమైన మెజార్టీ కాగా, తాడూరు, తిమ్మాజీపేట మండలాల్లో టీఆర్ఎస్కు స్పష్టమైన మెజార్టీ వచ్చింది. బిజినేపల్లి, తెలకపల్లిలో హంగ్ ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్రమంత్రి సూదిని జైపాల్‌రెడ్డి సొంత మండలం.. మాడ్గుల జెడ్పీటీసీ స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. టీఆర్ఎస్ అభ్యర్థి పడగాల రవి సమీప కాంగ్రెస్ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డిపై 480 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మాడ్గుల మండలంలోని 14 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు తమ తీర్పును ఏ ఒక్క పార్టీకి అనుకూలంగా కాకుండా మిశ్రమఫలితాలను ఇచ్చారు. తాజా మాజీ ఎమ్మెల్యే పి.రాములు ప్రాతినిథ్యం వహిస్తున్న అచ్చంపేట నియోజకవర్గంలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడ ఆరు జెడ్పీటీసీ, 71 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. బల్మూరు, ఉప్పునుంతల, అమ్రాబాద్, వంగూరు జెడ్పీటీసీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోగా, అచ్చంపేట టీడీపీ, లింగాల జెడ్పీటీసీ స్థానాన్ని టీఆర్ఎస్ అభ్యర్థి చేజిక్కించుకున్నారు. -
చలో చలో క్యాంప్
- ఆత్మరక్షణ వ్యూహం - వల వేసే ఎత్తుగడలు - రెండు పార్టీల్లో హడావుడి సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : అత్యధిక స్థానాల్లో హంగ్ ఫలితాలతో మేయర్, ఛైర్మన్లను కైవవం చేసుకోవటం ప్రధా న పార్టీలకు తలనొప్పిగా మారనుంది. సొంత సభ్యులను కాపాడుకుంటూనే ఇతరుల మద్దతు కూడగట్టేందుకు వ్యూహరచన చేయటం రెండు పార్టీలకు తప్పనిసరిగా మారింది. ఏమరుపాటుగా ఉంటే బలాబలాలు తారుమారయ్యేలా ఉండటంతో సభ్యుల బేరసారాలు.. రకరకాల ఒప్పందాల ఎత్తులతో పాటు క్యాంపు రాజకీయాలకు నేతలు వెనుకాడటం లేదు. ఇప్పటికే ఛైర్మన్, మేయర్ రేసులో ఉన్న అభ్యర్థులు తమకున్న సభ్యుల బలగాన్ని రహస్య శిబిరాలకు తరలించే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కరీంనగర్ కార్పొరేషన్ నుంచి 24 మంది టీఆర్ఎస్ అభ్యర్ధులతో పాటు ముగ్గురు ఇండిపెండెంట్లు మంగళవారం హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. మేయర్ రేసులో ఉన్న అభ్యర్ధి రవీందర్‌సింగ్ ఆధ్వర్యంలో వీరు వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా క్యాంపు నిర్వహించే ఆలోచనలో ఉంది. - కోరుట్ల మున్సిపాలిటీలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్ధి జువ్వాడి నర్సింగరావు శనివారం రాత్రి 31 మందిని ధర్మపురికి తీసుకెళ్లారు. మరుసటి రోజున తిరిగి వచ్చారు. వీరిలో 13 మంది విజయం సాధించారు. - మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ఆధ్వర్యంలో ఈ నెల 11న టీఆర్ఎస్ అభ్యర్థులు 31 మంది హైదరాబాద్‌కు తీసుకెళ్లి తీసుకొచ్చారు. వీరిలో ఎనిమిది మంది గెలిచారు. ఎంఐఎం ఐదు స్థానాల్లో గెలవడంతో వారితో కలిసి క్యాంపునకు వెళ్లేందు కు టీఆర్ఎస్ ఏర్పాట్లు చేసుకుంటోంది. - మెట్పల్లి మున్సిపాలిటీలో 12 మంది టీఆర్ఎస్ అభ్యర్థులు ఇప్పటికే క్యాంపునకు చేరుకున్నారు. పట్టణ అధ్యక్షుడు బర్ల సాయన్న సతీమణి బాగీర్త చైర్పర్సన్ అభ్యర్థి రేసులో ఉన్నారు. సాయన్న అధ్వర్యంలో వీరందరూ హైదరాబాద్‌కు వెళ్లినట్లు తెలిసింది. - హుస్నాబాద్ నగర పంచాయతీని స్పష్టమైన ఆధిక్యంతో కైవశం చేసుకున్న టీఆర్ఎస్.. సొంత సభ్యులు చేజారకుండా అప్రమత్తమైంది. చైర్మన్ అభ్యర్థి చంద్రయ్య ఆధ్వర్యంలో 11 మంది సోమవారం రాత్రి హైదరాబాద్ బయల్దేరుతున్నారు. - హుజూరాబాద్ నగర పంచాయతీ నుంచి 9 మంది టీఆర్ఎస్ అభ్యర్థులతో పాటు ఇద్దరు ఇండిపెండెంట్లను సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ క్యాంపునకు తరలించేందుకు సిద్ధమయ్యారు. -
టీఆర్ఎస్ అభ్యర్థులకు కాంగ్రెస్ గాలం?
హైదరాబాద్: తెలంగాణలో తమకు మెజారిటీ సీట్లు రావని అంచనాకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థులకు గాలం వేస్తున్నట్టు మీడియాలో ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ వైఖరిపై అసంతృప్తితో ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులతో కాంగ్రెస్ సంప్రదింపులు జరుపుతున్నట్టు ఓ ఆంగ్ల ప్రతిక వెల్లడించింది. ఒకవేళ మెజారిటీకి దగ్గరగా తాము సీట్లు గెల్చుకుంటే తమకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ కోరుతున్నట్టు తెలుస్తోంది. తమకు మద్దతు ఇస్తే మంత్రి పదవులు ఇస్తామని ఆశ జూపుతున్నట్టు సమాచారం. ఈ మేరకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్... టీఆర్ఎస్ అసంతృప్త నేతలతో చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత దాసోజు శ్రావణ్ ధ్రువీకరించారు. చాలా మంది టీఆర్ఎస్ అభ్యర్థులు తమ పార్టీ నాయకులతో టచ్‌లో ఉన్నారని వెల్లడించారు. దాదాపు 20 మంది టీఆర్ఎస్ అభ్యర్థులు తమతో టచ్‌లో ఉన్నారని పొన్నాల లక్ష్మయ్య చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. వారి పేర్లను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారని చెబుతున్నారు. అయితే తమ పార్టీ అభ్యర్థులు కాంగ్రెస్ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు వచ్చిన కథనంపై టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పొన్నాల లక్ష్మయ్య బ్రోకర్లా వ్యవహరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. నీచ రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. -
కారు వర్సెస్ ఫ్యాన్..
నాగర్ కర్నూలు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: నాగర్‌కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రత్యర్థులు బలహీనంగా ఉండడంతో.. ఇప్పటికే హ్యాట్రిక్ విజయం సాధించిన మందా జగన్నాథం మరోసారి విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఐదేళ్లలో మూడు పార్టీలు మారిన మందా జగన్నాథానికి అదృష్టం కలిసి వస్తోంది. ఆయనకు మూడు పార్టీలలో ఉన్న సంబంధాలతోపాటు, నియోజకవర్గ ప్రజలతో ఉన్న సత్సంబంధాలు ఆయన విజయానికి దోహదపడే అవకాశం ఉంది. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు బలంగా లేకపోయినా.. క్రాస్ ఓటింగ్‌తో మందా జగన్నాథం కు కలిసొచ్చే అవకాశం ఉంది. ఆయన స్వంత అసెంబ్లీ నియోజకవర్గం ఆలంపూర్లో తన కుమారుడుని శ్రీనాథ్‌ను రంగంలోకి దింపినా.. అక్కడ మాత్రం కొడుకు గెలిచే అవకాశాలు కనపడడం లేదు. అసెంబ్లీ స్థానాల్లో ఇతర పార్టీల అభ్యర్థులకు ఓట్లు వేసే ఓటర్లు ఎంపీ స్థానానికి వచ్చేసరికి మాత్రం మందా జగన్నాథం వైపు మొగ్గుచూపుతున్నారు. నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేయడానికి అభ్యర్థులెవరూ లేకపోవడంతో...చివరి నిమిషంలో ఎమ్మెల్సీ నంది ఎల్లయ్యను రంగంలోకి దించారు. టీడీపీ నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బక్కాని నర్సింలు రంగంలో ఉన్నారు. ఈ ఇద్దరు అభ్యర్థులు పార్లమెంట్ నియోజకవర్గంపై ఏమాత్రం ప్రభావం చూపించలేకపోతున్నారు. వైఎస్సార్సీపీ నుంచి మారెడు గోపాల్ రంగం లో ఉన్నారు. ఆయన కొన్ని నియోజకవర్గాల్లో విస్తృత ప్రచా రం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థుల కంటే మెరుగైన ప్రచారం సాగిస్తున్నారు. గ్రామాలు, తండాల్లోకి వెళ్తున్నారు. కేవలం అసెంబ్లీ అభ్యర్థులు చేసే ప్రచారంపైనే కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులు ఆధారపడుతున్నారు. నాగర్ కర్నూలు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మల్లు రవిని రంగంలోకి దించి ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ నియోజకవర్గంపై అవగాహన ఉన్న నాయకునిగా..ఈసారి ఆయనకు గెలిచే అవకాశం ఉండేదన్న ప్రచారం సాగుతోంది. మూడుసార్లు ఎంపీగా ఉన్న మందా జగన్నాథంపై కొంత వ్యతిరేకత ఉన్నా.. ఆ ఇద్దరు అభ్యర్థుల కంటే ఈయనే మెరుగు అనే భావన వ్యక్తం అవుతోంది. - ఈ పార్లమెంట్ నియోజకవర్గంలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పరిశీలిస్తే.. కల్వకుర్తిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎడ్మ కిష్టారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి మధ్యనే పోటీ ఉన్నా.. ఎడ్మ కిష్టారెడ్డి వైపు ఓటర్లు మొగ్గు చూపుతున్నారు. టీడీపీ నుంచి టీ ఆర్ఎస్లో చేరిన జైపాల్‌యాదవ్ మూడోస్థానానికి పడిపోయారు - ఇక అచ్చంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఇక్కడ డాక్టర్ వంశీకష్ణ పట్ల సానుకూలత వ్యక్తం అవుతున్నా.. ఒకసారి కొత్త వ్యక్తికి అవకాశం ఇవ్వాలన్న అభిప్రాయం కూడా కొంత కనిపిస్తోంది. అది బలంగా వేళ్లూనుకుంటే మాత్రం బాల్‌రాజ్ కు అనుకూలంగా మారే అవకాశం లేకపోలేదు. - నాగర్‌కర్నూలులో కాంగ్రెస్, బీజేపీ,వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్ మధ్యనే పోటీ ఉంది. ప్రస్తుతం ఈ నియోజవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నాగం జనార్దన్‌రెడ్డి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. ఆయన కుమారుడు శశిధర్‌రెడ్డి రంగంలో ఉన్నా..ప్రభావం అంతంత మాత్రమే. వైఎస్సార్సీపీ అభ్యర్థి గట్టి పోటీ ఇస్తున్నా గెలుపువాటికి వరకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. కాంగ్రెస్ నుంచి దామోదర్‌రెడ్డి, టీఆర్ ఎస్ నుంచి జనార్దన్‌రెడ్డిల మధ్య పోటీ రసవత్తరంగా ఉంది. - వనపర్తి నియోజకవర్గంలో మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉంది. టీడీపీ నుంచి రావుల చంద్రశేఖరరెడ్డి, కాంగ్రెస్ నుంచి చిన్నారెడ్డి, టీ ఆర్ ఎస్ నుంచి నిరంజన్‌రెడ్డి పోటీ పడుతున్నారు. ముగ్గురికి మంచిపేరు ఉన్నా.. ఎవరు గెలుపొందినా చాలా తక్కువ ఓట్లతో బయటపడడానికి అవకాశం ఉంది. - ఆలంపూర్ ఎస్సీ నియోజకవర్గంలో చతుర్ముఖ పోటీ ఉంది. ఎంపీ మందా జగన్నాథం కుమారుడు బరిలో ఉన్నా.. గెలిచే అవకాశాలు ఏమాత్రం లేవన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కాంగ్రెస్ నుం చి టీడీపీలో చేరిన అబ్రహం, కాంగ్రెస్ నుంచి సంపత్‌కుమార్, వైఎస్సార్సీపీ నుంచి బంగి లక్ష్మన్న బరిలో ఉన్నారు. చల్లా కుటుం బ ప్రభావం ఈ నియోజకవర్గంపై అధికంగా ఉన్నట్లు సమాచారం. వారి మద్దతు ఉన్న వారే గెలుపునకు అవకాశం ఉంది. - కొల్లాపూర్‌లో మరోసారి మాజీ మంత్రి జూపల్లి కష్ణారావు విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌లో బలమైన వ్యక్తిగా ఉన్న విష్ణువర్దన్‌ను కాదని హర్షవర్దన్‌కు బరిలోకి దించడంతో కాంగ్రెస్ మైనస్ అయింది. ఇక్కడ బీజేపీ నుంచి మధుసూధన్‌రావు రంగంలోకి దిగారు. కాంగ్రెస్‌లో చీలిక జూపల్లి లాభించనుంది. - ఇక గద్వాలలో ఎదురులేదని భావించిన మాజీ మంత్రి డీకె ఆరుణ టీ ఆర్ ఎస్ నుంచి గట్టి పోటీ ఎదుర్కోంటున్నారు. ఆమె విజయం కోసం శ్రమించాల్సిన పరిస్థితి. జిల్లా నాయకురాలిగా పేరు తెచ్చుకున్నా.. ఆమె బయటకు వెళ్లి ప్రచారం చేసే అవకాశం లేకుండా పోయింది. టీ ఆర్ ఎస్ నుంచి బరిలో ఉన్న కష్ణమోహన్‌రెడ్డి ఆమెకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. కాంగ్రెస్‌లో ఆమె అనుయాయులైన ద్వితీయ శ్రేణి నాయకులు, ఆమె భర్త భరత్‌సింహారెడ్డి కారణంగా పార్టీ పలుచనైంది. గతంలో మాదిరిగా గెలుపుపై ధీమా వ్యక్తం చేయలేని పరిస్థితి ఆమెది. ఈస్థానంలో బీజేపీ నుంచి రంగంలో ఉన్న కేశవరెడ్డి మొదటిసారిగా రాజకీయాల్లోకి వచ్చారు. ఇక్కడ టీ ఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ ఉంది. ఎవరు గెలిచినా అతి తక్కువ మెజారిటీతో గెలిచే పరిస్థితి ఉంది. ఇవీ అసెంబ్లీ సెగ్మెంట్లు.. నాగర్‌కర్నూలు పార్లమెంట్ పరిధిలో కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్‌కర్నూలు, ఆలంపూర్, వనపర్తి, కొల్లాపూర్, గద్వాల నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో దాదాపు 14 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గాల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్యనే నెలకొంది. ఈ నియోజకవర్గంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, రాజోలిబండ , చేనేత కార్మికుల సమస్యలు, కొన్ని నియోజకవర్గాల్లోని తాగునీటి సమస్య, జూరాల నీటి విడుదలకు సంబంధించిన అంశా లు ప్రస్తావనకు రావడం లేదు. దళితులకు ఇంకా భూ పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్ల వంటి సమస్యలు ఉన్నాయి. -
టీఆర్ఎస్లో ‘రెండోట్ల’ కలకలం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిలో ‘రెండు ఓట్లు’ కలకలం రేపుతున్నాయి. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు వచ్చేసరికి క్రాస్ ఓటింగ్ జరుగుతుందేమోననే భయం వారిని వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొదలు అభ్యర్థులు ఇదే అంశం ప్రధానంగా భావించి ప్రచారం చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. జిల్లా లో రెండు లోక్‌సభ, తొమ్మిది అసెంబ్లీ స్థానాల నుంచి టీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. తె లంగాణ నినాదం, సెంటిమెంట్ బలంగా చూపించిన బీజేపీ సైతం ఈ ‘సార్వత్రిక’ ఎన్నికలలో ఎంపీ సీట్లను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం టీఆర్ఎస్ అభ్యర్థులలో కలకలం రేపుతోంది. అందరికీ ప్రతిష్టాత్మకమే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు ఈసారి ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో ఎన్డీఏ, యూపీఏ కాకుండా మూడో ప్రత్యామ్నాయం ఖాయమని టీఆర్ఎస్ బలంగా ప్రచారం చేస్తోంది. ఈ క్రమంలో ఎమ్మెల్యేలతోపాటు ఎంపీలను మెజార్టీ స్థానాల్లో గెలిపించుకునేందుకు సర్వశక్తులొడ్డుతోంది. అయితే, తెలంగా ణ ఉద్యమంలో తనదైన పాత్ర పోషించిన బీజేపీ సైతం నరేంద్రమోడి ప్రధాని కావాలంటే ఎంపీల ను గెలిపించాలని తెలంగాణవాదులు, యువతను కోరుతోంది. జిల్లాలో కొత్త ఓటర్లు, ప్రధానంగా టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపే యువత ఎమ్మెల్యేకు టీఆర్ఎస్ అభ్యర్థికి, ఎంపీకొచ్చేసరికి కమలానికి వేయాలన్న ధోరణి ప్రదర్శించడాన్ని ఆ పార్టీ పసిగట్టింది. దీనిని నివారించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఏకంగా ప్రచార సభలలోనే విషయాన్ని ప్రస్తావిస్తూ, క్రాస్‌ఓటింగ్ జరగకుండా చూడాలని కోరుతున్నారు. ఎమ్మెల్యే, ఎంపీలకు వేసే ఓట్లు కూడ టీఆర్ఎస్కే పడాలని పదే పదే చెబుతున్నారు. ఇక్కడ పరిస్థితులు భిన్నం నిజామాబాద్, జహీరాబాద్ లోక్‌సభ స్థానాలకు వచ్చేసరికి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. జహీరాబాద్ పరిధిలో జిల్లాలోని బాన్సువాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాలలో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పల్లెల్లో ప్రచారం ఉధృతంగా నిర్వహించాల్సిన ఎంపీ అభ్యర్థి భీమ్రావ్ బస్వంత్‌రావు పాటిల్‌కు భాష ప్రతిబంధకంగా మారింది. దీనికి తోడు వ్యాపారపరంగా మహారాష్ట్రలో స్థిరపడిన ఆయన ఏకంగా ఎంపీ అభ్యర్థిగా దిగడాన్ని కూడా ఎవరూ అంగీకరించడం లేదు. దీనికి తోడు, క్రాస్‌ఓటింగ్ జరిగితే పరిస్థితి ఏమిటన్న చర్చ ఉంది. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి నాయకురాలిగా ప్రజలతో సంబంధాలున్నా, జిల్లాలోని ఐదు సెగ్మెంట్లలో ఒక్క సిట్టింగ్ ఎమ్మెలే కూడా లేరు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గా లలో ఆమె ఎంపీ అభ్యర్థిగా ఓట్లడిగే పరిస్థితి. ఎమ్మెల్యే, ఎంపీలుగా టీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించాలని ఆమె ఆయా సెగ్మెంట్లలో బలంగా ప్రచారం చేస్తున్నారు. -
నేడు తొలి విడత పోలింగ్
పోలింగ్ సమయం :ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లా పరిషత్, న్యూస్‌లైన్ : జిల్లా, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ స్థానాలకు ఆదివారం తొలి విడత పోలింగ్ జరగనుంది. జిల్లాలో మొత్తం 50 జెడ్పీటీసీ, 705 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. తొలివిడతగా ములుగు, నర్సంపేట రెవెన్యూ డివిజన్లలో ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 20 మండలాల్లో 423 లొకేషన్లలో 777 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 20 మండలాలను 80 జోన్లు... 101రూట్లుగా విభజించారు. 856 పోలింగ్ ఆఫీసర్లు, 3419 సహాయ పోలింగ్ ఆఫీసర్లను నియమించారు. 387 పోలింగ్ స్టేషన్లలో వెబ్‌కాస్టింగ్ (నెట్ ద్వారా ప్రసారం) చేస్తుండగా.. ఇంటర్నెట్ అందుబాటులో ఉండే పోలింగ్ లొకేషన్లలో 253 మంది వీడియో గ్రాఫర్లను నియమించారు. మొదటి విడతలో 86 సాధారణ, 148 సున్నిత, 89 అత్యంత సున్నిత, 77 తీవ్రవాద ప్రాబల్య ప్రాంతాలుగా గుర్తించడంతోపాటు ఆయా ప్రాంతాల్లో తగిన ఏర్పాట్లు చేశారు. ఎన్నికలు జరిగే మండలాలు ములుగు డివిజన్లోని భూపాలపల్లి, చిట్యాల, ఏటూరునాగారం, గణపురం (ములుగు), గోవిందరావుపేట, మంగపేట, మొగుళ్లపల్లి, ములుగు, పరకాల, రేగొండ, తాడ్వాయి, శాయంపేట, వెంకటాపురంతోపాటు నర్సంపేట డివిజన్ పరిధిలోని చెన్నారావుపేట, దుగ్గొండి, గూడూరు, ఖానాపురం, కొత్తగూడ, నల్లబెల్లి, నర్సంపేట మండలాల్లో పోలింగ్ జరగనుంది. 255 గ్రామ పంచాయతీలకు చెందిన ఓటర్లు తమ ఓటు హక్కను వినియోగిం చుకోనున్నారు. ములుగు డివిజన్లోని గోవిందరావుపేట మండలం ఎస్సీ మహిళకు రిజర్వ అయింది. ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులు చైర్పర్సన్ రేసులో ఉంటారనే ప్రచారం జరుగుతోంది. ఉదయం 7 నుంచి పోలింగ్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ తొలివిడత ఎన్నికల పోలింగ్ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. జెడ్పీటీసీ అభ్యర్థులకు తెలుపు... ఎంపీటీసీ అభ్యర్థులకు గులాబీ రంగు బ్యాలెట్ పేపర్లు ఉంటాయి. మొత్తం 1,749 బ్యాలట్ బాక్స్‌లను వినియోగించనున్నారు. నిర్ధేశించిన సమయం ముగిసినప్పటి1కీ... పోలింగ్ కేంద్రాల అవరణలో ఉన్న ఓటర్లు ప్రతిఒక్కరికీ ఓటు వేసే అవకాశముంటుందని జిల్లా ఎన్నికల అధికారులు తెలిపారు. బ్యాలెట్ బాక్స్‌ల భద్రం ములుగు డివిజన్ పరిధిలోని మంగపేట, ఏటూరునాగారం, తాడ్వాయి, గోవిందరావుపేట, ములుగు, వెంకటాపూర్ మండలాలకు చెందిన బ్యాలెట్ బాక్స్‌లను ములుగు మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో... పరకాల, భూపాలపల్లి, శాయంపేట, రేగొండ, చిట్యాల, మొగుళ్లపల్లి, గణపురం (ములుగు ) మండలాలకు చెందిన బ్యాలెట్ బాక్స్‌లను పరకాలలోని గణపతి డిగ్రీ కాలేజీలో భద్రపరచనున్నట్లు జిల్లాపరిషత్ సీఈఓ ఆంజనేయులు తెలిపారు. నర్సంపేట డివిజన్ పరిధిలోని చెన్నారావుపేట, దుగ్గొండి, గూడూరు, ఖానాపూర్, కొత్తగూడ, నల్లబెల్లి, నర్సంపేట మండలాలకు చెందిన బ్యాలెట్ బాక్స్‌లను నర్సంపేటలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో భద్రపరుస్తామన్నారు. ఎన్నికల సిబ్బందికి నిధుల కేటాయింపు స్థానిక ఎన్నికల్లో శిక్షణతోపాటు పోలింగ్ విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగులకు అలవెన్స్‌లు చెల్లించేందుకు మొదటి విడత ఎన్నికలు జరుగుతున్న మండలాలకు నిధులను విడుదల చేసినట్లు జెడ్పీ సీఈఓ తెలిపారు. ఎన్నికల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యోగులకు వారు శిక్షణ పొందిన మండలాల్లోని ఎంపీడీఓలు అలవెన్సులు చెల్లించనున్నట్లు వెల్లడించారు. పీఓలకు ఒక్కొక్కరికి రోజుకు రూ.350 చొప్పున రెండు రోజులకు రూ.700... ఏపీఓలకు రూ.500, ఓపీఓలకు రూ.500 చెల్లించనున్నట్లు వివరించారు. పోలింగ్ రోజున పోలింగ్ అధికారులకు భోజన వసతి కల్పించని పక్షంలో ప్రతి ఉద్యోగికి రూ. వంద చెల్లించాలని ఎంపీడీఓలకు సూచించారు. మైక్రో అబ్జర్వర్లకు రూ.వెయ్యి, జోనల్ అధికారులకు రూ. 1500 చెల్లించాలన్నారు. వెబ్‌కాస్టింగ్ చేస్తున్న విద్యార్థులు ఒక్కొక్కరికి రెమ్యూనరేషన్ కింద రూ.500తోపాటు భోజనం కింద రూ.150, వీడియో గ్రాఫర్లకు రూ.900లు చెల్లించాలన్నారు. -
'అరువు తెచ్చుకున్న నేతలతో టీఆర్ఎస్ జాబితా'
హైదరాబాద్: విధానాలు, సిద్ధాంతాలు లేని పార్టీ టీఆర్ఎస్ అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. టీఆర్ఎస్ మేనిఫెస్టో ఆచరణ సాధ్యంగా లేదని, ప్రజలను మోసం చేసేలా ఉందని అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో సగానికి పైగా అరువు తెచ్చుకున్న నేతలే ఉన్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ద్రోహులకు, భూకబ్జాదారులకు టీఆర్ఎస్ టికెట్లు ఇచ్చిందన్నారు. కేసీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు రైతుల ఆత్మహత్యలను పట్టించుకోలేదన్నారు. ముప్పై ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క అభివృద్ధి ప్రతిపాదన తేలేదన్నారు. తాను మంత్రిగా సాధించిన ఐటీ ఐఆర్ ప్రాజెక్ట్‌ను కేసీఆర్ ప్రస్తావించడం ఆయనకు సొంత ఆలోచనలు లేవనడానికి నిదర్శనమన్నారు. తెలంగాణకు కాపలాకుక్కలా ఉంటానన్న కేసీఆర్ ఇప్పుడు సీఎం పదవి కోరితే తప్పేంటి అనడం ఆయన అధికార దాహానికి అద్దంపడుతోందన్నారు. తనపై సీబీఐ కేసు లేదని, కేసీఆర్‌పై భవిష్యత్తులో కేసులు పడతాయని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని ప్రజలు నమ్మడం లేదని పొన్నాల అన్నారు. -
మోసపోతే గోస తప్పదు: కేసీఆర్
* మన రాష్ట్రంలో మన ప్రభుత్వమే ఉండాలె: కేసీఆర్ * అట్లయితెనే ఆశించిన పునర్నిర్మాణం సాధ్యం * ఎక్కువ మంది ఎంపీలుంటేనే ఢిల్లీ మాట వింటది * ఇతర పార్టీల మాయ మాటలు నమ్మొద్దు గద్వాల, న్యూస్‌లైన్: ‘‘ఈ ఎన్నికల్లో మోసపోతే మళ్లా గోసపడతం. మనం కోరుకున్న తెలంగాణ రాష్ట్రం కావాలంటే మన రాష్ట్రంలో మన ప్రభుత్వమే ఉండాలె. ఎవరి మాయమాటలు నమ్మకుండా ప్రజలంతా ఏకమై టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి మన ప్రభుత్వమే వచ్చేలా చెయ్యాలె...’’ అని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో ఎక్కువ మంది ఎంపీలను గెలిపించుకుంటేనే తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి అవసరమైన నిధులను రాబట్టుకోగల మని.. ఎక్కువ మంది ఎంపీలుంటేనే మన డిమాండ్లకు ఢిల్లీలో విలువ ఉంటుందని పేర్కొన్నారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలలో జరిగిన బహిరంగసభలో కేసీఆర్ ప్రసంగించారు. ‘‘ఎన్నికల సందర్భంగా ఎన్నో పార్టీల నాయకులు ప్రజల ముందుకొస్తరు.. ఏవేవో మాయమాటలు చెబుతారు.. అవి నమ్మొద్దు.. మన రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంటేనే ఆశించిన పునర్నిర్మాణం సాధించగలం..’’ అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ సందర్భంగా ఢిల్లీలో తాను ఎన్ని ఇబ్బందులు పడ్డానో అందరికీ తెలుసని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మిగతా పార్టీల నేతలను, మాటలను నమ్మొద్దని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు 14ఏళ్లుగా ఉద్యమాన్ని కొనసాగించి, రాష్ట్రాన్ని సాధించిన మనం మన ప్రభుత్వాన్నే ఏర్పాటు చేసుకునేలా టీఆర్ఎస్ను గెలిపించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో బోయలను ఎస్టీ జాబితాలో చేర్చే జీవో జారీ చేస్తామని, మత్స్యకారులను బీసీ ‘ఏ’ గ్రూపులో చేర్చేందుకు ప్రయత్నిస్తామని కేసీఆర్ చెప్పారు. అంగన్వాడీల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఉండరని.. అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకుంటామని పేర్కొన్నారు. ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిని చంద్రబాబే ప్రవేశపెట్టారని, అది శ్రమదోపిడీ కాదా? అని కేసీఆర్ ప్రశ్నిం చారు. తెలంగాణలో తమ ప్రభుత్వం వచ్చాక పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు, పాలమూరును పచ్చని పొలాల జిల్లాగా మార్చేందుకు కృషిచేస్తామని చెప్పారు. ఇదే వేదికపై గద్వాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా జడ్పీటీసీ మాజీ సభ్యుడు కృష్ణమోహన్‌రెడ్డిని కేసీఆర్ ప్రకటించారు. ఎన్నికలైన తరువాత మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామన్నారు. ఈ సభలో రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నేత కె.కేశవరావు, పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎస్.నిరంజన్‌రెడ్డి, నాగర్‌కర్నూలు ఎంపీ మందా జగన్నాథం, కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. పాలమూరుకు పెద్దపీట.. తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు జిల్లా అభివృద్ధికి పెద్దపీట వేస్తామని.. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను సత్వరంగా పూర్తిచేయడంతో పాటు 14లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. కృష్ణా, తుంగభద్ర నదుల నడిగడ్డలో కరువు ఉందంటే పాలకుల చేతగానితనమే దానికి కారణమని ఆయన విమర్శించారు. ఆంధ్ర మాయా నేతల బూట్లు తూడిచే నాయకులు తెలంగాణలో ఉన్నారని, అందువల్లే ఇక్కడ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.