
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుపొందాలంటే ప్రతి ఓటరు దగ్గరికి వెళ్లేలా కార్యాచరణ రూపొందించుకోవాలని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంపై అనుసరించాల్సిన వ్యూహాలపై ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అభ్యర్థులతో కలిసి హైదరాబాద్‌లోని పోచారం నివాసంలో ఎంపీ కల్వకుంట్ల కవితతో బుధవారం సమావేశమయ్యారు.