నాగేంద్రపురంలో చిన్నారిని ఎత్తుకొన్న పోచారం
సాక్షి, బీర్కూర్ : అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని ఈ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కుతుందని ఆపద్ధర్మ మంత్రి, టీఆర్‌ఎస్ అభ్యర్ధి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం బీర్కూర్ మండల కేంద్రంతో పాటు తిమ్మాపూర్ గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారం సందర్భంగా పార్టీ శ్రేణులు, ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులు ఇచ్చి దీవించారు. బీర్కూర్‌లో పలు కాలనీలు తిరుగుతు టీఆర్‌ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. అనంతరం మండల కేంద్రంలోని గాంధీచౌక్‌లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. డప్పు చప్పుల్లతో ప్రచారం నిర్వహించారు. బీర్కూర్ గ్రామ శివారు నుంచి కార్యకర్తలు బైక్‌లతో స్వాగతం పలిగారు. తిమ్మాపూర్, బీర్కూర్ గ్రామాల్లోని ఆలయాల్లో పోచారం పూజలు నిర్వహించారు. అనంతరం చిన్నారులు మహిళలతో కలసి కోలాటం ఆడారు.
రైతుల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్
కోటగిరి: టీఆర్‌ఎస్‌తోనే బంగారు తెలంగాణా సాధ్యమవుతుందని రైతుల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని టీఆర్‌ఎస్ పార్టీ బాన్సువాడ నియోజక వర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని బస్వాపూర్, నాగేంద్రపురం, కొత్తపల్లి, కొత్తపల్లితండాల్లో పోచారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.పోచారం ప్రచారరథంపై ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నాగేంద్రపురంలో నిర్మించిన డబుల్‌బెడ్‌రూం ఇళ్లను సందర్శించిన పోచారం ప్రజలతో మాట్లాడారు. చిన్నారిని చంకలో ఎత్తుకొని ఆడించారు.
బీర్కూర్ : మండల కేంద్రంలో ఆదివారం అయ్యప్ప స్వాములకు దేశాయ్‌పేట్ సొసైటీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి భిక్ష ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment