'అరువు తెచ్చుకున్న నేతలతో టీఆర్ఎస్ జాబితా' | Barrow Red leaders in trs list, says ponnala lakshmaiah | Sakshi
Sakshi News home page

'అరువు తెచ్చుకున్న నేతలతో టీఆర్ఎస్ జాబితా'

Published Fri, Apr 4 2014 4:43 PM | Last Updated on Wed, Aug 15 2018 9:17 PM

'అరువు తెచ్చుకున్న నేతలతో టీఆర్ఎస్ జాబితా' - Sakshi

'అరువు తెచ్చుకున్న నేతలతో టీఆర్ఎస్ జాబితా'

హైదరాబాద్‌: విధానాలు, సిద్ధాంతాలు లేని పార్టీ టీఆర్‌ఎస్‌ అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. టీఆర్‌ఎస్ మేనిఫెస్టో ఆచరణ సాధ్యంగా లేదని, ప్రజలను మోసం చేసేలా ఉందని అన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితాలో సగానికి పైగా అరువు తెచ్చుకున్న నేతలే ఉన్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ద్రోహులకు, భూకబ్జాదారులకు టీఆర్‌ఎస్‌ టికెట్లు ఇచ్చిందన్నారు.

కేసీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు రైతుల ఆత్మహత్యలను పట్టించుకోలేదన్నారు. ముప్పై ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క అభివృద్ధి ప్రతిపాదన తేలేదన్నారు. తాను మంత్రిగా సాధించిన ఐటీ ఐఆర్‌ ప్రాజెక్ట్‌ను కేసీఆర్‌ ప్రస్తావించడం ఆయనకు సొంత ఆలోచనలు లేవనడానికి నిదర్శనమన్నారు.

తెలంగాణకు కాపలాకుక్కలా ఉంటానన్న కేసీఆర్ ఇప్పుడు సీఎం పదవి కోరితే తప్పేంటి అనడం ఆయన అధికార దాహానికి అద్దంపడుతోందన్నారు. తనపై సీబీఐ కేసు లేదని, కేసీఆర్‌పై భవిష్యత్తులో కేసులు పడతాయని చెప్పారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తుందని ప్రజలు నమ్మడం లేదని పొన్నాల అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement