ponnala lakshmaiah congress
-
కాంగ్రెస్‌లో 'బీసీ' కాక!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి బీసీల కాక మొదలైంది. బీసీ వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తూ గత 45 ఏళ్లుగా కాంగ్రెస్‌లో పనిచేస్తున్న సీనియర్ నేత, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పార్టీకి రాజీనామా చేశారు. పార్టీకి నాలుగు దశాబ్దాలకు పైగా సేవ చేసిన తనకు చివరకు అవమానాలే మిగిలాయని, ఈ ఆవేదనతోనే తాను పార్టీని వీడుతున్నానంటూ ఆయన శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాసిన లేఖ పార్టీవర్గాల్లో సంచలనం సృష్టించింది. పార్టీకి విధేయుడిగా పేరొందిన పొన్నాల రాజీనామా చేయడం, బీసీ నేతలు ఏకంగా గాందీభవన్‌లోనే ధర్నా నిర్వహించాలని ప్రయత్నించడం, అధిష్టానం గట్టిగా హెచ్చరించడం, మరోవైపు ఇటీవల ఢిల్లీ వెళ్లిన సందర్భంగా బీసీ నేతలకు కాంగ్రెస్ పెద్దలు సరిగా అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం, బీసీ నేతలకు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల కోత తప్పదనే సంకేతాలు వస్తుండడం లాంటి పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పారీ్టలో బీసీ నేతలు కేంద్రంగా ఓరకంగా కలకలమే రేగుతోంది. బీసీలకు ఎన్ని టికెట్లు వస్తాయో తేలాక ఆ వర్గానికి చెందిన మరికొందరు పొన్నాల బాట పట్టవచ్చనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. బీసీలకు 34 స్థానాలకు తగ్గకుండా ఇవ్వాలంటూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 34కు తగ్గకుండా టికెట్లు తమకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఇటీవల తెలంగాణకు చెందిన 30–40 మంది బీసీ నేతలు హస్తిన బాట పట్టారు. వీరిలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఇతరులు ఉన్నారు. అయితే వీరికి కనీసం అపాయింట్మెంట్ కూడా దొరకలేదనే చర్చ గాందీభవన్ వర్గాల్లో జరుగుతోంది. రాహుల్, సోనియాలను కలుస్తామని, అక్కడే బీసీల కోటా తేల్చుకుంటామని చెప్పిన బీసీ నేతలు ఢిల్లీ వెళ్లిన తర్వాత ఉసూరుమంటూ వెనక్కు రావాల్సి వచ్చింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కలుస్తారని చెప్పినా ఆయన కేవలం మధుయాష్కీకి మాత్రమే అపాయింట్మెంట్ ఇచ్చారు. మిగిలిన నేతలంతా ఏఐసీసీ కార్యాలయంలోనే వేచి ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత కొందరు నాయకులను ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కేసీ వేణుగోపాల్ కలిశారు. పార్టీ అధికారంలోకి రావడం మీకు ఇష్టం లేదా? అంటూ ఆయన ఎదురుదాడికి దిగడంతో వారంతా కంగు తినాల్సి వచి్చందని చెబుతున్నారు. దీనికి తోడు పార్టీ సర్వేల ఆధారంగా గెలిచే వారికి మాత్రమే టికెట్లు ఇస్తామని, మిగిలిన వారికి ఇవ్వలేమని చెప్పిన వేణుగోపాల్ కొందరిని వ్యక్తిగతంగా ప్రస్తావిస్తూ వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని వారి్నంగ్ కూడా ఇచి్చనట్లు సమాచారం. ఠాక్రే ఫోన్‌తో ధర్నా విరమణ? వాస్తవానికి బీసీలకు 34 అసెంబ్లీ స్థానాలకు తగ్గకుండా ఈసారి సీట్లు ఇస్తామని తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం చాలాసార్లు స్పష్టం చేసింది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ)లో తీసుకున్న ఈ నిర్ణయానికి అనుగుణంగా తమకు 34 కంటే ఎక్కువ సీట్లు ఇవ్వాలని గత రెండు నెలలుగా బీసీ నేతలు టీం బీసీ పేరుతో డిమాండ్ చేస్తున్నారు. తాజాగా 20–25 స్థానాలు మాత్రమే బీసీలకు ఇస్తున్నారని తెలియడంతో శుక్రవారం గాంధీభవన్‌లో ధర్నా చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ అనూహ్యంగా వారు తమ నిరసన విరమించుకున్నారు. ఇందుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే నుంచి వచ్చే ఒకే ఒక్క ఫోన్‌కాల్ కారణమనే చర్చ గాందీభవన్ వర్గాల్లో జరుగుతోంది. టికెట్ల ప్రకటన సమయంలో ఇలాంటి ఆందోళనలు చేయవద్దని, గెలిచే వారికే సీట్లిస్తామని, తమను కాదని ధర్నాలు చేస్తే పార్టీ నుంచి బయటకు పంపిస్తామని ఆయన హెచ్చరించడంతోనే టీం బీసీ నేతలు తమ ఆందోళనను విరమించుకున్నారని తెలుస్తోంది. పొత్తు కుదిరితే బీసీలకిచ్చే సీట్లేనా? వామపక్ష పార్టీలతో పొత్తు కుదిరితే చెరో రెండు సీట్లు చొప్పున సీపీఐ, సీపీఎంలకు కాంగ్రెస్ కేటాయిస్తుందనే చర్చ జరుగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, కొత్తగూడెం, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ, మునుగోడు స్థానాలను ఆ పార్టీలకు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇవి సాధారణంగా కాంగ్రెస్ బీసీలకిచ్చే అవకాశం ఉన్న, చాలామంది బీసీ నేతలు ఆశిస్తున్న స్థానాలనే వాదన విన్పిస్తోంది. బీసీలకు ఇచ్చే అవకాశమున్న సీట్లను పొత్తుల్లో వేరే పార్టీలకు ఇచ్చి, పొత్తుల కారణంగానే కొన్ని సీట్లు బీసీలకు ఇవ్వలేకపోయామని చెప్పేందుకే ఈ ఆలోచన చేస్తున్నారని బీసీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు సర్వేల పేరుతో బీసీ నేతలను దూరం చేసుకునేందుకు కూడా పార్టీ వెనుకాడడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే.. అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత చాలామంది బీసీ నేతలు పొన్నాల బాటలో పయనించవచ్చనే చర్చ గాందీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా పార్టీలోకి కొత్తగా వచ్చిన వారు అన్యాయంగా అధికారం చేజిక్కించుకున్నారు నిఖార్సైన నేతలు ఉనికి కోసం పాకులాడాల్సి వస్తోంది బీసీలకు అగౌరవం మాత్రమే మిగిలింది ఇలాంటి వాతావరణంలో ఇమడలేననే నిర్ధారణకు వచ్చా: పొన్నాల ‘అమెరికాలోని ప్రతిష్టాత్మక సంస్థతో కలిసి దశాబ్దం పాటు పనిచేసిన తర్వాత, కాంగ్రెస్ పార్టీతో కలిసి నాలుగు దశాబ్దాలకు పైగా పనిచేసిన నేను బాధాతప్త హృదయంతో ఈ లేఖను రాస్తున్నాను..’అని ఖర్గేకు రాసిన లేఖలో పొన్నాల తెలిపారు. ‘నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేసేందుకు పీవీ నరసింహారావు స్ఫూర్తినిచ్చారు. పార్టీలో సాధారణ కార్యకర్త నుంచి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించాను. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, 12 ఏళ్ల పాటు మంత్రిగా నిబద్ధతతో సేవలందించాను. అయితే పార్టీలో తాజాగా జరుగుతున్న పరిణామాలు నాకు తీవ్ర బాధను కలిగించాయి. 2015లో పీసీసీ అధ్యక్షుడిగా నన్ను అకారణంగా తొలగించారు. 2014 ఎన్నికల్లో పార్టీ ఓటమికి నేనే బాధ్యుడినని నిందించారు. పార్టీ మూల సిద్ధాంతంతో అనుబంధమున్న నాలాంటి నాయకుడికి పార్టీలో ఎన్నో అవమానాలు కలిగాయి. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారు అన్యాయంగా అధికారం చేజిక్కించుకున్నారు. నిఖార్సైన కాంగ్రెస్ నేతలు మాత్రం పార్టీలో ప్రాధాన్యం కోల్పోయి ఉనికి కోసం పాకులాడాల్సి వస్తోంది. ఈ విషయాలను పీసీసీ అధ్యక్షుడితో మాట్లాడేందుకు రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నాను. కానీ సాధ్యపడలేదు. సామాజిక న్యాయానికి కాలం చెల్లింది. కాంగ్రెస్ పార్టీకి ఆయువు పట్టు లాంటి సామాజిక న్యాయానికి ఇప్పుడు పార్టీలో కాలం చెల్లింది. సమాజంలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు అగౌరవం మాత్రమే మిగిలింది. పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ క్రమంలో వస్తున్న ఆరోపణలు పార్టీ అంకితభావాన్ని ప్రశ్నించే విధంగా ఉన్నాయి. ఇలాంటి అంశాలను చర్చించేందుకు నాలాంటి సీనియర్ నేత కూడా నెలల తరబడి నిరీక్షించాల్సి రావడం, ఢిల్లీలో కేసీ వేణుగోపాల్‌ను కలిసేందుకు పదిరోజులు వేచి ఉన్నా ఫలితం లేకపోవడం దురదృష్టకరం. 50 మంది బీసీ నేతలు ఢిల్లీకి వచ్చినా పెద్దలను కలిసేందుకు అనుమతి లభించలేదు. ఉదయ్‌పూర్, రాయ్‌పూర్ డిక్లరేషన్లు పార్టీలో అమలు కావడం లేదు. మరోవైపు బీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్సీ, ఇతర హోదాలను బీసీ నాయకులకు కల్పిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నేను పార్టీతో అనుబంధాన్ని కొనసాగించలేనని, ఇలాంటి వాతావరణంలో ఇమడలేననే నిర్ధారణకు వచ్చా. ఇన్నాళ్లూ నాకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు..’అని పొన్నాల తన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతానికి కాంగ్రెస్‌కు రాజీనామా చేశా.. ఏఐసీసీకి లేఖను పంపిన తర్వాత హైదరాబాద్‌లోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ పొన్నాల భావోద్వేగానికి గురయ్యారు. 1983 తర్వాత పార్టీ కేవలం మూడు సార్లు మాత్రమే అధికారంలోకి వచ్చిందని, ఉమ్మడి ఏపీలో అధికారం దక్కించుకున్నా తెలంగాణలో మాత్రం సగం సీట్లు పార్టీకి ఎప్పుడూ రాలేదని, ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు అవసరమైన విషయాలను పార్టీలో చర్చించాలన్నా వీలుపడలేదని చెప్పారు. చెప్పేది వినేవాళ్లు పార్టీలో లేరని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పొన్నాల కన్నీటి పర్యంతమయ్యారు. బీఆర్ఎస్లో చేరుతున్నారా అని ప్రశ్నించగా, ప్రస్తుతానికి తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా మాత్రమే చేశానని, ఇప్పుడే తన రాజకీయ భవిష్యత్తు గురించి చెప్పలేనని అన్నారు. ఒకరిద్దరు వెళ్లినా నష్టమేమీ లేదు: మురళీధరన్ సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకరిద్దరు వెళ్లిపోయినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీలోకి చాలామంది వచ్చి చేరుతున్నట్లు చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. పొన్నాల పార్టీని వీడటంపై విలేకరులు ప్రశ్నించగా..దీనిపై స్పందించాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్యానించారు. అదే సమయంలో అభ్యర్థుల జాబితా ప్రకటించకుండానే పొన్నాల పార్టీని ఎలా విమర్శిస్తారని ప్రశ్నించారు. -
పొన్నాల ఎఫెక్ట్.. కాంగ్రెస్‌కు భారీ షాక్!
సాక్షి, జనగామ: కాంగ్రెస్ ప్రకటించిన రెండు జాబితాల్లో టీపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్యకు చోటుదక్కక పోవడాన్ని నిరసిస్తూ 13 మంది కౌన్సిలర్లు, ఏడు మండలాల పరిధిలో 28 వేల మంది కార్యకర్తలు బుధవారం తమ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్‌రెడ్డికి లేఖ పంపించారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు చెంచారపు బుచ్చిరెడ్డి అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో నియోజకవర్గ ఇన్చార్జి చెంచారపు శ్రీనివాస్‌రెడ్డి, మునిసిపల్ ఫ్లోర్ లీడర్ ఎండి అన్వర్లు మాట్లాడారు. ఏడు మండలాల పరిధిలో మండల, జిల్లా బాధ్యులతో పాటు అనుబంధ సంఘాల అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ ప్రతినిధులు, బూత్ కమిటీ సభ్యులు, జనగామ మునిసిపల్ కౌన్సిలర్లు రాజీనామా చేసిన వారిలో ఉన్నట్లు పేర్కొన్నారు. వచ్చే జాబితాలో పొన్నాల పేరు ప్రకటించని పక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నాలుగు దశాబ్దాలుగా జనగామకు పెద్ద దిక్కుగా ఉంటూ.. కాంగ్రెస్‌కు వన్నె తీసుకు వచ్చిన పొన్నాలపై పార్టీలోని ఓ వర్గం కుట్ర పూరితంగా వ్యవహరించడం పద్ధతి కాదన్నారు. పొన్నాలను కాదని కూటమి తరుపున ఎవరు పోటీ చేయాలని ప్రయత్నించినా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి ఎలాంటి సహకారం ఉండదని తేల్చి చెప్పారు. బీసీ నేత అని చిన్నచూపు చూస్తే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొత్త కరుణాకర్‌రెడ్డి, ధర్మపురి శ్రీనివాస్, మేడ శ్రీనివాస్, మల్లేశం, సర్వల నర్సింగారావు, చిర్ర సత్యనారాయణ రెడ్డి, మహేందర్, అభిగౌడ్, రఘుఠాకూర్, సంపత్‌నాయక్, మజార్ షరీఫ్, శ్రీనివాస్, సత్యం తదితరులు పాల్గొన్నారు. -
వీళ్లకు ఇబ్బందేనా?
సాక్షి ప్రతినిధి, వరంగల్: సాధారణ ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు ఓడిపోయినా.. ప్రత్యర్థుల చేతిలో 30 వేల కంటే ఎక్కువ ఓట్ల తేడాతో ఓటమి పాలైనా.. గత ఎన్నికల్లో 25 వేల కంటే తక్కువ ఓట్లు వచ్చినా.. ఆయా అభ్యర్థులకు ఈ సారి టికెట్ ఇచ్చేది లేదని కాంగ్రెస్ పార్టీ స్వీయ మార్గదర్శకాలను రూపొందించుకుంటోంది. టీపీసీసీ ఎన్నికల కమిటీ ఏర్పాటైన తర్వాత నాలుగు రోజుల కిందట జరిగిన ప్రాథమిక భేటీలో పై అంశాలు చర్చకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే కమిటీ మరిన్ని సార్లు సమావేశమై టికెట్ల ఖరారుకు సంబంధించిన కీలక మార్గదర్శకాలను ఆమోదించనుంది. ఇవే నిబంధనలు నూటికి నూరుపాళ్లు అమలు చేస్తే కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు కీలక నేతలకు టికెట్లు దక్కే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు టికెట్ల రేసులో ముందంజలో ఉన్న పొన్నాల లక్ష్మయ్య, విజయరామారావు, డాక్టర్ రామచంద్రనాయక్‌తోపాటు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న ఎర్రబెల్లి స్వర్ణకు ఇబ్బందికర పరిస్థితి ఉన్నట్లు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. పొన్నాల పరిస్థితి ఏంటో ..! గత ఎన్నికలల్లో జనగామ నియోజకవర్గం నుంచి పోటీచేసిన అప్పటి పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య.. టీఆర్ఎస్ పార్టీకి చెందిన తన సమీప ప్రత్యర్ధి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చేతిలో 32,695 ఓట్ల తేడాతో ఓడిపోయారు. సుదీర్ఘకాలం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసి రికార్డు సాధించిన ఆయన తపాసుపల్లి నిర్మాణం పూర్తి చేసినప్పటికీ ప్రజలు మద్దతు తెలపలేదు. 2014 ఎన్నికల్లో జనగామ నియోజకవర్గంలో మొత్తం 1,70,930 ఓట్లు పోల్ కాగా.. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి 84,074 ఓట్లు, పొన్నాల లక్ష్మయ్యకు 51,379 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ నిబంధనలు కఠినంగా అమలు చేస్తే లక్ష్మయ్యకు ఇబ్బందికర పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే ఆయన టీపీసీసీ ఎన్నికల కమిటీలోనూ, ఎన్నికల మేనిఫెస్టో కమిటీలోనూ సభ్యుడిగా ఉండటంతో పాటు సుధీర్ఘకాలంగా మంత్రిగా పని చేసిన అనుభవం ఉన్న నేపథ్యంలో లక్ష్మయ్యకు ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వొచ్చని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. 55 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓటమి.. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి టికెట్ రేస్‌లో ముందున్న మాజీ మంత్రి విజయరామారావుకు ఈ నిబంధనలు అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ఇక్కడ తాటి కొండ రాజయ్య హ్యాట్రిక్ సాధించారు. రాజయ్య చేతిలో ఆయన 58,829 ఓట్ల తేడాతో ఓడిపోయారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకర్గంలో మొత్తం 1,79,052 ఓట్లు పోల్ కాగా, తాటికొండ రాజయ్యకు అత్యధికంగా 1,03,662 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన విజయరామారావు 44,833 ఓట్లతోనే సరిపెట్టుకున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎర్రబెల్లి స్వర్ణ మరోసారి టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. గత సాధారణ ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి వినయ్ భాస్కర్ చేతిలో 56,374 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక్కడ మొత్తం 1,40,788 ఓట్లు పోల్ కాగా.. స్వర్ణకు కేవలం 27,188 ఓట్లు వచ్చాయి. డోర్నకల్‌లో డిపాజిట్ నిబంధన.. గత ఎన్నికల్లో డోర్నకల్ నియోజకవర్గం నుంచి టీడీపీ–బీజేపీ కూటమి తరఫున డాక్టర్ రామచంద్రనాయక్ పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆయన డోర్నకల్ టికెట్ రేసులో హాట్ ఫెవరేట్‌గా ఉన్నారు. గత సాధారణ ఎన్నికల్లో ఆయనకు 8,384 ఓట్లు మాత్రమే వచ్చాయి. డిపాజిట్ కూడా దక్కలేదు. ఇక్కడ మొత్తం 1,64,352 ఓట్లు పోల్ కాగా.. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన రెడ్యానాయక్‌కు అత్యధికంగా 84,170 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ స్వీయ నిబంధనలు రామచంద్రనాయక్‌కు ప్రధాన అడ్డంకిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. వర్ధన్నపేటలో కొండేటి శ్రీధర్‌కు.. వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి కొండేటి శ్రీధర్‌కు ఇబ్బందిక పరిస్థితులే ఉన్నాయి. గత ఎన్నికల్లో ఆయన టీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేష్ చేతిలో 86,349 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక్కడ మొత్తం 1,77,745 ఓట్లు పోల్ కాగా.. కొండేటి శ్రీధర్‌కు 30,905 ఓట్లు మాత్రమే వచ్చాయి. రమేష్‌కు అత్యధికంగా 1,17,254 ఓట్లు పోలయ్యాయి. తన కు మరో అవకాశం ఇవ్వాలని టీపీసీసీకి శ్రీధర్ దరఖాస్తు చేసుకున్నారు. స్క్రీనింగ్ కమిటీ కూడా ఆయన అభ్యర్థనను పరిశీలించినట్లు తెలుస్తోంది. అయితే 86 వేల భారీ తేడాతో ఓటమి పాలైన నేపథ్యంలో పార్టీ వైఖరి ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. గెలుపు గుర్రాల కోసం వడపోత.. టికెట్ల ఖరారుకు సంబంధించి ఏఐసీసీ నియమించిన స్క్రీనింగ్ కమిటీ ఈ నెల 10, 11, 12, 13వ తేదీల్లో హైదరాబాద్‌లో పర్యటించనుంది. గెలుపు గుర్రాల కోసం వడపోత చేపట్టనుంది. టీ పీసీసీ ఎన్నికల కమిటీ ఇచ్చిన 1:3 జాబితాను వడపోసిన అనంతరం 15వ తేదీలోపు ప్రతి నియోజకవర్గానికి ఒకరు లేదా ఇద్దరి పేర్లతో ఏకే ఆంటోనీ నేతృత్వంలోని జాతీయ ఎన్నికల కమిటీకి జాబితా ఇవ్వనుంది. అక్కడ తుది నిర్ణయం తీసుకుని 15వ తేదీ నుంచి 20వ తేదీలోపు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించనున్నారు. -
'అరువు తెచ్చుకున్న నేతలతో టీఆర్ఎస్ జాబితా'
హైదరాబాద్: విధానాలు, సిద్ధాంతాలు లేని పార్టీ టీఆర్ఎస్ అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. టీఆర్ఎస్ మేనిఫెస్టో ఆచరణ సాధ్యంగా లేదని, ప్రజలను మోసం చేసేలా ఉందని అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో సగానికి పైగా అరువు తెచ్చుకున్న నేతలే ఉన్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ద్రోహులకు, భూకబ్జాదారులకు టీఆర్ఎస్ టికెట్లు ఇచ్చిందన్నారు. కేసీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు రైతుల ఆత్మహత్యలను పట్టించుకోలేదన్నారు. ముప్పై ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క అభివృద్ధి ప్రతిపాదన తేలేదన్నారు. తాను మంత్రిగా సాధించిన ఐటీ ఐఆర్ ప్రాజెక్ట్‌ను కేసీఆర్ ప్రస్తావించడం ఆయనకు సొంత ఆలోచనలు లేవనడానికి నిదర్శనమన్నారు. తెలంగాణకు కాపలాకుక్కలా ఉంటానన్న కేసీఆర్ ఇప్పుడు సీఎం పదవి కోరితే తప్పేంటి అనడం ఆయన అధికార దాహానికి అద్దంపడుతోందన్నారు. తనపై సీబీఐ కేసు లేదని, కేసీఆర్‌పై భవిష్యత్తులో కేసులు పడతాయని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని ప్రజలు నమ్మడం లేదని పొన్నాల అన్నారు. -
త్వరలో విడుదల
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థుల జాబితా దాదాపుగా ఖరాైరె నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీతో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తదితరులు సోమవారం భేటీ అయిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల జాబితాపై ఆ పార్టీ ఎన్నికల కమిటీ ఆమోద ముద్ర వేసినట్లు అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం. ఐదు నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లపై స్పష్టత రాగా,నిజామాబాద్ అ ర్బన్ తో పాటు జుక్కల్, ఎల్లారెడ్డి, బాన్సువాడపై కొంత సస్పె న్స్ పెట్టారు. ప్రకటన లాంఛనమే దాదాపుగా అభ్యర్థుల జాబితా ఖరారైందని, నేడో, రేపో అధికారికంగా ప్రకటన చేయడం లాంఛనంగా మిగిలిందని ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు పేర్కొన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల నడుమ పొత్తులు లేవని తేలిన నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ, టీపీసీసీకి 15 రోజుల క్రితమే జిల్లాకు చెందిన అభ్యర్థుల జాబితాను పంపింది. ఆ జాబితాపై కసరత్తు చేసిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఒక్కో స్థానం నుంచి ఇద్దరు నుంచి ఐదుగురు పేర్లను ఏఐసీసీ స్క్రీనిం గ్ కమిటీకి అందజేసింది. సోమవారం సాయంత్రం అభ్యర్థుల ఎంపికపై ఆమోదముద్ర పడిందని సమాచారం. డీఎస్ కోరుకున్నట్టుగానే పీసీసీ మాజీ చీఫ్, ఎమ్మెల్సీ ధర్మపురి శ్రీనివాస్ కోరిక మేరకు ఆయనకు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం కేటాయించారు. కామారెడ్డికి టీపీసీసీ ప్రచార కమిటీ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహ్మద్ షబ్బీర్ అలీ, బోధన్ నుంచి మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, ఆర్మూరు నుంచి మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి పేర్లు ఖరారయ్యాయి. బాలొ ్కండ మాజీ విప్ ఈరవత్రి అనిల్‌కే దక్కనుంది. నిజామాబాద్ అర్బన్ సహా మరో మూడు నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లు ఖరారైనా అధిష్టానం గోప్యంగా ఉంచు తోంది. డి.శ్రీనివాస్ ఒకవేళ మనసు మార్చుకుని మళ్లీ నిజామాబాద్ అర్బన్‌ను ఎంచుకుంటే తప్ప ఆయన రూరల్ నుంచే పోటీ చేస్తారు. అర్బన్ నియోజకవర్గం నుంచి ఆకుల లలిత, ధర్మపురి సంజయ్, తాహెర్ బిన్ హందాన్ తదితరులలో ఒకరికి టికెట్ దక్కనుంది. జుక్కల్, ఎల్లారెడ్డి, బాన్సువాడల నుంచి ఎక్కువ మంది పోటీ పడు తున్నందున చివరి నిముషం వరకు సస్పెన్స్ పెట్టి, అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది.