సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థుల జాబితా దాదాపుగా ఖరాైరె నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీతో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తదితరులు సోమవారం భేటీ అయిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల జాబితాపై ఆ పార్టీ ఎన్నికల కమిటీ ఆమోద ముద్ర వేసినట్లు అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం. ఐదు నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లపై స్పష్టత రాగా,నిజామాబాద్ అ ర్బన్ తో పాటు జుక్కల్, ఎల్లారెడ్డి, బాన్సువాడపై కొంత సస్పె న్స్ పెట్టారు.
ప్రకటన లాంఛనమే
దాదాపుగా అభ్యర్థుల జాబితా ఖరారైందని, నేడో, రేపో అధికారికంగా ప్రకటన చేయడం లాంఛనంగా మిగిలిందని ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు పేర్కొన్నారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీల నడుమ పొత్తులు లేవని తేలిన నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ, టీపీసీసీకి 15 రోజుల క్రితమే జిల్లాకు చెందిన అభ్యర్థుల జాబితాను పంపింది. ఆ జాబితాపై కసరత్తు చేసిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఒక్కో స్థానం నుంచి ఇద్దరు నుంచి ఐదుగురు పేర్లను ఏఐసీసీ స్క్రీనిం గ్ కమిటీకి అందజేసింది. సోమవారం సాయంత్రం అభ్యర్థుల ఎంపికపై ఆమోదముద్ర పడిందని సమాచారం.
డీఎస్ కోరుకున్నట్టుగానే
పీసీసీ మాజీ చీఫ్, ఎమ్మెల్సీ ధర్మపురి శ్రీనివాస్ కోరిక మేరకు ఆయనకు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం కేటాయించారు. కామారెడ్డికి టీపీసీసీ ప్రచార కమిటీ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహ్మద్ షబ్బీర్ అలీ, బోధన్ నుంచి మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, ఆర్మూరు నుంచి మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి పేర్లు ఖరారయ్యాయి. బాలొ ్కండ మాజీ విప్ ఈరవత్రి అనిల్‌కే దక్కనుంది. నిజామాబాద్ అర్బన్ సహా మరో మూడు నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లు ఖరారైనా అధిష్టానం గోప్యంగా ఉంచు తోంది. డి.శ్రీనివాస్ ఒకవేళ మనసు మార్చుకుని మళ్లీ నిజామాబాద్ అర్బన్‌ను ఎంచుకుంటే తప్ప ఆయన రూరల్ నుంచే పోటీ చేస్తారు.
అర్బన్ నియోజకవర్గం నుంచి ఆకుల లలిత, ధర్మపురి సంజయ్, తాహెర్ బిన్ హందాన్ తదితరులలో ఒకరికి టికెట్ దక్కనుంది. జుక్కల్, ఎల్లారెడ్డి, బాన్సువాడల నుంచి ఎక్కువ మంది పోటీ పడు తున్నందున చివరి నిముషం వరకు సస్పెన్స్ పెట్టి, అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది.
త్వరలో విడుదల
Published Tue, Apr 1 2014 2:23 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement