D.srinivas
-
మంచి స్నేహితుడిని కోల్పోయాను..
న్యూడిల్లీ : వైఎస్ వివేకానందరెడ్డి ఆకస్మిక మృతిపట్ల పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ... వివేకానందరెడ్డి మృతి బాధాకరమని, ఆయనతో కలిసి తాము పని చేశామని గుర్తు చేసుకున్నారు. ఆయన చాలా సౌమ్యుడు, వివాదాలకు అతీతంగా వ్యవహరించేవారు. దిగజారిన రాజకీయ సంస్కృతికి వివేకానందరెడ్డి అతీతుడు. ఆయన కుటుంబ సభ్యులకు సీపీఐ తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా అని నారాయణ పేర్కొన్నారు. చదవండి.... (వైఎస్ వివేకానందరెడ్డి కన్నుమూత) టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డీ.శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘వైఎస్ వివేకానందరెడ్డి మృతి నాకు ఎంతో బాధ కలిగించింది. ఆయన కుటుంబంతో నాకు మంచి అనుబంధం ఉంది. ఒక మంచి స్నేహితుడిని కోల్పోయాను. ఆయన ఒక మంచి రాజకీయవేత్త. వివేకానందరెడ్డి మృతికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. ఈ ఆపద సమయంలో వారి కుటుంబం ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నా.’ అని ఆకాంక్షించారు. అలాగే మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ... వైఎస్ వివేకానందరెడ్డి మరణంతో ఓ నిజాయితీ గల నాయకుడిని ప్రజలు కోల్పోయారని అన్నారు. -
ధర్మపురి సంజయ్ అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు!
నిజమాబాద్ నర్సింగ్ విద్యార్థినులను లైంగికంగా వేధించిన కేసులో ధర్మపురి సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం విచారణకు హాజరైన అనంతరం సంజయ్‌ను పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు. ఆయనను సుదీర్ఘంగా మూడు గంటల పాటు విచారించారు. మధ్యలో ఓసారి బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత మరోసారి విచారించారు. అనంతరం అతనిని అరెస్టు చేశారు. ఆ తర్వాత అతనిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆదివారం కావడంతో ఆయనను న్యాయమూర్తి ముందు హాజరుపరిచి అనంతరం రిమాండుకు తరలించనున్నారు. విద్యార్థినుల ఫిర్యాదుతో ధర్మపురి సంజయ్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే. సంజయ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ శాంకరీ నర్సింగ్ కళాశాల విద్యార్థినులు ఆరోపించారు. ఈ కేసులో 41- సీఆర్పీసీ ప్రకారం పోలీసులు సంజయ్‌కు నోటీసులు జారీచేశారు. ఈ కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీసులు ఈ నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో అజ్ఞాతంలోకి వెళ్లిన సంజయ్ ఎట్టకేలకు ఆదివారం పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. -
నోరు విప్పిన డీఎస్; కేసీఆర్ కోర్టులో బంతి!
సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ పార్టీలో తన పాత్ర చుట్టూ చోటుచేసుకుంటోన్న వ్యవహారాలపై ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) ఎట్టకేలకు నోరు విప్పారు. జరుగుతున్న పరిణామాలు దురదృష్టకరమని, క్రమశిక్షణ గురించి ఎవరో తనకు చెప్పాల్సిన అవసరంలేదని వ్యాఖ్యానించారు. బుధవారం ఉదయం తనను కలిసిన విలేకరులతో ‘‘నో కామెంట్.. నన్నేమీ అడగొద్దు..’’ అన్న డీఎస్... సాయంత్రానికి హైదరాబాద్‌లో మీడియాతో చిట్‌చాట్ చేశారు. ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ చీఫ్ కె.చంద్రశేఖర్‌రావును డీఎస్ కలవాల్సిఉన్నా, అంతకుముందే ఆయన మీడియాతో మాట్లాడటం, అదే సమయంలో ‘కేసీఆర్‌తో డీఎస్ అపాయింట్మెంట్ రద్దు’ వార్తలు రావడం గమనార్హం. నాతో మాట్లాడితే సరిపోయేది: ‘‘నేను ఏ పార్టీలో ఉన్నా ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తాను. క్రమశిక్షణ గురించి ఒకరు నాకు చెప్పాల్సిన పనిలేదు. నిజామాబాద్‌లో జరుగుతోన్న పరిణామాలు దురదృష్టకరం. ఏవైనా తేడాలుంటే నాతో మాట్లాడాల్సింది. కానీ ఏకంగా ఫిర్యాదు లేఖ రాయాల్సిన అవసరం ఏమొచ్చిందో ఎంపీ కవితను, ఎమ్మెల్యేలనే అడగండి. సరే, ఏది ఏమైనా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా చెబితే అలా. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఓకే. అది ఆయన చేతుల్లోనే ఉంది. సీఎం అపాయింట్మెంట్ అడిగాను కానీ అటు నుంచి స్పందన ఏదీ రాలేదు’’ అని డీఎస్ చెప్పారు. ఢిల్లీకి వెళ్లాను కానీ.. అది అబద్ధం: తాను ఢిల్లీకి వెళ్లినమాట వాస్తవమేనని అయితే వ్యక్తిగత పనుల కోసమే తప్ప రాజకీయాల కోసం కాదని డీఎస్ స్పష్టం చేశారు. ‘‘ఢిల్లీలోని నా క్వార్టర్ రిపేర్ పనులు జరుగుతున్నాయి. ఆ పని చూసుకుని తిరిగొచ్చేశాను. అక్కడ నేను కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్‌ను కలిశానని చెప్పడం పచ్చి అబద్ధం. టీఆర్ఎస్లో చేరిన తర్వాత ఇతర పార్టీ నేతలను కలవడమే మానేశా. అయినా, ఢిల్లీ వెళ్తే కాంగ్రెస్ నేతలు తప్ప ఇంకెవరు కనిపిస్తారు?’’ అని డీఎస్ పేర్కొన్నారు. కొడుకు అరవింద్ గురించి: ‘‘పెద్దాయన ఒక పార్టీలో ఉంటూ కార్యకర్తలను మాత్రం ఇంకో పార్టీలో చేరమని ప్రోత్సహిస్తున్నారు..’’అన్న ఎంపీ కవిత వ్యాఖ్యలకు డీఎస్ వివరణ ఇచ్చారు. ‘‘మా అబ్బాయి ఇండిపెండెంట్. తనకు తాను స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటాడు. వాటితో నాకు సంబంధంలేదు. అతని వ్యవహారాల్లో నేను తలదూర్చను’’ అని డీఎస్ చెప్పుకొచ్చారు. డీఎస్‌పై చర్యలు తీసుకోండి: మూడేళ్ల కిందట కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిన డి.శ్రీనివాస్.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఎంపీ కవిత నేతృత్వంలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకుల బృందం సీఎం కేసీఆర్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. గత మూడు రోజులుగా డీఎస్ ఢిల్లీలో ఉన్నారని, అక్కడ కాంగ్రెస్ ముఖ్య నేతలతో ఆయన మంతనాలు జరిపాలరని నేతలు ఆరోపించారు. -
బీజేపీ నేతలను కలిసిన డీఎస్ తనయుడు
న్యూఢిల్లీ : టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డీ.శ్రీనివాస్ రెండో కుమారుడు ధర్మపురి అరవింద్ శనివారం బీజేపీ నేతలను కలిశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు రాంమాధవ్, రాంలాల్‌తో ఆయన ఇవాళ భేటీ అయ్యారు. కాగా అరవింద్ బీజేపీలో చేరతారంటూ గత కొంతకాలంగా ఊహాగానాలు వినిపించాయి. ఆయన నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా రానున్న ఎన్నికల్లో బరిలోకి దిగుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో ఆయన ఓ జాతీయస్థాయి పత్రికకు ఇచ్చిన భారీ ప్రకటన రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న అరవింద్ ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ‘‘జాతి మొత్తం మోదీ వెంటే నిలవాలి..’’ అని పేర్కొంటూ ప్రకటన ఇచ్చారు. ఇది రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈరోజు బీజేపీ నేతలను అరవింద్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ఇప్పటికే డీఎస్ ప్రధాన అనుచరుడిగా పేరున్న సంగారెడ్డి జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ కొన్ని నెలల కిందట బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు డీఎస్ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకుంటారనే వార్తలు వినిపించినా ఆయన వాటిని ఖండించారు. తాను టీఆర్ఎస్లోనే ఉంటానని, పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా తన కుమారుడు ఇచ్చిన ప్రకటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని కూడా స్పష్టం చేశారు. అరవింద్ కూడా బీజేపీలో చేరుతాడని అనుకోవడం లేదని డీఎస్ అన్నారు. -
కాంట్రవర్సీలు చేయడం ఆయనకు అలవాటే...
-
కాంట్రవర్సీలు చేయడం ఆయనకు అలవాటే...
హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దిగ్విజయ్ తీరు వల్ల కాంగ్రెస్సే నష్టపోతోందని, కాంట్రవర్సీలు చేయడం ఆయనకు అలవాటు అని డీఎస్ మంగళవారమిక్కడ వ్యాఖ్యానించారు. దేశ భద్రతకు సంబంధించిన అంశాలపై నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని, ఇందుకు సంబంధించి దిగ్విజయ్‌పై కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని, తక్షణమే ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డీఎస్ డిమాండ్ చేశారు. దిగ్విజయ్ పోలీసులపై చేసిన సంచలన వ్యాఖ్యలు ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. ముస్లిం యువకులను ఐసిస్ వైపు పోలీసులు ప్రోత్సహిస్తున్నారనటం అర్ధరహితమన్నారు. దిగ్విజయ్‌వి తెలివితక్కువ మాటలని ఎద్దేవా చేశారు. రోజుకో మాట మాట్లాడే సంస్కృతి దిగ్విజయ్ సింగ్‌ది అన్నారు. కాగా తెలంగాణ పోలీసులు ఐసిస్ పేరిట నకిలీ వెబ్సైట్ ఏర్పాటుచేసి ముస్లిం యువతను రెచ్చగొడుతున్నారంటూ దిగ్విజయ్ ట్వీటర్లో పోస్టు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు రాష్ట్ర పోలీస్ శాఖపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దిగ్విజయ్‌పై పోలీస్ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. -
కేంద్ర సహకారం లేదు: డీఎస్
రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేసిన డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంత్‌రావు సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు కృషి చేస్తున్నా కేంద్రం నుంచి ఆశించిన సహకారం లభించడం లేదని రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం ఇక్కడ చైర్మన్ హమీద్ అన్సారీ సమక్షంలో రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ‘కేసీఆర్ ఇచ్చిన అవకాశంతో రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేశాను. మేమందరం ఒక పట్టుదలతో రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేసేందుకు అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, వెయ్యి రూపాయల పెన్షన్, సన్న బియ్యం.. ఇంకా ఎన్నెన్నో పథకాలు అమలవుతున్నాయి. లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి ఒక కాలవ్యవధి పెట్టుకుని ముందుకు సాగుతున్నాం. అయితే కేంద్రం నుంచి ఆశించిన సహకారం రావడంలేదు. కేంద్ర ప్రోత్సాహాన్ని సంపాదించేందుకు నావంతు కృషి చేస్తా’ అని పేర్కొన్నారు. మరో ప్రశ్నకు సమాధానంగా ‘కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం అనేది పార్టీ నిర్ణయించే అంశం. ప్రజోపయోగ కార్యక్రమాల్లో మా మద్దతు తప్పకుండా ఉంటుంది..’ అని అన్నారు. డీఎస్‌తో పాటు వొడితెల లక్ష్మీకాంతరావు కూడా మంగళవారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బంగారు తెలంగాణకు తన వంతు కృషిచేస్తానని పేర్కొన్నారు. -
బంగారు తెలంగాణకు బాటలు వేస్తాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన మున్నూరు కాపులు బంగారు తెలంగాణ నిర్మాణంలో కూడా పాలుపంచుకుంటారని పలువురు నేతలు పేర్కొన్నారు. శనివారం ఇక్కడ జరిగిన మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనంలో ఇటీవల ఎంపీగా ఎన్నికైన డి.శ్రీనివాస్, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్‌లను సన్మానించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న ముఖ్య అతిథిగా హాజరుకాగా, ఎంపీ కె. కేశవరావు, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ మాట్లాడుతూ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కాకుండా వేరే ఎవరు ఆ స్థానంలో ఉన్నా తెలంగాణ వచ్చేది కాదని, కేసీఆర్ కాకుండా మరెవరు ముఖ్యమంత్రి అయినా తెలంగాణ అభివృద్ధి చెందేది కాదని అన్నారు. వెనుకబడ్డ వర్గాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న సీఎంకు మున్నూరు కాపులు అండగా నిలవాలన్నా రు. జోగు రామన్న మాట్లాడుతూ మున్నూరు కాపులకు గుర్తింపునిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మద్దతుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, పూల రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
సార్.. చాంబర్ ఎక్కడ?
సచివాలయంలో డీఎస్ కోసం కార్యాలయం వెతుకులాట సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమితులైన డి.శ్రీనివాస్‌కు ఎక్కడ కార్యాలయం కేటాయిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సూచనలతో సాధారణ పరిపాలనా శాఖ అధికారులు ఈ పనిలో పడ్డారు. సీ, డీ బ్లాక్‌లలో ఎక్కడెక్కడ ఖాళీ గదులున్నాయి? ఎవరెవరి కార్యాలయాలు ఖాళీగా ఉన్నాయి..? అనే వివరాలను సేకరించారు. ఈ రెండు బ్లాక్‌లలో ఇటీవల పార్లమెంటరీ కార్యదర్శులకు కేటాయించిన ఆఫీసులు ఖాళీగా ఉంటున్నాయి. ప్రొటోకాల్ తొలగించటం, జీత భత్యాలు నిలిపివేయటంలో పార్లమెంటరీ కార్యదర్శులు ఆఫీసులకు రావటం లేదు. వీటిలో డీఎస్ కోరుకున్న చాంబర్‌ను కేటాయించే అవకాశాలు లేకపోలేదు. కానీ పార్లమెంటరీ కార్యదర్శులు 3 నెలల ముచ్చట తీరకముందే పదవులకు దూరమయ్యారు. దీంతో డీఎస్ సన్నిహితులు వీటిని తీసుకోవద్దని వారిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు ఆయన అనుచరులు డీ బ్లాక్‌లో వాస్తుకు అనుగుణంగా ఉన్న కార్యాలయాలను వెతికే పనిలో పడ్డారు. -
టీఆర్ఎస్ బలోపేతమంటే.. తెలంగాణ బలోపేతమే
* టీఆర్ఎస్లో డీఎస్ చేరిక సందర్భంగా సీఎం కేసీఆర్ వ్యాఖ్య * బంగారు తెలంగాణ కోసమే టీఆర్ఎస్లోకి: డీఎస్ సాక్షి, హైదరాబాద్: ‘‘టీఆర్ఎస్లో ఎవరు చేరినా.. టీఆర్ఎస్ బలోపేతమవుతుందని అంటున్నారు. ఎలాంటి డౌట్ లేదు. టీఆర్ఎస్ బలోపేతం కావడం అంటే తెలంగాణ బలోపేతం కావడం. తెలంగాణను తెచ్చిందే టీఆర్ఎస్. అది చరిత్ర. ఎవరూ కాదనలేరు. ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు. పార్టీలు, రాజకీయాలు వేరు. శతృత్వాలు ఉండవు. డీఎస్‌తో నాకు 35 ఏళ్లుగా సంబంధాలున్నాయి. మాకు పదవులు లేనప్పుడు కూడా కలిసే ఉన్నాం..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో టీఆర్ఎస్లో చేరారు. డీఎస్‌కు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం కేసీఆర్ మాట్లాడారు. డీఎస్‌కు చిన్న చిన్న పదవులు లెక్కకాదని, రెండు సార్లు ఉమ్మడి రాష్ట్రంలో వందల మందికి టికెట్లు ఇచ్చారన్నారు. డీఎస్ తెలంగాణ మేధావి అని, పరిపక్వత ఉన్న రాజకీయ నాయకుడని కితాబిచ్చారు. సెల్యూట్ చేస్తున్నా.. ‘‘తెలంగాణ బలోపేతం గురించి ఆలోచన చేసిన డీఎస్‌కు సెల్యూట్ చేస్తున్నా. పరిపక్వత ఉన్న వారికే ఈ ఆలోచన సాధ్యం. పదవులు లెక్కే కాదు. వర్తమాన రాజకీయ చరిత్రలో తెలంగాణ రాష్ట్రం తన అస్తిత్వాన్ని రూపు దిద్దుకుంటోంది. పార్టీలో చేరే వారు చేరొచ్చు. వారిని గౌరవించుకుంటం. డీఎస్‌కు అన్నీ తెలుసు. పది జిల్లాల్లో మూల మూలన పరిచయాలు ఉన్నాయి, వివాద రహితుడు, సం స్కారం ఉన్న వ్యక్తి. ఒక తమ్ముడిలా ఆయనను పార్టీలోకి ఆహ్వానిస్తున్నా. ఆయన సీనియారిటీ, అనుభవాన్ని తెలంగాణకు ఉపయోగించుకుంటం. రెండు మూడు రోజుల తర్వాత డీఎస్ ఇంటికి స్వయంగా వెళ్లి అన్ని విషయాలు చర్చిస్తామ’’ని కేసీఆర్ పేర్కొన్నారు. దొంగను పట్టుకుంటే.. ఇంత గొడవా? ‘‘తెలంగాణ అభివృద్ధికి అడుగడుగునా అడ్డపడుతున్నారు. దొంగను పట్టుకుంటే చంద్రబాబు ఒకటే గొడవ. మొగన్ని కొట్టి మొగసాలకు ఎక్కుతుండు. కరెంటు ఇవ్వరు, ఇయ్యం.. ఏం చేసుకుంటరంటడు. కార్పొరేషన్ల అకౌంట్లు ఫ్రీజ్ చేస్తరు. ఢిల్లీ నుంచి వచ్చిన నిధులు ఇవ్వరు. మీ బతుకేదో మీరు బతకండి. తెలంగాణ వేరైంది. దాని బతుకేందో అది బతుకుతది. హైదరాబాద్‌ను పట్టుకుని ఒకటే గుంజులాట.. ఇక అటు ఏపీ సహకరించడం లేదంటె.. ఇటు ఇక్కడి రాజకీయ నాయకులకూ ఓపిక లేకుండా పోయింది. ఏం జరగాలన్నా ఓ ఐదేళ్ల దాకా ఓపిక అవసరం కదా.. చాతనైతే సహకరించాలె. కానీ గొంతు పిస్కుడాయే..’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అండగా ఉండేందుకే..: డీఎస్ ‘‘టీఆర్ఎస్లో చేరాలన్న నిర్ణయాన్ని నిర్దిష్టంగా తీసుకున్నా. ఇప్పుడు కేసీఆర్ నాకు కండువా కప్పారుగానీ... 2004లోనే మేం కండువాలు కప్పుకున్నాం. తెలంగాణ ఇచ్చింది సోనియా అయితే, తెచ్చింది కేసీఆర్.. ఆయన ఒత్తిడితోనే తెలంగాణ కల సాకారమైంది. బంగారు తెలంగాణ సాధన కోసం అంతా కలిసి పనిచేయాలి. నా అంతరాత్మ ప్రబోధం మేరకే కాంగ్రెస్‌కు రాజీనామా చేశా.. టీఆర్ఎస్లో చేరుతున్నా..’’ అని డీఎస్ చెప్పారు. కేసీఆర్‌కు అన్నివేళలా అండగా ఉంటానని, తన వెంట పార్టీలోకి వచ్చిన వారి బాగోగులు చూసుకుంటానని చెప్పారు. తెలంగాణ సీఎం పనిచేస్తుంటే పక్క రాష్ట్ర సీఎం పనిలేక ఆటంకాలు పెడుతున్నారంటూ చంద్రబాబును విమర్శించారు. ఇది సెక్యులర్ తెలంగాణ ఇది సెక్యులర్ తెలంగాణ అని, గంగా జమున తహజీబ్ ప్రతీకగా ఉన్న తెలంగాణ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గత పాలకులు తెలంగాణ సంస్కృతిని ధ్వంసం చేశారని.. ఈ తెలంగాణలో మనదైనటువంటి సంస్కృతితో ముందుకు వెళదామని చెప్పారు. ‘‘పాత వైభవం, పాత సంస్కృతి, మనదైనటువంటి సంస్కృతి, మనదైనటువంటి ఆలోచనా విధానంతో ప్రస్ఫుటంగా, ప్రబలంగా, అద్భుతంగా ముందుకు వెళదాం. హైదరాబాద్ రంజాన్ పండుగకు ఒకప్పుడు పెట్టింది పేరు. మహబూబ్ అలీఖాన్ రంజాన్ పండుగ రోజున చల్లే రూపాయలు తెచ్చుకునే వారు. అంత గొప్పగ జరిగేది. మధ్యలో వచ్చిన వారికి రంజాన్ తెలియదు, బక్రీద్ తెలియదు. హైదరాబాద్ సంస్కృతిని ధ్వంసం చేశారు. హిందూ ముస్లింలు ఒకరి అభివృద్ధికి ఒకరు సహకరించుకోవాలి. 750 సంవత్సరాల ముస్లిం రాజుల పాలనలో ఒక్కసారి కూడా మతకలహాలు జరగలేదు. మధ్యలో కొందరు లుచ్చాలు, గూండాలు మతకల్లోలాలు సృష్టించారు. స్వాతంత్య్రానికి ముందు మహాత్మాగాంధీ కూడా నిజాం గొప్పతనాన్ని, హైదరాబాద్ గొప్పతనాన్ని పొగిడారు. హైదరాబాద్‌ను చూసి ఉత్తర భారతం నేర్చుకోవాలన్నారు. ఈ గొప్ప తనాన్ని భవిష్యత్ తరాలకు ట్రాన్స్ఫర్ చేయాలి..’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. -
కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన డి.శ్రీనివాస్
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి డీ.శ్రీనివాస్ గుడ్‌బై చెప్పారు. ఆయన బుధవారం టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సమంక్షంలో డీ.శ్రీనివాస్ గులాబీ కండువా కప్పుకున్నారు. తెలంగాణ భవన్లో జరిగి ఈ కార్యక్రమంలో కేసీఆర్ పార్టీ కండువా కప్పి డీఎస్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. డీఎస్‌తో పాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు, నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేశారు. కాగా డీఎస్‌కు కేబినెట్ ర్యాంకుతో ప్రభుత్వ ముఖ్య సలహాదారు పదవి కానీ, రాజ్యసభ సభ్యునిగా కానీ అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. -
నా నిర్ణయం సరైనదే: డీఎస్
హైదరాబాద్ : తెలంగాణవాదులందర్నీ ఏకతాటిపైకి తెచ్చిన ఘనత కేసీఆర్‌దే అని డి.శ్రీనివాస్ అన్నారు. ఆయన బుధవారం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ఉద్యమించడం వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్...సోనియాగాంధీని ఒప్పించారని అన్నారు. కేసీఆర్-సోనియా గాంధీల మధ్య చక్కని అవగాహన ఉందన్నారు. కేసీఆర్ ఒత్తిడి వల్లే తెలంగాణ ప్రకటన వచ్చిందని డీఎస్ అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నిరాహార దీక్ష చేశారన్నారు. ఆరు దశాబ్దాల పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రం అని, అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ కోసం రాజ్యాంగబద్ధంగా పోరాటం చేశానని డీఎస్ అన్నారు. టీఆర్ఎస్ లో చేరటంపై తన నిర్ణయం సరైనదేనని ఆయన అభిప్రాయపడ్డారు. సోనియాను గౌరవిస్తూ కేసీఆర్‌ను బలోపేతం చేయడానికే టీఆర్ఎస్లో చేరానన్నారు. కేసీఆర్ ఎన్సైక్లోపిడియా అని, ప్రజల కోరిక మేరకే పార్టీలో చేరినట్లు చెప్పారు. తాను బీ ఫాం ఇస్తే గెలిచినవారు ఇప్పుడు తనను విమర్శిస్తున్నారని, తానేవరికీ భయపడనని డీఎస్ స్పష్టం చేశారు. 2004లో తాను టీఆర్ఎస్ కండువా, కేసీఆర్ కాంగ్రెస్ కండువా వేసుకున్నామని, 2004లో రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయని డీఎస్ తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ వల్లే సాధ్యమని ఆయన అన్నారు. -
రేపు కారెక్కనున్న డీఎస్
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు సమక్షంలో బుధవారం తెలంగాణ భవన్లో డీఎస్ గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్లో ఏర్పాట్లు చేసినట్లు పార్టీ కార్యాలయ వర్గాలు చెప్పాయి. ఇటీవలే కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన డీఎస్ టీఆర్ఎస్లో చేరనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు తెలంగాణ కాంగ్రెస్‌లోని కొందరు నాయకులు, ఆయన సొంత జిల్లా నిజామాబాద్ నుంచి మరికొందరు నేతలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్లో కాంగ్రెస్‌కు 16 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వీరిలో అత్యధికులు డీఎస్‌ను అనుసరిస్తారని అంటున్నారు. మరికొందరు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా ఈ జాబితాలో ఉన్నారని సమాచారం. చేరిక కార్యక్రమాన్ని అట్టహాసంగా కాకుండా, సాదా సీదాగానే జరపాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు చెబుతున్నారు. డీఎస్‌కు కేబినెట్ ర్యాంకుతో ప్రభుత్వ ముఖ్య సలహాదారు పదవిగానీ, రాజ్యసభ సభ్యునిగాగానీ అవకాశం ఇచ్చే వీలుందంటున్నారు. త్వరలో జరగనున్న శాసన మండలి స్థానిక సంస్థల కోటా ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి గెలిపించి ముఖ్యమైన శాఖతో మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం కూడా సాగుతోంది. -
'నువ్వుంటే ఎంత..? పోతే ఎంత..?'
-
కేసీఆర్‌కు రూ.5 కోట్లతో బస్సు ఎందుకు?
న్యూఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ...జిల్లాల్లో పర్యటన కోసం 'తెలంగాణ హరిత పథం' పేరుతో రూ.5 కోట్లతో బస్సును కొనుగోలు చేయటాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు తప్పుబట్టారు. కేసీఆర్‌కు రూ.5 కోట్లతో బస్సు ఎందుకు...అదే రూ.5 కోట్లను పేదల కోసం ఖర్చు చేయొచ్చు కదా? అని ఆయన ప్రశ్నించారు. ఐదు కోట్లతో బస్సును కొనడం ప్రజా దుర్వినియోగమే అని వీహెచ్ మండిపడ్డారు. కేసీఆర్‌కు ఎవరి నుంచి ప్రాణహాని లేదని, అలాంటప్పుడు అంత ఖర్చు చేయాల్సిన అవసరం ఉందా అని ఆయన విమర్శించారు. వీహెచ్ ఇవాళ ఉదయం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. సీనియర్ నేత డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీని వీడటంతో పాటు, తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలను ఆయన ఈ సందర్భంగా సోనియాకు వివరించారు. సోనియాతో సమావేశం అనంతరం వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ 'డీఎస్ పచ్చి అవకాశ వాది, ఆయన కాంగ్రెస్‌ను వీడటం వల్ల పార్టీకి ఎలాంటి నష్టం లేదు. కాంగ్రెస్‌లో అన్ని పదవులు అనుభవించిన డీఎస్...ఇప్పుడు టీఆర్ఎస్ నేతల అవకాశాలు కొల్లగొట్టేందుకు వెళ్తున్నారన్నారు. -
సోనియాతో వీహెచ్ భేటీ, తాజా పరిస్థితులపై వివరణ
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో ఆపార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీ హనుమంతరావు శుక్రవారం భేటీ అయ్యారు. ఆయన ఈ సందర్భంగా పీసీసీ మాజీ చీఫ్ డీ.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా అంశంతో పాటు, తాజా పరిస్థితులపై వివరిస్తున్నట్లు సమాచారం. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ నయవంచకుడని, కాంగ్రెస్ పార్టీలో అవమానం జరిగిందని, తనకు అన్యాయం చేశారని డి.శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అందువల్లే ఆ పార్టీని వీడుతున్నానని.. మంచి ముహూర్తం చూసుకుని టీఆర్ఎస్లో చేరతానని ఆయన చెప్పారు. గురువారం డీఎస్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం విదితమే. -
కాసేపట్లో డీ.శ్రీనివాస్ ప్రెస్‌మీట్
హైదరాబాద్ : గులాబీ గూటికి చేరనున్న కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ.శ్రీనివాస్ గురురవారం ఉదయం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడుతున్న పరిణామాలపై ఆయన ఈ సందర్భంగా వివరించనున్నారు. కాగా డీఎస్ తన రాజీనామా ఇవాళ ప్రకటించనున్నారు. అలాగే టీఆర్ఎస్లో చేరడంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మరోవైపు రాజీనామా చేయడానికి కారణాలను, టీఆర్ఎస్లో చేరాలనే నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన పరిస్థితులను ఒక బహిరంగ లేఖలో వివరించనున్నారు. సీఎం కేసీఆర్ కనుసన్నల్లో రూపొందిన ఆ బహిరంగ లేఖను ఉదయం విడుదల చేయనున్నారు. కాంగ్రెస్‌ను వీడుతున్నట్లుగా బుధవారం రాత్రే ఏఐసీసీ నాయకత్వానికి డీఎస్ ఒక లేఖను ఫ్యాక్స్ చేశారు. -
6న టీఆర్ఎస్లో చేరనున్న డీ.శ్రీనివాస్
-
6న టీఆర్ఎస్లో చేరనున్న డీ.శ్రీనివాస్
హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఈ నెల 6వ తేదీన టీఆర్ఎస్లో చేరనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన అధికారికంగా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. డీ.శ్రీనివాస్ బుధవారం కేసీఆర్‌తో క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ అధిష్ఠానం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న డీఎస్...కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ సోనియాగాంధీకి బహిరంగ లేఖ రాసే యోచనలో ఉన్నారు. మరోవైపు కేసీఆర్‌తో డీఎస్ భేటీ కొనసాగుతోంది. క్యాంపు కార్యాలయం నుంచి డీఎస్ నేరుగా నిజామాబాద్ వెళ్లనున్నారు. జిల్లాలోని అనుచరులతో ఆయన మూడురోజుల పాటు సమావేశాలు నిర్వహిస్తారు. కాగా డీఎస్‌కు ఎలాంటి పదవి ఇస్తారన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. నిజామాబాద్ జిల్లా పార్టీ నేతలతో కేసీఆర్ చర్చలు జరుపుతున్నారు. -
సీఎంను పరామర్శించడానికే వచ్చా
-
కేసీఆర్‌ను పరామర్శించడానికే వచ్చా: డీఎస్
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ జ్వరంతో బాధపడుతున్నారని తెలిసి పరామర్శించడానికి వచ్చానని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీ.శ్రీనివాస్ అన్నారు. ఆయన బుధవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం డీఎస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు గుర్తింపు లేదని, పార్టీ అధినేత్రి సోనియా గాంధీని ఇతర నేతలు పక్కదారి పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. అయితే కాంగ్రెస్ పార్టీని వీడుతున్న విషయాన్ని మాత్రం డీఎస్ ప్రస్తావించలేదు. కాగా శాసనమండలిలో తిరిగి అవకాశం ఇవ్వనందుకు అసంతృప్తికి గురైన డీఎస్ హస్తానికి చేయిచ్చి, కారు ఎక్కేందుకు రంగం సిద్ధం చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన ఈనెల 6వ తేదీన గులాబీ కండువా కప్పుకోనున్నారు. -
కేసీఆర్‌తో డీ.శ్రీనివాస్ సమావేశం
-
కేసీఆర్‌తో డీ.శ్రీనివాస్ సమావేశం
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన ఆపార్టీ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ హస్తానికి హ్యాండ్ ఇచ్చారు. ఆయన బుధవారం కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారు. డీ శ్రీనివాస్ ఇవాళ ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. మరికాసేపట్లో డీ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నిజామాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కూడా డీఎస్ బాటలోనే పయనిస్తున్నారు. ఆయన కూడా టీఆర్ఎస్లో చేరనున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఈ నెల 6వ తేదీన గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఛాన్స్ దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న డీఎస్‌ను బుజ్జగించేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. డీఎస్ నివాసానికి బుధవారం ఉదయం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, డీ హనుమంతరావు తదితరులు వెళ్లినా... డీఎస్ లేకపోవటంతో వారు వెనుదిరిగారు. ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత మారిన పరిణామాలు రాష్ట్ర రాజకీయాలలో ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, ఎమ్మెల్యేల కోటా కింద జరిగిన ఎమ్మెల్సీల ఎన్నికల తర్వాత మార్పులు చర్చనీయాంశంగా మారాయి. ఇదే సమయంలో ఎమ్మెల్సీ టికెట్ తీవ్రంగా యత్నించిన పీసీసీ మాజీ చీఫ్, మాజీ మంత్రి డీఎస్‌కు చేదు అనుభవం ఎదురైంది. తనకు శిష్యులుగా పేరున్న ఆ కుల లలిత రాఘవేందర్‌లకు తన ప్రమేయం లేకుండా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారన్న ఆవేదనను కూడా ఆయన అనుచరుల వద్ద వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తనపట్ల సానుకూలంగా ఉన్నా.. పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ వ్యతిరేకంగా వ్యవహరించినందు వల్లే అన్యాయం జరిగిం దని కూడ వాపోయినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే మనస్తాపానికి గురైన డి.శ్రీనివాస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ కూడ రాసినట్లు ప్రచారం జరిగింది. అ లేఖలో దిగ్విజయ్ సింగ్ వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వీటన్నింటినీ పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీని డీఎస్ వీడేందుకే నిర్ణయించుకున్నారన్న ప్రచారానికి బలం చేకూరుతుండగా, ఆయన మాత్రం ప్రత్యక్షంగా స్పందించకపోవడంపై సస్పెన్స్ నెలకొంది. -
దిగ్విజయ్‌కు డీఎస్ షాక్ !
హైదరాబాద్ : ఏఐసీసీ ప్రధానకార్యదర్శి దిగ్విజయ్‌సింగ్‌పై అసంతృప్తితో ఉన్న పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ మరోసారి షాక్ ఇచ్చారు. గాంధీభవన్‌లో ఆదివారం జరిగిన పీవీ నరసింహారావు జయంతి కార్యక్రమానికి డీఎస్ హాజరు కాలేదు. శాసనమండలి టికెట్ రాకపోవడానికి మీరే కారణమని డీఎస్ అసంతృప్తితో ఉన్నారని, అందుకే ఆయన ఈ సమావేశానికి హాజరుకాలేదని అక్కడ ఉన్న పీసీసీ నేతలు దిగ్విజయ్‌కు చెప్పారు. దీంతో డీఎస్ ఇంటికి పోదామని, ఫోన్ కలిపి ఇవ్వాలని పీసీసీ ప్రొటోకాల్ విభాగానికి చెందిన నేతకు ఆయన సూచించారు. వెంటనే డీఎస్‌కు ఆ నాయకుడు ఫోన్ చేశారు. దిగ్విజయ్ మాట్లాడతారని చెప్పగానే.. డీఎస్ విముఖత వ్యక్తం చేశారు. పార్టీకి కీలకమైన ఈ సమయంలో తీరని నష్టం చేసిన దిగ్విజయ్‌తో ఫోన్లో మాట్లాడటం కూడా ఇష్టంలేదని, ఇంకా ఏ ముఖం పెట్టుకుని ఇంటికి వస్తాడని డీఎస్ ఘాటుగా సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో చేసేదేమీలేక దిగ్విజయ్ మౌనం వహించారు. -
డిగ్గీ వర్సెస్ డీఎస్!
-
కొంపముంచిందే దిగ్విజయ్ సింగ్...
హైదరాబాద్ : శాసనసభ్యుల కోటా నుంచి ఎమ్మెల్సీ టికెట్ రాకుండా ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్ అడ్డుపడ్డారని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఆవేదన చెందినట్లు సమాచారం. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, పార్టీ అంతర్గత అంశాలపై అనుచరులు, సన్నిహితులతో డీఎస్ తన మనోభావాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా పార్టీకి విధేయంగా, అధినేత ఆదేశాలకు అనుగుణంగా, విశ్వాసంగా, వివాదరహితంగా, అందరితోనూ సమన్వయంగా పనిచేసుకుంటూ పోవడమే కొందరు పెద్దలకు నచ్చడం లేదని ఆవేదన చెందినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల కోటలో ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడానికి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా సుముఖంగానే ఉన్నా దిగ్విజయ్ సింగ్ అసూయ, ఈర్ష్యతో అడ్డుపడ్డారని డీఎస్ వాపోయినట్లు తెలిసింది. -
ప్రజలకు ఎందుకు దూరమయ్యాం
కాంగ్రెస్ బలోపేతంపై డీఎస్ కమిటీ సమాలోచనలు సంప్రదాయ ఓటు బ్యాంకుకు గండిపడిందని అభిప్రాయం హైదరాబాద్: కాంగ్రెస్‌కు సంప్రదాయ ఓటుబ్యాంకుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, యువత, రైతులు, మహిళలు దూరమవడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యామని టీపీసీసీ హైపవర్ కమిటీ అభిప్రాయపడింది. రాష్ర్టంలో వైఎస్సార్సీపీ పోటీ చేయడం వల్ల కూడా కాంగ్రెస్‌కు నష్టం జరిగిందని భావిస్తోంది. కన్వీనర్ డి.శ్రీనివాస్ అధ్యక్షతన కమిటీ సభ్యులు సోమవారం గాంధీభవన్‌లో సమావేశమయ్యారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నందు వల్ల సెటిలర్లు పార్టీని దెబ్బతీశారని, ఎన్నికల్లో వ్యతిరేకంగా ఓటు వేశారని, మైనారిటీలు కూడా పార్టీకి వ్యతిరేకంగా తీర్పునివ్వడంతో ఓటమిని చవిచూడాల్సి వచ్చిందని ఈ సందర్భంగా కమిటీ అంచనాకు వచ్చింది. అనంతరం డి.శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ వచ్చేనెల రెండో వారంకల్లా పార్టీ సభ్యత్వ కార్యక్రమం ముగియగానే జిల్లా పర్యటనలను ప్రారంభిస్తామని, పార్టీ నాయకత్వానికి వంద రోజుల్లో నివేదికను అందజేస్తామని తెలిపారు. వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు వారానికి రెండు జిల్లాల చొప్పున పర్యటనలు చేపడతామన్నారు. సమస్యలు పట్టని సీఎం: ఉత్తమ్ సీఎం కేసీఆర్‌కు ప్రజల సమస్యలు పట్టడం లేదని, ఆయన ధ్యాసంతా పార్టీ ఫిరాయింపులపైనేనని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. సోమవారం రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌లో చెత్తపోయిందని, నిఖార్సైన కార్యకర్తలు మిగిలారన్నారు. కార్యకర్తలకు అన్యాయం జరిగితే నాయకత్వం అండగా ఉంటుందని, ఇందుకోసం గాంధీభవన్‌లో హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఏఐసీసీ కార్యదర్శి ఆర్.సి.కుంతియా మాట్లాడుతూ సభ్యత్వాన్ని సత్వరమే పూర్తిచేసి, పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి కేంద్రీకరించాలని కోరారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క పాల్గొన్నారు. ఇదిలాఉండగా, రంగారెడ్డి జిల్లా నేతల సమావేశంలో మాజీమంత్రి మల్రెడ్డి రంగారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్‌లు ముఖ్యనేతల మధ్యే పరోక్షంగా పరస్పర విమర్శలు చేసుకోవడం జిల్లా కాంగ్రెస్‌లో విభేదాలను బట్టబయలు చేసింది. -
సోనియాతో భేటీ అయిన డీఎస్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ శాసనమండలిలో ప్రతిపక్ష నేత, సీనియర్ కాంగ్రెస్ నేత డి.శ్రీనివాస్ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో మంగళవారం ఇక్కడ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలు, అందుకు కారణాలు వివరించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసినప్పుడు నేరుగా బ్యాంకులతో మాట్లాడుకుందని, ఇప్పుడు వాయిదాల పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడంతో ఈ పరిస్థితి ఎదురైందని వివరించారు. కాగా, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదును సీరియస్‌గా తీసుకోవాలని సోనియా చెప్పారని డీఎస్ తెలిపారు. నేతలంతా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని ఆమె సూచించినట్టు చెప్పారు. -
క్రమశిక్షణ ఉల్లంఘనలపై కొరడా
టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల * పార్టీ బలోపేతానికి ప్రణాళిక * సభ్యత్వ నమోదుపై దృష్టి * 23న మైనారిటీల సమావేశం * కాంగ్రెస్ ఎంపీలు, మాజీ ఎంపీల సమావేశంలో నిర్ణయం సాక్షి, హైదరాబాద్: పార్టీ నేతలు ఎంతటివారైనా క్రమశిక్షణతో ఉండాలని, హద్దుదాటితే కఠినంగా వ్యవహరించాలని, ఎవరినీ ఉపేక్షించకూడదని నిర్ణయించినట్లు టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. గాంధీ భవన్లో ఆదివారం ఆయన పార్టీ ఎంపీలు, మాజీ ఎంపీలు, ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయిన వారితో సమావేశమయ్యారు. సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో పార్టీ బలోపేతానికి ప్రణాళిక, నేతల సేవల వినియోగం తదితర అంశాలపై చర్చించారు. తమను విశ్వాసంలోకి తీసుకోవడం లేదని, పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదని ఆరోపించిన ఎంపీలు.. ప్రత్యేకంగా భేటీ కావాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో, సీనియర్లు కల్పించుకుని టీపీసీసీ అధ్యక్షుని నేతృత్వంలోనే సమావేశం జరిగేలా ప్రయత్నించారు. సీఎల్పీ నేత కె.జానారెడ్డి, మండలిలో సీఎల్పీ నేత డి.శ్రీనివాస్, ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, నంది ఎల్లయ్య, వి.హనుమంతరావు, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. మాజీ కేంద్ర మంత్రులు జైపాల్‌రెడ్డి, బలరాం నాయక్, మాజీ ఎంపీ మధు యాష్కి మినహా 16మంది పాల్గొన్న ఈ సమావేశ వివరాలను పొన్నాల మీడియాకు వెల్లడించారు. ‘సభ్యత్వ నమోదుకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వనున్నాం. 14 నుంచి 19వ తేదీ వరకు ఆరు రోజుల పాటు విస్తృతంగా సభ్యత్వాన్ని నమోదు చేస్తాం. దీనికోసం సమన్వయ కమిటీలనూ నియమిస్తాం. ఆయా పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎంపీలు, మాజీ ఎంపీలే సభ్యత్వ నమోదు బాధ్యతను తీసుకుంటారు. సభ్యత్వ నమోదుపై 23న సమీక్ష నిర్వహిస్తాం. ఈ సమీక్ష సమావేశానికి ఏఐసీసీ నాయకత్వం కూడా హాజరవుతుంది. అదే రోజు కాంగ్రెస్ మైనారిటీ సెల్ సమావేశాన్ని కూడా నిర్వహిస్తాం’ అని పొన్నాల తెలిపారు. పార్టీని వదిలి వెళ్లిన ఎమ్మెల్యేల ఇళ్ల ఎదుట ఆయా నియోజకవర్గాలకు చెందిన పార్టీ శ్రేణులు ఆందోళన చేస్తాయని, పదవులకు రాజీనామా చే యాలని ఒత్తిడి తెస్తామని ఆయన వివరించారు. జీహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సమన్వయ కమిటీలను నియమిస్తామన్నారు. ఏఐసీసీ ఏర్పాటు చే సిన టీపీపీసీ సమన్వయ కమిటీలో తమకు స్థానం కల్పించాలని ఎంపీలు, మాజీ ఎంపీలు కోరారని, ఈ అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ పాల్గొన్నారు. -
రైతుల ఆత్మహత్యలపై భగ్గుమన్న విపక్షాలు
ఆందోళనల మధ్యే మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం కాంగ్రెస్, టీడీపీ సభ్యుల నిరసన.. బడ్జెట్ కాపీలను చించేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీలు సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, టీడీపీ సభ్యుల ఆందోళన మధ్య శాసన మండలిలో ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. విపక్ష సభ్యులు బడ్జెట్ ప్రసంగం ప్రారంభించినప్పట్నుంచే రైతుల ఆత్మహత్యలపై ప్రకటన చేయాలని నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. బడ్జెట్ తర్వాత బీఏసీలో చర్చిద్దామని మండలి చైర్మన్ పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఆందోళన కొనసాగించారు. తాము బడ్జెట్‌కు వ్యతిరేకం కాదని, ముందుగా ప్రకటన చేయాలని పట్టుబడుతూ పలుమార్లు చైర్మన్ పోడియం వద్దకు వెళ్లారు. మండలిలో ప్రతిపక్ష నేత డి.శ్రీనివాస్ మాత్రం పోడియం వద్దకు వెళ్లకుండా తన సీటు వద్దే ఉండి నిరసన వ్యక్తం చేశారు. ‘తెలంగాణ రైతులను కాపాడండి.. ఆత్మహత్యల నుంచి తెలంగాణ రైతాంగాన్ని కాపాడాలి.. రోగాల నుంచి తెలంగాణ ప్రజలను కాపాడండి.. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించి విద్యార్థులను ఆదుకోవాలి’ అని నినాదాలు చేశారు. బడ్జెట్ ప్రసంగం కొనసాగినంత సేపూ ప్లకార్డులను ప్రదర్శించారు. నలుపు కండువాలు మెడలో వేసుకొని నిరసన వ్యక్తంచేశారు. కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్సీలు నినాదాలు చేస్తుండటంతో టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు సుధాకర్‌రెడ్డి, రవీందర్ తదితరులు లేచి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ ఆందోళన మధ్య డి.శ్రీనివాస్‌కు మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలపై ప్రకటన చేయాలని కోరారు. ఆ తర్వాత రాజయ్య తన ప్రసంగం కొనసాగించారు. అయినా విపక్ష సభ్యులు మళ్లీ ఆందోళనను కొనసాగించారు. దీంతో మరో రెండుసార్లు డి.శ్రీనివాస్‌కు మాట్లాడే అవకాశం ఇచ్చారు. చివ రిసారి ఆయనకు మైక్ ఇచ్చినా... మంత్రి తన ప్రసంగాన్ని కొన సాగించారు. బీజేపీ ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్ తన సీటు వదే ్ద నిల్చొని నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు తెచ్చిన ప్లకార్డును తీసుకొని, ఆ పార్టీ పేరు కనిపించకుండా పట్టుకొని ప్రదర్శించారు. బడ్జెట్ ప్రసంగం చివరికి చేరుకునే సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు బడ్జెట్ ప్రతులను చించి, సభలో సభ్యులపైకి విసిరివేశారు. వారి ఆందోళనల నడుమే మండలిని శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ స్వామిగౌడ్ ప్రకటించారు. -
కట్టడి అంటే కర్రపట్టుకుని కాపలా కాయాలా?
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీ. కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, డీ. శ్రీనివాస్ లు మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కేసీఆర్ పై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని, ప్రతిపక్షమే లేకుండా చేయాలని కేసీఆర్ చూస్తున్నారని పొన్నాల విమర్శించారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న ప్రజా ప్రతినిధులపై అనర్హత వేటు వేయాలని వారు కోరారు. ఫిరాయింపుల అంశాన్ని కౌన్సిల్ చైర్మన్, శాసనసభ స్పీకర్ దృష్టికి తీసుకెళ్తామని వారు తెలిపారు. పార్టీ మారాలనుకుంటున్న నేతలు తమ పదవులకు రాజీనామా చేయాలని, పార్టీ వీడుతున్న నేతలు చెబితే మా లోపాలను సరిచేసుకుంటామని కాంగ్రెస్ నేతలు అన్నారు. స్వార్ధం కోసం పార్టీ వీడుతున్న నేతలను కట్టడి చేయడమంటే.. కర్రపట్టుకుని కాపలా కాయాలా అంటూ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు పొన్నాల సమాధానమిచ్చారు. -
'అధికారం కోసమే కేసీఆర్ హామీలిచ్చారు'
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని శాసనమండలి ప్రతిపక్ష నేత డీ శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. సీఎల్పీ కార్యాలయంలో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీల భేటీ ముగిసింది. అనంతరం డీఎస్ మాట్లాడుతూ ప్రతిపక్షమే లేకండా చేయాలనే ధోరణిలో అధికార పక్షం ఉందని మండిపడ్డారు. ఓట్లు దండుకుని అధికారంలోకి రావడానికే కేసీఆర్ ఎన్నికల హామీలు ఇచ్చారే తప్ప, వాటిని అమలు చేయాలనే చిత్తశుద్ధితో కాదని విమర్శించారు. కౌన్సిల్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించామని, అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని డీఎస్ తెలిపారు. -
సతీశ్‌పవార్ మృతితో విషాదం
నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్‌పవార్ అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కొంత కాలంగా ఆయన బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. శుక్రవారం అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో ఆస్పత్రిలో కన్నుమూశారు. కాంగ్రెస్ పార్టీలో చేరి తన రాజకీయ జీవితాన్ని ప్రారం భి ంచిన ఆయన నిజామాబాద్‌లో కౌన్సిలర్‌గా గెలుపొందారు. అనంతరం నేరుగా జరిగిన ఎన్నికలలో చైర్మన్‌గా గెలుపొందారు. 1994లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరి తన రాజకీయ గురువు డి. శ్రీనివాస్‌పై పోటీ చేసి గెలుపొందారు. 2004లో మరొక సారి పోటీ చేసి ఓడిపోయారు. 2005లో జరిగిన మున్సిప ల్ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికలలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశాలతో కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలుపొందారు. టీడీపీకి మెజార్టీ రాకపోవడంతో మేయర్ పదవి దక్కలేదు. 2010లో నిజామాబాద్ అర్బన్ ఉప ఎన్నికల సందర్బంగా టీడీపీకి రాజీనామా చేసి డీఎస్ సమక్షంలోనే తిరిగి స్వంత గూటికి చేరారు. ఓ వైపు రాజ కీ యాలలో ఉంటూనే మరోవైపు సినీరంగంలో అడిగి పెట్టి పలు చిత్రాలకు పంపిణీదారుగా వ్యవహరించారు. కొన్ని చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. శుక్రవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. శాసనమండలి విపక్షనేత డి. శ్రీనివాస్, నిజామాబాద్ అర్బన్, రూరల్ ఎమ్మెల్యేలు గణేష్‌గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, కామా రెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్, టీపీసీసీ అధికార ప్రతినిధి మహేష్‌కుమార్‌గౌడ్, నిజామాబాద్ మేయర్ ఆకుల సుజాతాశ్రీశైలం,ఎమ్మెల్సీ రాజేశ్వర్ సతీశ్‌పవార్ మృత దే హంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. పవార్ మృతదేహాన్ని చూసి డీఎస్ కంటతడిపెట్టారు. మాజీ ఎమ్మెల్యేలు గంగారాం, జనార్దన్‌గౌడ్ కాంగ్రెస్, టీడీ పీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అనుచరులు, ప్రజలు అంత్యక్రియలలో పాల్గొన్నారు. -
కేసీఆర్ ఆత్మ పరిశీలన చేసుకో: డీఎస్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీ ఏపీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ మండిపడ్డారు. కేసీఆర్ 100 రోజుల పాలనలో ప్రజలకు కేసీఆర్ చేసిందేమిటో ఆత్మపరిశీలన చేసుకోవాలని డీఎస్ సూచించారు. ఎన్నికల ప్రచారం, మానిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేరకపోతే తల నరక్కుంటానన్న కేసీఆర్ ప్రకటనను నమ్మి ప్రజలు టీఆర్ఎస్ను గెలిపించారని ఆయన అన్నారు. కాని కేసీఆర్ మాత్రం ఇచ్చిన హామీల అమలు దిశగా చర్యలు తీసుకోవడంలేదని డీఎస్ విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగబద్దంగా నడుస్తోందా, లేక ఏకపక్షంగా నడుస్తోందా అర్ధం కావడంలేదని డీఎస్ ఎద్దేవా చేశారు. ప్రభుత్వం తప్పులు చేస్తున్నప్పుడు ప్రజలే వాటిని సరిదిద్దాలని డీఎస్ అన్నారు. -
అహంకారంతో వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ నేతలు: డీఎస్
చేగుంట: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి చెల్లని రూపాయి అంటూ మహిళలను అవమానించే విధంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడటం శోచనీయమని పీసీసీ మాజీ అధ్యక్షుడు, శాసనమండలి పక్షనాయకుడు డి. శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా చేగుంటలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజాసేవకు ప్రాముఖ్యత ఇచ్చే సునీతాలక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరారు. సమావేశంలో రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనందభాస్కర్, సునీ తాలక్ష్మారెడ్డి, బండి నర్సాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
పొన్నాల, డీఎస్ లతో విభేదాలు లేవు: జానారెడ్డి
న్యూఢిల్లీ: తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి ఆశించడంలేదని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి స్పష్టం చేశారు. పీసీసీ అధ్యక్షుడ్ని ఒకవేళ అధిష్టానం మార్చాలనుకుంటే సలహాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని జానా అన్నారు. ప్రస్తుత తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, మాజీ పీసీసీ చీఫ్ డీ శ్రీనివాస్‌తో నాకు ఎలాంటి విభేదాలు లేవని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. సందర్భానుసారంగా పొన్నాల మాట్లాడలేకపోతున్నారని, మేధోమథనం సదస్సు ఎప్పుడనేది పొన్నాల నాతో చెప్పలేదని జానా అన్నారు. సీఎల్పీ కమిటీ ఏర్పాటుపై ఆయనతో నేను చర్చించలేదన్నారు. పీఎసీ ఛైర్మన్ ఎవరనేది నేనే నిర్ణయిస్తానని మరో ప్రశ్నకు జానారెడ్డి సమాధానమిచ్చారు. -
చంపేందుకు కుట్ర జరుగుతోందని డీఎస్ తనయుడు ఫిర్యాదు!
హైదరాబాద్: తనను చంపేందుకు కొందరు వెంబడిస్తున్నారని మాజీ పీసీసీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్ తనయుడు సంజయ్ ఆరోపించారు. తనను హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారని సంజయ్ మంగళవారం మధ్యాహ్నం బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో సంజయ్ ఫిర్యాదు చేశారు. గతంలో నిజామాబాద్ మేయర్ గా సంజయ్ సేవలందించారు. వ్యక్తిగతంగా తనకెవరితో విబేధాలు లేవని సంజయ్ పోలీసులకు తెలిపినట్టు సమాచారం. సంజయ్ చేసిన ఫిర్యాదు ఆధారంగా అనుమానిత వ్యక్తులపై బంజారాహిల్స్ పోలీసులు దృష్టి కేంద్రికరించారు. -
తెలంగాణలో పర్యటించాలని సోనియాకు ఆహ్వానం
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ డి. శ్రీనివాస్ శనివారం కలిశారు. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, ఎన్నికల్లో ఓటమి తదితర అంశాలపై వీరిరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. భేటీ అనంతరం డీఎస్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి రాష్ట్రానికి రావాలని సోనియాగాంధీని ఆహ్వానించినట్లు తెలిపారు. సోనియా వల్లే తెలంగాణ వచ్చిందన్న భావన ప్రజల్లో బలంగా ఉందని డీఎస్ అన్నారు. అయితే ఎన్నికల్లో గెలుపు ఓటమి సహజమని ఆయన అన్నారు. కాంగ్రెస్ బలోపేతానికి, పార్టీ కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు. పోలవరం ఆర్డినెన్స్‌పై కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని డీఎస్ విమర్శించారు. దీనివల్ల గిరిజనులకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన చెందారు. -
గొంతునొక్కి బిల్లు పాస్ చేశారు
చంద్రబాబు, వెంకయ్య చెప్పుచేతల్లో మోడీ నడుస్తున్నారు భవిష్యత్ కార్యాచరణకు సిద్ధం: టీఆర్ఎస్ ఎంపీలు సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభలో మందబలంతో మా గొంతు నొక్కి పోలవరం ఆర్డినెన్సు బిల్లును ఆమోదించారని టీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. బలవంతంగా ఆమోదించిన ఆర్డినెన్సు బిల్లు వెనుక ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కుట్ర ఉందని ఆరోపించారు. పార్లమెంటు వెలుపల శుక్రవారం టీఆర్ఎస్ లోక్‌సభ నేత జితేందర్‌రెడ్డి, ఎంపీలు సీతారాంనాయక్, బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సహా పది పార్టీల ఎంపీలు అడ్డుకున్నా.. పోలవరం ఆర్డినెన్సు చట్టం చేయడం దురదృష్టకరమన్నారు. ఆర్డినెన్సు బిల్లును రాజ్యసభలో అడ్డుకుంటామని చెప్పారు. సంఖ్యాబలం చూసుకుని మైనార్టీ సభ్యులను ఎన్డీఏ ప్రభుత్వం అణగదొక్కిందని మండిపడ్డారు. స్పీకర్ సుమిత్రా మహజన్ ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు. అన్యాయం జరిగితే సుప్రీంకు వెళ్లాలని స్పీకర్ చెప్పడం పార్లమెంటు విలువలను దిగజార్చడమేనన్నారు. అన్ని అంశాలను కోర్టులే తేల్చితే ఇక చట్టసభలు ఎందుకున్నట్టు అని ప్రశ్నించారు. కేంద్రంతో కలిసి పనిచేయాలని మేం అనుకుంటుండగా.. మాతో దుర్మార్గంగా వ్యవహరించిందని ఎన్డీఏ ప్రభుత్వంపై ఆగ్రహం వెలిబుచ్చారు. ఆదివాసీలు, గిరిజనులకు జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతున్నట్టు ప్రకటించారు. వెంకయ్య, బాబు చెప్పుచేతల్లో ప్రధాని మోడీ నడుస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో ఆదివాసి, గిరిజనులకు అన్యాయం జరుగుతుంటే రాష్ట్రంలో బీజేపీ ఏం చేస్తోందని అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని ప్రశ్నించారు. తెలంగాణ భూభాగాన్ని, ఆదివాసి గిరిజనులను కాపాడుకోడానికి సీఎం కేసీఆర్ నాయకత్వాన కచ్చితంగా సుప్రీంను ఆశ్రయిస్తామని, అక్కడ న్యాయం జరుగుతుందని విశ్వాసం వెలిబుచ్చారు. ఇప్పటికే టీఆర్ఎస్ ఎంపీ సీతారామ్‌నాయక్ సుప్రీంలో కేసు వేశారని చెప్పారు. సభ నుంచి వాకౌట్ చేశాం: ఎంపీ కవిత పోలవరం ఆర్డినెన్స్ బిల్లును దొడ్డిదారిన తెచ్చి ఆమోదించడాన్ని నిరసిస్తూ లోక్‌సభ నుంచి వాకౌట్ చేశామని టీఆర్ఎస్ ఎంపీ కె. కవిత చెప్పారు. పార్లమెంట్ ప్రాంగణంలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ ఆర్డినెన్స్ బిల్లును ఆమోదించారు. రాష్ట్ర సరిహద్దులు మార్చాలంటే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకకు బిల్లు పంపాలి. ఆ తర్వాత బిల్లును పార్లమెంట్లో పెట్టాలి. అలా చేయకుండా దొడ్డిదారిన ఆర్డినెన్స్ బిల్లును తీసుకురావడం చాలా అన్యాయం. ఈ విషయాన్ని స్పీకర్‌కు చెబితే కోర్టు ద్వారా తేల్చుకోవాలని చెప్పారు. దీనిని మేమే కాదు.. అన్ని పార్టీలు ఖండించాయి. సభ నుంచి మేం వాకౌట్ చేశాం. తెలంగాణ, గిరిజనుల పక్షాన నిల్చుంటాం’ అని చెప్పారు. రాజ్యసభలో అడ్డుకునేందుకు టీఆర్ఎస్ యోచన సవరణ బిల్లును రాజ్యసభలో అడ్డుకోవాలని, దీనికోసం దేశవ్యాప్తంగా అన్ని పార్టీల మద్దతును కూడగట్టుకోవాలని తెలంగాణ రాష్ట్ర సమితి యోచిస్తోంది. రాజ్యసభలో బీజేపీకి సంఖ్యాబలం తక్కువగా ఉన్నందున అందులో పోలవరం ఆర్డినెన్స్ ముందుకు పోకుండా చేయాల్సిన బాధ్యతను టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావుకు అప్పగించారు. రాజ్యసభలో సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న కాంగ్రెస్‌ను కలుపుకోవాల్సిన బాధ్యతను ఆయనకు అప్పగించింది. -
ఏపీలో పోలవరం విలీనంపై ఎవరేమన్నారు!
పోలవరం బిల్లు బీజేపీకే శాపం: ఈటెల కరీంనగర్ : పోలవరం ముంపు మండలాల విలీనంపై తీసుకువచ్చిన బిల్లు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి శాపంగా పరిణమిస్తుందని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ హెచ్చరించారు. శుక్రవారం కరీంనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా రు. ‘గిరిజన గ్రామాలను ముంచొద్దు, ప్రాజెక్ట్ డిజైన్ మార్చాలని’ టీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా ఉన్న నాటినుంచి పోరాటం చేస్తుందని గుర్తు చేశారు. ‘తెలంగాణ ప్రాంత నీళ్లను దోచుకోవద్దు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని’ ఎంత మొత్తుకున్నా ఆనాటి సమైక్య ప్రభుత్వం వినలేదన్నారు. బీజేపీ ప్రభుత్వం గిరిజనుల కళ్లల్లో మట్టికొడుతూ బిల్లును ఆమోదింపచేసిందన్నారు. ఇది ముమ్మాటికి చంద్రబాబు కుట్ర అని ఆరోపించారు. బిల్లుపై పునరాలోచించాలని కేంద్రాన్ని కోరారు. శవాలపై నడుస్తూ ప్రాజెక్టు కడతారా?: డీఎస్ సాక్షి, న్యూఢిల్లీ: గిరిజనుల శవాలపై నడుచుకుంటూ వెళ్లి ప్రాజెక్టు కడతారా? అని తెలంగాణ శాసనమండలిలో ప్రతి పక్ష నేత డి.శ్రీనివాస్ ప్రశ్నించారు. పోలవరం ముంపు మండలాలను తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందడంపై శుక్రవారం ఢిల్లీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణ బిల్లు తెచ్చినప్పుడు నెలల తరబడి అనేక వర్గాల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే పార్లమెంటులో ఆమోదించారు. ఎవరితోనూ చర్చించకుండా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి సవరణ బిల్లును ఎన్డీయే ప్రభుత్వం ఆమోదించుకోవడం అన్యాయం’ అని పేర్కొన్నారు. న్యాయపోరాటం చేస్తాం: పొంగులేటి సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్లో పోలవరం బిల్లు ఆమోదం పై రాజీలేని న్యాయ పోరాటం చేస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్య కుట్ర ఫలితమే ఈ బిల్లు ఆమోదమని విమర్శించారు. సీఎల్పీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు మిత్రసేన, రేగ కాంతారావులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. ‘పోలవరం ఆర్డినెన్సు ఆమోదం అన్యాయం. శనివారం ఖమ్మం జిల్లా బంద్‌కు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు పలుకుతోంది. 14న అఖిలపక్ష నేతలతో హస్తినలో ధర్నా చేపట్టబోతున్నాం. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం’ అని పేర్కొన్నారు. అడ్డంకులు తొలిగాయి: మంత్రి యనమల సాక్షి, హైదరాబాద్: పోలవరం బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందడంతో ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటి వరకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. సచివాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మూడేళ్ళలో ప్రాజెక్టు పూర్తి చేస్తామని, ముంపు ప్రాంత గిరిజనులకు పునరావాస, పునర్నిర్మాణ పనులు వెంటనే చేపట్టేందుకు వీలుంటుందని తెలిపారు. మూడేళ్లలో పూర్తి చేస్తాం: మంత్రి దేవినేని సాక్షి, విజయవాడ: పోలవరం ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తిచేస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటించారు. ఆయన శుక్రవారం విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ సహాయంతో ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేస్తామన్నారు. పోలవరం ముంపు ప్రాంతాలకు చెందిన గిరిజన, గిరిజనేతరుల్ని ఆదుకునేందుకు.. భూసేకరణ, పునరావాస, పునర్నిర్మాణ పనుల కోసం రూ. 3,200 కోట్లు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. అధికారంలోకి రావడం కోసం ఆ రోజు అన్నింటికీ ఒప్పుకున్న కేసీఆర్ ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారని, బంద్‌లకు పిలుపునిస్తున్నారని విమర్శించారు. -
'అస్త్ర సన్యాసం చేయలేదు'
హైదరాబాద్: తాము అస్త్ర సన్యాసం చేయలేదని పిసిసి మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ చెప్పారు. ప్రభుత్వం, అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షనేత మాట్లాడుతుండగానే ఓటింగ్ మొదలుపెట్టారని విమర్శించారు. మండలి చైర్మన్ ఓటింగ్‌లో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీలు టీఆర్ఎస్కు ఓటు వేసినట్టేనని ఆయన అన్నారు. ఎమ్మెల్సీలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని డీఎస్ డిమాండ్ చేశారు. -
'కాంగ్రెస్ గెలుస్తుందని నమ్మకం ఉంది'
మండలి ఛైర్మన్ ఎన్నికపై ఎమ్మెల్సీలందరికీ విప్ జారీ చేశామని తెలంగాణ రాష్ట్ర శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ సభ పక్ష నాయకుడు డి.శ్రీనివాస్ (డీఎస్) స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ... శాసనమండలి ఛైర్మన్ ఎన్నికకు రహస్య బ్యాలెట్ పెట్టడం సరికాదని డిఎస్ అభిప్రాయపడ్డారు. ఇంత హడావుడిగా కౌన్సిల్ సమావేశం ఎందుకు అంటు ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సెషన్‌ను గవర్నర్‌ను కోరినప్పటికీ ప్రయోజనం లేదన్నారు. ఛైర్మన్‌గా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ఇతర పార్టీ ఎమ్మెల్సీలను కోరామని చెప్పారు. శాసనమండలి ఛైర్మన్ పదవిని గెలుస్తామని తమకు నమ్మకం ఉందని డీఎస్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర మండలి ఛైర్మన్ పదవికి బుధవారం ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నుంచి స్వామిగౌడ్ మంగళవారం నామినేషన్ దాఖలు చేయగా, కాంగ్రెస్ నుంచి పారూక్ హుస్సేన్ నామినేషన్ దాఖలు చేశారు. -
ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాల్సిందే!
-
ఆ అయిదుగురు ఎమ్మెల్సీలపై వేటు వేయండి
హైదరాబాద్ : టీఆర్ఎస్లో చేరిన అయిదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని శాసనమండలిలో విపక్ష నేత డీ శ్రీనివాస్ శనివారం శాసనసభ కార్యదర్శి సదారాంకి ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయించిన వారిని అనర్హులుగా ప్రకటించాలని పిటిషన్లో పేర్కొన్నారు. కాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు ఆమోస్, జగదీశ్వర్‌రెడ్డి, భానుప్రసాద్, రాజలింగం, భూపాల్‌రెడ్డితోపాటు మరికొందరు, వీరితోపాటు బీఎస్పీకి చెందిన ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డి, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పలు టీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా డీఎస్ మాట్లాడుతూ పార్టీ ఫిరాయించిన అయిదుగురు ఎమ్మెల్సీలపై ఫిర్యాదు చేశామన్నారు. ఫిరాయింపును రుజువు చేసే సాక్ష్యాలను ఫిర్యాదు లేఖలో పొందుపరిచినట్లు ఆయన తెలిపారు. వాటిని ఛైర్మన్ పరిశీలించి తక్షణమే ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేస్తారని ఆశిస్తున్నట్లు డీఎస్ తెలిపారు. చైర్మన్ స్పందించకుంటే న్యాయ పోరాటం చేస్తామని ఆయన పేర్కొన్నారు. -
రంగంలోకి దిగిన డీఎస్, ఫోన్లో మంతనాలు
-
రంగంలోకి దిగిన డీఎస్, ఫోన్లో మంతనాలు
హైదరాబాద్ : హస్తానికి హ్యాండ్ ఇచ్చి కారు స్టీరింగ్ పట్టుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్న తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీలను బుజ్జగించేందుకు తెలంగాణ శాసనమండలి నేత డీ శ్రీనివాస్ రంగంలోకి దిగారు. అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్సీలను బుజ్జగించేందుకు డీఎస్ పావులు కదుపుతున్నారు. వారితో ఆయన ఫోన్లో మంతనాలు జరుపుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం కాంగ్రెస్ ఎమ్మెల్సీలతో డీఎస్ భేటీ కానున్నారు. కాగా ఎన్నికల్లో ఓడిపోయిన నేతలు డి.శ్రీనివాస్‌కు, షబ్బీర్ అలీకి కౌన్సిల్లో కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ పదవులివ్వడంపై ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, ఆమోస్, రాజలింగం, జగదీశ్వర్‌రెడ్డి,భానుప్రసాద్‌రావు , భూపాల్‌రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ఇక కాంగ్రెస్‌లో ఉంటే పదవులు సీనియర్లకే వస్తాయి తప్ప పార్టీ కోసం కష్టపడ్డ తమలాంటి వారికి రావనేది వారి ఆరోపణ. దీంతో ఈ ఎమ్మెల్సీలు అధికార టిఆర్ఎస్ వైపు ఆకర్షితులవుతున్నట్లు సమాచారం. వీరంతా టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సమక్షంలో బుధవారం మధ్యాహ్నం గులాబీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డి, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కూడా టీఆర్ఎస్లో చేరనున్నారు. -
చంద్రబాబు ఏకపక్షంగా వ్యవహరించకూడదు: డీఎస్
హైదరాబాద్: రాష్ట్రాలు రెండైనా తెలుగుజాతి ఒక్కటే అన్న చంద్రబాబు ఇప్పుడు తెలంగాణను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మాజీ పీసీసీ చీఫ్ డీ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ కోనుగోళ్ల ఒప్పందాల (పీపీఏ) రద్దు అంశంపై చంద్రబాబు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని డీఎస్ ఆరోపించారు. తెలంగాణ ప్రాంతంపై చంద్రబాబు కక్ష పూరితంగా వ్యవహరించవద్దని డీఎస్ సూచించారు. రాష్ట్రం విడిపోయినా అన్నదమ్ముల్లా కలిసుందామని డీఎస్ అన్నారు. ఉత్తరప్రదేశ్ యూపీ సర్కార్ పన్ను షరతులు సూచించడం వల్ల ఉత్తర తెలంగాణకు చమురు రవాణా నిలిచిపోయిన అంశాన్ని మీడియాకు డీఎస్ వెల్లడించారు. ఇకముందు కూడా ఇదే పరిస్థితి కొనసాగితే చమురు సంక్షోభం తలెత్తుందని ఆయన తెలిపారు. చమురు సంక్షోభం రాకుండా తెలంగాణ ప్రభుత్వం సమస్యను పరిష్కరించాలని డీఎస్ విజ్ఞప్తి చేశారు. -
పదవి కోసం పెద్ద లోల్లి
రసాభాసగా సీఎల్పీ భేటీ డీఎస్, షబ్బీర్‌కు మద్దతుగా రెండుగా చీలిపోయిన ఎమ్మెల్సీలు అధిష్టానం దూతల ముందే దూషణలపర్వం డీఎస్ ఒక్కో ఎమ్మెల్సీకి రూ.10 లక్షలు ఆఫర్ చేశారన్న రాజలింగం ఆరోపణలను ఖండించిన డీఎస్ వర్గం హైదరాబాద్: తెలంగాణ శాసన మండలి ప్రతిపక్ష నేత ఎంపిక కోసం మంగళవారం జరిగిన సీఎల్పీ భేటీ సవ్యంగానే జరిగినట్టు పైకి కనిపిస్తున్నా లోపల మాత్రం పెద్ద గొడవే జరిగింది. ఎమ్మెల్సీలు రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరిపైకి ఒకరు దూషణలపర్వానికి దిగారు. దీంతో అధిష్టానం పెద్దలు బిత్తరపోవాల్సి వచ్చింది. చివరికి వారు ఇరువర్గాలను శాంతింపజేసి ఎంపిక ప్రక్రియను మమ అనిపించారు. తనకు మద్దతివ్వాలంటూ ఒక్కో ఎమ్మెల్సీకి డి.శ్రీనివాస్ రూ.10 లక్షలు ఇచ్చినట్లు ఆ పార్టీ ఎమ్మెల్సీ రాజలింగం ఏకంగా సీఎల్పీ సమావేశంలోనే ఆరోపించడం తీవ్ర చర్చనీయాంశమైంది. టీఆర్ఎస్తో కుమ్మక్కైన డీఎస్‌కు మండలి ప్రతిపక్ష నేత పదవి ఎట్లా ఇస్తారంటూ నిలదీసిన రాజలింగంకు... మాజీ మంత్రి షబ్బీర్ అలీ సైతం మద్దతు పలికారు. ఆయనతోపాటు పలువురు ఎమ్మెల్సీలూ డీఎస్‌పై ఆరోపణలు చేశారు. వీటిని ఖండిస్తూ డీఎస్ వర్గం.. షబ్బీర్ అలీపై ప్రత్యారోపణలు చేయడంతో సమావేశం ఒకదశలో రసాభాసగా మారింది. భేటీ అదుపు తప్పిందని గ్రహించిన హైకమాండ్ దూతలు వయలార్, దిగ్విజయ్‌సింగ్‌లు... ఇరువర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఒక్కొక్కరిని పిలిచి బుజ్జగింపు యత్నాలు ప్రారంభించారు. డీఎస్‌కు మండలి ప్రతిపక్ష నేత పదవి, షబ్బీర్ అలీకి ఉపనేత పదవి ఇస్తామని ప్రతిపాదించారు. ఇందుకు షబ్బీర్ అయిష్టత వ్యక్తం చేసినప్పటికీ ఆయన పేరును ప్రకటించారు. డీఎస్, షబ్బీర్ అలీ ఇద్దరూ నిజామాబాద్ జిల్లాకు చెందిన వారే కావడం గమనార్హం. ఒకే జిల్లాకు రెండు పదవులు ఇవ్వడం పట్ల కాంగ్రెస్ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బేరసారాలు బయటకు పొక్కడం, ఈ విషయం ప్రజల్లోకి వెళితే కాంగ్రెస్ మరింత చులకన అవుతుందనే ఉద్దేశంతోనే షబ్బీర్ అలీకి ఉపనేత పదవిని కట్టబెట్టారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 17 మంది.. రెండున్నర గంటల సినిమా! కాంగ్రెస్ ఎమ్మెల్సీల సమావేశం సస్పెన్స్ సినిమాను తలపించింది. మండలిలో అధికార టీఆర్ఎస్తో పోలిస్తే ప్రతిపక్ష కాంగ్రెస్‌కు ఎమ్మెల్సీల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ప్రతిపక్ష పదవి కోసం గట్టి పోటీ నెలకొంది. డీఎస్, షబ్బీర్ గత వారం రోజులుగా ఎమ్మెల్సీలతో ముఖాముఖి సమావేశమై మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు. చివరి నిమిషం వరకు ఎమ్మెల్సీలతో మంతనాలు జరిపారు. అభిప్రాయ సేకరణ సమయంలోనూ ఇద్దరు నేతలు ఎవరికి వారే తమకే మండలి ప్రతిపక్ష నేత పదవి దక్కుతుందనే ధీమాలో ఉన్నారు. కాంగ్రెస్‌కు 17 మంది ఎమ్మెల్సీలుండగా మంగళవారంనాటి సమావేశానికి 16 మంది మాత్రమే హాజరయ్యారు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్ తన సమీప బంధువు చనిపోవడంతో రాలేదు. సమావేశానికి హాజరైన వారిలో ఏడుగురు (కేఆర్ ఆమోస్, యాదవరెడ్డి, భానుప్రసాద్, వి.భూపాల్‌రెడ్డి, రాజలింగం, జగదీశ్వర్‌రెడ్డి, పీర్ షబ్బీర్ అహ్మద్) షబ్బీర్ అలీకి మండలి ప్రతిపక్షనేత పదవి ఇవ్వాలని ప్రతిపాదించారు. అదే సమయంలో డీఎస్ పేరును ఏడుగురు (పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఫారూఖ్ హుస్సేన్, నేతి విద్యాసాగర్, డి.రాజేశ్వర్, ఎమ్మెస్ ప్రభాకర్, బి.వెంకట్రావు, మాగం రంగారెడ్డి) ఎమ్మెల్సీలు ప్రతిపాదించారు. చివర్లో తాను డీఎస్‌కు మద్దతిస్తున్నట్లు సంతోష్‌కుమార్ లేఖ పంపడంతో హైకమాండ్ పెద్దలు డీఎస్ పేరును ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో రాజలింగం డీఎస్‌పై చేసిన ఆరోపణలు సమావేశంలో కలకలం రేపాయి. డీఎస్ రూ.10 లక్షలు ఇవ్వబోయారు: రాజలింగం సమావేశానంతరం రాజలింగం మీడియాతో మాట్లాడుతూ ‘‘ఒక్కో ఎమ్మెల్సీకి డీఎస్ రూ.10 లక్షలు ఇచ్చారు. నాకు కూడా ఆఫర్ చేస్తే వద్దని తిరస్కరించాను. టీఆర్ఎస్తో కుమ్మక్కై కేసీఆర్ ప్రభుత్వంలో లోపాయికారీ పనులు చేసుకునేందుకే డీఎస్ మండలి ప్రతిపక్షనేత పదవిని ఆశించి అందరినీ మేనేజ్ చేస్తున్నాడు. 8 మంది ఎమ్మెల్సీలు వ్యతిరేకించినా హైకమాండ్ పెద్దలు ఆయన పేరునే ఖరారు చేశారు’’ అని అన్నారు. కాగా, రాజలింగం చేసిన ఆరోపణలకు విలువ లేదని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. షబ్బీర్‌కు హ్యాండిచ్చిన ప్రభాకర్! మండలి ప్రతిపక్షనేత పదవిపై గంపెడాశలు పెట్టుకున్న షబ్బీర్ అలీకి ఎమ్మెల్సీ ఎమ్మెస్ ప్రభాకర్ హ్యాండిచ్చినట్లు తెలుస్తోంది. తనకు 8 మంది ఎమ్మెల్సీలు మద్దతు ఇస్తారని షబ్బీర్ భావించారు. వీరిలో ప్రభాకర్ కూడా ఉన్నట్లు షబ్బీర్ అలీ చెబుతున్నారు. అయితే సమావేశం ప్రారంభం వరకు తమతోనే ఉన్న ప్రభాకర్ చివరి నిమిషంలో డీఎస్వైపు వెళ్లారని షబ్బీర్ వాపోయారు. ఎన్నిక ఏకగ్రీవమే: వయలార్ మండలి ప్రతిపక్షనేతగా డీఎస్, ఉపనేతగా షబ్బీర్ అలీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు వయలార్ రవి ప్రకటించారు. ఎమ్మెల్సీల సమావేశానంతరం దిగ్విజయ్‌సింగ్, వయలార్, పొన్నాల, డీఎస్ మీడియా ముందుకొచ్చారు. ఆ సమయంలో షబ్బీర్‌ను సైతం మీడియా ముందుకు రావాలని హైకమాండ్ పెద్దలు కోరినా ఆయన పట్టించుకోలేదు. తాను రానని పేర్కొంటూ వాహనం ఎక్కేందుకు ప్రయత్నించారు. కుంతియా, తిరునావక్కరసార్ ఆయనను బతిమిలాడి మీడియా ముందుకు తీసుకొచ్చారు. అనంతరం డీఎస్ మాట్లాడుతూ తనకు మద్దతిచ్చిన ఎమ్మెల్సీలకు కృతజ్ఞతలు తెలిపారు. షబ్బీర్‌తో కలిసి పనిచేస్తానని చెప్పారు. ఆ తర్వాత షబ్బీర్‌ను మాట్లాడాలని దిగ్విజయ్ కోరగా.. ‘ఇదేమైనా సంతోషకరమైన సమయమా? మాట్లాడటానికేముంది?’’ అని ఆయన వ్యాఖ్యానించారు. 30న టీ-కాంగ్రెస్‌లో సమీక్ష డీఎస్‌పై ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నాం: దిగ్విజయ్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణాలను విశ్లేషించేందుకు నెలాఖరులో రెండు రోజులపాటు ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించాలని అధిష్టానం నిర్ణయించింది. ఇందుకు ఈ నెల 30, వచ్చే నెల 1న సమావేశం కానున్నట్లు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ వెల్లడించారు. మంగళవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పార్టీ ఓటమికి కారణాలపై లోతుగా అధ్యయనం చేస్తామన్నారు. కాగా, ఎమ్మెల్సీలను డబ్బులతో ప్రభావితం చేయడం వల్లే మండలి ప్రతిపక్ష నేతగా సీనియర్ నేత డీఎస్ ఎన్నికయ్యారంటూ ఎమ్మెల్సీ రాజలింగం చేసిన ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అంతకుముందు జిల్లా పరిషత్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో గాంధీభవన్‌లో దిగ్విజయ్ సమావేశమయ్యారు. ఈ విషయంలో పటిష్ట వ్యూహంతో ముందుకు వెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలవారీగా ఫలితాలు, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. -
డీఎస్, జానా ఎంపికపై డీకే అరుణ వర్గం అసహనం
ప్రతిపక్ష నేతలుగా ఎన్నుకున్న సీఎల్పీ వయలార్ రవి, దిగ్విజయ్ ప్రకటన సీఎల్పీ భేటీలో నేతల నుంచి అభిప్రాయ సేకరణ తొలుత ఓటింగ్ నిర్వహిస్తామన్న పెద్దలు అవసరం లేదన్న సీనియర్లు.. డీఎస్ ఎంపికపై డీకే అరుణ వర్గం అసహనం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ తొలి ప్రతిపక్ష నేతగా కుందూరు జానారెడ్డి ఎన్నికయ్యారు. అలాగే శాసనమండలిలో తొలి ప్రతిపక్ష నేతగా ధర్మపురి శ్రీనివాస్ ఎన్నికయ్యారు. మంగళవారం అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు వీరిరువురు ఎన్నికైనట్లు ప్రకటించారు. అంతకుముందు ఈ ఇద్దరి నేతల ఎన్నిక అనేక మలుపులు తిరిగింది. పలువురు నేతలు ఈ పదవి కోసం పెద్ద ఎత్తున లాబీయింగ్ చేశారు. సీఎల్పీ సమావేశంలోనూ అభిప్రాయ సేకరణ ఆసక్తికరంగా సాగింది. కొందరు నేతలు జానా, డీఎస్ పేర్లను వ్యతిరేకించినా.. అధిష్టానం పెద్దలు మాత్రం వీరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఓటింగ్ వద్దన్న సీనియర్లు సీఎల్పీ సమావేశానికి ఏఐసీసీ దూతలుగా వయలార్ రవి, దిగ్విజయ్‌సింగ్ హాజరవగా, వీరికి సహాయకులుగా రామచంద్ర కుంతియా, తిరునావక్కరసార్లు వచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కూడా సమావేశంలో పాల్గొన్నారు. మొత్తం 21 మంది ఎమ్మెల్యేలకుగాను 20 మంది హాజరయ్యారు. సమావేశంలో తొలుత దిగ్విజయ్‌సింగ్ మాట్లాడుతూ.. ఓటింగ్ నిర్వహిస్తామన్నారు. వెంటనే సీనియర్ ఎమ్మెల్యే గీతారెడ్డి లేచి ‘‘ఓటింగ్ నిర్వహిస్తే బయటకు వేరే సంకేతాలు వెళ్తాయి. పార్టీ ఇప్పటికే కష్టకాలంలో ఉంది. గెలిచింది 21 మంది ఎమ్మెల్యేలే. కలిసికట్టుగా నడవాల్సిన ఈ సమయంలో ఓటింగ్ నిర్వహిస్తే ఎమ్మెల్యేలో చీలిక వస్తుంది’’ అని సూచించారు. ఈ వాదనను పార్టీ నేత జీవన్‌రెడ్డి బలపరిచారు. డీకే అరుణ ఆ సమయానికి సమావేశానికి రాలేదు. సమావేశంలో ఉన్న మిగిలిన ఎమ్మెల్యేల నుంచి అభ్యంతరం వ్యక్తం కాకపోవడంతో అధిష్టానం పెద్దలు అభిప్రాయ సేకరణకు సిద్ధమయ్యారు. ఒక్కో ఎమ్మెల్యే వచ్చి అభిప్రాయాన్ని చెప్పాలంటూ వయలార్ రవి, దిగ్విజయ్‌సింగ్ పక్కనే ఉన్న గదిలోకి వెళ్లారు. ఈలోపు అక్కడికి చేరిన అరుణ.. ‘‘మరికొంత సమయం కోరదాం’’ అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో అన్నారు. కానీ ఉత్తమ్ నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో డీకే అరుణ తెలంగాణలో అత్యధిక ఎమ్మెల్యే సీట్లు గెలిపించుకున్న జిల్లా తమదేనని, ఈసారి సీఎల్పీ నేతగా తనకు అవకాశమివ్వాలని దిగ్విజయ్‌ను కోరారు. కానీ అభిప్రాయ సేకరణ ముగిసిన తర్వాత మెజారిటీ సభ్యులు జానారెడ్డికి మద్దతు ఇచ్చారని దిగ్విజయ్ తెలిపారు. అక్కడి నుంచే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు. దీంతో జానారెడ్డి పేరును అధికారికంగా ప్రకటించాలని సోనియా ఆదేశించారు. ‘‘ఓటమి గురించి బాధపడాల్సిన అవసరం లేదు. 2019లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేందుకు కృషి చేయండి’’ అని జానారెడ్డికి సోనియా సూచించారు. అనంత రం హైకమాండ్ పెద్దలు జానారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నట్లు ప్రకటించారు. ముందే మద్దతు కూడగట్టిన జానా సీఎల్పీ నేత విషయంలో జానారెడ్డి సోమవారమే చక్రం తిప్పారు. తనకు పోటీగా ఉన్న నేతలను పిలిచి మాట్లాడారు. గీతారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలతో మంతనాలు జరిపి మద్దతు కూడగట్టడంలో సఫలీకృతులయ్యారు. డీకే అరుణ సైతం ముగ్గురు నేతలను కలిసి మద్దతు కోరినప్పటికీ ఫలితం లేకపోయింది. డీకే అరుణ వర్గం ఎమ్మెల్యేలు మాత్రం ఈ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్దంగా సీఎల్పీ నేతను ఎన్నుకుంటామని చెప్పిన హైకమాండ్ పెద్దలు ఓటింగ్ నిర్వహించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఆసక్తికరంగా కౌన్సిల్ ప్రతిపక్ష నేత ఎన్నిక మధ్యాహ్నం ఎమ్మెల్సీల సమావేశం జరిగింది. కౌన్సిల్ ప్రతిపక్ష నేతగా పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ పోటీపడ్డారు. మొత్తం 17 మందికిగాను 16 మంది ఎమ్మెల్సీలు హాజరైన ఈ భేటీలో సభ్యుల మధ్య ఏకాభిప్రాయం రాలేదు. దీంతో వయలార్, దిగ్విజయ్ పక్క గదిలోకి వెళ్లి ఒక్కొ సభ్యుడిని పిలిచి అభిప్రాయసేకరణ జరిపారు. వీరిలో 8 మంది డీఎస్‌కు, మరో 8 మంది షబ్బీర్‌కు మద్దతు తెలిపారు. అయితే హైకమాండ్ పెద్దలు మీడియాతో మాట్లాడుతూ డీఎస్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. తెలంగాణ మండలిలో మొత్తం 40 స్థానాలు ఉండగా.. ప్రస్తుతం అందులో 7 ఖాళీలున్నాయి. మిగతా 33 మందిలో.. కాంగ్రెస్‌కు 17, టీఆర్ఎస్కు 4, టీడీపీకి 7, ఎంఐఎంకు ఇద్దరు సభ్యులతోపాటు ఇతరులు ముగ్గురున్నారు. -
పిసిసి అధ్యక్షులు, మాజీ అధ్యక్షుల ఓటమి
హైదరాబాద్: ఈ సార్వత్రిక ఎన్నికలలో దేశవ్యాప్తంగానే కాకుండా, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయం చవిచూడవలసి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చి అక్కడ లబ్దిపొందుదామని చూసింది. అక్కడ కూడా చావుదెబ్బతింది. ఆంధ్రప్రదేశ్‌లో అయితే చావు దెబ్బతింది. అటు తెలంగాణలో ఇటు ఏపిలో పిసిసి అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, మాజీ మంత్రులు ఓడిపోయారు. పిసిసి మాజీ అధ్యక్షులు డి.శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అందరూ కట్టగట్టుకొని ఓటమిని చవిచూశారు. రఘువీరా రెడ్డిది దయనీయ స్థితి. ఆయన మూడవ స్థానానికి పరిమితమయ్యారు. నిజామాబాద్ రూరల్ శాసనసభ స్థానంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ డి శ్రీనివాస్ తన సమీప టీఆర్ఎస్ అభ్యర్థి బాజీరెడ్డి గోవర్థన్పై 20 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వరంగల్ జిల్లా జనగామ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక్కడ టిఆర్ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి విజయం సాధించారు. మరో పిసిసి మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి కిమిడి మృణాళిని చేతిలో ఓడిపోయారు. ఏపి పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అనంతపురం జిల్లా పెనుకొండలో పోటీ చేసి ఓడిపోయారు. ఇక్కడ టిడిపి అభ్యర్థి పార్ధసారధి విజయం సాధించారు. రఘువీరా రెడ్డి మూడవ స్థానానికి వెళ్లారు. -
కౌంటింగ్‌లో జర పదిలం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మున్సిపల్, పరిషత్, సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో జాగ్రత్తగా ఉండాలని టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య జిల్లా కాంగ్రెస్ నేతలకు సూచించారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో డీసీసీ అధ్యక్షుడు, పరిషత్ అభ్యర్థులు, ఎంపీ, ఎమ్మెల్యేల అభ్యర్థులు, ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. అభ్యర్థులవారీగా విజయావకాశాలపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈనెల 12, 13, 16వ తేదీల్లో జరిగే కౌంటింగ్‌కు ఏజెంట్ల నియామకంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఓట్ల లెక్కింపు సందర్భంగా వారు చురుకుగా వ్యవహరించేలా చూడాలని పేర్కొన్నారు. ఇందుకోసం ఈనెల 10న జిల్లా స్థాయిలో, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ వారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. నగర సమావేశం పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్, అర్బన్ అభ్యర్థి మహేశ్‌కుమార్‌గౌడ్ ఆధ్యర్యంలో, మున్సిపాలిటీల వారీ సమావేశాలు స్థానిక నాయకుల ఆధ్వర్యంలో జరుపుకోవాలని సూచించారు. ఇందులో చేసిన తీర్మానాలను టీపీసీసీకి పంపించాలని ఆదేశించారు. విజయం మనదే తెలంగాణలో అత్యధిక అసెంబ్లీ స్థానాలు సాధించి కాంగ్రెసే తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, లోక్‌సభ, పరిషత్ ఎన్నికలలోనూ తమదే గెలుపని పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో ప్రజలు సోనియాకు కృతజ్ఞతలు తెలిపేందుకు కాంగ్రెస్‌కే ఓటు వేశారని, పై చేయి తమదే అవుతుందన్నారు. అందుకే కౌంటింగ్‌ను సీరియస్‌గా తీసుకోవాలని, ఏజెంట్లు ఏమరపాటుగా వ్యవహరించకుండా చూసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో పీసీసీ మాజీ చీఫ్ డి. శ్రీనివాస్, మాజీ మంత్రి పి. సుదర్శన్‌రెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ కో కన్వీనర్ షబ్బీర్ అలీ, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి, మాజీ విప్ ఈరవత్రి అనిల్‌కుమార్, గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ రాజేశ్వర్, డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్, పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. -
ముఖ్యమంత్రి రేసులో లేను:డీఎస్
- హైకమాండ్ నిర్ణయమే శిరోధార్యం - ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది కాంగ్రెస్సే - బలహీనవర్గాలకే సీఎం పదవి సాక్షి, హైదరాబాద్: సీఎం రేసులో తాను లేనని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమన్నారు. కాంగ్రెస్‌కు తక్కువ సీట్లు వస్తాయని జరుగుతున్న ప్రచారంలోనూ వాస్తవం లేదని, కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది కాంగ్రెస్సేనని ధీమా వ్యక్తం చేశారు. అయితే, ఈసారి మాత్రం బలహీనవర్గాల వ్యక్తికే సీఎం పదవి దక్కుతుందన్నారు. ఆదివారం సాయంత్రం డీఎస్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సే. అలాంటప్పుడు టీఆర్ఎస్ గాలి ఎట్లా వీస్తుంది? టీఆర్ఎస్కు ఓటేశారన డానికి కచ్చితమైన కారణాలేమున్నాయి? మేం మాత్రం తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీపై ప్రజలు విశ్వాసంతో ఉన్నారని భావిస్తున్నాం’’అని చెప్పారు. ఎన్నికల్లో కొంత క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తమ దృష్టికి కూడా వచ్చిందన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... - సీఎం రేసులో ఉన్న కాంగ్రెస్ నేతలంతా ఓడిపోవాలనేది టీఆర్ఎస్ కోరిక. కేసీఆర్ ఓడిపోతారని మేమంటే ఏమైనా అర్థముంటుందా? ఆయన కచ్చితంగా గెలుస్తారు. రాజకీయాల్లో మాట్లాడేటప్పుడు పద్ధతి ఉండాలి. - లగడపాటి ఒకప్పుడు చేసే సర్వేలు వేరు. ఇప్పుడు వేరు. ఎందుకంటే కాంగ్రెస్‌ను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఆయన సర్వే చేస్తున్నారు. దానికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. - జానారెడ్డి అనుభవం ఉన్న నేత. ముఖ్యమంత్రి ఎవరు కావాలనేది కాంగ్రెస్ శాసనసభాపక్షం, హైకమాండ్ నిర్ణయం తీసుకుంటాయి. అయితే ఈసారి సీఎం ఎంపిక విషయంలో మాత్రం సామాజిక న్యాయం ఉంటుంది. బలహీనవర్గాలకు చెందిన వ్యక్తులకే సీఎం పదవిస్తామని హైకమాండ్ చెప్పింది. మా దృష్టిలో బలహీనవర్గాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలే. - నేను సీఎం పదవికి సమర్ధుడినో కాదో రెండుసార్లు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసినప్పుడే తేలిపోయింది. అయినా దేనికైనా అదృష్టం ఉండాలి. నుదుటిన రాసి ఉంటే సీఎం అవుతారు. - ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక కాంగ్రెస్ సిద్ధాంతాలకు దగ్గరగా ఉండే పార్టీలతో పొత్తు పెట్టుకుంటాం. టీఆర్ఎస్ మా సిద్ధాంతానికి దగ్గరగా ఉందా? లేదా? అనేది సందర్భం వచ్చినప్పుడు చెబుతా. - సోనియా, రాహుల్‌గాంధీ తెలంగాణలో ప్రచారం చేయడంతో కాంగ్రెస్‌కు ఊపు వచ్చింది. నేను కూడా మంచి మెజారిటీతో గెలుస్తాననే నమ్మకం ఉంది. - దేశంలోనూ కాంగ్రెస్సే అతిపెద్ద పార్టీగా అవతరిస్తుంది. ప్రాంతీయ పార్టీలతో కలిసి యూపీఏ-3 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. మోడీ ప్రధాని కావడం జరగని పని. బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కొద్దోగొప్పో అవకాశమున్నా ఆ పార్టీవాళ్లే మోడీని ప్రధాని కానివ్వరు. -
తెలంగాణ ఉద్యమానికి ఆద్యుడిని నేనే: డీఎస్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఒక్కడే లేడని, ఉద్యమంలో చాలా మంది మమేకం అయ్యారని నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి డి.శ్రీనివాస్ అన్నారు. అసలు తెలంగాణ ఉద్యమానికి ఆద్యుడిని తానేనని చెప్పారు. నిజామాబాద్‌లో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ కోసం మొదట అసెంబ్లీలో మూడుగంటల పాటు మాట్లాడింది తానేనన్నారు. కేసీఆర్, టీఆర్ఎస్ పుట్టక ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ ‘తెలంగాణ’ కోసం ఉద్యమాలు చేస్తోందన్నారు. ‘‘ఎమోషనల్ ఇష్యూస్‌ని అడ్వాంటేజ్‌గా తీసుకొని, సెంటిమెంట్‌ను సొమ్ము చేసుకుంటున్న కేసీఆర్‌కు ఈ సారి తెలంగాణ ప్రజలు ప్రతికూలమైన తీర్పు ఇవ్వబోతున్నారు’’ అని జోస్యం చెప్పారు. -
మాటలు మార్చే కేసీఆర్‌కు ఓట్లు రాలవు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ రాష్ట్రం తెచ్చింది, ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనన్న విషయాన్ని తెలంగాణ ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ సెంటిమెంట్‌ను ఇంతకాలం సొమ్ము చేసుకున్న కేసీఆర్ మాటలకు ఇక ఓట్లు రాలే కాలం పోయిందన్నారు. నిజామాబాద్‌లోని స్వగృహంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. సోనియాగాంధీ నిర్ణయం, కాంగ్రెస్ పార్టీపై ప్రజలు చాలా విశ్వాసంగా ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో తమకే పట్టం కడతారన్నారు. తెలంగాణ ప్ర జలలో ఉన్న బలమైన సెంటిమెంట్‌ను కేసీఆర్ ఇంతకాలం సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షను సోని యాగాంధీ, కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిం దన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వసే ్తనే బంగారు తెలంగాణ సాధ్యమన్నా రు. డిచ్‌పల్లిలో రాహుల్‌గాంధీ బహిరంగసభ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే జరుగుతోందన్నారు. నిజామాబాద్‌లోని కలెక్టరేట్, పాలిటెక్నిక్ కళాశాల మైదానం కోసం ప్రయత్నించినా అనుమతి దొరకలేదని, అందుకే డిచ్పల్లి మండలం సుద్దపల్లిలో రాహుల్ సభ నిర్వహిస్తున్నామన్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు జరిగే సభను మధ్యాహ్నం 3.30 గంటలకు మార్చినట్లు డీఎస్ చెప్పారు. మహ బూబ్‌నగర్‌లో మరో బహిరంగసభ ఉన్నందున, కొంత ఆలస్యంగా జరుగుతుందని, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి నాయకులు, కార్యకర్తలు సభకు తరలివస్తారన్నారు. రాహుల్‌గాంధీ సభ జిల్లాలోని ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు మంచి ఫలితాలు ఇస్తుందన్నారు. విలేకరుల సమావేశంలో రాహుల్‌గాంధీ ప్రోగ్రాం కో ఆ ర్డినేటర్ సి.శ్రీనివాస్‌రావు, డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్, యువజన కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్చార్జి ఘన్‌రాజ్ తదితరులులు పాల్గొన్నారు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీజీ డిచ్పల్లి: సభకు రాహుల్ హాజరవుతుండటంతో ఎస్పీజీ అధికారులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. నిజామాబాద్ రేంజ్ డీఐజీ సూర్యనారాయణ, ఎస్పీ తరుణ్‌జోషి, డీఎస్పీ అనిల్‌కుమార్ సహకరిస్తున్నారు.సభా వేదిక ఏ స్థలంలో ఏర్పాటు చేయాలి, సభకు హాజరయ్యే ప్రముఖులు, ఇతర నాయకుల వాహనాలను ఎక్క డ పార్కు చేయాలనే విషయాలపై స్థానిక పోలీసు అధికారులకు ఎస్పీజీ అధికారులు తగిన సూచనలు ఇచ్చారు. సభా ప్రాంగణాన్ని ఆదివారం మధ్యాహ్నం పీసీసీ మాజీ చీఫ్ డి. శ్రీనివాస్ పరిశీలించారు. ఎండాకాలం కావడం తో సభకు హాజరయ్యే ప్రతి ఒక్కరూ కుర్చీలో కూర్చునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలి పారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు తాహెర్‌బిన్ హందాన్, నగేశ్‌రెడ్డి, ఘన్‌రాజ్, సురేం దర్, గజవాడ జైపాల్, కంచె ట్టి గంగాధర్, దాసరి లక్ష్మినర్సయ్య, అమృతాపూర్ గంగాధర్, శ్రీనివాస్‌రెడ్డి, అంబర్‌సింగ్, అశోక్, రాంచందర్‌గౌడ్, వెంకటరమణ, చిన్న య్య, నర్సయ్య, సాయన్న తదితరులు ఉన్నారు. వేదికకు సుమారు 20 అడుగుల దూరంలో హెలీపాడ్‌ను సిద్ధం చేస్తున్నారు. -
టీఆర్ఎస్తో గడీల పాలనే
నిజామాబాద్‌సిటీ, న్యూస్‌లైన్ : తెలంగాణ ఉద్యమంలో ఏనాడు పాల్గొనని వారికి టిక్కెట్లు ఇచ్చిన టీఆర్ఎస్తో సామాజిక తెలంగాణ ఎలా సాధ్యమవుతుందని పీసీసీ మాజీ అధ్యక్షుడు,ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ ప్రశ్నించారు. ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాలతో మళ్లీ గడీల పాలన వస్తుందన్న భయం ప్రజల్లో నెలకొందన్నారు. జిల్లాకేంద్రంలోని తన నివాసంలో బుధవారం ఉదయం విలేకరుల సమావేశంలో డీఎస్ మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను చూస్తే, వారు ఏనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో ముందుండడంతో పాటు పార్టీ జెండాలను మోసిన వారిని పక్కనపెట్టడంపై టీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలోనే తెలంగాణ ప్రాంతాన్ని ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత తమపై ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సీఎం కావాలని తాను అనుకోవటంలేదని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,అభిమానులే తాను సీఎం కావాలని కోరుకుంటున్నారని డీఎస్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన ఎన్నికల మేనిఫెస్టో అన్ని పార్టీల కంటే బాగుందని కితాబిచ్చారు. తెలంగాణ అమరుల కుటుంబాలను ఆదుకోవడం, యువత, మహిళలు, ఉద్యోగులు, రైతులు, కార్మికులు అన్నివర్గాల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందన్నారు. మేనిఫెస్టోలో తన సూచనలు ఎన్నో ఉన్నాయన్నారు. ఇప్పటికే తాను ’200 కోట్లతో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానన్నారు. 2016 వరకు ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టులు పూర్తయి సిరికొండ మండలం వరకు సాగు,తాగునీరు అందిస్తామన్నారు. సిరికొండ లో రెండు పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తానని చెప్పారు. ధర్పల్లిలో జూనియర్ ,పాలిటె క్నిక్ కళాశాలలను ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. -
కేసీఆర్‌కు స్వార్థం పెరిగింది: డీఎస్
నిజామాబాద్, న్యూస్‌లైన్: టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావుకు స్వార్థం ఎక్కువై పోయిందని నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి డి.శ్రీనివాస్ విమర్శించారు. శనివారం నిజామాబాద్‌లో శనివారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ కోసం సకల జనుల సమ్మె, మిలీనియం మార్చ్, విద్యార్థి జేఏసీ, ఉద్యోగ జేఏసీ వర్గాలు ఉధృతంగా సమ్మె చేస్తుంటే కేసీఆర్ అజ్ఞాతంలో ఉన్న ఆయన.. 2014 ఎన్నికల ముందు ఉద్యమం చేస్తే ఎన్నికలో గెలువచ్చాన్న కారణంతో తెరపైకి వచ్చాడని విమర్శించారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పోతుందని తెలిసి కూడా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను, చూసి చలించిన సోనియా తెలంగాణ ఇచ్చారన్నారు. -
దశమి రోజు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: టికెట్ ఖాయమని తెలిసినా పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో పాటు కాంగ్రెస్, టీఆర్ ఎస్, టీడీపీ, వైఎస్ఆర్ సీపీ, బీజేపీ తది తర పార్టీల నేతలు ముహూర్తం కోసం ఆగారు. బుధవారం దశమి, అందులో శ్రీరామ పట్టాభిషేకం జరిగిన ముహూర్తం కావడంతో ప్రధాన పార్టీల నేతలందరూ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా నామినేషన్ల కేంద్రాల వద్ద జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. అంతా సిద్ధం లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లకు బుధవారం తెరపడుతుంది. 10న నామినేషన్ల పరిశీలన ఉంటుం ది. 12 తేదీ నామినేషన్ల ఉప సంహరణకు గడువు కా గా, ఈనెల 30న పోలింగు ఉంటుంది. ఈ నేపథ్యం లో ఈనెల 13 నుంచి ఎన్నికల ప్రచారం హోరెత్తనుం ది. ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రచారసరళిపై నిఘా ముమ్మరం చేసింది. వచ్చే నెల 16న ఓట్ల లెక్కింపు, ఫలితాలు ఉంటాయి. నిన్నటి వరకు టికెట్ల కోసం ఢిల్లీ, హైదరాబాద్‌లో ‘క్యూ’ కట్టిన నేతలు, నేడు జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో బా రులు తీరనున్నారు. పార్లమెంట్ అభ్యర్థులు జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలో, ఎమ్మెల్యే అభ్యర్థులు నియోజకవర్గం కేంద్రంలో తహశీల్దారు/ఆర్డీఓ కార్యాలయాల్లో నామినేషన్లు దాఖలు చేస్తారు. నేడు నామినేషన్ వేసేది వీరే నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీ ఆర్ఎస్ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ నుం చి మధుయాష్కీ గౌడ్, వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా సింగిరెడ్డి రవీందర్‌రెడ్డి, బీజేపీ నుంచి పొద్దుటూరి సదానందరెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, పీఆర్ సోమాని నామినేషన్ వే యనున్నట్లు ప్రకటించారు. నిజామాబాద్ రూరల్ అభ్యర్థులుగా కాంగ్రెస్ నుంచి ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్), బాజిరెడ్డి గోవర్ధన్ (టీఆర్ ఎస్), గడ్డం ఆనంద్‌రెడ్డి (బీజేపీ), బొడ్డు గంగారెడ్డి(వైఎస్ఆర్ సీపీ)లు నామినేషన్ వేయనున్నారు. నిజామాబాద్ అర్బన్ నుంచి వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా అంతిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ (కాంగ్రెస్), బిగాల గణేశ్ గుప్తా (టీఆర్ఎస్), మీర్ మ జాజ్ అలీ (ఎంఐఎం), బీజేపీ అభ్యర్థులుగా డాక్టర్ బాపురెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాలు వేయనున్నారు. బోధన్‌లో మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి (కాంగ్రెస్), మహమ్మద్ షకీల్ (టీఆర్ఎస్), మేడపాటి ప్రకాశ్‌రెడ్డి (టీడీపీ), బీజేపీ, వైఎస్ఆర్ సీపీల నుంచి కెప్టెన్ కరుణాకర్‌రెడ్డి, తూము శరత్‌రెడ్డిలు నామినేషన్ వేయనున్నట్లు పేర్కొన్నారు. కామారెడ్డిలో మాజీ మంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ నామినేషన్ వేయనున్నారు. వైఎస్ఆర్ సీపీ నుంచి చిల్కూరు కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి గంప గోవర్ధన్‌లు కూడ నామినేషన్లు వేస్తారు. ఆర్మూర్ నియోజకవర్గంలో కేఆర్ సురేశ్‌రెడ్డి (కాంగ్రెస్), రాజారాం యాదవ్ (టీడీపీ), ఆశన్నగారి జీవన్‌రెడ్డి (టీఆర్ఎస్), మార చంద్రమోహన్లు నామినేషన్ వేయనున్నట్లు ప్రకటించారు. బాల్కొండ నుంచి ఈరవత్రి అనిల్ (కాంగ్రెస్), డాక్టర్ ఏలేటి మల్లికార్జున్‌రెడ్డి (టీడీపీ), వేముల ప్రశాంత్‌రెడ్డి (టీఆర్ఎస్)లు నామినేషన్లు వేయనున్నారు. జుక్కల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సౌదాగర్ గంగారాం, హన్మంత్ సింధే(టీఆర్ఎస్), వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా నాయుడు ప్రకాశ్‌లు నామినేషన్ వేయనున్నారు. అయితే కాంగ్రెస్ రెబల్‌గా అరుణతార, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌లు కూడ నామినేషన్ వేసే అవకాశం ఉంది. బాన్సువాడకు కాసుల బాలరాజు (కాంగ్రెస్), పోచారం శ్రీనివాస్‌రెడ్డి (టీఆర్ఎస్), టీడీపీ, వైఎస్సార్సీల నుంచి బద్యానాయక్, రాంమోహన్‌లు నామినేషన్ వేయనున్నారు. ఎల్లారెడ్డి నుంచి పటోళ్ల సిద్దార్థరెడ్డి (వైఎస్సార్సీపీ), నల్లమడుగు సురేందర్ (కాంగ్రెస్ ), ఏనుగు రవీందర్‌రెడ్డి (టీఆర్ఎస్), బాణాల లక్ష్మారెడ్డి (బీజేపీ)లు నామినేషన్ వేయనున్నట్లు ప్రకటించారు. -
కాంగిరేసు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కాంగ్రెస్ దిగ్గజాలు డి.శ్రీనివాస్, మహ్మద్ షబ్బీర్‌అలీ, పి.సుదర్శన్‌రెడ్డి, మాజీ స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డికి నిజామాబాద్ రూరల్, కామారెడ్డి, బోధన్, ఆర్మూరు స్థానా లు దక్కాయి. మాజీ విప్ ఈరవత్రి అనిల్‌కు బాల్కొండ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్‌కు నిజామాబాద్ అర్బన్ కేటాయించగా, బాన్సువాడ కాసుల బాలరాజుకిచ్చారు. కాంగ్రెస్ బహిష్కృత నేత సౌదాగర్ గంగారాంకు జుక్కల్ టికెట్ ఇవ్వడంతో అక్కడ ఎంపీ సురేష్‌కుమార్ షెట్కార్ దిష్టిబొమ్మను కార్యకర్తలు దహనం చేశారు. టీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన నల్లమడుగు (జాజల) సురేందర్‌కు ఎల్లారెడ్డి దక్కింది. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల లలిత, జిల్లా అధ్యక్షురాలు అరుణతార ప్రయత్నాలు ఫలించలేదు. మైనార్టీ నేత, డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్‌కు కూడ ‘చెయ్యి’చ్చారు. ఇదేమి తీరు? టికెట్ల కేటాయింపులో లాబీయింగ్ జరిగిందంటూ పలుచోట్ల నాయకులు అసంతృప్తిని వ్యక్తం చేయగా, కార్యకర్తలు నేతల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఏఐసీసీ వాయిదాకు ముందు చేసిన ప్రకటన, తాజాగా వెల్లడించిన జాబితాకు తేడా ఉందంటూ ఆందోళనకు దిగారు. నిజామాబాద్ అర్బన్‌కు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల లలిత పేరుందన్న ప్రచారం జరగగా, తుది జాబితాలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ పేరును ప్రకటించారు. జుక్కల్ మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారాంపై కాంగ్రెస్ అధిష్టానం క్రమశిక్షణ చర్యల కింద ఆరేళ్ల పాటు బహిష్కరణ వేటు వేసింది. అయితే ఇటీవల ఎంపీ సురేష్‌కుమార్ షెట్కా ర్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు షబ్బీర్ అలీ ఏఐసీసీకి లేఖ రాశారని చెప్తున్నా, దానిపై డీసీసీ, టీపీసీసీలో స్పష్టత లేదు. జుక్కల్ టికెట్ గంగారాంకు కేటాయించినం దుకు నిరసనగా అక్కడి నాయకులు ఎంపీ సురేష్‌కుమార్ షెట్కార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎల్లారెడ్డిలోను షెట్కార్, షబ్బీర్‌అలీ దిష్టిబొమ్మలను తగులబెట్టారు. మహిళల కోటాలో తమకు టికెట్ లభిస్తుందని ఆశించిన ఆకుల లలిత, అరుణతారకు ఈసారి కూడ పార్టీ అధిష్టానం మొండిచెయ్యి చూపింది. ఎమ్మెల్సీ రాజేశ్వర్, మాజీ డీసీసీ అధ్యక్షుడు గడుగు గంగాధర్ జుక్కల్ టికెట్ ఆశించి భంగపడ్డారు. మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్‌కు ఎల్లారెడ్డిలో ప్రతికూల పరిస్థితు లు నెలకొన్నాయి. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేశారని ఆరేళ్ల పాటు బహిష్కరణ వేటు వేసిన అధిష్టానం గంగారాంకు ఎలా టికెట్ ఇస్తుందన్న ప్రశలు వినిపిస్తుం డగా.. అందుకు ప్రధాన కారణం షబ్బీర్ అలీ, సురేష్‌కుమార్ షెట్కార్లంటూ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్లో టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన నల్లమడుగు సురేందర్‌కు ఇచ్చిన మాటను నిలుపుకోగా, జనార్దన్‌గౌడ్‌కు ఆశాభంగం కలిగింది. మరో మూడు నియోకవర్గాలలో ఇదే పరిస్థితి నెలకొంది. అసంతృప్తివాదులను బుజ్జగించడం కోసం మంగళవారం నుంచి అగ్రనాయకత్వం రంగంలోకి దిగనున్నట్లు సమాచారం. అందరిని కలుపుకోవాలని అధిష్టానం డీసీసీలను ఆదేశించింది. -
నిజామాబాద్ రూరల్ నుంచే పోటీ: డీఎస్
డిచ్పల్లి, నిజామాబాద్ రూరల్ నుంచే తాను శాసనసభ స్థానానికి పోటీ చేస్తానని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ప్రకటించారు. బుధవారం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా స్థానంలో ఇంకెవరున్నా తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదన్నారు. -
త్వరలో విడుదల
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థుల జాబితా దాదాపుగా ఖరాైరె నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీతో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తదితరులు సోమవారం భేటీ అయిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల జాబితాపై ఆ పార్టీ ఎన్నికల కమిటీ ఆమోద ముద్ర వేసినట్లు అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం. ఐదు నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లపై స్పష్టత రాగా,నిజామాబాద్ అ ర్బన్ తో పాటు జుక్కల్, ఎల్లారెడ్డి, బాన్సువాడపై కొంత సస్పె న్స్ పెట్టారు. ప్రకటన లాంఛనమే దాదాపుగా అభ్యర్థుల జాబితా ఖరారైందని, నేడో, రేపో అధికారికంగా ప్రకటన చేయడం లాంఛనంగా మిగిలిందని ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు పేర్కొన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల నడుమ పొత్తులు లేవని తేలిన నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ, టీపీసీసీకి 15 రోజుల క్రితమే జిల్లాకు చెందిన అభ్యర్థుల జాబితాను పంపింది. ఆ జాబితాపై కసరత్తు చేసిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఒక్కో స్థానం నుంచి ఇద్దరు నుంచి ఐదుగురు పేర్లను ఏఐసీసీ స్క్రీనిం గ్ కమిటీకి అందజేసింది. సోమవారం సాయంత్రం అభ్యర్థుల ఎంపికపై ఆమోదముద్ర పడిందని సమాచారం. డీఎస్ కోరుకున్నట్టుగానే పీసీసీ మాజీ చీఫ్, ఎమ్మెల్సీ ధర్మపురి శ్రీనివాస్ కోరిక మేరకు ఆయనకు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం కేటాయించారు. కామారెడ్డికి టీపీసీసీ ప్రచార కమిటీ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహ్మద్ షబ్బీర్ అలీ, బోధన్ నుంచి మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, ఆర్మూరు నుంచి మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి పేర్లు ఖరారయ్యాయి. బాలొ ్కండ మాజీ విప్ ఈరవత్రి అనిల్‌కే దక్కనుంది. నిజామాబాద్ అర్బన్ సహా మరో మూడు నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లు ఖరారైనా అధిష్టానం గోప్యంగా ఉంచు తోంది. డి.శ్రీనివాస్ ఒకవేళ మనసు మార్చుకుని మళ్లీ నిజామాబాద్ అర్బన్‌ను ఎంచుకుంటే తప్ప ఆయన రూరల్ నుంచే పోటీ చేస్తారు. అర్బన్ నియోజకవర్గం నుంచి ఆకుల లలిత, ధర్మపురి సంజయ్, తాహెర్ బిన్ హందాన్ తదితరులలో ఒకరికి టికెట్ దక్కనుంది. జుక్కల్, ఎల్లారెడ్డి, బాన్సువాడల నుంచి ఎక్కువ మంది పోటీ పడు తున్నందున చివరి నిముషం వరకు సస్పెన్స్ పెట్టి, అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది. -
తండ్రా.. కొడుకా!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: సార్వత్రిక ఎన్నికలలో ఒక కుటుంబం నుంచి ఒక్కరికి మాత్రమే టికెట్ ఇవ్వాలన్న కాంగ్రెస్ తాజా ప్రతి పాదన కలకలం రేపుతోంది. పీసీసీ మాజీ చీఫ్, ఎమ్మెల్సీ డి. శ్రీనివాస్, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ నిజామాబాద్ రూరల్, కామారెడ్డి నుంచి పోటీకి సిద్ధం కాగా, ఆ ఇద్దరు నేతల కుమారులు డి.సంజయ్ నిజామాబాద్ అర్బన్ నుంచి, మహ్మద్ ఇలి యాస్ కామారెడ్డి లేదా ఎల్లారెడ్డి నుంచి టికెట్‌ను ఆశిస్తున్నారు. ఒక కుటుంబంలో ఒక్కరికే టికెట్ అన్న ప్రతిపాదనకు తోడు ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నవారు పదవులకు రాజీ నామాలు చేస్తే అంగీకరించబోమన్న నిర్ణయం కూడా వీరికి ఇబ్బందికరంగా మారనుంది. కాం గ్రెస్ అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయం పార్టీ సీనియర్లను ఆలోచనలో పడేస్తోంది. వారసుల పోరు ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా డి. శ్రీని వాస్, షబ్బీర్ అలీలు ఏం నిర్ణయం తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. ఈసారైనా.. నిజామాబాద్ అర్బన్ నుంచి రెండుసార్లు పోటీ చేసి ఓటమి చెందిన డీఎస్ ఈసారి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధం అ య్యారు. అయితే ఆయన కుమారుడు సంజయ్ అర్బన్ నుంచి చేసుకున్న దరఖాస్తు కూడా పరి శీలనలో ఉంది. షబ్బీర్ అలీ ఎమ్మెల్సీగా సుమా రు మరో ఐదు సంవత్సరాలు కొనసాగే అవకాశం ఉన్నందున కామారెడ్డి లేదా ఎల్లారెడ్డి నుంచి తన కు టికెట్ ఇవ్వాలని ఆయన కుమారుడు మహ్మద్ ఇలియాస్ కోరుతున్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి, టీపీపీసీ నుంచి ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి జాబితాలు పంపిన క్రమంలో తాజాగా ‘ఒక కుంటుంబం నుంచి ఒక్కరికే టికెట్’ అన్న ప్రతిపాదనతో తండ్రులు బరిలో ఉం టారా? కొడుకులను దింపుతారా? అన్న చర్చ జిలా ్లలో మొదలైంది. దిగ్గజాలకు ‘ఎమ్మెల్సీ’ అడ్డంకా? రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపే నేతలున్న జిల్లాలో ఏఐసీసీ తాజా ప్రతిపాదనలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. రెండు పర్యాయాలు పీసీసీ చీఫ్‌గా ఉన్న డి.శ్రీనివాస్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో ప్రస్తుతం కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రచార కమిటీ ఉపాధ్యక్షునిగా షబ్బీ ర్, ఎన్నికల కమిటీ సభ్యుడుగా డీఎస్ వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్సీగా వీరి పదవీకాలం ఇంకా ఉండగా టికెట్ల సర్దుబాటులో భాగంగా ఒక కుటుంబానికి ఒకటే టికెట్, ఎమ్మెల్సీల రాజీనామాలను అమోదించబోమన్న అధిష్టానం నిర్ణయాలు ఏ పరిణామాలకు దారి తీస్తాయోననని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఆశల పల్లకీలో ఇదే సమయంలో నిజామాబాద్ అర్బన్, రూరల్‌ల నుంచి డీఎస్, సంజయ్‌లతో పాటు తాహెర్‌బిన్ హందాన్, ఆకుల లలిత, గడుగు గంగాధర్, బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ తదితరులు కూడా టికెట్ ఆశిస్తున్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి నుంచి ప్రస్తుతం షబ్బీర్ అలీ, ఇలియాస్, ఎడ్ల రాజిరెడ్డిల పేర్లుండగా.. అధిష్టానం తీసుకున్న నిర్ణయాలు అమలైతే ఇద్దరు నేతలు తమ ఇద్దరు కుమారులను సార్వత్రిక ఎన్నికల రంగంలోకి దింపడం అనివార్యం. మరో ఆరు రోజులలో సార్వత్రిక ఎన్నికలకు నోటిఫి కేషన్ విడుదల కానుం డగా, తాజా ఏఐసీసీ ప్రతిపాదనలు ఏ మేరకు అమలవుతాయి? ఈ విషయంలో ఇద్దరు అగ్రనేతలు ఏమి చేయనున్నారు? వీరిద్దరు బరిలో ఉండటం అవసరమని అధిష్టానం భావిస్తే ఏం జరుగుతుందనే అం శాలు పార్టీ వర్గాల్లో ఉత్కంఠను రేపుతున్నాయి. మరో వైపు అగ్రనేతలు, వారి వారసులతో పాటు ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి పంపిన జాబితాలో పేర్లుఉన్న నేతలలో ఆశలు చిగురిస్తున్నాయి. అధిష్టానం నిర్ణయం తమకు లాభించవచ్చని భావిస్తున్నారు. -
కాంగ్రెస్ పార్టీకి సమస్యలున్నాయి: డీఎస్
న్యూఢిల్లీ: సీమాంధ్రలో కాంగ్రెస్‌కు కొన్ని సమస్యలు ఉన్నాయని, అయితే కాంగ్రెస్ పార్టీ మళ్లీ పునర్వైభవం సాధిస్తుందనే ఆశాభావాన్ని మాజీ పీసీసీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్ వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఇతర పార్టీలతో పొత్తులపై హైకమాండ్‌దే తుది నిర్ణయమని డీఎస్ అన్నారు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఆయన అన్నారు. ఈసారి ఎన్నికల్లో టికెట్ల పంపిణీలో అభ్యర్థులందరికి సామాజిక న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని ఆయన తెలిపారు. గతంతో పోలిస్తే ఈసారి బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించడానికి కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంటుందని డీఎస్ వెల్లడించారు. గతంలో నిజమాబాద్ అర్బన్ స్థానంలో పోటి చేసి ఓటమి పాలైన డీఎస్ నిజామాబాద్ రూరల్ టికెట్ ను ఆశిస్తున్నారు. నిజమాబాద్ రూరల్ టికెట్ కేటాయించాలని స్క్రీనింగ్ కమిటీ మందు తన అభిప్రాయాలను డీఎస్ వెల్లడించారు. -
ఎంఐఎంతో అవగాహన అవసరం
సోనియాకు డీఎస్ సూచన.. గంటపాటు భేటీ తెలంగాణ పర్యటనకు సోనియా, రాహుల్‌కు ఆహ్వానం వచ్చే ఎన్నికల్లో మైనారిటీల ఓట్లు చీలకూడదంటే ఎంఐఎంతో అవగాహన కుదుర్చుకుంటే మంచిదని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ సూచిం చారు. తెలంగాణలో టీఆర్ఎస్ను దెబ్బతీ యాలంటే జేఏసీ నేతలకు ఎక్కువ టిక్కెట్లు ఇవ్వాలని కూడా గట్టిగా చెప్పారు. సోమవారం ఢిల్లీలో సోనియాతో ఆయన గంటపాటు భేటీ అయ్యారు. తెలంగాణ లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఎన్నికల సన్నద్ధతపై వీరిద్దరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. తెలంగాణలో పార్టీ ప్రచారానికి సోనియా, రాహుల్‌లను డీఎస్ ఆహ్వానించారు. ఏప్రిల్ రెండో వారంలో ఒకరు, మూడో వారంలో ఒకరు పర్యటించాలని కోరారు. దీనికి సోనియా సానుకూలంగా స్పందించారు. కాగా ఎన్నికల్లో పార్టీ ప్రచార చిత్రాల కోసం రాహుల్‌తో ఫోటో సెషన్‌కు తెలంగాణ నేతలు హాజరయ్యారు. ఇందుకు 50 ఏళ్లు మించని నేతలకే ఆహ్వానం అందింది. కేంద్ర మంత్రి బలరాం నాయక్, ఎంపీలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సురేష్ శెట్కార్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వంశీచంద్‌రెడ్డి హాజరయ్యారు. రాహుల్‌తో వీరంతా విడివిడిగా, ఉమ్మడిగా ఫోటోలు దిగారు. -
టికెట్ల కేటాయింపులో డీ‘ఎస్’ మార్క్!
నిజామాబాద్‌అర్బన్, న్యూస్‌లైన్ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో తన ఆధిపత్యాన్ని నిలుపుకునే దిశగా పీసీసీ మాజీ చీఫ్, ఎమ్మెల్సీ డీ. శ్రీనివాస్ పావులు కదిపారు. బల్దియా బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను సోమవారం ఖరారు చేశారు. ఇందులో పలువురు సీనియర్ల పేర్లు గల్లంతు కావడం, మిగతా సీనియర్ నాయకుల ప్రతిపాదనలకు స్థానం లేకపోవడం సిటీలో చర్చనీయాంశంగా మారింది. అనుకూలంగా ఉన్నవాళ్లకే కార్పొరేషన్లో టికెట్ల కేటాయింపులో ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్, మాజీ మేయర్ సంజయ్ తమ ఆధిపత్యం నెగ్గించుకున్నారు. తమకు అనుకూలంగా ఉన్నవారికి టికెట్లు ఇప్పించుకున్నట్లు ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. టికెట్లు ఆశించిన జెండాగుడి మాజీ చైర్మన్ నాని, సీనియర్ నాయకుడు శ్రీహరికి టికెట్లు రాకపోవడం వెనుక డీఎస్ అనుచరుల హస్తం ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి. మైనార్టీ నాయకుడు అబ్ధుల్‌కు చెందిన వారికీ టికెట్లు కేటాయించలేదు. ప్రతిష్టాత్మకంగా మారిన 50వ డివిజన్లో ఇద్దరు బలమైన నాయకులున్నా ఛాగుభాయ్కి కేటాయించారు. సీనియర్లకు చుక్కెదురు కార్పొరేషన్లో టికెట్ల కేటాయింపులో ముఖ్యమైన నాయకులకు చుక్కెదురైంది. మాజీ డీసీసీ అధ్యక్షుడు గడుగు గంగాధర్, ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు తాహెర్బిన్ల పాత్ర నామమాత్రం కూడా లేకుండా పోయింది. వీరు తమ అనుచరులకు టికెట్లు ఇప్పించుకోవడంలో విఫలమయ్యారు. తాహెర్బిహన్కు తెలియకుండానే టికెట్ల కేటాయింపు జరిగింది. డీఎస్‌కు ముఖ్య అనుచరుడిగా పేరున్న రత్నాకర్, ఆయనకు సన్నిహితంగా మరో విద్యార్థి నాయకుడు తమ వారికి టికెట్లు ఇప్పించుకోవాలని ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. డీఎస్ మరో ముఖ్యఅనుచరుడైన వేణు, ఇతర నాయకులు ప్రతిపాదనలనే టికెట్ల కేటాయింపులో పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిసింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలోనే నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ స్థానాన్ని తిరిగి హస్తగతం చేసుకోవాలన్న లక్ష్యంతోనే డీఎస్ మున్సిపల్ కార్పొరేటర్ అభ్యర్థులను ఎంపిక చేసినట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని టికెట్ల కేటాయింపు చేసినట్లు పేర్కొంటున్నారు. మరోవైపు తమకు, తమ అనుచరులకు టికెట్లు కేటాయించకపోవడంతో పలువురు నాయకులు గుర్రుగా ఉన్నారు. -
ఫలించిన కాంగ్రెస్ నేతల రాయబారం
హైదరాబాద్ : కాంగ్రెస్ నేతల రాయబారం ఫలించింది. పటాన్చెరు ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్...కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. రాహుల్ గాంధీ కార్యాలయం నుంచి కూడా ఆయనకు ఫోన్ కాల్ వచ్చినట్లు సమాచారం. స్థానికంగా కాంగ్రెస్ పరిస్థితి బాగోలేదని, పార్టీ తరఫున పోటీ చేస్తే గెలిచే అవకాశాల్లేవనే ఉద్దేశంతోనే నందీశ్వర్ గౌడ్ టీఆర్ఎస్ వైపు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను కూడా కలిశారు. అయితే నందీశ్వర్ గౌడ్ పార్టీ వీడేందుకు సిద్ధం కావటంతో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు ఆయన్ని బుజ్జగించేందుకు యత్నించారు. చివరకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ పీసీసీ నేత డీ శ్రీనివాస్, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ...రంగంలోకి దిగి నందీశ్వర్ గౌడ్‌ను బుజ్జగించి టీఆర్ఎస్లోకి వెళ్లే ఆలోచనను విరమింపచేశారు. నేతల రాయబారం ఫలించటంతో నందీశ్వర్ హస్తాన్ని వీడే యోచన విరమించుకున్నారు. -
కేసీఆర్ ను కలిసిన నందీశ్వర్ గౌడ్
హైదరాబాద్: పటాన్చెరు కాంగ్రెస్ శాసనసభ్యుడు నందీశ్వర్‌గౌడ్ శనివారం టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ను కలిశారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మేరకు నందీశ్వర్ గౌడ్ కేసీఆర్ తో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. అలాగే టీఆర్ఎస్ లో చేరికపై ఆయన తన అనుచరులతో మంతనాలు జరుపుతున్నారు. కాగా పటాన్చెరు ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌కు ప్రధాన అనుచరుడు. స్థానికంగా కాంగ్రెస్ పరిస్థితి బాగోలేదని, పార్టీ తరఫున పోటీ చేస్తే గెలిచే అవకాశాల్లేవనే ఉద్దేశంతోనే ఆయన టీఆర్ఎస్ వైపు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ సమాచారం తెలిసి డీఎస్ ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. డీఎస్ స్వయంగా ఫోన్ చేసినా రెండ్రోజుల నుంచి స్పందించడం లేదని సమాచారం. అయితే డీఎస్ సన్నిహితులు మాత్రం నందీశ్వర్‌గౌడ్‌కు తాత్కాలిక ఇబ్బందులున్నప్పటికీ ఆయన మాత్రం కాంగ్రెస్‌ను వీడబోరనే చెబుతున్నారు. -
అంతా సస్పెన్స్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : నామినేషన్ల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది. మొదటి రెండు రో జులు అంతంత మాత్రంగా నే నామినేషన్లు దాఖలయ్యా యి. బుధవారం ఊపందుకోగా గురువారం భారీ స్థాయిలో నామినేషన్లు వేశారు. జిల్లావ్యాప్తంగా గురువారం ఒక్కరోజే 945 నామినేషన్లు దాఖలు కావడం విశేషం. మున్సిపాలిటీలలో నామినేషన్ల దాఖలుకు శుక్రవారం చివరి రోజు. నామినేషన్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇంకా నేతల చేతులలోనే మేయర్, చైర్మన్ అభ్యర్థులను ప్రకటించడంలో ప్రధాన పార్టీలు చేస్తున్న తాత్సారం అశావహులను ఆందోళనకు గురి చేస్తోంది. ప్రధానంగా కాంగ్రెస్, టీఆర్ఎస్, వైఎస్ఆర్ సీపీ, టీడీపీ, బీజేపీ, సీపీఐ, ఎంఐఎం, న్యూడెమోక్రసీ పార్టీలు ఈ ఎన్నికలలో తలపడనున్నాయి. ఆయా పార్టీల పేరు మీద ఇప్పటికే చాలా మంది నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ఏ పార్టీ కూడా అభ్యర్థులను ప్రకటించలేదు. బీ ఫారాలు ఇవ్వలేదు. డీఎస్ ఆధ్వర్యంలో సమావేశం నిజామాబాద్ నగర పాలక సంస్థ నుంచి మేయర్ అభ్యర్థిని ఖరారు చేసే విషయమై పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ ఇప్పటికే ఓ సమావేశం నిర్వహించారు. అయినప్పటికీ ఆ పార్టీ కార్పొరేటర్లు, మేయర్ అభ్యర్థి పేర్లు ఇంకా ప్రకటించలేదు. టీఆర్ఎస్ అర్బన్ నియోజకవర్గ ఇన్చార్జి బస్వ లక్ష్మీనర్సయ్య మేయర్ స్థానానికి నలుగురి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ సైతం మేయర్ అభ్యర్థిని తేల్చలేదు. తెలుగుదేశం పార్టీ పరిస్థితి దీనంగా ఉంది. అన్ని స్థానాల్లో అభ్యర్థులకు బీ ఫారాలు ఇచ్చేందుకు వైఎస్ఆర్ సీపీ కసరత్తు చేస్తోంది. ఇతర పార్టీలు సైతం అభ్యర్థుల ఎంపికలో కసరత్తు చేస్తున్నాయి. నాలుగైదు రోజులలోమున్సిపాలిటీలలో శుక్రవారం నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తి కానుంది. శనివారం నామినేషన్లను పరిశీలిస్తారు. అభ్యర్థుల తుది జాబితాను మంగళవారం ప్రకటి స్తారు. ఆ రోజు నుంచి ప్రచారం ఊపందుకోనుంది. -
‘తెలంగాణ’లో డీఎస్ది కీలకపాత్ర
నిజామాబాద్ సిటీ, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ కీలకపాత్ర పోషించారని ఎంపీ మధుయాష్కీ గౌడ్ పేర్కొన్నారు. పార్లమెంట్లో తెలంగాణ సాధన కోసం తెలంగాణ ఎంపీలు చేసిన పోరాటాల వెనుక డీఎస్ ఉన్నారన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం విద్యార్థి, ఉద్యోగ, రాజకీయ జేఏసీల ఆధ్వర్యంలో చేసిన ఉద్యమాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ లేఖ ఇచ్చిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారని, అయితే రాష్ట్రం ఏర్పాటు కాకుండా చంద్రబాబు అడ్డుపడ్డారని యాష్కీ ఆరోపించారు. ఇప్పుడు ఏ విధంగా విజయోత్సవాలు నిర్వహిస్తారని ప్రశ్నించారు. తల్లిని చంపి బిడ్డను ఇచ్చారంటూ సోనియాగాంధీపై గుజరాత్ ము ఖ్యమంత్రి నరేంద్రమోడి విమర్శలు చేయటం తగదన్నారు. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని తెలంగాణ ఏర్పాటులో ఎన్ని అడ్డంకులు వచ్చినా అన్నింటిని తట్టుకుని తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియాగాంధీకే దక్కుతుందని ప్రభుత్వ మాజీ విప్ అనిల్ పేర్కొన్నారు. సీమాంధ్రలో పార్టీకి నష్టం వాటిల్లుతుందని తెలిసినా ప్రజాభీష్టానికే మద్దతుగా నిలిచారన్నారు. తెలంగాణకు అడ్డుపడాలని బీజేపీ చూసిందని, తీరా ప్రత్యేక రాష్ట్ర బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత ప్రజలు చిన్నమ్మను మరచిపోవద్దంటూ సుష్మాస్వరాజ్ మాట్లాడారని విమర్శించారు. డీఎస్ 2009లో ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి జిల్లాను ఎంతో అభివృద్ధి చేసేవారని ఎమ్మెల్సీ రాజేశ్వర్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనను గెలిపించి పెద్ద నాయకుడిని చేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చరిత్రలో జిల్లాకు ప్రత్యేక స్థానం తెలంగాణ చరిత్రలో జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందని మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణను ఆంధ్రలో కలుపుతూ దేశ తొలి ప్రధాని నెహ్రూ నిజామాబాద్ నుంచే ప్రకటన చేశారన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో ప్రతి ఇంటికి గోదావరి నీళ్లు, నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జిల్లాలోని అన్ని పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీని గెలిపించి తెలంగాణ ఇచ్చిన రుణం తీర్చుకుందామని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాహెర్ ప్రజ లకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల లలిత, జిల్లా అధ్యక్షురాలు అరుణతార, పీసీసీ కార్యదర్శులు సురేందర్, రత్నాకర్, సత్యం రాయల్వార్, పీసీసీ సహాయ కార్యదర్శి రాజేంద్రప్రసాద్, డీసీసీ మాజీ అధ్యక్షుడు గడుగు గంగాధర్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశ వేణు, నిజామాబాద్ ఏ ఎంసీ చైర్మన్ నగేశ్‌రెడ్డి, మాజీ మేయర్ డి.సంజయ్ తదితరులు పాల్గొన్నారు. -
సామాజిక తెలంగాణ కావాలి: డీఎస్
టీఆర్ఎస్తో పొత్తు లేకున్నా 100 ఎమ్మెల్యే, 16 ఎంపీ సీట్లు సాధిస్తాం సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్ర సాధన నేపథ్యంలో సామాజిక తెలంగాణ కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ అన్నారు. పరిపాలనలో బడుగు, బలహీనులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదివారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. తెలంగాణ చాంపియన్ కేసీఆర్ అని జరుగుతున్న ప్రచారాన్ని డీఎస్ కొట్టిపారేశారు. పార్లమెంట్ ఉభయ సభల్లో తెలంగాణ బిల్లు ఆమోదం కోసం సోనియా చేసిన కృషి ప్రతి ఒక్కరికీ తెలుసునన్నారు. కేసీఆర్ పార్టీ పుట్టకముందే తాను తెలంగాణపై శాసనసభలోనే మూడున్నర గంటలపాటు మాట్లాడానని, ఆ రోజు కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ పదవిలో కొనసాగుతున్నారని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, ప్రజా సంఘాలు సైతం ప్రత్యేక రాష్ర్టం కోసం ఎంతో కష్టపడ్డాయన్నారు. కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనమైనా, కాకపోయినా తెలంగాణలో 16 ఎంపీ, 100 ఎమ్మెల్యే స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. -
చంద్రబాబుపై విరుచుకుపడిన డిఎస్
నిజమాబాద్: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై పిసిసి మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ మండిపడ్డారు. ఇక్కడ తన ఆధ్వర్యంలో జరిగిన సోనియాకు కృతజ్ఞతా సభలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబువి ఊసరవెల్లి నాటకాలని తీవ్రస్థాయిలో విమర్శించారు. తెలంగాణలో టీడీపీ కనుమరుగు కాబోతుందని జోస్యం చెప్పారు. ఇన్నాళ్లు తెలంగాణను అడ్డుకున్నది చంద్రబాబేన్నారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే మూడు రాష్ట్రాలు ఇచ్చినప్పుడే తెలంగాణ ఇచ్చేదని డీఎస్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పదవులన్నీ అనుభవించి తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచాడని విమర్శించారు. ఈ సభకు ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, అంజన్ కుమార్ హాజరయ్యారు. -
కేసీఆర్ విజ్ఞతకే వదిలేస్తాం: డీఎస్
కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీని విలీనం చేయడం, చేయకపోవడం ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఇష్టమని మాజీ పీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ (డిఎస్) అభిప్రాయపడ్డారు. శనివారం డిఎస్ హైదరాబాద్‌లో మాట్లాడుతూ... తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ తాను ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. అయితే ప్రస్తుతం కేసీఆర్ ఏం మాట్లాడిన ఆయన విజ్ఞతకే వదిలేస్తామని డిఎస్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమం కోసం పుట్టిన పార్టీ అని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో ఆ పార్టీ పని అయిపోయిందని డీఎస్ చెప్పారు.తెలంగాణ కోసం కేవలం కేసీఆర్ ఒక్కరే పోరాడలేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఆవిర్భావానికి తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తప్ప మరెవరూ కారణం కాదని డీఎస్ పేర్కొన్నారు. -
ఎవరికి వారే
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది, తెచ్చింది తామే అని చెప్పుకోవడానికి కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున విజయోత్సవాలు నిర్వహించాలనుకున్నారు. అయితే దీనికి ఆదిలోనే అవాంతరం ఏర్పడింది. గ్రూప్ విభేదాలతో నేతలు ఎవరికి వారే సం బురాలు చేసుకుంటున్నారు. జిల్లాలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి, పీసీసీ మాజీ చీఫ్, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ వేర్వేరు కార్యక్రమాలకు తెరతీశారు. ఇద్దరు నేతల అనుచరులు సైతం వేర్వేరుగా సంబురాలు చేసుకున్నారు. జిల్లా కాంగ్రెస్‌లో గ్రూప్ విభేదాలకు ఇది తాజా ఉదాహరణ. 2009 ఎన్నికల తర్వాత అగ్రనేతల మధ్య ఆధిపత్య పోరు జిల్లా కాంగ్రెస్ పార్టీని అతలాకుతలం చేస్తోంది. జిల్లాలోని తొమ్మి ది నియోజకవర్గాలపైనా ప్రభావం చూపుతోంది. 2009 ఎన్నికలలో అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన డి.శ్రీనివాస్ ఓడిపోయారు. జిల్లా నుంచి కాంగ్రెస్ తరపున బోధన్ నుంచి పోటీచేసిన సుదర్శన్‌రెడ్డి ఒక్కరే విజయం సాధించడంతో రాష్ట్ర ప్రభుత్వంలో ఆయనకు చోటు లభించింది. తర్వాతి పరిస్థితులలో జిల్లాపై పట్టు నిలుపుకోవడానికి ఒకరు, పట్టు సాధించడం కోసం మరొకరు ప్రయత్నించడంతో ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు తీవ్రమైంది. మరోవైపు మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి పార్టీలో ప్రాబల్యా న్ని చాటుకునేందుకు యత్నిస్తూ వస్తున్నారు. దీంతో జిల్లా కాంగ్రెస్‌లో నాలుగు స్తంభాలాట నెలకొంది. ఇది పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారుతోంది. కార్యకర్తలను ఆయోమయానికి గురి చేస్తోంది. సంబురాలలోనూ కలవని నేతలు పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించిన సందర్భంగా నిర్వహించే ఉత్సవాల కోసమూ అగ్రనేతలు కలిసి సాగడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా జిల్లాలో సంబురాలు ఉమ్మడిగా, ఘనంగా నిర్వహించాలని అగ్రనేతలు పిలుపునిచ్చారు. పార్టీ హైకమాండ్ ఆదేశించిన మరుసటి రోజే సంబురాలకు సిద్ధమైన ఇద్దరు నేతలు హైదరాబాద్‌లో వేర్వేరుగా ముఖ్య కార్యకర్తలతో భేటీ అయ్యారు. నిజామాబాద్ రూరల్, అర్బన్ నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలతో డి.శ్రీనివాస్ హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో మాట్లాడారు. మంత్రి సుదర్శన్‌రెడ్డి సైతం బోధన్ నియోజకవర్గం ముఖ్య నేతలతో పాటు నిజామాబాద్‌కు చెందిన కేడర్ తో హైదరాబాద్‌లో మాట్లాడారు. బుధవారం నిజామాబాద్ నుంచి బోధన్ వరకు మంత్రి ర్యాలీ తీశారు. విజయోత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. డీఎస్ వచ్చే నెల రెండున నిజామాబాద్ రానున్నారు. ఆ రోజు సంబురాలు జరుపుకునేందుకు డీఎస్ వర్గం ఏర్పాట్లు చేస్తోంది. ఐక్యత కష్టమే! తెలంగాణ ప్రాంతంలోని పలు జిల్లాలలో ఇప్పటికే ఉమ్మడిగా సదస్సులు నిర్వహించగా, జిల్లాలో మాత్రం గ్రూపు రాజకీయాల కారణంగా అలాంటి పరిస్థితి కనిపించడంలేదు. బీజేపీ, టీఆర్ఎస్లు ఇప్పటికే ఘనంగా విజయోత్సవాలు నిర్వహించాయి. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనకబడినట్లే భావిస్తున్నారు. ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ రెండు రోజుల క్రితం బాల్కొండ నియోజకవర్గంలో సంబురాలు చేసుకోగా, మంత్రి సుదర్శన్‌రెడ్డి బుధవారం నిర్వహించారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కొందరు ఆ సంబురాల ఊసే ఎత్తడం లేదన్న చర్చ పార్టీ వర్గాలలో సాగుతోంది. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, మాజీ శాసనసభాపతి సురేశ్‌రెడ్డిలు తెలంగాణ సంబురాలపై స్పందించకపోవడం పార్టీ కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తోంది. పరిస్థితులను గమనిస్తున్నవారు కాంగ్రెస్‌లో ఐక్యత కష్టమే అని పేర్కొంటున్నారు. -
తెలంగాణలోని సీమాంధ్రులంతా తెలంగాణవారే!
హైదరాబాద్: తెలంగాణలో ఉన్న సీమాంధ్రులంతా తెలంగాణవారేనని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ చెప్పారు. ఆదివారం తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో 75 లక్షల మంది సీమాంధ్రులు నివసిస్తున్నారని తెలిపారు. సోనియాగాంధీ పట్టుదలతోనే తెలంగాణ రాష్ట్రం సాకారమైందన్నారు. సోనియాగాంధీకి తెలంగాణ ప్రజలంతా రుణపడి ఉంటారని తెలిపారు. తెలంగాణ వారంతా కాంగ్రెస్‌కు అండగా నిలవాలని పిలుపు ఇచ్చారు. తెలంగాణ, సీమాంధ్రలో ఏర్పడిన గందరగోళ పరిస్థితికి మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డే కారణమని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రజాసంక్షేమం కోసం పాటుపడాల్సిన కిరణ్‌కుమార్‌రెడ్డి తన స్వార్ధం కోసం అధికార, ధన బలంతో ప్రజల మధ్య రాగద్వేషాలను పెరిగేలా చేశాడని పేర్కొన్నారు. సీఎం క్యాంపు కార్యాలయాన్ని రాజకీయాలకు వాడుకున్నారని విమర్శించారు. -
'టీఆర్ఎస్ విలీనానికి సమయం ఆసన్నమైంది'
తెలంగాణ ప్రజల ఆకాంక్షను యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీర్చారని మాజీ పీసీసీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్ తెలిపారు. తెలంగాణ ప్రజలు ఆమెకు జన్మజన్మలకు రుణపడి ఉంటారన్నారు. శుక్రవారం న్యూఢిల్లీలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) విలీనం అయ్యే సమయం ఆసన్నమైందని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అందుకు సంబంధించిన ప్రక్రియను అధిష్టానం చూస్తుందన్నారు. అయితే సీఎం కిరణ్ తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో రాష్గ్రపతి పాలన వచ్చే అవకాశాలున్నాయని ఆయన చెప్పారు.సీఎం రేసులో తాను మాత్రం లేనని స్పష్టం చేశారు. సాధారణ ఎన్నికల ముందే రెండు రాష్ట్రాలు ఏర్పడతాయని డి.శ్రీనివాస్ వెల్లడించారు. -
గెలవలేని వారే పార్టీ విడిచి వెళ్తున్నారు: డీఎస్
తెలంగాణకు అన్యాయం జరిగిందని తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా ప్రగాఢంగా నమ్మారన్ని అందువల్ల తెలంగాణ సాధ్యమైందన్ని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ వెల్లడించారు. బుధవారం ఆయన న్యూఢిల్లీలో మాట్లాడుతూ... 14 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తుందని, ఆ ప్రయత్నం ఇప్పటికి సాకారం అయిందన్నారు. రెండు ప్రాంతాలుగా విడిపోయినా మానసికంగా తమ మధ్య ఉన్న సమైక్యతను ఎవరూ విడగొట్టలేరని అన్నారు. అటు సీమాంధ్ర ఇటు తెలంగాణ రాష్ట్రాలు పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాల్సిన అవశ్యకతను ఆయన ఈ సందర్బంగా విశదీకరించారు. తెలంగాణ, సీమాంధ్రలు దేశంలో అగ్రగామి రాష్ట్రాలుగా అభివృద్ధి చెందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కొందరు మాత్రం ఇరు ప్రాంతాలలో రాగద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ దయతో అనామకులు కూడా మంత్రులయ్యారన్న విషయాన్ని ఈ సందర్భంగా డీఎస్ గుర్తు చేశారు. పార్టీ వల్ల ప్రతినిధులుంటారు, కానీ ప్రతినిధులు వల్ల పార్టీ ఉండదని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికలలో గెలవలేని వారే కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్లిపోతారన్నారని డీఎస్ అభిప్రాయపడ్డారు. సీఎం కిరణ్ తన పదవికి రాజీనామా చేయనున్నారని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు డీఎస్ పై విధంగా సమాధానంగా చెప్పారు. -
ప్రేమాభిమానాలతో విడిపోదాం:డీఎస్
ఢిల్లీ: రాష్ట్ర విభజనకు సీమాంధ్ర నేతలు సహకరించాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక రాష్ట్రం అనివార్యమైన నేపథ్యంలో ప్రాంతాల మధ్య విద్వేషాలు తగవని ఆయన తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడిన డీఎస్..ప్రేమాభిమానాలతో విడిపోదామని పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్వాగతించిన విషయాన్ని గుర్తు చేశారు. అదే విషయాన్ని ఆయన ఇక్కడ ఢిల్లీ పెద్దల చెవిలో చెబుతున్నారని డీఎస్ తెలిపారు.ప్రజలకు మాత్రం వేరే మాట చెబుతూ తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీ విలీనం అయ్యి ఇచ్చిన మాటకు కట్టుబడాలన్నారు. -
'బిల్లు తిప్పి పంపితే రాష్ట్రపతికి చేరుతుంది.. అంతే!'
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు-2013 ను తిప్పిపంపాలని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పీసీసీ మాజీ చీఫ్ డి. శ్రీనివాస్ స్పందించారు. విభజన బిల్లును తిప్పి పంపితే తెలంగాణకు నష్టమేముండదు అని డీఎస్ వ్యాఖ్యానించారు. ఇచ్చిన గడువు కంటే ఇంకా నాలుగు రోజులు మందుగానే రాష్ట్రపతికి చేరుతుంది. అంతేకాని తెలంగాణకు వ్యతిరేకంగా ఏమి జరగదు అని ఆయన అన్నారు. బిల్లుపై సీఎం కిరణ్ స్పందించిన తీరును డీఎస్ తప్పుపట్టారు. రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చిన నెలన్నర తర్వాత...అది తప్పులు తడకలుగా ఉందని సీఎం అనడం హస్యస్పదం అని డి. శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. ‘‘బిల్లు లోపభూయిష్టం, రాజ్యాంగ ఉల్లంఘనలున్నాయంటూ.. బిల్లును తిప్పి పంపాలని అంటూ సీఎం కిరణ్ అసెంబ్లీ లో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
తెలంగాణలో పార్టీ పరిస్థితేంటి?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయంతో తెలంగాణలో పార్టీ పుంజుకుందా?, ప్రజల్లో స్పందన ఎలా ఉంది?, అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందా?.. కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి గులాంనబీ ఆజాద్ ప్రయత్నించారు. ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం హైదరాబాద్ వచ్చిన ఆజాద్.. సుమారు గంటకు పైగా గాంధీభవన్‌లో గడిపారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జానారెడ్డి, ఎంపీలు అంజన్‌కుమార్‌యాదవ్, సురేష్‌షెట్కార్, పొన్నం ప్రభాకర్, వీహెచ్, ఎంఏ ఖాన్, మాజీమంత్రులు డీఎల్ రవీంద్రారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఫరీదుద్దీన్తోపాటు పలువురు పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు ఆజాద్‌ను కలిశారు. జానారెడ్డి, డీఎస్, తర్వాత డిప్యూటీ సీఎం ఆజాద్‌తో ముఖాముఖి సమావేశమై తెలంగాణలో పార్టీ పరిస్థితిని వివరించారు. వీరు వేర్వేరుగా ఆజాద్‌తో మాట్లాడే సమయంలో బొత్స కూడా బయటే ఉన్నారు. తెలంగాణలో పార్టీ పరిస్థితిని ఆరా తీసిన ఆజాద్‌తో ఆ ప్రాంత నేతలు.. గతంలో తాము తెలంగాణలో తిరగలేని పరిస్థితి ఉండేదని, విభజనపై నిర్ణయం తీసుకున్న తరువాత ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లగలుగుతున్నామన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందనే గట్టి నమ్మకం తమకు ఏర్పడిందన్నారు. ఎంపీ సీట్ల విషయానికొస్తే అంజన్‌కుమార్ 15 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పగా... షెట్కార్ మాత్రం హైదరాబాద్ పార్లమెంట్ స్థానం మినహా మిగిలిన 16 స్థానాల్లోనూ కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్నారు. అంతకుముందు డీఎల్ రవీంద్రారెడ్డి సైతం ఆజాద్‌ని కలిసివెళ్లారు. పార్టీ పరిస్థితి, సీఎం కిరణ్ వల్ల పార్టీకి జరుగుతున్న నష్టంపై డీఎల్ ఆయనకు వివరించినట్లు తెలుస్తోంది. మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎమ్మెల్యే మస్తాన్‌వలీ కూడా ఆజాద్‌ను కలిశారు. సీమాంధ్రలో కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు హైకమాండ్ దగ్గర గట్టి వ్యూహం ఉందని వారితో ఆజాద్ చెప్పారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క కూడా ఆజాద్‌తో విడిగా సమావేశమయ్యారు. విభజన విషయంలో అసెంబ్లీలో ఏయే పార్టీలు ఏ విధంగా వ్యవహరిస్తున్నాయన్న వివరాలను ఆజాద్ అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. రాష్ట్ర పగ్గాలు మళ్లీ ఆజాద్‌కే? కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జి బాధ్యతలను మళ్లీ కేంద్రమంత్రి ఆజాద్‌కే అప్పగించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. 2004 ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌తో టీఆర్ఎస్ పొత్తు విషయంలో ఆజాద్ క్రియాశీల పాత్ర పోషించారు. ఇప్పుడు రాష్ట్ర విభజన పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేయడం లేదా పొత్తు కుదుర్చుకునే అంశాల్లో ఆజాద్ చొరవ ఉపకరిస్తుందనే ఉద్దేశంతో మళ్లీ ఆయనకే బాధ్యతలు అప్పగించే ఆలోచన హైకమాండ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌కు మధ్యప్రదేశ్ బాధ్యతలు అప్పగించవచ్చని సమాచారం. 17న ఢిల్లీలో జరిగే ఏఐసీసీ సమావేశాల తర్వాత ఈ మార్పులు జరగవచ్చని తెలుస్తోంది. -
జగన్‌పై సీబీఐ దర్యాప్తు చేయించింది కాంగ్రెస్సే
పీసీసీ మాజీ చీఫ్ డీఎస్ వెల్లడి హైకోర్టులో పిటిషన్ వేసిందే మావాళ్లు బాబుపైనా జరిపించి ఉండాల్సిందని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: ఆలస్యంగానైనా నిజం నిగ్గుదేలింది. వైఎస్ జగన్‌పై జరిగింది రాజకీయ కుట్రేనని నిరూపితమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంతకాలం నుంచీ చెబుతూ వస్తున్న ఈ విషయాన్ని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కూడా తాజాగా ధ్రువీకరించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆస్తుల కేసులో సీబీఐ దర్యాప్తు చేయించింది తామే (కాంగ్రెస్)నని ఆయన అంగీకరించారు. ‘వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయినప్పటికీ, ఆయనపై ఆరోపణలు వచ్చినందున కచ్చితమైన దర్యాప్తు చేయించాం. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో ఎన్నో అవినీతి ఆరోపణలు వచ్చాయి. అలాంటిది అయనపై సీబీఐ విచారణ చేయించకపోవడం సమర్థనీయం కాదు’ అని అన్నారు. డీఎస్ గురువారం సాయంత్రం తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సోనియాగాంధీపై చంద్రబాబు అవినీతి ఆరోపణలు చేయడాన్ని ఖండించారు. సిద్ధాంతాలు, నైతిక విలువలు లేని బాబు... దేశం కోసం, కాంగ్రెస్ అభివృద్ధి కోసం ఎంతో త్యాగం చేసిన సోనియాపై ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు. అధికారం కోసం బాబు ఎంతకైనా దిగజారతారంటూ విమర్శించారు. ‘‘ఎమ్మెల్యేలందరినీ ప్రలోభపెట్టి బాబు అప్రజాస్వామికంగా అధికారం సంపాదించుకున్నాడు. ఆ తర్వాత కూడా వాజ్‌పేయి హవా వల్ల బాబు రెండోసారి సీఎం అయ్యాడు. లౌకికవాదినని చెప్పుకునే బాబు ఇప్పుడు మతతత్వ పార్టీతో పొత్తుకు సిద్ధమవుతున్నాడు’’ అని ధ్వజమెత్తారు. బాబుపై అవినీతి ఆరోపణలు వస్తే వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు రుజువు చేయలేకపోయిందని విలేకరులు ప్రశ్నించగా, ‘‘నాడు కేంద్రంలో మేం (కాంగ్రెస్) అధికారంలో లేము. బాబుకు అనుకూలమైన ప్రభుత్వం ఉండటం వల్లే ఆయనపై విచారణ జరపలేదు. వైఎస్‌పై ఆరోపణలు వచ్చినప్పుడు కేంద్రంలో మా ప్రభుత్వమే ఉంది కాబట్టి ఆయన చనిపోయినప్పటికీ సీబీఐ ద్వారా దర్యాప్తు చేయించాం. చంద్రబాబుపై సీబీఐతో దర్యాప్తు చేయిస్తే కక్షసాధింపు అంటారని ఆగిపోయాం’’ అని బదులిచ్చారు. సీబీఐ విచారణకు ఆదేశించింది హైకోర్టు కదా, మీ ప్రభుత్వం అంటారేమిటని ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘‘హైకోర్టు ఎందుకు ఆదేశించిం ది? ఏమైనా కలగన్నదా? పిటిషన్ వేసిందెవరు? మా వాళ్లే కదా! అదే సమయంలో కమిట్మెంట్తో విచారణ జరిపించింది ఎవరు? మా ప్రభుత్వమే కదా!’’ అంటూ బదులిచ్చారు. కిరణ్ ఏమీ చేయలేడు: మంత్రి శ్రీధర్‌బాబు సమర్థుడైనందునే వాణిజ్య పన్నుల శాఖను అదనంగా కేటాయించామన్న సీఎం కిరణ్ వ్యాఖ్యలపై డీఎస్ తీవ్రంగా మండిపడ్డారు. ‘‘వాణిజ్య శాఖను సమర్థంగా నిర్వహింగల వ్యక్తి శాసనసభ వ్యవహారాల శాఖను నిర్వహించలేని అసమర్థుడా? నిజంగా సమర్థుడే అనుకుంటే శ్రీధర్‌బాబును ఆ శాఖలో కూడా కొనసాగించవచ్చు కదా! అలాకాకుండా కరడుగట్టిన సమైక్యవాది అయిన శైలజానాథ్‌కు అప్పగించడం వెనుక ఉద్దేశమేమిటి?’’ అంటూ ప్రశ్నించారు. ‘కిరణ్ ఏదో సాధించాలని అనుకుంటున్నాడు. కానీ ఏమీ చేయలేడనే సంగతిని గుర్తుంచుకోవాలి’’ అని పేర్కొన్నారు. -
ఎన్నికల లోపే తెలంగాణ
ఢిల్లీ: 2014 ఎన్నికల లోపే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుందని పిసిసి మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ చెప్పారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2014 ఎన్నికలు రెండు రాష్ట్రాల్లోనూ జరుగుతాయన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాగత అంశాలపై చర్చించేందుకు సోనియాను కలిసినట్లు చెప్పారు. తెలంగాణకు సంబంధించే కాకుండా, సీమాంధ్రకు సంబధించిన రాజకీయ అంశాలపై కూడా చర్చించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు. 2009లో కేంద్రం ప్రకటించిన తెలంగాణ ప్రక్రియకు కొనసాగింపుగానే ఇప్పుడు చర్యలు జరుగుతున్నాయని చెప్పారు. తెలంగాణలో ఉన్న సీమాంధ్రులకు ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. బీజేపీ కూడా పార్లమెంట్లో తెలంగాణకు పూర్తి స్థాయి మద్దతు ఇస్తుందని చెప్పారు.